Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅಲ್ -ಫತ್ ಹ್   ಶ್ಲೋಕ:
وَهُوَ الَّذِیْ كَفَّ اَیْدِیَهُمْ عَنْكُمْ وَاَیْدِیَكُمْ عَنْهُمْ بِبَطْنِ مَكَّةَ مِنْ بَعْدِ اَنْ اَظْفَرَكُمْ عَلَیْهِمْ ؕ— وَكَانَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرًا ۟
మరియు ఆయనే మీ నుండి ముష్రికుల చేతులను హుదేబియాలో మీకు కీడుని కలిగించే ఉద్దేశముతో వారిలోని ఎనభై మంది వచ్చినప్పుడు ఆపాడు. మరియు వారి నుండి మీ చేతులను ఆపాడు అప్పుడు మీరు వారిని హతమార్చలేదు మరియు వారిని బాధించలేదు. వారిని బందీలుగా చేసుకునే సామర్ధ్యం ఉండి కూడా మీరు వారిని విడుదల చేశారు. మరియు అల్లాహ్ మీరు చేసేవాటిని చూస్తున్నాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
هُمُ الَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَالْهَدْیَ مَعْكُوْفًا اَنْ یَّبْلُغَ مَحِلَّهٗ ؕ— وَلَوْلَا رِجَالٌ مُّؤْمِنُوْنَ وَنِسَآءٌ مُّؤْمِنٰتٌ لَّمْ تَعْلَمُوْهُمْ اَنْ تَطَـُٔوْهُمْ فَتُصِیْبَكُمْ مِّنْهُمْ مَّعَرَّةٌ بِغَیْرِ عِلْمٍ ۚ— لِیُدْخِلَ اللّٰهُ فِیْ رَحْمَتِهٖ مَنْ یَّشَآءُ ۚ— لَوْ تَزَیَّلُوْا لَعَذَّبْنَا الَّذِیْنَ كَفَرُوْا مِنْهُمْ عَذَابًا اَلِیْمًا ۟
వారందరే అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరచి,మిమ్మల్ని మస్జిదుల్ హరామ్ నుండి ఆపారు మరియు బలి పశువును దాని జుబాహ్ అయ్యే ప్రదేశమైన హరమ్ నకు చేరకుండా ఉండేటట్లు ఆపారు. మరియు ఒక వేళ అక్కడ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే పురుషులు,విశ్వాసమును కనబరిచే స్త్రీలు ఉండకుండా ఉంటే - మీరు వారిని గుర్తించకుండా ఉండి మీరు వారిని అవిశ్వాసపరులతో పాటు హతమార్చేసేవారు. వారిని మీరు మీకు తెలియకుండా హత్య చేసి ఉంటే మీకు పాపము మరియు రక్తపరిహారము కలిగి ఉండేది. కావున ఆయన మక్కా విజయము రోజు మీకు అనుమతినిచ్చాడు అల్లాహ్ మక్కాలోని విశ్వాసపరుల్లాంటి వారిలా తాను తలచిన వారిని తన కారుణ్యములో ప్రవేశింపజేస్తాడు. ఒక వేళ మక్కాలో విశ్వాసపరుల్లో నుంచి అవిశ్వాసపరులు వేరై ఉంటే అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై అవిశ్వాసమును కనబరచిన వారిని మేము బాధాకరమైన శిక్షకు గురి చేసేవారము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِذْ جَعَلَ الَّذِیْنَ كَفَرُوْا فِیْ قُلُوْبِهِمُ الْحَمِیَّةَ حَمِیَّةَ الْجَاهِلِیَّةِ فَاَنْزَلَ اللّٰهُ سَكِیْنَتَهٗ عَلٰی رَسُوْلِهٖ وَعَلَی الْمُؤْمِنِیْنَ وَاَلْزَمَهُمْ كَلِمَةَ التَّقْوٰی وَكَانُوْۤا اَحَقَّ بِهَا وَاَهْلَهَا ؕ— وَكَانَ اللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمًا ۟۠
అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు తమ హృదయముల్లో సత్య సాక్షాత్కారానికి సంబంధం లేకుండా కేవలం మనోవంఛలతో సంబంధం కల అజ్ఞాన కాలపు అహంభావమును పెంచుకున్నప్పుడు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశమును వారు తమను ఓడించి అపనిందలు వేస్తారనే భయముతో అసహ్యించుకున్నారు. అప్పుడు అల్లాహ్ తన వద్ద నుండి మనశ్శాంతిని తన ప్రవక్తపై అవతరింపజేశాడు మరియు దాన్ని విశ్వాసపరులపై అవతరింపజేశాడు. అయితే వారి మీద ఉన్న కోపము ముష్రికులతో పోరాటమును వారు చేసినట్లుగా కోరలేదు. మరియు అల్లాహ్ విశ్వాసపరులకి సత్య వాక్కు అది లా యిలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవము ఇంకొకరు లేడు) ను అనివార్యము చేశాడు. మరియు వారు దానికి తగినట్లుగా స్థిరంగా ఉండాలని అనివార్యము చేశాడు. అప్పుడు వారు దానిపై స్థిరంగా ఉన్నారు. మరియు విశ్వాసపరులు ఇతరులకన్న ఈ వాక్యమునకు ఎక్కువ హక్కుదారులు. అల్లాహ్ వారి హృదయముల్లో మంచితనమును తెలుసుకున్నప్పుడు వారే దానికి అర్హతకలిగే అర్హులు. మరియు అల్లాహ్ ప్రతీది తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
لَقَدْ صَدَقَ اللّٰهُ رَسُوْلَهُ الرُّءْیَا بِالْحَقِّ ۚ— لَتَدْخُلُنَّ الْمَسْجِدَ الْحَرَامَ اِنْ شَآءَ اللّٰهُ اٰمِنِیْنَ ۙ— مُحَلِّقِیْنَ رُءُوْسَكُمْ وَمُقَصِّرِیْنَ ۙ— لَا تَخَافُوْنَ ؕ— فَعَلِمَ مَا لَمْ تَعْلَمُوْا فَجَعَلَ مِنْ دُوْنِ ذٰلِكَ فَتْحًا قَرِیْبًا ۟
నిశ్ఛయంగా అల్లాహ్ తన ప్రవక్తకు కలను నిజం చేసి చూపించాడు. ఎప్పుడైతే ఆయన దాన్నే తన కలలో చూశారో తన సహచరులకు దాన్ని గురించి సమాచారమిచ్చారు. అదేమిటంటే నిశ్చయంగా ఆయన మరియు ఆయన అనుచరులు అల్లాహ్ పవిత్ర గృహములో తమ శతృవుల నుండి నిర్భయంగా ప్రవేసిస్తున్నారు. వారిలో నుండి కొందరు తమ శిరో ముండనం చేస్తున్నారు. మరియు వారిలో నుండి కొందరు ఖుర్బానీ ముగింపు గురించి ప్రకటిస్తూ వెంట్రుకలను కత్తిరిస్తున్నారు. ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మీకు తెలియని మీ ప్రయోజనంను తెలుసుకున్నాడు. కావున ఆయన ఆ సంవత్సరం మక్కాలో ప్రవేశించటం ద్వారా కల నిరూపితం కాకుండానే దగ్గరలోనే విజయమును కలిగించాడు. మరియు అది అల్లాహ్ హుదైబియా సయోధ్యను జారీచేసి, మరియు దాని వెనువెంటనే హుదైబియాలో సమావేశమైన విశ్వాసపరుల చేతులపై ఖైబర్ పై విజయంను కలిగించి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
هُوَ الَّذِیْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰی وَدِیْنِ الْحَقِّ لِیُظْهِرَهٗ عَلَی الدِّیْنِ كُلِّهٖ ؕ— وَكَفٰی بِاللّٰهِ شَهِیْدًا ۟ؕ
అల్లాహ్ యే తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను స్పష్టమైన ప్రకటన మరియు ఇస్లాం ధర్మమైన సత్య ధర్మమును ఇచ్చి దాన్ని దానికి వ్యతిరేక ధర్మములన్నింటిపై ఆధిక్యతను కలిగించటానికి పంపించాడు. మరియు అల్లాహ్ దానికి సాక్షి. మరియు సాక్షిగా అల్లాహ్ యే చాలు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• الصد عن سبيل الله جريمة يستحق أصحابها العذاب الأليم.
అల్లాహ్ మార్గము నుండి ఆపటం ఎటువంటి పాపమంటే దానికి పాల్పడేవారు బాధాకరమైన శిక్షకు అర్హులు.

• تدبير الله لمصالح عباده فوق مستوى علمهم المحدود.
అల్లాహ్ తన దాసుల ప్రయోజనాలను వారి పరిమిత జ్ఞానము కంటే పైన నిర్వహించటం.

• التحذير من استبدال رابطة الدين بحمية النسب أو الجاهلية.
వంశ స్వాభిమానము లేదా అజ్ఞానముతో ధర్మ సంబంధాన్ని మార్చటం నుండి హెచ్చరించటం

• ظهور دين الإسلام سُنَّة ووعد إلهي تحقق.
ఇస్లాం ధర్మం యొక్క ఆవిర్భావం ఒక దైవిక సంప్రదాయము మరియు వాగ్దానము నెరవేరింది.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅಲ್ -ಫತ್ ಹ್
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ