Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Vertimų turinys


Reikšmių vertimas Aja (Korano eilutė): (187) Sūra: Sūra Al-Bakara
اُحِلَّ لَكُمْ لَیْلَةَ الصِّیَامِ الرَّفَثُ اِلٰی نِسَآىِٕكُمْ ؕ— هُنَّ لِبَاسٌ لَّكُمْ وَاَنْتُمْ لِبَاسٌ لَّهُنَّ ؕ— عَلِمَ اللّٰهُ اَنَّكُمْ كُنْتُمْ تَخْتَانُوْنَ اَنْفُسَكُمْ فَتَابَ عَلَیْكُمْ وَعَفَا عَنْكُمْ ۚ— فَالْـٰٔنَ بَاشِرُوْهُنَّ وَابْتَغُوْا مَا كَتَبَ اللّٰهُ لَكُمْ ۪— وَكُلُوْا وَاشْرَبُوْا حَتّٰی یَتَبَیَّنَ لَكُمُ الْخَیْطُ الْاَبْیَضُ مِنَ الْخَیْطِ الْاَسْوَدِ مِنَ الْفَجْرِ ۪— ثُمَّ اَتِمُّوا الصِّیَامَ اِلَی الَّیْلِ ۚ— وَلَا تُبَاشِرُوْهُنَّ وَاَنْتُمْ عٰكِفُوْنَ فِی الْمَسٰجِدِ ؕ— تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَقْرَبُوْهَا ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ اٰیٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
పూర్వ ఆదేశాల్లోంచి ఉపవాసపు రాత్రుల్లో మనిషి నిదురపోయినప్పటి నుంచి ఫజర్ కన్న మునుపు మేల్కొనే వరకు తినటం,తమ భార్యతో సంబోగం చేయటం నిషేదించబడి ఉండేది,ఓ విశ్వాసపరులారా అల్లాహ్ ఆ ఆదేశమును రద్దుపరచి ఉపవాస రాత్రుల్లో మీ భార్యలతో సంబోగం చేయటమునకు అనుమతించాడు,వారు మీ కొరకు వస్త్రము,నిష్కలంకులు. మీరు వారి కొరకు వస్త్రము,నిష్కలంకులు. మీరు ఒకరి అవసరం ఇంకొకరికి లేనివారు కారు.అల్లాహ్ వారించిన వాటిని పాటించి మీరు ఆత్మ ద్రోహానికి పాల్పడుతున్నారని అల్లాహ్ గ్రహించాడు.మీ పై కనికరించి మీ పశ్చాత్తాపమును స్వీకరించాడు,మీకు సౌలభ్యాన్ని కలిగించాడు.అయితే మీరు ఇప్పుడు వారితో సంబోగము చేయండి,అల్లాహ్ మీకొరకు నిర్ణయించిన సంతానమును కోరుకోండి.రాత్రి నల్ల చారలు తొలిగిపోయి ఉదయపు తెల్ల చారలు ప్రస్పుటమై మీ కొరకు ఫజరె సాదిక్ (ఫజర్ అజాన్ అయ్యే వరకు) వేళ అయ్యే వరకు మీరు తినండి,త్రాగండి,ఫజర్ నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు ఉపవాసమును భంగ పరిచే వాటి నుండి దూరంగా ఉండి ఉపవాసమును పూర్తి చేసుకోండి.మీరు మస్జిద్ లో ఏతికాఫ్ పాటించే సమయంలో మీ భార్యలతో సంబోగించకండి.ఎందుకంటే అది (సంబోగం) దానిని (ఏతికాఫ్) భంగం చేస్తుంది.ఈ తెలియ పరచబడిన ఆదేశాలు అల్లాహ్ హద్దులు,అతడు హలాల్,హరాంను స్పష్టంగా తెలియ పరచాడు.ఎప్పుడు కూడా వాటి దరి దాపులకు వెళ్ళకండి,ఎందుకంటే ఎవరైతే అల్లాహ్ హద్దుల దరి దాపులకు వెళతాడో అతడు హరామ్ లో పడిపోయే సంభావన ఉన్నది.ఈ ఆదేశాల కొరకు ఈ స్పష్టమైన ఉదాహరణను ఇచ్చి అల్లాహ్ ప్రజల కొరకు ఆయనిచ్చిన ఆదేశమును పాటించటం,వారించిన వాటికి దూరంగా ఉండటం ఆయన నుండి తప్పి పోకుండా ఉండటానికి తన ఆయతులను వివరించి తెలియ పరచాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• مشروعية الاعتكاف، وهو لزوم المسجد للعبادة؛ ولهذا يُنهى عن كل ما يعارض مقصود الاعتكاف، ومنه مباشرة المرأة.
ధర్మబద్దంగా ఏతికాఫ్ అంటే ఆరాధనల కొరకు మస్జిద్లను పట్టుకుని ఉండటం,అందుకనే ఏతికాఫ్ ఉద్దేశానికి అడ్డు తగిలే వాటి నుండి ఆపడం జరిగింది,భార్యతో సమగామనం చేయటం అందులో నుంచే.

• النهي عن أكل أموال الناس بالباطل، وتحريم كل الوسائل والأساليب التي تقود لذلك، ومنها الرشوة.
అధర్మ పద్దతిలో ప్రజల సొమ్మును తినడం గురించి వారింపు,దానిని అనుసరించే కారకాలు,పద్దతుల నిషేదింపు,లంచమూ అందులో నుంచే.

• تحريم الاعتداء والنهي عنه؛ لأن هذا الدين قائم على العدل والإحسان.
అతిక్రమింపు ను నిషేదించటం,దాని నుండి వారించటం ఎందుకంటే ఈ ధర్మం న్యాయం, మంచితనం పై స్థాపించ బడింది.

 
Reikšmių vertimas Aja (Korano eilutė): (187) Sūra: Sūra Al-Bakara
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Vertimų turinys

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uždaryti