Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅಲ್ -ಜಾಸಿಯ   ಶ್ಲೋಕ:
اَفَرَءَیْتَ مَنِ اتَّخَذَ اِلٰهَهٗ هَوٰىهُ وَاَضَلَّهُ اللّٰهُ عَلٰی عِلْمٍ وَّخَتَمَ عَلٰی سَمْعِهٖ وَقَلْبِهٖ وَجَعَلَ عَلٰی بَصَرِهٖ غِشٰوَةً ؕ— فَمَنْ یَّهْدِیْهِ مِنْ بَعْدِ اللّٰهِ ؕ— اَفَلَا تَذَكَّرُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు తన మనోవాంఛలను అనుసరించి దాన్ని తాను విభేదించని ఆరాధ్యదైవం స్థానంలో చేసినవాడిని చూడండి. అల్లాహ్ తన జ్ఞానముతో అతన్ని అపమార్గమునకు లోను చేశాడు. ఎందుకంటే అతడు అపమార్గమునకు యోగ్యుడు. మరియు ఆయన అతని హృదయంపై సీలు వేశాడు కాబట్టి అతను తాను ప్రయోజనం చెందే విధంగా వినలేడు. మరియు అల్లాహ్ అతని చూపుపై తెరను కప్పివేశాడు అది అతన్ని సత్యమును చూడటం నుండి ఆపుతుంది. అయితే అల్లాహ్ అపమార్గమునకు లోను చేసిన తరువాత అతనికి సత్యము కొరకు అనుగ్రహించేవాడెవడు ?. ఏమీ మీరు మనోవాంఛలను అనుసరించటం యొక్క నష్టము నుండి మరియు అల్లాహ్ ధర్మమును అనుసరించటం యొక్క ప్రయోజనం నుండి హితబోధనను గ్రహించరా ?.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَقَالُوْا مَا هِیَ اِلَّا حَیَاتُنَا الدُّنْیَا نَمُوْتُ وَنَحْیَا وَمَا یُهْلِكُنَاۤ اِلَّا الدَّهْرُ ۚ— وَمَا لَهُمْ بِذٰلِكَ مِنْ عِلْمٍ ۚ— اِنْ هُمْ اِلَّا یَظُنُّوْنَ ۟
మరియు మరణాంతరం లేపబడటంను తిరస్కరించే అవిశ్వాసపరులు ఇలా పలికారు : మా ఈ ఇహలోక జీవితము మాత్రమే జీవితము. దాని తరువాత ఎటువంటి జీవితం లేదు. చాలా తరాలు మరణించి అవి తిరిగి రావు. మరియు చాలా తరాలు జీవిస్తాయి. మరియు మమ్మల్ని రాత్రింబవళ్ళు ఒకదాని వెనుకు ఒకటి రావటం మాత్రమే మరణింపజేస్తుంది. మరియు మరణాంతరం లేపబడటమును వారి తిరస్కారములో వారికి ఎటువంటి జ్ఞానం లేదు. వారు కేవలం ఊహగానాలే చేస్తున్నారు. మరియు నిశ్చయంగా ఊహగానాలు సత్యం ముందు ఏమి పనికి రావు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ مَّا كَانَ حُجَّتَهُمْ اِلَّاۤ اَنْ قَالُوا ائْتُوْا بِاٰبَآىِٕنَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ముష్రికులపై స్పష్టమైన మా ఆయతులను చదివి వినిపించినప్పుడు వారు వాదించటానికి ప్రవక్తసల్లల్లాహు అలైహి వసల్లంతో,ఆయన సహచరులతో వారి ఈ మాటలు తప్ప వారి కొరకు ఎటువంటి వాదన ఉండేది కాదు : "మేము మా మరణం తరువాత లేపబడుతామని వాదనలో మీరు సత్యవంతులేనైతే మరణించిన మా తాతముత్తాతలను మీరు మా కొరకు జీవింపజేయండి".
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قُلِ اللّٰهُ یُحْیِیْكُمْ ثُمَّ یُمِیْتُكُمْ ثُمَّ یَجْمَعُكُمْ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ لَا رَیْبَ فِیْهِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟۠
ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : అల్లాహ్ మిమ్మల్ని సృష్టించి మిమ్మల్ని జీవింపజేస్తాడు ఆ తరువాత ఆయన మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మీ మరణం తరువాత లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు ప్రళయదినం నాడు మిమ్మల్ని ఆయన సమీకరిస్తాడు. ఆ దినము రావటం విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాని చాలా మందికి తెలియదు. అందుకనే వారు దాని కొరకు సత్కర్మల ద్వారా సిద్ధం కావటం లేదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَیَوْمَ تَقُوْمُ السَّاعَةُ یَوْمَىِٕذٍ یَّخْسَرُ الْمُبْطِلُوْنَ ۟
మరియు ఆకాశముల సామ్రాజ్యాధికారము,భూమి యొక్క సామ్రాజ్యాధికారము ఒక్కడైన అల్లాహ్ కొరకే చెందుతుంది. ఆ రెండింటిలో న్యాయపూరితంగా ఆయన తప్ప ఇతరుల ఆరాధన చేయబడదు. లెక్క తీసుకుని ప్రతిఫలం ప్రసాదించటానికి అల్లాహ్ మృతులను మరల లేపే ప్రళయం నెలకొనే దినమున అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధన చేసే వారైన,సత్యమును నిర్వీర్యం చేయటానికి,అసత్యమును నిరూపించటానికి ప్రయత్నించే అసత్యవాదులు నష్టమును చూస్తారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَتَرٰی كُلَّ اُمَّةٍ جَاثِیَةً ۫ؕ— كُلُّ اُمَّةٍ تُدْعٰۤی اِلٰی كِتٰبِهَا ؕ— اَلْیَوْمَ تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఆ రోజున ప్రతీ సమాజమును తమ మోకాళ్ళపై కూర్చుని తమ పట్ల ఏమి చేయబడుతుంది అని నిరీక్షిస్తుండగా చూస్తారు. ప్రతీ సమాజము సంరక్షదూతలు వ్రాసిన తమ కర్మల పుస్తకం వైపునకు పిలవబడుతారు. ఓ ప్రజలారా ఈ రోజు మీరు ఇహలోకంలో చేసుకున్న మేలు,చెడు యొక్క ప్రతిఫలం ప్రసాదించబడుతారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
هٰذَا كِتٰبُنَا یَنْطِقُ عَلَیْكُمْ بِالْحَقِّ ؕ— اِنَّا كُنَّا نَسْتَنْسِخُ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
ఇది మా పుస్తకము దీనిలోనే మా దూతలు మీ కర్మలను వ్రాసేవారు. అది మీకు వ్యతిరేకం సత్యం గురించే సాక్ష్యం పలుకుతుంది కాబట్టి మీరు దాన్ని చదవండి. నిశ్ఛయంగా మేము ఇహలోకంలో మీరు చేసే కర్మల గురించి వ్రాయమని సంరక్షదూతలకు ఆదేశించాము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَیُدْخِلُهُمْ رَبُّهُمْ فِیْ رَحْمَتِهٖ ؕ— ذٰلِكَ هُوَ الْفَوْزُ الْمُبِیْنُ ۟
కాని విశ్వసించి సత్కర్మలను చేసిన వారిని పరిశుద్ధుడైన వారి ప్రభువు తన కారుణ్యము ద్వారా తన స్వర్గములో ప్రవేశింపజేస్తాడు. అల్లాహ్ వారికి ప్రసాదించే ఈ ప్రతిఫలం దాని ఏ ప్రతిఫలము సరితూగని స్పష్టమైన ప్రతిఫలము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَاَمَّا الَّذِیْنَ كَفَرُوْا ۫— اَفَلَمْ تَكُنْ اٰیٰتِیْ تُتْلٰی عَلَیْكُمْ فَاسْتَكْبَرْتُمْ وَكُنْتُمْ قَوْمًا مُّجْرِمِیْنَ ۟
మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచినవారిని దూషిస్తూ వారితో ఇలా పలకబడును : మీ ముందట మా ఆయతులు చదివి వినిపించబడలేదా ?. అప్పుడు మీరు వాటిపై విశ్వాసమును కనబరచటం నుండి అహంకారమును చూపారు. మరియు మీరు అపరాధ జనులైపోయారు. మీరు అవిశ్వాసముకు,పాపకార్యములకు పాల్పడ్డారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَاِذَا قِیْلَ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّالسَّاعَةُ لَا رَیْبَ فِیْهَا قُلْتُمْ مَّا نَدْرِیْ مَا السَّاعَةُ ۙ— اِنْ نَّظُنُّ اِلَّا ظَنًّا وَّمَا نَحْنُ بِمُسْتَیْقِنِیْنَ ۟
నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసులకు ఆయన వారిని మరణాంతరం లేపి వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తానని చేసిన వాగ్దానము ఎటువంటి సందేహం లేని సత్యమని, ప్రళయం సత్యమని అందులో ఎటువంటి సందేహం లేదని మీరు దాని కొరకు ఆచరణలు చేయండి అని మీతో తెలపబడినప్పుడు మీరు ఇలా పలికారు : ఈ ప్రళయం ఏమిటో మాకు తెలియదు. అది వస్తుంది అన్నది బలహీనమైన ఊహగానమని మేము భావిస్తున్నాము. అది తొందరలోనే రాబోతున్నదన్న విషయమును మేము నమ్మము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• اتباع الهوى يهلك صاحبه، ويحجب عنه أسباب التوفيق.
మనోవాంఛలను అనుసరించటం అనుసరించే వాడిని నాశనం చేస్తుంది. మరియు అతని నుండి అనుగ్రహపు కారకాలను ఆపివేస్తుంది.

• هول يوم القيامة.
ప్రళయదినము యొక్క భయాందోళన.

• الظن لا يغني من الحق شيئًا، خاصةً في مجال الاعتقاد.
అనుమానము సత్యం విషయంలో ఏమాత్రం పనికిరాదు. ముఖ్యంగా నమ్మకం ఉన్న ప్రాంతములో.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅಲ್ -ಜಾಸಿಯ
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ