Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅನ್ನಹ್ಲ್   ಶ್ಲೋಕ:
وَلَقَدْ نَعْلَمُ اَنَّهُمْ یَقُوْلُوْنَ اِنَّمَا یُعَلِّمُهٗ بَشَرٌ ؕ— لِسَانُ الَّذِیْ یُلْحِدُوْنَ اِلَیْهِ اَعْجَمِیٌّ وَّهٰذَا لِسَانٌ عَرَبِیٌّ مُّبِیْنٌ ۟
మరియు ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఖుర్ఆన్ నేర్పిస్తున్నది ఒక మనిషి అని చెబుతున్న విషయం మాకు తెలుసు. వారు తమ వాదనలో అబధ్ధం చెబుతున్నారు. ఆయనకు నేర్పిస్తున్నాడని వారు వాదిస్తున్న వ్యక్తి భాష అరబీ కాదు (అజమీ). ఈ ఖుర్ఆన్ గొప్ప అర్ధము కల స్పష్టమైన అరబీ భాషలో అవతరింపబడినది. అలాంటప్పుడు ఆయన ఒక అరబేతరుడితో దాన్ని నేర్చుకున్నాడని మీరు ఎలా వాదిస్తున్నారు ?.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِاٰیٰتِ اللّٰهِ ۙ— لَا یَهْدِیْهِمُ اللّٰهُ وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ ఆయతులను పరిశుద్ధుడైన ఆయన వద్దనుండి వచ్చినవని విశ్వసించరో వారికి అల్లాహ్ వారు ఎప్పటి వరకు దానిపై మొండిగా ఉంటారో అప్పటి వరకు సన్మార్గము కొరకు సౌభాగ్యమును కలిగించడు. వారికి ఉన్న అల్లాహ్ పై అవిశ్వాసము,ఆయన ఆయతుల పట్ల తిరస్కారము వలన వారి కొరకు బాధాకరమైన శిక్ష కలదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِنَّمَا یَفْتَرِی الْكَذِبَ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِاٰیٰتِ اللّٰهِ ۚ— وَاُولٰٓىِٕكَ هُمُ الْكٰذِبُوْنَ ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన విషయంలో అబధ్ధపరులు కారు.అల్లాహ్ ఆయతులను విశ్వసించనివారు అబధ్ధమును కల్పిస్తున్నారు. ఎందుకంటే వారికి శిక్ష భయం లేదు. ప్రతిఫలమును ఆశించటం లేదుమరియు అవిశ్వాస గుణము కలిగిన వారందరు అసత్యపరులు. ఎందుకంటే అబధ్ధము వారి అలవాటు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
مَنْ كَفَرَ بِاللّٰهِ مِنْ بَعْدِ اِیْمَانِهٖۤ اِلَّا مَنْ اُكْرِهَ وَقَلْبُهٗ مُطْمَىِٕنٌّۢ بِالْاِیْمَانِ وَلٰكِنْ مَّنْ شَرَحَ بِالْكُفْرِ صَدْرًا فَعَلَیْهِمْ غَضَبٌ مِّنَ اللّٰهِ ۚ— وَلَهُمْ عَذَابٌ عَظِیْمٌ ۟
ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసము తరువాత అల్లాహ్ పట్ల అవిశ్వాసముతో నిండిన హృదయమును కలిగి ఉండి దాన్ని విశ్వాసమునకు విరుద్ధంగా ఎంచుకుని ఉండి ఇష్టపూర్వకంగా దాన్ని పలికితే అతను ఇస్లాం నుండి మరలిపోతాడు. ఇలాంటి వారిపై అల్లాహ్ వద్ద నుండి ఆగ్రహం వచ్చి పడుతుంది. మరియు వారికి పెద్ద శిక్ష ఉన్నది. కాని ఎవరైతే విశ్వాసము యొక్క వాస్తవికతను నమ్ముతూ అతని హృదయం విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండి బలవంతాన తన నోటితో అవిశ్వాస మాటలు పలికితే (అతడు ఇస్లాంలోనే ఉంటాడు) .
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ذٰلِكَ بِاَنَّهُمُ اسْتَحَبُّوا الْحَیٰوةَ الدُّنْیَا عَلَی الْاٰخِرَةِ ۙ— وَاَنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الْكٰفِرِیْنَ ۟
ఇస్లాం నుండి ఈ మరలిపోవటం అన్నది వారు తమ అవిశ్వాసం వలన పరలోకమునకు బదులుగా ఇహలోక శిధిలాలను పొందటం వలన జరిగినది. మరియు అల్లాహ్ అవిశ్వాసపరులైన జాతి వారికి విశ్వాసమును అనుగ్రహించడు. కాని వారిని పరాభవమునకు గురి చేస్తాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ طَبَعَ اللّٰهُ عَلٰی قُلُوْبِهِمْ وَسَمْعِهِمْ وَاَبْصَارِهِمْ ۚ— وَاُولٰٓىِٕكَ هُمُ الْغٰفِلُوْنَ ۟
విశ్వాసము తరువాత మరలిపోయే గుణం కల వీరందరి హృదయములపై అల్లాహ్ ముద్ర వేశాడు. అయితే వారు హితబోధనలను అర్ధం చేసుకోరు. వారి చెవులపై వేశాడు వాటి ద్వారా వారు ప్రయోజనం కలిగించే వాటిని విన లేరు. వారి కళ్ళపై వేశాడు అయితే వారు విశ్వాసము పై సూచించే సూచనలను చూడలేరు. మరియు వారందరు సుఖ,దుఃఖాల కారకాల నుండి మరియు అల్లాహ్ వారి కొరకు తయారు చేసి ఉంచిన శిక్ష నుండి పరధ్యానంలో ఉన్నారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
لَا جَرَمَ اَنَّهُمْ فِی الْاٰخِرَةِ هُمُ الْخٰسِرُوْنَ ۟
వాస్తవానికి నిశ్చయంగా వారు ప్రళయదినాన విశ్వాసము తరువాత తమ అవిశ్వాసం వలన స్వయంగా నష్టపోతారు. ఒక వేళ వారు తమ మొదటి విశ్వాసముపై ఉండి ఉంటే స్వర్గములో ప్రవేశించి ఉండేవారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ثُمَّ اِنَّ رَبَّكَ لِلَّذِیْنَ هَاجَرُوْا مِنْ بَعْدِ مَا فُتِنُوْا ثُمَّ جٰهَدُوْا وَصَبَرُوْۤا ۙ— اِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
ఆ తరువాత ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు ఆ బలహీన విశ్వాసపరులను క్షమించేవాడును,కరుణించేవాడును ఎవరైతే ముష్రికుల చేతుల్లో బాధించబడిన తరువాత మక్కా నుండి మదీనాకి హిజ్రత్ చేసి వెళ్లిపోయారో. వారు (ముష్రికులు) వారి ధర్మ విషయంలో పీడిస్తే వారు చివరకు వారి హృదయములు విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండి, వారు అవిశ్వాసపలుకులు పలికారు,ఆ పిదప అల్లాహ్ వాక్కు గొప్పదవటానికి,అవిశ్వాసపరుల వాక్కు నేలమట్టం అవటానికి అల్లాహ్ మార్గంలో పోరాడి,దానిలో కలిగే కష్టాల్లో సహనం చూపించారు. నిశ్చయంగా నీ ప్రభువు వాడు పీడించబడిన ఈ పీడన తరువాత,వారు బాధించబడి చివరికి అవిశ్వాస పలుకును పలికిన బాధ తరువాత వారిని మన్నించే వాడును,వారిపై కనికరించే వాడును.ఎందుకంటే వారు అవిస్వాసపలుకులను బలవంతాన మాత్రమే పలికారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• الترخيص للمُكرَه بالنطق بالكفر ظاهرًا مع اطمئنان القلب بالإيمان.
హృదయము విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండటంతోపాటు అవిశ్వాసమాటలను బహిర్గతంగా పలకటానికి బలవంతం చేయబడిన వారికి అనుమతి.

• المرتدون استوجبوا غضب الله وعذابه؛ لأنهم استحبوا الحياة الدنيا على الآخرة، وحرموا من هداية الله، وطبع الله على قلوبهم وسمعهم وأبصارهم، وجعلوا من الغافلين عما يراد بهم من العذاب الشديد يوم القيامة.
(విశ్వాసము నుండి) మరలిపోయిన వారికి అల్లాహ్ ఆగ్రహం,ఆయన శిక్ష అనివార్యం చేయబడినది. ఎందుకంటే వారు పరలోకమునకు బదులుగా ఇహలోక జీవితమును ఇష్టపడ్డారు.అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని కోల్పోయారు.వారి హృదయములపై,వారి చెవులపై,వారి చూపులపై సీలు వేయబడింది. ప్రళయదినాన వారి కొరకు నిర్ణయించబడిన కఠిన శిక్ష నుండి వారు పరధ్యానంలో ఉంచబడ్డారు.

• كَتَبَ الله المغفرة والرحمة للذين آمنوا، وهاجروا من بعد ما فتنوا، وصبروا على الجهاد.
విశ్వసించి బాధింపబడిన తరువాత హిజ్రత్ చేసి ధర్మ పోరాటంలో సహనం చూపిన వారి కొరకు అల్లాహ్ క్షమాపణను,కారుణ్యమును వ్రాసివేశాడు.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅನ್ನಹ್ಲ್
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ