పాపాలను క్షమించేవాడు [1] మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, [2] ఎంతో ఉదార స్వభావుడు. [3] ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. (అందరి) మరలింపు ఆయన వైపుకే ఉంది!
[1] అల్-'గాఫిర్ : Oft-Forgiving, Most Forgiving. క్షమాగుణ పరిపూర్ణుడు, పాపాలను క్షమించేవాడు, ఎక్కువగా క్షమించేవాడు. ఇంకా చూడండి, అల్-'గఫ్ఫారు: క్షమించేవాడు, 20:82; అల్-'గఫూరు : 2:173. [2] చూడండి, 8:52, 15:50. [3] జి'-'త్తౌలు: అంటే Bestorwer of Favours, ఎంతో ఉదారస్వభావుడు, దాతృత్వుడు, ధనసంపత్తులు ప్రసాదించేవాడు, లేక తన దాసులను అనుగ్రహించేవాడు.
వారికి పూర్వం గడిచిన నూహ్ జాతి వారూ మరియు వారి పిదప వచ్చిన ఇతర వర్గాల వారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు. మరియు ప్రతి సమాజం వారు తమ సందేశహరుణ్ణి నిర్భంధించటానికి ప్రయత్నాలు చేశారు. మరియు అసత్యంతో సత్యాన్ని ఖండించటానికి వాదులాడారు; కావున చివరకు నేను వారిని పట్టుకున్నాను. చూశారా! నా శిక్ష ఎలా ఉండిందో!
సింహాసనాన్ని (అర్ష్ ను) మోసేవారు మరియు దాని చుట్టూ ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. [1] మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరియు విశ్వసించిన వారి కొరకు క్షమాభిక్ష కోరుతూ: "ఓ మా ప్రభూ! నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతి దానిని ఆవరించి ఉన్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి, నీ మార్గాన్ని అనుసరించే వారిని క్షమించు; మరియు వారిని భగభగమండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు!"
"ఓ మా ప్రభూ! ఇంకా వారిని, నీవు వాగ్దానం చేసిన, కలకాలముండే స్వర్గవనాలలో ప్రవేశింపజేయి మరియు వారి తండ్రులలో వారి సహవాసులలో (అజ్వాజ్ లలో) మరియు వారి సంతానంలో, సద్వర్తనులైన వారిని కూడా! నిశ్చయంగా నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు." [1]
"మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)." [1]
[1] పై మూడు ఆయత్ లలో విశ్వాసుల కొరకు రెండు శుభవార్తలు ఉన్నాయి. 1) దైవదూతలు ('అలైహిమ్. స.) వారికై ప్రార్థనలు చేస్తూ ఉంటారు. 2) విశ్వాసుల కుటుంబీకులందరూ స్వర్గంలో ఒకే చోట ఉంటారు.
నిశ్చయంగా, (ఆ రోజు) సత్యతిరస్కారులను పిలిచి వారితో: "ఈరోజు మీకు, మీ పట్ల ఎంత అసహ్యం కలుగుతున్నదో! మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలువగా మీరు నిరాకరించినపుడు, అల్లాహ్ కు మీ పట్ల ఇంత కంటే ఎక్కువ అసహ్యం కలిగేది!" అని అనబడుతుంది.
వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్ని ఇచ్చావు మరియు రెండు సార్లు జీవితాన్ని ఇచ్చావు. [1] ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. కావున ఇప్పుడైనా ఇక్కడి నుండి (నరకం నుండి) బయట పడే మార్గం ఏదైనా ఉందా?"
[1] చూడండి, 2:28 రెండు మరణాలు అంటే మొదటిది మానవుడు ఉనికిలోకి రాకముందు ఉన్న స్థితి. రెండవది భూలోక జీవితంలో మరణించటం. రెండు జీవితాలంటే మొదటిది భూలోక జీవితం, రెండవది పరలోక జీవితం. వ్యాఖ్యాతలందరూ ఈ విశదీకరణతో ఏకీభవిస్తున్నారు.
(వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది): "దీనికి కారణమేమిటంటే వాస్తవానికి అద్వితీయుడైన అల్లాహ్ ను ప్రార్థించమన్నప్పుడు మీరు తిరస్కరించారు మరియు ఆయనకు భాగస్వాములు కల్పించబడినప్పుడు, మీరు విశ్వసించారు! ఇప్పుడు తీర్పు మహోన్నతుడు, మహనీయుడు [1] అయిన అల్లాహ్ చేతిలో ఉంది." [2]
[1] చూడండి, 4:34. [2] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: తీర్పుదినమున స్వర్గానికి అర్హులైన వారు స్వర్గానికి పంపబడతారు. నరకానికి అర్హులైన వారు నరకానికి. ఆ తరువాత అల్లాహ్ (సు.తా.) అంటాడు : 'ఎవని హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉందో అతనిని నరకం నుండి తీయండి.' అప్పుడు వారు తీయబడతారు. వారు కాలి నల్లబడిపోయి ఉంటారు. వారు జీవనదిలోకి త్రోయబడతారు. వారు నది ఒడ్డున మొగ్గలు అంకురించినట్లు, అంకురించి బయటికి వస్తారు. (అబూ సయీద్ అల్-ఖుద్రీ కథనం; బు'ఖారీ, ముస్లిం, నసాయి', మరియు ఇబ్నె 'హంబల్) ఈ విధంగా కొంతైనా విశ్వాసమున్నవారు క్షమింపబడతారు.
ఆయనే మీకు తన అద్భుత సూచనలను చూపించేవాడు మరియు ఆకాశం నుండి మీ కొరకు జీవనోపాధిని అవతరింపజేసేవాడు. కాని, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలేవారు తప్ప, ఇతరులు వీటిని గ్రహించలేరు.
కావున (ఓ విశ్వాసులారా!) మీరు మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయనకే ప్రత్యేకించుకొని, అల్లాహ్ ను మాత్రమే ప్రార్థించండి. సత్యతిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైనా!
ఆయన మహోన్నతమైన స్థానాలు గలవాడు, [1] (సర్వాధికార) సింహాసనానికి (అర్ష్ కు) అధిపతి, [2] తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై, తన ఆజ్ఞ ప్రకారం, తన దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) అవతరింపజేస్తాడు[3], ఆయనతో సమావేశమయ్యే దినమును గురించి హెచ్చరించటానికి.
[1] రఫీ'ఉ: Exalted, ఉన్నత స్థానాలు గలవాడు, అర్-రాఫి'ఉ: (సేకరించబడిన పదం) The Exalter, of the believer by prospering him. Exalter of the obedient. విశ్వాసులను ఉన్నత స్థాయిలోకి ఎత్తువాడు, పైకెత్తేవాడు లేక విధేయులను ప్రశంసించువాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. [2] చూడండి, 7:54 [3] అర్-రూ'హు: దివ్యజ్ఞానం, చూడండి, 16:2, 42:52 అక్కడ కూడా రూ'హ్ దివ్యజ్ఞానంగా పేర్కొనబడింది. 19:17 78:38 మరియు 97:4లలో రూ'హ్, జిబ్రయీల్ (అ.స.)ను సూచిస్తోంది.
ఆ రోజు వారందరూ బయటికి వస్తారు. వారి ఏ విషయం కూడా అల్లాహ్ నుండి రహస్యంగా ఉండదు. ఆ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిది? అద్వితీయుడూ, ప్రబలుడూ [1] అయిన అల్లాహ్ దే!
[1] అల్-ఖహ్హారు: తన సృష్టిపై సంపూర్ణ అధికారం, ఆధిపత్యం గలవాడు, లోబరచుకొనేవాడు, ప్రజలుడు. అల్-ఖాహిరుకు.చూడండి 6:18, 61. అల్ వా'హిద్ కు చూడండి 2:133.
మరియు (ఓ ముహమ్మద్!) సమీపంలో రానున్న దినాన్ని గురించి వారిని హెచ్చరించు. అప్పుడు గుండెలు గొంతుల వరకు వచ్చి అడ్డుకొని, ఊపిరి ఆడకుండా చేస్తాయి. (ఆ రోజు) దుర్మార్గులకు, ఆప్తమిత్రుడు గానీ, మాట చెల్లునట్టి సిఫారసు చేసేవాడు గానీ,[1] ఎవ్వడూ ఉండడు.
మరియు అల్లాహ్, న్యాయంగా తీర్పు చేస్తాడు. మరియు వారు ఆయనను (అల్లాహ్ ను) వదలి ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నారో, వారు ఎలాంటి తీర్పు చేయలేరు. నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
ఏమీ? వారు భూమిలో సంచారం చేసి తమకు ముందు గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో చూడలేదా? వారు, వీరి కంటే ఎక్కువ బలం గలవారు. మరియు వీరి కంటే ఎక్కువ గుర్తులను భూమిలో వదిలి పోయారు; కాని అల్లాహ్ వారి పాపాలకుగానూ వారిని పట్టుకున్నాడు మరియు అప్పుడు వారిని అల్లాహ్ పట్టు నుండి కాపాడేవాడు ఎవ్వడూ లేక పోయాడు.
ఇలా ఎందుకు జరిగిందంటే! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు! కాని వారు, వారిని తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారిని శిక్షకు గురి చేశాడు. నిశ్చయంగా, ఆయన మహా బలశాలి, శిక్ష విధించటంలో కఠినుడు.
ఫిర్ఔన్, హామాన్ మరియు ఖారూన్ ల [1] వద్దకు! కాని వారు: "ఇతను మాంత్రికుడు, అసత్యవాది!" అని అన్నారు.
[1] ఖారూన్, మొదట మూసా ('అ.స.) ను అనుసరించాడు. తరువాత అవిశ్వాసుడయ్యాడు. వివరాలకు చూడండి, 28:76. హామాన్, కొరకు చూడండి 28:6, అతడు ఫిర్'ఔన్ సభలో మంత్రిగా ఉండేవాడు.
తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకొని రాగా వారన్నారు: "ఇతనిని విశ్వసించే వారందరి పుత్రులను చంపండి మరియు వారి స్త్రీలను బ్రతకనివ్వండి." [1] కాని సత్యతిరస్కారుల పన్నాగాలు వ్యర్థమే అవుతాయి.
[1] ఫిర్ఔ'న్, మూసా ('అ.స.) జన్మానికి ముందు కూడా తాను బానిసలుగా చేసి ఉంచిన బనీ-ఇస్రాయీ'ల్ సంతతి వారి మగ సంతానాన్ని పుట్టిన పెంటనే చంపిస్తూ ఉండేవాడు. ఎందుకంటే వారి సంతతిలోని బాలుడు అతని నాశనానికి కారకుడవుతాడని, అతనికి జ్యోతిష్యులు చెప్పి ఉంటారు. ఈసారి మూసా ('అ.స.) మరియు అతని సంతతి వారి మధ్య అవిశ్వాసం, కలహాలు రేకెత్తించే ఉద్దేశ్యంతో వారి పుత్రులను చంపమని ఆజ్ఞాపిస్తాడు. వారు పలికిన మాటలకు చూడండి, 7:129.
మరియు ఫిర్ఔన్ ఇలా అన్నాడు: "మూసాను చంపే పని నాకు వదలి పెట్టండి; అతనిని తన ప్రభువును పిలుచుకోనివ్వండి. వాస్తవానికి, నా భయమేమిటంటే, అతను మీ ధర్మాన్ని మార్చవచ్చు, లేదా దేశంలో కల్లోల్లాన్ని రేకెత్తించవచ్చు!"
మరియు మూసా అన్నాడు: "నిశ్చయంగా, నేను లెక్క తీసుకోబడే రోజును విశ్వసించని ప్రతి దురహంకారి నుండి కాపాడటానికి, నాకూ మరియు మీకూ కూడా ప్రభువైన ఆయన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను!" [1]
[1] ఫిర్ఔ'న్, మూసా ('అ.స.) చెపగోరినప్పుడు అతను ఈ విధంగా ప్రార్థించాడు. దైవప్రవక్త ('స'అస) కూడా తమకు శత్రువుల భయం ఉంటే ఈ దు'ఆ చేసేవారు. ముస్నద్ అ'హ్మద్, 4/415 'ఓ అల్లాహ్ (సు.తా.) మేము నిన్ను వారికి విరుద్ధంగా ఉంచుతున్నాము. మరియు వారి ఆగడాల నుండి నీ రక్షణ కోరుతున్నాము.'
అప్పుడు తన విశ్వాసాన్ని గుప్తంగా ఉంచిన ఫిర్ఔన్ కుటుంబపు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: [1] "ఏమీ? మీరు, 'అల్లాహ్ యే నా ప్రభువు.' అని అన్నందుకు, ఒక వ్యక్తిని చంపగోరుతున్నారా? వాస్తవానికి, అతను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాడు కదా! మరియు ఒకవేళ అతను అసత్యవాది అయితే, అతని అసత్యం అతని మీదనే పడుతుంది! కాని ఒకవేళ అతను సత్యవంతుడే అయితే, అతను హెచ్చరించే (శిక్ష) మీపై పడవచ్చు కదా! నిశ్చయంగా, అల్లాహ్ మితిమీరే అసత్యవాదికి సన్మార్గం చూపడు!"
ఓ నా జాతి ప్రజలారా! ఈనాడు రాజ్యాధికారం మీదే; దేశంలో మీరు ప్రాబల్యం వహించి ఉన్నారు, కాని ఒకవేళ అల్లాహ్ శిక్ష మన మీద వచ్చి పడితే, అప్పుడు మనకెవడు సహాయం చేయగలడు?" అప్పుడు ఫిర్ఔన్ అన్నాడు: "నాకు సముచితమైన మార్గమే నేను మీకూ చూపుతాను, నేను మీకు మార్గదర్శకత్వం చేసేది కేవలం సరైన మార్గం వైపునకే!" [1]
[1] ఫిర్'ఔన్ చూపే మార్గం సత్యమైనది కాదు, చూడండి, 11:97.
ఆరోజు మీరు వెనుదిరిగి పారిపోవాలనుకుంటారు, కాని అల్లాహ్ (శిక్ష) నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవ్వడూ ఉండడు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి, మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు.
మరియు వాస్తవానికి ఇంతకు పూర్వం యూసుఫ్ మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలు తీసుకొని వచ్చాడు. కాని మీరు అతడు తెచ్చిన వాటిని గురించి సందేహంలో పడ్డారు. చివరకు అతడు మరణించినప్పుడు, మీరన్నారు: "ఇక అల్లాహ్ ఇతని తరువాత ఏ ప్రవక్తనూ పంపడు!" [1] ఈ విధంగా అల్లాహ్ మితిమీరి ప్రవర్తించే వారిని, సందేహంలో పడేవారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు.
[1] బహుశా ఈజిప్ట్ లో యూసుఫ్ ('అ.స.) తమ తెగవారైన హిక్సోస్ (Hyksos) వారిలోనే ప్రవక్తగా పరిగణించబడ్డారు. వారు 'అరబ్బులు. హిబ్రూ భాషతో కలిసే భాష మాట్లాడేవారు. ఇతర ప్రజలు అతనిని ప్రవక్తగా ఎంచలేదు.
ఎవరైతే అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి తమ దగ్గర ఏ ఆధారంలేనిదే వాదిస్తారో, వారు అల్లాహ్ దగ్గర మరియు విశ్వసించిన వారి దగ్గర ఎంతో గర్హనీయులు. ఈ విధంగా అల్లాహ్ దురహంకారీ, నిర్దయుడూ (క్రూరుడు) అయిన ప్రతి వ్యక్తి హృదయం మీద ముద్ర వేస్తాడు.
ఆకాశాలలోనికి వెళ్ళే మార్గాలు! మరియు వాటి ద్వారా నేను మూసా దేవుణ్ణి చూడటానికి. ఎందుకంటే, నిశ్చయంగా, నేను అతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను!" మరియు ఈ విధంగా ఫిరఔన్ కు తన దుష్కార్యాలు మంచివిగా కనబడ్డాయి. మరియు అతడు సన్మార్గం నుండి నిరోధించబడ్డాడు. మరియు ఫిరఔన్ యొక్క ప్రతి పన్నాగం అతనిని నాశనానికి మాత్రమే గురి చేసింది.
దుష్కార్యాలు చేసిన వానికి, వాటికి సరిపోయే ప్రతీకారం మాత్రమే లభిస్తుంది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవాడు, పురుషుడైనా లేదా స్త్రీ అయినా! అతడు (ఆమె) విశ్వాసి అయితే; అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. [1] అందు వారికి అపరిమితమైన జీవనోపాధి ఇవ్వబడుతుంది. [2]
[1] పాపులకు వారి దుష్టకార్యాలకు సరిసమానమైన శిక్షయే ఇవ్వబడుతుంది. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మాత్రమే స్వర్గానికి హక్కుదారులు. విశ్వసించక ఎన్ని సత్కార్యాలు చేసినా అవి వ్యర్థమే అవుతాయి. అదే విధంగా సత్కార్యాలు చేయని విశ్వాసి కూడా కేవలం విశ్వాసం ఆధారంగా స్వర్గానికి హక్కుదారుడు కాజాలడు, సత్కార్యాలు చేసి, అల్లాహ్ (సు.తా.) కరుణిస్తే తప్ప. [2] రిజ్ ఖున్: జీవనోపాధి, అంటే కేవలం అన్న పానీయాలే కాక, అన్నీ మంచి వస్తువులు, సుఖసంతోషాలు, తెలివితేటలు మొదలైనవి. ఏవైతే సుఖమయ జీవితానికి అవసరమో!
మీరు నన్ను - అల్లాహ్ ను తిరస్కరించి - ఎవరిని గురించైతే నాకు ఎలాంటి జ్ఞానం లేదో! వారిని, ఆయనకు భాగస్వాములుగా కల్పించమని పిలుస్తున్నారు. మరియు నేనేమో మిమ్మల్ని సర్వశక్తిమంతుని, క్షమాశీలుని వైపునకు పిలుస్తున్నాను.
నిస్సందేహంగా! వాస్తవానికి మీరు దేని వైపునకైతే (ప్రార్థించటానికి) నన్ను పిలుస్తున్నారో! దానికి ఇహలోకంలోను మరియు పరలోకంలోను ప్రార్థనా అర్హత లేదు. [1] మరియు నిశ్చయంగా, మనందరి మరలింపు అల్లాహ్ వైపునకే మరియు నిశ్చయంగా, మితి మీరి ప్రవర్తించే వారే నరకాగ్ని వాసులవుతారు.
[1] ఇలాంటి అర్థమిచ్చే వాక్యాల కోసం చూడండి, 46:5, 35:14.
కావున నేను మీతో చెప్పే విషయం మున్ముందు మీరే తెలుసుకోగలరు. ఇక నా వ్యవహారాన్ని నేను అల్లాహ్ కు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు."
ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. [1] మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: "ఫిర్ఔన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" [2] అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.
[1] గోరీలలో ఉన్నవారు ఉదయం మరియు సాయంత్రం దాని ముందు ప్రవేశ పెట్టబడతారు. ఇదే గోరీల శిక్ష, 'అజాబె ఖబ్ర్!' దీనిని గురించి ఎన్నో 'హదీస్' లు ఉన్నాయి. 'ఆయి'షహ్ (ర.'అన్హా) దైవప్రవక్త ('స'అస) తో ప్రశ్నిస్తే అతను ఇలా అన్నారు:'అవును గోరీల శిక్ష తథ్యం.' ('స'హీ'హ్ బు'ఖారీ) మరొక 'హదీస్' : మీలో ఎవరైనా మరణిస్తే అతనికి ఉదయం మరియు సాయంత్రం అతన చోటు (స్వర్గంలో లేక నరకంలో అతని స్థానం) చూపబడుతుంది. మరియు అతనితో అనబడుతుంది: 'ఇదే నీ గమ్యస్థానం. పునరుత్థఆన దినమున అల్లాహ్ (సు.తా.) నిన్ను ఇక్కడికే పంపుతాడు.' ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం). చనిపోయిన తరువాత పునరుత్థానదినం వరకు ఉండే కాలాన్ని బర్'జఖ్ అంటారు. [2] ఆల-ఫిర్'ఔన్: అంటే, ఫిర్'ఔన్, అతని జాతివారు మరియు అతని అనుచరులందరూ.
ఇక వారు నరకాగ్నిలో పరస్పరం వాదులాడుతున్నప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా పరిగణింపబడిన వారు, పెద్ద మనుషులుగా (నాయకులుగా) పరిగణింపబడే వారితో ఇలా అంటారు: "వాస్తవానికి, మేము మిమ్మల్ని అనుసరిస్తూ ఉండే వారము, కావున మీరిప్పుడు మా నుండి నరకాగ్నిని కొంతనైనా తొలగించగలరా?"
దుహంకారంలో మునిగి ఉన్నవారు (ఆ పెద్ద మనుషులు) ఇలా అంటారు: "వాస్తవానికి, మనమందరం అందులో (నరకాగ్నిలో) ఉన్నాం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసుల మధ్య వాస్తవమైన తీర్పు చేశాడు!"
వారు (రక్షకులు) అంటారు: "ఏమీ? మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మీ దైవప్రవక్తలు రాలేదా?" అప్పుడు వారంటారు: "అవును (వచ్చారు)!" వారికి ఇలా జవాబివ్వబడుతుంది: "అయితే మీరే ప్రార్థించండి!" కాని సత్యతిరస్కారుల ప్రార్థన నిష్ఫలమే అవుతుంది.
నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించిన వారికి ఇహలోక జీవితంలో మరియు సాక్షులు నిలబడే రోజున కూడా సహాయము నొసంగుతాము. [1]
[1] చూపునరుత్థానదినమున దైవదూతలు మరియు దైవప్రవక్త ('అలైహిమ్. స.) లు సాక్ష్యమిస్తారు. కావున పునరుత్థానదినం, సాక్ష్యాల దినం అని కూడా అనబడుతోంది. ఇంకా చూడండి, 39:69.
కావున నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం; నీ పాపాలకు క్షమాపణ వేడుకో మరియు సాయంత్రం మరియు ఉదయం నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయనను స్తుతించు.
నిశ్చయంగా, ఎవరైతే, తమ దగ్గర, ఎలాంటి ప్రమాణం లేనిదే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) గురించి వాదులాడుతారో, వారి హృదయాలలో వాస్తవానికి గొప్పతనపు గర్వం నిండి ఉంది. కాని వారు దానిని (గొప్పతనాన్ని) పొందజాలరు. కావున నీవు అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
మరియు గ్రుడ్డివాడు మరియు చూడగలవాడు సరిసమానులు కాజాలరు మరియు అదే విధంగా! విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు దుర్వర్తనులు కూడా (సమానులు కాజాలరు). మీరు అర్థం చేసుకునేది చాలా తక్కువ!
మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. [1] నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు."
[1] 'హదీస్' : "అద్దు'ఆఉ హువల్ 'ఇబాదహ్, వ అద్దు'ఆఉ ముఖ్ఖుల్ 'ఇబాదహ్." దు'ఆ అంటే ఇక్కడ చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయంలో 'ఇబాదహ్ అంటే నమా'జ్. (ముస్నద్ అ'హ్మద్ 4/271) ఇంకా చూడండి, 2:186.
అల్లాహ్! ఆయనే, మీ కొరకు విశ్రాంతి తీసుకోవటానికి రాత్రిని మరియు (చూడటానికి) ప్రకాశవంతమైన పగటిని నియమించినవాడు. [1] నిశ్చయంగా, అల్లాహ్ ప్రజల పట్ల ఎంతో అనుగ్రహుడు, కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు తెలుపరు.
ఆయనే అల్లాహ్, మీ ప్రభువు! ప్రతి దానిని సృష్టించినవాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)? [1]
అల్లాహ్ యే! మీ కొరకు భూమిని నివాస స్థలంగా మరియు ఆకాశాన్ని కప్పుగా నియమించిన వాడు మరియు ఆయనే మీకు మంచి రూపాన్నిచ్చి దానిని ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు మరియు మీకు మంచి వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాడు. ఆయనే అల్లాహ్! మీ పోషకుడు. కావున అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వలోకాలకు ప్రభువు.
ఆయన సజీవుడు. [1] ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున మీరు ఆయననే ప్రార్థించండి! మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోండి. సర్వస్తోత్రాలకు అర్హుడు, సర్వలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే.
ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువు తరఫు నుండి, నాకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాతనే, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవాటి ఆరాధన నుండి నేను వారించబడ్డాను మరియు నేను సర్వలోకాల ప్రభువుకు మాత్రమే విధేయుడను (ముస్లింను) అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను."
ఆయనే, మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. [1] తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత పిండంతో (రక్తముద్దతో), ఆ తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు. ఆ తరువాత మిమ్మల్ని యుక్తవయస్సులో బలం గలవారిగా చేస్తాడు; చివరకు మిమ్మల్ని ముసలివారిగా మార్చుతాడు. మీలో కొందరు దీనికి ముందే చనిపోతారు. మరియు మీరంతా మీ నియమిత కాలం వరకే నివసిస్తారు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని (ఇదంతా మీకు వివరించబడుతోంది).
[1] చూడండి, 3:59, 11:61, 22:5, 30:20. ఈ ఆయత్ లో, 'తురాబ్' తో సృష్టించాడని ఉంది.
ఎవరైతే ఈ గ్రంథాన్ని అసత్యమని తిరస్కరించారో మరియు మేము మా సందేశహరులకు ఇచ్చి పంపిన దానిని (తిరస్కరించారో), వారు తప్పక త్వరలోనే (తమ పర్యవసానం) తెలుసుకుంటారు;
(ఎవరినైతే) మీరు అల్లాహ్ ను వదలి (ప్రార్థిస్తూ ఉన్నారో)!" వారంటారు: "వారు మమ్మల్ని త్యజించారు! అలా కాదు దీనికి పూర్వం మేము ఎవరినీ ప్రార్థించేవారమే కాదు." [1] ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారులను మార్గభ్రష్టత్వంలో వదలుతాడు.
కావున (ఓ ప్రవక్తా!) నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం. మేము వారికి చేసిన వాగ్దానాల (శిక్ష) నుండి కొంత నీకు చూపినా! లేదా (దానికి ముందు) నిన్ను మరణింపజేసినా వారందరూ మా వైపునకే కదా మరలింపబడతారు! [1]
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము; వారిలో కొందరి వృత్తాంతం మేము నీకు తెలిపాము; మరికొందరిని గురించి నీకు తెలుపలేదు. మరియు అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ప్రవక్త కూడా ఏ అద్భుత క్రియలను (ఆయాత్ లను) స్వయంగా చేయలేడు. [1] కాని అల్లాహ్ ఆజ్ఞ వచ్చినపుడు, న్యాయంగా తీర్పు చేయబడుతుంది. మరియు అప్పుడు అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు.
[1] చూడండి, 6:109. అద్భుత క్రియలు (ము'ఆజి'జాత్) కేవలం అల్లాహ్ (సు.తా.) అధీనంలోనే ఉన్నాయి. ఆయన తాను కోరినప్పుడే వాటిని చూపిస్తాడు. పూర్వకాలపు చాలా మంది ప్రవక్తల జాతి ప్రజలు, అద్భుతక్రియలు చూసి కూడా విశ్వసించలేదు.
మరియు వాటి వల్ల మీకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా మీ హృదయాలు కోరిన చోట్లకు పోవటానికి ఉపయోగపడతాయి మరియు వాటి మీద మరియు పడవల మీద మీరు తీసుకు పోబడతారు.
ఏమీ? వీరు భూమిలో సంచరించలేదా? అప్పుడు వీరికి పూర్వం గతించిన వారి గతి ఏమయిందో కనిపించలేదా? వారు వీరి కంటే సంఖ్యాపరంగా అధికులు మరియు వీరి కంటే ఎక్కువ బలవంతులు మరియు భూమిలో (ఎక్కువ) చిహ్నాలు వదలి పోయారు, కాని వారి సంపాదన వారికి ఏ విధంగానూ పనికి రాలేదు.
ఎందుకంటే! వారి సందేశహరులు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పుడు, వారు తమ దగ్గరున్న జ్ఞానానికి గర్వపడ్డారు; కాబట్టి వారు దేనిని గురించి పరిహాసాలాడుతూ ఉన్నారో అదే వారిని చుట్టుకున్నది.
ఆ తరువాత మా శిక్షను చూసినప్పుడు వారు ఇలా అన్నారు: "మేము అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము మరియు మేము (అల్లాహ్ కు) సాటి కల్పిస్తూ వచ్చిన భాగస్వాములను తిరస్కరిస్తున్నాము."
కాని మా శిక్షను చూసిన తర్వాత, వారి విశ్వాసం వారికి ఏ మాత్రం లాభదాయకం కాజాలదు. ఇదే అల్లాహ్ తన దాసుల కొరకు వాస్తవంగా, నియమించిన విధానం (సాంప్రదాయం). మరియు అక్కడ సత్యతిరస్కారులు నష్టానికి గురి అవుతారు.
Contents of the translations can be downloaded and re-published, with the following terms and conditions:
1. No modification, addition, or deletion of the content.
2. Clearly referring to the publisher and the source (QuranEnc.com).
3. Mentioning the version number when re-publishing the translation.
4. Keeping the transcript information inside the document.
5. Notifying the source (QuranEnc.com) of any note on the translation.
6. Updating the translation according to the latest version issued from the source (QuranEnc.com).
7. Inappropriate advertisements must not be included when displaying translations of the meanings of the Noble Quran.
លទ្ធផលស្វែងរក:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".