ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​ * - សន្ទស្សន៍នៃការបកប្រែ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ការបកប្រែអត្ថន័យ ជំពូក​: សូរ៉ោះអាល់កសស   អាយ៉ាត់:

సూరహ్ అల్-ఖసస్

طٰسٓمّٓ ۟
తా-సీన్-మీమ్[1].
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْمُبِیْنِ ۟
ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయాత్)[1].
[1] చూడండి, 12:1.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
نَتْلُوْا عَلَیْكَ مِنْ نَّبَاِ مُوْسٰی وَفِرْعَوْنَ بِالْحَقِّ لِقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟
విశ్వసించే ప్రజల కొరకు, మేము మూసా మరియు ఫిర్ఔన్ ల యొక్క నిజ వృత్తాంతాన్ని నీకు వినిపిస్తున్నాము.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّ فِرْعَوْنَ عَلَا فِی الْاَرْضِ وَجَعَلَ اَهْلَهَا شِیَعًا یَّسْتَضْعِفُ طَآىِٕفَةً مِّنْهُمْ یُذَبِّحُ اَبْنَآءَهُمْ وَیَسْتَحْیٖ نِسَآءَهُمْ ؕ— اِنَّهٗ كَانَ مِنَ الْمُفْسِدِیْنَ ۟
నిశ్చయంగా, ఫిర్ఔన్ భూమి మీద అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. మరియు అందులోని ప్రజలను వర్గాలుగా విభజించి, వారిలోని ఒక తెగ వారిని నీచపరచి వారి పుత్రులను వధిస్తూ ఉండేవాడు[1] మరియు వారి స్త్రీలను బ్రతకనిచ్చేవాడు. నిశ్చయంగా, అతడు దౌర్జన్యపరులలోని వాడిగా ఉండేవాడు.
[1] వీరు ఇస్రాయీ'ల్ సంతతివారు. ఫిర్'ఔన్ జాతివారు వీరిని బానిసలుగా చేసి హింసించే వారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَنُرِیْدُ اَنْ نَّمُنَّ عَلَی الَّذِیْنَ اسْتُضْعِفُوْا فِی الْاَرْضِ وَنَجْعَلَهُمْ اَىِٕمَّةً وَّنَجْعَلَهُمُ الْوٰرِثِیْنَ ۟ۙ
మరియు భూమి మీద అణచి వేయబడిన వారిని కనికరించాలని మరియు వారిని నాయకులుగా చేయాలని మరియు వారిని వారసులుగా చేయాలని మేము కోరాము[1].
[1] చూడండి, 7:137.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَنُمَكِّنَ لَهُمْ فِی الْاَرْضِ وَنُرِیَ فِرْعَوْنَ وَهَامٰنَ وَجُنُوْدَهُمَا مِنْهُمْ مَّا كَانُوْا یَحْذَرُوْنَ ۟
మరియు (ఇస్రాయీల్ సంతతి) వారికి భూమిలో అధికారం ఒసంగాలనీ[1] మరియు ఫిర్ఔన్, హామాన్[2] మరియు వారి సైనికులకు - దేనిని గురించైతే (ఫిర్ఔన్ జాతి) వారు భయపడుతూ ఉండేవారో[3] - అదే వారికి చూపాలని!
[1] ఇక్కడ అ'ర్దున్, భూమి అంటే కనాన్ (షామ్).
[2] హామాన్, ఫిర్'ఔన్ యొక్క ముఖ్య నాయకుడు. చూడండి, 40:36-37.
[3] అంటే, ఇస్రాయీ'ల్ సంతతివారి ద్వారా తమ నాశనం కావచ్చనే ఏ భయం వల్లనైతే ఫిర్'ఔన్ జాతి వారు ఇస్రాయీ'ల్ సంతతివారి మగ సంతానాన్ని హత్య చేస్తూ ఉండేవారో - దానినే వారికి సత్యం చేసి చూపటానికి.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاَوْحَیْنَاۤ اِلٰۤی اُمِّ مُوْسٰۤی اَنْ اَرْضِعِیْهِ ۚ— فَاِذَا خِفْتِ عَلَیْهِ فَاَلْقِیْهِ فِی الْیَمِّ وَلَا تَخَافِیْ وَلَا تَحْزَنِیْ ۚ— اِنَّا رَآدُّوْهُ اِلَیْكِ وَجَاعِلُوْهُ مِنَ الْمُرْسَلِیْنَ ۟
మేము మూసా తల్లి మనస్సులో ఇలా[1] సూచించాము: "నీవు అతనికి (మూసాకు) పాలు ఇస్తూ ఉండు. కాని అతనికి ప్రమాదమున్నదని, నీవు భావిస్తే అతనిని నదిలో విడిచి పెట్టు[2]. మరియు నీవు భయపడకు మరియు దుఃఖించకు; నిశ్చయంగా మేము అతనిని నీ వద్దకు తిరిగి చేర్చుతాము. మరియు అతనిని (మా) సందేశహరులలో ఒకనిగా చేస్తాము!"
[1] వ'హీ: అంటే ఇక్కడ ఆమె మనస్సులో ఆలోచన పుట్టించడం.
[2] చూడండి, 20:39.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَالْتَقَطَهٗۤ اٰلُ فِرْعَوْنَ لِیَكُوْنَ لَهُمْ عَدُوًّا وَّحَزَنًا ؕ— اِنَّ فِرْعَوْنَ وَهَامٰنَ وَجُنُوْدَهُمَا كَانُوْا خٰطِـِٕیْنَ ۟
తరువాత ఫిర్ఔన్ కుటుంబంవారు[1] - తమకు శత్రువై, దుఃఖకారణుడవటానికి - అతనిని ఎత్తుకున్నారు. నిశ్చయంగా ఫిర్ఔన్, హామాన్ మరియు వారి సైనికులు పాపిష్ఠులు!
[1] అంటే ఫిర్'ఔన్ భార్య. ఇంకా చూడండి, 66:11.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقَالَتِ امْرَاَتُ فِرْعَوْنَ قُرَّتُ عَیْنٍ لِّیْ وَلَكَ ؕ— لَا تَقْتُلُوْهُ ۖۗ— عَسٰۤی اَنْ یَّنْفَعَنَاۤ اَوْ نَتَّخِذَهٗ وَلَدًا وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟
మరియు ఫిర్ఔన్ భార్య (అతనితో) ఇలా అన్నది: "ఇతను నీకూ మరియు నాకూ కంటి చలువ! ఇతనిని చంపకు, బహుశా ఇతడు మనకు ఉపయోగకారి కావచ్చు![1] లేదా మనం ఇతనిని కుమారునిగా చేసుకోవచ్చు!" కాని వారు (వాస్తవాన్ని) తెలుసుకోలేక పోయారు.
[1] వారికి సంతానం లేనందుకు ఆమె అతనిని ('అ.స.ను) కుమారునిగా చేసుకోదలచింది.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاَصْبَحَ فُؤَادُ اُمِّ مُوْسٰی فٰرِغًا ؕ— اِنْ كَادَتْ لَتُبْدِیْ بِهٖ لَوْلَاۤ اَنْ رَّبَطْنَا عَلٰی قَلْبِهَا لِتَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟
మరియు మూసా తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆమె విశ్వసించినవారిలో ఉండటానికి మేము, ఆమె హృదయాన్ని దృఢపరచి ఉండకపోతే, ఆమె అతనిని (మూసాను) గురించి అంతా బట్టబయలు చేసి ఉండేది.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقَالَتْ لِاُخْتِهٖ قُصِّیْهِ ؗ— فَبَصُرَتْ بِهٖ عَنْ جُنُبٍ وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟ۙ
ఆమె, అతని (మూసా) సోదరితో[1] అన్నది: "అతని వెంట వెళ్ళు." కావున ఆమె దూరం నుండియే అతనిని గమనించసాగింది. కానీ, వారది గ్రహించలేక పోయారు.
[1] మూసా('అ.స.) సోదరీమణి పేరు మర్యమ్ బిన్తె 'ఇమ్రాన్ మరియు 'ఈసా ('అ.స.) తల్లిపేరు కూడా మర్యమ్ బిన్తె 'ఇమ్రాన్.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَحَرَّمْنَا عَلَیْهِ الْمَرَاضِعَ مِنْ قَبْلُ فَقَالَتْ هَلْ اَدُلُّكُمْ عَلٰۤی اَهْلِ بَیْتٍ یَّكْفُلُوْنَهٗ لَكُمْ وَهُمْ لَهٗ نٰصِحُوْنَ ۟
మరియు మేము అతనిని (ఇతరుల) పాలు త్రాగకుండా మొదటనే నిషేధించి ఉన్నాము. (అతని సోదరి) వారితో అన్నది: "మీ కొరకు అతనిని (పాలిచ్చి) పోషించగల ఒక కుటుంబం వారిని నేను మీకు చూపనా? మరియు వారు అతనిని మంచిగా చూసుకునే వారై ఉంటారు."
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَرَدَدْنٰهُ اِلٰۤی اُمِّهٖ كَیْ تَقَرَّ عَیْنُهَا وَلَا تَحْزَنَ وَلِتَعْلَمَ اَنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟۠
ఈ విధంగా మేము అతనిని (మూసాను) - అతని తల్లి కళ్ళు చల్లబడటానికి, ఆమె దుఃఖించకుండా ఉండటానికి మరియు అల్లాహ్ వాగ్దానం సత్యమైనదని ఆమె తెలుసుకోవటానికి - తిరిగి ఆమె వద్దకు చేర్చాము. కాని వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَمَّا بَلَغَ اَشُدَّهٗ وَاسْتَوٰۤی اٰتَیْنٰهُ حُكْمًا وَّعِلْمًا ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟
మరియు అతను (మూసా) యుక్తవయస్సుకు చేరి పరిపూర్ణుడు అయినప్పుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా, మేము సజ్జనులకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము.[1]
[1] చూడండి, 12:22.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَدَخَلَ الْمَدِیْنَةَ عَلٰی حِیْنِ غَفْلَةٍ مِّنْ اَهْلِهَا فَوَجَدَ فِیْهَا رَجُلَیْنِ یَقْتَتِلٰنِ ؗ— هٰذَا مِنْ شِیْعَتِهٖ وَهٰذَا مِنْ عَدُوِّهٖ ۚ— فَاسْتَغَاثَهُ الَّذِیْ مِنْ شِیْعَتِهٖ عَلَی الَّذِیْ مِنْ عَدُوِّهٖ ۙ— فَوَكَزَهٗ مُوْسٰی فَقَضٰی عَلَیْهِ ؗ— قَالَ هٰذَا مِنْ عَمَلِ الشَّیْطٰنِ ؕ— اِنَّهٗ عَدُوٌّ مُّضِلٌّ مُّبِیْنٌ ۟
మరియు (ఒకరోజు) నగరవాసులు ఏమరుపాటులో ఉన్నప్పుడు, అతను నగరంలోకి ప్రవేశించాడు, అతను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం చూశాడు, వారిలో ఒకడు అతని జాతికి చెందినవాడు, మరొకడు విరోధి జాతికి చెందినవాడు. అతని జాతికి చెందిన వాడు, విరోధి జాతివానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని (మూసాను) అర్థించాడు. మూసా అతడిని ఒక గుద్దుగుద్దాడు. అది అతడిని అంతమొందించింది. (అప్పుడు) అతను (మూసా) అన్నాడు: "ఇది షైతాన్ పనే! నిశ్చయంగా, అతడు శత్రువు మరియు స్పష్టంగా దారి తప్పించేవాడు."[1]
[1] దైవప్రవక్త ప్రవచనం: 'తెగలకొరకు, తెగల పేరట కృషిచేసేవాడూ మరియు తెగల కొరకు పోరాడే వాడూ మరియు తెగల కొరకు మరణించేవాడూ మాలోనివాడుకాడు!' (అబూ దావూద్ - 'జుబైర్ ఇబ్నె మత్'ఇమ్ - కథనం ఆధారంగా) దీని భావం అడుగగా అతను ('స'అస) అన్నారు: 'అన్యాయ విషయంలో తమ వారికి సహాయపడటం.'
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ رَبِّ اِنِّیْ ظَلَمْتُ نَفْسِیْ فَاغْفِرْ لِیْ فَغَفَرَ لَهٗ ؕ— اِنَّهٗ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ ۟
(మూసా) ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. కావున నన్ను క్షమించు!" (అల్లాహ్) అతనిని క్షమించాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత[1].
[1] ఉద్ధేశ్యపూర్వకంగా చంపకున్నా, ఒక మానవుని హత్య జరిగింది. దానికి మూసా ('అ.స.) పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకుంటే, అల్లాహ్ (సు.తా.) అతనిని క్షమించాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ رَبِّ بِمَاۤ اَنْعَمْتَ عَلَیَّ فَلَنْ اَكُوْنَ ظَهِیْرًا لِّلْمُجْرِمِیْنَ ۟
(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నాకు మహోపకారం చేశావు. కావున నేను ఇక ఎన్నటికీ నేరస్తులకు సహాయపడను!"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاَصْبَحَ فِی الْمَدِیْنَةِ خَآىِٕفًا یَّتَرَقَّبُ فَاِذَا الَّذِی اسْتَنْصَرَهٗ بِالْاَمْسِ یَسْتَصْرِخُهٗ ؕ— قَالَ لَهٗ مُوْسٰۤی اِنَّكَ لَغَوِیٌّ مُّبِیْنٌ ۟
మరుసటి రోజు ఉదయం అతను (మూసా) భయపడుతూ అతని జాగ్రత్తగా (ఇటూ అటూ చూస్తూ) నగరంలోకి వెళ్ళాడు. అప్పుడు అకస్మాత్తుగా అంతకు ముందు రోజు, అతనిని సహాయానికి పిలిచినవాడే, మళ్ళీ సహాయానికై అరవసాగాడు. మూసా వానితో అన్నాడు: "నిశ్చయంగా, నీవు స్పష్టమైన తప్పు దారికి లాగేవాడవు!"[1]
[1] ఇబ్నె 'అబ్బాస్ మరియు ముఖాతిల్ (ర'ది.'అన్హుమ్) ల కథనం ప్రకారం ఆ ఇస్రాయీ'ల్ వంశీయుడు సత్యతిరస్కారి.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَلَمَّاۤ اَنْ اَرَادَ اَنْ یَّبْطِشَ بِالَّذِیْ هُوَ عَدُوٌّ لَّهُمَا ۙ— قَالَ یٰمُوْسٰۤی اَتُرِیْدُ اَنْ تَقْتُلَنِیْ كَمَا قَتَلْتَ نَفْسًا بِالْاَمْسِ ۗ— اِنْ تُرِیْدُ اِلَّاۤ اَنْ تَكُوْنَ جَبَّارًا فِی الْاَرْضِ وَمَا تُرِیْدُ اَنْ تَكُوْنَ مِنَ الْمُصْلِحِیْنَ ۟
ఆ తరువాత అతను తమ ఇద్దరికీ విరోధి అయిన వాడిని గట్టిగా పట్టుకోబోగా, అతడు అరిచాడు: "ఓ మూసా! ఏమీ? నీవు నిన్న ఒక వ్యక్తిని చంపినట్లు నన్ను కూడా చంపదలచుకున్నావా? నీవు ఈ దేశంలో క్రూరునిగా మారి ఉండదలుచుకున్నావా? సద్వర్తనునిగా ఉండదలుచుకోలేదా?"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَجَآءَ رَجُلٌ مِّنْ اَقْصَا الْمَدِیْنَةِ یَسْعٰی ؗ— قَالَ یٰمُوْسٰۤی اِنَّ الْمَلَاَ یَاْتَمِرُوْنَ بِكَ لِیَقْتُلُوْكَ فَاخْرُجْ اِنِّیْ لَكَ مِنَ النّٰصِحِیْنَ ۟
మరియు ఒక వ్యక్తి నగరపు ఒక వైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: ఓ మూసా! నాయకులందరూ కలిసి నిన్ను హత్య చేయాలని సంప్రదింపులు చేస్తున్నారు. కావున నీవు వెళ్ళిపో, నేను నిశ్చయంగా, నీ శ్రేయోభిలాషిని!"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَخَرَجَ مِنْهَا خَآىِٕفًا یَّتَرَقَّبُ ؗ— قَالَ رَبِّ نَجِّنِیْ مِنَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟۠
అప్పుడతను భయపడుతూ, అతి జాగ్రత్తగా అక్కడి నుండి బయలు దేరాడు. అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను దుర్మార్గుల నుండి కాపాడు!"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَمَّا تَوَجَّهَ تِلْقَآءَ مَدْیَنَ قَالَ عَسٰی رَبِّیْۤ اَنْ یَّهْدِیَنِیْ سَوَآءَ السَّبِیْلِ ۟
ఆ తరువాత మద్ యన్ వైపుకు బయలు దేరుతూ, ఇలా అనుకున్నాడు: "బహుశా, నా ప్రభువు నాకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తున్నాడు!"[1]
[1] మద్ యన్ అక్కడ నివసించే ప్రజల తెగ పేరు. వారు అమోరైట్ (Amorite) తెగకు చెందిన 'అరబ్బులు. యూదుల సంతతితో వారికి దగ్గరి సంబంధం ఉండెను. చూడండి, 7:8. ఇబ్రాహీమ్ ('అ.స.) కుమారుడైన ఇస్'హాఖ్ ('అ.స.) యొక్క కుమారుడగు య'అఖూబ్ ('అ.స.) మరొక పేరు ఇస్లాయీ'ల్. ఆ పేరుతోనే పిలువబడే అతని పన్నెండుమంది కుమారుల సంతతి వారే ఇస్రాయీ'ల్ సంతతి వారు (బనీ ఇస్రాయీ'ల్).
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَمَّا وَرَدَ مَآءَ مَدْیَنَ وَجَدَ عَلَیْهِ اُمَّةً مِّنَ النَّاسِ یَسْقُوْنَ ؗ۬— وَوَجَدَ مِنْ دُوْنِهِمُ امْرَاَتَیْنِ تَذُوْدٰنِ ۚ— قَالَ مَا خَطْبُكُمَا ؕ— قَالَتَا لَا نَسْقِیْ حَتّٰی یُصْدِرَ الرِّعَآءُ ٚ— وَاَبُوْنَا شَیْخٌ كَبِیْرٌ ۟
ఇత అతను మద్ యన్ లోని ఒక బావి వద్దకు చేరుకున్నప్పుడు; అక్కడ చాలా మంది ప్రజలు, తమ తమ పశువులకు నీరు త్రాగించటాన్ని మరియు వారికి దూరంగా ఒక ప్రక్కన ఇద్దరు స్త్రీలు తమ పశువులను ఆపుతూ ఉండటాన్ని చూశాడు. (మూసా) ఆ స్త్రీలను అడిగాడు: "మీరిద్దరి చిక్కు ఏమిటి?" వారిద్దరన్నారు: "ఈ పశువుల కాపరులంతా పోయే వరకు మేము (మా పశువులకు) నీరు త్రాపలేము. మరియు మా తండ్రి చాలా వృద్ధుడు"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَسَقٰی لَهُمَا ثُمَّ تَوَلّٰۤی اِلَی الظِّلِّ فَقَالَ رَبِّ اِنِّیْ لِمَاۤ اَنْزَلْتَ اِلَیَّ مِنْ خَیْرٍ فَقِیْرٌ ۟
అప్పుడు అతను వారిద్దరి పశువులకు నీరు త్రాపాడు. తరువాత నీడలోకి పోయి ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నీవు నాపై ఏ మేలును అవతరింపజేసినా, నేను దాని ఆవశ్యకత గలవాడనే!"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَجَآءَتْهُ اِحْدٰىهُمَا تَمْشِیْ عَلَی اسْتِحْیَآءٍ ؗ— قَالَتْ اِنَّ اَبِیْ یَدْعُوْكَ لِیَجْزِیَكَ اَجْرَ مَا سَقَیْتَ لَنَا ؕ— فَلَمَّا جَآءَهٗ وَقَصَّ عَلَیْهِ الْقَصَصَ ۙ— قَالَ لَا تَخَفْ ۫— نَجَوْتَ مِنَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
తరువాత ఆ ఇద్దరిలో ఒకామె సిగ్గుపడుతూ మెల్లగా అతని వద్దకు వచ్చి ఇలా అన్నది: "వాస్తవానికి నా తండ్రి - నీవు మా కొరకు (మా పశువులకు) నీరు త్రాపించి నందుకు - ప్రతిఫలమివ్వటానికి, నిన్ను పిలుస్తున్నాడు."[1] అతను, అతని వద్దకు పోయి తన వృత్తాంతాన్ని వినిపించాడు. అప్పుడతను అన్నాడు: "నీవు ఏ మాత్రం భయపడకు. నీవు దుర్మార్గ ప్రజల నుండి విముక్తి పొందావు."
[1] ఆ ఇద్దరు స్త్రీల తండ్రి పేరు ఖుర్ఆన్ పేర్కొనలేదు. ఇమామ్ షౌకాని మరియు ఇతర చాలామంది వ్యాఖ్యాతలు అతని పేరు షు'ఐబ్ ('అ.స.) అని అన్నారు. ఎందుకంటే అతను మద్ యన్ జాతి వారివైపునకే ప్రవక్తగా పంపబడి ఉండెను. కాని ఇబ్నె-కసీ'ర్ అభిప్రాయం వేరుంది. అతను అంటారు: 'షు'ఐబ్ ('అ.స.) మరియు మూసా ('అ.స.) కాలాలలో చాలా గడువు ఉంది. కాబట్టి ఇతను షు'ఐబ్ ('అ.స.) తెగకు చెందిన మరొక వ్యక్తి కావచ్చు.' అల్లాహు ఆలమ్.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَتْ اِحْدٰىهُمَا یٰۤاَبَتِ اسْتَاْجِرْهُ ؗ— اِنَّ خَیْرَ مَنِ اسْتَاْجَرْتَ الْقَوِیُّ الْاَمِیْنُ ۟
వారిద్దరిలో ఒకామె ఇలా అన్నది: "నాన్నా! ఇతనిని పని కొరకు పెట్టుకో. నిశ్చయంగా, ఇలాంటి బలవంతుని మరియు నమ్మదగిన వానిని పని కొరకు పెట్టుకోవటం ఎంతో మేలైనది."
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ اِنِّیْۤ اُرِیْدُ اَنْ اُنْكِحَكَ اِحْدَی ابْنَتَیَّ هٰتَیْنِ عَلٰۤی اَنْ تَاْجُرَنِیْ ثَمٰنِیَ حِجَجٍ ۚ— فَاِنْ اَتْمَمْتَ عَشْرًا فَمِنْ عِنْدِكَ ۚ— وَمَاۤ اُرِیْدُ اَنْ اَشُقَّ عَلَیْكَ ؕ— سَتَجِدُنِیْۤ اِنْ شَآءَ اللّٰهُ مِنَ الصّٰلِحِیْنَ ۟
(వారి తండ్రి) అన్నాడు: "నీవు నా వద్ద ఎనిమిది సంవత్సరాలు పని చేస్తూ ఉండటానికి ఒప్పుకుంటే, నేను నా ఈ ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయగోరుతున్నాను.[1] నీవు ఒకవేళ పది సంవత్సరాలు పూర్తి చేయదలిస్తే అది నీ ఇష్టం! నేను నీకు కష్టం కలిగించ దలచుకోలేదు. అల్లాహ్ కోరితే, నీవు నన్ను సద్వర్తనునిగా పొందుతావు!"
[1] మన సాంఘిక సంప్రదాయంలో ఆడబిడ్డ (వధువు) ఇంటివారు తమ బిడ్డ కొరకు వరుని (పెండ్లి కుమారుని) వారితో వివాహసంబంధం గురించి మొదట మాట ప్రారంభించటం అనుచితమైన విషయంగా భావిస్తారు. కాని అల్లాహ్ (సు.తా.) షరీయత్ లో ఇది అనుచితం కాదు. ఒకవేళ సద్వర్తనుడు, సుశీలుడు అయిన వరుడు ఉంటే అతనితో గానీ, లేక అతని కుటుంబంవారితో గానీ, వధువు ఇంటివారు మాట్లాడితే తప్పులేదు. దైవప్రవక్త ('స'అస) మరియు సహాబీల (ర'ది.'అన్హుమ్)లలో కూడా ఈ ఆచారం ఉండెను.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ ذٰلِكَ بَیْنِیْ وَبَیْنَكَ ؕ— اَیَّمَا الْاَجَلَیْنِ قَضَیْتُ فَلَا عُدْوَانَ عَلَیَّ ؕ— وَاللّٰهُ عَلٰی مَا نَقُوْلُ وَكِیْلٌ ۟۠
(మూసా) అన్నాడు: "ఈ విషయం నీకూ మరియు నాకూ మధ్య నిశ్చయమే! ఈ రెండు గడువులలో నేను దేనిని పూర్తి చేసినా, నా పై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. మరియు మన ఈ మాటలకు అల్లాహ్ యే సాక్షి!"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَلَمَّا قَضٰی مُوْسَی الْاَجَلَ وَسَارَ بِاَهْلِهٖۤ اٰنَسَ مِنْ جَانِبِ الطُّوْرِ نَارًا ۚ— قَالَ لِاَهْلِهِ امْكُثُوْۤا اِنِّیْۤ اٰنَسْتُ نَارًا لَّعَلِّیْۤ اٰتِیْكُمْ مِّنْهَا بِخَبَرٍ اَوْ جَذْوَةٍ مِّنَ النَّارِ لَعَلَّكُمْ تَصْطَلُوْنَ ۟
ఆ తరువాత మూసా తన గడువు[1] పూర్తి చేసి, తన కుటుంబం వారిని తీసుకొని పోతుండగా, తూర్ పర్వతపు దిక్కులో ఒక మంటను చూశాడు. (అప్పుడు) తన ఇంటి వారితో అన్నాడు: "ఆగండి! నేను ఒక మంటను చూశాను, బహుశా! నేను అక్కడి నుండి ఏదైనా మంచి వార్తను తీసుకొని రావచ్చు, లేదా ఒక అగ్ని కొరవినైనా! అప్పుడు మీరు దానితో చలి కాచుకోవచ్చు."
[1] ఇబ్నె 'అబ్బాస్ (ర'ది.'అ.) కథనం ప్రకారం అతను ఈ గడువు పది సంవత్సరాలు పూర్తి చేశారు. ఎందుకంటే మూసా ('అ.స.) వృద్ధుడైన తన భార్య తండ్రికి సహాయపడగోరారు. చూడండి, 27:7-8.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَلَمَّاۤ اَتٰىهَا نُوْدِیَ مِنْ شَاطِئِ الْوَادِ الْاَیْمَنِ فِی الْبُقْعَةِ الْمُبٰرَكَةِ مِنَ الشَّجَرَةِ اَنْ یّٰمُوْسٰۤی اِنِّیْۤ اَنَا اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَ ۟ۙ
కాని అతను దాని (అగ్ని) వద్దకు చేరుకున్నప్పుడు,[1] ఆ లోయ కుడివైపు ఉన్న ఒక శుభవంతమైన స్థలములో ఉన్న ఒక చెట్టు నుండి: "ఓ మూసా! నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! సర్వలోకాల ప్రభువును." అనే మాటలు వినిపించాయి.
[1] ఆ మంట వాస్తవానికి అల్లాహ్ (సు.తా.) దివ్యజ్యోతి. చూడండి, 19:52, 20:80.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاَنْ اَلْقِ عَصَاكَ ؕ— فَلَمَّا رَاٰهَا تَهْتَزُّ كَاَنَّهَا جَآنٌّ وَّلّٰی مُدْبِرًا وَّلَمْ یُعَقِّبْ ؕ— یٰمُوْسٰۤی اَقْبِلْ وَلَا تَخَفْ ۫— اِنَّكَ مِنَ الْاٰمِنِیْنَ ۟
(ఇంకా ఇలా వినిపించింది): "నీ చేతి కర్రను పడవేయి!" అతను (మూసా) దానిని పామువలే కదలటం చూసి వెనక్కి మరలి పరుగెత్తాడు, తిరిగి కూడా చూడలేదు. (తరువాత ఇలా సెలవీయబడింది): "ఓ మూసా, ముందుకు రా, భయపడకు! నిశ్చయంగా, నీవు సురక్షితంగా ఉన్నావు!
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اُسْلُكْ یَدَكَ فِیْ جَیْبِكَ تَخْرُجْ بَیْضَآءَ مِنْ غَیْرِ سُوْٓءٍ ؗ— وَّاضْمُمْ اِلَیْكَ جَنَاحَكَ مِنَ الرَّهْبِ فَذٰنِكَ بُرْهَانٰنِ مِنْ رَّبِّكَ اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ ۟
నీ చేతిని నీ చంకలోకి దూర్చుకో, అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది[1]. నీవు భయపడకుండా ఉండటానికి నీ చేతిని నీ ప్రక్కకు అదుముకో! ఈ రెండు, నీవు ఫిర్ఔన్ మరియు అతని నాయకులకు (చూపటానికి) నీ ప్రభువు ప్రసాదించిన నిదర్శనాలు (ఆయాత్). నిశ్చయంగా వారు చాలా దుష్టులయి పోయారు!"
[1] చూడండి, 7:108.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ رَبِّ اِنِّیْ قَتَلْتُ مِنْهُمْ نَفْسًا فَاَخَافُ اَنْ یَّقْتُلُوْنِ ۟
(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నేను వారి మనిషిని ఒకనిని చంపాను. కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاَخِیْ هٰرُوْنُ هُوَ اَفْصَحُ مِنِّیْ لِسَانًا فَاَرْسِلْهُ مَعِیَ رِدْاً یُّصَدِّقُنِیْۤ ؗ— اِنِّیْۤ اَخَافُ اَنْ یُّكَذِّبُوْنِ ۟
మరియు నా సోదరుడు హారూన్ మాట్లాడటంలో నా కంటే మంచి వాగ్ధాటి గలవాడు.[1] నన్ను సమర్థించటానికి అతనిని నాకు సహాయకునిగా నాతో పాటు పంపు. వాస్తవానికి వారు నన్ను అసత్యవాదివని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను!"
[1] చూడండి, 20:27-28 మరియు 26:12-13
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ سَنَشُدُّ عَضُدَكَ بِاَخِیْكَ وَنَجْعَلُ لَكُمَا سُلْطٰنًا فَلَا یَصِلُوْنَ اِلَیْكُمَا ۚۛ— بِاٰیٰتِنَا ۚۛ— اَنْتُمَا وَمَنِ اتَّبَعَكُمَا الْغٰلِبُوْنَ ۟
ఆయన (అల్లాహ్) అన్నాడు: "మేము నీ సోదరుని ద్వారా నీ చేతులను బలపరుస్తాము. మరియు మేము మీ ఇద్దరికీ విశేష శక్తి నొసంగుతాము. వారు మీ ఇద్దరికి ఏ మాత్రం హాని చేయలేరు. మా సూచనల ద్వారా మీరిద్దరూ మరియు మిమ్మల్ని అనుసరించే వారు గెలుపొందుతారు."[1]
[1] ఆ వాక్యం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. చూడండి, 5:67, 33:39, 51:21, 40:51-52..
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَلَمَّا جَآءَهُمْ مُّوْسٰی بِاٰیٰتِنَا بَیِّنٰتٍ قَالُوْا مَا هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّفْتَرًی وَّمَا سَمِعْنَا بِهٰذَا فِیْۤ اٰبَآىِٕنَا الْاَوَّلِیْنَ ۟
ఆ తరువాత మూసా మా స్పష్టమైన సూచనలను తీసుకొని వారి వద్దకు పోగా వారన్నారు: "ఇది కల్పితమైన మాయాజాలం మాత్రమే.[1] ఇలాంటిది పూర్వీకులైన మా తాతముత్తాతల కాలంలో కూడా జరిగినట్లు మేము వినలేదు."[2]
[1] చూడండి, 74:24.
[2] చూడండి, 38:5.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقَالَ مُوْسٰی رَبِّیْۤ اَعْلَمُ بِمَنْ جَآءَ بِالْهُدٰی مِنْ عِنْدِهٖ وَمَنْ تَكُوْنُ لَهٗ عَاقِبَةُ الدَّارِ ؕ— اِنَّهٗ لَا یُفْلِحُ الظّٰلِمُوْنَ ۟
ఇక మూసా అన్నాడు: "నా ప్రభువు తరఫు నుండి ఎవడు మార్గదర్శకత్వం తీసుకొని వచ్చాడో మరియు చివరికి ఎవరి పర్యవసానం మంచిదవుతుందో ఆయనకు బాగా తెలుసు.[1] నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు."
[1] పరలోక సాఫల్యమే నిజమైన సాఫల్యం. సత్యతిరస్కారులు ఇహలోకంలో సాఫల్యం పొంద వచ్చు. భూలోకంలో దొరికే సుఖసంతోషాలు తాత్కాలికమైనవే! వాస్తవానికి పరలోక సుఖ సంతోషాలే చిరకాలముండేవి.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقَالَ فِرْعَوْنُ یٰۤاَیُّهَا الْمَلَاُ مَا عَلِمْتُ لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرِیْ ۚ— فَاَوْقِدْ لِیْ یٰهَامٰنُ عَلَی الطِّیْنِ فَاجْعَلْ لِّیْ صَرْحًا لَّعَلِّیْۤ اَطَّلِعُ اِلٰۤی اِلٰهِ مُوْسٰی ۙ— وَاِنِّیْ لَاَظُنُّهٗ مِنَ الْكٰذِبِیْنَ ۟
మరియు ఫిర్ఔన్ అన్నాడు: "ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు.[1] కావున ఓ హామాన్! కాల్చిన మట్టి ఇటుకలతో నాకొక ఎత్తైన గోపురాన్ని నిర్మించు. దానిపై ఎక్కి నేను బహుశా, మూసా దేవుణ్ణి చూడగలనేమో! నిశ్చయంగా, నేను ఇతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను."
[1] చూడండి, 79:24.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاسْتَكْبَرَ هُوَ وَجُنُوْدُهٗ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَظَنُّوْۤا اَنَّهُمْ اِلَیْنَا لَا یُرْجَعُوْنَ ۟
మరియు, అతడు మరియు అతడి సైనికులు భూమిపై అన్యాయంగా అహంభావాన్ని ప్రదర్శించారు. మరియు నిశ్చయంగా, మా వైపుకు తాము ఎన్నడూ మరలిరారని భావించారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاَخَذْنٰهُ وَجُنُوْدَهٗ فَنَبَذْنٰهُمْ فِی الْیَمِّ ۚ— فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الظّٰلِمِیْنَ ۟
కావున మేము అతనిని మరియు అతని సేనలను పట్టుకొని సముద్రంలోకి విసరివేశాము. ఇక చూడు! దుర్మార్గుల పర్యవసానం ఏమయిందో!
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَجَعَلْنٰهُمْ اَىِٕمَّةً یَّدْعُوْنَ اِلَی النَّارِ ۚ— وَیَوْمَ الْقِیٰمَةِ لَا یُنْصَرُوْنَ ۟
మరియు మేము వారిని నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. మరియు పునరుత్థాన దినమున వారికెలాంటి సహాయం దొరకదు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاَتْبَعْنٰهُمْ فِیْ هٰذِهِ الدُّنْیَا لَعْنَةً ۚ— وَیَوْمَ الْقِیٰمَةِ هُمْ مِّنَ الْمَقْبُوْحِیْنَ ۟۠
మరియు మేము ఈ లోకంలో కూడా అభిశాపం వారిని వెంటాడేటట్లు చేశాము. మరియు పునరుత్థాన దినమున వారు తృణీకరింప బడేవారిలో చేరుతారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ مِنْ بَعْدِ مَاۤ اَهْلَكْنَا الْقُرُوْنَ الْاُوْلٰی بَصَآىِٕرَ لِلنَّاسِ وَهُدًی وَّرَحْمَةً لَّعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟
మరియు వాస్తవానికి - పూర్వ తరాల వారిని నాశనం చేసిన తరువాత - మేము మానవులకు జ్ఞానవృద్ధి చేయటానికి మరియు వారికి మార్గదర్శకత్వంగా కారుణ్యంగా ఉండటానికి, మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. బహుశా వారు హితబోధ నేర్చుకుంటారని!
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَا كُنْتَ بِجَانِبِ الْغَرْبِیِّ اِذْ قَضَیْنَاۤ اِلٰی مُوْسَی الْاَمْرَ وَمَا كُنْتَ مِنَ الشّٰهِدِیْنَ ۟ۙ
మరియు (ఓ ముహమ్మద్!) మేము మూసాపై మా ఆదేశం (తౌరాత్) పూర్తిగా అవతరింప జేసినపుడు, నీవు (తూర్ పర్వతపు) కుడి వైపునా లేవు. మరియు నీవు అక్కడ ప్రత్యక్ష సాక్షులలో కూడా లేవు!
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلٰكِنَّاۤ اَنْشَاْنَا قُرُوْنًا فَتَطَاوَلَ عَلَیْهِمُ الْعُمُرُ ۚ— وَمَا كُنْتَ ثَاوِیًا فِیْۤ اَهْلِ مَدْیَنَ تَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِنَا ۙ— وَلٰكِنَّا كُنَّا مُرْسِلِیْنَ ۟
కాని నిశ్చయంగా, (ఆ తరువాత కూడా) మేము అనేక తరాలను ప్రభవింపజేశాము. వారి మీదుగా ఒక సుదీర్ఘకాలం గడిచి పోయింది. మా సూచనలను వినిపించటానికి నీవు మద్ యన్ వాసులతో కూడా లేవు, కాని మేము (ఎల్లప్పుడూ) మా సందేశహరులను పంపుతూ వచ్చాము.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَا كُنْتَ بِجَانِبِ الطُّوْرِ اِذْ نَادَیْنَا وَلٰكِنْ رَّحْمَةً مِّنْ رَّبِّكَ لِتُنْذِرَ قَوْمًا مَّاۤ اَتٰىهُمْ مِّنْ نَّذِیْرٍ مِّنْ قَبْلِكَ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟
మరియు మేము (మూసాను) పిలిచినపుడు, నీవు (ఓ ముహమ్మద్!) తూర్ పర్వతం దగ్గర లేవు. కాని నీవు నీ ప్రభువు యొక్క కారుణ్యంతో, నీకు పూర్వం హెచ్చరిక చేసేవాడు రానటువంటి జాతివారిని హెచ్చరించటానికి - బహుశా వారు హితబోధ నేర్చుకుంటారేమోనని - (పంపబడ్డావు).
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَوْلَاۤ اَنْ تُصِیْبَهُمْ مُّصِیْبَةٌ بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ فَیَقُوْلُوْا رَبَّنَا لَوْلَاۤ اَرْسَلْتَ اِلَیْنَا رَسُوْلًا فَنَتَّبِعَ اٰیٰتِكَ وَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟
మరియు వారు తమ చేతులారా, చేసుకొని పంపిన కర్మల ఫలితంగా వారిపై ఆపద వచ్చి పడినపుడు, వారు: "ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు, అలా చేస్తే మేము నీ సూచనలను అనుసరిస్తూ, విశ్వాసులైన వారిలో చేరి ఉండేవారం కదా!" (అని తీర్పు దినమున అనకూడదని).
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَلَمَّا جَآءَهُمُ الْحَقُّ مِنْ عِنْدِنَا قَالُوْا لَوْلَاۤ اُوْتِیَ مِثْلَ مَاۤ اُوْتِیَ مُوْسٰی ؕ— اَوَلَمْ یَكْفُرُوْا بِمَاۤ اُوْتِیَ مُوْسٰی مِنْ قَبْلُ ۚ— قَالُوْا سِحْرٰنِ تَظَاهَرَا ۫— وَقَالُوْۤا اِنَّا بِكُلٍّ كٰفِرُوْنَ ۟
ఆ తర్వాత మా తరఫు నుండి వారి వద్దకు సత్యం వచ్చినపుడు, వారిలా అన్నారు: "మూసాకు ఇవ్వ బడినటువంటిది, ఇతనికి ఎందుకు ఇవ్వబడలేదు!" ఏమీ? దీనికి పూర్వం మూసాకు ఇవ్వబడిన దానిని వారు తిరస్కరించలేదా? వారన్నారు: "రెండూ మాయాజాలాలే! అవి ఒకదాని కొకటి సహాయపడుతున్నాయి." ఇంకా ఇలా అన్నారు: "నిశ్చయంగా, మేము వీటన్నింటినీ తిరస్కరిస్తున్నాము."
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قُلْ فَاْتُوْا بِكِتٰبٍ مِّنْ عِنْدِ اللّٰهِ هُوَ اَهْدٰی مِنْهُمَاۤ اَتَّبِعْهُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "మీరు నిజాయితీపరులే అయితే, అల్లాహ్ దగ్గర నుండి ఈ రెండింటి కంటే ఉత్తమమైన మార్గం చూపే ఒక గ్రంథాన్ని తీసుకురండి. దానిని నేను అనుసరిస్తాను."
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاِنْ لَّمْ یَسْتَجِیْبُوْا لَكَ فَاعْلَمْ اَنَّمَا یَتَّبِعُوْنَ اَهْوَآءَهُمْ ؕ— وَمَنْ اَضَلُّ مِمَّنِ اتَّبَعَ هَوٰىهُ بِغَیْرِ هُدًی مِّنَ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟۠
వారు నీకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే, వారు కేవలం తమ కోరికలను అనుసరిస్తున్నారని తెలుసుకో! మరియు అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని విడిచి కేవలం తన కోరికలను అనుసరించే వాని కంటే ఎక్కువ మార్గభ్రష్టుడు ఎవడు? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟ؕ
మరియు వారు హితబోధ పొందాలని, వాస్తవంగా మేము ఈ వచనాన్ని (ఖుర్ఆన్ ను) క్రమక్రమంగా అందజేశాము.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ مِنْ قَبْلِهٖ هُمْ بِهٖ یُؤْمِنُوْنَ ۟
ఎవరికైతే పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చామో వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు.[1]
[1] అంటే యూదులలో 'అబ్దుల్లాహ్ బిన్-సల్లామ్ మరియు 'హబష నుండి వచ్చిన క్రైస్తవులు (ర'.ది.'అన్హుమ్). చూడండి, 26:196-197.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِذَا یُتْلٰی عَلَیْهِمْ قَالُوْۤا اٰمَنَّا بِهٖۤ اِنَّهُ الْحَقُّ مِنْ رَّبِّنَاۤ اِنَّا كُنَّا مِنْ قَبْلِهٖ مُسْلِمِیْنَ ۟
మరియు వారికి ఇది వినిపించబడి నప్పుడు, వారు ఇలా అంటారు: "మేము దీనిని విశ్వసించాము, నిశ్చయంగా ఇది మా ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నిశ్చయంగా, మేము మొదటి నుండియో అల్లాహ్ కు విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."[1]
[1] ఈ విషయం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. దైవప్రవక్తలందరూ ప్రచారం చేసిన ధర్మం ఇస్లాం మాత్రమే. అంటే ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) కు తప్ప ఇతరులకు దాస్యం, ఆరాధన చేయరాదని. ప్రతికాలపు వారు తమతమ భాషలలో దానికి వివిధ పేర్లు ఇచ్చారు. అంటే క్రైస్తవధర్మం, యూదధర్మం, మొదలైనవి. కాని వాస్తవానికి ప్రవక్తలందరి ధర్మం ఇస్లాం మాత్రమే. అంటే అల్లాహ్ (సు.తా.) కు విధేయులై కేవలం ఆయనకే దాస్యం, ఆరాధన చేయటం. కాని ఆ ప్రాచీన దివ్యగ్రంథాలు ఆయా ప్రవక్తల ప్రచారానికి ఎన్నో వందల సంవత్సరాల తరువాత లిఖిత రూపంలోకి వచ్చాయి. దాని వల్ల వాటిని లిఖించిన వారు, తమ ప్రవక్తుల వినిపించిన దివ్యసందేశాలను వాటి అసలు అవతరించిన రూపంలో వ్రాయలేక పోయారు. తరువాత తరాల ధర్మవేత్తలు మొదటి వారు వ్రాసిన వాటితో ఏకీభవించక వాటిలో మార్పులు చేస్తూ పోయారు. ఉదాహరణకు: ఈ రోజు ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ ప్రామాణికమైనదిగా పరిగణించబడే బైబిల్ - ఏదైతే తౌరాత్, 'జబూర్ మరియు ఇంజీల్ గ్రంథా(Old and New Testaments)ల సముదాయమో - అందులో కూడా ఎన్నోసార్లు మార్పులు చేయబడ్డాయి. చివరి మార్పులు గలది, ఈనాటి (Revised) Authorized K.J.V. అందుకే అసలు ఆ ప్రవక్తలు ప్రచారం చేసింది, ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.) ఆరాధన. అయినా ఈనాడు వాటిలో మానవులు మార్పులు చేయడం వల్ల, ఆ గ్రంథాలను అనుసరిస్తున్నారు ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.) ఆరాధనను వదలి, బహుదైవారాధన, ప్రవక్తల విగ్రహాల ఆరాధన చేస్తున్నారు. కాని ఇస్లాం స్వీకరించిన యూదులు మరియు క్రైస్తవులు సత్యాన్ని తెలుసుకొని: 'మేము మొదటి నుండియే ముస్లింలముగా ఉన్నాము' అని అన్నారు. ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.) ఆరాధనయే సత్యధర్మమని, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اُولٰٓىِٕكَ یُؤْتَوْنَ اَجْرَهُمْ مَّرَّتَیْنِ بِمَا صَبَرُوْا وَیَدْرَءُوْنَ بِالْحَسَنَةِ السَّیِّئَةَ وَمِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۟
వీరే, తమ సహనానికి ఫలితంగా రెండింతలు ప్రతిఫలమొసంగపడే వారు.[1] వీరే మంచితో చెడును నివారించే వారు. మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు చేసేవారు.
[1] చూసహనం వహించటం అంటే, ఇక్కడ దైవప్రవక్తలను మరియు దివ్యగ్రంథాలను విశ్వసించి ఆ విశ్వాసంపై స్థిరంగా ఉండటం. మొదటి దివ్యగ్రంథం మీద స్థిరంగా ఉండి, రెండవ దివ్యగ్రంథం వస్తే దానిని అనుసరించటం. ఇలాంటి వారికి రెండింతలు ప్రతిఫలముంది. రెండింతలు ప్రతిఫలం పొందే ముగ్గురిలో వీరొకరు. ('స.బు'ఖారీ) చూ. 13:22.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِذَا سَمِعُوا اللَّغْوَ اَعْرَضُوْا عَنْهُ وَقَالُوْا لَنَاۤ اَعْمَالُنَا وَلَكُمْ اَعْمَالُكُمْ ؗ— سَلٰمٌ عَلَیْكُمْ ؗ— لَا نَبْتَغِی الْجٰهِلِیْنَ ۟
మరియు వారు వ్యర్థమైన మాటలు విన్నప్పుడు, ఇలా అంటూ దూరంగా తొలగి పోతారు: "మాకు మా కర్మలు మరియు మీకు మీ కర్మలు, మీకు సలాం![1] మాకు మూర్ఖులతో పనిలేదు."
[1] ఈ సలాం అభివందనం కాదు. మేము మీవంటి మూర్ఖులతో వాదులాడమని తప్పించుకోవటానికి పలికేది. చూడండి, 25:63, 43:89.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّكَ لَا تَهْدِیْ مَنْ اَحْبَبْتَ وَلٰكِنَّ اللّٰهَ یَهْدِیْ مَنْ یَّشَآءُ ۚ— وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِیْنَ ۟
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందే వారెవరో బాగా తెలుసు.[1]
[1] చూఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) పినతండ్రి అబూ 'తాలిబ్ మరణిచినప్పుడు అవతరింపజేయబడింది. అతని ఆఖరు ఘడియలలో దైవప్రవక్త ('స'అస) అతనితో అన్నారు: "ఇప్పుడైనా: 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అను. దానితో నేను పునరుత్థానదినమున నీ క్షమాపణ కొరకు అల్లాహ్ (సు.తా.)ను పేడుకోగలను." అక్కడున్న ఖురైష్ సర్దారులను చూసి అతను అలా అనలేదు. ('స'హీ'హ్ బు'ఖారీ) ఇంకా చూ. 14:4.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقَالُوْۤا اِنْ نَّتَّبِعِ الْهُدٰی مَعَكَ نُتَخَطَّفْ مِنْ اَرْضِنَا ؕ— اَوَلَمْ نُمَكِّنْ لَّهُمْ حَرَمًا اٰمِنًا یُّجْبٰۤی اِلَیْهِ ثَمَرٰتُ كُلِّ شَیْءٍ رِّزْقًا مِّنْ لَّدُنَّا وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟
వారు ఇలా అంటారు: "ఒకవేళ నీతో పాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలంబిస్తే! మేము మా భూమి నుండియే పారద్రోలబడతాము."[1] ఏమీ? మేము వారిని శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలం (మక్కా) లో స్థిరనివాసము నొసంగి వారికి మా తరఫు నుండి జీవనోపాధిగా అన్ని రకాల ఫలాలను సమకూర్చలేదా? కాని వాస్తవానికి వారిలో చాలా మందికి ఇది తెలియదు.[2]
[1] దీనిని ఈ విధంగా బోధించారు: 1) ఆ కాలపు ఖురైషులు ఇస్లాం స్వీకరిస్తే, వారి తోటి వారు, వారిని మతద్రోహులుగా పరిగణించి వారిని, వారి నగరం మక్కా నుండి పారద్రోలుతారని భయపడ్డారు. 2) అదే విధంగా ఈ కాలంలో కూడా చాలామంది ఇది సత్యధర్మమని తెలిసి కూడా తమ బంధువుల నుండి మరియు తమ సమాజం నుండి విడదీయబడతామని భయపడి సత్యాన్ని అవలంబించరు. కాని రాబోయే పరలోక జీవితపు శాశ్వత సుఖాల ముందు ఈ జీవిత సుఖం అతి స్వల్పమైనదనే సత్యాన్ని వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది!
[2] చూడండి, 14:35-41, 21:26, 29:67. 22. ఇబ్రాహీం ('అ.స.) మక్కా కొరకు చేసిన ప్రార్థన.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَكَمْ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ بَطِرَتْ مَعِیْشَتَهَا ۚ— فَتِلْكَ مَسٰكِنُهُمْ لَمْ تُسْكَنْ مِّنْ بَعْدِهِمْ اِلَّا قَلِیْلًا ؕ— وَكُنَّا نَحْنُ الْوٰرِثِیْنَ ۟
మరియు మేము ఎన్నో నగరాలను, జీవన సుఖసంపదలతో ఉప్పొంగిపోతూ ఉండగా, వాటిని నాశనం చేయలేదా! అవిగో వారి నివాసాలు, వారి తరువాత వాటిలో నివసించిన వారు చాలా తక్కువ! మరియు నిశ్చయంగా, మేమే వాటికి వారసులయ్యాము. [1]
[1] చూడండి, 15:23.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَا كَانَ رَبُّكَ مُهْلِكَ الْقُرٰی حَتّٰی یَبْعَثَ فِیْۤ اُمِّهَا رَسُوْلًا یَّتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِنَا ۚ— وَمَا كُنَّا مُهْلِكِی الْقُرٰۤی اِلَّا وَاَهْلُهَا ظٰلِمُوْنَ ۟
మరియు నీ ప్రభువు నగరాలను ఏ మాత్రమూ నాశనం చేసేవాడు కాదు, ఎంత వరకైతే వాటి ముఖ్య నగరానికి మా సూచన (ఆయాత్) లను వినిపించే సందేశహరులను పంపమో! మేము నగరాలను వాటి ప్రజలు దుర్మార్గులై పోతే తప్ప, నాశనం చేసే వారం కాము.[1]
[1] సందేశహరులు ఎల్లప్పుడూ పెద్ద నగరాలలోనే పంపబడ్డారు. వారే దాని చుట్టూ ఉన్న చిన్న గ్రామాల వారికి కూడా ప్రచారం చేశారు. కేవలం సత్యతిరస్కారులుగా ఉన్నంత మాత్రాన, ఏ నగరవాసులు కూడా నాశనం చేయబడలేదు. సత్యతిరస్కారంతో బాటు వాటిలోని ప్రజలు దుర్మార్గానికి, విశ్వాసుల పట్ల దౌర్జన్యానికి పాల్పడినప్పుడే అవి నాశనం చేయబడ్డాయి. చూడండి, 11:117, 6:130-132, 28:59.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَاۤ اُوْتِیْتُمْ مِّنْ شَیْءٍ فَمَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا وَزِیْنَتُهَا ۚ— وَمَا عِنْدَ اللّٰهِ خَیْرٌ وَّاَبْقٰی ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟۠
మరియు మీకు ఇవ్వబడిన వన్నీ ఈ ప్రాపంచిక జీవితపు సుఖసంతోషాల సామాగ్రి మరియు దాని అలంకరణలు మాత్రమే! కాని అల్లాహ్ వద్ద ఉన్నది దీని కంటే ఎంతో ఉత్తమమైనది మరియు నిత్యమైనది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?[1]
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'అల్లాహ్ (సు.తా.) సాక్షి! ఈ ప్రాపంచిక జీవితం పరలోక జీవితం ముందు, ఒకడు తన వ్రేలును సముద్రంలో ముంచి బయటికి తీస్తే, దానికి అంటే నీటితో సమానమైనది.' ('స'హీ'హ్ ముస్లిం)
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَفَمَنْ وَّعَدْنٰهُ وَعْدًا حَسَنًا فَهُوَ لَاقِیْهِ كَمَنْ مَّتَّعْنٰهُ مَتَاعَ الْحَیٰوةِ الدُّنْیَا ثُمَّ هُوَ یَوْمَ الْقِیٰمَةِ مِنَ الْمُحْضَرِیْنَ ۟
ఏమీ? మేము చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందేవాడు,[1] మేము ఒసంగిన ఈ ప్రాపంచిక సుఖసంతోషాలు పొంది, పునరుత్థాన దినమున మా ముందు (శిక్షకై) హాజరు చేయబడే వాడితో సమానుడు కాగలడా?
[1] చూఅల్లాహ్ (సు.తా.) మంచి వాగ్దానం చేసిన, సద్వర్తనులైన విశ్వాసులకు: 'ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!' చూడండి, 2:38, 62, 112, 262, 274, 277, 3:170, 5:69, 6:48, 7:35, 49, 10:62, 46:13.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَیَوْمَ یُنَادِیْهِمْ فَیَقُوْلُ اَیْنَ شُرَكَآءِیَ الَّذِیْنَ كُنْتُمْ تَزْعُمُوْنَ ۟
మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ రోజు ఆయన (అల్లాహ్) వారిని పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నా భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు?"[1]
[1] చూడండి, 6:22-23.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ الَّذِیْنَ حَقَّ عَلَیْهِمُ الْقَوْلُ رَبَّنَا هٰۤؤُلَآءِ الَّذِیْنَ اَغْوَیْنَا ۚ— اَغْوَیْنٰهُمْ كَمَا غَوَیْنَا ۚ— تَبَرَّاْنَاۤ اِلَیْكَ ؗ— مَا كَانُوْۤا اِیَّانَا یَعْبُدُوْنَ ۟
ఎవరైతే ఆ మాట (శిక్ష) వర్తిస్తుందో, వారిలా విన్నవించుకుంటారు: "ఓ మా ప్రభూ! మేము దారి తప్పించిన వారు వీరే! మేము దారి తప్పిన విధంగానే వీరిని కూడా దారి తప్పించాము. వీరితో మాకెలాంటి సంబంధం లేదని నీ ముందు ప్రకటిస్తున్నాము. అసలు వీరు మమ్మల్ని ఆరాధించనేలేదు."[1]
[1] అసలు వీరు మమ్మల్ని ఆరాధించనే లేదు. ఈ వాక్యం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. చూడండి, 6:49, 19:81, 82, 46:5-6, 10:28, 29:25, 2:166, 167 .
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقِیْلَ ادْعُوْا شُرَكَآءَكُمْ فَدَعَوْهُمْ فَلَمْ یَسْتَجِیْبُوْا لَهُمْ وَرَاَوُا الْعَذَابَ ۚ— لَوْ اَنَّهُمْ كَانُوْا یَهْتَدُوْنَ ۟
మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు సాటి కల్పించిన మీ భాగస్వాములను పిలువండి!" అప్పుడు వారు, వారిని (భాగస్వాములను) పిలుస్తారు, కాని వారు, వారికి సమాధానమివ్వరు. మరియు వారు శిక్షను చూసి (అనుకుంటారు): "ఒకవేళ వాస్తవానికి తాము సన్మార్గాన్ని అవలంబించి వుంటే ఎంత బాగుండేది!" [1] అని.
[1] ఇంకా చూడండి, 18:52, 53.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَیَوْمَ یُنَادِیْهِمْ فَیَقُوْلُ مَاذَاۤ اَجَبْتُمُ الْمُرْسَلِیْنَ ۟
మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆయన (అల్లాహ్) వారిని పిలిచిన రోజు ఇలా ప్రశ్నిస్తాడు: "మేము పంపిన సందేశహరులకు మీరు ఏ విధంగా సమాధానమిచ్చారు?"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَعَمِیَتْ عَلَیْهِمُ الْاَنْۢبَآءُ یَوْمَىِٕذٍ فَهُمْ لَا یَتَسَآءَلُوْنَ ۟
ఆ రోజు వారి సమాధానాలన్నీ (కారణాలన్నీ) అస్పష్టమై పోతాయి మరియు వారు ఒకరితో నొకరు సంప్రదించుకోనూ లేరు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاَمَّا مَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ صَالِحًا فَعَسٰۤی اَنْ یَّكُوْنَ مِنَ الْمُفْلِحِیْنَ ۟
కాని ఎవడైతే పశ్చాత్తాప పడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో! అతడు సాఫల్యం పొందే వారిలో చేరగలడని ఆశించవచ్చు!
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَرَبُّكَ یَخْلُقُ مَا یَشَآءُ وَیَخْتَارُ ؕ— مَا كَانَ لَهُمُ الْخِیَرَةُ ؕ— سُبْحٰنَ اللّٰهِ وَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟
మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు. మరియు ఎన్నుకునే హక్కు వారికి ఏ మాత్రం లేదు. అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు, వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే మహోన్నతుడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَرَبُّكَ یَعْلَمُ مَا تُكِنُّ صُدُوْرُهُمْ وَمَا یُعْلِنُوْنَ ۟
మరియు వారు తమ హృదయాలలో దాచుకున్నది మరియు బహిర్గతం చేసేది అంతా నీ ప్రభువుకు తెలుసు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَهُوَ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— لَهُ الْحَمْدُ فِی الْاُوْلٰی وَالْاٰخِرَةِ ؗ— وَلَهُ الْحُكْمُ وَاِلَیْهِ تُرْجَعُوْنَ ۟
మరియు ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! మొదట (ఇహలోకంలో) మరియు చివరకు (పరలోకంలో) స్తుతింపదగినవాడు కేవలం ఆయనే! మరియు విశ్వన్యాయాధిపత్యం ఆయనదే. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قُلْ اَرَءَیْتُمْ اِنْ جَعَلَ اللّٰهُ عَلَیْكُمُ الَّیْلَ سَرْمَدًا اِلٰی یَوْمِ الْقِیٰمَةِ مَنْ اِلٰهٌ غَیْرُ اللّٰهِ یَاْتِیْكُمْ بِضِیَآءٍ ؕ— اَفَلَا تَسْمَعُوْنَ ۟
వారితో అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపైన పునరుత్థాన దినం వరకు ఎడతెగకుండా రాత్రి ఆవరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా, మీకు వెలుగును తేగలడా? అయితే మీరెందుకు వినరు?"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قُلْ اَرَءَیْتُمْ اِنْ جَعَلَ اللّٰهُ عَلَیْكُمُ النَّهَارَ سَرْمَدًا اِلٰی یَوْمِ الْقِیٰمَةِ مَنْ اِلٰهٌ غَیْرُ اللّٰهِ یَاْتِیْكُمْ بِلَیْلٍ تَسْكُنُوْنَ فِیْهِ ؕ— اَفَلَا تُبْصِرُوْنَ ۟
ఇంకా ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపై పునరుత్థాన దినము వరకు ఎడతెగకుండా పగటిని అవతరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా మీకు విశ్రాంతి పొందటానికి రాత్రిని తేగలడా? అయితే, మీరెందుకు చూడలేరు?"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمِنْ رَّحْمَتِهٖ جَعَلَ لَكُمُ الَّیْلَ وَالنَّهَارَ لِتَسْكُنُوْا فِیْهِ وَلِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟
ఆయన తన కారుణ్యంతో మీ కొరకు రాత్రిని మరియు పగటిని, విశ్రాంతి పొందటానికి మరియు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి చేశాడు, బహుశా మీరు కృతజ్ఞులౌతారేమోనని.[1]
[1] రాత్రి మరియు పగలు ఈ రెండూ అల్లాహ్ (సు.తా.) అనుగ్రహించిన వరాలు. ఒకవేళ రాత్రి లేకుంటే, ప్రజలందరూ ఒకేసారి విశ్రాంతి తీసుకోలేక పోయేవారు. ప్రతి ఒక్కడు తన ఇష్టానుసారం విశ్రాంతి తీసుకుంటే ప్రపంచ కార్యక్రమాలు సరళంగా జరిగేవి కావు. మానవుల జీవితాలు పరస్పర సహయోగం, వల్లనే సరళంగా జరుగుతున్నాయి. దాని కొరకు రాత్రింబవళ్ళు ఎంతో ఉపయోగకరమైనవి.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَیَوْمَ یُنَادِیْهِمْ فَیَقُوْلُ اَیْنَ شُرَكَآءِیَ الَّذِیْنَ كُنْتُمْ تَزْعُمُوْنَ ۟
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆయన (అల్లాహ్), వారిని ఆ రోజు పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నాకు భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు?"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَنَزَعْنَا مِنْ كُلِّ اُمَّةٍ شَهِیْدًا فَقُلْنَا هَاتُوْا بُرْهَانَكُمْ فَعَلِمُوْۤا اَنَّ الْحَقَّ لِلّٰهِ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟۠
మరియు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని[1] నిలబెట్టి ఇలా అంటాము: "మీ నిదర్శనాన్ని తీసుకురండి!" అప్పుడు వారు సత్యం, నిశ్చయంగా అల్లాహ్ వైపే ఉందని తెలుసుకుంటారు. మరియు వారు కల్పించుకున్నవన్నీ వారిని త్యజించి ఉంటాయి.
[1] ఈ సాక్షులు ప్రవక్త ('అలైహిమ్ స.)లు ప్రతి ప్రవక్త తన కాలపు ప్రజలకు సాక్షిగా ఉంటాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّ قَارُوْنَ كَانَ مِنْ قَوْمِ مُوْسٰی فَبَغٰی عَلَیْهِمْ ۪— وَاٰتَیْنٰهُ مِنَ الْكُنُوْزِ مَاۤ اِنَّ مَفَاتِحَهٗ لَتَنُوْٓاُ بِالْعُصْبَةِ اُولِی الْقُوَّةِ ۗ— اِذْ قَالَ لَهٗ قَوْمُهٗ لَا تَفْرَحْ اِنَّ اللّٰهَ لَا یُحِبُّ الْفَرِحِیْنَ ۟
వాస్తవానికి, ఖారూన్, మూసా జాతికి చెందినవాడే. కాని అతడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.[1] మరియు మేము అతడికి ఎన్నో నిధులను ఇచ్చి ఉంటిమి. వాటి తాళవు చెవులను బలవంతులైన పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా ఎంతో కష్టంతో మాత్రమే మోయగలిగే వారు. అతడి జాతి వారు అతనితో అన్నారు: "నీవు విర్రవీగకు, నిశ్చయంగా, అల్లాహ్ విర్రవీగే వారిని ప్రేమించడు!
[1] చూఎంత గొప్ప ప్రవక్తను అనుసరించినా, అహంభావం మరియు స్వాభిమానంతో ప్రవర్తించే వారిని అల్లాహ్ (సు.తా.) ప్రేమించడు. ఈ ఉదాహరణ ఇక్కడ మూసా ('అ.స.) జాతికి చెందిన ఖారూన్ అనే గొప్ప ధనవంతుడైన వ్యక్తి విషయంలో ఇవ్వబడింది. ఇంకా చూడండి, 29:39 మరియు 40:24.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَابْتَغِ فِیْمَاۤ اٰتٰىكَ اللّٰهُ الدَّارَ الْاٰخِرَةَ وَلَا تَنْسَ نَصِیْبَكَ مِنَ الدُّنْیَا وَاَحْسِنْ كَمَاۤ اَحْسَنَ اللّٰهُ اِلَیْكَ وَلَا تَبْغِ الْفَسَادَ فِی الْاَرْضِ ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ الْمُفْسِدِیْنَ ۟
మరియు అల్లాహ్ నీకు ఇచ్చిన సంపదతో పరలోక గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు ఇహలోకం నుండి లభించే భాగాన్ని మరచిపోకు. నీకు అల్లాహ్ మేలు చేసినట్లు, నీవు కూడా (ప్రజలకు) మేలు చేయి.[1] భూమిపై కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నించకు. నిశ్చయంగా, అల్లాహ్ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు!"
[1] ఏ విధంగానైతే నీ ప్రభువుకు నీపై హక్కు ఉందో, అదే విధంగా నీ ఆత్మకు, నీ భార్యాపిల్లలకు, నీ బంధువులకు మరయు నీ అతిథులను మొదలైన వారికి కూడా నీ మీద., నీ ఆదాయం మీద హక్కు ఉంది. కావున ప్రతి ఒక్కనికి వాని హక్కు చెల్లించు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ اِنَّمَاۤ اُوْتِیْتُهٗ عَلٰی عِلْمٍ عِنْدِیْ ؕ— اَوَلَمْ یَعْلَمْ اَنَّ اللّٰهَ قَدْ اَهْلَكَ مِنْ قَبْلِهٖ مِنَ الْقُرُوْنِ مَنْ هُوَ اَشَدُّ مِنْهُ قُوَّةً وَّاَكْثَرُ جَمْعًا ؕ— وَلَا یُسْـَٔلُ عَنْ ذُنُوْبِهِمُ الْمُجْرِمُوْنَ ۟
అతడు (ఖారూన్) అన్నాడు: "నిశ్చయంగా, ఇది (ఈ ధనం) నాకు నా జ్ఞానం వల్లనే ఇవ్వబడింది!" [1] ఏమీ? అతడికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ అతడికి ముందు ఎన్నో తరాల వారిని - అతడి కంటే ఎక్కువ బలం మరియు ఎక్కువ ధనసంపదలు గలవారిని కూడా - నాశనం చేశాడని? మరియు పాపాత్ములు వారి పాపాలను గురించి ప్రశ్నింపబడరు.
[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 28:78 మరియు 41:50.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَخَرَجَ عَلٰی قَوْمِهٖ فِیْ زِیْنَتِهٖ ؕ— قَالَ الَّذِیْنَ یُرِیْدُوْنَ الْحَیٰوةَ الدُّنْیَا یٰلَیْتَ لَنَا مِثْلَ مَاۤ اُوْتِیَ قَارُوْنُ ۙ— اِنَّهٗ لَذُوْ حَظٍّ عَظِیْمٍ ۟
తరువాత అతడు తన వైభవంతో తన జాతి వారి ఎదుటకు వచ్చాడు. ఇహలోక జీవితపు సుఖాలు కోరేవారు ఇలా అన్నారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఖారూన్ కు లభించినటు వంటివి (ధనసంపత్తులు) మాకు కూడా లభించి ఉంటే ఎంత బాగుండేది? నిశ్చయంగా అతడు ఎంతో అదృష్టవంతుడు!"
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقَالَ الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ وَیْلَكُمْ ثَوَابُ اللّٰهِ خَیْرٌ لِّمَنْ اٰمَنَ وَعَمِلَ صَالِحًا ۚ— وَلَا یُلَقّٰىهَاۤ اِلَّا الصّٰبِرُوْنَ ۟
కాని జ్ఞానసంపన్నులు అన్నారు: "మీ దౌర్భాగ్యం! అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలమే, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఎంతో శ్రేష్ఠమైనది. మరియు ఈ మహాభాగ్యం, సహనం వహించే వారికి తప్ప ఇతరులకు లభించదు."[1]
[1] 'హదీస్' ఖుద్సీ: అల్లాహ్ (సు.తా.) అంటాడు: 'నేను నా సద్వర్తనులైన దాసుల కొరకు సిద్ధపరచిన వస్తువులు ఎలాంటివంటే, వాటిని ఇంత వరకు ఏ కన్నూ చూడలేదు, ఏ చెవి వినలేదు మరియు ఏ ఆత్మ కూడా ఊహించలేదు!' (బు'ఖారీ, ముస్లిం)
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَخَسَفْنَا بِهٖ وَبِدَارِهِ الْاَرْضَ ۫— فَمَا كَانَ لَهٗ مِنْ فِئَةٍ یَّنْصُرُوْنَهٗ مِنْ دُوْنِ اللّٰهِ ؗۗ— وَمَا كَانَ مِنَ الْمُنْتَصِرِیْنَ ۟
ఆ పిదప మేము అతనిని, అతని గృహంతో సహా భూమిలోకి అణగద్రొక్కాము. అతడిని, అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించగల, అతడి తెగవారు ఎవ్వరూ లేకపోయారు మరియు అతడు కూడా తనను తాను కాపాడు కోలేకపోయాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاَصْبَحَ الَّذِیْنَ تَمَنَّوْا مَكَانَهٗ بِالْاَمْسِ یَقُوْلُوْنَ وَیْكَاَنَّ اللّٰهَ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ وَیَقْدِرُ ۚ— لَوْلَاۤ اَنْ مَّنَّ اللّٰهُ عَلَیْنَا لَخَسَفَ بِنَا ؕ— وَیْكَاَنَّهٗ لَا یُفْلِحُ الْكٰفِرُوْنَ ۟۠
మరియు నిన్నటి వరకు అతడి (ఖారూన్) వలే కావలెనని ఎవరైతే కోరుతూ వచ్చారో, వారు ఇప్పుడు ఇలా పలుకసాగారు: "తెలుసుకోండి! [1] అల్లాహ్ తన దాసులలో, తాను కోరిన వారికి జీవనోపాధిని విస్తరింపజేస్తాడు.[2] మరియు (తాను కోరిన వారికి) తగ్గిస్తాడు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహమే మాపై లేకుంటే ఆయన మమ్మల్ని కూడా భూమిలోకి అణగద్రొక్కి ఉండేవాడు. తెలుసుకోండి! సత్యతిరస్కారులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు!"
[1] వయ్ క అన్న : ఈ శబ్దానికి, Woe unto thee, Oh, Ah, Know అనే అర్తాలిచ్చారు. అంటే, నీ పాడు గాను, అయ్యే, తెలుసుకో మొదలైనవి.
[2] అల్లాహ్ (సు.తా.) ధన సంపత్తులు ప్రసాదించినంత మాత్రాన అల్లాహ్ (సు.తా.) వానితో సంతుష్టుడయ్యాడని మరియు అల్లాహ్ (సు.తా.) వాటిని ఇవ్వని వాని మీద కోపంతో ఉన్నాడని కాదు. శాశ్వత సుఖసంతోషాలు కేవలం విశ్వసించి సత్కార్యాలు చేసే వారికే లభిస్తాయి. భూలోక సుఖసంతోషాలు, పరలోక సుఖసంతోషాల ముందు అతి స్వల్వమైనవి.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
تِلْكَ الدَّارُ الْاٰخِرَةُ نَجْعَلُهَا لِلَّذِیْنَ لَا یُرِیْدُوْنَ عُلُوًّا فِی الْاَرْضِ وَلَا فَسَادًا ؕ— وَالْعَاقِبَةُ لِلْمُتَّقِیْنَ ۟
ఆ పరలోక జీవితపు గృహాన్ని మేము భూమిలో పెద్దరికం చూపగోరని వారి కొరకు మరియు కల్లోలం రేకెత్తించని వారి కొరకు ప్రత్యేకిస్తాము. మరియు దైవభీతి గలవారికే (మేలైన) పర్యవసానం ఉంటుంది.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
مَنْ جَآءَ بِالْحَسَنَةِ فَلَهٗ خَیْرٌ مِّنْهَا ۚ— وَمَنْ جَآءَ بِالسَّیِّئَةِ فَلَا یُجْزَی الَّذِیْنَ عَمِلُوا السَّیِّاٰتِ اِلَّا مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
మంచి పనులు చేసి వచ్చిన వారికి వాటి కంటే ఉత్తమమైన (ప్రతిఫలం) లభిస్తుంది.[1] మరియు చెడ్డపనులు చేసి వచ్చిన వారికి, వారు చేస్తూ ఉండిన చెడ్డపనులకు తగినంత ప్రతిఫలమే ఇవ్వబడుతుంది.
[1] చూడండి, 27:89 ప్రతి మంచిపనికి పదింతలు అధికంగా పుణ్యఫలితం ఇవ్వబడుతుంది. అల్లాహ్ (సు.తా.) కోరితే అంతకంటే ఎక్కువ పుణ్య ఫలితం ఇస్తాడు. కాని ప్రతి చెడ్డ పనికి దానంత శిక్ష మాత్రమే విధించబడుతుంది. పునరుత్థానదినమున ఎవరికీ అన్యాయం జరుగదు. చూడండి, 6:160.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّ الَّذِیْ فَرَضَ عَلَیْكَ الْقُرْاٰنَ لَرَآدُّكَ اِلٰی مَعَادٍ ؕ— قُلْ رَّبِّیْۤ اَعْلَمُ مَنْ جَآءَ بِالْهُدٰی وَمَنْ هُوَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ను నీకు విధిగా చేసినవాడు (అల్లాహ్) తప్పక నిన్ను నీ నిర్ణీత స్థానానికి తిరిగి తెస్తాడు.[1] వారితో ఇలా అను: "ఎవడు మార్గదర్శకత్వంలో ఉన్నాడో మరియు ఎవడు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాడో, నా ప్రభువుకు బాగా తెలుసు."
[1] అంటే తప్పక తిరిగి మక్కాకు తెస్తాడు. కావున హిజ్రత్ కు 8 సంవత్సరాల తరువాత దైవప్రవక్త ('స'అస) తిరిగి మక్కాకు విజేయులై వచ్చారు. (ఇబ్నె-'అబ్బాస్ ర'ది.'అ. కథనం, 'స'హీ'హ్ బు'ఖారీ).
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَا كُنْتَ تَرْجُوْۤا اَنْ یُّلْقٰۤی اِلَیْكَ الْكِتٰبُ اِلَّا رَحْمَةً مِّنْ رَّبِّكَ فَلَا تَكُوْنَنَّ ظَهِیْرًا لِّلْكٰفِرِیْنَ ۟ؗ
మరియు నీకు ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఇవ్వబడుతుందని నీవెన్నడూ ఆశించలేదు, ఇది కేవలం నీ ప్రభువు కారుణ్యం వల్లనే లభించింది. కావున నీవు ఎన్నటికీ సత్యతిరస్కారులకు తోడ్పడే వాడవు కావద్దు!
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَا یَصُدُّنَّكَ عَنْ اٰیٰتِ اللّٰهِ بَعْدَ اِذْ اُنْزِلَتْ اِلَیْكَ وَادْعُ اِلٰی رَبِّكَ وَلَا تَكُوْنَنَّ مِنَ الْمُشْرِكِیْنَ ۟ۚ
మరియు అల్లాహ్ ఆయతులు, నీపై అవతరింపజేయబడిన తరువాత; వారు (సత్యతిరస్కారులు) వాటి (పఠనం / ప్రచారం) నుండి నిన్ను ఏ మాత్రం తొలగింపనివ్వరాదు. మరియు (ప్రజలను) నీ ప్రభువు వైపునకు ఆహ్వానించు. మరియు నీవు బహుదైవారాధకులలో చేరిపోకు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَا تَدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ۘ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۫— كُلُّ شَیْءٍ هَالِكٌ اِلَّا وَجْهَهٗ ؕ— لَهُ الْحُكْمُ وَاِلَیْهِ تُرْجَعُوْنَ ۟۠
మరియు అల్లాహ్ తో పాటు ఏ ఇతర దైవాన్నీ ఆరాధించకు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. కేవలం ఆయన ఉనికి (ముఖం) తప్ప ప్రతిదీ నశిస్తుంది.[1] సర్వన్యాయాధిపత్యం కేవలం ఆయనదే మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.
[1] చూడండి, 55:26-27.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: សូរ៉ោះអាល់កសស
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​ - សន្ទស្សន៍នៃការបកប្រែ

ការបកប្រែអត្ថន័យគម្ពីរគួរអានជាភាសាតេលូហ្គូ ដោយលោកអាប់ឌុររ៉ហុីម ពិន ម៉ូហាំម៉ាត់

បិទ