Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಇಬ್ರಾಹೀಮ್   ಶ್ಲೋಕ:
تُؤْتِیْۤ اُكُلَهَا كُلَّ حِیْنٍ بِاِذْنِ رَبِّهَا ؕ— وَیَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟
ఈ మేలు జాతి వృక్షము తన ప్రభువు ఆదేశంతో అన్ని వేళల్లో తన మంచి ఫలాలను ఇస్తుంది. మరియు పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ ప్రజలకు వారు హితబోధన గ్రహిస్తారని ఆశిస్తూ ఉదాహరణలు ఇస్తుంటాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَمَثَلُ كَلِمَةٍ خَبِیْثَةٍ كَشَجَرَةٍ خَبِیْثَةِ ١جْتُثَّتْ مِنْ فَوْقِ الْاَرْضِ مَا لَهَا مِنْ قَرَارٍ ۟
చెడ్డదైన షిర్క్ పదము పోలిక చెడ్డ వృక్షముతో కలిగి ఉన్నది. అది ఉమ్మెత్త వృక్షము. అది తన వ్రేళ్ళ సమేతంగా పెకలించబడింది. దానికి నేల పై స్థిరత్వము లేదు.మరియు ఆకాశము వైపు ఎదుగుదల ఉండదు. అయితే అది చనిపోతుంది. మరియు దాన్ని గాలి ఎత్తుకు పోతుంది. అవిశ్వాస పదము దాని గతి వినాశనము. మరియు దానికి పాల్పడేవాడి కొరకు సత్కర్మ అల్లాహ్ వైపునకు ఎక్కదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
یُثَبِّتُ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا بِالْقَوْلِ الثَّابِتِ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَفِی الْاٰخِرَةِ ۚ— وَیُضِلُّ اللّٰهُ الظّٰلِمِیْنَ ۙ۫— وَیَفْعَلُ اللّٰهُ مَا یَشَآءُ ۟۠
అల్లాహ్ విశ్వాసపరులను ఇహలోకజీవితంలో వారు విశ్వాస స్థితిలో మరణించేవరకు స్థిరమైన తౌహీద్ కలిమా ద్వారా సంపూర్ణ విశ్వాసంలో స్థిరత్వమును ప్రసాధిస్తాడు మరియు వారి సమాధుల్లో బర్జఖ్ లో ప్రశ్నాజవాబుల సమయంలో మరియు వారికి ప్రళయ దినాన స్థిరత్వమును ప్రసాధిస్తాడు. మరియు అల్లాహ్ తోపాటు సాటి కల్పించి,ఆయనను అవిశ్వసించిన వారిని అల్లాహ్ సరైన మార్గము నుండి,సన్మార్గము నుండి తప్పిస్తాడు. మరియు అల్లాహ్ తాను ఎవరిని తన న్యాయ బధ్ధంగా అపమార్గమునకు లోను చేయదలచుకుంటాడో,మరియు ఎవరిని తన అనుగ్రహము ద్వారా సన్మార్గము చూపదలచుకుంటాడో చేసి తీరుతాడు. పరిశుద్ధుడైన ఆయనను ఎవరు బలవంతం చేయలేరు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ بَدَّلُوْا نِعْمَتَ اللّٰهِ كُفْرًا وَّاَحَلُّوْا قَوْمَهُمْ دَارَ الْبَوَارِ ۟ۙ
ఖురైష్ హరమ్ ప్రాంతములో భద్రత ద్వారా,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను వారిలో ప్రవక్తగా పంపించటం ద్వారా తమకు అల్లాహ్ కలిగించిన అనుగ్రహమును నిరాకరించినప్పుడు వారు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను అవిశ్వసించిన వారి స్థితిని మీరు చూశారు. వారు వీటిని నిరాకరించారు : ఆయన తన ప్రభువు వద్ద నుండి వారి వద్దకు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించినప్పుడు అతని అనుగ్రహములను తిరస్కరించటం.మరియు వారు తమ జాతుల వారిలోంచి తమను అనుసరించిన వారిని అవిశ్వాసంలో దించి వినాశ గృహంలోకి నెట్టి వేశారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
جَهَنَّمَ ۚ— یَصْلَوْنَهَا ؕ— وَبِئْسَ الْقَرَارُ ۟
మరియు వినాశన గృహము అది నరకము.అందులో వారు ప్రవేశించి దాని వేడిని అనుభవిస్తారు. వారి నివాసము ఎంతో చెడ్డదైన నివాసము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَجَعَلُوْا لِلّٰهِ اَنْدَادًا لِّیُضِلُّوْا عَنْ سَبِیْلِهٖ ؕ— قُلْ تَمَتَّعُوْا فَاِنَّ مَصِیْرَكُمْ اِلَی النَّارِ ۟
మరియు ముష్రికులు అల్లాహ్ మార్గము నుండి భ్రష్టులైన తరువాత తమను అనుసరించిన వారిని అల్లాహ్ మార్గము నుండి తప్పించటానికి అల్లాహ్ కొరకు సమానులుగా,సామ్యములుగా తయారు చేసుకున్నారు. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : మీకు ఉన్న మనోవాంచనల ద్వారా,ఇహలోకములో సందేహాలను వ్యాపించటం ద్వారా ప్రయోజనం చెందండి. ఎందుకంటే ప్రళయ దినాన మీరు మరలి వెళ్లవలసిన స్థానం నరకాగ్ని.మీకి అది తప్ప ఇంకొకటి మరలి వెళ్లే ప్రదేశం లేదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قُلْ لِّعِبَادِیَ الَّذِیْنَ اٰمَنُوْا یُقِیْمُوا الصَّلٰوةَ وَیُنْفِقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِیَةً مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَ یَوْمٌ لَّا بَیْعٌ فِیْهِ وَلَا خِلٰلٌ ۟
ఓ ప్రవక్తా మీరు విశ్వాసపరులతో ఇలా పలకండి : ఓ విశ్వాసపరులారా మీరు నమాజును పరిపూర్ణ రీతిలో పాటించండి. మరియు మీరు విధిగావించబడిన,స్వచ్ఛందమైన దాన ధర్మాలను మీ వద్దకు ఎటువంటి బేరము లేని,అల్లాహ్ శిక్షకు పరిహారం చెల్లించటానికి ఎటువంటి పరిహారము లేని,తన మితృని కొరకు సిఫారసు చేయటానికి ఎటువంటి మిత్ర సహాయము లేని దినము రాక ముందే మీకు అల్లాహ్ ప్రసాధించిన వాటిలో నుంచి ప్రదర్శనా బుద్ధితో భయపడుతూ గోప్యంగాను,మిమ్మల్ని ఇతరులు అనుసరించటానికి బహిరంగంగాను ఖర్చు చేయండి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اَللّٰهُ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ ۚ— وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِیَ فِی الْبَحْرِ بِاَمْرِهٖ ۚ— وَسَخَّرَ لَكُمُ الْاَنْهٰرَ ۟ۚ
అల్లాహ్ యే పూర్వ నమూనా లేకుండా ఆకాశములను సృష్టించాడు మరియు భూమిని సృష్టించాడు. మరియు ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించాడు. మరియు ఆ కురిసిన నీటి ద్వారా మీ కొరకు ఆహారముగా రకరకాల ఫలాలను వెలికి తీశాడు.ఓ ప్రజలారా ఆయన నీటిపై నడుస్తున్న ఓడలను తన అభీష్టం మేరకు మీకు వశపరచాడు. మరియు ఆయన నదులను మీ కొరకు మీరు వాటి నుండి త్రాగటానికి మరియు మీ పశువులకు,మీ పంటపొలాలకు త్రాపించటానికి వశపరచాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَسَخَّرَ لَكُمُ الشَّمْسَ وَالْقَمَرَ دَآىِٕبَیْنِ ۚ— وَسَخَّرَ لَكُمُ الَّیْلَ وَالنَّهَارَ ۟ۚ
మరియు ఆయన సూర్య చంద్రులను నిరంతరం పయనించే విధంగా మీకి వశపరచాడు. మరియు రాత్రింబవళ్ళను అవి ఒక దాని వెనుక ఒకటి వచ్చే విధంగా మీకు వశపరచాడు. రాత్రిని మీ నిద్ర కొరకు,మీ ఉపశమనము కొరకు మరియు పగలును మీ కార్యచరణ,మీ శ్రమ కొరకు చేశాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• تشبيه كلمة الكفر بشجرة الحَنْظل الزاحفة، فهي لا ترتفع، ولا تنتج طيبًا، ولا تدوم.
అవిశ్వాస మాటను ప్రాకే ఉమ్మెత్తు చెట్టుతో పోల్చబడినది,అది పెరగదు,మంచిని ఉత్పత్తి చేయదు మరియు అది శాస్వతంగా ఉండదు.

• الرابط بين الأمر بالصلاة والزكاة مع ذكر الآخرة هو الإشعار بأنهما مما تكون به النجاة يومئذ.
పరలోక ప్రస్తావనతో నమాజు ఆదేశం మరియు జకాత్ ఆదేశం మధ్య సంబంధం,ఆ రెండిటితోనే ఆ రోజున విముక్తి ఉన్నదని అందులో సూచన ఉన్నది.

• تعداد بعض النعم العظيمة إشارة لعظم كفر بعض بني آدم وجحدهم نعمه سبحانه وتعالى .
కొన్ని గొప్ప అనుగ్రహాల గణన ఆదమ్ యొక్క కొంతమంది సంతతి పెద్ద అవిశ్వాసమునకు మరియు మహోన్నతుడైన,పరిశుద్ధుడైన ఆయన అనుగ్రహాల పట్ల వారి తిరస్కారమునకు సంకేతము.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಇಬ್ರಾಹೀಮ್
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ