Check out the new design

クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) * - 対訳の目次


対訳 章: 家畜章   節:

అల్-అన్ఆమ్

本章の趣旨:
تقرير عقيدة التوحيد والرد على ضلالات المشركين.
ఏకదైవారాధన సిద్ధాంతాన్ని నిర్ణయించడం మరియు బహుదైవారాధకుల అపమార్గములను తిరస్కరించటం

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَجَعَلَ الظُّلُمٰتِ وَالنُّوْرَ ؕ۬— ثُمَّ الَّذِیْنَ كَفَرُوْا بِرَبِّهِمْ یَعْدِلُوْنَ ۟
సంపూర్ణ పరిపూర్ణతో కూడిన వర్ణన, ప్రేమతో కూడిన అత్యున్నత సౌంధర్యాలతో స్ధుతి ఆ అల్లాహ్ కే వర్తిస్తుంది ఎవరైతే భూమ్యాకాశాలను పూర్వపు ఉదాహరణ లేకుండా సృష్టించాడో,ఒక దాని తరువాత ఒకటిగా రేయింబవళ్ళను సృష్టించాడు,రాత్రిని చీకటిగా సృష్టించాడు,పగలును వెలుగుగా సృష్టించాడు. మరియు వీటికి తోడుగా సత్యతిరస్కారులైన వారు అల్లాహేతరులను ఆయనకు సమానంగా చేస్తున్నారు. వారిని ఆయనతో సాటి కల్పిస్తున్నారు.
アラビア語 クルアーン注釈:
هُوَ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ طِیْنٍ ثُمَّ قَضٰۤی اَجَلًا ؕ— وَاَجَلٌ مُّسَمًّی عِنْدَهٗ ثُمَّ اَنْتُمْ تَمْتَرُوْنَ ۟
ఓ ప్రజలారా ఆయన సుబహానహు వతఆలా మిమ్మల్ని మీ తండ్రి ఆదమ్ అలైహిస్సలాంను మట్టితో సృష్టించినప్పుడే మట్టితో సృష్టించాడు.ఆ తరువాత ఆయన సుబహానహు తఆలా ఇహలోక జీవితంలో మీ నివాసము కొరకు ఒక గడువును నియమించాడు.మరియు ఆయన తప్ప ఇంకొకరికి తెలియని వేరొక గడువును మిమ్మల్ని ప్రళయదినాన లేపటం కొరకు నియమించాడు.ఆ తరువాత మీరు ఆయన సుబహానహు తఆలా మరల లేపే విషయంలో ఆయన శక్తి సామర్ధ్యాల గురించి సంశయంలో పడిపోయారు.
アラビア語 クルアーン注釈:
وَهُوَ اللّٰهُ فِی السَّمٰوٰتِ وَفِی الْاَرْضِ ؕ— یَعْلَمُ سِرَّكُمْ وَجَهْرَكُمْ وَیَعْلَمُ مَا تَكْسِبُوْنَ ۟
ఆయన సుబహానహు తఆలా భూమ్యాకాశాల్లో వాస్తవ ఆరాధ్య దైవము.ఆయనపై ఏ వస్తువు దాగి ఉండదు.ఆయన మీరు దాచిపెట్టే సంకల్పాలను,మాటలను,ఆచరణలను తెలుసుకుంటాడు.వాటిలోంచి మీరు బహిర్గతం చేసే వాటిని తెలుసుకుంటాడు.మరియు తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
アラビア語 クルアーン注釈:
وَمَا تَاْتِیْهِمْ مِّنْ اٰیَةٍ مِّنْ اٰیٰتِ رَبِّهِمْ اِلَّا كَانُوْا عَنْهَا مُعْرِضِیْنَ ۟
ముష్రికుల వద్దకు తన ప్రభువు వద్ద నుండి ఏ ఆధారం వచ్చినా దానిని వారు పట్టించుకోకుండా వదిలివేసేవారు.వారి వద్దకు అల్లాహ్ యొక్క ఏకత్వమును నిరూపించే స్పష్టమైన ఆధారాలు,స్పష్టమైన ఋజువులు వచ్చినవి.వారి వద్దకు ఆయన ప్రవక్తల నిజాయితిని తెలిపే సూచనలు వచ్చినవి.అయితే వారు వాటిని పట్టించుకోకుండా వాటిపట్ల విముఖతను చూపారు.
アラビア語 クルアーン注釈:
فَقَدْ كَذَّبُوْا بِالْحَقِّ لَمَّا جَآءَهُمْ ؕ— فَسَوْفَ یَاْتِیْهِمْ اَنْۢبٰٓؤُا مَا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
ఒక వేళ వీరందరు ఈ స్పష్టమైన ఆధారాలు,స్పష్టమైన ఋజువుల పట్ల విముఖత చూపితే నిశ్చయంగా వీరు చాలా స్పష్టమైన దాని పట్ల విముఖత చూపారు.నిశ్చయంగా వీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసుకుని వచ్చిన ఖుర్ఆన్ ను తిరస్కరించారు.ఆయన వారి వద్దకు తీసుకుని వచ్చినది దేని గురించైతే వారు హేళన చేస్తున్నారో అది సత్యమని ప్రళయదినాన శిక్షను చూసినప్పుడు వారు గుర్తిస్తారు.
アラビア語 クルアーン注釈:
اَلَمْ یَرَوْا كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنْ قَرْنٍ مَّكَّنّٰهُمْ فِی الْاَرْضِ مَا لَمْ نُمَكِّنْ لَّكُمْ وَاَرْسَلْنَا السَّمَآءَ عَلَیْهِمْ مِّدْرَارًا ۪— وَّجَعَلْنَا الْاَنْهٰرَ تَجْرِیْ مِنْ تَحْتِهِمْ فَاَهْلَكْنٰهُمْ بِذُنُوْبِهِمْ وَاَنْشَاْنَا مِنْ بَعْدِهِمْ قَرْنًا اٰخَرِیْنَ ۟
దుర్మార్గులైన జాతులవారి వినాశనంలో అల్లాహ్ సాంప్రదాయం ఉన్నదని ఈ అవిశ్వాసపరులందరికి తెలియదా?.అల్లాహ్ వారి కన్న ముందు చాలా జాతులను వినాశనానికి గురి చేశాడు.ఈ అవిశ్వాసపరులకి ప్రసాదించనివి ఎన్నో వారికి భూమిలో నివాసం కొరకు,బలము కొరకు కారకాలను ప్రసాదించాడు.నిర్విరామంగా (పుష్కలంగా) వారిపై వర్షాలను కురిపించాడు.వారి నివాసాల క్రింద నుండి సెలయేరులు ప్రవహించే విదంగా చేశాడు.అయినా వారు అల్లాహ్ పట్ల అవిధేయత చూపారు.అప్పుడు ఆయన వారు పాపకార్యములను పాల్పడటం వలన వారిని వినాశనానికి గురి చేశాడు.వారి తరువాత వేరే జాతుల వారిని సృష్టించాడు.
アラビア語 クルアーン注釈:
وَلَوْ نَزَّلْنَا عَلَیْكَ كِتٰبًا فِیْ قِرْطَاسٍ فَلَمَسُوْهُ بِاَیْدِیْهِمْ لَقَالَ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِیْنٌ ۟
ఓ ప్రవక్తా మేము కాగితాల్లో వ్రాయబడిన ఒక గ్రంధాన్ని మీపై అవతరింపజేసినా,వారు దానిని తమ కళ్ళతో చూసినా,వారు తమ చేతులతో పుస్తకాన్ని తాకి అనుభూతి చెంది నిర్ధారించుకున్నా వారి మొరటుతనం,తిరస్కారము వలన వారు దానిని విశ్వసించరు.నీవు తీసుకుని వచ్చినది స్పష్టమైన మాయాజాలం కన్నా ఎక్కువే.మేము దానిని విశ్వసించమంటే విశ్వసించము అని వారు అంటారు.
アラビア語 クルアーン注釈:
وَقَالُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَیْهِ مَلَكٌ ؕ— وَلَوْ اَنْزَلْنَا مَلَكًا لَّقُضِیَ الْاَمْرُ ثُمَّ لَا یُنْظَرُوْنَ ۟
ఈ అవిశ్వాసపరులందరు అంటారు-: ఒక వేళ అల్లాహ్ ముహమ్మద్ తోపాటు ఒక దూతను దించి ఉంటే అతడు మాతో మాట్లాడి ఉంటే ఆయన ప్రవక్త అని సాక్షం పలికి ఉంటే మేము విశ్వసిస్తాము.మేము ఒక వేళ వారు కోరిన లక్షణాలు కల దూతను దించితే మేము వారిని వినాశనమునకు గురి చేస్తాము.అప్పుడు వారు విశ్వసించరు,దైవ దూత దిగినప్పుడు వారికి పశ్చ్యాత్తాప్పడటానికి వ్యవది ఇవ్వబడదు.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• شدة عناد الكافرين، وبيان إصرارهم على الكفر على الرغم من قيام الحجة عليهم بالأدلة الحسية.
అవిశ్వాసపరుల మొండితనం యొక్క తీవ్రత,ఇంద్రియ ఆధారాలతో వారిపై వాదన ఉన్నా దానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పై వారి మొండితనం ప్రకటన.

• التأمل في سنن الله تعالى في السابقين لمعرفة أسباب هلاكهم والحذر منها.
పూర్వికుల వినాశనమునకు గల కారణాలను తెలుసుకోవటానికి ,వాటి గురించి శ్రద్ధ వహించటానికి అల్లాహ్ సాంప్రదాయంలో ధృష్టిని సారించటం.

• من رحمة الله بعباده أن لم ينزل لهم رسولًا من الملائكة لأنهم لا يمهلون للتوبة إذا نزل.
తన దాసులపై దైవ దూతల్లోంచి ప్రవక్తను వారి కొరకు దించకపోవటం అల్లాహ్ యొక్క కారుణ్యం.ఎందుకంటే దైవ దూతే దిగితే పశ్చ్యాత్తాప్పడటానికి వారికి వ్యవది ఇవ్వబడదు.

 
対訳 章: 家畜章
章名の目次 ページ番号
 
クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) - 対訳の目次

- Tafsir Center for Quranic Studies - 発行

閉じる