Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅನ್ನೂರ್   ಶ್ಲೋಕ:
وَاَنْكِحُوا الْاَیَامٰی مِنْكُمْ وَالصّٰلِحِیْنَ مِنْ عِبَادِكُمْ وَاِمَآىِٕكُمْ ؕ— اِنْ یَّكُوْنُوْا فُقَرَآءَ یُغْنِهِمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ؕ— وَاللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ ۟
ఓ విశ్వాసపరులారా మీరు భర్యలు లేని పురషులకు,భర్తలు లేని స్వతంత్రపరులైన స్త్రీలకు వివాహం చేయించండి. మరియు విశ్వాసపరులైన మీ బానిస పురుషులకు,స్త్రీలకు వివాహం చేయించండి. ఒక వేళ వారు పేదవారైతే అల్లాహ్ వారిని తన విశాలమైన అనుగ్రహం ద్వారా ధనికులను చేస్తాడు. మరియు అల్లాహ్ ఆహారోపాధిలో విశాలవంతుడు. ఎవరి సుసంపన్నత ఆయన ఆహారోపాధిని తగ్గించదు. ఆయన తన దాసుల స్థితులను తెలిసినవాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَلْیَسْتَعْفِفِ الَّذِیْنَ لَا یَجِدُوْنَ نِكَاحًا حَتّٰی یُغْنِیَهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ؕ— وَالَّذِیْنَ یَبْتَغُوْنَ الْكِتٰبَ مِمَّا مَلَكَتْ اَیْمَانُكُمْ فَكَاتِبُوْهُمْ اِنْ عَلِمْتُمْ فِیْهِمْ خَیْرًا ۖۗ— وَّاٰتُوْهُمْ مِّنْ مَّالِ اللّٰهِ الَّذِیْۤ اٰتٰىكُمْ ؕ— وَلَا تُكْرِهُوْا فَتَیٰتِكُمْ عَلَی الْبِغَآءِ اِنْ اَرَدْنَ تَحَصُّنًا لِّتَبْتَغُوْا عَرَضَ الْحَیٰوةِ الدُّنْیَا ؕ— وَمَنْ یُّكْرِهْهُّنَّ فَاِنَّ اللّٰهَ مِنْ بَعْدِ اِكْرَاهِهِنَّ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
తమ పేదరికం వలన వివాహం చేసుకోవటానికి స్థోమత లేనివారు అల్లాహ్ వారికి తన విశాల అనుగ్రహం ద్వారా ధనవంతులుగా చేసేవరకు వ్యభిచారము నుండి శీల శుద్ధతను పాటించాలి. మరియు బానిసల్లోంచి ఎవరైతే విముక్తి పొందటం కొరకు ధనం ఇవ్వటం పై తమ యజమానులతో వ్రాత పత్రమును కోరితే వారి యజమానులు వారిలో చెల్లించే సామర్ధ్యమును,ధర్మ విషయంలో మంచితనమును చూస్తే వారు తప్పకుండా వారి నుండి స్వీకరించాలి. మరియు వారు తమకు అల్లాహ్ ప్రసాదించిన సంపద నుండి వారు వ్రాతపూరకంగా చెల్లిస్తామన్న దానిలో తమవంతు భాగస్వాములు అవటానికి వారికి ఇవ్వటం ధర్మము. మరియు మీరు మీ బానిస స్త్రీలను ధనాన్ని ఆశిస్తూ వ్యభిచారమునకు బలవంత పెట్టకండి - ఏవిధంగా నైతే అబ్దుల్లాహ్ ఇబ్ను ఉబయ్ తన ఇద్దరి బానిస స్త్రీల పట్ల వారు శీలమును ,అశ్లీలతను దూరంగా ఉండటమును ఆశించినప్పుడు కూడా పాల్పడే వాడు - మీరు వారి మర్మావయవము ద్వారా సంపాదించిన దాన్ని కోరుతూ దానిపై మీలో నుండి ఎవరైన వారిని బలవంతం చేసి ఉంటే నిశ్ఛయంగా అల్లాహ్ బలవంతము తరువాత వారి (ఆ స్త్రీల కొరకు) పాపములను మన్నించేవాడును,వారిపై కనికరించేవాడును. ఎందుకంటే వారు బలవంతం చేయబడ్డారు. పాపమన్నది బలవంతం చేసినవారిపై ఉంటుంది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَلَقَدْ اَنْزَلْنَاۤ اِلَیْكُمْ اٰیٰتٍ مُّبَیِّنٰتٍ وَّمَثَلًا مِّنَ الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلِكُمْ وَمَوْعِظَةً لِّلْمُتَّقِیْنَ ۟۠
మరియు నిశ్ఛయంగా మేము ఓ ప్రజలారా మీ వైపు ఎటువంటి సందేహం లేని స్పష్టమైన ఆయతులను అవతరింపజేశాము. మరియు మేము మీ వైపున మీకన్న పూర్వం గతించిన విశ్వాసపరుల,అవిశ్వాసపరుల ఉదాహరణలను అవతరింపజేశాము. మరియు మేము మీపై హితోపదేశమును అవతరింపజేశాము. తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ ఆయన పట్ల భయభీతి కలిగిన వారు దాని ద్వారా హితోపదేశం గ్రహిస్తారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اَللّٰهُ نُوْرُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— مَثَلُ نُوْرِهٖ كَمِشْكٰوةٍ فِیْهَا مِصْبَاحٌ ؕ— اَلْمِصْبَاحُ فِیْ زُجَاجَةٍ ؕ— اَلزُّجَاجَةُ كَاَنَّهَا كَوْكَبٌ دُرِّیٌّ یُّوْقَدُ مِنْ شَجَرَةٍ مُّبٰرَكَةٍ زَیْتُوْنَةٍ لَّا شَرْقِیَّةٍ وَّلَا غَرْبِیَّةٍ ۙ— یَّكَادُ زَیْتُهَا یُضِیْٓءُ وَلَوْ لَمْ تَمْسَسْهُ نَارٌ ؕ— نُوْرٌ عَلٰی نُوْرٍ ؕ— یَهْدِی اللّٰهُ لِنُوْرِهٖ مَنْ یَّشَآءُ ؕ— وَیَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ لِلنَّاسِ ؕ— وَاللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟ۙ
అల్లాహ్ ఆకాశములకు,భూమికి జ్యోతీ,వాటిలో ఉన్నవారికి మార్గదర్శకుడు. పరిశుద్ధుడైన ఆయన జ్యోతి విశ్వాసపరుని హృదయంలో కిటికీ లేని గోడలో ఒక గూటితో పోల్చవచ్చు. అందులో ఒక దీపం ఉన్నది. ఆ దీపము ఒక కాంతి వంతమైన గాజు సీసాలో ఉన్నది. అది ముత్యములా మెరిసిపోతున్న ఒక నక్షత్రమువలె ఉన్నది. ఆ దీపము ఒక శుభ ప్రదమైన వృక్షపు నూనెతో వెలిగించబడుతుంది. అది జైతూన్ వృక్షము (ఆలివ్ చెట్టు). ఆ వృక్షమును సూర్యుడి నుండి ప్రొద్దునా గాని సాయంత్రము గాని ఏదీ కప్పి ఉంచలేదు. దాని నూనె స్వచ్ఛదనం వలన దానికి అగ్ని తగలకపోయినా వెలిగిపోయినట్లుంది. అటువంటప్పుడు దానికి అది (అగ్ని) తగిలితే ఎలా ఉంటుంది ?!. దీపం వెలుగు గాజు సీసా వెలుగుపై ఉన్నది. ఇదే విధంగా విశ్వాసపరుని హృదయం అందులో సన్మార్గము యొక్క వెలుగు వెలిగినప్పుడు ఉంటుంది. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి తాను కోరుకున్న వారికి ఖుర్ఆన్ ను అనుసరించే సౌభాగ్యమును కలిగిస్తాడు. మరియు అల్లాహ్ వస్తువులను వాటిని పోలిన వాటితో ఉపమానములను తెలపటం ద్వారా స్పష్టపరుస్తాడు. మరియు అల్లాహ్ ప్రతీ వస్తువు గురించి తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فِیْ بُیُوْتٍ اَذِنَ اللّٰهُ اَنْ تُرْفَعَ وَیُذْكَرَ فِیْهَا اسْمُهٗ ۙ— یُسَبِّحُ لَهٗ فِیْهَا بِالْغُدُوِّ وَالْاٰصَالِ ۟ۙ
ఈ దీపము ఆ మస్జిదులలో వేటి స్థానమునైతే పెంచమని,వేటినైతే నిర్మించమని అల్లాహ్ ఆదేశించాడో వాటిలో వెలిగించబడుతుంది. మరియు వాటిలో అజాన్ ద్వారా,స్మరణ ద్వారా,నమాజు ద్వారా ఆయన నామము స్మరించటం జరుగుతుంది. వాటిలో అల్లాహ్ మన్నతను ఆశిస్తూ ఉదయం మొదటి వేళలో,చివరి వేళలో నమాజులను పాటిస్తారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• الله عز وجل ضيق أسباب الرق (بالحرب) ووسع أسباب العتق وحض عليه .
సర్వ శక్తి వంతుడు,మహోన్నతుడైన అల్లాహ్ బానిసత్వము యొక్క కారకాలను కుదించాడు. మరియు విమోచనము యొక్క కారకాలను విస్తరింపజేశాడు,దానిపై ప్రోత్సహించాడు.

• التخلص من الرِّق عن طريق المكاتبة وإعانة الرقيق بالمال ليعتق حتى لا يشكل الرقيق طبقة مُسْتَرْذَلة تمتهن الفاحشة.
వ్రాత పత్రము పధ్ధతి ద్వారా బానిసత్వము నుండి విముక్తి కలిగించటం, బానిసను విముక్తి కలిగించటానికి ధనం ద్వారా బానిసకు సహాయం చేయటం చివరికి అతను ఆ వర్గమును రూపము ఇవ్వకుండా ఉండటానికి ఏదైతే అశ్లీలతను తన వృత్తిగా చేసుకుంటుంది.

• قلب المؤمن نَيِّر بنور الفطرة، ونور الهداية الربانية.
విశ్వాసపరుని హృదయం స్వాభావిక కాంతితో, దైవిక మార్గదర్శక కాంతితో ప్రకాశిస్తుంది.

• المساجد بيوت الله في الأرض أنشأها ليعبد فيها، فيجب إبعادها عن الأقذار الحسية والمعنوية.
మస్జిదులు భూమిపై అల్లాహ్ గృహాలు వాటిని ఆయన తన ఆరాధన వాటిలో చేయటానికి సృష్టించాడు. కాబట్టి వాటిని ఇంద్రియ,నైతిక మలినాల నుండి దూరంగా ఉంచటం తప్పనిసరి.

• من أسماء الله الحسنى (النور) وهو يتضمن صفة النور له سبحانه.
అల్లాహ్ యొక్క అందమైన పేర్లలోంచి (అన్నూర్) .మరియు పరిశుద్ధుడైన ఆయన కొరకు కాంతి యొక్క గుణము కలదు.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅನ್ನೂರ್
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ