Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅಲ್- ಕಹ್ಫ್   ಶ್ಲೋಕ:
فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتٰىهُ اٰتِنَا غَدَآءَنَا ؗ— لَقَدْ لَقِیْنَا مِنْ سَفَرِنَا هٰذَا نَصَبًا ۟
వారిద్దరు ఆ ప్రదేశము నుండి దాటి వెళ్ళిపోయినప్పుడు మూసా అలైహిస్సలాం తన సేవకునితో ఇలా పలికారు : నీవు మా వద్దకు మద్యాహ్న భోజనం తీసుకునిరా. నిశ్చయంగా మాకు మా ఈ ప్రయాణం మూలంగా తీవ్ర అలసట కలిగింది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ اَرَءَیْتَ اِذْ اَوَیْنَاۤ اِلَی الصَّخْرَةِ فَاِنِّیْ نَسِیْتُ الْحُوْتَ ؗ— وَمَاۤ اَنْسٰىنِیْهُ اِلَّا الشَّیْطٰنُ اَنْ اَذْكُرَهٗ ۚ— وَاتَّخَذَ سَبِیْلَهٗ فِی الْبَحْرِ ۖۗ— عَجَبًا ۟
సేవకుడు ఇలా సమాధానమిచ్చాడు : ఏమీ మేము రాతి బండవద్ద విశ్రాంతి తీకున్నప్పుడు జరిగినది మీరు చూశారా ?!. అప్పుడు నేను చేప విషయం మీకు గుర్తు చేయటం మరచిపోయాను. దాని గురించి మీకు గుర్తు చేయటం నుండి నన్ను షైతాను మాత్రమే మరపింపజేశాడు. చేప బ్రతికిపోయి ఆశ్చార్యానికి గురి చేస్తూ తన కోసం సముద్రంలో దారిని తయారు చేసుకుంది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ ذٰلِكَ مَا كُنَّا نَبْغِ ۖۗ— فَارْتَدَّا عَلٰۤی اٰثَارِهِمَا قَصَصًا ۟ۙ
మూసా అలైహిస్లాం తన సేవకునితో ఇలా పలికారు : మేము కోరుకున్నది అదే. అది పుణ్యదాసుని ప్రదేశమునకు గుర్తు. అప్పుడు వారిద్దరు తమ అడుగుజాడలను అనుసరిస్తూ దారిని వారిద్దరు కోల్పోకుండా ఉండటానికి వెనుకకు మరలారు. చివరికి రాతి బండ వద్దకు చేరుకున్నారు. మరియు దాని నుండి చేప ప్రవేశ మార్గము ఉన్నది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَاۤ اٰتَیْنٰهُ رَحْمَةً مِّنْ عِنْدِنَا وَعَلَّمْنٰهُ مِنْ لَّدُنَّا عِلْمًا ۟
వారిద్దరూ చేపను పోగొట్టుకున్న ప్రదేశమునకు చేరుకున్నప్పుడు దాని వద్ద వారు మా పుణ్య దాసుల్లోంచి ఒక దాసుడిని (అతడు ఖజిర్ అలైహిస్సలాం) పొందారు. అతనికి మేము మా వద్ద నుండి కారుణ్యమును ప్రసాధించాము. మరియు మేము అతనికి మా వద్ద నుండి ప్రజలకు తెలియని జ్ఞానమును ప్రసాధించాము. మరియు అది (జ్ఞానం) ఈ గాధలో ఇమిడి ఉన్నది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ لَهٗ مُوْسٰی هَلْ اَتَّبِعُكَ عَلٰۤی اَنْ تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا ۟
మూసా ఆయనతో వినమ్రతతో,మెత్తదనముతో ఇలా పలికారు : సత్యం వైపునకు దారి చూపే ఏదైతే జ్ఞానమును అల్లాహ్ మీకు నేర్పించాడో దాని నుండి మీరు నాకు నేర్పించటముపై నేను మిమ్మల్ని అనుసరించగలనా ?.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ اِنَّكَ لَنْ تَسْتَطِیْعَ مَعِیَ صَبْرًا ۟
ఖజిర్ ఇలా సమాధానమిచ్చారు : మీరు చూసిన నా జ్ఞానముపై ఖచ్చితంగా సహనం చూపలేరు. ఎందుకంటే అది మీ దగ్గర ఉన్న జ్ఞానంతో సరిపోలడం లేదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَكَیْفَ تَصْبِرُ عَلٰی مَا لَمْ تُحِطْ بِهٖ خُبْرًا ۟
మరియు నీవు చూసే కార్యల గురించి సరి అయినది ఏదో నీవు గుర్తించని వాటిపై నీవు ఎలా సహనం చూపగలవు ?!. ఎందుకంటే నీవు వాటి విషయంలో నీ జ్ఞానము పరంగా నిర్ణయం తీసుకుంటావు కాబట్టి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ سَتَجِدُنِیْۤ اِنْ شَآءَ اللّٰهُ صَابِرًا وَّلَاۤ اَعْصِیْ لَكَ اَمْرًا ۟
మూసా ఇలా సమాధానమిచ్చారు : ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే మీరు నన్ను మీ కార్యలను నేను చూసిన వాటిపై సహనం చూపే వానిగా పొందుతారు. అవి మీ విధేయతకు సంబంధించినవి.మీరు నాకు ఆదేశించిన వాటి విషయంలో మీకు విధేయత చూపకుండా ఉండలేను.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ فَاِنِ اتَّبَعْتَنِیْ فَلَا تَسْـَٔلْنِیْ عَنْ شَیْءٍ حَتّٰۤی اُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا ۟۠
ఖజిర్ మూసాతో ఇలా పలికారు : ఒక వేళ మీరు నన్ను అనుసరిస్తే నేను చేసిన దాన్ని మీరు చూసిన ఆ విషయం గురించ్ నేను దాని కారణం ముందు స్పష్టపరచే వాడినయ్యేంతవరకు మీరు నన్ను అడగకండి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَانْطَلَقَا ۫— حَتّٰۤی اِذَا رَكِبَا فِی السَّفِیْنَةِ خَرَقَهَا ؕ— قَالَ اَخَرَقْتَهَا لِتُغْرِقَ اَهْلَهَا ۚ— لَقَدْ جِئْتَ شَیْـًٔا اِمْرًا ۟
వారిద్దరు దానిపై రాజీ అయినప్పుడు వారు సముద్ర తీరమునకు నడిచి వెళ్ళారు.చివరకు ఒక నావను పొందారు. ఖజిర్ కి గౌరవంగా ఎటువంటి పారితోషికం లేకుండా వారిద్దరు అందులో సవారీ అయ్యారు. అప్పుడు ఖజిర్ దాని పలకల్లోంచి ఒక పలకను ఊడగొట్టి నావకు రంధ్రం చేశారు. అప్పుడు మూసా ఆయనతో ఇలా పలికారు : ఏమీ మీరు ఆ నావను దేనిలోనైతే మమ్మల్ని ఎటువంటి పారితోషికం లేకుండా సవారీ చేయించినారో దాని వారిని ముంచి వేసే ఉద్దేశంతో రంధ్రం చేశారా ?!. నిశ్చయంగా మీరు పెద్ద ఘనకార్యమే చేశారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ اَلَمْ اَقُلْ اِنَّكَ لَنْ تَسْتَطِیْعَ مَعِیَ صَبْرًا ۟
ఖజిర్ మూసాతో "మీరు నా నుండి చూసిన దానిపై సహనం చూపలేరని నేను మీకు చెప్పలేదా ?" అని అన్నారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ لَا تُؤَاخِذْنِیْ بِمَا نَسِیْتُ وَلَا تُرْهِقْنِیْ مِنْ اَمْرِیْ عُسْرًا ۟
మూసా అలైహిస్సలాం ఖజిర్ తో ఇలా పలికారు : నేను మరిచిపోయి మీకు ఇచ్చిన మాటను వదిలివేసినందుకు మీరు నన్ను శిక్షించకండి.నాపై బలవంతం చేయకండి,మీ సహచర్యంలో కఠినంగా వ్యవహరించకండి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَانْطَلَقَا ۫— حَتّٰۤی اِذَا لَقِیَا غُلٰمًا فَقَتَلَهٗ ۙ— قَالَ اَقَتَلْتَ نَفْسًا زَكِیَّةً بِغَیْرِ نَفْسٍ ؕ— لَقَدْ جِئْتَ شَیْـًٔا نُّكْرًا ۟
వారిద్దరు నావ నుండి దిగిన తరువాత తీరం వెంబడి నడుచుకుంటూ వెళ్ళసాగారు. అప్పుడు వారిద్దరు పిల్లలతోపాటు ఆడుకుంటున్నఇంకా యవ్వన దశకు చేరని ఒక పిల్లవాడిని చూశారు. అప్పుడు ఖజిర్ అతనిని చంపివేశారు. మూసా అతనితో ఇలా పలికారు : ఏమీ మీరు ఎటువంటి పాపం చేయని,ఇంకా యవ్వన దశకు చేరని ఒక అమాయక ప్రాణాన్ని చంపేశారా ?!.నిశ్చయంగా మీరు ఘోరాతికరమైన పని చేశారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• استحباب كون خادم الإنسان ذكيًّا فطنًا كَيِّسًا ليتم له أمره الذي يريده.
మనిషి తాను కోరుకున్నది పరిపూర్ణం అవ్వాలంటే అతని యొక్క సేవకుడు తెలివైన వాడు,వివేకవంతుడు,బుద్ధిమంతుడై ఉండటం మంచిది.

• أن المعونة تنزل على العبد على حسب قيامه بالمأمور به، وأن الموافق لأمر الله يُعان ما لا يُعان غيره.
దాసుడు తనకు ఆదేశించబడిన వాటికి ఎంతవరకు కట్టుబడి ఉంటాడో అంత సహాయము అతనిపై కలుగుతుంది,అల్లాహ్ ఆదేశమునకు కట్టుబడి ఉండేవాడికి ఎవరికీ అందనంత సహాయం అతనికి అందుతుంది.

• التأدب مع المعلم، وخطاب المتعلم إياه ألطف خطاب.
గురువుతో మర్యాదపూర్వకంగా ఉండటం, విధ్యను అభ్యసించేవాడు అతనిని (గురువును) ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మృధువుగా మాట్లాడలి.

• النسيان لا يقتضي المؤاخذة، ولا يدخل تحت التكليف، ولا يتعلق به حكم.
మతిమరుపునకు ఎటువంటి శిక్ష నిర్ణయించబడదు.మరియు అది బాధ్యత క్రింద రాదు. మరియు దానికి సంబంధించి ఎటువంటి తీర్పు ఉండదు.

• تعلم العالم الفاضل للعلم الذي لم يَتَمَهَّر فيه ممن مهر فيه، وإن كان دونه في العلم بدرجات كثيرة.
సద్గుణ జ్ఞానము కలవాడు తనకు ఏ జ్ఞానములోనైతే ప్రావీణ్యము లేదో అందులో ప్రావీణ్యం కలవారితో నేర్చుకోవాలి. ఒక వేళ తను ఇతరుల కన్న జ్ఞానపరంగా ఎక్కువ స్థానాలు కలవాడైనా సరే.

• إضافة العلم وغيره من الفضائل لله تعالى، والإقرار بذلك، وشكر الله عليها.
జ్ఞానము,ఇతర ఘనతల యొక్క సంబంధమును మహోన్నతుడైన అల్లాహ్ కి కలపాలి.మరియు వాటిని అంగీకరించాలి.మరియు వాటి గురించి అల్లాహ్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅಲ್- ಕಹ್ಫ್
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ