Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Vertimų turinys


Reikšmių vertimas Sūra: Sūra Al-Bakara   Aja (Korano eilutė):

సూరహ్ అల్-బఖరహ్

Sūros prasmės:
الأمر بتحقيق الخلافة في الأرض بإقامة الإسلام، والاستسلام لله، والتحذير من حال بني إسرائيل.
ఇస్లాంను స్థాపించటం,అల్లాహ్ కు లొంగిపోవటం మరియు బనీ ఇస్రాయీలు పరిస్థితి నుండి హెచ్చరించడం ద్వారా భువిలో ఖిలాఫత్ సాక్షాత్కారానికి ఆదేశించడం.

الٓمّٓ ۟ۚ
{الم} ఖుర్ ఆన్ లోని కొన్ని సూరాలు ఈ అక్షరాల ద్వారా ఆరంభం చేయబడినవి. ఇవి విడివిడిగా ఇలా (أ، ب، ت، إلخ) వచ్చినప్పుడు ఎటువంటి అర్ధం లేని అక్షరాలు. అవి అలా రావటానికి ఒక విజ్ఞత మరియు ఉద్దేశం ఉన్నది. ఖుర్ఆన్ లో విజ్ఞత లేనిది ఏదీ లేదు. ఆ విజ్ఞతల్లోంచి ముఖ్యమైనది వారికి తెలిసిన,వారు మాట్లాడే అక్షరాలతోనే తయారైన ఖుర్ఆన్ ద్వారా ఛాలెంజ్ చేయటం వైపు సూచన. అందుకనే ఎక్కువగా వాటి తరువాత పవిత్ర ఖుర్ఆన్ ప్రస్తావన వచ్చినది.దానికి ఉదాహరణ ఈ సూరాలో ఉన్నది.
Tafsyrai arabų kalba:
ذٰلِكَ الْكِتٰبُ لَا رَیْبَ ۖۚۛ— فِیْهِ ۚۛ— هُدًی لِّلْمُتَّقِیْنَ ۟ۙ
ఈ మహోన్నతమైన ఖుర్ఆన్ గ్రంధంలో అవతరణ రీత్యా కానీ, లేక పదాలు మరియు వాక్యార్ధాల రీత్యా కానీ ఏవిధమైన సంశయము లేదు. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క వాక్కు మరియు అది ఆయన వైపుకు చేరవేసే మార్గము వైపునకు దైవభీతి కలవారికి మార్గదర్శకమవుతుంది.
Tafsyrai arabų kalba:
الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِالْغَیْبِ وَیُقِیْمُوْنَ الصَّلٰوةَ وَمِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۟ۙ
ఎవరైతే అగోచర విషయాలను విశ్వసిస్తారో' అంటే బుద్దికి అందనటువంటివి మరియు ఙానేంద్రియాలకు గోప్యంగా ఉన్నవి, వేటి గురించి అయితే అల్లాహ్ మరియు ప్రవక్త తెలియజేశారో ఉదాహరణకు పరలోకానికి సంబంధించిన విషయాలు. మరియు 'ఎవరైతే నమాజును స్థాపిస్తారో' అంటే నమాజులను వాటి సమయంలో అల్లాహ్ నియమించిన నియమాలకు కట్టుబడి దాని విధులను మరియు సున్నతులను ఖచ్చితంగా నెరవేరుస్తారో అని అర్థము. మరియు 'వారికి అల్లాహ్ ప్రసాదించిన వాటి నుండి విధి గావించబడిన వాటిని తీయటం ద్వారా ఉదాహరణకు జకాత్,' మరియు విధి గావించబడనిది స్వచ్ఛందంగా చేసే దానము లాంటిలో పుణ్యాన్ని ఆశించి ఖర్చు పెడతారు.మరియు ఓ ప్రవక్తా ఎవరైతే నీ పై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింప జేయబడిన వాటి మధ్య వ్యత్యాసం చూపకుండా విశ్వసిస్తారో', వారు పరలోకంపై మరియు అక్కడ లభించు పాపపుణ్యాల ప్రతిఫలాలపై తిరుగు లేని విశ్వాసం కలిగి ఉంటారు.
Tafsyrai arabų kalba:
وَالَّذِیْنَ یُؤْمِنُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ ۚ— وَبِالْاٰخِرَةِ هُمْ یُوْقِنُوْنَ ۟ؕ
"ఎవరైతే అగోచర విషయాలను విశ్వసిస్తారో" అంటే బుద్దికి అందనటువంటివి మరియు ఇంద్రయాలకు గోప్యంగా ఉన్నవి, వేటి గురించి అయితే అల్లాహ్ మరియు ప్రవక్త తెలియజేశారో వాటన్నింటినీ విశ్వసిస్తారని అర్ధం ఉదాహరణకు పరలోకానికి సంబంధించిన విషయాలు. మరియు "ఎవరైతే నమాజును స్థాపిస్తారో" అంటే నమాజులను వాటి నిర్ధారిత సమయంలో అల్లాహ్ నియమించిన నియమాలకు కట్టుబడి దాని విధులను మరియు సున్నతులను ఖచ్చితంగా నెరవేరుస్తారో అని అర్థం. "మరియు వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు చేస్తారో" అంటే విధి దానాన్ని మరియు దానధర్మాలను పుణ్యాన్ని ఆశించి ఎవరైతే ఖర్చు పెడతారో అని అర్థం. మరియు ఎవరైతే (ఓ ముహమ్మద్!) నీ పై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింప జేయబడిన వాటి మధ్య వ్యత్యాసం చూపకుండా విశ్వసిస్తారో, వారు పరలోకంపై మరియు అక్కడ లభించు పాపపుణ్యాల ప్రతిఫలాలపై తిరుగు లేని విశ్వాసం కలిగి ఉంటారని అర్ధం.
Tafsyrai arabų kalba:
اُولٰٓىِٕكَ عَلٰی هُدًی مِّنْ رَّبِّهِمْ ۗ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟
పైన తెలియజేయబడిన గుణాలు గల వారే ఋజుమార్గం పై ఉన్నవారు. మరియు వారే తాము ఆశించిన వాటిని పొందటం ద్వారా,తాము భయపడిన వాటి నుండి విముక్తి పొంది ఇహలోకములో,పరలోకములో సాఫల్యం పొందుతారు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• الثقة المطلقة في نفي الرَّيب دليل على أنه من عند الله؛ إذ لا يمكن لمخلوق أن يدعي ذلك في كلامه.
• ఇందులో ఏవిధమైన సందేహం లేదని సంపూర్ణంగా త్రుణీకరించడం ద్వారానే ఇది అల్లాహ్ తరుపు నుంచి (అవతరించినదని) రుజువు అవుతుంది. ఎందుకనగా ఒక మనిషి తన మాటలలో ఈ విధంగా ఆరోపించడం అసాధ్యం.

• لا ينتفع بما في القرآن الكريم من الهدايات العظيمة إلا المتقون لله تعالى المعظِّمون له.
• ఖుర్ఆన్ గ్రంధంలోని ఉన్నతమైన ఆదేశాల ప్రయోజనం కేవలం అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని కొనియాడే మరియు ఆయన పట్ల భయభక్తులు గల అల్లాహ్ దాసులు మాత్రమే పొందగలరు.

• من أعظم مراتب الإيمانِ الإيمانُ بالغيب؛ لأنه يتضمن التسليم لله تعالى في كل ما تفرد بعلمه من الغيب، ولرسوله بما أخبر عنه سبحانه.
• విశ్వాసం యొక్క అత్యున్నత స్థాయి ఏమిటంటే అగోచర విషయాలను విశ్వశించడం. అగోచర విషయాల జ్ఞానములో అద్వితీయుడైన అల్లాహ్, ఆ జ్ఞానాన్ని తన ప్రవక్తకు ప్రసాదించాడు. అగోచర విషయాలను విశ్వశించడంలో దాసుడు తనను తాను సమర్పించుకోవడం ఇమిడి ఉంది.

• كثيرًا ما يقرن الله تعالى بين الصلاة والزكاة؛ لأنَّ الصلاة إخلاص للمعبود، والزكاة إحسان للعبيد، وهما عنوان السعادة والنجاة.
• అల్లాహ్ (సు.తా) ఖుర్ఆన్ లో అత్యధికంగా నమాజును మరియు జకాతును కలిపి ప్రస్తావించాడు. ఎందుకనగా నమాజు కేవలం దైవం కోసం ప్రత్యేకించబడిన ఆరాధన అయితే జకాతు దాసుల పై చేసే ఉపకారం. ఈ రెండూ వాస్తవానికి నైతికతకు మరియు ముక్తికి అంశము వంటివి.

• الإيمان بالله تعالى وعمل الصالحات يورثان الهداية والتوفيق في الدنيا، والفوز والفلاح في الأُخرى.
• మహోన్నతుడైన అల్లాహ్ పట్ల విశ్వాసం మరియు సత్కార్యాల ఆచరణ ఇహలోకంలో ఋజుమార్గమునకు మరియు పరలోకంలో సాఫల్యమునకు వారసత్వమును కలిగిస్తాయి.

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا سَوَآءٌ عَلَیْهِمْ ءَاَنْذَرْتَهُمْ اَمْ لَمْ تُنْذِرْهُمْ لَا یُؤْمِنُوْنَ ۟
నిశ్ఛయంగా విశ్వాసం లేకపోవటం వలన అల్లాహ్ వాక్కు అనివార్యం అయినవారు తమ అపమార్గముపై,మొండితనంపై కొనసాగిపోతారు. వారిని మీరు హెచ్చరించిన హెంచ్చరించకపోయిన రెండూ సమానము.
Tafsyrai arabų kalba:
خَتَمَ اللّٰهُ عَلٰی قُلُوْبِهِمْ وَعَلٰی سَمْعِهِمْ ؕ— وَعَلٰۤی اَبْصَارِهِمْ غِشَاوَةٌ ؗ— وَّلَهُمْ عَذَابٌ عَظِیْمٌ ۟۠
ఎందుకంటే అల్లాహ్ వారి హృదయాల పై ముద్ర వేసి వాటిని వాటి ఆంతర్యంలోని చెడును పూర్తిగా మూసివేసాడు.మరియు వారి చెవులపై ముద్రవేయబడిన కారణంగా వారు సత్యాన్ని ఆచరించె ఉద్దేశ్యంతో వినలేరు మరియు వారి కళ్ళపై తెరవేయబడిన కారణంగా సత్యం ప్రస్పుటమయిన తరువాత కూడా వారు చూడలేక పోతున్నారు వీరి కొరకు పరలోకంలో ఘోరమైన శిక్ష ఉన్నది.
Tafsyrai arabų kalba:
وَمِنَ النَّاسِ مَنْ یَّقُوْلُ اٰمَنَّا بِاللّٰهِ وَبِالْیَوْمِ الْاٰخِرِ وَمَا هُمْ بِمُؤْمِنِیْنَ ۟ۘ
ప్రజలలో ఒక వర్గం తాము విస్వాసులమని బొంకుతుంది వారు తమ ధన మరియు ప్రాణ భయంతో ఇలా బొంకుతున్నారే కానీ అంతర్గతoగా వారు అంతర్గతంగా అవిశ్వాసులు.
Tafsyrai arabų kalba:
یُخٰدِعُوْنَ اللّٰهَ وَالَّذِیْنَ اٰمَنُوْا ۚ— وَمَا یَخْدَعُوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا یَشْعُرُوْنَ ۟ؕ
వారు తమ విశ్వాసాన్ని ప్రదర్శించి, అవిశ్వాసాన్ని తిరస్కరించి అల్లాహ్ ను మరియు విస్వాసులను మోసగిస్తున్నారని తమ అజ్ఞానంతో భ్రమపడుతున్నారు. కానీ వాస్తవానికి వారు కేవలం తమను తామే మొసగించుకుంటున్నారు. కానీ ఇది వారు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే అల్లాహ్ కు రహస్యము,గోప్యవిషయాలు తెలుసు. ఆయన విస్వాసులకు వారి గుణాలను మరియు వారి పరిస్థితులను గురిoచి తెలియచేశాడు.
Tafsyrai arabų kalba:
فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ ۙ— فَزَادَهُمُ اللّٰهُ مَرَضًا ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۙ۬۟ — بِمَا كَانُوْا یَكْذِبُوْنَ ۟
(వారి ఈ వైఖరికి) కారణం ఏమనగా, వారి హృదయాలలో అనుమానం అనే వ్యాధి ఉన్నది.అల్లాహ్ వారి అనుమానాన్ని మరింతగా రెట్టింపు చేశాడు. మరియు వారి ఆచరణకు ఫలితంగా నరకంలోని అట్టడుగు భాగంలో ఘోరమైన శిక్షను విధించాడు. వారు ప్రజలపై మరియు అల్లాహ్ పై అబద్ధాలను మోపడం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని తిరస్కరించటం కారణంగా ఈ విధమైన శిక్ష విధించబడింది.
Tafsyrai arabų kalba:
وَاِذَا قِیْلَ لَهُمْ لَا تُفْسِدُوْا فِی الْاَرْضِ ۙ— قَالُوْۤا اِنَّمَا نَحْنُ مُصْلِحُوْنَ ۟
మరియు వారిని ‘అవిశ్వాసమూ, పాపకార్యాలు మొదలైన వాటితో భూమిపై ఉపద్రవాలను సృష్టించకండి’ అని చెప్పినప్పుడల్లా వారు దానిని నిరాకరించారు. తాము సంఘ సంస్కర్తలమనీ, తాము చేస్తున్నదంతా సంస్కరణే అని వాదించారు.
Tafsyrai arabų kalba:
اَلَاۤ اِنَّهُمْ هُمُ الْمُفْسِدُوْنَ وَلٰكِنْ لَّا یَشْعُرُوْنَ ۟
వాస్తవానికి నిశ్చయంగా ఉపద్రవాలను సృష్టించేది వారే. కానీ వారు ఇది గ్రహించలేక పోతున్నారు. మరియు వారు చేసే పనులే అసలైన ఉపద్రవాలు అనేది తెలుసుకోలేక పోతున్నారు.
Tafsyrai arabų kalba:
وَاِذَا قِیْلَ لَهُمْ اٰمِنُوْا كَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوْۤا اَنُؤْمِنُ كَمَاۤ اٰمَنَ السُّفَهَآءُ ؕ— اَلَاۤ اِنَّهُمْ هُمُ السُّفَهَآءُ وَلٰكِنْ لَّا یَعْلَمُوْنَ ۟
మరియు ఎప్పుడైతే వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులవలె విశ్వసించమని ఆదేశించబడినదో అప్పుడు వారు దానిని హేళనాప్రాయంగా మరియు తిరస్కార వైఖరితో సమాధానం పలుకుతూ మేము బుద్ది హీనులవలె విశ్వంసించాలా? అని అన్నారు. వాస్తవానికి వారే బుద్ది హీనులని తెలుసుకోలేక పోతున్నారు.
Tafsyrai arabų kalba:
وَاِذَا لَقُوا الَّذِیْنَ اٰمَنُوْا قَالُوْۤا اٰمَنَّا ۖۚ— وَاِذَا خَلَوْا اِلٰی شَیٰطِیْنِهِمْ ۙ— قَالُوْۤا اِنَّا مَعَكُمْ ۙ— اِنَّمَا نَحْنُ مُسْتَهْزِءُوْنَ ۟
వారు విశ్వాసులను కలసినప్పుడు మీరు విశ్వసించిన దానిని మేమూ విశ్వసిస్తున్నామని అంటారు. కానీ అలా వారు కేవలం విశ్వాసుల పట్ల తమకు ఉన్న భయంతోనే అంటున్నారు. మరియు ఎప్పుడైతే వారు విశ్వాసుల నుండి మరలి తమ నాయకుల వద్దకు ఏకాంతంలో చేరుతారో అప్పుడు తాము తమ నాయకుల విధేయతలోనే స్ధిరంగా ఉన్నామని నమ్మిస్తూ నిస్సందేహంగా మేము మీ పద్ధతి పైనే ఉన్నామని, పైకి మాత్రం కేవలం విశ్వాసులతో ఉన్నట్టు ఎగతాళి చేస్తున్నామని అంటారు.
Tafsyrai arabų kalba:
اَللّٰهُ یَسْتَهْزِئُ بِهِمْ وَیَمُدُّهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟
వారు విశ్వాసులతో ఆడుతున్న పరిహాసానికి బదులుగా అల్లాహ్ వారితో పరిహాసమాడుతున్నాడు. ఇది వారి పనులకు ప్రతిఫలం. అందుకే ఇహలోకంలో వీరిపై ముస్లిములకు వర్తించే ఆదేశాలే వర్తిస్తాయి. కానీ, పరలోకంలో మాత్రం వారి కపటవిశ్వాసం మరియు అవిశ్వాసం యొక్క ప్రతిఫలం ఇవ్వబడుతుంది. మరియు వారు వారి మార్గభ్రష్టత్వంలో, తిరస్కారవైఖరిలో చాలా దూరం చేరుకోవాలనే ఉద్దేశ్యంతో వారికి ఇంకా గడువు ఇవ్వబడుతుంది. చివరకు వారు ఆందోళన చెందుతూ, బిత్తరపోయి మిగిలిపోతారు.
Tafsyrai arabų kalba:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ اشْتَرَوُا الضَّلٰلَةَ بِالْهُدٰی ۪— فَمَا رَبِحَتْ تِّجَارَتُهُمْ وَمَا كَانُوْا مُهْتَدِیْنَ ۟
వారందరే అవివేకులు, ఎందుకంటే వారు విశ్వాసాన్ని అవిశ్వాసంతో మార్పిడి చేసుకున్నారు. వారి ఈ వర్తకం ఎంత మాత్రం లాభదాయకం కాదు. ఎందుకంటే వారు అల్లాహ్ పట్ల గల తమ విశ్వాసాన్ని కోల్పొయారు. మరియు వారు సత్యం వైపునకు మార్గదర్శకత్వాన్నీ కూడా పొందలేకపోయారు (సన్మార్గాన్నీ నోచుకోలేకపోయారు).
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• أن من طبع الله على قلوبهم بسبب عنادهم وتكذيبهم لا تنفع معهم الآيات وإن عظمت.
తమ అహంకార వైఖరి, మరియు అసత్య వాదనల కారణంగా, అల్లాహ్ ఎవరి హృదయాలపై నైతే ముద్ర వేస్తాడో, అటువంటి వారికి ఏ వాక్యాలూ ప్రయోజనం కలిగించవు, అవి ఎంత గొప్ప వాక్యాలైనా సరే.

• أن إمهال الله تعالى للظالمين المكذبين لم يكن عن غفلة أو عجز عنهم، بل ليزدادوا إثمًا، فتكون عقوبتهم أعظم.
అల్లాహ్ దుర్మార్గులకు, సత్యతిరస్కారులకు గడువును ఇచ్చినది వారి పట్ల అలక్ష్యము వహించి కాదు, లేక వారి పట్ల అశక్తుడై కాదు. వారికి ఇవ్వబడిన గడువు వారి పాపం పండటానికి తద్వారా వారికి ఘోరమైన శిక్షను విధించటానికి.

مَثَلُهُمْ كَمَثَلِ الَّذِی اسْتَوْقَدَ نَارًا ۚ— فَلَمَّاۤ اَضَآءَتْ مَا حَوْلَهٗ ذَهَبَ اللّٰهُ بِنُوْرِهِمْ وَتَرَكَهُمْ فِیْ ظُلُمٰتٍ لَّا یُبْصِرُوْنَ ۟
అల్లాహ్ ఈ కపట విశ్వాసుల గురించి రెండు ఉపమానాలు ఇచ్చాడు. ఒకటి అగ్నికి సంబంధిచిన ఉపమానమైతే, మరొకటి నీటికి చెందిన ఉపమానం. వారికి చెందిన అగ్ని ఉపమానం ఎలా ఉందంటే, ఒకడు అగ్నిని రాజేశాడు (పరిసరాలను) ప్రకాశవంతం చేయడానికి. ఎపుడైతే దాని వెలుగు (పరిసరాలను) ప్రకాశవంతం చేసిందో, దానినుండి ప్రయోజనం పొందాలని తలపోసాడు. ఇంతలోనే దాని వెలుతురు పోయింది. (పరిసరాలనుండి) ప్రకాశం పోయింది. నిప్పు మిగిలి పోయింది. దానిని రాజేసినవారు ఏమీ చూడలేకపోయారు; మార్గం కనిపించని అంధకారంలో మిగిలి పోయారు.
Tafsyrai arabų kalba:
صُمٌّۢ بُكْمٌ عُمْیٌ فَهُمْ لَا یَرْجِعُوْنَ ۟ۙ
వారు సత్యాన్ని స్వీకరించే ఉద్ధేశంతో వినలేని చెవిటివారు. వారు దాన్ని పలకలేని మూగవారు; వారు దాన్ని చూడలేని గ్రుడ్డివారు.అయితే వారు తమ మార్గ భ్రష్ఠత్వము నుండి మరలిరారు.
Tafsyrai arabų kalba:
اَوْ كَصَیِّبٍ مِّنَ السَّمَآءِ فِیْهِ ظُلُمٰتٌ وَّرَعْدٌ وَّبَرْقٌ ۚ— یَجْعَلُوْنَ اَصَابِعَهُمْ فِیْۤ اٰذَانِهِمْ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ؕ— وَاللّٰهُ مُحِیْطٌ بِالْكٰفِرِیْنَ ۟
అయితే వారికి (మునాఫిఖులకు) సంబంధించిన నీటి ఉపమానం చిమ్మచీకటిని క్రమ్ము కొని ఉన్న మేఘాలు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాన్ని పోలి ఉన్నది. అది ఒక జాతిపై కురవగా వారు తీవ్రమైన భయాందోళనకు గురైయ్యారు. కనుక వారు ఆ శబ్ధాలకు మ్రుత్యు భయంతో తమ వ్రేళ్లతో తమ చెవులను మూసుకోసాగారు.మరియు అల్లాహ్ సత్యతిరస్కారులను (అన్ని వైపుల నుండి) ఆవరించి ఉన్నాడు. (కనుక) వారు ఆయనను అశక్తుడిగా చేయలేరు.
Tafsyrai arabų kalba:
یَكَادُ الْبَرْقُ یَخْطَفُ اَبْصَارَهُمْ ؕ— كُلَّمَاۤ اَضَآءَ لَهُمْ مَّشَوْا فِیْهِ ۙۗ— وَاِذَاۤ اَظْلَمَ عَلَیْهِمْ قَامُوْا ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَاَبْصَارِهِمْ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠
పిడుగు తన తీవ్రమైన మెరుపు,కాంతిలతో వారి చూపులను తీసుకుపోవుటకు సమీపమవుతున్నది.ఉరుము వారి కొరకు మెరిసి,కాంతినిచ్చినప్పుడల్లా ముందడుగు వేస్తున్నారు,అది కాంతినివ్వనప్పుడు అంధకారంలోనే మిగిలిపోతున్నారు. అప్పుడు వారు కదలలేకపోతున్నారు . ఒకవేళ అల్లాహే అనుకుంటే వారి సత్యతిరస్కరణ కారణంగా ఏదైనాచేయగల తన సంపూర్ణ సామర్ధ్యంతో వారి వినికిడిని, చూపునూ పోగోట్టేవాడు. అవి ఎన్నటీకీ వారివైపు తిరిగి రాగలిగేవికావు. కాబట్టి (ఇందులో ప్రస్తావించబడిన) వర్షపు ఉపమానం దివ్యఖుర్ఆన్ ను పోలినది. మరియు ఉరుముల శబ్ధాలు ఈ గ్రంధంలో ప్రస్తావించబడిన హెచ్చరికలను పోలినవి. మరియు మెరుపుల వెలుతురు యొక్క ఉపమానం అప్పుడప్పుడు వారి ముందు ప్రస్తుటమవుతున్న సత్యమును పోలినది. వారు ఉరుముల శబ్ధాలకు తమ చెవులను మూసుకోవటం యొక్క ఉపమానం సత్యం పట్ల వారి విముఖత చూపటం మరియు స్వీకరించకపోవటం వంటిది. కపటులకు ఈ రెండు ఉపమాల వారి మధ్య పోలిక ప్రయోజనం పొందకపోవటమే.నిప్పుకు సంబంధించిన ఉపమానంలో నిప్పును రాజేసేవాడు చీకటి,కాల్చటం తప్ప ఏ విధమైన ప్రయోజనం చెందలేకపోయడు. మరియు నీటి ఉపమానంలో వర్షం కురిపింప జేయబడిన వారు ఉరుముల మెరుపుల వలన భయం మరియు ఆందోళనను తప్ప మరే ప్రయోజనాన్ని పోందలేకపోయారు. ఈ విధంగా కపటవిశ్వాసులు ఇస్లాంలో కఠినత్వాన్ని, మరియు కష్టతరాన్ని తప్ప మరేమీ చూడలేక పోతున్నారు.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا النَّاسُ اعْبُدُوْا رَبَّكُمُ الَّذِیْ خَلَقَكُمْ وَالَّذِیْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟ۙ
ఓ మానవులారా మీరు మీప్రభువును మాత్రమే ఆరాధించండి. ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి ఎందుకంటే ఆయనే మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారినీ పుట్టించాడు. ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా మిమ్మల్ని మీరు దైవశిక్ష నుంచి రక్షించుకునే ఆశ ఉంది.
Tafsyrai arabų kalba:
الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ فِرَاشًا وَّالسَّمَآءَ بِنَآءً ۪— وَّاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ ۚ— فَلَا تَجْعَلُوْا لِلّٰهِ اَنْدَادًا وَّاَنْتُمْ تَعْلَمُوْنَ ۟
ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా, నివాసయోగ్యంగా చేశాడు. మరియు దానిపై ఆకాశాన్ని దృఢమైన కప్పుగా చేశాడు. మరియు కరుణతో వర్షాన్ని కురింపించి తద్వారా భూమినుండి రకరకాల పంటలూ, పండ్లూ, ఫలాలూ పండేలా చేసి మీకు జీవనోపాధిగా చేశాడు. కావున మీరు అల్లాహ్ తప్ప మరొక సృష్టికర్త లేడన్న విషయాన్ని తెలిసికూడా అల్లాహ్ కు పోలికలను, భాగస్వాములను కల్పించకండి.
Tafsyrai arabų kalba:
وَاِنْ كُنْتُمْ فِیْ رَیْبٍ مِّمَّا نَزَّلْنَا عَلٰی عَبْدِنَا فَاْتُوْا بِسُوْرَةٍ مِّنْ مِّثْلِهٖ ۪— وَادْعُوْا شُهَدَآءَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మరియు ఒక వేళ మీరు – ఓ మానవులారా - మాదాసుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింప జేయబడిన ఖుర్ఆన్ (దైవ గ్రంధం అన్న) విషయంలో మీకు సందేహం ఉంటే; మేము చాలేంజ్ చేస్తున్నాము; దానిని పోలిన ఒక్క సూరహ్ లేక దాని కంటే చిన్నసూరహ్ నైనా తయారు చేసుకుని వచ్చి దానిని వ్యతిరేకించండి. మరియు మీ వాదనలో మీరు సత్యవంతులు అయితే మీ సహాయకులలో మీకు వీలైనంత మందిని కూడా పిలుచుకోండి.
Tafsyrai arabų kalba:
فَاِنْ لَّمْ تَفْعَلُوْا وَلَنْ تَفْعَلُوْا فَاتَّقُوا النَّارَ الَّتِیْ وَقُوْدُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖۚ— اُعِدَّتْ لِلْكٰفِرِیْنَ ۟
కానీ, ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - వాస్తవానికి అలా మీరు ఎన్నటికీ చేయలేరు – కాబట్టి ఆ అగ్నికి భయపడండి; ఎదైతే (దైవ తిరస్కారణ కారణంగా) దైవశిక్షకు అర్హులైన మానవులూ, మరియు వారు ఆరాధించిన రకరకాల శిలలతో (వాటిని అందులో వేసి) ప్రజ్వలింప జేయబడుతుందో; ఆ నరకాగ్నికి భయపడండి. (ఎందుకంటే) అల్లాహ్ ఈ నరకాగ్నిని దైవతిరస్కారుల కోసం తయారుచేసి ఉన్నాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• أن الله تعالى يخذل المنافقين في أشد أحوالهم حاجة وأكثرها شدة؛ جزاء نفاقهم وإعراضهم عن الهدى.
నిశ్చయంగా అల్లాహ్ కపట విశ్వాసులను – వారి కపటత్వానికి ప్రతిఫలంగా, మరియు ఋజుమార్గం పట్ల వారి విముఖతకు బదులుగా – వారి క్లిష్టతర విషయాలలో వారిని భంగపాటుకు గురిచేస్తాడు.

• من أعظم الأدلة على وجوب إفراد الله بالعبادة أنه تعالى هو الذي خلق لنا ما في الكون وجعله مسخَّرًا لنا.
ఆరాధనలలో ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట విధి అనుటకు గొప్ప రుజువులలో ఒకటి - ఆయనే ఈ సర్వ సృష్ఠిలో ఉన్నదానినంతా సృష్ఠించాడు మరియు దానిని మన కొరకు ఉపయుక్తంగా మలచాడు.

• عجز الخلق عن الإتيان بمثل سورة من القرآن الكريم يدل على أنه تنزيل من حكيم عليم.
ఖుర్ఆన్ గ్రంధాన్ని పోలినటువంటి ఒక్క సూరహ్ నైనా రచించ లేకపోయిన సృష్టి యొక్క అసమర్ధత ఈ గ్రంధం మహావివేకి మరియు సర్వజ్నుడైన అల్లాహ్ చే అవతరింప జేయబడినదని రుజువు చేస్తున్నది.

وَبَشِّرِ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ— كُلَّمَا رُزِقُوْا مِنْهَا مِنْ ثَمَرَةٍ رِّزْقًا ۙ— قَالُوْا هٰذَا الَّذِیْ رُزِقْنَا مِنْ قَبْلُ وَاُتُوْا بِهٖ مُتَشَابِهًا ؕ— وَلَهُمْ فِیْهَاۤ اَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَّهُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
క్రితం చేయబడిన హెచ్చరికలు అవిశ్వాసుల కొరకు కాగా, ఓ ప్రవక్తా! అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యాలు చేసే విశ్వాసులకు, క్రింద సెలయేళ్ళు పారుతూ ఉండే (అద్భుతమైన) భవనాల, (అందమైన) వృక్షాలతో కూడిన స్వర్గవనాల శుభవార్త వినిపించు. వారికి ఆహారంగా తినడానికి స్వర్గవనాల ఫలాలను ఇచ్చినపుడు; భూమి పైని ఫలాలతో వాటి ప్రబలమైన పోలిక కారణంగా; వారు ఇలా అంటారు “ఇవి మేము ఇంతకు ముందు తిన్న ఫలాలను పోలి ఉన్నాయి”.(ఎందుకంటే) అవే పేర్లు, అవే రూపాలు కలిగిన ఫలాలు వారికి ఇవ్వబడ్డాయి కనుక. తమకు తెలిసినవే (తాము చూసినవే) కనుక వారు (సంకోచం లేకుండా) స్వీకరిస్తారని. కానీ అవి రుచిలో భిన్నంగా ఉంటాయి. ఇంకా వారి కొరకు సౌందర్యవతులైన, చురుకైన సహచరులు (Partners) ఉంటారు. వారు (ఆ సహచరులు), మనసుకు తట్టే అన్నీ రకాల అశుధ్ధతలనుండి, పరిశుద్దులై ఉంటారు. మరియు వారు (విశ్వాసులు) అంతము అనేదే లేని (ఏ నిర్వచనానికీ అందని) సౌఖ్యం లో ఉంటారు - (ఎప్పుడో ఒకప్పుడు) తెగిపోయి, ముగిసిపోయే ఇహలోకపు సౌఖ్యాలకు భిన్నంగా.
Tafsyrai arabų kalba:
اِنَّ اللّٰهَ لَا یَسْتَحْیٖۤ اَنْ یَّضْرِبَ مَثَلًا مَّا بَعُوْضَةً فَمَا فَوْقَهَا ؕ— فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا فَیَعْلَمُوْنَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّهِمْ ۚ— وَاَمَّا الَّذِیْنَ كَفَرُوْا فَیَقُوْلُوْنَ مَاذَاۤ اَرَادَ اللّٰهُ بِهٰذَا مَثَلًا ۘ— یُضِلُّ بِهٖ كَثِیْرًا وَّیَهْدِیْ بِهٖ كَثِیْرًا ؕ— وَمَا یُضِلُّ بِهٖۤ اِلَّا الْفٰسِقِیْنَ ۟ۙ
నిస్సందేహంగా అల్లాహ్ తానుకోరిన ఉపమానాలను (మనసుకు తాకేలా) ఉపయోగించడానికి సిగ్గుపడడు. కనుక దోమ ఉపమానమైనా, లేక దానికంటే పెద్ద వాటిలో పెద్ద దానినైనా సరే, లేక దానికంటే చిన్న వాటిలో చిన్న దానినైనా సరే. ప్రజలు రెండు రకాలు; 1. విశ్వాసులు, 2. అవిశ్వాసులు. ఈ విషయంలో విశ్వాసులు (ఉపమానంలోని) సత్యాన్ని ధృవీకరిస్తారు, ఉపమానాన్ని తెలియజేయడం వెనుక దైవ పరమార్ధం ఉందన్న విషయాన్ని గ్రహిస్తారు. కాగా అవిశ్వాసులు “అల్లాహ్ దోమ, ఈగ మరియు సాలీడు పురుగు లాంటి అల్పమైన జీవుల ఉదాహరణ ఇవ్వడం ఏమిటీ?” అని పరిహాసమాడుతారు. దానికి జవాబు అల్లాహ్ నుండి వస్తున్నది “నిస్సందేహంగా ఈ ఉపమానాలలో ప్రజల కొరకు కొన్ని సూచనలు మరియు పరమార్ధాలు మరియు ప్రజలకు పరీక్షలున్నాయి. అల్లాహ్ వారిలో కొందరిని (వారి అహంకారం కారణంగా) ఈ ఉదాహరణలతో అపమార్గానికి లోను చేస్తాడు. ఇలాంటివారు అనేకులు. మరి కొందరిని హితబోధ గ్రహించటం కారణంగా సన్మార్మాన్ని ప్రసాధిస్తాడు. మరియు ఇలాంటి వారు కూడా అనేకులు. మరియు అల్లాహ్ కేవలం అపమార్గానికి అర్హులైన వారిని తప్ప మరెవ్వరినీ అపమార్గానికి లోను చెయ్యడు. వారు తమ అవిధేయత కారణంగా బహిష్కరించ బడినవారు ఉదాహరణకు కపటవిశ్వాసులు”.
Tafsyrai arabų kalba:
الَّذِیْنَ یَنْقُضُوْنَ عَهْدَ اللّٰهِ مِنْ بَعْدِ مِیْثَاقِهٖ ۪— وَیَقْطَعُوْنَ مَاۤ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ یُّوْصَلَ وَیُفْسِدُوْنَ فِی الْاَرْضِ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟
ఎవరైతే అల్లాహ్ యొక్క ఒప్పందాన్ని తెంచివేస్తారో. ఏదైతే వారు కేవలం ఆయనను మాత్రమే ఆరాధిస్తారని మరియు ఆ ప్రవక్తకు విధేయత చూపుతామని ఒప్పందం చేశారో ఏ ప్రవక్త గురించైతే ఆయనకు ముందు పంపబడిన వారు తెలియజేశారో. ఇటువంటి వారు తమ ఒప్పందాన్ని తిరస్కరించి అల్లాహ్ ఆదేశించిన ఆజ్ఞలను మరియు అల్లాహ్ కలిపి ఉంచమని చెప్పిన బంధుత్వాలను త్రెంచివేస్తున్న గుణం కలిగి ఉన్నారు. మరియు వీరు తమ అవిధేయతతో భువిలో కల్లోలాన్ని వ్యాపింపజేస్తున్నారు. వీరే తమ ఇహపరలోకాల యొక్క వ్యవహారాలలో నిర్లక్ష్యం వహిస్తున్నవారు.
Tafsyrai arabų kalba:
كَیْفَ تَكْفُرُوْنَ بِاللّٰهِ وَكُنْتُمْ اَمْوَاتًا فَاَحْیَاكُمْ ۚ— ثُمَّ یُمِیْتُكُمْ ثُمَّ یُحْیِیْكُمْ ثُمَّ اِلَیْهِ تُرْجَعُوْنَ ۟
నిస్సందేహంగా ఓ సత్యతిరస్కారులారా, మీ వైఖరి బహు విచిత్రమైనది. మీరు మీలోనే అల్లాహ్ యొక్క శక్తిసామర్ధ్యాల నిదర్శనాలను చూస్తున్నప్పటికీ ఆయనను ఎలా తిరస్కరించగలరు.వాస్తవానికి క్రితంలో మీరు ఏమీ కానప్పుడు ఆయన మీకు ఉనికిని కలిగించాడు మరియు మీకు జీవితాన్ని ప్రసాదించాడు తిరిగి రెండోసారి మీకు మరణాన్ని ప్రసాదించేవాడు ఆయనే మళ్లీ మీకు రెండో జీవితం కలిగిస్తాడు తర్వాత మీరు ముందు పంపుకున్న కర్మల యొక్క లెక్క తీసుకోవటానికి ఆయనవైపే మరలుతారు.
Tafsyrai arabų kalba:
هُوَ الَّذِیْ خَلَقَ لَكُمْ مَّا فِی الْاَرْضِ جَمِیْعًا ۗ— ثُمَّ اسْتَوٰۤی اِلَی السَّمَآءِ فَسَوّٰىهُنَّ سَبْعَ سَمٰوٰتٍ ؕ— وَهُوَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟۠
మరియు అల్లాహ్ అధ్వితీయుడు ఎవరైతే మీకు ప్రపంచంలో ఉన్న సమస్త నదులను, చెట్లను మరియు లెక్కించలేనన్ని సమస్తాన్ని సృష్టించాడు మీరు వాటి ద్వారా ప్రయోజనాన్ని పోందుతున్నారు మరియు మీకు ఉపయుక్తంగా చేసిన వాటిని వినియోగపరుచుకుంటున్నారు. ఆయన ఆకాశాన్ని సృష్టించటానికి పూనుకుని దానిని ఏడు సమానమైన ఆకాశాలుగా సృష్టించాడు మరియు ఆయన జ్ఞానము ప్రతీ వస్తువును పర్యవేష్టించియున్నది.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• من كمال النعيم في الجنة أن ملذاتها لا يكدرها أي نوع من التنغيص، ولا يخالطها أي أذى.
స్వర్గము యొక్క అనుగ్రహాల పరిపూర్ణత (ఎటువంటిదంటే) వాటి రుచి (ఎంత ఆస్వాధించినప్పటికీ) విరక్తిని కలిగించదు.మరియు వాటి సమ్మేళననము ఏవిధమైన ఇబ్బందిని కలిగించదు.

• الأمثال التي يضربها الله تعالى لا ينتفع بها إلا المؤمنون؛ لأنهم هم الذين يريدون الهداية بصدق، ويطلبونها بحق.
అల్లాహ్ ఉపదేశించిన ఉదాహరణలు వాస్తవానికి విస్వాసులకు తప్ప మరెవరికీ ప్రయోజనాన్ని కలిగించవు ఎందుకంటే యధార్దానికి వారే సచ్చీలతతో మార్గదర్శకాన్ని కోరేవారు.మరియు దానిని నిజంగా అన్వేషించేవారు.

• من أبرز صفات الفاسقين نقضُ عهودهم مع الله ومع الخلق، وقطعُهُم لما أمر الله بوصله، وسعيُهُم بالفساد في الأرض.
అవిధేయుల యొక్క బహిర్గత లక్షణం ఏమనగా అల్లాహ్ తో మరియు సృష్టిరాశులతో చేసిన ఒప్పందాలను ఉల్లఘించటం.అల్లాహ్ కలిపి ఉంచమని ఆదేశించిన బంధుత్వాలను తెంచివేయటం.మరియు భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేయటానికి ప్రయత్నించటం.

• الأصل في الأشياء الإباحة والطهارة؛ لأن الله تعالى امتنَّ على عباده بأن خلق لهم كل ما في الأرض.
వాస్తవానికి వుస్తువులన్నింటిలో పరిశుధత మరియు ధర్మసమ్మతమే మూలసిధ్దాంతం.ఎందుకనగా దైవం భూమిలోని సమస్త వస్తువులను దాసుల ప్రయోజనం కొరకే సృష్టించి ఉపకారం చేశాడు.

وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ جَاعِلٌ فِی الْاَرْضِ خَلِیْفَةً ؕ— قَالُوْۤا اَتَجْعَلُ فِیْهَا مَنْ یُّفْسِدُ فِیْهَا وَیَسْفِكُ الدِّمَآءَ ۚ— وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ؕ— قَالَ اِنِّیْۤ اَعْلَمُ مَا لَا تَعْلَمُوْنَ ۟
అల్లాహ్ సుబ్హానహు వతఆలా తాను దైవదూతలతో మాట్లాడిన సన్నివేశాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు:నిస్సందేహంగా ఆయన భువిలో ఒకరికొకరు ప్రాతినిధ్యం వహించుచు దైవవిధేయతను (ధర్మాన్ని) స్ధాపించేందుకు మానవుణ్ని సృష్టించబోతున్నాను.అని అన్నాడు అప్పుడు దైవదూతలు విశ్లేషణ మరియు మార్గదర్శకాన్ని పొందే ఉద్దేశ్యంతో మానవుణ్ని భూమిపై ప్రతినిధిగా పంపటం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు.వారు అందులో కల్లోలాన్ని వ్యాపింపజేస్తారు మరియు దౌర్జన్యంతో నెత్తురును చిందిస్తారు(అని అభ్యర్ధించారు) మరియు మేము నీ విధేయతకు కట్టుబడి ఉండేవాళ్లం నీ పవిత్రతను కొనియాడేవాళ్లం,నీ ఘనతను చాటేవాళ్లము.మరియు వీటి నంచి అలసిపోయే వాళ్లము కాదు కదా అని అన్నారు.అప్పుడు అల్లాహ్ వారి ప్రశ్నకు సమాధానంగా:నిస్సందేహంగా మానవుని సృష్టి వెనుక మీకు తెలియని పరమార్ధాన్ని మరియు వారి ప్రాతినిధ్యం యొక్క లక్ష్యాన్ని నేను తెలిసినవాడను.
Tafsyrai arabų kalba:
وَعَلَّمَ اٰدَمَ الْاَسْمَآءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَی الْمَلٰٓىِٕكَةِ فَقَالَ اَنْۢبِـُٔوْنِیْ بِاَسْمَآءِ هٰۤؤُلَآءِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మరియు ఆదం(అలైహిస్సలాం) యొక్క ఘనతను తెలియజేయటానికి అల్లాహ్ సమస్త జంతువుల మరియు సమస్త వస్తువుల,పదార్ధాల పేర్లను,వాటి అర్ధాలను నేర్పించాడు. తరువాత వాటిని దైవదూతల ముందు ప్రదర్శించి:ఒక వేళ మీరు ఈ (మానవ) సృష్టి కన్నా ఉత్తములన్న మీ ప్రతిపాదనలో సత్యవంతులైతే వీటి పేర్లను తెలపండి అని అన్నాడు.
Tafsyrai arabų kalba:
قَالُوْا سُبْحٰنَكَ لَا عِلْمَ لَنَاۤ اِلَّا مَا عَلَّمْتَنَا ؕ— اِنَّكَ اَنْتَ الْعَلِیْمُ الْحَكِیْمُ ۟
వారు తమ లోపాన్ని అంగీకరిస్తూ అల్లాహ్ వైపు ఆయన ఘనతను కొనియాడుతూ ఇలా అన్నారు: ఓ మా ప్రభువా మేము నీ ఆదేశానికి మరియు సంవిధానానికి అభ్యంతరాన్ని తెలియజేసిన దాని నుంచి నీ పవిత్రతను కొనియాడుతున్నాము.నీవు మాకు ప్రసాదించిన జ్ఞానం తప్ప మాకు ఏదియు తెలియదు.నిస్సందేహంగా నీవు సర్వజ్ఞానివి నీ నుంచి ఏది అగోచరము కాదు.నీవు మహావివేకివి సమస్త వ్యవహారాలను నీ సంవిధానం మరియు నీ శక్తి సామర్ధ్యాలతో తగిన స్థానంలో ఉంచగలవాడవు.
Tafsyrai arabų kalba:
قَالَ یٰۤاٰدَمُ اَنْۢبِئْهُمْ بِاَسْمَآىِٕهِمْ ۚ— فَلَمَّاۤ اَنْۢبَاَهُمْ بِاَسْمَآىِٕهِمْ ۙ— قَالَ اَلَمْ اَقُلْ لَّكُمْ اِنِّیْۤ اَعْلَمُ غَیْبَ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۙ— وَاَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا كُنْتُمْ تَكْتُمُوْنَ ۟
అప్పుడు అల్లాహ్ ఆదం(అలైహిస్సలాం)ను నీవు ఈ వస్తువుల పేర్లను తెలియజేయమని ఆదేశించాడు.మరి ఎప్పుడైతే తన ప్రభువు నేర్పినవాటిని అతను తెలియజేశాడో అప్పుడు అల్లాహ్ దైవదూతలతో ఇలా అన్నాడు: నేను భూమ్యాకాశాలలో అగోచరమైన వాటన్నింటినీ తెలిసినవాడను అని మీకు చెప్పలేదా?మరియు మీరు దాచి ఉంచే వాటిని మీరు బహిర్గతం చేసే వాటిని కూడి తెలిసినవాడను.
Tafsyrai arabų kalba:
وَاِذْ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اَبٰی وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِیْنَ ۟
అల్లాహ్ ఆదం (అలైహిస్సలాం) కు మర్యాదపూర్వకమైన గౌరవసాష్టాంగాన్ని చేయమని దైవదూతలను ఆదేశించిన సన్నివేశాన్ని వివరించాడు.అప్పుడు వారందరూ సాష్టాంగము చేశారు.కానీ ఒక్క ఇబ్లీసు తప్ప అతడు జిన్నాతులలో ఒకడు.అతడు అల్లాహ్ యొక్క ఆదేశానికి అభ్యంతరాన్ని తెలుపుతూ సాష్టాంగపడటానికి నిరాకరించాడు మరియు ఆదం(అలైహిస్సలాం) పట్ల గర్వాన్ని ప్రదర్శించాడు.కనుక అతను (ఇలా) అల్లాహ్ ను తిరస్కరించినవారిలో చేరాడు.
Tafsyrai arabų kalba:
وَقُلْنَا یٰۤاٰدَمُ اسْكُنْ اَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَیْثُ شِئْتُمَا ۪— وَلَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِیْنَ ۟
మరియు మేము ఆదముతో ఇలా అన్నాము: ఓ ఆదం నీవు నీ భార్య స్వర్గంలో నివసించండి మరియు మీరిరువురూ స్వర్గం యొక్క ఏ ప్రదేశం యొక్క ఫలాలను యథేచ్ఛగా తినండి.వాటిని ఆస్వాధించటంలో మీకు ఏవిధమైన విరక్తి కలుగదు.కానీ నేను మీకు నిషేధించిన ఈ చెట్టు నుంచి తినే ఉద్దేశ్యంతో దానికి దరిదాపులకు కూడా పోకండి అలా చేస్తే మీరిద్దరూ మీకు ఆజ్ఞాపించిన దానికి అవిధేయులై దుర్మార్గులలో చేరిన వారవుతారు.
Tafsyrai arabų kalba:
فَاَزَلَّهُمَا الشَّیْطٰنُ عَنْهَا فَاَخْرَجَهُمَا مِمَّا كَانَا فِیْهِ ۪— وَقُلْنَا اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ— وَلَكُمْ فِی الْاَرْضِ مُسْتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰی حِیْنٍ ۟
షైతాన్ వారిరువురిని పెడత్రోవ పట్టించడానికి (వారి మనసులలో) ప్రేరేపిస్తూ మరియు(నిషేధించిన చెట్టువైపు) ఆకర్షిస్తూ ఉన్నాడు. చివరికి వారికి నిషేధించిన చెట్టు నుంచి తినే పొరపాటుకు మరియు నేరానికి లోను చేశాడు.కనుక అల్లాహ్ వారికి ఫలితంగా వారు నివసిస్తున్న స్వర్గం నుంచి బహిష్కరించాడు.మరియు అల్లాహ్ వారితో మరియు షైతానుతో ఇలా అన్నాడు: మీరంతా భూలోకానికి దిగిపోండి మీరు ఒండొకరిపట్ల విరోధులు మరియు మీ కొరకు భూమిపై ఒక నిర్ణీత సమయం నివసించటం నిర్ధారించబడింది. దానిలోని మంచివాటితో లబ్ది పొందుతూ మీ చివరి ఘడియ వరకు ప్రళయం సంభవించే వరకు అక్కడే గడప వలసి ఉంటుంది.
Tafsyrai arabų kalba:
فَتَلَقّٰۤی اٰدَمُ مِنْ رَّبِّهٖ كَلِمٰتٍ فَتَابَ عَلَیْهِ ؕ— اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِیْمُ ۟
ఆదమ్ ('అ.స.)అల్లాహ్ నుంచి పొందిన మాటల ద్వారా ప్రార్ధించవలసినదిగా సూచించబడ్డారు.అవి అల్లాహ్ తెలిపిన ఈ వాక్యాలలో ఉన్నాయి:అప్పుడు వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు ఓ మా ప్రభువా మాకు మేమే అన్యాయం చేసుకున్నాము మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే మరియు క్షమించకపోతే నిశ్చయంగా మేము నష్టపోయే వారమౌవుతాము.(7ఆరాఫ్:23) కనుక అల్లాహ్ వారి క్షమాపణను స్వీకరించాడు మరియు ఆయన అమితంగా క్షమించేవాడు మరియు తన దాసులను అనన్యంగా కనికరించేవాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• الواجب على المؤمن إذا خفيت عليه حكمة الله في بعض خلقه وأَمْرِهِ أن يسلِّم لله في خلقه وأَمْرِهِ.
ఒక విశ్వాసిపై అల్లాహ్ యొక్క సృష్టితాల మరియు ఆదేశాల పరమార్ధం తెలియనప్పుడు వాటి సృష్టిని మరియు ఆదేశాలను శిరసావహించటం తప్పనిసరి.

• رَفَعَ القرآن الكريم منزلة العلم، وجعله سببًا للتفضيل بين الخلق.
దివ్యఖుర్ఆన్ జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని పెంచింది.మరియు జ్ఞానాన్ని సృష్టిరాశులలో గౌరవ ప్రతిష్టతలకు కొలమానంగా పరిగణించింది.

• الكِبْرُ هو رأس المعاصي، وأساس كل بلاء ينزل بالخلق، وهو أول معصية عُصِيَ الله بها.
గర్వమే ప్రతి అవిధేయతకు మూలం మరియు సృష్టిరాశులపై అవతరించే ప్రతి ఆపదకు మూలకారకం మరియు ఇదే అల్లాహ్ విషయంలో అవిధేయతకు పాల్పడిన మొట్టమొదటి నేరం.

قُلْنَا اهْبِطُوْا مِنْهَا جَمِیْعًا ۚ— فَاِمَّا یَاْتِیَنَّكُمْ مِّنِّیْ هُدًی فَمَنْ تَبِعَ هُدَایَ فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
మేము వారితో ఇలా అన్నాము మీరంతా స్వర్గం నుండి భువికి దిగిపోండి ఒక వేళ మీ వద్దకు నా ప్రవక్తల నుంచి మార్గదర్శకం వస్తే దానిని అనుసరించి నాప్రవక్తలను విశ్వసంచిన వారికి పరలోకం విషయంలో భయం ఉండదు.మరియు వారు తాము కోల్పోయిన వాటి పట్ల దుఖించరు.
Tafsyrai arabų kalba:
وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟۠
కానీ ఎవరైతే తిరస్కరిస్తారో మరియు నా వాక్యాలను ధిక్కరిస్తారో వారే శాశ్వతంగా నరకంలో పడి ఉంటారు. ఎన్నటికీ వారు దాని నుండి బయటకు రాలేరు.
Tafsyrai arabų kalba:
یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اذْكُرُوْا نِعْمَتِیَ الَّتِیْۤ اَنْعَمْتُ عَلَیْكُمْ وَاَوْفُوْا بِعَهْدِیْۤ اُوْفِ بِعَهْدِكُمْ ۚ— وَاِیَّایَ فَارْهَبُوْنِ ۟
ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన యాఖూబ్ సంతానమా అల్లాహ్ మీకు వరుసగా ఒకదాని తరువాత మరొకటి అవతరింపజేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి మీరు నాపై మరియు నా ప్రవక్తలపై విశ్వాసము కలిగి నా ధర్మాన్ని ఆచరించి నా వైపు మీరు చేసిన ఒప్పందానికి కట్టుబడి ఉండండి. ఒక వేళ మీరు నా ఒప్పందాన్ని నెరవేరుస్తే నేను మీకు వాగ్ధానం చేసన విధంగా ఇహలోకంలో మంచి జీవితాన్ని మరియు తీర్పుదినము నాడు ఉత్తమమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను.కనుక మీరు నాకు మాత్రమే భయపడండి మరియు నా ఒప్పందాన్ని ఉల్లంఘించకండి.
Tafsyrai arabų kalba:
وَاٰمِنُوْا بِمَاۤ اَنْزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُوْنُوْۤا اَوَّلَ كَافِرٍ بِهٖ ۪— وَلَا تَشْتَرُوْا بِاٰیٰتِیْ ثَمَنًا قَلِیْلًا ؗ— وَّاِیَّایَ فَاتَّقُوْنِ ۟
మరియు ఏ గ్రంధాన్నైతే నేను ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేసానో దానిని దాని కంటే ముందు అప్పటికింకా మార్పుకు గురికాని తౌరాత్ గ్రంధంలో ప్రస్థావించబడిన అల్లాహ్ యొక్క ఏకదైవారాధనను మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి దైవదౌత్యాన్ని ధ్రువీకరిస్తూ (ఖుర్ఆన్ ను) విశ్వసించండి.మరియు మీరు వీటిని తిరస్కరించు వారిలో మొదటి వర్గం కాకుండా జాగ్రత్త పడండి.మరియు నేను అవతరింపజేసిన నా వాక్యాలను కొద్దిపాటి వెలకు,పలుకుబడికి, నాయకత్వానికి (ఆశపడి) వాటిని మార్చివేయకండి.మరియు నా ఆగ్రహం, నా శిక్షల పట్ల భయంకలిగి ఉండండి.
Tafsyrai arabų kalba:
وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَاَنْتُمْ تَعْلَمُوْنَ ۟
మరియు మీరు అబద్దాలను కల్పించి నేను నాప్రవక్తపై అవతరింపజేసిన సత్యాన్ని కలగాపులగం చేయకండి.మరియు మీ గ్రంధాలలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి ప్రస్తావించబడిన ఆయన గుణాలను మీకు తెలిసినప్పటికీ మీరు నమ్మికూడా వాటిని దాచిపెట్టకండి.
Tafsyrai arabų kalba:
وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَارْكَعُوْا مَعَ الرّٰكِعِیْنَ ۟
మరియు నమాజును దాని విధులు,మరియు సున్నతులు, మరియు మౌలికాంశాలతో సహా పరిపూర్ణంగా నెరవేర్చండి.మరియు అల్లాహ్ మీ చేతులలో మీకనుగ్రహించిన ధనం నుంచి విధిదానాన్ని(జకాత్) చెల్లించండి.మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సమాజంలోని భయభక్తులు కలవారితో కలసి భక్తిపరులుగా వ్యవహరించండి.
Tafsyrai arabų kalba:
اَتَاْمُرُوْنَ النَّاسَ بِالْبِرِّ وَتَنْسَوْنَ اَنْفُسَكُمْ وَاَنْتُمْ تَتْلُوْنَ الْكِتٰبَ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
(ఇది) ఎంతటి ఘోరం:మీరు పరులకు విశ్వాసం మరియు సత్కర్మల గురించి బోధిస్తున్నారు కానీ స్వయంగా మీరు మరచిపోయి వాటిని ధిక్కరిస్తున్నారు.అంతేకాకుండా మీరు తౌరాతు గ్రంధంలో ప్రస్తావించబడిన దైవవిధేయత ధర్మఅనుసరణ మరియు ఆయన ప్రవక్తల ధృవీకరణకు సంబంధించిన ఆదేశాలను చదువుతున్నారు.మీరు (మీకు ఉన్న)బుద్ధిని ఉపయోగించుకోలేకపోతున్నారా?
Tafsyrai arabų kalba:
وَاسْتَعِیْنُوْا بِالصَّبْرِ وَالصَّلٰوةِ ؕ— وَاِنَّهَا لَكَبِیْرَةٌ اِلَّا عَلَی الْخٰشِعِیْنَ ۟ۙ
మరియు మీరు మీ ప్రాపంచిక, ధార్మిక వ్యవహారాలన్నింటిలో సహనం మరియు మిమ్మల్ని అల్లాహ్ కు దగ్గర చేసే నమాజు ద్వారా ఆయన సహాయాన్ని అర్ధించండి. తద్వారా ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ ఆపదల నుండి తొలగించి మిమ్మల్ని రక్షిస్తాడు.మరియు నమాజ్ ఎంతో ఘనమైనది మరియు కష్టతరమైనది కానీ తమ ప్రభువు పట్ల భయభక్తులు కలవారికి తప్ప.
Tafsyrai arabų kalba:
الَّذِیْنَ یَظُنُّوْنَ اَنَّهُمْ مُّلٰقُوْا رَبِّهِمْ وَاَنَّهُمْ اِلَیْهِ رٰجِعُوْنَ ۟۠
మరియు వారికి అది (సులువు)ఎందుకనగా వాస్తవానికి వారే అల్లాహ్ పై మరియు తీర్పుదినం నాడు ఆయనను కలుసుకోవడం పై నమ్మకాన్ని కలిగి ఉన్నారు.వారు తమ ప్రతిఫలాన్ని పొందటానికి ఆయన వైపే మరలుతారు.
Tafsyrai arabų kalba:
یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اذْكُرُوْا نِعْمَتِیَ الَّتِیْۤ اَنْعَمْتُ عَلَیْكُمْ وَاَنِّیْ فَضَّلْتُكُمْ عَلَی الْعٰلَمِیْنَ ۟
ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన యాఖూబ్ సంతానమా మీపై నేను అవతరింపజేసిన ధార్మిక మరియు ప్రాపంచిక అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి.మరియు నేను మీ కాలంలో మీ తోటివారి కంటే మీకు దైవదౌత్యం మరియు రాజ్యాన్ని అనుగ్రహించి మీకు వారిపై ఔన్నత్యాన్ని ప్రసాదించిన దానిని జ్ఞాపకం చేసుకోండి.
Tafsyrai arabų kalba:
وَاتَّقُوْا یَوْمًا لَّا تَجْزِیْ نَفْسٌ عَنْ نَّفْسٍ شَیْـًٔا وَّلَا یُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَّلَا یُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَّلَا هُمْ یُنْصَرُوْنَ ۟
మరియు మీరు మీ విధులను నిర్వర్తించి మీకు నిషేదించిన వాటి నుండి దూరంగా ఉండటం ద్వారా మీకూ మరియు ప్రళయదినం నాటి దైవశిక్షకు మధ్య రక్షణను ఏర్పరచుకోండి.ఆ రోజు ఎవరూ ఎవరికి ప్రయోజనాన్ని చేకూర్చలేరు.మరియు ఏ ఆపద నుంచి తొలగించడానికైనా ఏ మేలును చేకూర్చడానికైనా అల్లాహ్ అనుమతి లేనిదే ఎవరి సిఫారసు స్వికరించబడదు.మరియు భూమి నిండా బంగారాన్ని పరిహారంగా చెల్లించినా తీసుకోబడదు.మరియు ఆరోజు రక్షించేవారెవ్వరూ ఉండరు.అలాంటప్పుడు సిఫారసుదారుల సిఫారసు, పరిహారం లాభం చేకూర్చలేవు మరియు రక్షించేవారెవరూ ఉండరు కనుక అప్పుడు ఎక్కడికి పారిపోవాలి?
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• من أعظم الخذلان أن يأمر الإنسان غيره بالبر، وينسى نفسه.
మనిషి పరులకు మంచిని భోదిస్తూ తనను మరచిపోవటమే అన్నింటికన్నా ఎక్కువ నష్టం.

• الصبر والصلاة من أعظم ما يعين العبد في شؤونه كلها.
నమాజు మరియు సహనం దాసుల వ్యవహారాలన్నింటిలో దైవ సహాయానికి ముఖ్య కారకం.

• في يوم القيامة لا يَدْفَعُ العذابَ عن المرء الشفعاءُ ولا الفداءُ، ولا ينفعه إلا عمله الصالح.
ప్రళయదినం నాడు మనిషిని ఏఒక్కరి సిఫారసు ఏ పరిహారం దైవ శిక్ష నుంచి కాపాడలేవు కానీ అతని అమలు తప్ప.

وَاِذْ نَجَّیْنٰكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ یَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ یُذَبِّحُوْنَ اَبْنَآءَكُمْ وَیَسْتَحْیُوْنَ نِسَآءَكُمْ ؕ— وَفِیْ ذٰلِكُمْ بَلَآءٌ مِّنْ رَّبِّكُمْ عَظِیْمٌ ۟
ఓ ఇస్రాయీలు సంతతివారా మిమ్మల్ని రకరకాల శిక్షలకు గురి చేసే ఫిర్ఔన్ అనుచరుల నుండి మేము మిమ్మల్ని రక్షించినప్పటి వైనమును ఒక సారి గుర్తు చేసుకోండి. మీకు మనుగడ లేకుండా ఉండటానికి వారు మీ మగ సంతానమును జిబాహ్ చేసి హతమార్చే వారు. మరియు వారి సేవ చేయటానికి స్త్రీలు ఉండటానికి మీ ఆడ సంతానమును వదిలి వేసే వారు మిమ్మల్ని అవమానించటంలో,కించపరచటంలో కొనసాగిపోతూ. మిమ్మల్ని ఫిర్ఔన్ మరియు అతని అనుచరుల పట్టు నుండి రక్షించటంలో మీ ప్రభువు వద్ద నుండి ఒక పెద్ద పరీక్ష ఉన్నది. బహుశా మీరు కృతజ్ఞత తెలుపుకుంటారని.
Tafsyrai arabų kalba:
وَاِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَاَنْجَیْنٰكُمْ وَاَغْرَقْنَاۤ اٰلَ فِرْعَوْنَ وَاَنْتُمْ تَنْظُرُوْنَ ۟
మరియు మీపై మా అనుగ్రహముల్లోంచి మేము మీ కొరకు సముద్రమును చీల్చటమును గుర్తు చేసుకోండి. అప్పుడు మేము దాన్ని ఎండిన మార్గముగా చేశాము మీరు అందులో నడవసాగారు. అప్పుడు మేము మిమ్మల్ని రక్షించాము. మరియు మేము మీ శతృవులైన ఫిర్ఔన్ మరియు అతని అనుచరులను మీ కళ్ళ ముందటే ముంచివేశాము. మీరు వారి వైపు చూస్తూ ఉండిపోయారు.
Tafsyrai arabų kalba:
وَاِذْ وٰعَدْنَا مُوْسٰۤی اَرْبَعِیْنَ لَیْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهٖ وَاَنْتُمْ ظٰلِمُوْنَ ۟
మరియు ఈ అనుగ్రహముల్లోంచి మూసాతో నలభై రాత్రుల మా వాగ్దానమును అందులో జ్యోతిగా మరియు సన్మార్గముగా తౌరాతు అవతరణ పూర్తి అవటానికి చేసిన దాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఆ తరువాత ఈ గడువులో మీరు ఆవు దూడను ఆరాధించటం మాత్రం జరిగింది. మరియు మీరు మీ ఈ చర్య వలన దుర్మార్గులు అయ్యారు.
Tafsyrai arabų kalba:
ثُمَّ عَفَوْنَا عَنْكُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟
ఆ పిదప మేము మీ పశ్చాత్తాపము తరువాత మిమ్మల్ని మన్నించాము. మేము మిమ్మల్ని శిక్షించలేదు బహుశా మీరు అల్లాహ్ కు ఆయన మంచి ఆరాధన,ఆయన పై విధేయత ద్వారా కృతజ్ఞత తెలుపుకుంటారని.
Tafsyrai arabų kalba:
وَاِذْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟
మరియు ఈ అనుగ్రహముల్లోంచి మేము మూసా అలైహిస్సలాంకు తౌరాతును సత్య,అసత్యాల మధ్య గీటురాయిగా మరియు సన్మార్గము,అపమార్గముల మధ్య వ్యత్యాసము చూపే దానిగా ప్రసాదించటమును మీరు గుర్తు చేసుకోండి. బహుశా మీరు దాని ద్వారా సత్యము వైపునకు మార్గం పొందుతారని.
Tafsyrai arabų kalba:
وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهٖ یٰقَوْمِ اِنَّكُمْ ظَلَمْتُمْ اَنْفُسَكُمْ بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوْبُوْۤا اِلٰی بَارِىِٕكُمْ فَاقْتُلُوْۤا اَنْفُسَكُمْ ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ عِنْدَ بَارِىِٕكُمْ ؕ— فَتَابَ عَلَیْكُمْ ؕ— اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِیْمُ ۟
మరియు ఈ అనుగ్రహముల్లోంచి అల్లాహ్ మీకు ఆవు దూడ ఆరాధన చేయటం నుండి పశ్చాత్తాప్పడటమునకు భాగ్యమును కలిగించటమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు మూసా అలైహిస్సలాం మీతో ఇలా పలికారు : నిశ్చయంగా మీరు ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని దాన్ని మీరు ఆరాధించటంతో మీరు మీ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడ్డారు. కావున మీరు పశ్చాత్తాప్పడి మీ సృష్టి కర్త,మిమ్మల్ని ఉనికిలోకి తెచ్చిన వాడి వైపునకు మరలండి. మరియు ఇది మీలో కొందరు కొందరిని వదించటం ద్వారా. ఈ రకమైన పశ్చాత్తాపము నరకాగ్నిలో శాశ్వతంగా ఉండే వైపునకు దారి తీసే అవిశ్వాసములో కొనసాగటం కంటే మీకు ఎంతో మీలైనది. మీరు దాన్ని అల్లాహ్ అనుగ్రహం,సహాయం ద్వారా నెరవేర్చారు. ఆయన మీపై కనికరించాడు. ఎందుకంటే ఆయన ఎక్కువగా పశ్చాత్తాపమును అంగీకరించేవాడును,తన దాసులపై అపారంగా కరుణించేవాడును.
Tafsyrai arabų kalba:
وَاِذْ قُلْتُمْ یٰمُوْسٰی لَنْ نُّؤْمِنَ لَكَ حَتّٰی نَرَی اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْكُمُ الصّٰعِقَةُ وَاَنْتُمْ تَنْظُرُوْنَ ۟
మరియు మీ తాతముత్తాతలు మూసా అలైహిస్సలాంను ఉద్దేశించి ధైర్యముతో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : అల్లాహ్ ను మా నుండి దాచుకోని కళ్ళాలా చూసేవరకు మేము నిన్ను విశ్వసించము. అప్పుడు దహించివేసే అగ్ని మిమ్మల్ని పట్టుకుంది. అప్పుడు అది మిమ్మల్ని మీలోని కొందరు కొందరిని చూస్తుండగానే చంపివేసింది.
Tafsyrai arabų kalba:
ثُمَّ بَعَثْنٰكُمْ مِّنْ بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟
ఆ తరువాత మేము మీ మరణం తరువాత మిమ్మల్ని జీవింపజేశాము బహుశా మీరు అల్లాహ్ కు ఆయన మీపై దీన్ని అనుగ్రహించటంపై కృతజ్ఞత తెలుపుకుంటారని.
Tafsyrai arabų kalba:
وَظَلَّلْنَا عَلَیْكُمُ الْغَمَامَ وَاَنْزَلْنَا عَلَیْكُمُ الْمَنَّ وَالسَّلْوٰی ؕ— كُلُوْا مِنْ طَیِّبٰتِ مَا رَزَقْنٰكُمْ ؕ— وَمَا ظَلَمُوْنَا وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟
మరియు మీపై మా అనుగ్రహాల్లోంచి మీరు భూమిలో నిలువ నీడ లేకుండా తచ్చాడుతూ తిరుగుతున్నప్పుడు మేము మేఘమును పంపించటం అది సూర్యుని వేడి నుండి మీకు నీడనిస్తుంది. మరియు మా అనుగ్రహముల్లోంచి మేము మీపై తేనె వలె తియ్యటి పానియమును మరియు కౌజు పిట్టలాంటి మంచి మాంసము కల చిన్న పక్షిని కురిపించటం. మరియు మేము మీతో ఇలా పలికాము : మేము మీకు ఆహారముగా ప్రసాదించిన శుద్ధమయిన వస్తువులను తినండి. మరియు ఈ అనుగ్రహాల పట్ల వారి తిరస్కారము,వాటి పట్ల వారి కృతఘ్నత వలన మేము ఏదీ తరిగించలేదు. కాని వారే తమ స్వయమునకు (తమ మనస్సులకు) వాటి పుణ్యముల భాగమును తగ్గించి వాటిని శిక్షకు అప్పగించి అన్యాయం చేసుకున్నారు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• عِظَمُ نعم الله وكثرتها على بني إسرائيل، ومع هذا لم تزدهم إلا تكبُّرًا وعنادًا.
ఇస్రాయీలు సంతతి వారిపై అల్లాహ్ అనుగ్రహములు గొప్పగా ఉండటం మరియు అవి అధికంగా ఉండటం. ఇలా ఉన్నప్పటికి అవి వారిలో అహంకారమును మరియు మొండితనమును అధికం చేసింది.

• سَعَةُ حِلم الله تعالى ورحمته بعباده، وإن عظمت ذنوبهم.
మహోన్నతుడైన అల్లాహ్ దయ మరియు ఆయన దాసులపై ఆయన కారుణ్యము యొక్క విశాలత్వము ఒక వేళ వారి పాపాలు ఎంత పెద్దవైనప్పటికి.

• الوحي هو الفَيْصَلُ بين الحق والباطل.
దైవ వాణి అనేది సత్య,అసత్యాల మధ్య విభజన.

وَاِذْ قُلْنَا ادْخُلُوْا هٰذِهِ الْقَرْیَةَ فَكُلُوْا مِنْهَا حَیْثُ شِئْتُمْ رَغَدًا وَّادْخُلُوا الْبَابَ سُجَّدًا وَّقُوْلُوْا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطٰیٰكُمْ ؕ— وَسَنَزِیْدُ الْمُحْسِنِیْنَ ۟
మేము మీతో ఇలా పలికినప్పుడు మీపై ఉన్నఅల్లాహ్ అనుగ్రహాలను మీరు గుర్తు చేసుకోండి : మీరు బైతుల్ మఖ్దిస్ లో (పరశుద్ధ గృహములో) ప్రవేశించండి. మరియు అందులో ఉన్న పరిశుద్ధ ఆహారముల్లోంచి మీరు కోరుకున్న చోటు నుండి ఆహ్లాదంగా విస్తృతంగా తినండి. మరియు మీరు ప్రవేశించేటప్పుడు అల్లాహ్ కొరకు రకూ చేస్తూ,అణుకువను చూపుతూ అయిపోండి. మరియు అల్లాహ్ తో ఇలా పలుకుతూ వేడుకోండి : ఓ మా ప్రభువా నీవు మా పాపములను మన్నించు. మేము మీ కొరకు స్వీకరిస్తాము. మరియు వారి కర్మలను మంచిగా చేసిన వారికి దానికన్న అధికంగా పుణ్యమును మేము ప్రసాదిస్తాము.
Tafsyrai arabų kalba:
فَبَدَّلَ الَّذِیْنَ ظَلَمُوْا قَوْلًا غَیْرَ الَّذِیْ قِیْلَ لَهُمْ فَاَنْزَلْنَا عَلَی الَّذِیْنَ ظَلَمُوْا رِجْزًا مِّنَ السَّمَآءِ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟۠
వారిలో నుండి దుర్మార్గమునకు పాల్పడిన వారికి వారు చర్యను మార్చటం మరియు మాటను మార్చటం తప్ప ఇంకేమి జరగలేదు. అప్పుడు వారు తమ పిరుదులపై ప్రాకుతూ ప్రవేశించారు. మరియు వారు అల్లాహ్ ఆదేశము పట్ల హేళన చేస్తూ వెన్నులో గింజ అని పలికారు. వారిలో నుండి దుర్మార్గులపై వారికి నిర్దేశించిన హద్దు నుండి వైదొలగిపోవటం వలన మరియు ఆదేశమును వ్యతిరేకించటం వలన అల్లాహ్ ప్రతిఫలంగా ఆకాశము నుండి శిక్షను దించటం జరిగింది.
Tafsyrai arabų kalba:
وَاِذِ اسْتَسْقٰی مُوْسٰی لِقَوْمِهٖ فَقُلْنَا اضْرِبْ بِّعَصَاكَ الْحَجَرَ ؕ— فَانْفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَیْنًا ؕ— قَدْ عَلِمَ كُلُّ اُنَاسٍ مَّشْرَبَهُمْ ؕ— كُلُوْا وَاشْرَبُوْا مِنْ رِّزْقِ اللّٰهِ وَلَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ ۟
మరియు మీరు తీహ్ లో ఉన్నప్పుడు మీపై కలిగిన అల్లాహ్ అనుగ్రహములను గుర్తు చేసుకోండి. మరియు మీకు తీవ్రమైన దాహం కలిగినది. అప్పుడు మూసా అలైహిస్సలాం తన ప్రభువును కడువినయంగా ప్రార్ధించి మీకు నీళ్ళను త్రాపించమని ఆయనను అడిగాడు. అప్పుడు మేము ఆయనను తన చేతి కర్రను రాతిపై కొట్టమని ఆదేశించాము. ఆయన దాన్ని కొట్టగానే మీ తెగల లెక్క ప్రకారం పన్నెండు ఊటలు దాని నుండి ప్రవహించాయి. వాటి నుండి నీరు పొంగి ప్రవహించింది. మరియు మేము ప్రతీ తెగకు వాటి నుండి అది త్రాగే ప్రత్యేక చోటును స్పష్టపరచాము. వారి మధ్య తగాదా రాకుండా ఉండటానికి. మరియు మేము మీతో ఇలా పలికాము : మీరు మీ వద్దకు అల్లాహ్ మీ ఎటువంటి శ్రమ,చర్య లేకుండా తీసుకుని వచ్చిన అల్లాహ్ ఆహారములో నుంచి తినండి మరియు త్రాగండి. మరియు మీరు భూమిలో ఉపద్రవాలను తలపెట్టుతూ తిరగకండి.
Tafsyrai arabų kalba:
وَاِذْ قُلْتُمْ یٰمُوْسٰی لَنْ نَّصْبِرَ عَلٰی طَعَامٍ وَّاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ یُخْرِجْ لَنَا مِمَّا تُنْۢبِتُ الْاَرْضُ مِنْ بَقْلِهَا وَقِثَّآىِٕهَا وَفُوْمِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ؕ— قَالَ اَتَسْتَبْدِلُوْنَ الَّذِیْ هُوَ اَدْنٰی بِالَّذِیْ هُوَ خَیْرٌ ؕ— اِهْبِطُوْا مِصْرًا فَاِنَّ لَكُمْ مَّا سَاَلْتُمْ ؕ— وَضُرِبَتْ عَلَیْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَآءُوْ بِغَضَبٍ مِّنَ اللّٰهِ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ كَانُوْا یَكْفُرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ وَیَقْتُلُوْنَ النَّبِیّٖنَ بِغَیْرِ الْحَقِّ ؕ— ذٰلِكَ بِمَا عَصَوْا وَّكَانُوْا یَعْتَدُوْنَ ۟۠
మరియు మీరు మీ ప్రభువు అనుగ్రహమును తిరస్కరించినప్పటి వైనమును గుర్తు చేసుకోండి అప్పుడు మీరు అల్లాహ్ మీపై అవతరింపజేసిన మన్న,సల్వాను తినటం నుండి విసిగిపోయి ఇలా పలికారు : మారని ఒకేరకమైన ఆహారమును మేము సహించము. అప్పుడు మీరు మూసా అలైహిస్సలాంను అల్లాహ్ తో తమ కొరకు భూమి ఉత్పత్తి చేసే కాయగూరలను,ఆకుగూరలను,దోసకాయలను (దోసకాయ లాంటిదే కాని దాని కన్నపెద్దది),ధాన్యములను,పప్పును,ఉల్లిపాయలను ఆహారంగా వెలికితీయమని వేడుకోమని కోరారు. అప్పుడు మూసా అలైహిస్సలాం అయిష్టతను చూపుతూ ఇలా పలికారు : మీరు బదులుగా కోరుకున్న మీ కోరిక మన్న,సల్వా కన్న చాలా తక్కువైనది మరియు అల్పమైనది. మరియు అది (మన్న,సల్వా) మేలైనది,గౌరవప్రధమైనది. వాస్తవానికి అది మీ వద్దకు ఎటువంటి అలసట,శ్రమ లేకుండా వస్తున్నది. మీరు ఈ ఊరు నుండి ఏ ఉరుకైనా వెళ్ళండి అక్కడి పొలాల్లో,బజారులలో మీరు అడిగిన వాటిని పొందుతారు. మరియు వారు తమ మనోవాంఛలను అనుసరించటం వలన మరియు అల్లాహ్ వారి కొరకు ఎంపిక చేసిన వాటి నుండి పదేపదే విముఖత చూపటం వలన వారికి అవమానము,పేదరికం,కష్టాలు చుట్టుకున్నాయి. మరియు వారు ఆయన ధర్మము పట్ల విముఖత చూపటం వలన మరియు వారు ఆయన ఆయతులను తిరస్కరించటం వలన మరియు ఆయన ప్రవక్తలను దుర్మార్గముగా శతృత్వముగా హతమార్చటం వలన అల్లాహ్ ఆగ్రహమునకు లోనయ్యారు. ఇదంతా వారు అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడటం వలన మరియు ఆయన హద్దులను అతిక్రమించటం వలన.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• كل من يتلاعب بنصوص الشرع ويحرّفها فيه شَبَهٌ من اليهود، وهو مُتوعَّد بعقوبة الله تعالى.
ధర్మ ఆధారాలతో ఆటలాడి వాటిని తారుమారు చేసే ప్రతీ ఒక్కడు యూదులు లాంటివాడు. మరియు అతడు మహోన్నతుడైన అల్లాహ్ శిక్షతో వాగ్దానం చేయబడ్డాడు.

• عِظَمُ فضل الله تعالى على بني إسرائيل، وفي مقابل ذلك شدة جحودهم وعنادهم وإعراضهم عن الله وشرعه.
ఇశ్రాయీలు సంతతి వారిపై సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అనుగ్రహ గొప్పతనం, దీనికి ప్రతిగా వారి అవిశ్వాసం, మొండితనం మరియు వారు అల్లాహ్ నుండి మరియు ఆయన ధర్మ శాసనం నుండి తప్పుకోవడం.

• أن من شؤم المعاصي وتجاوز حدود الله تعالى ما ينزل بالمرء من الذل والهوان، وتسلط الأعداء عليه.
నిశ్చయంగా అవిధేయ కార్యాలు మరియు మహోన్నతుడైన అల్లాహ్ హద్దులను అతిక్రమించటం యొక్క దుష్ప్రభావములోంచిది మవిషిపై దిగే అవమానము మరియు పరాభవము మరియు అతని శతృవుల ఆధిక్యత.

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَالَّذِیْنَ هَادُوْا وَالنَّصٰرٰی وَالصّٰبِـِٕیْنَ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۪ۚ— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
నిశ్ఛయంగా ఈ సమాజము నుండి విశ్వసించిన వారు మరియు అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపబడక మునుపటి సమాజములైన యూదుల్లోంచి,క్రైస్తవుల్లోంచి,సాబియిల్లోంచి విశ్వసించినవారు - వారు కొంత మంది ప్రవక్తల అనుచరుల వర్గము వారు అల్లాహ్ పై మరియు అంతిమ దినముపై విశ్వాసమును సాధించారు. వారి కొరకు వారి ప్రభువు వద్ద వారి ప్రతిఫలమున్నది. మరియు వారు పరలోకంలో ఎదుర్కొనే వాటి గురించి వారిపై ఎటువంటి భయం ఉండదు. ఇహలోకము నుండి తాము కోల్పోయిన వాటిపై వారు దుఃఖించరు.
Tafsyrai arabų kalba:
وَاِذْ اَخَذْنَا مِیْثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّوْرَ ؕ— خُذُوْا مَاۤ اٰتَیْنٰكُمْ بِقُوَّةٍ وَّاذْكُرُوْا مَا فِیْهِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟
మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాస విషయంలో మీతో తీసుకున్న దృఢమైన ప్రమాణమును మీరు గుర్తు చేసుకోండి. మరియు మేము పర్వతమును మిమ్మల్ని భయపెట్టటానికి మరియు ప్రమాణముపై అమలు చేయటం నుండి వదిలివేయటం నుండి హెచ్చరించటానికి మీపై తీసుకుని వచ్చాము. మీపై మేము అవతరించిన తౌరాతును జాగ్రత్తగా మరియు శ్రద్ధగా ఎటువంటి నిశ్ఛలత,సోమరితనం లేకుండా పట్టుకోవటం గురించి మీకు ఆదేశిస్తూ. మరియు మీరు అందులో ఉన్నవాటిని కంఠస్తం చేసుకుని దానిలో యోచన చేయండి బహుశా అలా చేసి మీరు మహోన్నతుడైన అల్లాహ్ శిక్ష నుండి భయపడుతారని.
Tafsyrai arabų kalba:
ثُمَّ تَوَلَّیْتُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ ۚ— فَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ لَكُنْتُمْ مِّنَ الْخٰسِرِیْنَ ۟
మీతో దృఢ ప్రమాణం తీసుకున్న తరువాత మీరు విముఖత చూపటం మరియు విధేయత చూపటం తప్ప మీతో ఇంకేమి జరగలేదు. మరియు ఒక వేళ మిమ్మల్ని మన్నించి అల్లాహ్ అనుగ్రహం మరియు మీ తౌబా ను స్వీకరించి ఆయన కారుణ్యం మీపై లేకుంటే ఈ విముఖత మరియు అవిధేయత వలన నష్టపోయేవారిలోంచి మీరు అయిపోతారు.
Tafsyrai arabų kalba:
وَلَقَدْ عَلِمْتُمُ الَّذِیْنَ اعْتَدَوْا مِنْكُمْ فِی السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُوْنُوْا قِرَدَةً خٰسِـِٕیْنَ ۟ۚ
మరియు మీ పూర్వికుల వార్త నిస్సందేహంగా మీకు తెలుసు; వేటాడం వారిపై నిషేధించబడిన రోజైన శనివారం రోజున వేటాడి అతిక్రమించారు. అప్పుడు అది చేయటానికి వారు శనివారం రోజు ముందు వలను పరచి ఆదివారం రోజును దాన్ని తీయటం ద్వారా ఉపాయం పన్నారు. అయితే అల్లాహ్ ఈ ఉపాయం పన్నిన వారందరిని వారి ఉపాయం పన్నటంపై వారికి శిక్షగా బహిష్కరించబడిన కోతులవలే చేసేశాడు.
Tafsyrai arabų kalba:
فَجَعَلْنٰهَا نَكَالًا لِّمَا بَیْنَ یَدَیْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِیْنَ ۟
అయితే మేము ఈ అతిక్రమించిన ఊరిని దాని సమీప ఊళ్ళకు గుణపాఠంగా మరియు దాని తరువాత వచ్చే వారికి గుణపాఠంగా చేశాము చివరికి వారి శిక్షకు గురి అవకుండా ఉండటానికి వారి చర్యకు పాల్పడకుండా ఉండటానికి. మరియు అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారికి కలిగే అల్లాహ్ శిక్ష నుండి,ఆయన ప్రతీకారము నుండి భయపడేవారైన దైవ భీతిపరులకు దాన్ని మేము హితబోధనగా చేశాము.
Tafsyrai arabų kalba:
وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهٖۤ اِنَّ اللّٰهَ یَاْمُرُكُمْ اَنْ تَذْبَحُوْا بَقَرَةً ؕ— قَالُوْۤا اَتَتَّخِذُنَا هُزُوًا ؕ— قَالَ اَعُوْذُ بِاللّٰهِ اَنْ اَكُوْنَ مِنَ الْجٰهِلِیْنَ ۟
మరియు మీరు మీ పూర్వికుల వార్తల్లో నుండి వారికి మరియు మూసా అలైహిస్సలాంకు మధ్య ఏమి జరిగినదో గుర్తు చేసుకోండి. అప్పుడు ఆయన వారికి ఆవుల్లోంచి ఒక ఆవును జిబాహ్ చేయమన్న అల్లాహ్ ఆదేశము గురించి తెలియపరచారు. అప్పుడు వారు బదులుగా త్వరపడుతూ మొండిగా ఇలా పలికారు : ఏమీ నీవు మాతో పరిహాసమాడుతున్నావా. అప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : అల్లాహ్ పై అబద్ధము పలికే వారిలో నుండి మరియు ప్రజలతో పరిహాసమాడే వారిలో నుండి నేను కావటం నుండి అల్లాహ్ శరణమును వేడుకుంటున్నాను.
Tafsyrai arabų kalba:
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ یُبَیِّنْ لَّنَا مَا هِیَ ؕ— قَالَ اِنَّهٗ یَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَّلَا بِكْرٌ ؕ— عَوَانٌ بَیْنَ ذٰلِكَ ؕ— فَافْعَلُوْا مَا تُؤْمَرُوْنَ ۟
వారు మూసా అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఆయన మాకు జిబాహ్ చేయమని ఆదేశించిన ఆవు వర్ణనను మాకు స్పష్టపరచమని మీరు మీ ప్రభువుతో మా కొరకు వేడుకోండి. ఆప్పుడు ఆయన వారితో ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలుకుతున్నాడు : నిశ్చయంగా ఆ ఆవు వయస్సులో పెద్దది గాని చిన్నది గాని కాకూడదు. కాని అది దానికి మధ్యదై ఉండాలి. కావున మీరు మీ ప్రభువు ఆదేశమును పాటించటంలో త్వరపడండి.
Tafsyrai arabų kalba:
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ یُبَیِّنْ لَّنَا مَا لَوْنُهَا ؕ— قَالَ اِنَّهٗ یَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ صَفْرَآءُ ۙ— فَاقِعٌ لَّوْنُهَا تَسُرُّ النّٰظِرِیْنَ ۟
అప్పుడు వారు మూసా అలైహిస్సలాంతో ఇలా పలుకుతూ తమ వాదనల్లో మరియు తమ మొండితనములో కొనసాగిపోయారు : మీరు మీ ప్రభువుతో ఆయన మాకు దాని రంగు ఎలా ఉంటుందో స్పష్టపరచే వరకు వేడుకోండి. అప్పుడు మూసా వారితో ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలుకుతున్నాడు : నిశ్చయంగా ఆ ఆవు మదురు పసుపు రంగుదై ఉండాలి. దాన్ని చూసేవారికి అది నచ్చాలి.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• الحُكم المذكور في الآية الأولى لِمَا قبل بعثة النبي صلى الله عليه وسلم، وأما بعد بعثته فإن الدين المَرْضِيَّ عند الله هو الإسلام، لا يقبل غيره، كما قال الله تعالى: ﴿ وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْه ﴾ (آل عمران: 85).
మొదటి ఆయతులో ప్రస్తావించబడిన ఆదేశం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక మునుపటి దాని కొరకు. ఇక ఆయన ప్రవక్తగా పంపించబడిన తరువాత అల్లాహ్ వద్ద నిశ్చయంగా స్వీకరించబడే ధర్మం అది ఇస్లాం. అది తప్ప ఇతర ధర్మాలు స్వీకరించబడవు. ఏ విధంగా అయితే మహోన్నతుడైన అల్లాహ్ పలికాడో : ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని ఆశిస్తే అతని ధర్మం స్వీకరించబడదు (ఆలె ఇమ్రాన్ - 85)

• قد يُعَجِّلُ الله العقوبة على بعض المعاصي في الدنيا قبل الآخرة؛ لتكون تذكرة يتعظ بها الناس فيحذروا مخالفة أمر الله تعالى.
నిశ్చయంగా అల్లాహ్ పరలోకం కన్న ముందే ఇహలోకంలో కొన్ని పాపములపై త్వరగా శిక్షిస్తాడు; అది హిత బోధన కావటానికి ప్రజలు దాని ద్వారా హితబోధన గ్రహించి మహోన్నతుడైన అల్లాహ్ ఆదేశమును విబేధించటం నుండి వారు జాగ్రత్త పడటానికి.

• أنّ من ضيَّق على نفسه وشدّد عليها فيما ورد موسَّعًا في الشريعة، قد يُعاقَبُ بالتشديد عليه.
నిశ్చయంగా ఎవరైతే ధర్మంలో విస్తృతం చేయబడి వచ్చిన వాటి విషయంలో తన స్వయమును ఇబ్బందికి గురి చేసుకుని తన మనస్సుపై కఠినంగా వ్యవహరిస్తాడో అతడు తనపై కఠినత్వము ద్వారా శిక్షింపబడుతాడు.

قَالُوا ادْعُ لَنَا رَبَّكَ یُبَیِّنْ لَّنَا مَا هِیَ ۙ— اِنَّ الْبَقَرَ تَشٰبَهَ عَلَیْنَا ؕ— وَاِنَّاۤ اِنْ شَآءَ اللّٰهُ لَمُهْتَدُوْنَ ۟
ఆ తరువాత వారు ఇలా పలుకుతూ తమ మొండితనంలో కొనసాగిపోయారు : దాని లక్షణాలను మాకు మరింత స్పష్టపరచటానికి నీ ప్రభువుతో మా కొరకు వేడుకో. ఎందుకంటే ఈ ప్రస్తావించబడిన లక్షణాలతో వర్ణించబడిన ఆవులు చాలా ఉండేవి వాటిలో నుండి దాన్ని మేము గుర్తించలేకపోతున్నాము. జిబాహ్ చేయటమునకు కోరబడిన ఆవు వైపునకు అల్లాహ్ తలచుకుంటే వారు పొందుతారని దృవీకరిస్తూ.
Tafsyrai arabų kalba:
قَالَ اِنَّهٗ یَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُوْلٌ تُثِیْرُ الْاَرْضَ وَلَا تَسْقِی الْحَرْثَ ۚ— مُسَلَّمَةٌ لَّا شِیَةَ فِیْهَا ؕ— قَالُوا الْـٰٔنَ جِئْتَ بِالْحَقِّ ؕ— فَذَبَحُوْهَا وَمَا كَادُوْا یَفْعَلُوْنَ ۟۠
అప్పుడు మూసా వారితో ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలుకుతున్నాడు : నిశ్చయంగా ఈ ఆవు యొక్క లక్షణం ఏమిటంటే అది దున్నటంలో గాని భూమికి నీరు వేయటంలో గాని పనిచేయటానికి ఉపయోగించబడి ఉండకూడదు. మరియు అది లోపముల నుండి సురక్షితంగా ఉండాలి. మరియు దాని పసుపు రంగు కాకుండా వేరే రంగు గుర్తు అందులో ఉండకూడదు. అప్పుడు వారు ఇలా పలికారు : ఇప్పుడు నీవు ఆవును పూర్తిగా నిర్వచించే ఖచ్చితమైన లక్షణమును తీసుకుకుని వచ్చావు. వాదనలు మరియు మొండి తనం వలన వారు దగ్గర దగ్గర దాన్ని జిబాహ్ చేసే స్థితిలో లేని తరువాత కూడా దాన్ని జిబాహ్ చేశారు.
Tafsyrai arabų kalba:
وَاِذْ قَتَلْتُمْ نَفْسًا فَادّٰرَءْتُمْ فِیْهَا ؕ— وَاللّٰهُ مُخْرِجٌ مَّا كُنْتُمْ تَكْتُمُوْنَ ۟ۚ
మరియు మీలో నుండి ఒక వ్యక్తిని మీరు హత్య చేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి అప్పుడు మీరు పరస్పరం సమర్ధించుకున్నారు. ప్రతి ఒక్కరు తన తరపు నుండి హత్య నిందను సమర్ధించుకుని దాన్ని ఇతరుల మీద మోపసాగారు. చివరకు మీరు పరస్పరం తగువులాడసాగారు. మరియు అల్లాహ్ ఆ నిర్దోషి హత్యను దేనినైతే మీరు దాస్తున్నారో బయట పెడతాడు.
Tafsyrai arabų kalba:
فَقُلْنَا اضْرِبُوْهُ بِبَعْضِهَا ؕ— كَذٰلِكَ یُحْیِ اللّٰهُ الْمَوْتٰی وَیُرِیْكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟
అప్పుడు మేము మీతో ఇలా పలికాము : మీరు జిబాహ్ చేయమని ఆదేశించబడిన ఆవు ఒక భాగముతో మీరు హతుడిపై కొట్టండి. నిశ్చయంగా హత్య చేసిన వాడు ఎవడో అతడు తెలియపరచటానికి అల్లాహ్ అతడిని తొందరలోనే జీవింపజేస్తాడు. ఈ మృతుడిని జీవింపజేసినట్లే అల్లాహ్ ప్రళయదినమున మృతులను జీవింపజేస్తాడు. మరియు తన సామర్ధ్యంపై సూచించే ఆధారాలను మీకు చూపిస్తాడు. బహుశా మీరు వాటిని అర్ధం చేసుకుని మహోన్నతుడైన అల్లాహ్ పై వాస్తవంగా విశ్వాసం కనబరుస్తారని.
Tafsyrai arabų kalba:
ثُمَّ قَسَتْ قُلُوْبُكُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ فَهِیَ كَالْحِجَارَةِ اَوْ اَشَدُّ قَسْوَةً ؕ— وَاِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا یَتَفَجَّرُ مِنْهُ الْاَنْهٰرُ ؕ— وَاِنَّ مِنْهَا لَمَا یَشَّقَّقُ فَیَخْرُجُ مِنْهُ الْمَآءُ ؕ— وَاِنَّ مِنْهَا لَمَا یَهْبِطُ مِنْ خَشْیَةِ اللّٰهِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
ఆ పిదప మీ హృదయములు ఈ వాక్చాతుర్యమైన హితోపదేశములు,అద్భుతమైన అద్భుతాల తరువాత కఠినంగా అయిపోయినవి. చివరికి అవి రాళ్ళ వలె అయిపోయినవి, అంతే కాదు వాటి కన్న ఎక్కువ కఠినంగా మారిపోయినవి. అవి తమ స్థితి నుండి ఎన్నడు మారవు. ఇక రాళ్ళు మారుతాయి. నిశ్చయంగా కొన్ని రాళ్ళ నుంచి సెలయేరులు ప్రవహిస్తాయి. మరియు నిశ్చయంగా వాటిలో నుంచి కొన్ని పగిలి దాని నుండి నీరు బయటకు వచ్చి భూమిలో ప్రవహించే ఊటలు ఏర్పడుతాయి. వాటి నుండి ప్రజలు మరియు పశువులు ప్రయోజనం చెందుతారు. మరియు వాటిలో నుండి కొన్ని అల్లాహ్ భయభీతి వలన పర్వతాల పై నుండి క్రిందికి రాలి పడతాయి. మరియు మీ హృదయములు అలా కాదు. మరియు మీరు చేస్తున్న వాటి నుండి అల్లాహ్ పరధ్యానంలో లేడు. కాని దాని గురించి ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన తొందరలోనే దాని పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
اَفَتَطْمَعُوْنَ اَنْ یُّؤْمِنُوْا لَكُمْ وَقَدْ كَانَ فَرِیْقٌ مِّنْهُمْ یَسْمَعُوْنَ كَلٰمَ اللّٰهِ ثُمَّ یُحَرِّفُوْنَهٗ مِنْ بَعْدِ مَا عَقَلُوْهُ وَهُمْ یَعْلَمُوْنَ ۟
ఓ విశ్వాసులారా ఏమీ మీరు యూదుల స్థితి వాస్తవికత మరియు వారి మొండితనము తెలిసిన తరువాత కూడా వారు విశ్వసిస్తారని మరియు మీకు ప్రతిస్పందిస్తారని ఆశిస్తున్నారా ?. వాస్తవానికి వారి పండితుల్లోంచి ఒక వర్గము తౌరాతులో మీపై అవతరింపబడిన అల్లాహ్ వాక్కును వింటున్నది. ఆ తరువాత వాటి పదాలను మరియు వాటి అర్ధాలను తాము వాటిని అర్ధం చేసుకున్న తరువాత వాటిని గుర్తించిన తరువాత మార్చివేస్తున్నారు. వాస్తవానికి వారికి తమ మహా నేరము గురించి తెలుసు.
Tafsyrai arabų kalba:
وَاِذَا لَقُوا الَّذِیْنَ اٰمَنُوْا قَالُوْۤا اٰمَنَّا ۖۚ— وَاِذَا خَلَا بَعْضُهُمْ اِلٰی بَعْضٍ قَالُوْۤا اَتُحَدِّثُوْنَهُمْ بِمَا فَتَحَ اللّٰهُ عَلَیْكُمْ لِیُحَآجُّوْكُمْ بِهٖ عِنْدَ رَبِّكُمْ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
యూదుల వైరుధ్యాలు మరియు వారి కుట్రల్లోంచి వారిలోని కొందరు విశ్వాసపరులతో కలిస్తే వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీని మరియు ఆయన సందేశము సరవటం గురించి వారి ముందు అంగీకరించేవారు. కాని యూదులు పరస్పరం ఏకాంతంలో కలిసినప్పుడు ఈ అంగీకారాల వలన పరస్పరం దూషించుకునేవారు. ఎందుకంటే ముస్లిములు వారి నుండి దైవ దౌత్య నిజాయితీ గురించి జరిగిన విషయంలో వారికి విరుద్ధంగా వాటి ద్వారా వాదనలను స్థాపించేవారు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• أن بعض قلوب العباد أشد قسوة من الحجارة الصلبة؛ فلا تلين لموعظة، ولا تَرِقُّ لذكرى.
కొంతమంది దాసుల హృదయములు గట్టి రాళ్ళ కన్న ఎక్కువగా కఠినంగా ఉంటాయి. అవి ఏ హితబోధన వలన కూడా మెత్తగా అవ్వవు మరియు ఏ ఉపదేశము వలన మృధువుగా మారవు.

• أن الدلائل والبينات - وإن عظمت - لا تنفع إن لم يكن القلب مستسلمًا خاشعًا لله.
సూచనలు మరియు ఆధారాలు ఒక వేళ అవి ఎంత గొప్పవైన హృదయము అల్లాహ్ కు వినయంగా లొంగకపోతే ప్రయోజనం కలిగించవు.

• كشفت الآيات حقيقة ما انطوت عليه أنفس اليهود، حيث توارثوا الرعونة والخداع والتلاعب بالدين.
యూదుల మనస్సులు దేన్ని కలిగి ఉన్నాయో దాని వాస్తవికతను ఆయతులు వెల్లడించాయి ఎందుకంటే వారు బుద్ధిలేమి మరియు మేసం చేయటం,ధర్మం పట్ల ఆటలాడటమునకు వారసులయ్యారు.

اَوَلَا یَعْلَمُوْنَ اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا یُسِرُّوْنَ وَمَا یُعْلِنُوْنَ ۟
ఈ యూదులందరు ఈ అవమానకరమైన మార్గాన్ని అనుసరిస్తారు, వారు తమ మాటలు మరియు చర్యల నుండి వారు ఏమి దాచిపెడుతున్నారో మరియు వారు ప్రకటించిన వాటి గురించి అల్లాహ్ కు తెలుసు అన్న విషయం నుండి వారు నిర్లక్ష్యం చేసినట్లు, మరియు అతను వాటిని తన దాసులకు వెల్లడిస్తాడు మరియు వారిని అపవాదు చేస్తాడు.
Tafsyrai arabų kalba:
وَمِنْهُمْ اُمِّیُّوْنَ لَا یَعْلَمُوْنَ الْكِتٰبَ اِلَّاۤ اَمَانِیَّ وَاِنْ هُمْ اِلَّا یَظُنُّوْنَ ۟
మరియు యూదుల్లోంచి ఒక వర్గమున్నది. వారికి తౌరాత్ గురించి పఠించటం తప్ప ఏమి తెలియదు. అది దేనిపై సూచిస్తుందో వారికి అర్ధం కాలేదు. వారి వద్ద తమ పెద్దల నుండి తీసుకున్న అబద్దాలు మాత్రమే ఉన్నాయి. వాటిని వారు అల్లాహ్ అవతరింపజేసిన తౌరాత్ అని భావిస్తున్నారు.
Tafsyrai arabų kalba:
فَوَیْلٌ لِّلَّذِیْنَ یَكْتُبُوْنَ الْكِتٰبَ بِاَیْدِیْهِمْ ۗ— ثُمَّ یَقُوْلُوْنَ هٰذَا مِنْ عِنْدِ اللّٰهِ لِیَشْتَرُوْا بِهٖ ثَمَنًا قَلِیْلًا ؕ— فَوَیْلٌ لَّهُمْ مِّمَّا كَتَبَتْ اَیْدِیْهِمْ وَوَیْلٌ لَّهُمْ مِّمَّا یَكْسِبُوْنَ ۟
ఎవరైతే తమ చేతులతో పుస్తకమును వ్రాసి ఆ తరువాత ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చినదని అబద్దమును పలుతుతున్నారో వారి కొరకు వినాశనము మరియు కఠినమైన శిక్ష నిరీక్షిస్తున్నది. వారు సత్యమునకు మరియు సన్మార్గమును అనుసరించటమునకు బదులుగా ధనము,రాజ్యము లాంటి ఇహలోకంలో అల్పమైన ధరను ఆశిస్తున్నారు. తమ చేతులారా వ్రాసి దాన్ని అల్లాహ్ వద్ద నుండి అని అబద్దమును కల్పించటం పై వారి కొరకు వినాశనము మరియు కఠినమైన శిక్ష కలదు. దీని వెనుక వారు సంపాదించిన సంపద మరియు రాజ్యమునకు బదులుగా వారి కొరకు వినాశనము మరియు కఠినమైన శిక్ష కలదు.
Tafsyrai arabų kalba:
وَقَالُوْا لَنْ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعْدُوْدَةً ؕ— قُلْ اَتَّخَذْتُمْ عِنْدَ اللّٰهِ عَهْدًا فَلَنْ یُّخْلِفَ اللّٰهُ عَهْدَهٗۤ اَمْ تَقُوْلُوْنَ عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
మరియు వారు అసత్యంగా,అహంకారంగా ఇలా పలికారు : మాకు అగ్ని తాకదు. మరియు మేము కొన్ని రోజులు మాత్రమే అందులో ప్రవేశిస్తాము. ఓ ప్రవక్తా వారందరితో ఇలా పలకండి : వీటికి: మీరు అల్లాహ్ నుండి ఒక దృఢమైన వాగ్దానం తీసుకున్నారా ?. ఒక వేళ అది మీకు ఉంటే ; నిశ్ఛయంగా అల్లాహ్ తన ప్రమాణమునకు విరుద్ధంగా చేయడు. లేదా మీరు అల్లాహ్ పై మీకు తెలియని అబద్దమును మరియు అసత్యమును పలుకుతున్నారు.
Tafsyrai arabų kalba:
بَلٰی مَنْ كَسَبَ سَیِّئَةً وَّاَحَاطَتْ بِهٖ خَطِیْٓـَٔتُهٗ فَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
వీరందరు ఊహించుకున్నట్లు విషయం కాదు. నిశ్చయంగా అల్లాహ్ అవిశ్వాసము యొక్క చెడును సంపాదించిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాడు. మరియు అతని పాపములు అతన్ని అన్నివైపుల నుండి చుట్టుముడుతాయి. వారందరికి నరకంలో ప్రవేశింపజేయటం ద్వారా మరియు దాన్ని అంటిపెట్టుకునే విధంగా ప్రతిఫలం ప్రసాదించటం జరుగును. వారు అందులో శాశ్వతంగా ఉంటారు.
Tafsyrai arabų kalba:
وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَنَّةِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟۠
మరియు ఎవరైతే అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేస్తారో వారందరి ప్రతిఫలం అల్లాహ్ వద్ద స్వర్గములో ప్రవేశము మరియు దాన్ని అంటిపెట్టుకుని ఉండటం. వారు అందులో శాశ్వతంగా ఉంటారు.
Tafsyrai arabų kalba:
وَاِذْ اَخَذْنَا مِیْثَاقَ بَنِیْۤ اِسْرَآءِیْلَ لَا تَعْبُدُوْنَ اِلَّا اللّٰهَ ۫— وَبِالْوَالِدَیْنِ اِحْسَانًا وَّذِی الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنِ وَقُوْلُوْا لِلنَّاسِ حُسْنًا وَّاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ؕ— ثُمَّ تَوَلَّیْتُمْ اِلَّا قَلِیْلًا مِّنْكُمْ وَاَنْتُمْ مُّعْرِضُوْنَ ۟
ఓ ఇస్రాయీలు సంతతివారా మేము మీపై తీసుకున్న దృఢమైన ప్రమాణమును గుర్తు చేసుకోండి. మీరు అల్లాహ్ ఏకేశ్వరోపాసన చేయటం ద్వారా మరియు ఆయనతో పాటు మీరు ఇతరులను ఆరాధించకుండా మరియు తల్లిదండ్రులకు,దగ్గరి బంధువులకు,అనాధలకు,నిరుపేదలకు మరియు అవసరం కలవారికి మీరు మేలు చేయటం ద్వారా మరియు మీరు ప్రజలకు మంచి మాట పలకటం ద్వారా,మంచిని ఆదేశించటం మరియు చెడు నుండి వారించటం ఎటువంటి కఠినత,తీవ్రత లేకుండా మరియు మీకు ఆదేశించబడిన విధంగా నమాజును పరిపూర్ణంగా మీరు పాటించటం ద్వారా మరియు జకాతును దానికి అర్హులైనవారికి మీకు మంచి అనిపించిన విధంగా వారికి ఇవ్వటం ద్వారా. ఈ ఒప్పందం తరువాత మీతో తీసుకున్న దాన్ని పూర్తి చేయటం నుండి మీరు విముఖత చూపుతూ తిరిగిపోవటం తప్ప మీ నుండి ఇంకేమి జరగలేదు. కాని అల్లాహ్ మీలో నుండి ఎవరినైతే రక్షించాడో వారు అల్లాహ్ తో చేసిన ఒప్పందమును,ప్రమాణమును పూర్తిచేశారు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• بعض أهل الكتاب يدّعي العلم بما أنزل الله، والحقيقة أن لا علم له بما أنزل الله، وإنما هو الوهم والجهل.
కొంత మంది గ్రంధవహులు అల్లాహ్ అవతరింపజేసిన వాటి గురించి జ్ఞానమున్నదని వాదిస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ అవతరించిన వాటి గురించి వారికి జ్ఞానం లేదు. అది భ్రమ,అజ్ఞానం మాత్రమే.

• من أعظم الناس إثمًا من يكذب على الله تعالى ورسله ؛ فينسب إليهم ما لم يكن منهم.
ప్రజల్లోంచి పెద్ద పాపాత్ముడు ఎవడంటే అతడే మహోన్నతుడైన అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై అబద్ధము పలికి వారిలో నుంచి కాని వాటిని వారికి ఆపాదించువాడు.

• مع عظم المواثيق التي أخذها الله تعالى على اليهود وشدة التأكيد عليها، لم يزدهم ذلك إلا إعراضًا عنها ورفضًا لها.
మహోన్నతుడైన అల్లాహ్ యూదులతో పెద్ద ప్రమాణాలు తీసుకుని వాటి గురించి కఠినంగా తాకీదు చేసినా కూడా అవి వారికి వాటి నుండి విముఖతను మరియు తిరస్కారమును మాత్రమే అధికం చేసినవి.

وَاِذْ اَخَذْنَا مِیْثَاقَكُمْ لَا تَسْفِكُوْنَ دِمَآءَكُمْ وَلَا تُخْرِجُوْنَ اَنْفُسَكُمْ مِّنْ دِیَارِكُمْ ثُمَّ اَقْرَرْتُمْ وَاَنْتُمْ تَشْهَدُوْنَ ۟
మీలోని కొందరు కొందరి రక్తం చిందించటము యొక్క నిషేదము గురించి మరియు మీలోని కొందరు కొందరిని వారి ఇండ్ల నుండి వెలివేయటము యొక్క నిషేధము గురించి తౌరాతులో మేము మీపై తీసుకున్న దృఢమైన ప్రమాణమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు మేము మీతో తీసుకున్న ప్రమాణమును మీరు అంగీకరించారు. మరియు మీరు అది సరి అవటంపై సాక్ష్యం పలికారు.
Tafsyrai arabų kalba:
ثُمَّ اَنْتُمْ هٰۤؤُلَآءِ تَقْتُلُوْنَ اَنْفُسَكُمْ وَتُخْرِجُوْنَ فَرِیْقًا مِّنْكُمْ مِّنْ دِیَارِهِمْ ؗ— تَظٰهَرُوْنَ عَلَیْهِمْ بِالْاِثْمِ وَالْعُدْوَانِ ؕ— وَاِنْ یَّاْتُوْكُمْ اُسٰرٰی تُفٰدُوْهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَیْكُمْ اِخْرَاجُهُمْ ؕ— اَفَتُؤْمِنُوْنَ بِبَعْضِ الْكِتٰبِ وَتَكْفُرُوْنَ بِبَعْضٍ ۚ— فَمَا جَزَآءُ مَنْ یَّفْعَلُ ذٰلِكَ مِنْكُمْ اِلَّا خِزْیٌ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَیَوْمَ الْقِیٰمَةِ یُرَدُّوْنَ اِلٰۤی اَشَدِّ الْعَذَابِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
ఆ తరువాత మీరు ఈ ప్రమాణమును విబేధించారు. అప్పుడు మీలో కొందరు కొందరిని హతమార్చారు. మరియు మీలో నుండి ఒక వర్గమును మీరు వారికి వ్యతిరేకంగా శతృవులకు సహాయం చేస్తూ అన్యాయంగా,దుర్మార్గంగా వారి నివాసముల నుండి వెలివేశారు. మరియు వారు శతృవుల చేతిలో బందీలై మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారి బందీ నుండి వారిని విముక్తి కలిగించటం కొరకు విమోచనాధనం ఇవ్వటంలో మీరు కృషి చేశారు. వారిని వారి ఇండ్ల నుండి వెలివేయటం మీపై నిషేధమైనా కూడా. మీరు ఎలా తౌరాతులో ఉన్న కొన్నింటిని ఖైదీలకు విమోచనా ధనం ఇవ్వటం అనివార్యమును విశ్వసిస్తున్నారు మరియు అందులో ఉన్న కొన్నింటిని రక్తమును పరిరక్షించటం మరియు మీలోని కొందరిని వారి నివాసముల నుండి వెళ్ళ గొట్టటంను ఆపటమును తిరస్కరిస్తున్నారు ?! మీలో నుండి ఇలా చేసే వారికి ప్రతిఫలము ఇహలోకములో అవమానము మరియు పరాభవము మాత్రమే ఉంటుంది. ఇక పరలోకంలో అతడు తీవ్రమైన శిక్ష వైపుకు మరలించబడుతాడు. మరియు అల్లాహ్ మీరు చేసే వాటి నుండి పరధ్యానంలో లేడు. అంతే కాదు ఆయన వాటి గురించి తెలుసుకునేవాడు మరియు ఆయన తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ اشْتَرَوُا الْحَیٰوةَ الدُّنْیَا بِالْاٰخِرَةِ ؗ— فَلَا یُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ یُنْصَرُوْنَ ۟۠
వారందరు ఉండిపోయే దానిపై అంతమైపోయే దాన్ని ప్రాధాన్యతనిస్తూ పరలోకమునకు బదులుగా ఇహలోకజీవితమును కోరుకున్నారు. పరలోకంలో వారి నుండి శిక్ష తేలిక చేయబడదు. ఆ రోజు వారికి సహాయం చేయటానికి ఏ సహాయకుడు ఉండడు.
Tafsyrai arabų kalba:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ وَقَفَّیْنَا مِنْ بَعْدِهٖ بِالرُّسُلِ ؗ— وَاٰتَیْنَا عِیْسَی ابْنَ مَرْیَمَ الْبَیِّنٰتِ وَاَیَّدْنٰهُ بِرُوْحِ الْقُدُسِ ؕ— اَفَكُلَّمَا جَآءَكُمْ رَسُوْلٌۢ بِمَا لَا تَهْوٰۤی اَنْفُسُكُمُ اسْتَكْبَرْتُمْ ۚ— فَفَرِیْقًا كَذَّبْتُمْ ؗ— وَفَرِیْقًا تَقْتُلُوْنَ ۟
మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంకు తౌరాతును ప్రసాదించాము. మరియు ఆయన తరువాత ప్రవక్తలను ఆయన అడుగుజాడలలో నడిపించాము. మరియు మేము మర్యమ్ కుమారుడగు ఈసా అలైహిస్సలాంకు ఆయన నిజాయితీని స్పష్టపరిచే మృతులను జీవింపజేయటం,పుట్టుగ్రుడ్డిని,కుష్టురోగిని నయం చేయటం లాంటి స్పష్టమైన సూచనలను ప్రసాదించాము. మరియు దైవదూత జిబ్రయీల్ ద్వారా మేము ఆయనను బలపరచాము. ఓ ఇస్రాయీలు సంతతివారా ఏమీ? మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా అల్లాహ్ వద్ద నుండి మీ వద్దకు వస్తే మీరు సత్యం పట్ల అహంకారమును చూపుతారా మరియు మీరు అల్లాహ్ ప్రవక్తలపట్ల దురహంకారమును చూపి వారిలో నుండి ఒక వర్గమును మీరు తిరస్కరించి ఒక వర్గమును హతమారుస్తారా ?!
Tafsyrai arabų kalba:
وَقَالُوْا قُلُوْبُنَا غُلْفٌ ؕ— بَلْ لَّعَنَهُمُ اللّٰهُ بِكُفْرِهِمْ فَقَلِیْلًا مَّا یُؤْمِنُوْنَ ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించకపోవటంలో యూదుల వాదన వారి మాటాల్లో ఇలా ఉన్నది : నిశ్ఛయంగా మా హృదయములు గ్లాఫులలో ఉన్నవి నీవు పలికే మాటలు వాటికి ఏమాత్రం చేరవు మరియు అవి దాన్ని అర్ధం చేసుకోవు. వారు భావిస్తున్నట్లు పరిస్థితి అలా లేదు. కాని అల్లాహ్ వారి అవిశ్వాసం వలన తన కారుణ్యము నుండి వారిని గెంటివేశాడు. అల్లాహ్ అవతరింపజేసిన వాటిపై వారు చాలా తక్కువ విశ్వాసం చూపుతారు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• من أعظم الكفر: الإيمان ببعض ما أنزل الله والكفر ببعضه؛ لأن فاعل ذلك قد جعل إلهه هواه.
పెద్ద అవిశ్వాసములోంచిది ఏమిటంటే అల్లాహ్ అవతరించిన వాటిలో నుంచి కొన్నింటిని విశ్వసించి కొన్నింటిని అవిశ్వసించటం. ఎందుకంటే అలా చేసేవాడు తన మనోవాంఛలను తన ఆరాధ్య దైవంగా చేసుకున్నాడు.

• عِظَم ما بلغه اليهود من العناد، واتباع الهوى، والتلاعب بما أنزل الله تعالى.
యూదుల తలబిరుసుతనము మరియు మనోవాంఛల అనుసరణ మరియు మహోన్నతుడైన అల్లాహ్ అవతరించిన వాటి పట్ల ఆటలాడటం యొక్క పెద్ద తప్పిదము యొక్క వివరణ.

• فضل الله تعالى ورحمته بخلقه، حيث تابع عليهم إرسال الرسل وإنزال الكتب لهدايتهم للرشاد.
మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహము మరియు ఆయన దాసుల పట్ల ఆయన కారుణ్యము ఎందుకంటే వారికి సన్మార్గము యొక్క మార్గ దర్శకము కొరకు ఒకరి తరువాత ఒకరు ప్రవక్తలను వారి వద్దకు పంపించటం మరియు గ్రంధముల అవతరణ జరిగినది.

• أن الله يعاقب المعرضين عن الهدى المعاندين لأوامره بالطبع على قلوبهم وطردهم من رحمته؛ فلا يهتدون إلى الحق، ولا يعملون به.
నిశ్ఛయంగా అల్లాహ్ సన్మార్గము నుండి విముఖత చూపేవారికి,ఆయన ఆదేశములను వ్యతిరేకించే వారికి వారి హృదయములపై సీలు వేసి మరియు వారిని తన కారుణ్యము నుండి గెంటివేసి శిక్షిస్తాడు. అప్పుడు వారు సత్యము వైపునకు మార్గము పొందరు మరియు దాని ప్రకారం ఆచరించరు.

وَلَمَّا جَآءَهُمْ كِتٰبٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ ۙ— وَكَانُوْا مِنْ قَبْلُ یَسْتَفْتِحُوْنَ عَلَی الَّذِیْنَ كَفَرُوْا ۚ— فَلَمَّا جَآءَهُمْ مَّا عَرَفُوْا كَفَرُوْا بِهٖ ؗ— فَلَعْنَةُ اللّٰهِ عَلَی الْكٰفِرِیْنَ ۟
మరియు ఎప్పుడైతే తౌరాతులో మరియు ఇంజీలులో ఉన్న సాధారణమైన సరైన నియమములకు అనుగుణంగా ఉండే దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు వచ్చినదో మరియు వారు దాని అవతరణకు మునుపు ఇలా పలికే వారు : మేము ముష్రికులపై విజయం సాధిస్తాము, మరియు ఒక ప్రవక్తను పంపినప్పుడు అది మనకు తెరవబడుతుంది, కాబట్టి మనం ఆయనను విశ్వసించి ఆయనను అనుసరిస్తాము. ఎప్పుడైతే వారి వద్దకు వారికి తెలిసిన గుణములు కల ఖుర్ఆన్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారికి తెలిసిన సత్యము వచ్చినదో వారు దాన్ని తిరస్కరించారు. అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించే వారిపై అల్లాహ్ శాపము కురియుగాక.
Tafsyrai arabų kalba:
بِئْسَمَا اشْتَرَوْا بِهٖۤ اَنْفُسَهُمْ اَنْ یَّكْفُرُوْا بِمَاۤ اَنْزَلَ اللّٰهُ بَغْیًا اَنْ یُّنَزِّلَ اللّٰهُ مِنْ فَضْلِهٖ عَلٰی مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ ۚ— فَبَآءُوْ بِغَضَبٍ عَلٰی غَضَبٍ ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ مُّهِیْنٌ ۟
అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై విశ్వాసమునకు బదులుగా వారి మనస్సులు కోరుకున్న భాగము ఎంతో చెడ్డది. అయితే వారు అల్లాహ్ అవతరించిన దాన్ని అవిశ్వసించారు మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించారు. దైవదౌత్యము మరియు ఖుర్ఆన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించబడటం వలన దుర్మార్గంగా మరియు అసూయగా. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వారు తిరస్కరించటం వలన మరియు ముందు నుంచే తౌరాతులో మార్పు చేర్పులు చేయటం వలన వారు మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి రెట్టింపు ఆగ్రహానికి యోగ్యులయ్యారు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యమును తిరస్కరించే వారి కొరకు ప్రళయదినమున అవమానపరిచే శిక్ష కలదు.
Tafsyrai arabų kalba:
وَاِذَا قِیْلَ لَهُمْ اٰمِنُوْا بِمَاۤ اَنْزَلَ اللّٰهُ قَالُوْا نُؤْمِنُ بِمَاۤ اُنْزِلَ عَلَیْنَا وَیَكْفُرُوْنَ بِمَا وَرَآءَهٗ ۗ— وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ؕ— قُلْ فَلِمَ تَقْتُلُوْنَ اَنْۢبِیَآءَ اللّٰهِ مِنْ قَبْلُ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
ఈ యూదులందరితో మీరు అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన సత్యమును,సన్మార్గమును విశ్వసించండి అని పలకబడినప్పుడు వారు ఇలా పలికేవారు : మా ప్రవక్తలపై అవతరింపబడిన వాటిని మేము విశ్వసిస్తున్నాము. మరియు వారు అది కాకుండా వేరేవి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన దానిని తిరస్కరించేవారు. అది కూడా ఈ ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వారి వద్ద ఉన్న దానికి అనుగుణంగా ఉన్న సత్యము. ఒక వేళ వారు వాస్తవానికి తమపై అవతరింపబడిన వాటిని విశ్వసించి ఉంటే ఖుర్ఆన్ ను విశ్వసించేవారు. ఓ ప్రవక్త వారికి సమాధానమిస్తూ ఇలా పలకండి : ఎందుకని మీరు అల్లాహ్ ప్రవక్తలను మునుపటి నుండి హతమార్చేవారు. ఒక వేళ మీరు వాస్తవానికి వారు మీ వద్దకు తీసుకుని వచ్చిన సత్యమును విశ్వసించి ఉంటే.
Tafsyrai arabų kalba:
وَلَقَدْ جَآءَكُمْ مُّوْسٰی بِالْبَیِّنٰتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهٖ وَاَنْتُمْ ظٰلِمُوْنَ ۟
మరియు నిశ్చయంగా మీ ప్రవక్త అయిన మూసా అలైహిస్సలాం తన నిజాయితీపై సూచించే స్పష్టమైన ఆయతులను మీ వద్దకు తీసుకుని వచ్చారు. దాని తరువాత మీరు మూసా తన ప్రభువును కలవటానికి వెళ్ళిన తరువాత ఆవు దూడను తయారు చేసుకుని దాన్ని ఆరాధించేవారు. మరియు అల్లాహ్ తోపాటు మీరు సాటి కల్పించటం వలన దుర్మార్గమునకు పాల్పడ్డారు. మరియు ఆయన ఒక్కడే ఇతరులు కాకుండా ఆరాధనకు యోగ్యుడు.
Tafsyrai arabų kalba:
وَاِذْ اَخَذْنَا مِیْثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّوْرَ ؕ— خُذُوْا مَاۤ اٰتَیْنٰكُمْ بِقُوَّةٍ وَّاسْمَعُوْا ؕ— قَالُوْا سَمِعْنَا وَعَصَیْنَا ۗ— وَاُشْرِبُوْا فِیْ قُلُوْبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ؕ— قُلْ بِئْسَمَا یَاْمُرُكُمْ بِهٖۤ اِیْمَانُكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
మూసా అలైహిస్సలాంను అనుసరించమని మరియు ఆయన అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాన్ని స్వీకరించమని మేము మీపై దృఢమైన ప్రమాణమును తీసుకుని వచ్చినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. మరియు మేము మిమ్మల్ని భయపెట్టటానికి పర్వతమును మీపై తీసుకుని వచ్చి నిలబెట్టాము. మరియు మేము మీతో ఇలా పలికాము : మేము మీకు ప్రసాదించిన తౌరాతును శ్రమతో,కృషితో తీసుకోండి. మరియు స్వీకరించి విధేయత చూపే ఉద్దేశంతో వినండి. అలా గనుక జరగకపోతే మేము మీపై పర్వతమును పడవేస్తాము. అప్పుడు మీరు ఇలా పలికారు : మేము మా చెవులతో విన్నాము మరియు మేము మా చర్యల ద్వారా అవిధేయత చూపాము. వారి అవిశ్వాసం వలన ఆవు దూడ ఆరాధన వారి హృదయములలో చోటు చేసుకుంది. ఓ ప్రవక్త మీరు ఇలా పలకండి : ఒక వేళ మీరు విశ్వసించేవారైతే అల్లాహ్ పట్ల అవిశ్వాసం కలిగిన ఈ విశ్వాసం మీకు ఆదేశిస్తున్నది ఎంతో చెడ్డది. ఎందుకంటే సత్య విశ్వాసముతో పాటు అవిశ్వాసం ఉండదు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• اليهود أعظم الناس حسدًا؛ إذ حملهم حسدهم على الكفر بالله وردِّ ما أنزل، بسبب أن الرسول صلى الله عليه وسلم لم يكن منهم.
యూదులు ప్రజల్లోకెల్ల పెద్ద అసూయపరులు అందుకనే వారి అసూయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో నుంచి కాక పోవటం వలన అల్లాహ్ పట్ల అవిశ్వాసం పై మరియు ఆయన అవతరించిన దాన్ని ఖండించటం పై పురిగొల్పింది.

• أن الإيمان الحق بالله تعالى يوجب التصديق بكل ما أَنزل من كتب، وبجميع ما أَرسل من رسل.
అల్లాహ్ పై సత్యవిశ్వాసం ఆయన అవతరింపజేసిన గ్రంధములన్నింటిని మరియు ఆయన పంపించిన ప్రవక్తలందరిని దృవీకరించటమును అనివార్యం చేస్తుంది.

• من أعظم الظلم الإعراض عن الحق والهدى بعد معرفته وقيام الأدلة عليه.
పెద్ద దుర్మార్గముల్లో ఒకటి సత్యాన్ని,మార్గదర్శకత్వమును తెలుసుకున్న తరువాత దాని నుండి విముఖత చూపటం మరియు దానికి వ్యతిరేకంగా ఆధారాలను ఏర్పాటు చేయటం.

• من عادة اليهود نقض العهود والمواثيق، وهذا ديدنهم إلى اليوم.
ఒప్పొందాలను,ప్రమాణములను విచ్ఛిన్నం చేయటం యూదుల అలవాటులలో ఒకటి. మరియు ఇది ఈ రోజు వరకు వారి అలవాటుగానే ఉన్నది.

قُلْ اِنْ كَانَتْ لَكُمُ الدَّارُ الْاٰخِرَةُ عِنْدَ اللّٰهِ خَالِصَةً مِّنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ యూదులారా ఒక వేళ పరలోక నివాసములో మీ కొరకు స్వర్గము ప్రత్యేకించి ఉండి ప్రజల్లో మీరు తప్ప ఇంకెవరు అందులో ప్రవేశించకుండా ఉండి ఉంటే మీరు మరణమును ఆశించండి మరియు దాన్ని కోరుకోండి. ఈ స్థానమును మీరు త్వరగా పొందటానికి మరియు ఇహలోక జీవితము యొక్క భారాలు మరియు వాటి చింతల నుండి మీరు విశ్రాంతి తీసుకోవటానికి. ఒక వేళ మీరు మీ ఈ వాదనలో సత్యవంతులే అయితే.
Tafsyrai arabų kalba:
وَلَنْ یَّتَمَنَّوْهُ اَبَدًا بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ ۟
వారు తమ జీవితంలో చేసిన అల్లాహ్ పట్ల అవిశ్వాసము,ఆయన ప్రవక్తలను తిరస్కరించటం మరియు ఆయన గ్రంధముల్లో మార్పు చేర్పులు చేయటం వలన వారు ఎన్నటికి మరణమును ఆశించరు. మరియు అల్లాహ్ కు వారిలో నుంచి ,ఇతరుల్లోంచి దుర్మార్గుల గురించి బాగా తెలుసు. మరియు ఆయన తొందరలోనే ప్రతి ఒక్కరికి వారి కర్మల పరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَلَتَجِدَنَّهُمْ اَحْرَصَ النَّاسِ عَلٰی حَیٰوةٍ ۛۚ— وَمِنَ الَّذِیْنَ اَشْرَكُوْا ۛۚ— یَوَدُّ اَحَدُهُمْ لَوْ یُعَمَّرُ اَلْفَ سَنَةٍ ۚ— وَمَا هُوَ بِمُزَحْزِحِهٖ مِنَ الْعَذَابِ اَنْ یُّعَمَّرَ ؕ— وَاللّٰهُ بَصِیْرٌ بِمَا یَعْمَلُوْنَ ۟۠
ఓ ప్రవక్త మీరు తప్పకుండా యూదులను జీవితంపై ప్రజల్లోకెల్లా అత్యంత ఆశ కలిగిన వారిగా పొందుతారు అది నీచమైనదైన,అవమానకరమైనదైన సరే. అంతే కాదు వారు మరణాంతరం లేపబడటం మరియు లెక్కతీసుకోవటంపై విశ్వాసం కనబరచని ముష్రికుల కన్న ఎక్కువ ఆశ కలిగిన వారు. వారు గ్రంధవహులై,మరణాంతరం లేపబడటం,లెక్కతీసుకోబడటంపై విశ్వాసం కలిగి కూడాను. వారిలో నుండి ఒక్కడు అతని వయస్సు వెయ్యేళ్ళు చేరాలని కోరుతున్నాడు. అతని వయస్సు పెరిగిన అల్లాహ్ శిక్ష నుండి అతన్ని అది దూరం చేయదు. మరియు అల్లాహ్ వారి కర్మల గురించి తెెలుసుకునే వాడును,వాటిపై దృష్టి పెట్టి ఉన్న వాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి వాటిపరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
قُلْ مَنْ كَانَ عَدُوًّا لِّجِبْرِیْلَ فَاِنَّهٗ نَزَّلَهٗ عَلٰی قَلْبِكَ بِاِذْنِ اللّٰهِ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ وَهُدًی وَّبُشْرٰی لِلْمُؤْمِنِیْنَ ۟
ఓ ప్రవక్త నిశ్చయంగా దైవదూతల్లోంచి జిబ్రాయీలు మనకు శతృవు అని యూదుల్లోంచి పలికే వారితో మీరు ఇలా పలకండి : ఎవరైతే జిబ్రాయీల్ ను శతృవుగా భావిస్తాడో ఎందుకంటే ఆయన అల్లాహ్ సూచన మేరకు ఖుర్ఆన్ ను మీ హృదయంపై అవతరింపజేశాడు. అది పూర్వ దివ్యగ్రంధములైన తౌరాత్,ఇంజీలును దృవీకరిస్తుంది. మరియు మంచిని గురించి సూచిస్తుంది. మరియు విశ్వాసపరుల కొరకు అల్లాహ్ సిద్ధం చేసి ఉంచిన అనుగ్రహాల గురించి వారికి శుభవార్తనిస్తుంది. ఎవరైతే ఈ గుణములు,చర్యలు కలిగిన వారిని శతృవుగా భావించాడో అతడు మార్గభ్రష్టతకు లోనయిన వారిలో నుంచివాడు.
Tafsyrai arabų kalba:
مَنْ كَانَ عَدُوًّا لِّلّٰهِ وَمَلٰٓىِٕكَتِهٖ وَرُسُلِهٖ وَجِبْرِیْلَ وَمِیْكٰىلَ فَاِنَّ اللّٰهَ عَدُوٌّ لِّلْكٰفِرِیْنَ ۟
ఎవరైతే అల్లాహ్ కు,ఆయన దూతలకు,ఆయన ప్రవక్తలకు శతృవుగా ఉంటాడో మరియు దగ్గరి దూతలైన జిబ్రయీల్,మీకాయిల్ కు శతృవుగా ఉంటాడో నిశ్ఛయంగా అల్లాహ్ మీలో నుండి అవిశ్వాసపరులకు మరియు ఇతరుల కొరకు శతృవుగా ఉంటాడు. మరియు అల్లాహ్ ఎవరికైతే శతృవుగా ఉంటాడో అతడు స్పష్టమైన నష్టమును తీసుకుని మరలుతాడు.
Tafsyrai arabų kalba:
وَلَقَدْ اَنْزَلْنَاۤ اِلَیْكَ اٰیٰتٍۢ بَیِّنٰتٍ ۚ— وَمَا یَكْفُرُ بِهَاۤ اِلَّا الْفٰسِقُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు తీసుకుని వచ్చిన దైవదౌత్యము మరియు దైవవాణి విషయంలో మీ నిజాయితీపై స్పష్టమైన సూచనలను మేము మీ వైపునకు అవతరింపజేశాము. అవి స్పష్టమై,బహిర్గతమైన కూడా అల్లాహ్ ధర్మం నుండి వైదొలగిన వారు మాత్రమే నిరాకరిస్తారు.
Tafsyrai arabų kalba:
اَوَكُلَّمَا عٰهَدُوْا عَهْدًا نَّبَذَهٗ فَرِیْقٌ مِّنْهُمْ ؕ— بَلْ اَكْثَرُهُمْ لَا یُؤْمِنُوْنَ ۟
యూదుల దుస్థితిలో నుంచి ఒకటి వారితో ఏదైన ప్రమాణం తీసుకుంటే - తౌరాతు సూచించే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యంపై విశ్వాసం చూపటంపై - వారిలో నుండి ఒక వర్గము దాన్ని భంగపరుస్తుంది. అంతేకాదు వాస్తవానికి చాలా మంది ఈ యూదులు మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసిన వాటిపై విశ్వాసం కనబరచలేదు. ఎందుకంటే విశ్వాసం ప్రమాణమును సంపూర్ణం చేయటంపై పురిగొల్పుతుంది.
Tafsyrai arabų kalba:
وَلَمَّا جَآءَهُمْ رَسُوْلٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِیْقٌ مِّنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ ۙۗ— كِتٰبَ اللّٰهِ وَرَآءَ ظُهُوْرِهِمْ كَاَنَّهُمْ لَا یَعْلَمُوْنَ ۟ؗ
మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వద్ద నుండి ప్రవక్తగా వారి వద్దకు వచ్చినప్పుడు మరియు ఆయన తౌరాత్ లో ఉన్న తన గుణమునకు అనుగుణంగా ఉన్నారు. వారిలో నుండి ఒక వర్గము అది సూచించే దాని నుండి విముఖత చూపి దాన్ని పట్టించుకోకుండా తమ వీపుల వెనుక పడవేశారు. అందులో ఉన్న సత్యము నుండి,సన్మార్గము నుండి ప్రయోజనం చెందకుండా,వాటిని పట్టించుకోని అజ్ఞాని స్థితిని పోలియున్నారు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• المؤمن الحق يرجو ما عند الله من النعيم المقيم، ولهذا يفرح بلقاء الله ولا يخشى الموت.
వాస్తవ విశ్వాసపరుడు అల్లాహ్ వద్ద ఉన్న శాశ్వత అనుగ్రహాలను ఆశిస్తారు. మరియు ఇందుకనే అతడు అల్లాహ్ కలుసుకోవటం గురించి సంతోషపడుతాడు. మరియు అతడు మరణము నుంచి భయపడడు.

• حِرص اليهود على الحياة الدنيا حتى لو كانت حياة حقيرة مهينة غير كريمة.
ఇహలోక జీవితంపై యూదులు అత్యాశ కలిగి ఉండటం చివరికి ఆ జీవితం నీచమైన,దిగజారినదైన,అగౌరవప్రదమైనా సరే.

• أنّ من عادى أولياء الله المقربين منه فقد عادى الله تعالى.
అల్లాహ్ సన్నిహితులకు ఎవరైతే శతృత్వం కలిగి ఉంటాడో అతడు మహోన్నతుడైన అల్లాహ్ కు శతృత్వం కలిగి ఉంటాడు.

• إعراض اليهود عن نبوة محمد صلى الله عليه وسلم بعدما عرفوا تصديقه لما في أيديهم من التوراة.
యూదులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దౌత్యం గురించి వారి చేతుల్లో ఉన్న పుస్తకముల్లో దాని దృవీకరణను తెలిసిన తరువాత కూడా దాని నుండి విముఖత చూపారు.

• أنَّ من لم ينتفع بعلمه صح أن يوصف بالجهل؛ لأنه شابه الجاهل في جهله.
ఎవరైతే తన జ్ఞానంతో ప్రయోజనం చెందడో అతడిని అజ్ఞానంతో వర్ణించడం సరైనది. ఎందుకంటే అతను తన అజ్ఞానంలో అజ్ఞానితో పోలియున్నాడు.

وَاتَّبَعُوْا مَا تَتْلُوا الشَّیٰطِیْنُ عَلٰی مُلْكِ سُلَیْمٰنَ ۚ— وَمَا كَفَرَ سُلَیْمٰنُ وَلٰكِنَّ الشَّیٰطِیْنَ كَفَرُوْا یُعَلِّمُوْنَ النَّاسَ السِّحْرَ ۗ— وَمَاۤ اُنْزِلَ عَلَی الْمَلَكَیْنِ بِبَابِلَ هَارُوْتَ وَمَارُوْتَ ؕ— وَمَا یُعَلِّمٰنِ مِنْ اَحَدٍ حَتّٰی یَقُوْلَاۤ اِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ؕ— فَیَتَعَلَّمُوْنَ مِنْهُمَا مَا یُفَرِّقُوْنَ بِهٖ بَیْنَ الْمَرْءِ وَزَوْجِهٖ ؕ— وَمَا هُمْ بِضَآرِّیْنَ بِهٖ مِنْ اَحَدٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ— وَیَتَعَلَّمُوْنَ مَا یَضُرُّهُمْ وَلَا یَنْفَعُهُمْ ؕ— وَلَقَدْ عَلِمُوْا لَمَنِ اشْتَرٰىهُ مَا لَهٗ فِی الْاٰخِرَةِ مِنْ خَلَاقٍ ۫ؕ— وَلَبِئْسَ مَا شَرَوْا بِهٖۤ اَنْفُسَهُمْ ؕ— لَوْ كَانُوْا یَعْلَمُوْنَ ۟
మరియు ఎప్పుడైతే వారు అల్లాహ్ ధర్మమును వదిలివేశారో వారు దానికి బదులుగా అల్లాహ్ ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం రాజ్యం విషయంలో షైతానులు కల్పించుకున్న అబద్దమును అనుసరించారు. ఎందుకంటే ఆయన తన రాజ్యమును మంత్రజాలముతో స్థాపించారని వారు వాదించారు. సులైమాన్ అలైహిస్సలాం మంత్రజాలమును ఉపయోగించి అవిశ్వాసమునకు పాల్పడలేదు. ఏ విధంగానైతే యూదులు వాదించేవారో. కానీ షైతానులు అవిశ్వాసమును కనబరచారు ఎందుకంటే వారు ప్రజలకు మంత్రజాలమును నేర్పించేవారు. ఇరాక్ లోని బాబిల్ పట్టణంలోని ఇద్దరు దైవదూతలైన హారూత్ మరియు మారూత్ పై ప్రజలకు పరీక్షగా అవతరింపబడే మంత్రజాలమును వారు వారికి నేర్పించేవారు. ఆ ఇద్దరు దూతలు ప్రతి ఒక్కరితో తమ మాటల్లో మేము ప్రజల కొరకు ఒక పరీక్ష కావున మీరు మంత్రజాలమును నేర్చుకుని అవిశ్వాసమునకు పాల్పడకండి అని హెచ్చరించిన తరువాతే నేర్పించేవారు. ఎవరైతే వారి హితోపదేశమును స్వీకరించలేదో వారు వారి నుండి మంత్రజాలమును నేర్చుకునేవారు. అందులో నుండి ఒక రకము మనిషికి అతని భార్యకు మధ్య వైరమును నాటి వారిద్దరి మధ్య వేరు చేసేది. ఈ మంత్రజాలకులందరు ఎవరికైనా నష్టం కలిగించిన అది అల్లాహ్ ఇచ్ఛతో,అనుమతితో మాత్రమే. వారు తమకు నష్టం కలిగించేది మరియు తమకు లాభం కలిగించని దాన్ని నేర్చుకుంటున్నారు. మరియు ఈ యూదులందరికి తెలుసు అల్లాహ్ గ్రంధమునకు బదులుగా మంత్రజాలమును ఎంచుకునే వాడికి పరలోకంలో ఎటువంటి వంతుగాని భాగము గాని లేదని. వారు దేనికి బదులుగా తమ ప్రాణములను అమ్మివేశారో అది ఎంతో చెడ్డది. ఎందుకంటే వారు అల్లాహ్ దివ్యవాణికి,ఆయన శాసనములకు బదులుగా మంత్రజాలమును ఎంచుకున్నారు. మరియు ఒక వేళ వారికి ప్రయోజనం కలిగించేది ఏదో వారికి తెలిసి ఉంటే ఈ అవమానకర చర్యకు,స్పష్టమైన మార్గ భ్రష్టతకు పాల్పడటానికి ముందడుగు వేసేవారు కాదు.
Tafsyrai arabų kalba:
وَلَوْ اَنَّهُمْ اٰمَنُوْا وَاتَّقَوْا لَمَثُوْبَةٌ مِّنْ عِنْدِ اللّٰهِ خَیْرٌ ؕ— لَوْ كَانُوْا یَعْلَمُوْنَ ۟۠
ఒక వేళ యూదులు వాస్తవానికి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయనపై విధేయత చూపటం మరియు ఆయనపై అవిధేయతను వదిలివేయటం ద్వారా ఆయనకు భయపడి ఉంటే వారు దేనిపైనైతే ఉన్నారో దాని కంటే వారికొరకు అల్లాహ్ ప్రతిఫలం ఎంతో మేలైనది. ఒక వేళ వారు తమకు ప్రయోజనం కలిగించే వాటిని తెలుసుకుని ఉంటే.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَقُوْلُوْا رَاعِنَا وَقُوْلُوا انْظُرْنَا وَاسْمَعُوْا ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ اَلِیْمٌ ۟
అల్లాహ్ విశ్వాసపరులకు మంచి మాటల ఎంపికను నిర్దేశిస్తూ వారితో ఇలా పలికాడు : ఓ విశ్వాసపరులారా మీరు రాయినా అని పలకకండి. అంటే మీరు మా పరిస్థితులను గమనించండి. ఎందుకంటే యూదులు దాన్ని వక్రీ కరించేవారు. దాని ద్వారా వారు దైవ ప్రవక్తను ఉద్దేశించి పెడ అర్ధమును నిర్ణయించుకుని పలికేవారు. అది రఊన (కాయటం ,కాపరి). కావున అల్లాహ్ ఈ మార్గమును అడ్డుకోవటానికి ఈ మాటను నిషేధించాడు. మరియు తన దాసులకు దానికి బదులుగా ఉన్జుర్నా అని పలకమని ఆదేశించాడు. అంటే మీరు మా కొరకు నిరీక్షించండి మీరు పలికే మాటను మేము అర్ధం చేసుకుంటాము. మరియు ఇది హెచ్చరిక లేకుండా అర్ధానికి దారితీసే పదం. మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కెరకు బాధాకరమైన శిక్ష కలదు.
Tafsyrai arabų kalba:
مَا یَوَدُّ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَلَا الْمُشْرِكِیْنَ اَنْ یُّنَزَّلَ عَلَیْكُمْ مِّنْ خَیْرٍ مِّنْ رَّبِّكُمْ ؕ— وَاللّٰهُ یَخْتَصُّ بِرَحْمَتِهٖ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ ۟
అవిశ్వాసపరులు వారు యూదులైనా లేదా ముష్రికులైనా మీ ప్రభువు వద్ద నుండి ఏదైన మేలు అది కొద్దిగా అయినా లేదా ఎక్కువ అయిన మీపై అవతరించటంను ఇష్టపడరు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారికి తన కారుణ్యమును దైవదౌత్య రూపంలో,దైవవాణి రూపంలో,విశ్వాసం రూపంలో ప్రత్యేకిస్తాడు. మరియు అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. సృష్టి రాసుల్లోంచి ఎవరికైన ఏదైన మేలు కలిగితే ఆయన వద్ద నుండే కలుగును. దైవ ప్రవక్తను పంపించటం మరియు గ్రంధమును అవతరింపజేయటం ఆయన అనుగ్రహములో నుంచే.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• سوء أدب اليهود مع أنبياء الله حيث نسبوا إلى سليمان عليه السلام تعاطي السحر، فبرّأه الله منه، وأَكْذَبَهم في زعمهم.
అల్లాహ్ ప్రవక్తల పట్ల యూదుల చెడ్డ ప్రవర్తన ఎలాగంటే వారు సులైమాన్ అలాహిస్సలాం మంత్రజాలమును వినియోగించారని వారు అపాదించారు. అయితే అల్లాహ్ ఆయనను దాని నుండి పరిశుద్ధుడని తెలియపరచాడు. మరియు వారు తమ వాదనలో అసత్యులని తెలియపరచాడు.

• أن السحر له حقيقة وتأثير في العقول والأبدان، والساحر كافر، وحكمه القتل.
మంత్రజాలము అన్నది దానికి వాస్తవికత ఉన్నది. మరియు అది మనస్సులపై మరియు శరీరములపై ప్రభావం చూపుతుంది. మరియు మంత్రజాలకుడు అవిశ్వాసపరుడు. అతని విషయంలో ఆదేశం అతన్ని హతమార్చటం.

• لا يقع في ملك الله تعالى شيء من الخير والشر إلا بإذنه وعلمه تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ రాజ్యంలో ఏదైన మేలుగాని,కీడుగాని కలిగితే మహోన్నతుడైన ఆయన అనుమతితో మరియు ఆయన జ్ఞానంతో కలుగుతుంది.

• سد الذرائع من مقاصد الشريعة، فكل قول أو فعل يوهم أمورًا فاسدة يجب تجنبه والبعد عنه.
కారకాలను నిరోధించటం ధర్మ ఉద్దేశముల్లోంచిది. కావున ఆ ప్రతి మాట,చర్య చెడును కలిగించేది అని సందేహముంటే దాని నుండి జాగ్రత్తగా ఉండటం మరియు దాని నుండి దూరంగా ఉండటం తప్పనిసరి.

• أن الفضل بيد الله تعالى وهو الذي يختص به من يشاء برحمته وحكمته.
అనుగ్రహము అన్నది మహోన్నతుడైన అల్లాహ్ చేతిలో ఉన్నది. మరియు ఆయనే దాని ద్వారా తాను తలచుకున్న వారికి తన కారుణ్యముతో,తన విజ్ఞతతో ప్రత్యేకిస్తాడు.

مَا نَنْسَخْ مِنْ اٰیَةٍ اَوْ نُنْسِهَا نَاْتِ بِخَیْرٍ مِّنْهَاۤ اَوْ مِثْلِهَا ؕ— اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
అల్లాహ్ స్పష్టపరుస్తున్నాడు ఆయన ఖుర్ఆన్ నుండి ఏదైన ఆయత్ యొక్క ఆదేశమును ఎత్తివేసినప్పుడు లేదా దాని పదములనే ఎత్తివేసినప్పుడు ఆయన వాటి నుండి ప్రజలను మరపింపజేస్తాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయన దాని కన్న ప్రయోజనకరమైన దాన్ని త్వరగా లేదా ఆలస్యంగా లేదా దానికి పోలినటువంటి వాటిని తీసుకుని వస్తాడు. మరియు ఇది అల్లాహ్ జ్ఞానముతో మరియు ఆయన విజ్ఞతతో. ఓ ప్రవక్త మీకు తెలుసు అల్లాహ్ ప్రతీది చేయగల సమర్ధుడని. కావున ఆయన తాను తలచుకున్నది చేస్తాడు. తాను కోరికున్నది నిర్ణయిస్తాడు.
Tafsyrai arabų kalba:
اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَمَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟
ఓ ప్రవక్త మీకు తెలుసు అల్లాహ్ భూమ్యాకాశముల సామ్రాజ్యాధిపతి అని. ఆయన తలచుకున్నది ఆయన నిర్ణయిస్తాడు. తాను తలచిన దాని గురించి తన దాసులకు ఆయన ఆదేశిస్తాడు. మరియు తాను తలచుకున్న వాటి నుండి వారిని వారిస్తాడు. ధర్మం నుండి తాను తలచుకున్న దాన్ని స్థాపిస్తాడు. మరియు తాను తలచుకున్న దాన్ని రద్దు పరుస్తాడు. మరియు మీ కొరకు అల్లాహ్ తరువాత మీ వ్యవహారములను పరిరక్షించే పరిరక్షకుడెవడూ ఉండడు. మరియు మీ నుండి కీడును తొలగించే ,హాయకుడెవడూ ఉండడు. కాని అల్లాహ్ యే వాటన్నిటి పరిరక్షకుడు మరియు దాన్ని చేసే సమర్ధుడు.
Tafsyrai arabų kalba:
اَمْ تُرِیْدُوْنَ اَنْ تَسْـَٔلُوْا رَسُوْلَكُمْ كَمَا سُىِٕلَ مُوْسٰی مِنْ قَبْلُ ؕ— وَمَنْ یَّتَبَدَّلِ الْكُفْرَ بِالْاِیْمَانِ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِیْلِ ۟
ఓ విశ్వాసులారా మీరు మీ ప్రవక్తను అభ్యంతరకరమైన,మొండిదైన ప్రశ్నను అడగటం మీ పని కాదు. ఏ విధంగానైతే మూసా అలైహిస్సలాం జాతివారు తమ ప్రవక్తను ఇంతకు ముందే అడిగారో. వారి మాట ఇలా ఉన్నది : أَرِنَا اللَّهَ جَهْرَةً﴾ [النساء: ١٥٣]﴿ "నీవు అల్లాహ్ ను మాకు ప్రత్యక్షంగా చూపించు". మరియు ఎవరైతే విశ్వాసమునకు బదులుగా అవిశ్వాసమును కోరుకుంటాడో అతడు సన్మార్గమైన మాధ్యే మార్గము నుండి తప్పిపోతాడు.
Tafsyrai arabų kalba:
وَدَّ كَثِیْرٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ یَرُدُّوْنَكُمْ مِّنْ بَعْدِ اِیْمَانِكُمْ كُفَّارًا ۖۚ— حَسَدًا مِّنْ عِنْدِ اَنْفُسِهِمْ مِّنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْحَقُّ ۚ— فَاعْفُوْا وَاصْفَحُوْا حَتّٰی یَاْتِیَ اللّٰهُ بِاَمْرِهٖ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
చాలా మంది యూదులు మరియు క్రైస్తవులు మీరు విశ్వాసం తీసుకుని వచ్చిన తరువాత మిమ్మల్ని అవిశ్వాసులుగా మరల్చాలనుకుంటున్నారు. ఏ విధంగానైతే మీరు విగ్రహాలను ఆరాధించేవారో. ఇది వారి మనస్సుల్లో ఉన్న అసూయ వలన. ప్రవక్త అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చినది సత్యం అని వారికి స్పష్టమైన తరువాత వారు ఇలా ఆశిస్తున్నారు. ఓ విశ్వాసులారా వారి చర్యలను క్షమించివేయండి. మరియు వారి అజ్ఞానమును మరియు వారి మనస్సుల్లో ఉన్న చెడును మన్నించివేయండి. వారి విషయంలో అల్లాహ్ తీర్పు వచ్చేంత వరకు. వాస్తవానికి అల్లాహ్ ఈ ఆదేశం,ఆయన తీర్పు వచ్చినది. మరియు అవిశ్వాసపరునికి ఇస్లాంను లేదా జిజియా ఇవ్వటంను లేదా యుద్దం చేయటంను ఎంపిక చేసుకునే అధికారం కలదు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. కాబట్టి వారు ఆయనను అశక్తుడిని చేయలేరు.
Tafsyrai arabų kalba:
وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ؕ— وَمَا تُقَدِّمُوْا لِاَنْفُسِكُمْ مِّنْ خَیْرٍ تَجِدُوْهُ عِنْدَ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
మరియు మీరు నమాజును దాని మూలవిషయాలతో,విధులతో,సున్నతులతో పరిపూర్ణంగా పాటించండి. మరియు మీరు మీ సంపదల నుండి జకాతును తీసి దాని హక్కుదారులకు ఇవ్వండి. మరియు మీరు ఏదైతే సత్కర్మను మీ ఇహలోక జీవితంలోనే చేసుకుని దాన్ని మీ మరణం కన్న ముందు మీ స్వయం కొరకు భద్రంగా పంపించుకుంటారో దాని పుణ్యమును మీరు ప్రళయదినమున మీ ప్రభువు వద్ద పొందుతారు. అప్పుడు ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేస్తున్న కర్మలను వీక్షిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి అతని కర్మ పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَقَالُوْا لَنْ یَّدْخُلَ الْجَنَّةَ اِلَّا مَنْ كَانَ هُوْدًا اَوْ نَصٰرٰی ؕ— تِلْكَ اَمَانِیُّهُمْ ؕ— قُلْ هَاتُوْا بُرْهَانَكُمْ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మరియు యూదుల్లోంచి,క్రైస్తవుల్లోంచి ప్రతీ వర్గము నిశ్ఛయంగా స్వర్గము తమ కొరకు ప్రత్యేకించబడినదని తెలిపింది. యూదులు ఇలా పలికారు : అందులో యూదులు మాత్రమే ప్రవేశిస్తారు. మరియు క్రైస్తవులు ఇలా పలికారు : అందులో క్రైస్తవులు మాత్రమే ప్రవేశిస్తారు. ఇవి వారి అసత్య మనోవాంఛలు మరియు వారి చెడు భ్రమలు. ఓ ప్రవక్తా వారిని ఖండిస్తూ ఇలా పలకండి : ఒక వేళ మీరు మీ వాదనలో వాస్తవానికి సత్యవంతులే అయితే మీరు వాదిస్తున్న దానిపై మీ ఆధారమును తీసుకుని రండి.
Tafsyrai arabų kalba:
بَلٰی ۗ— مَنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَهُوَ مُحْسِنٌ فَلَهٗۤ اَجْرُهٗ عِنْدَ رَبِّهٖ ۪— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟۠
స్వర్గములో మాత్రం అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో ఉండి ఆయన వైపునకు మరలేవాడు ప్రవేశిస్తాడు. మరియు అతడు తన చిత్తశుద్ధితో పాటు ప్రవక్త తెచ్చిన దాన్ని అనుసరించటం ద్వారా తన ఆరాధనను మెరుగుపరచుకునేవాడై ఉంటాడు. అతడే స్వర్గములో ప్రవేశిస్తాడు అతడు ఏ వర్గములో నుంచి అయినా సరే. మరియు అతని కొరకు అతని ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంటుంది. పరలోకంలో వారు ఎదుర్కొనే వాటి గురించి వారిపై ఎటువంటి భయముండదు. మరియు ఇహలోకములో నుంచి వారు కోల్పోయిన దానిపై వారికి బాధ ఉండదు. మరియు ఈ లక్షణాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తరువాత ముస్లిముల్లో మాత్రమే నిరూపితమైనవి.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• أن الأمر كله لله، فيبدل ما يشاء من أحكامه وشرائعه، ويبقي ما يشاء منها، وكل ذلك بعلمه وحكمته.
వ్యవహారమంతా అల్లాహ్ కే చెందుతుంది. కావున ఆయన తన ఆదేశముల్లోంచి మరియు తన శాసనముల్లోంచి తాను తలచుకున్న వాటిని మార్చివేస్తాడు మరియు వాటిలో నుంచి తాను తలచుకున్న వాటిని అట్టే ఉంచుతాడు. మరియు ఇవన్ని ఆయన జ్ఞానముతో మరియు విజ్ఞతతో జరుగును.

• حَسَدُ كثيرٍ من أهل الكتاب هذه الأمة، لما خصَّها الله من الإيمان واتباع الرسول، حتى تمنوا رجوعها إلى الكفر كما كانت.
ఈ సమాజముపై గ్రంధవహుల తరపు నుండి చాలా అసూయ కలదు ఎందుకంటే అల్లాహ్ వారిని విశ్వాసముతో మరియు ప్రవక్తను అనుసరించటంతో ప్రత్యేకించాడు. చివరికి వారు తాము ఉన్న అవిశ్వాసం వైపునకు వారి మరలటమును ఆశించారు.

وَقَالَتِ الْیَهُوْدُ لَیْسَتِ النَّصٰرٰی عَلٰی شَیْءٍ ۪— وَّقَالَتِ النَّصٰرٰی لَیْسَتِ الْیَهُوْدُ عَلٰی شَیْءٍ ۙ— وَّهُمْ یَتْلُوْنَ الْكِتٰبَ ؕ— كَذٰلِكَ قَالَ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ مِثْلَ قَوْلِهِمْ ۚ— فَاللّٰهُ یَحْكُمُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟
మరియు యూదులు ఇలా పలికారు : క్రైస్తవులు సరైన ధర్మంపై లేరు. మరియు క్రైస్తవులు ఇలా పలికారు : యూదులు సరైన ధర్మంపై లేరు. వాస్తవానికి వారందరు తమపై అల్లాహ్ అవతరింపజేసిన గ్రంధాలను మరియు వాటిలో దైవ ప్రవక్తలందరిని ఎటువంటి బేధభావం లేకుండా విశ్వసించాలని ఉన్న ఆదేశమును చదువుతున్నారు. వారి ఈ చర్యలో జ్ఞానం లేని ముష్రికుల మాటను పోలి ఉన్నారు. ఎప్పుడైతే వారు ప్రవక్తలందరిని మరియు వారిపై అవతరింపబడిన గ్రంధములను తిరస్కరించారో. ఇందు వలనే అల్లాహ్ విభేదించే వారి మధ్య ప్రళయదినమున తీర్పునిస్తాడు తన దాసులకు ఇచ్చిన న్యాయపూరితమైన తీర్పును ఈవిధంగా ఇస్తాడు: మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసిన వాటన్నింటిని విశ్వసించటంలోనే సాఫల్యం ఉన్నది.
Tafsyrai arabų kalba:
وَمَنْ اَظْلَمُ مِمَّنْ مَّنَعَ مَسٰجِدَ اللّٰهِ اَنْ یُّذْكَرَ فِیْهَا اسْمُهٗ وَسَعٰی فِیْ خَرَابِهَا ؕ— اُولٰٓىِٕكَ مَا كَانَ لَهُمْ اَنْ یَّدْخُلُوْهَاۤ اِلَّا خَآىِٕفِیْنَ ؕ۬— لَهُمْ فِی الدُّنْیَا خِزْیٌ وَّلَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابٌ عَظِیْمٌ ۟
అతని కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడు ఉండడు. ఎవడైతే అల్లాహ్ నామమును ఆయన మస్జిదులో స్మరించటం నుండి ఆపుతాడో మరియు అందులో నమాజు నుండి,స్మరణ నుండి,ఖుర్ఆన్ పారాయణం నుండి ఆపుతాడో మరియు వాటిని నాశనం చేయటంలో,పాడు చేయటంలో ప్రయత్నం చేస్తూ,కారకుడవుతూ శ్రమిస్తాడో వాటిని కొళ్ళగొట్టటం ద్వారా మరియు వాటిలో ఆరాధన చేయటమును ఆపటం ద్వారా. వాటిని నాశనం చేయటంలో ప్రయత్నించిన వారందరు తాము ఉన్న అవిశ్వాసము మరియు అల్లాహ్ మస్జిదుల నుండి ఆపటం వలన భయముతో వారి హృదయములు వణుకుతూ తప్ప అల్లాహ్ మస్జిదులలో ప్రవేశించటం వారికి సరికాదు. వారి కొరకు ఇహలోక జీవితంలో విశ్వాసపరుల చేతుల్లో అవమానము,పరాభవము కలదు. మరియు వారి కొరకు పరలోకంలో పెద్ద శిక్ష కలదు వారు ప్రజలను అల్లాహ్ మస్జిదుల నుండి ఆపటం మూలంగా.
Tafsyrai arabų kalba:
وَلِلّٰهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۗ— فَاَیْنَمَا تُوَلُّوْا فَثَمَّ وَجْهُ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ وَاسِعٌ عَلِیْمٌ ۟
మరియు తూర్పు పడమరల మరియు వాటి మధ్య ఉన్న దాని రాజ్యాధికారం అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తలచుకున్నది తన దాసులకు ఆదేశిస్తాడు. మరియు మీరు ఎటు ముఖము త్రిప్పుకున్న మహోన్నతుడైన అల్లాహ్ కు మీరు అభిముఖమవుతారు. ఒక వేళ ఆయన మిమ్మల్ని బైతుల్ మఖ్దిస్ వైపునకు లేదా కాబా వైపునకు అభిముఖమవమని ఆదేశించిన లేదా మీరు ఖిబ్లా విషయంలో తప్పిదం చేసినా లేదా దానికి అభిముఖమవటం మీపై కష్టమైన మీపై ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే దిక్కులన్ని మహోన్నతుడైన అల్లాహ్ కే చెందుతాయి. నిశ్చయంగా అల్లాహ్ విస్తృతుడు ఆయన తన కారుణ్యముతో మరియు తన సౌలభ్యముతో తన సృష్టితాలను విస్తృతం చేస్తాడు, వారి సంకల్పాలను మరియు వారి కార్యాలను బాగా తెలిసినవాడు.
Tafsyrai arabų kalba:
وَقَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا ۙ— سُبْحٰنَهٗ ؕ— بَلْ لَّهٗ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— كُلٌّ لَّهٗ قٰنِتُوْنَ ۟
మరియు యూదులు,క్రైస్తవులు,ముష్రికులు ఇలా పలికారు : అల్లాహ్ తన కొరకు సంతానమును చేసుకున్నాడు. ఆయన దాని నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. ఆయనకు తన సృష్టితాల అవసరం లేనివాడు. సంతానమును దాని అవసరం కలవాడే చేసుకుంటాడు. కాని భూమ్యాకాశముల్లో ఉన్న వాటి రాజ్యాధికారము పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన ఆయనకే చెందును. సృష్టితాలన్ని పరిశుద్ధుడైన ఆయనకు దాసులు,ఆయనకు వినయంతో ఉండేవారు. ఆయన తాను తలచుకున్న దాని ద్వారా వారిలో కార్యనిర్వహణ చేస్తాడు.
Tafsyrai arabų kalba:
بَدِیْعُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَاِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟
మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ ఆకాశములను మరియు భూమిని మరియు ఆ రెండింటిలో ఉన్న వాటిని పూర్వ నమూనా లేకుండా సృష్టించినవాడు. మరియు ఆయన ఏదైన విషయమును అంచనా వేసుకుని దాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయము కొరకు ఇలా పలుకుతాడు : నీవు అయిపో (కున్) అప్పుడు అల్లాహ్ ఎలా అవ్వాలని కోరుకున్నాడో అలా అయిపోతుంది. ఆయన ఆదేశమును మరియు ఆయన నిర్ణయమును మరల్చేవాడు ఎవడూ ఉండడు.
Tafsyrai arabų kalba:
وَقَالَ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ لَوْلَا یُكَلِّمُنَا اللّٰهُ اَوْ تَاْتِیْنَاۤ اٰیَةٌ ؕ— كَذٰلِكَ قَالَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ مِّثْلَ قَوْلِهِمْ ؕ— تَشَابَهَتْ قُلُوْبُهُمْ ؕ— قَدْ بَیَّنَّا الْاٰیٰتِ لِقَوْمٍ یُّوْقِنُوْنَ ۟
మరియు గ్రంధవహుల్లోంచి మరియు ముష్రికుల్లోంచి జ్ఞానం లేనివారు సత్యమును వ్యతిరేకిస్తూ ఇలా పలికారు : ఎందుకని అల్లాహ్ మాతో మధ్యవర్తి లేకుండా మాట్లాడడు లేదా మాతో ప్రత్యేకించబడిన ఏదైన ఇంద్రియ సంకేతం మా వద్దకు ఎందుకు రాదు ?. వారి ఇటువంటి మాటనే తిరస్కార సమాజములు ముందు తమ ప్రవక్తలతో పలికారు. ఒక వేళ వారి కాలములు మరియు వారి ప్రదేశములు వేరైనా. సత్యముపై అది తమ కొరకు బహిర్గతమైనప్పుడు నమ్మకమును కలిగిన జాతి వారి కొరకు నిశ్ఛయంగా మేము ఆయతులను స్పష్టపరచాము. వారికి ఎటువంటి సందేహం కలగదు. మరియు వారికి ఎటువంటి మొండితనము ఆపదు.
Tafsyrai arabų kalba:
اِنَّاۤ اَرْسَلْنٰكَ بِالْحَقِّ بَشِیْرًا وَّنَذِیْرًا ۙ— وَّلَا تُسْـَٔلُ عَنْ اَصْحٰبِ الْجَحِیْمِ ۟
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మేము మిమ్మల్ని ఎటువంటి సందేహం లేని సత్య ధర్మమునిచ్చి పంపించాము విశ్వాసపరులకి స్వర్గం గురించి మీరు శుభవార్తనివ్వటానికి మరియు అవిశ్వాసపరులకు నరకాగ్ని గురించి మీరు హెచ్చరించటానికి. మరియు స్పష్టంగా చేరవేయటం మాత్రమే మీపై బాధ్యత కలదు. మరియు మిమ్మల్ని విశ్వసించని నరకవాసుల గురించి అల్లాహ్ మిమ్మల్ని ప్రశ్నించడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• الكفر ملة واحدة وإن اختلفت أجناس أهله وأماكنهم، فهم يتشابهون في كفرهم وقولهم على الله بغير علم.
అవిశ్వాసం ఒకే ధర్మం ఒక వేళ దాని ప్రజల జాతులు మరియు వారి ప్రదేశాలు వేరైనా కూడా. వారు తమ అవిశ్వాసంలో మరియు అల్లాహ్ పై జ్ఞానం లేకుండా మాట్లాడటంలో పరస్పరం పోలి ఉంటారు.

• أعظم الناس جُرْمًا وأشدهم إثمًا من يصد عن سبيل الله، ويمنع من أراد فعل الخير.
ప్రజల్లోంచి నేరపరంగా పెద్దవారు మరియు వారిలో తీవ్రమైన పాపాత్ములు ఎవరంటే వారే అల్లాహ్ మార్గము నుండి నిరోధించేవారు మరియు మంచి చేయదలచిన వారిని ఆపేవారు.

• تنزّه الله تعالى عن الصاحبة والولد، فهو سبحانه لا يحتاج لخلقه.
మహోన్నతుడైన అల్లాహ్ సహవాసిని మరియు సంతానము కలిగి ఉండటం నుండి అతీతుడు. ఆయన పరిశుద్ధుడు ఆయనకు తన సృష్టిరాసుల అవసరం లేదు.

وَلَنْ تَرْضٰی عَنْكَ الْیَهُوْدُ وَلَا النَّصٰرٰی حَتّٰی تَتَّبِعَ مِلَّتَهُمْ ؕ— قُلْ اِنَّ هُدَی اللّٰهِ هُوَ الْهُدٰی ؕ— وَلَىِٕنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَ الَّذِیْ جَآءَكَ مِنَ الْعِلْمِ ۙ— مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟ؔ
అల్లాహ్ తన ప్రవక్తను ఉద్దేశించి ఆయనకు దర్శకత్వం మరియు హెచ్చరిక చేస్తూ ఇలా పలికాడు : మీరు ఇస్లాంను వదిలి యూదులు మరియు క్రైస్తవులు ఉన్న దాన్ని అనుసరించనంతవరకు వారు మీతో సంతృప్తి చెందరు. ఒక వేళ ఇది మీతో లేదా మీ అనుచరులతో మీ వద్దకు వచ్చిన స్పష్టమైన సత్యం తరువాత జరిగితే మీకు అల్లాహ్ వద్ద నుండి ఎటువంటి మద్దతు కాని సహాయం కాని లభించదు. ఇది సత్యాన్ని విడిచిపెట్టి,అసత్య ప్రజలతో కలిసిపోయే ప్రమాదాన్ని వివరించే పరంగా ఉన్నది.
Tafsyrai arabų kalba:
اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یَتْلُوْنَهٗ حَقَّ تِلَاوَتِهٖ ؕ— اُولٰٓىِٕكَ یُؤْمِنُوْنَ بِهٖ ؕ— وَمَنْ یَّكْفُرْ بِهٖ فَاُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟۠
దివ్య ఖుర్ఆన్ యూదుల్లోంచి ఒక వర్గము గురించి ప్రస్తావిస్తుంది. వారు అవతరింపబడి తమ చేతుల్లో ఉన్న గ్రంధముల ప్రకారం ఆచరిస్తున్నారు. మరియు వాటిని అనుసరించవలసిన రీతిలో అనుసరిస్తున్నారు. వారందరు ఈ గ్రంధముల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీపై సూచించే సూచనలను పొందుతున్నారు. మరియు అందువల్లే వారు ఆయనపై విశ్వాసం చూపటం వైపునకు త్వరపడ్డారు. మరోక వర్గము గురించి (ప్రస్తావిస్తుంది) అది తన అవిశ్వాసంపై మొండిగా ఉన్నది. దాని కొరకు నష్టము కలదు.
Tafsyrai arabų kalba:
یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اذْكُرُوْا نِعْمَتِیَ الَّتِیْۤ اَنْعَمْتُ عَلَیْكُمْ وَاَنِّیْ فَضَّلْتُكُمْ عَلَی الْعٰلَمِیْنَ ۟
ఓ ఇస్రాయీలు సంతతివారా మీపై నేను అవతరింపజేసిన ధార్మిక మరియు ప్రాపంచిక అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి.మరియు నేను మీ కాలంలో మీ తోటివారి కంటే మీకు దైవదౌత్యం మరియు రాజ్యాన్ని అనుగ్రహించి మీకు వారిపై ఔన్నత్యాన్ని ప్రసాదించిన దానిని జ్ఞాపకం చేసుకోండి.
Tafsyrai arabų kalba:
وَاتَّقُوْا یَوْمًا لَّا تَجْزِیْ نَفْسٌ عَنْ نَّفْسٍ شَیْـًٔا وَّلَا یُقْبَلُ مِنْهَا عَدْلٌ وَّلَا تَنْفَعُهَا شَفَاعَةٌ وَّلَا هُمْ یُنْصَرُوْنَ ۟
మరియు మీరు అల్లాహ్ ఆదేశములను అనుసరించటం ద్వారా మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా మీకు మరియు ప్రళయదిన శిక్షకు మధ్య రక్షణను ఏర్పరచుకోండి. ఎందుకంటే ఆ రోజు ఏ ప్రాణి ఏ ప్రాణికి ఏవిధంగా ఉపయోగపడదు. మరియు దాని నుండి ఎటువంటి పరిహారము అది ఎంత పెద్దదైన స్వీకరించబడదు. మరియు దానికి ఎవరి సిఫారసు కూడా అతను ఎంత ఉన్నత స్థానం వాడైన సరే ప్రయోజనం కలిగించదు. మరియు అల్లాహ్ కాకుండా అతనికి రక్షించే రక్షకుడు ఎవడూ ఉండడు.
Tafsyrai arabų kalba:
وَاِذِ ابْتَلٰۤی اِبْرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّ ؕ— قَالَ اِنِّیْ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًا ؕ— قَالَ وَمِنْ ذُرِّیَّتِیْ ؕ— قَالَ لَا یَنَالُ عَهْدِی الظّٰلِمِیْنَ ۟
మరియు అల్లాహ్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంను ఆయనకు ఆదేశములను,బాధ్యతలను ఇవ్వటం ద్వారా పరీక్షించినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు ఆయన వాటిని నెలకొల్పారు. మరియు వాటిని పరిపూర్ణ రీతిలో పూర్తి చేశారు.అల్లాహ్ తన ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాంతో ఇలా పలికాడు : నిశ్చయంగా నేను నిన్ను ప్రజల కొరకు ఆదర్శంగా చేస్తాను. నీ చర్యల్లో,నీ గుణాల్లో నిన్ను ఆదర్శంగా తీసుకోబడును. అప్పుడు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా అలాగే నా సంతానములో నుంచి ప్రజలు అనుసరించే నాయకులను చేయి. అల్లాహ్ ఆయనకు సమాధానమిస్తూ ఇలా పలికాడు : నీ సంతానములో నుండి ధర్మ విషయంలో దుర్మార్గులైన వారికి ఇమామత్ గురించి నీ కొరకు నా వాగ్దానం వర్తించదు.
Tafsyrai arabų kalba:
وَاِذْ جَعَلْنَا الْبَیْتَ مَثَابَةً لِّلنَّاسِ وَاَمْنًا ؕ— وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرٰهٖمَ مُصَلًّی ؕ— وَعَهِدْنَاۤ اِلٰۤی اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ اَنْ طَهِّرَا بَیْتِیَ لِلطَّآىِٕفِیْنَ وَالْعٰكِفِیْنَ وَالرُّكَّعِ السُّجُوْدِ ۟
అల్లాహ్ నిషిద్ధ గృహమును ప్రజల కొరకు మరలే స్థలంగా చేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి వారి హృదయములు దానిని అట్టిపెట్టుకుని ఉంటాయి. ఎప్పుడెప్పుడైతే వారు దాని నుండి పయనించి వెళతారో వారు దాని వైపునకే మరలి వస్తారు. మరియు ఆయన దాన్ని వారి కొరకు శాంతి నిలయంగా చేశాడు. అందులో వారిపై దాడీ చేయబడదు. మరియు ఆయన ప్రజలకు ఇలా ఆదేశించాడు : ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కాబా నిర్మాణం చేసేటప్పుడు ఆయన నిలబడిన రాయిని మీరు నమాజు కొరకు స్థలంగా చేసుకోండి. మరియు నిషిద్ధ గృహమును మలినముల నుండి మరియు విగ్రహాల నుండి పరిశుద్ధ పరచమని మరియు తవాఫ్ ద్వారా,ఈతికాఫ్ ద్వారా,నమాజు,ఇతర వాటి ద్వారా అందులో ఆరాధన చేయదలచిన వారి కొరకు దాన్ని సిద్ధం చేయమని మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ కు తాకీదు చేశాము.
Tafsyrai arabų kalba:
وَاِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّ اجْعَلْ هٰذَا بَلَدًا اٰمِنًا وَّارْزُقْ اَهْلَهٗ مِنَ الثَّمَرٰتِ مَنْ اٰمَنَ مِنْهُمْ بِاللّٰهِ وَالْیَوْمِ الْاَخِرِ ؕ— قَالَ وَمَنْ كَفَرَ فَاُمَتِّعُهٗ قَلِیْلًا ثُمَّ اَضْطَرُّهٗۤ اِلٰی عَذَابِ النَّارِ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟
ఓ ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన ప్రభువును వేడుకొంటూ ఇలా పలికినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి : ఓ నా ప్రభువా నీవు మక్కా ను శాంతియుతమైన నగరంగా చేయి. అందులో ఎవరూ హానికి గురి కాకూడదు. మరియు అక్కడి ప్రజలకు రకరకాల ఫలాలను ఆహారంగా ప్రసాదించు. మరియు వాటిని నీపై మరియు అంతిమ దినముపై విశ్వాసమును చూపే వారికి ప్రత్యేక ఆహారంగా చేయి. అల్లాహ్ ఇలా పలికాడు : మరియు వారిలో నుండి తిరస్కరించే వాడికి నిశ్చయంగా నేను అతనికి ఇహలోకంలో ఆహారంగా ప్రసాదించే వాటితో కొంత ప్రయోజనం చేకూర్చుతాను. ఆ తరువాత పరలోకంలో అతడిని బలవంతాన నరకాగ్ని శిక్ష వైపునకు ఈడుస్తాను. ప్రళయదినమున అతడు మరలి వెళ్ళే ఎంతో చెడ్డ నివాసము.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• أن المسلمين مهما فعلوا من خير لليهود والنصارى؛ فلن يرضوا حتى يُخرجوهم من دينهم، ويتابعوهم على ضلالهم.
ముస్లిములు యూదులకు,క్రైస్తవులకు ఎంత మేలు చేసినా వారు వారిని వారి ధర్మం నుండి తీసివేసేంతవరకు మరియు వారి మార్గ భ్రష్టతపై వారిని అనుసరించేటట్లు చేయనంత వరకు సంత్రుప్తి చెందరు.

• الإمامة في الدين لا تُنَال إلا بصحة اليقين والصبر على القيام بأمر الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ ఆజ్ఞను నెరవేర్చడంలో నిశ్చయత మరియు సహనంతో తప్ప ధర్మంలో ఇమామత్ సాధించబడదు.

• بركة دعوة إبراهيم عليه السلام للبلد الحرام، حيث جعله الله مكانًا آمنًا للناس، وتفضّل على أهله بأنواع الأرزاق.
నిషిద్ధ నగరము కొరకు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం దుఆ శుభాలు. అందుకనే అల్లాహ్ దాన్ని ప్రజల కొరకు శాంతి ప్రదేశంగా చేశాడు. మరియు అక్కడి వాసులపై రకరకాల ఆహార పదార్ధాలను అనుగ్రహించాడు.

وَاِذْ یَرْفَعُ اِبْرٰهٖمُ الْقَوَاعِدَ مِنَ الْبَیْتِ وَاِسْمٰعِیْلُ ؕ— رَبَّنَا تَقَبَّلْ مِنَّا ؕ— اِنَّكَ اَنْتَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
మరియు ఓ ప్రవక్త మీరు జ్ఞాపకం చేసుకోండి ఇబ్రాహీం మరియు ఇస్మాయీల్ అలైహిమస్సలామ్ కాబా గృహపు పునాదులను ఎత్తేటపుడు వారిరువురు ఎంతో అణుకువతో, వినమ్రతతో ఈ విధంగా పలకసాగారు : ఓ మా ప్రభూ నీవు మా ఆచరణలను (మరియు అందులో నుంచి ఈ గ్రహనిర్మాణమును) స్వీకరించు.నిశ్చయంగా మా ప్రార్దనలను స్వీకరించేవాడివి,మా సంకల్పాలను,మా ఆచరణలను తెలిసినవాడివి నీవే.
Tafsyrai arabų kalba:
رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَیْنِ لَكَ وَمِنْ ذُرِّیَّتِنَاۤ اُمَّةً مُّسْلِمَةً لَّكَ ۪— وَاَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَیْنَا ۚ— اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِیْمُ ۟
ఓ మాప్రభూ మమ్మల్ని, నీకు విధేయత చూపేవారిగా,నీ భీతి పరులుగా,నీతోపాటు ఎవరినీ సాటి కల్పించని వారిగా చేయి.మరియు నీవు మా సంతానములో నుంచి ఒక జాతిని నీకు విధేయత చూపే వారిగా చేయి.మరియు నిన్ను ఏవిధంగా ఆరాధించాలో మాకు తెలియజేయి.మరియు మా పాపములను,నీకు విధేయత చూపటంలో మా లోపములను మన్నించు.నిశ్చయంగా నీ క్షమాపణ కోరే నీ దాసులని మన్నించేవాడివి,వారిపై కనికరించేవాడివి నీవే.
Tafsyrai arabų kalba:
رَبَّنَا وَابْعَثْ فِیْهِمْ رَسُوْلًا مِّنْهُمْ یَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِكَ وَیُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَیُزَكِّیْهِمْ ؕ— اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟۠
ఓ మా ప్రభు ఇస్మాయీల్ సంతతి నుంచి వారిలో ఒక ప్రవక్తను పంపు.అతడు అవతరింపజేయబడిన నీ వాక్యాలను వారి ముందు చదివి వినిపిస్తాడు.మరియు వారికి ఖుర్ఆన్,సున్నత్ ను నేర్పిస్తాడు.షిర్క్,మరియు దుర్గుణాల నుండి వారిని పరిశుద్ధ పరుస్తాడు. నిశ్చయంగా నీ కార్య నిర్వహణ,మరియు నీఆదేశాలలో నీవు సర్వశక్తిమంతుడవు మరియు మహావివేకవంతుడవు.
Tafsyrai arabų kalba:
وَمَنْ یَّرْغَبُ عَنْ مِّلَّةِ اِبْرٰهٖمَ اِلَّا مَنْ سَفِهَ نَفْسَهٗ ؕ— وَلَقَدِ اصْطَفَیْنٰهُ فِی الدُّنْیَا ۚ— وَاِنَّهٗ فِی الْاٰخِرَةِ لَمِنَ الصّٰلِحِیْنَ ۟
మరియు తన అవివేకము వలన,తన దురాలోచనతో సన్మార్గమును వదిలి మార్గ భ్రష్టతకు లోనై ,తన మనసు కొరకు దిగజార్చుకోవటంను ఇష్టపడి తన పై హింసకు పాల్పడిన వాడు తప్ప ఇంకెవరు ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని వదిలి వేరే ధర్మాల వైపు మరలిపోడు.మరియు మేము అతనిని ఇహ లోకంలో ఒక ప్రవక్తగా మరియు మిత్రునిగా ఎన్నుకున్నాము.మరియు నిశ్చయంగా అతను పరలోకంలో అల్లాహ్ తమపై విధిగావించిన వాటిని పూర్తి చేసి ఉన్నత స్థానాలను పొందే పుణ్యాత్ముల్లోంచి అవుతాడు.
Tafsyrai arabų kalba:
اِذْ قَالَ لَهٗ رَبُّهٗۤ اَسْلِمْ ۙ— قَالَ اَسْلَمْتُ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟
ఆయన (ఇబ్రాహీము) ఇస్లాం వైపునకు ముందడుగువేయుట వలన అల్లాహ్ ఆయనను ఎన్నుకున్నాడు.అప్పుడు ఆయనతో ఆయన ప్రభువు ఇలా పలికాడు : నీవు నాకొరకు ఆరాధనను ప్రత్యేకించు,విధేయత ద్వారా నా కొరకు అణుకువనుచూపు,అప్పుడు ఆయన తన ప్రభువుకు సమాధానమిస్తు ఇలా పలికారు : నేను దాసుల సృష్టికర్త,వారి ఉపాది ప్రధాత మరియు వారి వ్యవహారాల నిర్వాహకుడైన అల్లాహ్ కు విధేయుడైనాను.
Tafsyrai arabų kalba:
وَوَصّٰی بِهَاۤ اِبْرٰهٖمُ بَنِیْهِ وَیَعْقُوْبُ ؕ— یٰبَنِیَّ اِنَّ اللّٰهَ اصْطَفٰی لَكُمُ الدِّیْنَ فَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَ ۟ؕ
మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారులను ఈ వచనమునే ఉపదేసించారు : {سْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ అస్లమ్తు లిరబ్బిల్ ఆలమీన్} అదే విధంగా దానిని యాఖూబు తన కుమారులకు కూడా ఉపదేసించారు.వారిరువురు తమ కుమారులను పిలుస్తూ ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ ఇస్లాం ధర్మమును మీ కొరకు ఆమోదించాడు,ఐతే మీరు మీకు మరణం వచ్చేంత వరకు దానిపై (ఇస్లాంని) స్థిరంగా ఉండండి, మీరు బహిరంగంగా,అంతర్గతంగా అల్లాహ్ కు విధేయులై ఉండండి.
Tafsyrai arabų kalba:
اَمْ كُنْتُمْ شُهَدَآءَ اِذْ حَضَرَ یَعْقُوْبَ الْمَوْتُ ۙ— اِذْ قَالَ لِبَنِیْهِ مَا تَعْبُدُوْنَ مِنْ بَعْدِیْ ؕ— قَالُوْا نَعْبُدُ اِلٰهَكَ وَاِلٰهَ اٰبَآىِٕكَ اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ اِلٰهًا وَّاحِدًا ۖۚ— وَّنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ ۟
యాకూబ్ కు మరణం ఆసన్నమయినప్పుడు మీరు అక్కడ ఉన్నారా? అప్పుడు ఆయన తన కుమారులను ప్రశ్నిస్తూ ఈ విధంగా పలికారు : నా మరణాంతరం మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారు ఆయన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా పలికారు : మేము మీ ఆరాధ్య దైవమును, మీ పూర్వికులైన ఇబ్రాహీం ఇస్మాయీల్,ఇస్హాఖ్ ల ఆరాధ్యదైవమైన ఒకే ఆరాధ్య దైవమును మాత్రమే ఆరాధిస్తాము.ఆయనకు ఎవరూ సాటి లేరు.మరియు మేము ఆయన ఒక్కడికే విధేయులమై కట్టుబడి ఉంటాము.
Tafsyrai arabų kalba:
تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْ ۚ— لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْ ۚ— وَلَا تُسْـَٔلُوْنَ عَمَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟
ఆ జాతి (ఉమ్మత్) మీకు పూర్వం గతించిన జాతుల్లోంచి ఒక జాతి.వారు ముందే తమ ఆచరణలను చేరవేసుకున్నారు.వారు చేసుకున్న మంచీ,చెడూ వారికోసమే, మీరు చేసుకున్నది మీ కొరకే,వారు చేసుకున్నకర్మల గురించి మీరు ప్రశ్నించబడరు,మీరు చేసుకున్న కర్మల గురించి వారు ప్రశ్నించబడరు,వేరే వారి పాపములకు బదులుగా ఎవరూ శిక్షించబడరు,కాని ప్రతి ఒక్కరు తాము చేసుకున్న దానికి ప్రతి ఫలము పొందుతారు,కావున మీకు పూర్వం గతించిన వారి ఆచరణలు మిమ్మల్నిఅశ్రద్ద వహించేటట్లు చేయకూడదు సుమా.ఎందుకంటే దైవ కారుణ్యం తరువాత ఎవరికీ అతని పుణ్యకార్యము తప్ప ఏదీ లాభం చేకూర్చదు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• المؤمن المتقي لا يغتر بأعماله الصالحة، بل يخاف أن ترد عليه، ولا تقبل منه، ولهذا يُكْثِرُ سؤالَ الله قَبولها.
దైవభీతికల విశ్వాసపరుడు తన పుణ్యకార్యాల వలన మోసపోడు,కాని అవి రద్దుచేయబడతాయని, స్వీకరించబడవని భయపడుతూ ఉంటాడు,అందువలనే వాటి స్వీకారంకోసం ఎక్కువగా అల్లాహ్ ను ప్రాధేయపడుతూ ఉంటాడు.

• بركة دعوة أبي الأنبياء إبراهيم عليه السلام، حيث أجاب الله دعاءه وجعل خاتم أنبيائه وأفضل رسله من أهل مكة.
ప్రవక్తల పితామహుడు అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ భాగ్యము,అల్లాహ్ ఆయన దుఆ ను స్వీకరించి మక్కా వాసుల్లోంచి (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను) తన ప్రవక్తల్లో గొప్ప,అంతిమ ప్రవక్తగా చేశాడు.

• دين إبراهيم عليه السلام هو الملة الحنيفية الموافقة للفطرة، لا يرغب عنها ولا يزهد فيها إلا الجاهل المخالف لفطرته.
ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం ఏక దైవ సిధ్దాంత ధర్మము,మరియు ప్రకృతికి అనుకూలమైన ధర్మం. తన స్వభవమునకు వ్యతిరేకి అయిన అజ్ఞాని తప్ప ఇంకెవడూ ఇబ్రాహీం ధర్మం నుంచి ముఖము తిప్పుకోడు,మరియు సంబంధము వదులుకోడు.

• مشروعية الوصية للذرية باتباع الهدى، وأخذ العهد عليهم بالتمسك بالحق والثبات عليه.
రుజుమార్గమును అనుసరించమని సంతానమును హితబోధ చేయుట,సత్యాన్ని స్వీకరించి దానిపై నిలకడగా ఉండటం పై వారితొ వాగ్దానం తీసుకోవటం ధర్మబద్ధమైనది.

وَقَالُوْا كُوْنُوْا هُوْدًا اَوْ نَصٰرٰی تَهْتَدُوْا ؕ— قُلْ بَلْ مِلَّةَ اِبْرٰهٖمَ حَنِیْفًا ؕ— وَمَا كَانَ مِنَ الْمُشْرِكِیْنَ ۟
ఈ జాతి వారితో (ముస్లిములతో) యూదులుమీరు యూదులుగా మారిపోండి సన్మార్గములో ప్రవేశిస్తారని పలికారు మరియు క్రైస్తవులు:మీరు క్రైస్తవులుగా మారిపోండి సన్మార్గములో ప్రవేశిస్తారని.పలికారు కానీ ఓ ప్రవక్తా మీరు వారికి ఇలా తెలియజేయండి : మేము అసత్య ధర్మాలను వదిలి సత్య ధర్మమును,ఏక దైవ సిధ్దాంత ధర్మమయిన ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్నే అనుసరిస్తాము, అతను అల్లాహ్ తోపాటు సాటి కల్పించే వారిలోంచికాడు.
Tafsyrai arabų kalba:
قُوْلُوْۤا اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ اِلَیْنَا وَمَاۤ اُنْزِلَ اِلٰۤی اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَمَاۤ اُوْتِیَ مُوْسٰی وَعِیْسٰی وَمَاۤ اُوْتِیَ النَّبِیُّوْنَ مِنْ رَّبِّهِمْ ۚ— لَا نُفَرِّقُ بَیْنَ اَحَدٍ مِّنْهُمْ ؗ— وَنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ ۟
ఓ విశ్వాసులారా యూదులు,క్రైస్తవుల్లోంచి ఈ విధంగా అసత్య వాదనలు చేసే వారితో ఇలా పలకండి : మేము అల్లాహ్ నూ,మరియు మా వైపునకు అవతరింపబడిన ఖుర్ఆన్ నూ విశ్వవసించాము.మరియు ఇబ్రాహీం,ఆయన కుమారులు ఇస్మాయీల్,ఇస్హాఖ్,యాఖూబుల పై అవతరింపబడిన వాటినీ విశ్వవసించాము మరియు,యాఖూబ్ సంతతి నుంచి వచ్చిన ప్రవక్తల పై అవతరింపబడిన వాటినీ విశ్వవసించాము,అల్లాహ్ మూసాకు ప్రసాధించిన తౌరాత్ నూ విశ్వసించాము మరియు అల్లాహ్ ఈసాకు ప్రసాధించిన ఇంజీల్ నూ విశ్వసించాము.అల్లాహ్ దైవ ప్రవక్తలందరికి ప్రసాధించిన గ్రంధాలను విశ్వసించాము,అయితే వారిలో (ప్రక్తలలో) కొందరిని విశ్వసించి మరికొందరిని విశ్వసించకుండా,వారిలో ఏవిధమైన బేధభావము చూపకుండా అందరినీ విశ్వసిస్తున్నాము.మరియు మేము పరిశుద్ధుడు,ఒక్కడే అయిన ఆయననే అనుసరిస్తాము,మరియు ఆయనకే అణుకువను చూపుతాము.
Tafsyrai arabų kalba:
فَاِنْ اٰمَنُوْا بِمِثْلِ مَاۤ اٰمَنْتُمْ بِهٖ فَقَدِ اهْتَدَوْا ۚ— وَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا هُمْ فِیْ شِقَاقٍ ۚ— فَسَیَكْفِیْكَهُمُ اللّٰهُ ۚ— وَهُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟ؕ
ఒకవేళ యూదులు,క్రైస్తవులు,మరియు సత్య తిరస్కారుల్లోంచి ఇతరులు మీరు విశ్వసించినట్లు విశ్వసిస్తే వారు అల్లాహ్ ప్రశన్నతను పొందే సన్మార్గమును పొందిన వారవుతారు.ఒకవేళ వారు విశ్వాసము నుంచి విముఖత చూపినా,దైవ ప్రవక్తలందరిని లేదా వారిలో నుంచి కొంత మందిని తిరస్కరించినా,వారు విభేధాలలో,మరియు విరోధంలో ఉన్నట్లే.అయితే ఓప్రవక్తా!మీరు బాధపడకండి,మిమ్మల్ని వారి బాధలనుండి రక్షించడానికి అల్లాహ్ చాలు.ఆయన (అల్లాహ్)వారి కీడు మీపైరాకుండా ఆపుతాడు,వారికి వ్యతిరేకంగా మీకు సహాయపడుతాడు,ఆయన వారి మాటలను వింటున్నాడు.వారి ఉద్దేశాలు,వారి కార్యాలు ఏమిటో ఆయనకు బాగా తెలుసు.
Tafsyrai arabų kalba:
صِبْغَةَ اللّٰهِ ۚ— وَمَنْ اَحْسَنُ مِنَ اللّٰهِ صِبْغَةً ؗ— وَّنَحْنُ لَهٗ عٰبِدُوْنَ ۟
మీరు బాహ్యంగా,అంతరంగా అల్లాహ్ యొక్క ఆ ధర్మం పై కట్టుబడి ఉండండి దేని పైనైతే అతడు మిమ్మల్ని పుట్టించాడొ,అల్లాహ్ ధర్మముకన్నా ఏ ధర్మమూ గొప్పది కాదు,అది స్వభావానికి అనుకూలంగా ఉన్నది,ప్రయోజనాలను చేకూరుతుంది,నష్టాలను (చెడులను) ఆపుతుంది,మీరు ఇలా పలకండి:మేము ఒకే అల్లాహ్ కొరకు ఆరాధిస్తున్నాము,ఆయనతో పాటు వేరేవారెవరూ సాటి లేరు.
Tafsyrai arabų kalba:
قُلْ اَتُحَآجُّوْنَنَا فِی اللّٰهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ ۚ— وَلَنَاۤ اَعْمَالُنَا وَلَكُمْ اَعْمَالُكُمْ ۚ— وَنَحْنُ لَهٗ مُخْلِصُوْنَ ۟ۙ
ఓ ప్రవక్త మీరు తెలపండి-:ఓ గ్రంధవహులారా మీరు అల్లాహ్,ఆయన ధర్మం పై మా కన్న ఎక్కువ హక్కు దారులు అన్న విషయంలో మాతో వాదిస్తున్నార,మీ యొక్క ధర్మము పురాతనమైనదని,మీ గ్రంధము ముందుదని.అయితే ఇది మీకు ఏమాత్రం లాభం చేకూర్చదు.అల్లాహ్ మనందరి ప్రభువు,మీరు అతనిని ప్రత్యేకించుకోకండి,మా కొరకు మా ఆ ఆచరణలు వాటి గురించి మీరు ప్రశ్నించబడరు,మీ కొరకు మీ ఆ ఆచరణలు వాటి గురించి మేము ప్రశ్నించబడము,ప్రతి ఒక్కరు తమ ఆచరణ పరంగా ఫ్రతిఫలము పొందుతారు,మేము ఆరాధనను,విధేయతను అల్లాహ్ కొరకే ప్రత్యేకిస్తున్నాము,ఆయనతో ఏ వస్తువును సాటి కల్పించము.
Tafsyrai arabų kalba:
اَمْ تَقُوْلُوْنَ اِنَّ اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطَ كَانُوْا هُوْدًا اَوْ نَصٰرٰی ؕ— قُلْ ءَاَنْتُمْ اَعْلَمُ اَمِ اللّٰهُ ؕ— وَمَنْ اَظْلَمُ مِمَّنْ كَتَمَ شَهَادَةً عِنْدَهٗ مِنَ اللّٰهِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
ఓ గ్రంధవహులార : నిశ్చయంగ ఇబ్రాహీము,ఇస్మాయీలు,ఇస్హాఖు,యాఖూబు,యాఖూబు సంతతి నుంచి వచ్చినప్రవక్తలు యూద ధర్మము లేదా క్రైస్తవ ధర్మము పై ఉండే వారని మీరు అంటున్నారా? ఓ ప్రవక్తా వారికే సమాధానమిస్తూ ఇలా చెప్పండి : మీకు బాగా తెలుసా లేదా అల్లాహ్ కు (బాగా తెలుసా)?! అయితే ఒకవేళ వారు (గ్రంధవహులు) వారి ధర్మం పై ఉన్నారు అని వాధిస్తే వారు ఆబద్ధము పలికారు;ఎందుకంటే వారిని ప్రవక్తగా చేసి పంపడము మరియు వారు మరణించడము తౌరాత్,ఇంజీలు అవతరణ ముందు జరిగింది!.దీన్ని బట్టి వారు అల్లాహ్,ఆయన ప్రవక్త పై ఆబద్ధము పలుకుతున్నారన్న విషయము అర్ధమవుతుంది.మరియు వారు నిశ్చయంగా తమ పై అవతరింపబడిన వాస్తవాన్ని దాచిపెట్టారు,తన వద్ద నిరూపించబడిన సాక్ష్యాన్నిదాచేవాడికన్నాపెద్ద దుర్మార్గుడు ఇంకొకడుండడు, దానిని అతడు అల్లాహ్ తో నేర్చుకున్నాడు,గ్రంధవహులు చేసినట్లుగా,అల్లాహ్ మీ ఆచరణల పట్ల అశ్రద్ధవహించడు,వాటి పరంగానే అతడు మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْ ۚ— لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْ ۚ— وَلَا تُسْـَٔلُوْنَ عَمَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟۠
ఈ జాతి వారు మీకన్న పూర్వం గతించినవారు,వారు తమ ఆచరణలను చేర వేసుకున్నారు,వారు చేసుకున్న ఆచరణలు వారి కొరకే,మీరు చేసుకున్న ఆచరణలు మీ కొరకే,వారి ఆచరణల గురించి మీరు ప్రశ్నించబడరు,మీ ఆచరణల గురించి వారు ప్రశ్నించబడరు,ఒకరు చేసిన పాపముకు బదులుగా ఇంకొకరు శిక్షించబడరు,ఇతరుల కర్మల ద్వారా లబ్ది పొందటం జరగదు,కాని ప్రతి ఒక్కరికి వారు ముందు పంపించుకున్న (చేసుకున్న) కర్మలకు ప్రతిఫలమును ప్రసాదించడం జరుగుతుంది.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• أن دعوى أهل الكتاب أنهم على الحق لا تنفعهم وهم يكفرون بما أنزل الله على نبيه محمد صلى الله عليه وسلم.
అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అవతరింప జేసిన దానిని తిరస్కరిస్తూ తాము సన్మార్గం పై ఉన్నామని గ్రంధవహుల వాదన వారికి ఏమాత్రం లాభం చేకూర్చదు.

• سُمِّي الدين صبغة لظهور أعماله وسَمْته على المسلم كما يظهر أثر الصبغ في الثوب.
ధర్మమునకు దాని ఆచరణలు బహిర్గతమవటం వలన రంగు పేరు ఇవ్వబడినది,ఒక బట్ట పై రంగు గుర్తు ఏ విధంగా బహిర్గతం అవుతుందో ఆ విధంగా ఒక ముస్లిం పై దాని (ధర్మం) గుర్తు బహిర్గతమవుతుంది.

• أن الله تعالى قد رَكَزَ في فطرةِ خلقه جميعًا الإقرارَ بربوبيته وألوهيته، وإنما يضلهم عنها الشيطان وأعوانه.
నిశ్చయంగా అల్లాహ్ తన సృష్టిరాశులందరి స్వభావంలో తన రుబూబియత్ (సృష్టికర్త,పాలకుడు,సంరక్షకుడు) ,తన ఉలూహియత్ (ఏక దైవోపాసవ) ను స్వీకరించడమును పొందుపరచాడు, షైతాను,అతని సహాయకులు వారిని మార్గ భ్రష్టతకు లోను చేస్తారు.

سَیَقُوْلُ السُّفَهَآءُ مِنَ النَّاسِ مَا وَلّٰىهُمْ عَنْ قِبْلَتِهِمُ الَّتِیْ كَانُوْا عَلَیْهَا ؕ— قُلْ لِّلّٰهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ؕ— یَهْدِیْ مَنْ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
యూదుల్లోంచి అజ్ఞానులు,మంద బుద్ధి కలవారు,వారి విధానం పై ఉన్న కపటులు తొందరలోనే అంటారు : ముందు నుంచి ముస్లిముల ఖిబ్లాగా ఉన్న బైతుల్ మఖ్దిస్ ను వారి ఖిబ్లా దిశ నుంచి ఏది మార్చింది?! ఓ ప్రవక్త వారికి సమాధానమిస్తూ ఇలా పలకండి : తూర్పు పడమరలు,అవే కాకుండ ఇతర దిశలు ఒక్కడైన అల్లాహ్ యాజమాన్యంలో ఉన్నవి,తాను తన దాసుల్లోంచి ఏ దిశ వైపు కోరుకుంటే ఆ దిశ వైపునకు మరలుస్తాడు,అతడు పరుశుద్ధుడు తన దాసుల్లోంచి ఎవరిని తలుచుకుంటే వారిని ఎటువంటి వంకరతనము,మలుపు లేని సన్మార్గము చూపుతాడు.
Tafsyrai arabų kalba:
وَكَذٰلِكَ جَعَلْنٰكُمْ اُمَّةً وَّسَطًا لِّتَكُوْنُوْا شُهَدَآءَ عَلَی النَّاسِ وَیَكُوْنَ الرَّسُوْلُ عَلَیْكُمْ شَهِیْدًا ؕ— وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِیْ كُنْتَ عَلَیْهَاۤ اِلَّا لِنَعْلَمَ مَنْ یَّتَّبِعُ الرَّسُوْلَ مِمَّنْ یَّنْقَلِبُ عَلٰی عَقِبَیْهِ ؕ— وَاِنْ كَانَتْ لَكَبِیْرَةً اِلَّا عَلَی الَّذِیْنَ هَدَی اللّٰهُ ؕ— وَمَا كَانَ اللّٰهُ لِیُضِیْعَ اِیْمَانَكُمْ ؕ— اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوْفٌ رَّحِیْمٌ ۟
మీ కొరకు మేము ఇష్టపడిన ఖిబ్లాను చేసినట్లే విశ్వాసాలలో,ఆరాధనలలో,వ్యవహారాలలో సమాజాలందరి మధ్య ఉత్తమమైన,న్యాయశీలమైన,మధ్యస్థ సమాజంగ మిమ్మల్ని చేశాము.ప్రళయదినాన అల్లాహ్ యొక్క ప్రవక్తల కొరకు వారు అల్లాహ్ ఆదేశాలను తమ సమాజాల వారి కొరకు చేరవేశారని మీరు సాక్షులవ్వటం కొరకు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఏ ఆదేశాలను ఇవ్వబడి మీ వద్దకు ప్రవక్తగా పంపించబడ్డారో వాటన్నింటిని ఆయన మీకు చేర వేశారని మీ పై సాక్షిగా అవ్వటం కొరకు.మీరు దేని వైపునైతే అభిముఖమయ్యేవారో ఆ బైతుల్ మఖ్దిస్ను ఖిబ్లా నుంచి మార్చాము దాని పై ఉన్న ప్రతిఫలమును తెలుసుకోవటం కొరకు.ఎవరైతే అల్లాహ్ శాసనాలను అంగీకరిస్తాడో,వాటికి కట్టుబడి ఉంటాడో అతడు ప్రవక్త ను అనుసరిస్తాడు.ఎవరైతే అతని (అల్లాహ్) ధర్మం నుంచి మరలి పోతాడో తన మనోవాంఛనలకు లోనవుతాడో అతడు అల్లాహ్ శాసనాలకు కట్టుబడి ఉండడు.అల్లాహ్ తన పై విశ్వాసము యొక్క,తన దాసుల కొరకు ఏవైతే శాసనాలను శాసించాడో లోతైన జ్ఞానము వలన అన్న నమ్మకము యొక్క సౌభాగ్యము కలిగించాడో వారికి తప్ప ఇతరులకు మొదటి సారి ఖిబ్లా మార్పు విషయం భారంగా అనిపించింది.అల్లాహ్ పై ఉన్న మీ విశ్వాసమును ఆయన (అల్లాహ్) వృధా చేయడు,వాటి లోంచి ఖిబ్లా మార్పు కన్న ముందు మీరు చేసుకున్న నమాజులు కూడాను,నిశ్చయముగా అల్లాహ్ ప్రజల పై వాత్సల్యము,కరుణను కలవాడు,అయితే అతడు ప్రజల పై భారాన్ని వేయడు,వారి ఆచరణల ప్రతి ఫలాన్ని వృదా చేయడు.
Tafsyrai arabų kalba:
قَدْ نَرٰی تَقَلُّبَ وَجْهِكَ فِی السَّمَآءِ ۚ— فَلَنُوَلِّیَنَّكَ قِبْلَةً تَرْضٰىهَا ۪— فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ؕ— وَحَیْثُ مَا كُنْتُمْ فَوَلُّوْا وُجُوْهَكُمْ شَطْرَهٗ ؕ— وَاِنَّ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ لَیَعْلَمُوْنَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّهِمْ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا یَعْمَلُوْنَ ۟
ఓ ప్రవక్త ఖిబ్లా విషయంలో మీరు కోరుకున్న వైపు,దాని మార్పుకు సంబంధించిన దైవవాణి అవతరణ కొరకు నిరీక్షిస్తూ,కోరుతూ ఆకాశము వైపునకు మీ యొక్క ముఖముని,దృష్టిని త్రిప్పుతుండగా మేము చూశాము.అయితే ఏ ఖిబ్లానైతే మీరు కోరుకుంటున్నారో,ఇష్టపడుతున్నారో బైతుల్ మఖ్దిస్ కు బదులుగా బైతుల్ హరామ్ వైపునకు ఇప్పుడు మేము తప్పకుండా మీ దిశను మారుస్తాము.అయితే మీరు మక్కతుల్ ముకర్రమహ్ లో గల గౌరవప్రధమైన అల్లాహ్ గృహము వైపునకు మీ యొక్క ముఖమును త్రిప్పుకోండి,ఓ విశ్వాసపరులారా మీరు ఎక్కడ ఉన్నా నమాజును చేసే సమయంలో దాని వైపునకే అభిముఖమవ్వండి.నిశ్చయంగా గ్రంధవహుల్లోంచి యూదులు,క్రైస్తవులు ఖిబ్లా మార్పు ఆదేశం వారి కార్యాల నిర్దేశకుడు,వారి సృష్టికర్త తరపు నుండి అవతరింప బడిన వాస్తవమైన ఆదేశం అని తెలుసుకుంటారు.ఎందుకంటే వారి గ్రంధాలలో దాని ఆధారాలు ఉన్నవి,మరయు అల్లాహ్ వాస్తవాన్ని వ్యతిరేకించే వీరి కర్మలనుండి ఏమరుపాటుకు లోనుకాడు,కాని పరిశుద్దుడైన అతడు వీటన్నింటి గురించి బాగా తెలిసినవాడు,వారికి దాని ప్రకారమే పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَلَىِٕنْ اَتَیْتَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ بِكُلِّ اٰیَةٍ مَّا تَبِعُوْا قِبْلَتَكَ ۚ— وَمَاۤ اَنْتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ ۚ— وَمَا بَعْضُهُمْ بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ ؕ— وَلَىِٕنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ مِّنْ بَعْدِ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ ۙ— اِنَّكَ اِذًا لَّمِنَ الظّٰلِمِیْنَ ۟ۘ
అల్లాహ్ సాక్షిగా ఓ ప్రవక్త మీరు గ్రంధం ఇవ్వబడిన యూదులు క్రైస్తవుల వద్దకు ఖిబ్లా మార్పు సరైనదని ఆయతులను,ఆధారాలను తీసుకుని వచ్చినా వారు మీ ఖిబ్లా వైపునకు మరలరు దానికి కారణం మీరు తీసుకుని వచ్చిన దాని పట్ల వ్యతిరేకత,వాస్తవాన్ని (హఖ్) అనుసరించటం గురించి అహంకారము,మరియు అల్లాహ్ మిమ్మల్ని దాని వైపునుంచి మరల్చిన తరువాత మీరు కూడా వారి ఖిబ్లా వైపునకుమరలరు,వారిలోని కొందరు కొందరి ఖిబ్లా వైపునకు మరలరు,ఎందుకంటే వారిలోని ప్రతి ఒక్కరు రెండో వర్గాన్ని తిరస్కరిస్తున్నారు,ఒక వేళ మీరు ఖిబ్లా విషయంలో,అది కాకుండా ఇతర విషయాలైన ధర్మ శాసనాలు,ధర్మ ఆదేశాల విషయంలో మీ వద్దకు ఎటువంటి సందేహం లేని సరైన జ్ఞానం వచ్చిన తరువాత వారి కోరికను అంగీకరిస్తే అటువంటప్పుడు మీరు సన్మార్గమును వదిలి మనోవాంఛనలకు లోనవటం వలన దుర్మార్గమునకు పాల్పడినవారవుతారు.వారిని అనుసరించడం (మాటవినడం) సరికాదని తెలియపరచడానికి దైవ ప్రవక్తను ఉద్దేశించి ఈ ఆదేశం ఇవ్వడం జరిగింది,కాకపోతే అల్లాహ్ తన ప్రవక్తను వాటి నుంచి రక్షించి ఉంచాడు,అది ఆయన తరువాత ఆయన జాతి వారికి హెచ్చరిక.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• أن الاعتراض على أحكام الله وشرعه والتغافل عن مقاصدها دليل على السَّفَه وقلَّة العقل.
అల్లాహ్ ఆదేశాలు,ఆయనశాసనాల పట్ల వ్యతిరేకత వాటి లక్ష్యాల పట్ల నిర్లక్ష్యం బుద్దిలేమి తనము, తెలివి తక్కువ తనమునకు ఆధారము.

• فضلُ هذه الأمة وشرفها، حيث أثنى عليها الله ووصفها بالوسطية بين سائر الأمم.
ఎప్పుడైతే అల్లాహ్ ఈజాతిని (ఉమ్మతే ముహమ్మదియా) పొగడటం,జాతులందరిలో న్యాయపూరిత జాతిగా వర్ణించడం జరిగిందో దానికి గౌరవం,గొప్పతనము లభించింది.

• التحذير من متابعة أهل الكتاب في أهوائهم؛ لأنهم أعرضوا عن الحق بعد معرفته.
గ్రంధవహుల కోరికలను అనుసరించడం గురించి హెచ్చరించడం జరిగింది,ఎందుకంటే వారు వాస్తవమును తెలుసుకున్న తరువాత దాని పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారు.

• جواز نَسْخِ الأحكام الشرعية في الإسلام زمن نزول الوحي، حيث نُسِخَ التوجه إلى بيت المقدس، وصار إلى المسجد الحرام.
దైవవాణి అవతరణ కాలంలో ఇస్లాంలో ధర్మ ఆదేశాలను రద్దు పరచడం సరైనదే,అలాగే బైతుల్ మఖ్దిస్ వైపు నుంచి ఖిబ్లా రద్దు పరచబడి మస్జిదే హరాం వైపునకు మారి పోయినది.

اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یَعْرِفُوْنَهٗ كَمَا یَعْرِفُوْنَ اَبْنَآءَهُمْ ؕ— وَاِنَّ فَرِیْقًا مِّنْهُمْ لَیَكْتُمُوْنَ الْحَقَّ وَهُمْ یَعْلَمُوْنَ ۟ؔ
గ్రంధం ఇవ్వబడిన యూదులు,క్రైస్తవుల పండితులకు ఖిబ్లా మార్పు ఆదేశం వారి వద్ద ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవ దౌత్య సూచనల్లోంచి అని తెలుసు,తమ పిల్లలను ఇతర పిల్లల్లోంచి ఎలా గుర్తించి వేరు చేసుకుంటారో (అలా తెలసు) ,దానితోపాటు వారిలోని ఒక వర్గం ఆయన తీసుకుని వచ్చిన వాస్తవాన్ని తమ అసూయ వలన దాచి వేస్తున్నారు,అది వాస్తవమని తెలిసి కూడా వారు ఇలా చేస్తున్నారు.
Tafsyrai arabų kalba:
اَلْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُوْنَنَّ مِنَ الْمُمْتَرِیْنَ ۟۠
ఇది నీ ప్రభువు తరుపు నుంచి వచ్చిన సత్యము,ఓ ప్రవక్త అది సరైనదన్న విషయంలో సందేహ పడేవారిలోంచి మీరు కాకండి.
Tafsyrai arabų kalba:
وَلِكُلٍّ وِّجْهَةٌ هُوَ مُوَلِّیْهَا فَاسْتَبِقُوْا الْخَیْرٰتِ ؔؕ— اَیْنَ مَا تَكُوْنُوْا یَاْتِ بِكُمُ اللّٰهُ جَمِیْعًا ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
జాతుల్లోంచి ప్రతి జాతికి ఒక దిక్కు ఉన్నది దాని వైపునకే వారు భావన పరంగా లేదా నైతిక పరంగా అభిముఖమవుతుంటారు,దీని వలనే జాతులకి తమ ఖిబ్లా విషయంలో,అల్లాహ్ తమ కొరకు నిర్దేశించిన శాసనాల విషయంలో వ్యతిరేకతలు. వారి దిక్కులు రకరకాలుగా ఉండటం ఒక వేళ అది అల్లాహ్ ఆదేశం అయిన,శాసనమయిన ఎటువంటి నష్టం చేయదు,అయితే ఓవిశ్వాస పరులారా మీరు ఏ పుణ్యకార్యాలు చేయడానికి ఆదేశించబడ్డారో వాటిని చేయడానికి పోటీ పడండి. మీరు ఏ స్థావరంలో ఉన్నా ప్రళయ దినాన మీ కర్మల ప్రతిఫలంను ప్రసాదించడం కొరకు అల్లాహ్ మిమ్మల్ని సమీకరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారము కలవాడు,మిమ్మల్ని సమీకరించడం,మీకు ప్రతిఫలం ప్రసాదించడం అతన్ని అశక్తుడ్ని చేయదు.
Tafsyrai arabų kalba:
وَمِنْ حَیْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ؕ— وَاِنَّهٗ لَلْحَقُّ مِنْ رَّبِّكَ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
నీవు ఏ ప్రాంతము నుంచి బయలుదేరినా,నీవు ఎక్కడ ఉన్నా ఓ ప్రవక్త నీవు,నిన్ను అనుసరించేవారు,నమాజు చేయదలచుకుంటే మస్జిదే హరాం వైపునకు అభిముఖమవ్వండి అది నీ ప్రభువు తరుపు నుంచి నీ వైపునకు అవతరింపబడిన సత్యము,అల్లాహ్ మీ కర్మల పట్ల నర్లక్ష్యంగా లేడు,వాటిని తెలుసుకుంటాడు,వాటి పరంగానే మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَمِنْ حَیْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ؕ— وَحَیْثُ مَا كُنْتُمْ فَوَلُّوْا وُجُوْهَكُمْ شَطْرَهٗ ۙ— لِئَلَّا یَكُوْنَ لِلنَّاسِ عَلَیْكُمْ حُجَّةٌ ۗ— اِلَّا الَّذِیْنَ ظَلَمُوْا مِنْهُمْ ۗ— فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِیْ ۗ— وَلِاُتِمَّ نِعْمَتِیْ عَلَیْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟ۙۛ
ఓ ప్రవక్త మీరు ఏ ప్రాంతము నుంచి బయలుదేరినా నమాజు చేయదలచుకుంటే మస్జిదుల్ హరాం వైపునకు అభిముఖమవ్వండి. ఓ విశ్వాసపరులారా మీరు ఏ ప్రాంతములో ఉన్నా నమాజు చేయదలచుకుంటే మీ ముఖములను దాని వైపునకే మరల్చుకోండి;జనులు మీకు వ్యతిరేకంగా ఎటువంటి వాదనలు చేయకుండా ఉండటానికి,కాని వారిలోంచి కొందరు దుర్మార్గులుంటారు,వారు తమ వ్యతిరేకత పైనే ఉంటారు,మీకు వ్యతిరేకంగా బలహీనమైన వాదనలు వాదిస్తూనే ఉంటారు,అయితే మీరు వారికి భయపడకండి,ఒక్కడైన మీ ప్రభువుకి ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడండి,నిశ్చయంగా అల్లాహ్ జాతుల్లోంచి మిమ్మల్ని వేరుపరచి మీపై తన అనుగ్రహమును పూర్తి చేయటానికి కాబావైపు అభిముఖమవ్వటమును నిర్ణయించాడు,ప్రజల గొప్ప ఖిబ్లా వైపు మీకు మార్గదర్శకానికి.
Tafsyrai arabų kalba:
كَمَاۤ اَرْسَلْنَا فِیْكُمْ رَسُوْلًا مِّنْكُمْ یَتْلُوْا عَلَیْكُمْ اٰیٰتِنَا وَیُزَكِّیْكُمْ وَیُعَلِّمُكُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَیُعَلِّمُكُمْ مَّا لَمْ تَكُوْنُوْا تَعْلَمُوْنَ ۟ؕۛ
ఏ విధంగానైతే మీలో నుంచే ఒక ప్రవక్తను మీ వద్దకు పంపి మేము ఇంకొక అనుగ్రహాన్ని మీపై కురిపించామో,అతడు మా ఆయతులను మీ ముందు చదివి వినిపిస్తున్నాడు,మంచిని,సద్గుణాలను మీకు ఆదేశిస్తూ,చెడునుంచి,దుర్గుణాలనుంచి వారిస్తూ మిమ్మల్ని ప్రక్షాళిస్తాడు,మరియు మిమ్మల్ని ఖుర్ఆన్,సున్నత్ ను బోధిస్తాడు,మరియు మీకు తెలియని మీ ఇహ,పర లోకాల విషయాలను మీకు నేర్పిస్తాడు.
Tafsyrai arabų kalba:
فَاذْكُرُوْنِیْۤ اَذْكُرْكُمْ وَاشْكُرُوْا لِیْ وَلَا تَكْفُرُوْنِ ۟۠
మీ హృదయాలు,అవయవాల ద్వార నన్ను స్మరించండి,నేను కూడా మిమ్మల్ని పొగుడ్తూ,మిమ్మల్ని రక్షిస్తూ జ్ఞాపకం ఉంచుకుంటాను,అయితే ప్రతి ఫలము కర్మలను బట్టి ఉంటుంది,నా అనుగ్రహాలు మీ పై ఏవైతే ఉన్నాయో వాటి కృతజ్ఞతలు తెలుపుకోండి,వాటిని తిరస్కరిస్తూ,వాటిని మీ పై నిషేధించిన వాటిలో ఉపయోగిస్తూ మీరు నాకు కృతఘ్నలు కాకండి.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اسْتَعِیْنُوْا بِالصَّبْرِ وَالصَّلٰوةِ ؕ— اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِیْنَ ۟
ఓ విశ్వాసపరులారా నా ఆదేశాన్ని స్వీకరిస్తూ,నా పై విధేయత చూపుతూ నమాజును నెలకొల్పుతూ సహనము ద్వారా సహాయమును అర్ధించండి,నిశ్చయంగా అల్లాహ్ సహనం పాటించేవారితో వారికి సహాయ పడుతూ,సౌభాగ్యమును కలిగిస్తూ తోడుగా ఉంటాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• إطالة الحديث في شأن تحويل القبلة؛ لما فيه من الدلالة على نبوة محمد صلى الله عليه وسلم.
ఖిబ్లా మార్పు విషయంలో సంభాషణ పొడుగింపు దేనిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్య నిరూపణ ఉంది.

• ترك الجدال والاشتغالُ بالطاعات والمسارعة إلى الله أنفع للمؤمن عند ربه يوم القيامة.
వాగ్వాదమును వదిలి వేయటం,విధేయత చూపటంలో నిమగ్నమవటం,అల్లాహ్ వైపునకు త్వరపడటం ప్రళయదినాన విశ్వాసపరుని కొరకు తన ప్రభువు వద్ద ఎంతో లాభదాయకమైనది.

• أن الأعمال الصالحة الموصلة إلى الله متنوعة ومتعددة، وينبغي للمؤمن أن يسابق إلى فعلها؛ طلبًا للأجر من الله تعالى.
అల్లాహ్ వద్దకు చేరవేసే సత్కర్మలు వైవిధ్యభరితమైనవి, బహుళమైనవి, అల్లాహ్ ను౦డి ప్రతిఫల౦ పొ౦దే౦దుకు విశ్వాసి వాటిని చేయడానికి పోటీపడాలి.

• عظم شأن ذكر الله -جلّ وعلا- حيث يكون ثوابه ذكر العبد في الملأ الأعلى.
అల్లాహ్ స్మరణ గొప్పతనము,దాని ప్రతిఫలము దైవదూతల్లో దాసుని యొక్క చర్చ.

وَلَا تَقُوْلُوْا لِمَنْ یُّقْتَلُ فِیْ سَبِیْلِ اللّٰهِ اَمْوَاتٌ ؕ— بَلْ اَحْیَآءٌ وَّلٰكِنْ لَّا تَشْعُرُوْنَ ۟
ఓ విశ్వాస పరులారా అల్లాహ్ మార్గంలో జిహాద్ (పవిత్ర యుద్దం) లో మరణించినవారిని ఇతరులు మరణించిన విధంగా మరణించిన మృతులని చెప్పకండి,వారు తమ ప్రభువు వద్ద జీవించి ఉన్నారు,కానీ వారి జీవితాన్ని మీరు గ్రహించలేరు.ఎందుకంటే అది ప్రత్యేకమైన జీవితం,దానిని అర్దం చేసుకోవటానికి అల్లాహ్ తరుపు నుంచి దైవ వాణి తప్ప వేరే మార్గం లేదు.
Tafsyrai arabų kalba:
وَلَنَبْلُوَنَّكُمْ بِشَیْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوْعِ وَنَقْصٍ مِّنَ الْاَمْوَالِ وَالْاَنْفُسِ وَالثَّمَرٰتِ ؕ— وَبَشِّرِ الصّٰبِرِیْنَ ۟ۙ
మరియు మేము తప్పకుండా మిమ్మల్ని రకరకాల ఆపదలకు గురి చేసి మీ శతృవుల తరుపు నుంచి భయాందోళనలకు గురి చేసి,ఆహారము తగ్గుదల ద్వారా ఆకలికి గురి చేసి,ధన సంపదలను దూరం చేయటం ద్వారా నష్టం చేసి లేదా వాటిని సంపాదించడం కష్టం చేసి,ప్రజలకు హాని కలిగించే కష్టాల కారణంగా ప్రాణ నష్టం చేసి,లేదా అల్లాహ్ మార్గంలో అమరగతిని కలిగించడం ద్వారా,నేల పండించే ఫలాలను నష్టం కలిగించి పరీక్షిస్తాము. ఓ ప్రవక్త ఈ కష్టాలపై సహనం పాటించే వారికి శుభవార్తను తెలియచేయండి వీటి ద్వారానే వారికి ఇహ పరాలలో సంతోషము ప్రాప్తిస్తుంది.
Tafsyrai arabų kalba:
الَّذِیْنَ اِذَاۤ اَصَابَتْهُمْ مُّصِیْبَةٌ ۙ— قَالُوْۤا اِنَّا لِلّٰهِ وَاِنَّاۤ اِلَیْهِ رٰجِعُوْنَ ۟ؕ
ఈ ఆపదల్లోంచి ఏదైన ఆపద వారికి కలిగినప్పుడు సంతోషంతో స్వాగతిస్తూ ఈవిధంగా పలుకుతారు "మేము అల్లాహ్ యొక్క సొత్తు అతను తలచుకున్న విధంగా మా పై అధికారమును చెలాయిస్తుంటాడు,నిశ్చయంగా మేము ప్రళయదినాన ఆయన వైపునకే మరలి వెళతాము అతడే మమ్మల్ని సృష్టించాడు,అనేక రకాల అనుగ్రహాలను మనకు ప్రసాదించాడు,మనం మరలి వెళ్లటం,మన కార్యాల ముగింపు అతని వైపే".(అని అంటారో)
Tafsyrai arabų kalba:
اُولٰٓىِٕكَ عَلَیْهِمْ صَلَوٰتٌ مِّنْ رَّبِّهِمْ وَرَحْمَةٌ ۫— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُهْتَدُوْنَ ۟
ఈ గుణాలు కలిగిన వారందరి కొరకు గొప్ప దైవదూతల ముందు అల్లాహ్ పొగడ్తలు లభించును.మరియు దైవ కారుణ్యం వారిపై కురియును,వారందరు సత్య మార్గమును పొందుతారు.
Tafsyrai arabų kalba:
اِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَآىِٕرِ اللّٰهِ ۚ— فَمَنْ حَجَّ الْبَیْتَ اَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَیْهِ اَنْ یَّطَّوَّفَ بِهِمَا ؕ— وَمَنْ تَطَوَّعَ خَیْرًا ۙ— فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِیْمٌ ۟
నిశ్చయంగా కాబా దగ్గరలో సఫా,మర్వా పేర్లతో ప్రసిద్ది చెందిన రెండు పర్వతాలు ధర్మం యొక్క ప్రత్యక్ష సూచనల్లోనివి,ఎవరైతే హజ్,ఉమ్రా ఆచారాలను పూర్తి చేయటానికి బైతుల్లాహ్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడో ఆ రెండింటి మధ్యన సయీ చేయటంలో అతనిపై ఎటువంటి పాపం లేదు,ముస్లింలలోంచి ఎవరైతే అది అజ్ఞాన కాలము నాటి కార్యము అని విశ్వసిస్తూ ఆ రెండింటి మధ్య సయీ చేయటం కొరకు బయలుదేరుతాడో అతని మనసు కుదుట పడటం కొరకు అందులో ఎటువంటి పాపము లేదు అనటానికి కారణం. మరియు అల్లాహ్ ఇవన్ని హజ్ ఆచారాల్లోంచి అని తెలియ పరచాడు,ఎవరైతే సత్కార్యాలను పుణ్యాన్ని ఆశిస్తూ,చిత్తశుద్దితో చేస్తాడో అల్లాహ్ అతని కర్మలను ఆదరిస్తాడు,అతని తరపు నుండి వాటిని స్వీకరిస్తాడు,అతనికి దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు,ఎవరు సత్కర్మలు చేశాడో,పుణ్యానికి అర్హుడో అల్లాహ్ కు బాగా తెలుసు.
Tafsyrai arabų kalba:
اِنَّ الَّذِیْنَ یَكْتُمُوْنَ مَاۤ اَنْزَلْنَا مِنَ الْبَیِّنٰتِ وَالْهُدٰی مِنْ بَعْدِ مَا بَیَّنّٰهُ لِلنَّاسِ فِی الْكِتٰبِ ۙ— اُولٰٓىِٕكَ یَلْعَنُهُمُ اللّٰهُ وَیَلْعَنُهُمُ اللّٰعِنُوْنَ ۟ۙ
నిశ్చయంగా ఎవరైతే యూదులు, క్రైస్తవుల్లోంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,ఆయన తీసుకుని వచ్చినవి సత్యమని నిర్ధారించే ఆధారాలను మేము వేటినైతే అవతరింప జేశామొ వారి గ్రంధాల్లో ప్రజల కొరకు మేము స్పష్టం చేసిన తరువాత వాటిని గోప్యంగా ఉంచుతున్నారో వారందరిని అల్లాహ్ తన కారుణ్యం నుండి ధూత్కరిస్తాడు,వారిని అతని కారుణ్యం నుండి వెడలగొట్టమని దైవ దూతలు,దైవ ప్రవక్తలు,ప్రజలందరు శపిస్తారు.
Tafsyrai arabų kalba:
اِلَّا الَّذِیْنَ تَابُوْا وَاَصْلَحُوْا وَبَیَّنُوْا فَاُولٰٓىِٕكَ اَتُوْبُ عَلَیْهِمْ ۚ— وَاَنَا التَّوَّابُ الرَّحِیْمُ ۟
కాని ఎవరైతే ఈ స్పష్టమైన ఆయతులను (సూచనలను) గోప్యంగా ఉంచటం పై పశ్చాత్తాప్పడుతూ అల్లాహ్ వైపునకు మరలుతారో,తమ బాహ్య,అంతర ఆచరణలను సంస్కరించుకుంటారో,తాము గోప్యంగా ఉంచిన సత్యాన్ని,సన్మార్గమును బహిర్గతం చేస్తారో వారందరి నా విధేయత వైపునకు మరలటాన్ని నేను అంగీకరిస్తున్నాను,మరయు దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను,వారిపై కరుణ కటాక్షాలను కురిపిస్తాను.
Tafsyrai arabų kalba:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَمَاتُوْا وَهُمْ كُفَّارٌ اُولٰٓىِٕكَ عَلَیْهِمْ لَعْنَةُ اللّٰهِ وَالْمَلٰٓىِٕكَةِ وَالنَّاسِ اَجْمَعِیْنَ ۟ۙ
నిశ్చయంగా సత్య తిరస్కారులు తాము తౌబా (పశ్చాత్తాపము) చేయక మునుపే సత్య తిరస్కార స్థితిలోనే మరణిస్తే వారందరి పై అల్లాహ్ యొక్క శాపము అతని కారుణ్యం నుండి వారిని గెంటి వేయటంతో పాటు ఉంటుంది,అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి గెంటి వేయమని,దాని నుండి దూరం చేయమని దైవ దూతలు,ప్రజలందరి శాపము వారిపై ఉంటుంది.
Tafsyrai arabų kalba:
خٰلِدِیْنَ فِیْهَا ۚ— لَا یُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟
ఈ శాపములోనే వారు ఎల్లప్పుడూ ఉంటారు,ఒక రోజు కూడా వారి శిక్షను తగ్గించటం గాని జరగదు,వారికి ప్రళయదినాన సమయమివ్వటమూ జరగదు.
Tafsyrai arabų kalba:
وَاِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الرَّحْمٰنُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రజలారా మీ వాస్తవ ఆరాధ్య దైవము ఆయన అస్తిత్వంలో,ఆయన గుణగణాల్లో ఒక్కడే.అతను తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవము లేడు,విశాలమైన కరుణకల కరుణామయుడు అతడే,తన దాసుల పట్ల అనంత కరుణ కలవాడు.ఎలాగైతే అతను వారిపై లెక్క లేనన్ని అనుగ్రహాలను కురిపించాడో.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• الابتلاء سُنَّة الله تعالى في عباده، وقد وعد الصابرين على ذلك بأعظم الجزاء وأكرم المنازل.
తన దాసులని పరీక్షించడం అల్లాహ్ సంప్రదాయం,ఆయన సహనం పాటించే వారికి వాటిపై గొప్ప ప్రతి ఫలం,ఉన్నత స్థానాల వాగ్దానం చేశాడు.

• مشروعية السعي بين الصفا والمروة لمن حج البيت أو اعتمر.
బైతుల్లాహ్ యొక్క హజ్ లేదా ఉమ్రా చేసే వారి కొరకు సఫా మర్వా సయీ చేసే ఆదేశం.

• من أعظم الآثام وأشدها عقوبة كتمان الحق الذي أنزله الله، والتلبيس على الناس، وإضلالهم عن الهدى الذي جاءت به الرسل.
అల్లాహ్ అవతరింపజేసిన సత్యాన్ని దాచటం,ప్రజలను సందేహాలకు గురి చేయటం,దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గం నుంచి వారిని మార్గ భ్రష్టులు చేయటం కఠినమైన శిక్షలు కల మహా పాపాల్లోంచివి.

اِنَّ فِیْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافِ الَّیْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِیْ تَجْرِیْ فِی الْبَحْرِ بِمَا یَنْفَعُ النَّاسَ وَمَاۤ اَنْزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنْ مَّآءٍ فَاَحْیَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِیْهَا مِنْ كُلِّ دَآبَّةٍ ۪— وَّتَصْرِیْفِ الرِّیٰحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَیْنَ السَّمَآءِ وَالْاَرْضِ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّعْقِلُوْنَ ۟
నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలో, ఆ రెండింటిలో ఉన్న సృష్టి అద్భుతాల్లో, పగలు రాత్రి ఒక దాని తరువాత ఒకటి రావటంలో,ప్రజలకు ఉపయోగకరమైన ఆహారము,దుస్తులు,వ్యాపార సామగ్రి,అవే కాకుండ వారికి అవసరమైన ఇతర వస్తువులను తీసుకుని సముద్రపు నీటి పై నడిచే ఓడల్లో,అల్లాహ్ ఆకాశము నుంచి నీటిని కురిపించి దాని ద్వారా గడ్డిని,పంటలను మొలకెత్తించి భూమిలో జీవమును పోయటంలో,అందులో(భూమిలో) అన్ని రకాల జీవాలను వ్యాపింప చేయటంలో,పవనాలను ఒక దిశ నుంచి ఇంకో దిశ వైపునకు మరలించటంలో,భూమ్యాకాశాల మధ్య నియమ నిభందనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాల్లో నిశ్చయంగా వీటన్నింటిలోంచి ప్రతి దానిలో నిరూపణలను గ్రహించే వారి కొరకు,ఆధారాలను,నిదర్శనాలను అర్ధం చేసుకునే వారి కొరకు ఆయన ఏకత్వం పై స్పష్టమైన ఆధారాలున్నాయి.
Tafsyrai arabų kalba:
وَمِنَ النَّاسِ مَنْ یَّتَّخِذُ مِنْ دُوْنِ اللّٰهِ اَنْدَادًا یُّحِبُّوْنَهُمْ كَحُبِّ اللّٰهِ ؕ— وَالَّذِیْنَ اٰمَنُوْۤا اَشَدُّ حُبًّا لِّلّٰهِ ؕ— وَلَوْ یَرَی الَّذِیْنَ ظَلَمُوْۤا اِذْ یَرَوْنَ الْعَذَابَ ۙ— اَنَّ الْقُوَّةَ لِلّٰهِ جَمِیْعًا ۙ— وَّاَنَّ اللّٰهَ شَدِیْدُ الْعَذَابِ ۟
ఈ స్పష్టమైన సూచనలతోపాటు ప్రజల్లోంచి కొందరు అల్లాహ్ ను వదిలి వేరే వారిని ఆరాధ్య దైవాలు చేసుకున్నారు.వారిని అల్లాహ్ కు సరిసమానులుగా పోల్చ సాగారు,వారిని అల్లాహ్ ను ఇష్టపడినట్లు ఇష్టపడ సాగారు,విశ్వాసపరులు వారి(ముష్రిక్కుల) ఈ ఆరాధ్య దైవాల కన్న అల్లాహ్ ను ఎక్కువగా ఇష్టపడుతారు,ఎందుకంటే వారు అల్లాహ్ తో పాటు వేరేవారిని సాటి కల్పించరు,వారు కలిమిలోను,లేమిలోను ఆయనను ఇష్టపడుతారు,కాని వారు (మష్రిక్కులు) తమ ఆరాధ్య దైవాలను కలిమిలోనే ఇష్టపడుతారు,లేమిలో అల్లాహ్ కు తప్ప ఇతరులను వేడుకోరు,ఒక వేళ దుర్మార్గులు తమ బహు దైవారాధన,తమ పాపాల వలన పరలోకంలో శిక్షను చూసుకున్నప్పుడు తమ పరిస్థితిని గమనిస్తే శక్తి సామార్ధ్యాలన్నింటిలో అల్లాహ్ ఒక్కడే అన్న విషయాన్నిగుర్తిస్తారు.ఆయన తన అవిధేయులను కఠినంగా శిక్షిస్తాడు.సాటి కల్పించేవారు ఒక వేళ వీటన్నింటిని చూస్తే వారు అతనితోపాటు ఇతరులను సాటి కల్పించరు.
Tafsyrai arabų kalba:
اِذْ تَبَرَّاَ الَّذِیْنَ اتُّبِعُوْا مِنَ الَّذِیْنَ اتَّبَعُوْا وَرَاَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْاَسْبَابُ ۟
మరియు అప్పుడు అనుసరించబడిన నాయకులు ప్రళయదినాన భయాందోళనలను,కష్టాలను చూసి తమను అనుసరించే బలహీనుల పట్ల విసుగును ప్రదర్శిస్తారు,మోక్షానికి మార్గాలు,కారకాలు వారి (అనుసరించే వారి నుంచి) నుంచి తెగిపోతాయి.
Tafsyrai arabų kalba:
وَقَالَ الَّذِیْنَ اتَّبَعُوْا لَوْ اَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّاَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوْا مِنَّا ؕ— كَذٰلِكَ یُرِیْهِمُ اللّٰهُ اَعْمَالَهُمْ حَسَرٰتٍ عَلَیْهِمْ ؕ— وَمَا هُمْ بِخٰرِجِیْنَ مِنَ النَّارِ ۟۠
బలహీనులు,అనుసరించేవారంటారు : ఒక వేళ మనకు ప్రాపంచిక జీవితం వైపునకు మరలి వెళ్ళటం అనేది జరిగితే మేము మా నాయకుల పట్ల విసుగును వారు మా పట్ల ప్రదర్శించినట్లు ప్రదర్శిస్తాము,ఏ విధంగానైతే అల్లాహ్ వారికి పరలోకంలో కఠినమైన శిక్షను చూపించాడో అదే విధంగా అసత్య విషయాల్లో తమ నాయకులను అనుసరించటం వలన పర్యవసానంగా దుఖము,అవమానము కలిగించటానికి వారికి చూపిస్తాడు,వారు ఎన్నటికి నరకాగ్ని నుండి బయటకు రాలేరు.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا النَّاسُ كُلُوْا مِمَّا فِی الْاَرْضِ حَلٰلًا طَیِّبًا ؗ— وَّلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟
ఓ ప్రజలారా మీరు భూమిలో ఉన్న జంతువుల్లోంచి,మొక్కల్లోంచి,వృక్షాల్లోంచి అలాగే ధర్మ సమ్మతమైన (హలాల్) పద్దతిలో సంపాదించిన వాటిని తినండి,అవి పరిశుద్ధమైనవి,చెడ్డవి కావు. మీరు షైతాన్ మార్గములను అనుసరించకండి,అతడు మిమ్మల్ని వాటి ద్వారా మీకు తెలియకుండానే నిదానంగా తీసుకుని వెళతాడు,నిశ్చయంగా అతడు మీ కొరకు బాహ్య శతృత్వం కల శతృవు,తనను బాధ కలిగించడం,మార్గ భ్రష్టతకు లోను చేయటం పై ఆశ కలిగిన శతృవును అనుసరించడం ఒక బుద్ది మంతునికి తగదు.
Tafsyrai arabų kalba:
اِنَّمَا یَاْمُرُكُمْ بِالسُّوْٓءِ وَالْفَحْشَآءِ وَاَنْ تَقُوْلُوْا عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
అతడు చిన్న పాపాలు,మహా పాపాల్లాంటి చెడుల గురించి,విశ్వాసాలు,ఆదేశాల విషయంలో అల్లాహ్,ప్రవక్తలు తీసుకుని వచ్చిన జ్ఞానం లేకుండా అల్లాహ్ పై మీరు పలకాలని ఆదేశిస్తాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• المؤمنون بالله حقًّا هم أعظم الخلق محبة لله؛ لأنهم يطيعونه على كل حال في السراء والضراء، ولا يشركون معه أحدًا.
అల్లాహ్ పై విశ్వాసం కలిగినవారు వాస్తవంలో వారే అల్లాహ్ కొరకు ఇష్టత కలిగిన గొప్ప సృష్టి,ఎందుకంటే వారు కలిమిలో,లేమిలో ప్రతి పరిస్థితిలో అతని (అల్లాహ్) పై విధేయత చూపుతారు,అతనితో పాటు వేరే ఎవరిని సాటి కల్పించరు.

• في يوم القيامة تنقطع كل الروابط، ويَبْرَأُ كل خليل من خليله، ولا يبقى إلا ما كان خالصًا لله تعالى.
ప్రళయదినాన సంబంధాలన్నీ తెగి పోతాయి,ప్రతి ప్రాణ స్నేహితుడు తన స్నేహితునితో సంబంధము లేనట్లు మాట్లాడుతాడు. ప్రత్యేకించి అల్లాహ్ కొరకు చేసినది మిగిలి ఉంటుంది.

• التحذير من كيد الشيطان لتنوع أساليبه وخفائها وقربها من مشتهيات النفس.
షైతాను కుట్రల గురించి హెచ్చరిక,ఎందుకంటే వాటి మార్గాలు ఎన్నో ఉన్నాయి,అవి దాగి ఉన్నాయి,మనోవాంఛలకు చాలా దగ్గరున్నవి.

وَاِذَا قِیْلَ لَهُمُ اتَّبِعُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ قَالُوْا بَلْ نَتَّبِعُ مَاۤ اَلْفَیْنَا عَلَیْهِ اٰبَآءَنَا ؕ— اَوَلَوْ كَانَ اٰبَآؤُهُمْ لَا یَعْقِلُوْنَ شَیْـًٔا وَّلَا یَهْتَدُوْنَ ۟
ఈ విశ్వాసులందరితో మీరు అల్లాహ్ అవతరింపజేసిన సన్మార్గమును,జ్యోతిని అనుసరించండి అని అన్నప్పుడు మొండి పట్టుదల కలవారు ఇలా అంటారు : అది కాదు మేము విశ్వాసాల విషయంలో,సంప్రదాయాల్లో మా తాతముత్తాతలను దేనిపైనైతే మేము పొందామో దానిని అనుసరిస్తాము,ఒకవేళ వారి తాతముత్తాతలు సన్మార్గమును,జ్యోతిని కొంచెం కూడా అర్దం చేసుకోకుండా, అల్లాహ్ ఇష్టపడిన సత్యం వైపునకు మరలి పోకుండా ఉంటే కూడా వారు వారినే అనుసరిస్తారా?!.
Tafsyrai arabų kalba:
وَمَثَلُ الَّذِیْنَ كَفَرُوْا كَمَثَلِ الَّذِیْ یَنْعِقُ بِمَا لَا یَسْمَعُ اِلَّا دُعَآءً وَّنِدَآءً ؕ— صُمٌّۢ بُكْمٌ عُمْیٌ فَهُمْ لَا یَعْقِلُوْنَ ۟
తాతముత్తాతలను అనుసరించటంలో సత్యతిరస్కారుల ఉపమానము ఆ కాపరిలా ఉన్నది,అతడు తన పశువులను పిలుస్తూ అరుస్తాడు,అవి అతని గొంతును వింటాయి,కాని అతని మాటను అర్దం చేసుకోలేవు,వారు సత్యమును లబ్ది పొందే విధంగా వినటంలో చెవిటివారు,వారు మూగవారు,వారి నాలుకలు సత్యాన్ని మాట్లాడటంలో మూగబోయినవి,దాన్ని (సత్యంను) చూడటంలో వారు అంధులు,అందుకనే ఏ సత్యం వైపునకు మీరు వారిని పిలుస్తున్నారో దానిని వారు అర్ధం చేసుకోలేరు.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُلُوْا مِنْ طَیِّبٰتِ مَا رَزَقْنٰكُمْ وَاشْكُرُوْا لِلّٰهِ اِنْ كُنْتُمْ اِیَّاهُ تَعْبُدُوْنَ ۟
అల్లాహ్ పై విశ్వాసమును చూపి ఆయన ప్రవక్తలను అనుసరించేవారా మీ కొరకు అల్లాహ్ ప్రసాదించిన,శాస్త్రియం చేసిన హలాల్ వస్తువులనే తినండి,మీకు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలపై అల్లాహ్ కు ప్రత్యక్షంగా,అంతరంగంగా కృతజ్ఞతలు తెలుపుకోండి,ఆయనపై విధేయత చూపుతూ ఆచరించడం,ఆయనకి అవిధేయత చూపటం నుండి దూరంగా ఉండటం ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటంలో నుంచే,ఒకవేళ మీరు వాస్తవానికి ఆయనొక్కడినే ఆరాధిస్తూ ఉంటే ఆయనతోపాటు వేరే వారిని సాటి కల్పించరు.
Tafsyrai arabų kalba:
اِنَّمَا حَرَّمَ عَلَیْكُمُ الْمَیْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنْزِیْرِ وَمَاۤ اُهِلَّ بِهٖ لِغَیْرِ اللّٰهِ ۚ— فَمَنِ اضْطُرَّ غَیْرَ بَاغٍ وَّلَا عَادٍ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
నిశ్చయంగా అల్లాహ్ ఆహారాల్లోంచి ధర్మబద్ధంగా జిబాహ్ చేయకుండానే చనిపోయినవి (జంతువులను) ప్రవహించే రక్తాలు,పంది మాంసము,జిబాహ్ (కోసే) సమయంలో వేటిపైనైతే అల్లాహేతరుల పేరు పఠించబడినదో వాటిని మీపై నిషేధించాడు,ఒక వ్యక్తి ఏదైన తినడానికి బలవంతం చేయబడినప్పుడు అతడు వాటిలోంచి అవసరం లేకుండానే తినడంలో అన్యాయం కాకపోతే అవసరానికి మించి లేకుండా తినడంలో అతనిపై ఎటువంటి దోషం లేదు,ఎటువంటి శిక్ష లేదు,నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని క్షమించే వాడు,కరుణించే వాడును. నిస్సహాయ సమయంలో నిషిద్ధ వస్తువులను తినటంను మన్నింపు అతని కరుణలోంచే.
Tafsyrai arabų kalba:
اِنَّ الَّذِیْنَ یَكْتُمُوْنَ مَاۤ اَنْزَلَ اللّٰهُ مِنَ الْكِتٰبِ وَیَشْتَرُوْنَ بِهٖ ثَمَنًا قَلِیْلًا ۙ— اُولٰٓىِٕكَ مَا یَاْكُلُوْنَ فِیْ بُطُوْنِهِمْ اِلَّا النَّارَ وَلَا یُكَلِّمُهُمُ اللّٰهُ یَوْمَ الْقِیٰمَةِ وَلَا یُزَكِّیْهِمْ ۖۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
నిశ్చయంగా గ్రంధంలో నుంచి అల్లాహ్ అవతరింపజేసిన సందేశాలను, వాటిలో ఉన్న విషయాలు ఏవైతే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క దైవదౌత్యాన్ని,సత్యాన్ని నిరూపించే ఆధారాలను యూదులు,క్రైస్తవులు ఏవిధంగా చేసేవారో ఆవిధంగా దాచివేస్తారో,వాటిని నాయకత్వం,మానం,ధనం లాంటి కొద్దిపాటి వాటికి బదులుగా అమ్ముకుంటారో,వాస్తవానికి వారు తమ కడుపులకి నరకాగ్ని ద్వారా శిక్షకు కారణం అయ్యే వాటిని తింటున్నారు,వారితో అల్లాహ్ ప్రళయదినాన వారు ఇష్టపడే మాటలు మాట్లాడడు,కాని వారికి చెడు అనిపించే (బాధ కలిగించే) మాటలు మాట్లాడుతాడు,వారిని పరిశుద్ధపరచడు,వారిని పొగడడు,వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది.
Tafsyrai arabų kalba:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ اشْتَرَوُا الضَّلٰلَةَ بِالْهُدٰی وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ— فَمَاۤ اَصْبَرَهُمْ عَلَی النَّارِ ۟
ప్రజలకు అవసరమైన జ్ఞానమును దాచే గుణం కల వీరందరు సత్య జ్ఞానమును దాచివేసినప్పుడు వారు సన్మార్గమునకు బదులుగా మార్గభ్రష్టతను కోరుకుంటున్నారు,అల్లాహ్ క్షమాపణకు బదులుగా అల్లాహ్ శిక్షను కోరుకుంటున్నారు,అయితే వారికి నరకాగ్నిలో ప్రవేశించుటకు కారణమయ్యే కార్యాలపై వారి సహనం ఏవిధంగా ఉందంటే నరక శిక్ష పై వారి సహనమును చూస్తే వారు దాని గురించి పట్టించుకోనట్లుంది.
Tafsyrai arabų kalba:
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ نَزَّلَ الْكِتٰبَ بِالْحَقِّ ؕ— وَاِنَّ الَّذِیْنَ اخْتَلَفُوْا فِی الْكِتٰبِ لَفِیْ شِقَاقٍ بَعِیْدٍ ۟۠
అల్లాహ్ దైవ గ్రంధములను సత్యంతోపాటు అవతరింపజేయటం మూలంగా వారు జ్ఞానమును,సన్మార్గమును దాచివేయటం వలన ఈ ప్రతిఫలము,వాటిని (జ్ఞానం,సన్మార్గం) తెలియజేయాలి,దాచివేయకూడదు.నిశ్చయంగా ఎవరైతే దైవ గ్రంధముల విషయంలో వాటిలోంచి కొన్నింటిపై విశ్వాసమును కనబరిచి వాటిలోంచి కొన్నింటిని దాచివేస్తారో వారు అంతర్యంలో,తగాదాల్లో సత్యము నుండి సదూరంలో ఉంటారు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• أكثر ضلال الخلق بسبب تعطيل العقل، ومتابعة من سبقهم في ضلالهم، وتقليدهم بغير وعي.
బుద్ధిలేమితనము,తమ పూర్వికుల అప మార్గమను అనుసరించటం,అవగాహన లేకుండా అనుకరించడం వలనే సృష్టి యొక్క మార్గభష్టత ఎక్కువగా ఉంటుంది.

• عدم انتفاع المرء بما وهبه الله من نعمة العقل والسمع والبصر، يجعله مثل من فقد هذه النعم.
మనిషి అల్లాహ్ ప్రసాదించిన బుద్ధి,వినికిడి,చూపు లాంటి అనుగ్రహాల ద్వారా లబ్ది పొందక పోవటం అతనిని అనుగ్రహాలను పోగొట్టుకున్న వాడి మాదిరిగా చేస్తుంది.

• من أشد الناس عقوبة يوم القيامة من يكتم العلم الذي أنزله الله، والهدى الذي جاءت به رسله تعالى.
అల్లాహ్ అవతరింప జేసిన జ్ఞానమును,ఆయన ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గమును దాచి వేసేవాడు ప్రళయదినాన ప్రజల్లోంచి కఠిన శిక్షను అనుభవిస్తాడు.

• من نعمة الله تعالى على عباده المؤمنين أن جعل المحرمات قليلة محدودة، وأما المباحات فكثيرة غير محدودة.
తన దాసుల్లోంచి విశ్వాసులపై ఆయన నిషిద్ధ వస్తువులను తక్కువగా,పరిమితంగా చేయటం,అనుమతించబడిన వాటిని ఎక్కువగా,అపరిమితంగా చేయటం అల్లాహ్ అనుగ్రహాల్లోంచివి.

لَیْسَ الْبِرَّ اَنْ تُوَلُّوْا وُجُوْهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلٰكِنَّ الْبِرَّ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَالْمَلٰٓىِٕكَةِ وَالْكِتٰبِ وَالنَّبِیّٖنَ ۚ— وَاٰتَی الْمَالَ عَلٰی حُبِّهٖ ذَوِی الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنَ وَابْنَ السَّبِیْلِ ۙ— وَالسَّآىِٕلِیْنَ وَفِی الرِّقَابِ ۚ— وَاَقَامَ الصَّلٰوةَ وَاٰتَی الزَّكٰوةَ ۚ— وَالْمُوْفُوْنَ بِعَهْدِهِمْ اِذَا عٰهَدُوْا ۚ— وَالصّٰبِرِیْنَ فِی الْبَاْسَآءِ وَالضَّرَّآءِ وَحِیْنَ الْبَاْسِ ؕ— اُولٰٓىِٕكَ الَّذِیْنَ صَدَقُوْا ؕ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُتَّقُوْنَ ۟
అల్లాహ్ వద్ద స్వీకృతమయ్యే సత్కార్యం తూర్పు,పడమరల వైపు ముఖము త్రిప్పుకోవటం,వాటికి వ్యతిరేక దిశలో మారటం కాదు,కాని ఒకే అల్లాహ్ పై విశ్వాసం చూపిన,ప్రళయ దినం పై విశ్వాసం చూపిన,దైవ దూతలందరి పై విశ్వాసం చూపిన,అవతరింపబడిన గ్రంధాల పై,ఎటువంటి వ్యత్యాసం లేకుండా దైవ ప్రవక్తలందరి పై విశ్వాసం చూపిన వ్యక్తిలోని ప్రతి సత్కార్యం సత్కార్యం అవుతుంది,ధనం యొక్క ఇష్టత,దాని పై అత్యాశ ఉండి కూడా తన దగ్గరి బంధువుల పై,యుక్త వయస్సుకు చేరక ముందే తమ తల్లిదండ్రులను కోల్పోయిన వారి పై (అనాధలు),అగత్యపరుల పై,తన ఇంటి వారి నుంచి,తన ఊరు నుంచి దూరం అయిన ప్రయాణికుని పై,ప్రజలను అర్ధించడం తప్పనిసరి అయిన వారి పై ఖర్చు చేయటం,బానిసను బానిసత్వం నుండి,బంధి నుండి విముక్తి చేయటం కోసం ధనమును ఖర్చు చేయటం,అల్లాహ్ ఆదేశం మేరకు నమాజును సంపూర్ణంగా నెలకొల్పటం,విధిగావించబడిన జకాతును చెల్లించడం,ప్రమాణాలు చేసిన తరువాత తమ ప్రమాణాలు నెరవేర్చేవారు,పేదరికపు క్లిష్ట పరిస్థితుల్లో,అనారోగ్య పరిస్థితుల్లో,యద్ధం యొక్క కఠిన పరిస్థితుల్లో పారిపోకుండా సహనం చూపే వారు,ఈ గుణాలను కలిగిన వారందరు అల్లాహ్ పై తమ విశ్వాసం,తమ ఆచరణల ద్వారా సత్య విశ్వాసమును కనబరిచారు. వారందరే అల్లాహ్ ఆదేశాలను చేసి చూపించిన,వేటి నుంచైతే వారించాడో వాటి నుంచి దూరంగా ఉండిన దైవభీతి పరులు.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُتِبَ عَلَیْكُمُ الْقِصَاصُ فِی الْقَتْلٰی ؕ— اَلْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْاُ بِالْاُ ؕ— فَمَنْ عُفِیَ لَهٗ مِنْ اَخِیْهِ شَیْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوْفِ وَاَدَآءٌ اِلَیْهِ بِاِحْسَانٍ ؕ— ذٰلِكَ تَخْفِیْفٌ مِّنْ رَّبِّكُمْ وَرَحْمَةٌ ؕ— فَمَنِ اعْتَدٰی بَعْدَ ذٰلِكَ فَلَهٗ عَذَابٌ اَلِیْمٌ ۟ۚ
అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ను అనుసరించేవారా ఉద్దేశపూర్వకంగా,ద్వేషంతో ఇతరులను హత్య చేసే వారి విషయంలో హంతకునికి అతని నేరము మాదిరిగా శిక్షించటం మీ పై విధిగావించబడినది.స్వతంతృనికి బదులుగా స్వతంతృడిని హత్య చేయాలి,బానిసకు బదులుగా బానిసను హత్య చేయాలి,స్తీకు బదులుగా స్తీని హత్య చేయాలి. ఒక వేళ హతుడు మరణం ముందు క్షమించివేస్తే లేదా హతుడి సంరక్షకుడు రక్తపరిహారం (రక్త ధనం) కొరకు క్షమించివేస్తే అది కూడా ఒక పరిమాణం ధనం నుంచి క్షమాభీక్ష కొరకు హంతకుడు తన తరుపు నుంచి చెల్లిస్తాడు,క్షమించేవాడు తప్పకుండా రక్తపరిహారం ను కోరటంలో చాటింపు వేయటానికి,బాధ పెట్టటానికి కాకుండా న్యాయసమ్మతంగా హంతకుడి మాట వినాలి,అలాగే హతుడు కూడా రక్త పరిహారంను తప్పించుకునే ఉద్దేశంతో కాకుండా,కాలయాపన లేకుండా ఉత్తమ రీతిలో చెల్లించాలి.ఈ క్షమాపణ,రక్తపరిహారం మీపై మీ ప్రభువు తరపు నుండి ఒక వెసులుబాటు,ఈ సమాజం పై ఒక కారుణ్యం. రక్తపరిహారం,క్షమాపణ తరువాత ఎవరైతే హంతకునిపై అతిక్రమిస్తే అతని పై అల్లాహ్ తరపునుంచి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
Tafsyrai arabų kalba:
وَلَكُمْ فِی الْقِصَاصِ حَیٰوةٌ یّٰۤاُولِی الْاَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟
మరియు అల్లాహ్ మీ కొరకు మీ రక్తమును చిందించకుండా,మీ మధ్య ద్వేషాలు లేకుండా శాసనంగా నిర్దేశించిన ప్రతీకారంలోనే మీ కొరకు జీవనం ఉంది,అల్లాహ్ శాసనాలకు కట్టుబడి ఉండి,ఆయన ఆదేశాలను పాటించేవారైన అల్లాహ్ భయభీతి కల బుద్దిమంతులే దీనిని గ్రహించగలరు.
Tafsyrai arabų kalba:
كُتِبَ عَلَیْكُمْ اِذَا حَضَرَ اَحَدَكُمُ الْمَوْتُ اِنْ تَرَكَ خَیْرَا ۖۚ— ١لْوَصِیَّةُ لِلْوَالِدَیْنِ وَالْاَقْرَبِیْنَ بِالْمَعْرُوْفِ ۚ— حَقًّا عَلَی الْمُتَّقِیْنَ ۟ؕ
మీలో ఎవరికైన మరణ సూచనలు,దానికి కారకాలు సమీపించినప్పుడు ఒక వేళ మీవద్ద సంపద ఉంటే తల్లిదండ్రుల కొరకు,సమీప బంధువుల కొరకు ధర్మంలో నిర్దేశించబడిన శాసనం ప్రకారం సంపద నుంచి మూడో వంతు కన్న ఎక్కువ కాకుండా వీలునామ వ్రాయటం విధిగావించబడినది. అల్లాహ్ మన్నత కొరకు ఈ కార్యం చేయటం దైవ భీతి కలవారి పై తాకీదు చేయబడిన విద్యుక్త ధర్మం.ఈ ఆదేశం ఆస్తుల పంపకము ఆయతుల అవతరణ ముందుది,ఆస్తుల పంపకము ఆయతుల అవతరణ తరువాత మృతుని ఆస్తిలో ఎవరికి ఎంత భాగమున్నదో,ఎవరు ఎంత భాగమునకు వారసుడవుతాడో వివరించ బడినది.
Tafsyrai arabų kalba:
فَمَنْ بَدَّلَهٗ بَعْدَ مَا سَمِعَهٗ فَاِنَّمَاۤ اِثْمُهٗ عَلَی الَّذِیْنَ یُبَدِّلُوْنَهٗ ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟ؕ
వీలునామాలో పెంచి లేదా తగ్గించి లేదా వీలునామా గురించి తెలిసిన తరువాత మార్చివేస్తే వీలునామా వ్రాసిన వారిపై ఎటువంటి దోషం లేదు,వీలునామాను మార్చిన వారిపైనే దోషం,నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల మాటలను వినేవాడును,వారి కార్యాల గురించి జ్ఞానం కలవాడును వారి స్థితుల్లోంచి ఏవి కూడా అతనిని దాటి వెళ్ళవు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• البِرُّ الذي يحبه الله يكون بتحقيق الإيمان والعمل الصالح، وأما التمسك بالمظاهر فقط فلا يكفي عنده تعالى.
అల్లాహ్ ఇష్టపడే పుణ్యకార్యం విశ్వాసం,సత్కార్యంతో కూడుకుని ఉంటుంది,కేవలం ఆచరణలను ప్రదర్శించటం ఒక్కటే అల్లాహ్ వద్ద సరిపోదు.

• من أعظم ما يحفظ الأنفس، ويمنع من التعدي والظلم؛ تطبيق مبدأ القصاص الذي شرعه الله في النفس وما دونها.
అతి గొప్పదైనది ఏదైతే ప్రాణమును సంరక్షిస్తుంది,అతిక్రమణ,అన్యాయమును నిరోదిస్తుంది అదేమిటంటే ప్రాణం విషయంలో,ఇతర విషయాల్లో అల్లాహ్ నిర్దేశించిన న్యాయ ప్రతీకారమును అమలు పరచటం.

• عِظَمُ شأن الوصية، ولا سيما لمن كان عنده شيء يُوصي به، وإثمُ من غيَّر في وصية الميت وبدَّل ما فيها.
వీలునామా గొప్పతనం ప్రత్యేకించి తన వద్ద ఉన్న వాటి గురించి వీలునామా వ్రాస్తే దాని గురించి గొప్పతనం,మృతుని వీలునామాను మార్చే వాడి పాపం.

فَمَنْ خَافَ مِنْ مُّوْصٍ جَنَفًا اَوْ اِثْمًا فَاَصْلَحَ بَیْنَهُمْ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
వీలునామ వ్రాసిన వ్యక్తి తరుపునుంచి పక్షపాతం లేదా వీలునామ వ్రాయటంలో అన్యాయం జరిగినదని తెలిసిన వ్యక్తి తన హితోపదేశం ద్వారా వీలునామ వ్రాసిన వ్యక్తి ద్వారా జరిగిన తప్పును సరిదిద్దాలి,విభేదించుకున్న వారి మధ్య కూడా వీలునామాను అమలు చేసే సమయంలో సరిదిద్దాలి,అటువంటప్పుడు అతనిపై (వీలు నామా వ్రాసిన వ్యక్తిపై) ఎటువంటి దోషం ఉండదు,అతను తన సర్దుబాటుకు అర్హుడు,నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని క్షమించే వాడును,వారిపై కరుణించే వాడును.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُتِبَ عَلَیْكُمُ الصِّیَامُ كَمَا كُتِبَ عَلَی الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟ۙ
అల్లాహ్ పై విస్వాసమును కలిగి ఆయన ప్రవక్తను అనుసరించే వారా మీ పూర్వ సమాజాలపై ఉపవాసాలు విధిగావించబడినట్లు మీపై కూడా విధిగావించబడినవి,ఆయన మీ మధ్య ,ఆయన శిక్ష మధ్య సత్కార్యములను డాలుగా తయారు చేయటం వలన బహుశా మీరు అల్లాహ్ భయమును కలిగి ఉంటారేమొ,అందులోంచి ఉపవాసాలు ఎంతో గొప్పవైనవి.
Tafsyrai arabų kalba:
اَیَّامًا مَّعْدُوْدٰتٍ ؕ— فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِیْضًا اَوْ عَلٰی سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَیَّامٍ اُخَرَ ؕ— وَعَلَی الَّذِیْنَ یُطِیْقُوْنَهٗ فِدْیَةٌ طَعَامُ مِسْكِیْنٍ ؕ— فَمَنْ تَطَوَّعَ خَیْرًا فَهُوَ خَیْرٌ لَّهٗ ؕ— وَاَنْ تَصُوْمُوْا خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
మీపై విధిగావించబడిన ఉపవాసాలు సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే మీరు ఉపవాసముండాలి,మీలో నుంచి ఎవరైన అనారోగ్యానికి గురై ఉపవాసం కష్టమైన లేదా ప్రయాణంలో ఉన్న అతను ఉపవాసమును విరమించవచ్చు (వదిలివేయవచ్చు). వేరే దినాల్లో వదిలివేసిన ఉపవాసములను అతను ఖజాగా పూర్తి చేసుకోవాలి. ఉపవాసముండే స్థోమత కలిగిన వారు (ఉపవాసమును వదిలి వేసినప్పుడు) పరిహారంగా ఒక నిరుపేదకు భోజనం పెట్టాలి,వదిలిన ప్రతి ఉపవాసమునకు బదులుగా ఒక నిరుపేదకు భోజనం పెట్టాలి,ఒకవేళ మీరు ఉపవాసంలో ఉన్న గొప్పతనం తెలుసుకుంటే ఉపవాసమును వదిలి పరిహారం చెల్లించుటకు బదులు ఉపవాసముండటం మీకు ఎంతో మేలైనది,ఈ ఆదేశం మొదట అల్లాహ్ ఉపవాసముల ఆదేశం ఇచ్చినప్పుడిది,అప్పుడు ఉపవాసం ఉండదలుచుకున్నవారు ఉపవాసముండేవారు,వదలదలుచుకున్నవారు వదిలేసి నిరుపేదకు భోజనం పెట్టేవారు,ఆతరువాత అల్లాహ్ ప్రతి ఒక్కరిపై ఉపవాసములను విధిగావించాడు. స్థోమత కలిగిన ప్రతి బాలిగ్ (యవ్వన దశకు చేరుకున్న) పై తప్పనిసరి చేశాడు.
Tafsyrai arabų kalba:
شَهْرُ رَمَضَانَ الَّذِیْۤ اُنْزِلَ فِیْهِ الْقُرْاٰنُ هُدًی لِّلنَّاسِ وَبَیِّنٰتٍ مِّنَ الْهُدٰی وَالْفُرْقَانِ ۚ— فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلْیَصُمْهُ ؕ— وَمَنْ كَانَ مَرِیْضًا اَوْ عَلٰی سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَیَّامٍ اُخَرَ ؕ— یُرِیْدُ اللّٰهُ بِكُمُ الْیُسْرَ وَلَا یُرِیْدُ بِكُمُ الْعُسْرَ ؗ— وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللّٰهَ عَلٰی مَا هَدٰىكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరణ రమజాను మాసంలో ఘనమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) లో మొదలయ్యింది,అల్లాహ్ దానిని మానవుల సన్మార్గం కొరకు అవతరింప జేసాడు,అందులో సన్మార్గంతోపాటు సత్యఅసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలున్నాయి,నివాసపరుడు (ప్రయాణంలో లేనివాడు) ఆరోగ్యవంతుడు రమజాను మాసమును పొందితే తప్పకుండా ఉపవాసముండాలి,ఉపవాసము కష్టమైన రోగగ్రస్తుడు లేదా ప్రయాణికుడు ఉపవాసమును వదిలి వేయవచ్చు,వదిలివేసిన ఉపవాసములను ఇతర దినములలో తప్పనిసరిగా పూర్తి చేయాలి,అల్లాహ్ తాను మీ కొరకు నిర్దేశించిన ఈ శాసనాల ద్వారా మిమ్మల్ని కఠిన మార్గంలో కాకుండా సులభ మార్గంలో నడిపించటమును,మీరు పూర్తి మాసపు లెక్కను పూర్తి చేసుకోవటంను,తన ఉపవాసములుండే సౌభాగ్యం మీకు ప్రసాదించినందుకు వాటిని పూర్తి చేయటం కొరకు మీకు సహాయం చేసినందుకు మీరు రమజాను మాసము ముగిసిన తరువాత పండుగ రోజున అల్లాహ్ గొప్పతనమును తెలియ జేయటంను ఆశిస్తున్నాడు,ఆయన ఇష్టపడిన ఈ ధర్మం యొక్క సన్మార్గమును మీకు కలిగించినందుకు మీరు అల్లాహ్ ని కృతజ్ఞలు తెలుపుకోండి.
Tafsyrai arabų kalba:
وَاِذَا سَاَلَكَ عِبَادِیْ عَنِّیْ فَاِنِّیْ قَرِیْبٌ ؕ— اُجِیْبُ دَعْوَةَ الدَّاعِ اِذَا دَعَانِ فَلْیَسْتَجِیْبُوْا لِیْ وَلْیُؤْمِنُوْا بِیْ لَعَلَّهُمْ یَرْشُدُوْنَ ۟
ఓ ప్రవక్త నా .దాసులు వారి దుఆల కొరకు నా స్వీకారము, నా దగ్గరత్వము గురించి మిమ్మల్ని అడిగినప్పుడు నేను వారికి చాలా దగ్గరా ఉన్నానని,వారి పరిస్థితులను తెలిసిన వాడినని,వారి అర్ధనలను ఆలకించే వాడినని వారికి తెలియ జేయండి,అయితే వారికి మధ్యవర్తుల,వారి స్వరాలను పెంచే అవసరము లేదు,చిత్తశుద్దితో నన్ను వేడుకునేవారి అర్ధనలను స్వీకరిస్తాను,వారు నాపై విధేయత చూపాలి,నా ఆదేశాలను పాటించాలి,తమ విశ్వాసము పై నిలకడను చూపాలి,ఎందుకంటే అవే నా స్వీకృతమునకు కారకం కావడానికి చాలా లాభదాయకము,బహుశా వారు ఈ ఋజు మార్గము ద్వారా తమ ధార్మిక,ప్రాపంచిక విషయాలలో నడుస్తారేమో.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• فَضَّلَ الله شهر رمضان بجعله شهر الصوم وبإنزال القرآن فيه، فهو شهر القرآن؛ ولهذا كان النبي صلى الله عليه وسلم يتدارس القرآن مع جبريل في رمضان، ويجتهد فيه ما لا يجتهد في غيره.
అల్లాహ్ ఖుర్ఆన్ ను అవతరింపజేయటం ద్వారా ఉపవాసాల మాసముగా చేసి రమజాను మాసమునకు ఘనతను ప్రసాదించాడు. అది ఖుర్ఆన్ మాసము. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను మాసములో జిబ్రయీల్ అలైహిస్సలాం తో పాటు ఖుర్ఆన్ అధ్యాయనం చేసేవారు. ఆ మాసములో శ్రమించే విదంగా వేరే మాసములో శ్రమించే వారు కాదు.

• شريعة الإسلام قامت في أصولها وفروعها على التيسير ورفع الحرج، فما جعل الله علينا في الدين من حرج.
ఇస్లాం ధర్మం విశ్వాసాలు,ఆదేశాల విషయంలో సౌలభ్యాన్ని కలిగించి కష్టతరమైన విషయాలను తీసి వేసింది,అల్లాహ్ ధర్మాన్ని మన పై కష్టతరం చేయలేదు.

• قُرْب الله تعالى من عباده، وإحاطته بهم، وعلمه التام بأحوالهم؛ ولهذا فهو يسمع دعاءهم ويجيب سؤالهم.
అల్లాహ్ తన దాసులకు దగ్గరవటం,వారిని చుట్టుముట్టటం,వారి పరిస్థితులను గురించి జ్ఞానమును కలిగి ఉండటం వలనే అతడు వారి దుఆలను ఆలకిస్తున్నాడు,వారి అర్ధనలను స్వీకరిస్తున్నాడు.

اُحِلَّ لَكُمْ لَیْلَةَ الصِّیَامِ الرَّفَثُ اِلٰی نِسَآىِٕكُمْ ؕ— هُنَّ لِبَاسٌ لَّكُمْ وَاَنْتُمْ لِبَاسٌ لَّهُنَّ ؕ— عَلِمَ اللّٰهُ اَنَّكُمْ كُنْتُمْ تَخْتَانُوْنَ اَنْفُسَكُمْ فَتَابَ عَلَیْكُمْ وَعَفَا عَنْكُمْ ۚ— فَالْـٰٔنَ بَاشِرُوْهُنَّ وَابْتَغُوْا مَا كَتَبَ اللّٰهُ لَكُمْ ۪— وَكُلُوْا وَاشْرَبُوْا حَتّٰی یَتَبَیَّنَ لَكُمُ الْخَیْطُ الْاَبْیَضُ مِنَ الْخَیْطِ الْاَسْوَدِ مِنَ الْفَجْرِ ۪— ثُمَّ اَتِمُّوا الصِّیَامَ اِلَی الَّیْلِ ۚ— وَلَا تُبَاشِرُوْهُنَّ وَاَنْتُمْ عٰكِفُوْنَ فِی الْمَسٰجِدِ ؕ— تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَقْرَبُوْهَا ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ اٰیٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
పూర్వ ఆదేశాల్లోంచి ఉపవాసపు రాత్రుల్లో మనిషి నిదురపోయినప్పటి నుంచి ఫజర్ కన్న మునుపు మేల్కొనే వరకు తినటం,తమ భార్యతో సంబోగం చేయటం నిషేదించబడి ఉండేది,ఓ విశ్వాసపరులారా అల్లాహ్ ఆ ఆదేశమును రద్దుపరచి ఉపవాస రాత్రుల్లో మీ భార్యలతో సంబోగం చేయటమునకు అనుమతించాడు,వారు మీ కొరకు వస్త్రము,నిష్కలంకులు. మీరు వారి కొరకు వస్త్రము,నిష్కలంకులు. మీరు ఒకరి అవసరం ఇంకొకరికి లేనివారు కారు.అల్లాహ్ వారించిన వాటిని పాటించి మీరు ఆత్మ ద్రోహానికి పాల్పడుతున్నారని అల్లాహ్ గ్రహించాడు.మీ పై కనికరించి మీ పశ్చాత్తాపమును స్వీకరించాడు,మీకు సౌలభ్యాన్ని కలిగించాడు.అయితే మీరు ఇప్పుడు వారితో సంబోగము చేయండి,అల్లాహ్ మీకొరకు నిర్ణయించిన సంతానమును కోరుకోండి.రాత్రి నల్ల చారలు తొలిగిపోయి ఉదయపు తెల్ల చారలు ప్రస్పుటమై మీ కొరకు ఫజరె సాదిక్ (ఫజర్ అజాన్ అయ్యే వరకు) వేళ అయ్యే వరకు మీరు తినండి,త్రాగండి,ఫజర్ నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు ఉపవాసమును భంగ పరిచే వాటి నుండి దూరంగా ఉండి ఉపవాసమును పూర్తి చేసుకోండి.మీరు మస్జిద్ లో ఏతికాఫ్ పాటించే సమయంలో మీ భార్యలతో సంబోగించకండి.ఎందుకంటే అది (సంబోగం) దానిని (ఏతికాఫ్) భంగం చేస్తుంది.ఈ తెలియ పరచబడిన ఆదేశాలు అల్లాహ్ హద్దులు,అతడు హలాల్,హరాంను స్పష్టంగా తెలియ పరచాడు.ఎప్పుడు కూడా వాటి దరి దాపులకు వెళ్ళకండి,ఎందుకంటే ఎవరైతే అల్లాహ్ హద్దుల దరి దాపులకు వెళతాడో అతడు హరామ్ లో పడిపోయే సంభావన ఉన్నది.ఈ ఆదేశాల కొరకు ఈ స్పష్టమైన ఉదాహరణను ఇచ్చి అల్లాహ్ ప్రజల కొరకు ఆయనిచ్చిన ఆదేశమును పాటించటం,వారించిన వాటికి దూరంగా ఉండటం ఆయన నుండి తప్పి పోకుండా ఉండటానికి తన ఆయతులను వివరించి తెలియ పరచాడు.
Tafsyrai arabų kalba:
وَلَا تَاْكُلُوْۤا اَمْوَالَكُمْ بَیْنَكُمْ بِالْبَاطِلِ وَتُدْلُوْا بِهَاۤ اِلَی الْحُكَّامِ لِتَاْكُلُوْا فَرِیْقًا مِّنْ اَمْوَالِ النَّاسِ بِالْاِثْمِ وَاَنْتُمْ تَعْلَمُوْنَ ۟۠
మీలోని కొందరు కొందరి సొమ్మును దొంగతనం,దోపిడి,మోసంలాగా అధర్మ పద్దతిలో తీసుకోకండి.వాటి ద్వారా పాలకుల వద్ద ఒక వర్గము ప్రజల సొమ్మును పాపముతో కూడుకుని తీసుకోవటం కొరకు వాటిని అల్లాహ్ నిషేదించాడని తెలిసి కూడా మీలో మీరు తగాదా పడకండి.నిషేదించబడినదని తెలిసి కూడా పాపం చేయడానికి ముందడుగు వేయటం అత్యంత చెడ్డదైన కార్యం,శిక్ష పరంగా చాలా పెద్దది.
Tafsyrai arabų kalba:
یَسْـَٔلُوْنَكَ عَنِ الْاَهِلَّةِ ؕ— قُلْ هِیَ مَوَاقِیْتُ لِلنَّاسِ وَالْحَجِّ ؕ— وَلَیْسَ الْبِرُّ بِاَنْ تَاْتُوا الْبُیُوْتَ مِنْ ظُهُوْرِهَا وَلٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقٰی ۚ— وَاْتُوا الْبُیُوْتَ مِنْ اَبْوَابِهَا ۪— وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
ఓ ప్రవక్త వారు మిమ్మల్ని చంద్రుని గురించి దాని స్థితుల మార్పు గురించి ప్రశ్నిస్తున్నారు.వారికి సమాధానమిస్తూ దాని మర్మం ఏమిటో తెలియజేయండి: నిశ్చయంగా అవి ప్రజల కొరకు వేళలు,వాటి ద్వారా హజ్ మాసము,ఉపవాసముల మాసము,జకాత్ చెల్లించటంలో సంవత్సరం పూర్తి అవటం లాంటి వారి ఆరాధనల వేళలు తెలుసుకుంటారు మరియు రక్తపరిహారము,రుణాలను చెల్లించటానికి వేళల నిర్ధారణ లాంటి వ్యవహారాల్లో వారి వేళలను తెలుసుకుంటారు.హజ్ లేదా ఉమ్రాలో మీరు ఇహ్రామ్ స్థితిలో ఇళ్ళలోకి వాటి వెనుక వైపు నుండి రావటం మీరు అజ్ఞాన కాలంలో అనుకునే విధంగా సత్కార్యం కాదు.కాని వాస్తవానికి సత్కార్యం అన్నది బాహ్యపరంగా,అంతఃపరంగా అల్లాహ్ కి భయపడే వాడి సత్కార్యమే అసలైన సత్కార్యం.అయితే ఇండ్లలోకి మీ రావటం వాటి వాకిళ్ల నుండే జరగాలి.అది మీకు సులభతరమైనది,కష్టతరమైనది కాదు.ఎందుకంటే అల్లాహ్ మీపై కష్టమైన వాటిని,మీకు ఇబ్బంది కరమైన వాటిని భారంగా వేయడు.మీరు మీకు అల్లాహ్ శిక్షకు మధ్య రక్షణగా సత్కార్యములను చేసుకోండి.తద్వారా మీకు దేనిలోనైతే ఇష్టత ఉన్నదో దానిని పొంది సాఫల్యం పొందుతారు,దేనినుంచైతే మీరు భయపడుతున్నారో దాని నుండి రక్షణ పొందుతారు.
Tafsyrai arabų kalba:
وَقَاتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ الَّذِیْنَ یُقَاتِلُوْنَكُمْ وَلَا تَعْتَدُوْا ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ الْمُعْتَدِیْنَ ۟
అల్లాహ్ వాక్కును (కలిమా) పెంపొందించే ఉద్దేశంతో మీరు పోరాడండి.సత్యతిరస్కారుల్లోంచి ఎవరైతే మీతో పోరాడుతున్నారో వారు మిమ్మల్ని అల్లాహ్ ధర్మం నుండి ఆపుతారు.మీరు పిల్లలను,స్త్రీలను,వృద్దులను హతమార్చి లేదా మృతుల అవయవాలను కోసి,అటువంటి కార్యాలు చేసి అల్లాహ్ హద్దులను అతిక్రమించకండి.నిశ్చయంగా అల్లాహ్ తాను నిర్దేశించిన,నిర్ణయించిన వాటిలో అతని హద్దులను అతిక్రమించే వారిని ఇష్టపడడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• مشروعية الاعتكاف، وهو لزوم المسجد للعبادة؛ ولهذا يُنهى عن كل ما يعارض مقصود الاعتكاف، ومنه مباشرة المرأة.
ధర్మబద్దంగా ఏతికాఫ్ అంటే ఆరాధనల కొరకు మస్జిద్లను పట్టుకుని ఉండటం,అందుకనే ఏతికాఫ్ ఉద్దేశానికి అడ్డు తగిలే వాటి నుండి ఆపడం జరిగింది,భార్యతో సమగామనం చేయటం అందులో నుంచే.

• النهي عن أكل أموال الناس بالباطل، وتحريم كل الوسائل والأساليب التي تقود لذلك، ومنها الرشوة.
అధర్మ పద్దతిలో ప్రజల సొమ్మును తినడం గురించి వారింపు,దానిని అనుసరించే కారకాలు,పద్దతుల నిషేదింపు,లంచమూ అందులో నుంచే.

• تحريم الاعتداء والنهي عنه؛ لأن هذا الدين قائم على العدل والإحسان.
అతిక్రమింపు ను నిషేదించటం,దాని నుండి వారించటం ఎందుకంటే ఈ ధర్మం న్యాయం, మంచితనం పై స్థాపించ బడింది.

وَاقْتُلُوْهُمْ حَیْثُ ثَقِفْتُمُوْهُمْ وَاَخْرِجُوْهُمْ مِّنْ حَیْثُ اَخْرَجُوْكُمْ وَالْفِتْنَةُ اَشَدُّ مِنَ الْقَتْلِ ۚ— وَلَا تُقٰتِلُوْهُمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ حَتّٰی یُقٰتِلُوْكُمْ فِیْهِ ۚ— فَاِنْ قٰتَلُوْكُمْ فَاقْتُلُوْهُمْ ؕ— كَذٰلِكَ جَزَآءُ الْكٰفِرِیْنَ ۟
మీరు వారిని ఎక్కడ ఎదురైతే అక్కడే వారిని వదించండి,ఎక్కడ నుంచి మిమ్మల్ని వారు తీసివేశారో అక్కడ నుంచి వారిని తీసి వేయండి,ఆ ప్రదేశం మక్కా నగరం.విశ్వాస పరుడిని అతని ధర్మం నుండి ఆపి అవిశ్వాసం వైపునకు అతనిని మరల్చడం వలన కలిగే ఉపద్రవము (ఫిత్న) హత్య కన్న ఘోరమైన పాపము.మస్జిదుల్ హరామ్ వద్ద దాని గొప్పతనం ఏదైతే ఉన్నదో దాని కారణం చేత వారు మీతో యుద్దము చేయనంత వరకు మీరు వారితో యుద్దమును మొదలెట్టకండి.,ఒక వేళ వారు మస్జిదుల్ హరామ్ వద్ద మొదలెడితే వారిని వదించండి,మస్జిదుల్ హరామ్ లో వారు హద్దుమీరినప్పుడు వారిని వదించడమే దీని ప్రతిఫలము,అది సత్య తిరస్కారులకు ప్రతిఫలము అవుతుంది.
Tafsyrai arabų kalba:
فَاِنِ انْتَهَوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఒక వేళ వారు మీతో యుద్దం చేయటం,వారి తిరస్కారమును మానుకుంటే మీరు కూడా వారి నుండి ఆగిపోండి,ఎందుకంటే అల్లాహ్ క్షమాపణ కోరే వారిని మన్నించే వాడు,వారి గతించిన పాపములపై వారిని శిక్షించడు,వారిని కరుణించే వాడు,వారిని శిక్షించడంలో తొందర పడడు.
Tafsyrai arabų kalba:
وَقٰتِلُوْهُمْ حَتّٰی لَا تَكُوْنَ فِتْنَةٌ وَّیَكُوْنَ الدِّیْنُ لِلّٰهِ ؕ— فَاِنِ انْتَهَوْا فَلَا عُدْوَانَ اِلَّا عَلَی الظّٰلِمِیْنَ ۟
మీరు బహుదైవారాధన,ప్రజలను అల్లాహ్ మార్గం నుంచి ఆపడం,సత్య తిరస్కారము జరగనంత వరకు,అదీష్టించే ధర్మం అల్లాహ్ ధర్మం అయ్యేంత వరకు సత్య తిరస్కారులతో యుద్దం చేయండి.ఒక వేళ వారు తమ తిరస్కార వైఖరి నుంచి,అల్లాహ్ మార్గము నుంచి ఆపటం నుంచి ఆగిపోతే మీరు వారితో యుద్దమును ఆపివేయండి,ఎందుకంటే అవిశ్వాసం,అల్లాహ్ మార్గం నుండి ఆపటం వలనే దుర్మార్గులపై ఆధిక్యాన్ని చూపాలి.
Tafsyrai arabų kalba:
اَلشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمٰتُ قِصَاصٌ ؕ— فَمَنِ اعْتَدٰی عَلَیْكُمْ فَاعْتَدُوْا عَلَیْهِ بِمِثْلِ مَا اعْتَدٰی عَلَیْكُمْ ۪— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟
అల్లాహ్ మిమ్మల్ని ఏడవ సంవత్సరంలో హరమ్ లో ప్రవేశింపజేసి ,ఉమ్రాను నిరవేర్పజేసి మీకు స్థానమును కల్పించిన పవిత్ర మాసము,అది ఆరవ సంవత్సరంలో బహు దైవారాదకులు మిమ్మల్ని హరమ్ లో ప్రవేశించకుండ ఆపిన పవిత్ర మాసమునకు బదులు,నిషిద్దతలు కలవు,ఉదాహరణకు హరమ్ ప్రాంత నిషిద్దత,నిషిద్ద మాసములు,ఇహ్రామ్అతిక్రమించే వారిపై ,వీటిలో ప్రతీకారము తీసుకోవచ్చు.వీటిలో మీపై ఎవరైనా దౌర్జన్యానికి పాల్పడితే వారు మీపట్ల వ్యవహరించిన విధంగా వారి పట్ల వ్యవహరించండి.సమానమైన పరిమితిని మించకండి.నిశ్చయంగా అల్లాహ్ హద్దుమీరే వారిని ఇష్టపడడు.మీకు అనుమతించబడిన విషయాల్లో హద్దు మీరటం గురించి అల్లాహ్ కు భయపడండి.అల్లాహ్ ప్రసాదించడంలో,మద్దతివ్వటంలో దైవభీతి కలవారికి తోడుగా ఉంటాడన్న విషయమును తెలుసుకోండి.
Tafsyrai arabų kalba:
وَاَنْفِقُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ وَلَا تُلْقُوْا بِاَیْدِیْكُمْ اِلَی التَّهْلُكَةِ ۛۚ— وَاَحْسِنُوْا ۛۚ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُحْسِنِیْنَ ۟
అల్లాహ్ విధేయతకు సంబంధించిన ధర్మ పోరాటంలో,ఇతర కార్యాల్లో ధనమును ఖర్చు చేయండి,ధర్మ పోరాటమును,అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటంను వదిలేసి లేదా మిమ్మల్ని వినాశనమునకు కారణమయ్యే విషయాల్లో మిమ్మల్ని పడవేసి మీకు మీరే వినాశనంలో నెట్టి వేయకండి,మీరు మీ ఆరాధనలను,మీ వ్యవహారాలను,మీ గుణాలను మంచిగా చేసుకోండి.నిశ్చయంగా అల్లాహ్ తమ వ్యవహారాలన్నింటిని మంచిగా చేసే వారిని ఇష్టపడుతాడు.వారికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు,వారికి సన్మార్గమును పొందే సౌభాగ్యమును కలిగిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَاَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلّٰهِ ؕ— فَاِنْ اُحْصِرْتُمْ فَمَا اسْتَیْسَرَ مِنَ الْهَدْیِ ۚ— وَلَا تَحْلِقُوْا رُءُوْسَكُمْ حَتّٰی یَبْلُغَ الْهَدْیُ مَحِلَّهٗ ؕ— فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِیْضًا اَوْ بِهٖۤ اَذًی مِّنْ رَّاْسِهٖ فَفِدْیَةٌ مِّنْ صِیَامٍ اَوْ صَدَقَةٍ اَوْ نُسُكٍ ۚ— فَاِذَاۤ اَمِنْتُمْ ۥ— فَمَنْ تَمَتَّعَ بِالْعُمْرَةِ اِلَی الْحَجِّ فَمَا اسْتَیْسَرَ مِنَ الْهَدْیِ ۚ— فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ ثَلٰثَةِ اَیَّامٍ فِی الْحَجِّ وَسَبْعَةٍ اِذَا رَجَعْتُمْ ؕ— تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ؕ— ذٰلِكَ لِمَنْ لَّمْ یَكُنْ اَهْلُهٗ حَاضِرِی الْمَسْجِدِ الْحَرَامِ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟۠
అల్లాహ్ మన్నతను ఆశిస్తూ హజ్,ఉమ్రాలను పూర్తి చేయండి. ఆ రెండిటిని పూర్తి చేయటం నుండి అనారోగ్యం,శతృవుల వలన ఆపబడినప్పుడు మీరు ఒంటె,ఆవు,గొర్రెల్లోంచి అందుబాటులో ఉన్న దేనినైన ఒకదానిని మీ ఇహ్రామ్ దీక్ష నుండి హలాల్ అవ్వటం కొరకు ఖుర్బానీగా ఇవ్వండి. ఖుర్బానీ దాని స్థానమునకు చేరే వరకు మీ శిరో ముండనం కాని,వెంట్రుకలను కత్తిరించటం కాని చేయకూడదు,ఒక వేళ హరమ్ ప్రాంతంలో ప్రవేశించడం నుంచి ఆపబడితే మీరు ఆపబడిన ప్రాంతంలోనే జిబహ్ చేయండి. ఒకవేళ హరమ్ నుండి ఆపబడకపోతే హరమ్లోనే ఖుర్బానీ ఇచ్చే రోజున లేదా దాని తరువాత తష్రీఖ్ దినాల్లో జిబాహ్ చేయండి. మీలో నుంచి ఎవరైన అనారోగ్యానికి గురైనా లేదా అతని తలలో పేలు వేరే వాటి వలన ఏదైన బాధ ఉన్న కారణంగా శిరో ముండనం చేసుకోవచ్చు,ఆతనిపై ఎటువంటి దోషము లేదు. కాని అతను మూడు రోజులు ఉపవాసముండాలి లేదా ఆరుగురు నిరు పేదలకు భోజనం పెట్టాలి లేదా ఒక జంతువును జిబాహ్ చేసి హరమ్ ప్రాంతంలోని పేదవారిలో పంచి పరిహారంగా చల్లించాలి. మీరు భయాందోళనలో కాకుండా ప్రశాంతతలో ఉన్నప్పుడు మీలో నుంచి ఎవరైన హజ్ మాసములో ఉమ్రా చేసి ప్రయోజనం పొందదలుచుకుని ఇహ్రామ్ నుంచి బయటకు వచ్చి హజ్ కొరకు ఇహ్రామ్ కట్టేవరకు ఇహ్రామ్ స్థితిలో ఆపబడిన కార్యాల నుండి లబ్ది పొందదలుచుకంటే ఒక గొర్రెను జిబాహ్ చేయాలి లేదా ఒక ఒంటెలో లేదా ఒక ఆవులో ఏడుగురు భాగస్వాములు కావచ్చు. ఖుర్బానీ ఇవ్వలేని వారు దానికి బదులుగా హజ్ దినాల్లో మూడు రోజులు ఉపవాసం పాటించాలి,ఇంకా ఇంటికి వాపసు అయిన తరువాత పది రోజుల ఉపవాసాలు పూర్తి అవటం కొరకు ఏడు రోజులు ఉపవాసం ఉండాలి. ఈ హజ్జె తమత్తు లో ఖుర్బానీ తప్పనిసరిగా ఇవ్వటం,స్థోమత లేనివాడు ఉపవాసాలుండటం హరమ్ ప్రాంతం వారు కాకుండా దూర ప్రాంతముల నుండి హజ్ కొరకు వచ్చిన వారి కొరకు వర్తిస్తుంది. అల్లాహ్ నిర్దేశించిన వాటిని పాటించటంలో,ఆయన హద్దులను గౌరవించటంలో అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఆదేశాలను వ్యతిరేకించే వారిని ఆయన కఠినంగా శిక్షిస్తాడని మీరు తెలుసుకోండి.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• مقصود الجهاد وغايته جَعْل الحكم لله تعالى وإزالة ما يمنع الناس من سماع الحق والدخول فيه.
ఆదేశమును అల్లాహ్ మన్నత కొరకు చేయటం,సత్యమును వినటము నుండి,సత్యములో ప్రవేశించటం నుండి ప్రజలను ఆటంకం కలిగించే వాటిని దూరం చేయటం జిహాద్ (ధర్మ పోరాటం) ఉద్దేశము,లక్ష్యము.

• ترك الجهاد والقعود عنه من أسباب هلاك الأمة؛ لأنه يؤدي إلى ضعفها وطمع العدو فيها.
జిహాద్ ను వదిలి వేయటం,దాని నుండి వెనుకంజ వేయటం ఉమ్మత్ వినాశనమునకు కారణమవుతుంది.ఎందుకంటే అది ఉమ్మత్ ని బలహీనతకు చేరుస్తుంది,వారిలో శతృవులు దురాశను చూపుతారు.

• وجوب إتمام الحج والعمرة لمن شرع فيهما، وجواز التحلل منهما بذبح هدي لمن مُنِع عن الحرم.
హజ్ మరియు ఉమ్రా ఫ్రారంభించిన వారికి వాటిని పూర్తి చేయటం తప్పనిసరి.హరమ్ ప్రాంతములో ప్రవేశము నుండి ఆపబడిన వారు ఒక జంతువును జిబాహ్ చేసి ఇహ్రామ్ దీక్ష నుండి బయటకు రావటం ధర్మసమ్మతమే.

اَلْحَجُّ اَشْهُرٌ مَّعْلُوْمٰتٌ ۚ— فَمَنْ فَرَضَ فِیْهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوْقَ وَلَا جِدَالَ فِی الْحَجِّ ؕ— وَمَا تَفْعَلُوْا مِنْ خَیْرٍ یَّعْلَمْهُ اللّٰهُ ؔؕ— وَتَزَوَّدُوْا فَاِنَّ خَیْرَ الزَّادِ التَّقْوٰی ؗ— وَاتَّقُوْنِ یٰۤاُولِی الْاَلْبَابِ ۟
హజ్జ్ మాసములు నిర్ధారితమై ఉన్నాయి.షవ్వాల్ మాసము నుండి మొదలై జిల్ హిజ్జ మాసపు పదవ తారీకున ముగిస్తాయి.ఈ నెలలో ఎవరైతే హజ్జ్ చేయాలని నిర్ణయించుకుంటాడో దాని కొరకు ఇహ్రామ్ కట్టుకుంటాడో అతనిపై సంబోగము,దానికి సంబంధించిన రతి క్రీడలు (ముద్దు పెట్టుకోవటం,వాటేసుకోవటం) నిషేదము.ఆ సమయం,ప్రదేశము గొప్పతనము వలన పాప కార్యము చేసి అల్లాహ్ విధేయత నుండి దూరం అవకూడదని అతని హక్కులో తాకీదు చేయబడింది.కోపాలకి,తగాదాలకి దారితీసే వివాదాలు అతనిపై నిషేదం.మీరు ఏ మంచి కార్యం చేసిన దానిని అల్లాహ్ గుర్తించి దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.హజ్జ్ నిర్వర్తించడం కొరకు మీకు అవసరమైన తినే,త్రాగే వస్తువులను ఏర్పాటు చేసుకుని సహాయమును అర్ధించండి.మీ వ్యవహారాలన్నింటిలో దేని ద్వారానైతే మీరు సహాయమును అర్ధిస్తున్నారో అందులో ఉత్తమమైనది అల్లాహ్ భయభీతి అన్న విషయమును మీరు గుర్తించండి.ఓ సరైన బుద్ధి కలవారా మీరు నా ఆదేశాలను పాటించి,నేను వారించిన వాటికి దూరంగా ఉండి నాకు భయపడుతూ ఉండండి.
Tafsyrai arabų kalba:
لَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ اَنْ تَبْتَغُوْا فَضْلًا مِّنْ رَّبِّكُمْ ؕ— فَاِذَاۤ اَفَضْتُمْ مِّنْ عَرَفٰتٍ فَاذْكُرُوا اللّٰهَ عِنْدَ الْمَشْعَرِ الْحَرَامِ ۪— وَاذْكُرُوْهُ كَمَا هَدٰىكُمْ ۚ— وَاِنْ كُنْتُمْ مِّنْ قَبْلِهٖ لَمِنَ الضَّآلِّیْنَ ۟
హజ్ సమయంలో హలాల్ ఆహారమును వ్యాపారము,ఇతర పద్దతుల ద్వారా కోరటంలో మీ పై ఎటువంటి దోషం లేదు,జిల్ హిజ్జ తొమ్మిదో తారీకున మీరు అరఫాలో బస చేసిన తరువాత వాపసు అవుతూ పదో తారీకు రాత్రి (తొమ్మిదో తారీకు సూర్యాస్తమయం నుండి పదోవ తారీకు మొదలవుతుంది) ముజ్దలిఫ చేరుకోవాలి.ముజ్దలిఫ లో మష్అరె హరమ్ వద్ద అల్లాహ్ పరిశుద్దతను తెలుపుతూ,లా యిలాహ ఇల్లల్లాహ్ పలుకుతూ,దుఆ చేస్తూ అల్లాహ్ ను స్మరించండి.మీకు ఆయన ధర్మం యొక్క జ్ఞానమును కలిగించినందుకు,ఆయన గృహపు హజ్ కార్యాలు (మనాసికె హజ్) తెలియజేసినందుకు మీరు అల్లాహ్ ను స్మరించండి.దీనికన్న ముందు మీరు ఆయన ధర్మము గురించి జ్ఞానము లేని వారై ఉండేవారు.
Tafsyrai arabų kalba:
ثُمَّ اَفِیْضُوْا مِنْ حَیْثُ اَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
మీరు అజ్ఞానులు అరఫాలో విడిది చేయకుండా వెళ్ళి పోయినట్లు కాకుండా ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ ను అనుసరించే ప్రజలు ఏ విధంగా అరఫాలో విడిది చేసి వాపసు అయ్యేవారో అలా వాపసు అవ్వండి.అల్లాహ్ నిర్దేశించిన దానిని పాటించటంలో మీరు లోపం చేసిన దానిపై అల్లాహ్ తో మన్నింపు వేడుకోండి నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించే వాడును,వారిపై కరుణించే వాడును.
Tafsyrai arabų kalba:
فَاِذَا قَضَیْتُمْ مَّنَاسِكَكُمْ فَاذْكُرُوا اللّٰهَ كَذِكْرِكُمْ اٰبَآءَكُمْ اَوْ اَشَدَّ ذِكْرًا ؕ— فَمِنَ النَّاسِ مَنْ یَّقُوْلُ رَبَّنَاۤ اٰتِنَا فِی الدُّنْیَا وَمَا لَهٗ فِی الْاٰخِرَةِ مِنْ خَلَاقٍ ۟
మీరు హజ్జ్ కార్యాలను సమాప్తం చేసి,వాటిని పూర్తి గావించినప్పుడు అల్లాహ్ ను స్మరించండి,మీ తాతముత్తాతల గొప్పలు చెప్పుకున్నట్లు వారిని పొగిడినట్లు ఆయనను ఎక్కువగా స్థుతించండి,పొగడండి.మీ తాతముత్తాతల కన్న ఇంకా ఎక్కువగా అల్లాహ్ ను స్మరించండి.ఎందుకంటే మీరు అనుభవిస్తున్న అనుగ్రహాలన్నీ ఆయన వద్దవే.మరియు ప్రజల్లో రకరకాల వారున్నారు,వారిలోంచి బహు దైవారాధకులైన సత్య తిరస్కారులున్నారు.వారికి ఇహలోక జీవితం పైనే నమ్మకం ఉన్నది.వారు తమ ప్రభువును కేవలం ఇహలోకమును,దాని హంగు బంగులైన ఆరోగ్యం,ధనము,సంతానమును అర్ధిస్తారు.అల్లాహ్ పరలోకంలో తన దాసుల్లోంచి విశ్వాసపరులైన వారి కొరకు ఏవైతే తయారు చేసి ఉంచాడో అందులో కొంచెము భాగం కూడా వారి ఇహలోకం పై ఇష్టత,పరలోకము పై అయిష్టత వలన వారికి లభించదు.
Tafsyrai arabų kalba:
وَمِنْهُمْ مَّنْ یَّقُوْلُ رَبَّنَاۤ اٰتِنَا فِی الدُّنْیَا حَسَنَةً وَّفِی الْاٰخِرَةِ حَسَنَةً وَّقِنَا عَذَابَ النَّارِ ۟
ప్రజల్లోంచి ఒక వర్గం అల్లాహ్ పై,అంతిమ దినం పై విశ్వాసమును కలిగి ఉంటారు,వారు తమ ప్రభువుతో ఏ విధంగానైతే స్వర్గం ద్వారా సాఫల్యంను,నరకాగ్ని శిక్ష నుండి శ్రేయస్సును అర్ధిస్తారో ఆ విధంగా ఇహలోక అనుగ్రహాలను,అందులోని సత్కార్యాలను అర్ధిస్తారు.
Tafsyrai arabų kalba:
اُولٰٓىِٕكَ لَهُمْ نَصِیْبٌ مِّمَّا كَسَبُوْا ؕ— وَاللّٰهُ سَرِیْعُ الْحِسَابِ ۟
వారందరు ఇహ,పరలోకాల శ్రేయస్సును అర్ధిస్తారు.వారికి ఇహలోకంలో సత్కార్యాల్లోంచి వారు సంపాదించిన వాటి ద్వారా గొప్ప పుణ్యములోంచి భాగము లభించును మరియు అల్లాహ్ కర్మల లెక్కను తొందరగా తీసుకుంటాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• يجب على المؤمن التزود في سفر الدنيا وسفر الآخرة، ولذلك ذكر الله أن خير الزاد هو التقوى.
విశ్వాసపరుని పై ఇహలోక ప్రయాణపు,పరలోక ప్రయాణపు సామగ్రిని సమకూర్చుకోవటం తప్పనిసరి,అందుకనే అల్లాహ్ మేలైన సామగ్రి దైవభీతి అని తెలియపరచాడు.

• مشروعية الإكثار من ذكر الله تعالى عند إتمام نسك الحج.
హజ్జ్ కార్యాలు పరిపూర్ణమైనప్పుడు అల్లాహ్ యొక్క స్మరణ ఎక్కువగా చేయటం చట్టబద్దమైనది.

• اختلاف مقاصد الناس؛ فمنهم من جعل همّه الدنيا، فلا يسأل ربه غيرها، ومنهم من يسأله خير الدنيا والآخرة، وهذا هو الموفَّق.
మనుషుల యొక్క ఉద్దేశాలు వేరువేరు; అయితే వారిలోంచి కొందరు ఇహలోకమే తమ యొక్క ధ్యేయము చేసుకున్నారు,వారు తమ ప్రభువుతో అది కాక వేరేది అర్ధించరు,వారిలోంచి మరి కొందరు ఆయనతో ఇహ,పరలోకాల శ్రేయస్సును అర్ధిస్తారు.మరియు ఇదే ప్రసాదము.

وَاذْكُرُوا اللّٰهَ فِیْۤ اَیَّامٍ مَّعْدُوْدٰتٍ ؕ— فَمَنْ تَعَجَّلَ فِیْ یَوْمَیْنِ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ۚ— وَمَنْ تَاَخَّرَ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ۙ— لِمَنِ اتَّقٰی ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّكُمْ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟
మీరు నిర్ణీత రోజులు అల్లాహ్ గొప్పతనమును (తక్బీర్ పలుకుతూ) తెలుపుతూ,లా యిలాహ ఇల్లల్లాహ్ పలుకుతూ అల్లాహ్ ను స్మరించండి.అవి జిల్ హిజ్జా మాసపు 11,12,13 తేదీలు,ఎవరైన జిల్ హిజ్జా మాసపు 12వ తేదీన షైతాను పై రాళ్ళు రువ్విన తరువాత మినా నుండి బయలుదేరితే అది అతని కొరకు అవుతుంది,అతని పై ఎటువంటి దోషము లేదు,ఎందుకంటే అల్లాహ్ అతనికి సౌలభ్యాన్ని కలిగించాడు.ఎవరైన 13వ తేదీ వరకు ఉండి షైతాను పై రాళ్ళు రువ్వితే అది అతని కొరకు అవుతుంది,అతని పై ఎటువంటి దోషం లేదు.అతను పూర్తి స్థాయికు చేరుకున్నాడు.అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కార్యమును అనుసరించాడు.ఇదంతా తన హజ్ లో అల్లాహ్ కు భయపడి అల్లాహ్ ఆదేశించినట్లు దానిని పూర్తి చేసిన వారికొరకు,మీరు అల్లాహ్ ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడుతూ ఉండండి.మరియు ఆయన ఒక్కరి వైపే మరలి వెళ్లవలసి ఉన్నదని నమ్మకమును కలిగి ఉండండి.తద్వారా ఆయన మీ ఆచరణలకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَمِنَ النَّاسِ مَنْ یُّعْجِبُكَ قَوْلُهٗ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَیُشْهِدُ اللّٰهَ عَلٰی مَا فِیْ قَلْبِهٖ ۙ— وَهُوَ اَلَدُّ الْخِصَامِ ۟
ఓ ప్రవక్త మనుషుల్లో కపటుడుంటాడు ఈ లోకంలో అతని మాటలు మీకు మంచిగా అనిపిస్తాయి,అతడు మీకు మంచిగా మాట్లాడే వాడిగా కనబడుతాడు,చివరికి అతనిని మీరు నీతిమంతునిగా,హితోక్తుడిగా భావిస్తారు,అతని ఉద్దేశం కేవలం తన ప్రాణమును,ధనమును కాపాడుకోవటం మాత్రమే.అతని మనసులో ఉన్న విశ్వాసము,మేలు విషయంలో అబద్దం పలుకుతున్నాడని అల్లాహ్ సాక్షమిస్తున్నాడు.అతడు ముస్లిముల యెడల ఎక్కువగా తగాదా పడేవాడు,ఎక్కువగా ద్వేషము కలవాడు.
Tafsyrai arabų kalba:
وَاِذَا تَوَلّٰی سَعٰی فِی الْاَرْضِ لِیُفْسِدَ فِیْهَا وَیُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ الْفَسَادَ ۟
మరియు అతడు నీ నుంచి వీపుతిప్పుకున్నప్పుడు,నీ వద్ద నుంచి వేరైనప్పుడు పాపాల ద్వారా భూమిలో చెడును వ్యాపింప చేయటానికి ప్రయత్నాలు చేస్తాడు,పంటలను నాశనం చేస్తాడు,పశువులను చంపుతాడు.మరియు అల్లాహ్ భూమిలో చెడును సుతారం ఇష్టపడడు,చెడును వ్యాపింప చేసే వారిని ఇష్టపడడు.
Tafsyrai arabų kalba:
وَاِذَا قِیْلَ لَهُ اتَّقِ اللّٰهَ اَخَذَتْهُ الْعِزَّةُ بِالْاِثْمِ فَحَسْبُهٗ جَهَنَّمُ ؕ— وَلَبِئْسَ الْمِهَادُ ۟
మరియు ఇలా చెడును వ్యాపింపజేసే వాడితో నీవు అల్లాహ్ హద్దులను గౌరవించడంలో,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కు భయపడుతూ ఉండు అని హితోపదేశంగా చెప్పినప్పుడు అతనిని గర్వం,అహంకారం సత్యం వైపునకు మరలటం నుండి ఆపుతుంది,అతడు పాపంలో కొనసాగుతూ పోతాడు,అతనికి నరకంలో ప్రవేశం ప్రతిఫలంగా సరిపోతుంది.నరక వాసుల కొరకు అది ఎంతో చెడ్డదైన స్థావరము,నివాస స్థలము.
Tafsyrai arabų kalba:
وَمِنَ النَّاسِ مَنْ یَّشْرِیْ نَفْسَهُ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ ؕ— وَاللّٰهُ رَءُوْفٌۢ بِالْعِبَادِ ۟
ప్రజల్లోంచి విశ్వాసపరుడు తన ప్రాణములను పణంగా పెట్టి తన ప్రభువుకు విధేయతగా,ఆయన మార్గంలో ధర్మ పోరాటాలు చేస్తూ,ఆయన మన్నతను కోరుకుంటూ దానిని వినియోగిస్తాడు.అల్లాహ్ తన దాసుల పట్ల విశాలమైన కరుణ కలవాడు,వారి పట్ల వాత్సల్యం కలవాడు.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا ادْخُلُوْا فِی السِّلْمِ كَآفَّةً ۪— وَلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟
అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి,గ్రంధవహులు గ్రంధములోంచి కొన్ని విషయాలపై విశ్వాసమును కనబరిచి కొన్నింటిని తిరస్కరించి ఏ విధంగా చేశారో ఆవిధంగా మీరు అందులో (ధర్మంలో) ఉన్న ఏ విషయాన్నీ వదలకండి.మరియు మీరు షైతాన్ మార్గములను అనుసరించకండి,అతడు మీకు శతృత్వం బహిర్గంగా కనబడుతున్న బద్ద శతృవు.
Tafsyrai arabų kalba:
فَاِنْ زَلَلْتُمْ مِّنْ بَعْدِ مَا جَآءَتْكُمُ الْبَیِّنٰتُ فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟
మీ వద్దకు ఎటువంటి సందేహం లేని స్పష్టమైన ఆధారాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒక వైపునకు వాలిపోవటం,ఒక వైపుకు జారిపోవటం జరిగితే గుర్తించుకోండి అల్లాహ్ తన శక్తి మరియు అణచి వేయటంలో ధీటుడు.తన వ్యవహారాల నిర్వహణలో,తన శాసనాలను శాసించటంలో వివేకవంతుడు,అయితే మీరు ఆయనతో భయపడండి,ఆయన గొప్పలు తెలియపరచండి.
Tafsyrai arabų kalba:
هَلْ یَنْظُرُوْنَ اِلَّاۤ اَنْ یَّاْتِیَهُمُ اللّٰهُ فِیْ ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلٰٓىِٕكَةُ وَقُضِیَ الْاَمْرُ ؕ— وَاِلَی اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۟۠
సత్య మార్గము నుండి దూరమై షైతాను మార్గమును అనుసరించే వీరందరు అల్లాహ్ వారి మధ్య తీర్పునివ్వటం కొరకు తనకు తగినట్లు ప్రళయ దినాన మేఘముల నీడల్లో వారి వద్దకు రావాలని దైవ దూతలు వారి నలుమూలల నుండి రావాలని వారు వేచి చూస్తున్నారు,అప్పుడు వారి మధ్య అల్లాహ్ తీర్పు జరుగుతుంది,దానిని పూర్తిగావిస్తాడు,ఒకే అల్లాహ్ వైపునే మనుషుల వ్యవహారాలు,కార్యాలు మరలించబడుతాయి.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• التقوى حقيقة لا تكون بكثرة الأعمال فقط، وإنما بمتابعة هدي الشريعة والالتزام بها.
వాస్తవానికి దైవభీతి అన్నది కేవలం ఆచరణలు ఎక్కువగా ఉండటంలో లేదు,ధర్మం యొక్క మార్గమును అనుసరించటంలో,దాని పై నిలకడ చూపటంలో ఉన్నది.

• الحكم على الناس لا يكون بمجرد أشكالهم وأقوالهم، بل بحقيقة أفعالهم الدالة على ما أخفته صدورهم.
ప్రజల మధ్య కేవలం వారి రూపాలను,వారి మాటలను చూసి తీర్పునివ్వటం జరగదు,కాని వారి మనస్సులలో దాగి ఉన్న సంకల్పాలను తెలిపే ఆచరణలపై తీర్పునివ్వటం జరుగుతుంది.

• الإفساد في الأرض بكل صوره من صفات المتكبرين التي تلازمهم، والله تعالى لا يحب الفساد وأهله.
భూమిలో చెడు అన్నది అహంకారుల్లో ఉండే గుణాల రూపాల వలన వ్యాపిస్తుంది,అల్లాహ్ చెడును,చెడును వ్యాపింప చేసేవారిని ఇష్టపడడు.

• لا يكون المرء مسلمًا حقيقة لله تعالى حتى يُسَلِّم لهذا الدين كله، ويقبله ظاهرًا وباطنًا.
మనిషి ఈ ధర్మము(ఇస్లాం) కొరకు పూర్తిగా సమర్పించుకునే వరకు,దాన్ని బాహ్యంగా అంతరంగా స్వీకరించే వరకు వాస్తవానికి అల్లాహ్ కొరకు ముస్లిం కాలేడు.

سَلْ بَنِیْۤ اِسْرَآءِیْلَ كَمْ اٰتَیْنٰهُمْ مِّنْ اٰیَةٍ بَیِّنَةٍ ؕ— وَمَنْ یُّبَدِّلْ نِعْمَةَ اللّٰهِ مِنْ بَعْدِ مَا جَآءَتْهُ فَاِنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟
ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రాయీల్ సంతతి వారిని మందలిస్తూ ఇలా ప్రశ్నించండి, అల్లాహ్ ప్రవక్త నిజాయితీని ఋజువు చేసే స్పష్టమైన ఎన్ని సూచనలను వివరించాడు.మీరు వాటిని తిరస్కరించారు,వాటి వైపు నుండి ముఖము తిప్పేసారు.ఎవరైతే అల్లాహ్ అనుగ్రహాలను తెలిసిన తరువాత,అవి బహిర్గతమైన తరువాత విస్మరిస్తూ,తిరస్కరిస్తూ మార్చదలుచుకుంటాడో,నిశ్చయంగా అల్లాహ్ విస్మరించే తిరస్కారులను కఠినంగా శిక్షించేవాడు.
Tafsyrai arabų kalba:
زُیِّنَ لِلَّذِیْنَ كَفَرُوا الْحَیٰوةُ الدُّنْیَا وَیَسْخَرُوْنَ مِنَ الَّذِیْنَ اٰمَنُوْا ۘ— وَالَّذِیْنَ اتَّقَوْا فَوْقَهُمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— وَاللّٰهُ یَرْزُقُ مَنْ یَّشَآءُ بِغَیْرِ حِسَابٍ ۟
అల్లాహ్ ను తిరస్కరించే వారి కొరకు ఇహలోక జీవితము,అందులో ఉన్న ఆహ్లాదకరమైన విషయాలు,అంతమైపోయే రుచుల ద్వారా అందంగా అలంకరించబడింది.వారు అల్లాహ్ ను, అంతిమ దినమును విశ్వసంచే వారిని హేళన చేస్తున్నారు,అల్లాహ్ కు భయపడి ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడే వారు పరలోకములో ఈ అవిశ్వాసుల కన్న ఉన్నత స్థానంలో ఉంటారు.అల్లాహ్ వారందరిని కలకాలముండే స్వర్గ వనాల్లో ఉంచుతాడు,అల్లాహ్ తన సృష్టి లోంచి తలచుకున్న వారికి లెక్క లేనంత ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
كَانَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً ۫— فَبَعَثَ اللّٰهُ النَّبِیّٖنَ مُبَشِّرِیْنَ وَمُنْذِرِیْنَ ۪— وَاَنْزَلَ مَعَهُمُ الْكِتٰبَ بِالْحَقِّ لِیَحْكُمَ بَیْنَ النَّاسِ فِیْمَا اخْتَلَفُوْا فِیْهِ ؕ— وَمَا اخْتَلَفَ فِیْهِ اِلَّا الَّذِیْنَ اُوْتُوْهُ مِنْ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنٰتُ بَغْیًا بَیْنَهُمْ ۚ— فَهَدَی اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا لِمَا اخْتَلَفُوْا فِیْهِ مِنَ الْحَقِّ بِاِذْنِهٖ ؕ— وَاللّٰهُ یَهْدِیْ مَنْ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
పూర్వం ప్రజలందరు ఒకే సమాజంగా సన్మార్గం పై తమ తండ్రి ఆదమ్ ధర్మం పై ఉండేవారు. చివరికి షైతానులు వారిని మార్గభ్రష్టతకు గురి చేసారు. విశ్వాసపరునికి,అవిశ్వాసపరునికి మధ్య విభేదించుకున్నారు. అందువలనే అల్లాహ్ విధేయులైన విశ్వాసపరుల కొరకు ఏర్పాటు చేసిన తన కారుణ్యం గురించి వారికి శుభవార్తనిస్తూ,అవిశ్వాసపరుల కొరకు తాను తయారు చేసిన తన కఠిన శిక్షను గురించి వారికి హెచ్చరిస్తూ దైవ ప్రవక్తలను పంపించాడు. ప్రజలు దేని గురించి విభేదించుకున్నారో దాని గురించి ప్రజల్లో తీర్పునివ్వటం కొరకు ఎటువంటి సందేహం లేని సత్యంతో కూడుకుని ఉన్న గ్రంధాలను తన ప్రవక్తలతో పాటు అవతరింపచేశాడు. అది అల్లాహ్ వద్ద నుండి వచ్చిన సత్యమని అల్లాహ్ వాదనలు యూదుల వద్దకు వచ్చిన తరువాత వారు తౌరాత్ జ్ఞానమును ఇవ్వబడిన తరువాత తమ దుర్మార్గం వలన దాని విషయంలో విభేదించుకున్నారు. అందులో విభేదించుకోవటానికి ఎటువంటి ఆస్కారమూ లేదు. అల్లాహ్ మార్గభ్రష్టత నుండి సన్మార్గమును పొందే జ్ఞానమును తన అనుమతితో,తన నిర్ణయంతో విశ్వాసపరులకు సౌభాగ్యమును కలిగించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి ఎటువంటి వంకరతనం లేని సన్మార్గమును ప్రసాదిస్తాడు. అదే విశ్వాసము యొక్క మార్గము.
Tafsyrai arabų kalba:
اَمْ حَسِبْتُمْ اَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا یَاْتِكُمْ مَّثَلُ الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلِكُمْ ؕ— مَسَّتْهُمُ الْبَاْسَآءُ وَالضَّرَّآءُ وَزُلْزِلُوْا حَتّٰی یَقُوْلَ الرَّسُوْلُ وَالَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ مَتٰی نَصْرُ اللّٰهِ ؕ— اَلَاۤ اِنَّ نَصْرَ اللّٰهِ قَرِیْبٌ ۟
ఓ విశ్వాసపరులారా మీకన్న పూర్వం గతించిన వారి పరీక్షల్లాంటి పరీక్షలు మీకు రాకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారనుకుంటున్నారా? వారికి పేదరికం,రోగాల కష్టాలు కలిగినాయి,ఆందోళనలు వారిని కదిపివేసినాయి,చివరకు వారి పరీక్షలు వారిని అల్లాహ్ సహాయమును కోరటంలో తొందరపడేటట్లు చేసాయి.ప్రవక్త,ఆయనతోపాటు విశ్వాసపరులు అల్లాహ్ సహాయం ఎప్పుడు వస్తుందని వాపోయారు.వినండి అల్లాహ్ను విశ్వసించే వారికి,ఆయనపై నమ్మకం కలిగిన వారికి అల్లాహ్ సహాయం సమీపంలో ఉన్నది.
Tafsyrai arabų kalba:
یَسْـَٔلُوْنَكَ مَاذَا یُنْفِقُوْنَ ؕ— قُلْ مَاۤ اَنْفَقْتُمْ مِّنْ خَیْرٍ فَلِلْوَالِدَیْنِ وَالْاَقْرَبِیْنَ وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنِ وَابْنِ السَّبِیْلِ ؕ— وَمَا تَفْعَلُوْا مِنْ خَیْرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِیْمٌ ۟
ఓ ప్రవక్త మీ సహచరులు తమ ఇతరాత్ర సంపద నుండి ఏమి ఖర్చు చేయాలని,వాటిని ఎక్కడ ఉంచాలని మిమ్మల్ని అడుగుతున్నారు.వారికి సమాధానమిస్తూ మీరు ఇలా పలకండి:మీరు ఏదైతే ఖర్చు చేస్తున్నారో అది ధర్మసమ్మతమైనది,శ్రేష్టమైనది.అయితే మీరు మీ తల్లిదండ్రుల కొరకు,మీ దగ్గరి బంధువుల కనీస అవసరాల కొరకు,పేదవారైన అనాధల కొరకు,ఎటువంటి సంపద లేని నిరుపేదల కొరకు,ప్రయాణం వలన తన కుటుంబం నుండి,తన దేశం నుండి దూరంగా ఉన్న ప్రయాణిికుని కొరకు ఖర్చు చేయాలి.ఓ విశ్వాసపరులారా మీరు చేసే సత్కార్యం తక్కువైన,ఎక్కువైన అల్లాహ్ కు దాని గురించి జ్ఞానముండును,అతని నుండి ఏ వస్తువు దాగి ఉండదు.అతడు దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• ترك شكر الله تعالى على نعمه وترك استعمالها في طاعته يعرضها للزوال ويحيلها بلاءً على صاحبها.
అల్లాహ్ అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతను తెలుపుకోవటంను వదిలివేయటం,వాటిని ఆయన విధేయతలో వినియోగించటంను వదిలి వేయటం వాటిని అంతరించుతుంది మరియు వాటి యజమానిపై ముప్పును కొని తెస్తుంది.

• الأصل أن الله خلق عباده على فطرة التوحيد والإيمان به، وإبليس وأعوانه هم الذين صرفوهم عن هذه الفطرة إلى الشرك به.
వాస్తవానికి అల్లాహ్ తన దాసులను తౌహీదు (ఏక దైవ ఆరాధన),ఆయన పై విశ్వాసమును తీసుకుని వచ్చే స్వభావం పై పుట్టిస్తాడు కాని ఇబ్లీసు,అతని సహాయకులు వారిని ఈ స్వభావము నుండి ఆయనతో పాటు సాటి కల్పించటం వైపునకు మరలుస్తారు.

• أعظم الخذلان الذي يؤدي للفشل أن تختلف الأمة في كتابها وشريعتها، فيكفّر بعضُها بعضًا، ويلعن بعضُها بعضًا.
వైఫల్యానికి దారి తీసె పెద్ద నిరాశ ఏమిటంటే సమాజం (ఉమ్మత్) తన గ్రంధ విషయంలో,తన ధర్మ శాసనాల విషయంలో విభేధించటం అయితే వారు ఒకరినొకరు తిరస్కరిస్తారు,ఒకరు ఇంకొకరిపై శాపనార్దాలు పెడతారు.

• الهداية للحق الذي يختلف فيه الناس، ومعرفة وجه الصواب بيد الله، ويُطلب منه تعالى بالإيمان به والانقياد له.
సత్య మార్గ దర్శకత్వంలో ప్రజలు విభిన్నమైన వైఖరిని కలిగి ఉంటారు.సరైన మార్గమును తెలియ పరచడం అల్లాహ్ చేతిలో ఉన్నది.దాని ద్వార అల్లాహ్ తనపై విశ్వాసమును,విధేయతను ఆశిస్తున్నాడు.

• الابتلاء سُنَّة الله تعالى في أوليائه، فيبتليهم بقدر ما في قلوبهم من الإيمان به والتوكل عليه.
తన స్నేహితులను పరీక్షించటం అల్లాహ్ సంప్రదాయం తనపై విశ్వాసము,నమ్మకము వారి హృదయముల్లో ఎంత ఉన్నదో పరీక్షిస్తాడు.

• من أعظم ما يعين على الصبر عند نزول البلاء، الاقتداء بالصالحين وأخذ الأسوة منهم.
పరీక్షల సమయంలో సహనం పాటించే సౌభాగ్యము,పుణ్యాత్ముల అనుసరణ,వారిని నమూనాగా తీసుకోవటం గొప్ప విషయాలు.

كُتِبَ عَلَیْكُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْ ۚ— وَعَسٰۤی اَنْ تَكْرَهُوْا شَیْـًٔا وَّهُوَ خَیْرٌ لَّكُمْ ۚ— وَعَسٰۤی اَنْ تُحِبُّوْا شَیْـًٔا وَّهُوَ شَرٌّ لَّكُمْ ؕ— وَاللّٰهُ یَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟۠
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మార్గంలో పోరాడటంలో ధనమును,మానమును ఖర్చు చేయటం అన్నది స్వాభావిక పరంగా మనస్సుకు నచ్చకపోయినా మీపై విధి గావించబడినది.బహుశా మీరు దేనినైతే ఇష్టపడటం లేదో అల్లాహ్ మార్గంలో పోరాడటం వాస్తవానికి మీ కొరకు మేలైనదేమో,లాభదాయకమైనదేమో.అల్లాహ్ యొక్క పెద్ద ప్రతిఫలంతో పాటు అందులో శతృవులకు వ్యతిరేకంగా సహాయం,అల్లాహ్ కలిమాను ఉన్నత శిఖరాలకు చేరవేయటంలో సహాయ సహకారాలు కలవు.బహుశా దేనినైతే మీరు ఇష్ట పడుతున్నారో ధర్మ యుద్ధంలో వెళ్ళకుండా కూర్చోవటం అది మీ పాలిట కీడును కలిగిస్తుంది,మీపై ఆపదను తెచ్చి పెడుతుంది,ఎందుకంటే అందులో ఓటమి ఉన్నది,శతృవుల ఆధిక్యత ఉన్నది అల్లాహ్ సంపూర్ణ జ్ఞానంతో కార్యాల మంచిని,వాటి చెడును తెలుసుకుంటాడు.మరియు మీకు వాటి గురించి తెలియదు.ఆయన ఆదేశమును స్వీకరించండి.అందులోనే మీకు శ్రేయస్కరమున్నది.
Tafsyrai arabų kalba:
یَسْـَٔلُوْنَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِیْهِ ؕ— قُلْ قِتَالٌ فِیْهِ كَبِیْرٌ ؕ— وَصَدٌّ عَنْ سَبِیْلِ اللّٰهِ وَكُفْرٌ بِهٖ وَالْمَسْجِدِ الْحَرَامِ ۗ— وَاِخْرَاجُ اَهْلِهٖ مِنْهُ اَكْبَرُ عِنْدَ اللّٰهِ ۚ— وَالْفِتْنَةُ اَكْبَرُ مِنَ الْقَتْلِ ؕ— وَلَا یَزَالُوْنَ یُقَاتِلُوْنَكُمْ حَتّٰی یَرُدُّوْكُمْ عَنْ دِیْنِكُمْ اِنِ اسْتَطَاعُوْا ؕ— وَمَنْ یَّرْتَدِدْ مِنْكُمْ عَنْ دِیْنِهٖ فَیَمُتْ وَهُوَ كَافِرٌ فَاُولٰٓىِٕكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ۚ— وَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
ఓ ప్రవక్త నిషిద్ధ మాసములైన జీఖాఅద,జిల్ హిజ్జా,ముహర్రం,రజబ్ లో యుద్ధం చేయటం గురించి వారు మిమ్మల్ని అడుగుతున్నారు.వారికే సమాధానమిస్తూ తెలియ పరచండి : ఈ మాసముల్లో యుద్ధం చేయటం అల్లాహ్ వద్ద మహా పాపం,ఇష్టం లేని కార్యం.ఏవిధంగానైతే అల్లాహ్ మార్గం నుండి బహుదైవారాధకుల ఆపే కార్యం చెడ్డదో,అలాగే విశ్వాసపరులను మస్జిదే హరామ్ నుండి ఆపడం,వారిని అక్కడ నుండి బహిష్కరించడం అల్లాహ్ వద్ద నిషిద్ద మాసముల్లో యుద్ధం చేయటం కన్న మహా పాపము,మరియు వారు మునిగి ఉన్న బహుదైవారాధన హత్య కన్న ఘోరమైన పాపము.బహుదైవారాధకులు మిమ్మల్ని మీ సత్య ధర్మం నుండి వారి అసత్య ధర్మం వైపునకు మరల్చే వరకు వారికి దాని వైపునకు అవకాశం దొరికితే మీతో యద్ధం చేస్తూ దుర్మార్గంపై ఉంటారు.మీలో నుంచి ఎవరైతే తన ధర్మం నుండి మరలి పోయి అల్లాహ్ పై అవిశ్వాస స్థితి లో చనిపోతాడో అతని సత్కర్మలు నాశనమవుతాయి,అతని కొరకు పరలోకంలో నరకంలో ప్రవేశించడం,అందులో ఎల్లప్పుడు ఉండటం తప్ప ఇంకేమి ఉండదు.
Tafsyrai arabų kalba:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَالَّذِیْنَ هَاجَرُوْا وَجٰهَدُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ۙ— اُولٰٓىِٕكَ یَرْجُوْنَ رَحْمَتَ اللّٰهِ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
నిశ్చయంగా అల్లాహ్,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కలిగిన వారు,మరియు అల్లాహ్,ఆయన ప్రవక్త వైపునకు హిజ్రత్ (వలస పోతూ) చేస్తూ తమ దేశమును వదిలి వేసినవారు,అల్లాహ్ కలిమాను ఉన్నత శిఖరాలకు చేరవేయటం కొరకు ధర్మపోరాటం చేసే వారందరు అల్లాహ్ కారుణ్యాన్ని,ఆయన మన్నింపును ఆశిస్తున్నారు.అల్లాహ్ తన దాసుల పాపములను మన్నించేవాడును,వారిని కరుణించే వాడును.
Tafsyrai arabų kalba:
یَسْـَٔلُوْنَكَ عَنِ الْخَمْرِ وَالْمَیْسِرِ ؕ— قُلْ فِیْهِمَاۤ اِثْمٌ كَبِیْرٌ وَّمَنَافِعُ لِلنَّاسِ ؗ— وَاِثْمُهُمَاۤ اَكْبَرُ مِنْ نَّفْعِهِمَا ؕ— وَیَسْـَٔلُوْنَكَ مَاذَا یُنْفِقُوْنَ ؕ۬— قُلِ الْعَفْوَؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُوْنَ ۟ۙ
ఓ ప్రవక్త మీ అనుచరులు (కమర్) మధ్యపానమును త్రాగటం,దాని క్రియవిక్రయాల ఆదేశము ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నారు (బుద్ధిని కప్పివేసి మతిని పోగొట్టే ప్రతి పదార్థమును కమర్ అంటారు).మరియు జూదము (ఖిమార్) గురించి దాని ఆదేశము ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నారు (ఖిమార్ అంటే పోటీల ద్వారా డబ్బును తీసుకోవటం,పోటీలో పాల్గొనే ఇరు వర్గాల తరుపు నుండి డబ్బు పెట్టడం జరుగుతుంది,వారిలోంచి గెలిచిన వారికి మొత్తం డబ్బు వెళుతుంది).వారినే సమాధానమిస్తూ తెలియజేయండి :బుద్ధిని,ధనాన్ని కోల్పోవటం ద్వారా,ద్వేషాలు,వైరాల్లో పడిపోవటం ద్వారా ఆరెండింటిలో (మధ్యపానము,జూదము) ధార్మిక,ప్రాపంచిక నష్టాలు,చెడులు ఎక్కువగా ఉన్నవి,ఆ రెండింటిలో ఆర్ధిక లాభాలు తక్కువగానే ఉంటాయి.వాటి వలన కలిగే నష్టము,వాటి వలన కలిగే పాపము వాటి లాభము కన్న అధికమే,వాటి నష్టము లాభము కన్న ఎక్కువగా ఉన్నది.అయితే బుద్ధి మంతుడు దాని నుండి దూరంగా ఉంటాడు.అల్లాహ్ తరపు నుంచి వచ్చిన ఈ ప్రకటన మధ్యపానమును నిషేధించినది.ఓ ప్రవక్త మీ అనుచరులు తమ సంపద నుండి స్వచ్చందంగా,విరాళంగా ఏమి ఖర్చు చేయాలని మిమ్మల్ని అడుగుతున్నారు.వారికే సమాధానమిస్తూ తెలపండి మీ అవసరానికి మించి ఉన్న సంపద నుండి మీరు ఖర్చు చేయండి (ఈ ఆదేశము మొదట్లో ఉండేది ఆతరువాత అల్లాహ్ ప్రత్యేక సంపదలో నుంచి నిర్ధారిత ధనం నుండు జకాత్ ను విధిగా చెల్లించమని ఆదేశించాడు).ఇలాంటి ప్రకటనలో ఎటువంటి సందేహము లేదు.అల్లాహ్ మీ కొరకు ధర్మ ఆదేశాలను మీరు యోచించటం కొరకు వివరిస్తున్నాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• الجهل بعواقب الأمور قد يجعل المرء يكره ما ينفعه ويحب ما يضره، وعلى المرء أن يسأل الله الهداية للرشاد.
కార్యాల పర్యావసనాల గురించి అజ్ఞానం మనిషిని అతనికి లాభం చేసే వాటిని అసహ్యించుకునే విధంగా,తనకు నష్టం చేసే వాటిని ఇష్టపడేటట్లుగా చేస్తుంది.మనిషి అల్లాహ్ తో సరైన మార్గమును చూపించమని తప్పని సరిగా వేడుకోవాలి.

• جاء الإسلام بتعظيم الحرمات والنهي عن الاعتداء عليها، ومن أعظمها صد الناس عن سبيل الله تعالى.
గౌరప్రదమైన వస్తువులను గౌరవించటానికి,వాటి విషయంలో హద్దుమీరటం నుండి వారించటానికి ఇస్లాం వచ్చినది. వాటిలోంచి (హద్దుమీరే విషయాల్లోంచి) పెద్దది ప్రజలను అల్లాహ్ మార్గం నుండి ఆపటం.

• لا يزال الكفار أبدًا حربًا على الإسلام وأهله حتَّى يخرجوهم من دينهم إن استطاعوا، والله موهن كيد الكافرين.
సత్య తిరస్కారులు ఇస్లాంకు వ్యతిరేకంగా,ముస్లింలకు వ్యతిరేకంగా వారిని వారి ధర్మం నుండి తీసివేయటం కొరకు యుద్దం చేస్తూనే ఉంటారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారుల కుట్రలను బలహీన పరుస్తాడు.

• الإيمان بالله تعالى، والهجرة إليه، والجهاد في سبيله؛ أعظم الوسائل التي ينال بها المرء رحمة الله ومغفرته.
అల్లాహ్ పై విశ్వాసం,ఆయన వైపునకు మరలటం,ఆయన మార్గంలో ధర్మ పోరాటం చేయటం మనిషికి అల్లాహ్ కారుణ్యాన్ని,ఆయన మన్నింపుని పొందటం కొరకు గొప్ప కారకాలు.

• حرّمت الشريعة كل ما فيه ضرر غالب وإن كان فيه بعض المنافع؛ مراعاة لمصلحة العباد.
నష్టం ఎక్కువగా ఉన్న విషయాలు ఒక వేళ అందులో కొద్దిపాటి లాభం ఉన్నా కూడా వాటిని దాసుల శ్రేయస్సు కొరకు ధర్మం నిషేదించినది.

فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ؕ— وَیَسْـَٔلُوْنَكَ عَنِ الْیَتٰمٰی ؕ— قُلْ اِصْلَاحٌ لَّهُمْ خَیْرٌ ؕ— وَاِنْ تُخَالِطُوْهُمْ فَاِخْوَانُكُمْ ؕ— وَاللّٰهُ یَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَاَعْنَتَكُمْ ؕ— اِنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟
ఇహ,పరలోకాల్లో మీకు లాభం చేకూర్చే వాటి గురించి యోచన చేయటం కొరకు ఈ ఆదేశాలు ధర్మబద్దం చేయబడినవి.ఓ ప్రవక్త మీ అనుచరులు అనాధల పట్ల బాధ్యత గురించి వారితో వ్యవహరించటంలో ఎలా ప్రవర్తించాలి,వారి సంపదను తమ సంపదతతో కలిపి ఖర్చు చేయటం,కలిపి ఇంటి వ్యవహారాల్లో ఖర్చు చేయవచ్చా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు.వారికే సమాధానమిస్తూ తెలియపరచండి:వారి డబ్బులో ఎలాంటి పరిహారం లేకుండా లేదా వారి సంపదలో సంపర్కం లేకుండా మీరు సంస్కరించడం కొరకు వారి పై మీకు ప్రాధాన్యత నివ్వటం మీ కొరకు అల్లాహ్ వద్ద ఎంతో మేలైనది,పుణ్యపరంగా ఎంతో ఉత్తమమైనది.వారి సంపద సంరక్షణ వలన వారి సంపదలో వారికి మేలు ఉన్నది.జీవన సామగ్రి విషయంలో,నివాస విషయంలో మరియు అటువంటి విషయాల్లో వారి సంపదను మీ సంపదలో కలుపుకుంటే అలా చేసినందుకు మీ పై ఎటువంటి దోషం లేదు.ఎందుకంటే వారు ధర్మపరంగా మీకు సోదరులు,సోదరులు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు.వారిలో కొందరు కొందరి వ్యవహారాలపై ఆధారపడి ఉంటారు.అనాధలను పోషించే వారిలోంచి ఎవరు అనాధల సొమ్మును కలుపుకుని చెడు చేయదలుచుకున్నారో ఎవరు సంస్కరించదలుచుకున్నారో అల్లాహ్ కు తెలుసు.ఒక వేళ అతను అనాధల విషయంలో మీకు కష్టతరం చేయదలచుకుంటే కష్టం చేస్తాడు.కాని అతను వారితో వ్యవహరించటంలో మీ కొరకు మార్గమును సులభతరం చేశాడు.ఎందుకంటే ఆయన ధర్మం సులభతరమును వివరిస్తుంది.నిశ్చయంగా అల్లాహ్ ఆధిక్యత కలవాడు,ఆయన పై ఏ వస్తువు ఆధిక్యతను చూప లేదు.అల్లాహ్ తన షృష్టి విషయంలో,దాని నిర్వహణలో,దానిని శాసించడంలో వివేకవంతుడు.
Tafsyrai arabų kalba:
وَلَا تَنْكِحُوا الْمُشْرِكٰتِ حَتّٰی یُؤْمِنَّ ؕ— وَلَاَمَةٌ مُّؤْمِنَةٌ خَیْرٌ مِّنْ مُّشْرِكَةٍ وَّلَوْ اَعْجَبَتْكُمْ ۚ— وَلَا تُنْكِحُوا الْمُشْرِكِیْنَ حَتّٰی یُؤْمِنُوْا ؕ— وَلَعَبْدٌ مُّؤْمِنٌ خَیْرٌ مِّنْ مُّشْرِكٍ وَّلَوْ اَعْجَبَكُمْ ؕ— اُولٰٓىِٕكَ یَدْعُوْنَ اِلَی النَّارِ ۖۚ— وَاللّٰهُ یَدْعُوْۤا اِلَی الْجَنَّةِ وَالْمَغْفِرَةِ بِاِذْنِهٖ ۚ— وَیُبَیِّنُ اٰیٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟۠
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ తో పాటు సాటి కల్పించే స్త్రీలు అల్లాహ్ ఏకత్వం పై విశ్వాసం తీసుకుని రానంత వరకు,ఇస్లాం ధర్మంలో ప్రవేశించనంత వరకు మీరు వారితో వివాహమాడకండి,అల్లాహ్ పై ఆయన ప్రవక్త పై విశ్వాసం కలిగిన బానిస స్త్రీ విగ్రహాలను పూజించే స్వతంత్ర స్త్రీ కన్న ఒక వేళ ఆమె ధనం,అందం మూలంగా మీకు నచ్చినా కూడా ఎంతో మేలైనది.బహు దైవారాధకులైన పురుషులకు మీ స్త్రీలను వివాహ బంధంలోకి ఇవ్వకండి.అల్లాహ్ పై ఆయన ప్రవక్త పై విశ్వాసమును కలిగిన బానిస బహు దైవారాధన చేసే స్వతంతృడు ఒక వేళ అతడు మీకు నచ్చినా అతడి కన్న ఎంతో మేలైన వాడు.స్త్రీలైనా పురుషులైనా వారందరు విగ్రహారాధన గుణం కలవారు.వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా నరకంలో ప్రవేశింపజేయటానికి దారి తీసే కార్యాల వైపు పిలుస్తారు.అల్లాహ్ స్వర్గం లో ప్రవేశము వైపునకు,పాపముల మన్నింపు వైపునకు దారి తీసే సత్కార్యాల వైపునకు తన ఆదేశము తన అనుగ్రహము ద్వారా పిలుస్తున్నాడు.మరియు అతడు తన ఆయతులను అవి దేని పైనైతే సూచిస్తున్నాయో దాని పరంగా గుణపాఠం నేర్చుకుని వాటి పై ఆచరించటానికి వాటిని ప్రజల కొరకు వివరించి తెలుపుతున్నాడు.
Tafsyrai arabų kalba:
وَیَسْـَٔلُوْنَكَ عَنِ الْمَحِیْضِ ؕ— قُلْ هُوَ اَذًی ۙ— فَاعْتَزِلُوا النِّسَآءَ فِی الْمَحِیْضِ ۙ— وَلَا تَقْرَبُوْهُنَّ حَتّٰی یَطْهُرْنَ ۚ— فَاِذَا تَطَهَّرْنَ فَاْتُوْهُنَّ مِنْ حَیْثُ اَمَرَكُمُ اللّٰهُ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ التَّوَّابِیْنَ وَیُحِبُّ الْمُتَطَهِّرِیْنَ ۟
ఓ ప్రవక్త మీ సహచరులు మిమ్మల్ని ఋతు స్రావం (అది స్త్రీ గర్భము నుండి నిర్దిష్ట కాలంలో వెలువడే సహజ రక్తము) గురించి ప్రశ్నిస్తున్నారు.వారికే సమాధానమిస్తూ తెలపండి ఋతు స్రావము పురుషుని కొరకు,స్త్రీ కొరకు అశుద్ధ స్ధితి.ఆ సమయంలో మీరు మీ స్త్రీలతో సంభోగము నుండి దూరంగా ఉండండి.వారి నుండి రక్తము ఆగే వరకు,దాని నుండి పరిశుద్ధమవుటకు గుసుల్ చేయనంత వరకు సంభోగ ఉద్దేశంతో వారి దగ్గరకు కూడా వెళ్ళకండి.రక్తము ఆగి గుసుల్ చేసినప్పుడు మీ కొరకు సమ్మతించిన మార్గంలో వారితో సంభోగం చేయండి.వారి మర్మావయవాలు (యోని) సంభోగం కొరకు పరిశుద్ధమైనవి.నిశ్చయంగా అల్లాహ్ పాపములనుండి ఎక్కువగా పశ్చాత్తాప్పడే వారిని,అశుద్ధ విషయముల నుండి ఎక్కువగా పరిశుద్ధతను పాటించే వారిని ఇష్టపడుతాడు.
Tafsyrai arabų kalba:
نِسَآؤُكُمْ حَرْثٌ لَّكُمْ ۪— فَاْتُوْا حَرْثَكُمْ اَنّٰی شِئْتُمْ ؗ— وَقَدِّمُوْا لِاَنْفُسِكُمْ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّكُمْ مُّلٰقُوْهُ ؕ— وَبَشِّرِ الْمُؤْمِنِیْنَ ۟
మీ భార్యలు మీ కొరకు పంట పొలాల స్థానంలో ఫలాలను ఇచ్చే నేల లాగా మీ కొరకు సంతానమును జన్మనిస్తారు.అయితే మీరు పంట మొలకెత్తే స్థానమునకు రండి.అది స్త్రీ మర్మాంగము (యోనీ).మర్మాంగములో అయితే మీరు కోరుకున్న ఏ దిశలో నైన మీరు కోరుకున్న విధంగా (సంభోగం చేయండి).మీరు మీ స్వయం కోసం సత్కర్మలు పంపండి.భర్త అల్లాహ్ దగ్గరత్వాన్ని పొందే ఉద్దేశంతో,పుణ్య సంతానమును ఆశిస్తూ తన భార్యతో సంభోగం చేయటం వాటిలోంచే (సత్కర్మల్లోంచి).అల్లాహ్ ఆదేశాలను పాటించటంలో ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కు భయపడండి.స్త్రీల విషయంలో మీకు నిర్దేశించినవి అందులోనివే.ప్రళయ దినాన ఆయనను కలుసుకోవలసి ఉన్నదని,ఆయన ముందు నిలబడవలసి ఉన్నదని,ఆయన మీకు మీ ఆచరణల పరంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి.ఓ ప్రవక్త అనుగ్రహాల్లోంచి తన ప్రభువును కలిసినప్పుడు గౌరవ పరమైన ఆయన ముఖమును చూసినప్పుడు కలిగే మహా ఆనందము గురించి విశ్వాసపరులకి శుభవార్తనివ్వండి.
Tafsyrai arabų kalba:
وَلَا تَجْعَلُوا اللّٰهَ عُرْضَةً لِّاَیْمَانِكُمْ اَنْ تَبَرُّوْا وَتَتَّقُوْا وَتُصْلِحُوْا بَیْنَ النَّاسِ ؕ— وَاللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ ۟
సత్కర్మలు చేయటానికి, దైవభీతిని ప్రజల మధ్య సంస్కరణను చేయటానికి మీరు అల్లాహ్ పై చేసే ప్రమాణమును బలవంతపు వాదనగా చేయకండి.కాని సత్కార్యమును వదిలి వేయటానికి ప్రమాణం చేస్తే సత్కార్యమును చేయండి.మీ ప్రమాణములకు పరిహారమును చెల్లించండి.అల్లాహ్ మీ మాటలను వింటున్నాడు,మీ కార్యాల గురించి జ్ఞానమును కలవాడు,వాటికి తొందరలోనే మీకు.ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• تحريم النكاح بين المسلمين والمشركين، وذلك لبُعد ما بين الشرك والإيمان.
ముస్లింలకి,బహుదైవారాదకులకి మధ్య నికాహ్ నిషిద్ధం,అదీ విశ్వాసమునకు,షిర్క్ కి మధ్య ఉన్న దూరం వలన.

• دلت الآية على اشتراط الولي عند عقد النكاح؛ لأن الله تعالى خاطب الأولياء لمّا نهى عن تزويج المشركين.
నికాహ్ ఒప్పందం సమయంలో సంరక్షకులు (వలీ) ఉండటం తప్పనిసరి అని ఆయతు సూచిస్తుంది,ఎందుకంటే అల్లాహ్ బహుదైవారాధకులను వివాహం చేసుకోవటం గురించి వారించేటప్పుడు సంరక్షకులను ఉద్దేశించి వారించాడు.

• حث الشريعة على الطهارة الحسية من النجاسات والأقذار، والطهارة المعنوية من الشرك والمعاصي.
ధర్మం మురికి అపరిశుభ్రత నుంచి ఇంద్రియ స్వచ్ఛత,షిర్క్,పాపాలనుండి నైతిక స్వచ్ఛత గురించి ప్రేరేపిస్తుంది.

• ترغيب المؤمن في أن يكون نظره في أعماله - حتى ما يتعلق بالملذات - إلى الدار الآخرة، فيقدم لنفسه ما ينفعه فيها.
విశ్వాసపరునికి తన పరలోకము కొరకు ఆచరణల్లో చివరికి తన కామ కోరికలకు సంభందించిన వాటిలో దృష్టి సారించటం విషయంలో ప్రోత్సహించడం.అయితే అతను అందులో ఏవి అతనికి లాభం చేకూర్చుతాయో వాటిని ముందు చేయాలి.

لَا یُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِیْۤ اَیْمَانِكُمْ وَلٰكِنْ یُّؤَاخِذُكُمْ بِمَا كَسَبَتْ قُلُوْبُكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ حَلِیْمٌ ۟
అనాలోచితంగా మీ నోటి నుండి వెలువడిన ప్రమాణాల కారణంగా అల్లాహ్ మిమ్మల్ని లెక్క తీసుకోడు,ఉదాహరణకు మీలో నుంచి ఎవరైన పలికిన పలుకులు "లేదు అల్లాహ్ సాక్షిగా","ఎందుకు కాదు అల్లాహ్ సాక్షిగా". అయితే దాని గురించి మీపై ఎటువంటి పరిహారం లేదు.ఆ విషయంలో ఎటువంటి శిక్ష లేదు.కాని మీరు ఉద్దేశపూర్వంగా చేసిన ప్రమాణాలకు మీతో లెక్క తీసుకుంటాడు.మరియు అల్లాహ్ తన దాసుల పాపములను మన్నించే వాడును,సహనశీలుడు వారిని శిక్షించడంలో తొందరపడడు.
Tafsyrai arabų kalba:
لِلَّذِیْنَ یُؤْلُوْنَ مِنْ نِّسَآىِٕهِمْ تَرَبُّصُ اَرْبَعَةِ اَشْهُرٍ ۚ— فَاِنْ فَآءُوْ فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఎవరైతే తమ భార్యలతో సంభోగం చేయమని ప్రమాణం చేస్తారో వారి కొరకు నాలుగు మాసాల కన్న ఎక్కువ కాకుండా వేచి చూడాలి.గడువు వారి ప్రమాణం చేసినప్పటి నుండి మొదలవుతుంది.దానినే ఈలా అని పిలుస్తారు.ఒక వేళ వారు దానిని (సంభోగం) వదలటం పై ప్రమాణం చేసిన తరువాత నాలుగు మాసాల గడువు లోపల లేద దాని కన్న తక్కువ వ్యవధిలో తమ భార్యలతో సంభోగించటం వైపునకు మరలితే నిశ్చయంగా అల్లాహ్ వారి ద్వారా జరిగిన దానిని మన్నించే వాడును,ఈ ప్రమాణము నుండి బయటపడే మార్గముగా పరిహారమును విధించి వారి పై కరుణించే వాడును.
Tafsyrai arabų kalba:
وَاِنْ عَزَمُوا الطَّلَاقَ فَاِنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟
విడాకుల ఉద్దేశంతో తమ భార్యలతో సంభోగం చేయకుండా వదిలేయటం కొనసాగిస్తే ,దాని వైపు నుంచి మరలక పోతే నిశ్చయంగా అల్లాహ్ వారి మాటలను వేటి ద్వారా నైతే విడాకులు నిర్ధారితమవుతున్నాయో వినే వాడు,వారి ఉద్దేశాలు,వారి స్థితుల పట్ల జ్ఞానమును కలవాడు.తొందరలోనే వాటి పరంగానే వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَالْمُطَلَّقٰتُ یَتَرَبَّصْنَ بِاَنْفُسِهِنَّ ثَلٰثَةَ قُرُوْٓءٍ ؕ— وَلَا یَحِلُّ لَهُنَّ اَنْ یَّكْتُمْنَ مَا خَلَقَ اللّٰهُ فِیْۤ اَرْحَامِهِنَّ اِنْ كُنَّ یُؤْمِنَّ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— وَبُعُوْلَتُهُنَّ اَحَقُّ بِرَدِّهِنَّ فِیْ ذٰلِكَ اِنْ اَرَادُوْۤا اِصْلَاحًا ؕ— وَلَهُنَّ مِثْلُ الَّذِیْ عَلَیْهِنَّ بِالْمَعْرُوْفِ ۪— وَلِلرِّجَالِ عَلَیْهِنَّ دَرَجَةٌ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟۠
విడాకులు పొందిన స్త్రీలు మూడు ఋతువుల వరకు వేచి ఉండాలి ఆ మధ్య కాలంలో వివాహం చేసుకోరాదు.ఒక వేళ వారు అల్లాహ్ పై,అంతిమ దినం పై విశ్వాసంలో సత్యవంతులైతే వారి గర్భంలో అల్లాహ్ సృష్టించిన పిండమును దాచటం వారి కొరకు సమ్మతం కాదు.ఒక వేళ వారికి విడాకులిచ్చిన భర్తలు ప్రేమతో కలుపుకునే ఉద్దేశంతో,దేని కారణంతో విడాకులివ్వడం జరిగిందో దానిని దూరం చేసే ఉద్దేశంతో తమ భార్యలను తమ వైపునకు మరల్చుకోవాలనుకుంటే విడాకులివ్వబడిన స్త్రీలు ఇద్దత్ గడువులో మరల్చబడడానికి ఎక్కువ హక్కుదారులు.తమ భర్తలకి తమ పై హక్కులు,బాధ్యతలు ఉన్నట్లే భార్యలకి ఉన్నవని ప్రజలకు తెలుసు.కానీ వారి పై భర్తలకు భద్రత,విడాకుల విషయంలో ఒకింత స్థానం ఎక్కువగా ఉంటుంది.అల్లాహ్ సర్వాధిక్యుడు.అతని పై ఏ వస్తువు ఆధిక్యతను చూప లేదు,శాసించడంలో,నిర్వహణలో అతడు వివేచనాపరుడు.
Tafsyrai arabų kalba:
اَلطَّلَاقُ مَرَّتٰنِ ۪— فَاِمْسَاكٌ بِمَعْرُوْفٍ اَوْ تَسْرِیْحٌ بِاِحْسَانٍ ؕ— وَلَا یَحِلُّ لَكُمْ اَنْ تَاْخُذُوْا مِمَّاۤ اٰتَیْتُمُوْهُنَّ شَیْـًٔا اِلَّاۤ اَنْ یَّخَافَاۤ اَلَّا یُقِیْمَا حُدُوْدَ اللّٰهِ ؕ— فَاِنْ خِفْتُمْ اَلَّا یُقِیْمَا حُدُوْدَ اللّٰهِ ۙ— فَلَا جُنَاحَ عَلَیْهِمَا فِیْمَا افْتَدَتْ بِهٖ ؕ— تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَعْتَدُوْهَا ۚ— وَمَنْ یَّتَعَدَّ حُدُوْدَ اللّٰهِ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟
భర్తకు తన నిర్ణయం నుండి మరలి వచ్చే అవకాశం రెండు విడాకుల వరకు ఉంటుంది.అతడు మొదటి విడాకులు ఇస్తాడు.అతరువాత తన నిర్ణయం నుండి మరలుతాడు,మరల విడాకులు ఇస్తాడు,ఆ తరువాత తన నిర్ణయం నుండి మరలుతాడు.రెండు విడాకుల తరువాత తన భార్యను సత్ప్రవర్తనతో తన బంధంలో ఉంచుకుంటే ఉంచుకోవచ్చు,లేదా ఆమెకు మేలు చేస్తు,ఆమె హక్కులను నిర్వర్తిస్తు మూడవ విడాకులివ్వాలి.ఓ భర్తల్లారా మీ భార్యలకు మీరు ఇచ్చిన మహర్లో నుంచి కొంచెం కూడా తీసుకోవటం సమ్మతం కాదు.కాని స్త్రీ తన భర్త నీతి నడవడికలు,అతని రూపు రేకల కారణంగా అయిష్టత చూపితే భర్యాభర్తలిద్దరు ఈ అయిష్టత కారణంగా తమ పై ఉన్న హక్కులను నిర్వర్తించడంలో లోపం కలుగుతుందని సందేహం కలిగితే వారిరువురు తమ సమస్యను తమ దగ్గరి బంధువుల ముందట లేదా ఇతరుల ముందు పెట్టాలి.ఒక వేళ సంరక్షకులు వారిరువురు తమ మధ్య వివాహ హక్కులను నిర్వర్తించటంలో లోపం కనబరుస్తారని భయపడితే భార్య భర్తకు విడాకులకు బదులుగా ధనమును ఇచ్చి ఖులా తీసుకుంటే వారిద్దరి పై ఎటువంటి దోషం లేదు.ధార్మిక ఈ ఆదేశాలు హలాల్ ,హరామ్ మధ్య వేరు చేస్తున్నవి.అయితే మీరు వాటిని అతిక్రమించకండి.హలాల్,హరామ్ మధ్య అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారందరు తమ కొరకు వినాశనమునకు కారకాలను కొని తెచ్చుకుని అల్లహ్ ఆగ్రహానికి,ఆయన శిక్షకు గురి అయ్యే దుర్మార్గులు.
Tafsyrai arabų kalba:
فَاِنْ طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهٗ مِنْ بَعْدُ حَتّٰی تَنْكِحَ زَوْجًا غَیْرَهٗ ؕ— فَاِنْ طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَیْهِمَاۤ اَنْ یَّتَرَاجَعَاۤ اِنْ ظَنَّاۤ اَنْ یُّقِیْمَا حُدُوْدَ اللّٰهِ ؕ— وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ یُبَیِّنُهَا لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟
ఒక వేళ భర్త తన భార్యకు మూడవ విడాకులు ఇస్తే వేరే వ్యక్తితో హలాలా ఉద్దేశంతో కాకుండా ఇష్టతతో నిజమైన వివాహం చేసుకుని ఆ నికాహ్ బంధంలో అతను (రెండొవ భర్త) ఆమెతో సంభోగించనంత వరకు ఆమెతో అతను (మొదటి భర్త) సరి కొత్త వివాహం చేసుకొనటం సమ్మతం కాదు.ఒక వేళ రెండోవ భర్త ఆమెను విడాకులిస్తే లేదా చనిపోతే భార్య,మొదటి భర్త వారిద్దరు తమపై ఉన్న ధర్మ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పూర్తి నమ్మకం ఉంటే సరి కొత్త నికాహ్,మహర్ ద్వారా మరలటంలో వారిరువురిపై ఎటువంటి పాపం లేదు.ధర్మం యొక్క ఈ ఆదేశాలను ప్రజల కొరకు వారు అతని ఆదేశాలను,హద్దులను తెలుసుకోవటానికి అల్లాహ్ వివరించి తెలుపుతున్నాడు.ఎందుకంటే వాటి ద్వారా లబ్ది పొందేవారు వారే.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• بيَّن الله تعالى أحكام النكاح والطلاق بيانًا شاملًا حتى يعرف الناس حدود الحلال والحرام فلا يتجاوزونها.
ప్రజలు హలాల్,హరామ్ ని తెలుసుకుని వాటిని జవదాట కుండా ఉండేంతవరకు అల్లాహ్ నికాహ్,తలాఖ్ ఆదేశాలను సమగ్రంగా ప్రకటించాడు.

• عظَّم الله شأن النكاح وحرم التلاعب فيه بالألفاظ فجعلها ملزمة، وألغى التلاعب بكثرة الطلاق والرجعة فجعل لها حدًّا بطلقتين رجعيتين ثم تحرم عليه إلا أن تنكح زوجا غيره ثم يطلقها، أو يموت عنها.
అల్లాహ్ నికాహ్ విషయమునకు గొప్ప వైభవాన్ని ప్రసాదించాడు. పదాలను తప్పనిసరి చేసి వాటితో ఆట్లాడటంను నిషేదించాడు. పదే పదే విడాకులు,వాటి నుంచి మరలింపును ఎక్కువ చేసి ఆట్లాడటం సరైనది కాదని తెలియపరచాడు. అందుకనే రెండు సార్లు మరలింపు కల విడాకుల ద్వారా హద్దును నియమించాడు. ఆ తరువాత భార్యను వేరే వ్యక్తి వివాహం చేసుకుని విడాకులిస్తే లేదా మరణిస్తే తప్ప భర్త పై నిషేధించాడు.

• المعاشرة الزوجية تكون بالمعروف، فإن تعذر ذلك فلا بأس من الطلاق، ولا حرج على أحد الزوجين أن يطلبه.
వైవాహిక జీవితం మంచి తనము తో కొనసాగుతుంది,ఒక వేళ అది సాధ్యం కానప్పుడు విడాకులు తీసుకోవటంలో అభ్యంతరం లేదు,దాన్ని కోరటంలో భార్యభర్తల్లోంచి ఎవరి పై దోషం లేదు.

وَاِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَبَلَغْنَ اَجَلَهُنَّ فَاَمْسِكُوْهُنَّ بِمَعْرُوْفٍ اَوْ سَرِّحُوْهُنَّ بِمَعْرُوْفٍ ۪— وَلَا تُمْسِكُوْهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوْا ۚ— وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهٗ ؕ— وَلَا تَتَّخِذُوْۤا اٰیٰتِ اللّٰهِ هُزُوًا ؗ— وَّاذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَیْكُمْ وَمَاۤ اَنْزَلَ عَلَیْكُمْ مِّنَ الْكِتٰبِ وَالْحِكْمَةِ یَعِظُكُمْ بِهٖ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟۠
మరియు మీరు మీ భార్యలకు విడాకులు ఇచ్చి వారికి వారి గడువు ముగింపు ఆసన్నమైనప్పుడు వారిని మేలుతో మీ వివాహ బంధంలో మరల్చుకోండి లేదా మేలుతో వారిని వారి గడువు పూర్తి అయ్యేవరకు వదిలి వేయండి.వారిపై ధ్వేషమును ప్రదర్శించటానికి,వారికి నష్టం కలిగించటానికి మీరు అజ్ఞాన కాలంలో చేసే విధంగా వివాహ బంధంలో మరల్చుకోకండి.ఎవరైతే ఈ విధంగా వారికి నష్టం కలిగించే ఉద్దేశంతో చేస్తారో వారు తమ పై పాపాన్ని,శిక్షను పిలుపునిచ్చి దుర్మార్గమునకు పాల్పడ్డారు.మీరు అల్లాహ్ ఆయతులతో ఆట్లాడటం,వాటి పై ధైర్యాన్ని ప్రదర్శించి వాటిని పరిహాసంగా చేయకండి.మీరు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకోండి .వాటిలో గొప్పదైన మీ పై అవతరించిన ఖుర్ఆన్,సున్నతును గుర్తు చేసుకోండి.మీ కొరకు కోరికను పెంచడాన్ని,భయపెట్టడానికి దాని ద్వారా మీకు హితోపదేశం చేస్తున్నాడు.ఆయన ఆదేశాలను పాటిస్తు,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడండి.అల్లాహ్ సర్వజ్ఞుడని తెలుసుకోండి.ఆయన నుండి ఏ వస్తువు దాగి ఉండదు.త్వరలోనే అతడు మీ ఆచరణలపై మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَاِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَبَلَغْنَ اَجَلَهُنَّ فَلَا تَعْضُلُوْهُنَّ اَنْ یَّنْكِحْنَ اَزْوَاجَهُنَّ اِذَا تَرَاضَوْا بَیْنَهُمْ بِالْمَعْرُوْفِ ؕ— ذٰلِكَ یُوْعَظُ بِهٖ مَنْ كَانَ مِنْكُمْ یُؤْمِنُ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— ذٰلِكُمْ اَزْكٰی لَكُمْ وَاَطْهَرُ ؕ— وَاللّٰهُ یَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟
మరియు మీరు మీ భార్యలకు మూడు కన్న తక్కువ (ఒకటి,రెండు) విడాకులు ఇచ్చినప్పుడు వారి గడువు (ఇద్దత్) ముగిస్తే ఓ సంరక్షకులారా మీరు వారిని ఆపకండి.అప్పుడు వారి భార్యల వైపు సరికొత్త నికాహ్ బంధం ద్వారా వారు (బార్యలు) దానిని ఆశించినప్పుడు తమ భర్తలతో పాటు పరస్పర అంగీకారంతో మరలటం జరుగును.వారిని వారించబడిన ఈ ఆదేశం ద్వారా మీలో నుండి అల్లాహ్ పై అంతిమ దినం పై విశ్వాసం కలిగిన వారికి హితోపదేశం చేయబడుతుంది.అది మీలో మేలును ఎక్కువగా వృద్ది పరుస్తుంది,మీ మానమర్యాదలను,మీ ఆచరణలను మాలిన్యాల నుండి అధికంగా పరిశుద్ధ పరుస్తుంది.మరియు అల్లాహ్ కు విషయాల వాస్తవికత గురించి,వాటి పరిణామాల గురించి జ్ఞానమున్నది,మీకు వాటి గురించి జ్ఞానము లేదు.
Tafsyrai arabų kalba:
وَالْوَالِدٰتُ یُرْضِعْنَ اَوْلَادَهُنَّ حَوْلَیْنِ كَامِلَیْنِ لِمَنْ اَرَادَ اَنْ یُّتِمَّ الرَّضَاعَةَ ؕ— وَعَلَی الْمَوْلُوْدِ لَهٗ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوْفِ ؕ— لَا تُكَلَّفُ نَفْسٌ اِلَّا وُسْعَهَا ۚ— لَا تُضَآرَّ وَالِدَةٌ بِوَلَدِهَا وَلَا مَوْلُوْدٌ لَّهٗ بِوَلَدِهٖ ۗ— وَعَلَی الْوَارِثِ مِثْلُ ذٰلِكَ ۚ— فَاِنْ اَرَادَا فِصَالًا عَنْ تَرَاضٍ مِّنْهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَیْهِمَا ؕ— وَاِنْ اَرَدْتُّمْ اَنْ تَسْتَرْضِعُوْۤا اَوْلَادَكُمْ فَلَا جُنَاحَ عَلَیْكُمْ اِذَا سَلَّمْتُمْ مَّاۤ اٰتَیْتُمْ بِالْمَعْرُوْفِ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
తల్లులు తమ సంతానమును రెండు సంవత్సరములు పూర్తిగా పాలు త్రాపించాలి.ఈ రెండు సంవత్సరముల పరిమితి పాలు పట్టించే గడువును పూర్తి చేయదలుచుకున్న వారి కొరకు ఉన్నది.విడాకులివ్వబడిన పాలు పట్టించే తల్లుల భోజన,వస్త్ర ఖర్చు బాధ్యత పిల్ల వాడి తండ్రి పై ఉంటుంది.అది ప్రజలకు తెలిసిన ప్రకారంగా ధర్మానికి విరుద్ధంగా కాకుండా ఉంటుంది.అల్లాహ్ ఏ ప్రాణము పై కూడా తన శక్తికి,స్థోమతకు మించి బాధ్యతను మోపడు.తల్లిదండ్రుల్లోంచి ఏ ఒక్కరికి సంతానమును ఎదుటి వారికి నష్టం కలిగించే కారకంగా చేయటం సమ్మతం కాదు.తండ్రి లేని పక్షంలో,పిల్ల వాడి కొరకు ధనం లేకపోతే పిల్ల వాడి వారసులపై తండ్రి హక్కులే ఉంటాయి.ఒక వేళ తల్లిదండ్రులిరువురు రెండు సంవత్సరములు పూర్తి కాకముందే పిల్లవాడికి పాలు పట్టించటంను పరస్పర సంప్రతింపులు,పరస్పర అంగీకరం తరువాత పిల్లవాడి బాగోగు కొరకు వదిలి వేయదలుచుకుంటే వారిద్దరిపై ఆ విషయంలో ఏ పాపముండదు.ఒక వేళ మీ పిల్లల కొరకు తల్లులను కాకుండా వేరే పాలు పట్టించే స్త్రీలను కోరుకుంటే వారికి వేతనము,పిల్లవాడికి మీరు ఖర్చు చేయవలసింది వాయిదా వేయకుండా,తగ్గించకుండా ఇవ్వండి.అల్లాహ్ ఆదేశాలను పాటించటంలో,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కు భయపడుతూ ఉండండి.మీరు చేస్తున్న కార్యాలను ఆయన వీక్షిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి.అందులో నుంచి ఏది ఆయనకు గోప్యంగా లేదు.మీరు ముందు పంపించుకున్న ఆచరణలకి ప్రతిఫలాన్ని ఆయన తొందరలోనే మీకు ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• نهي الرجال عن ظلم النساء سواء كان بِعَضْلِ مَوْلِيَّتِه عن الزواج، أو إجبارها على ما لا تريد.
తమ ఆదీనంలో ఉన్న స్త్రీని వివాహం నుండి ఆపటం ద్వారా కాని లేదా ఆమెకు ఇష్టం లేని విషయంలో బలవంతం చేయటం ద్వారా కాని స్త్రీలను హింసించటం నుండి మగ వారికి వారింపు.

• حَفِظَ الشرع للأم حق الرضاع، وإن كانت مطلقة من زوجها، وعليه أن ينفق عليها ما دامت ترضع ولده.
తన భర్త నుండి విడాకులివ్వబడిన తల్లి కొరకు పాలును పట్టించే హక్కును ధర్మం సంరక్షించింది.మరియు ఆమె అతని పిల్లవాడికి పాలు పట్టిస్తున్నంత వరకు ఆమెపై ఖర్చు చేసే బాధ్యత అతనిపై (భర్త) ఉన్నది.

• نهى الله تعالى الزوجين عن اتخاذ الأولاد وسيلة يقصد بها أحدهما الإضرار بالآخر.
అల్లాహ్ తఆలా భార్యాభర్తలిద్దరు ఒకరు ఇంకొకరిని సంతానమును నష్టం చేసే కారకంగా తయారు చేసుకోవటం నుండి వారించాడు.

• الحث على أن تكون كل الشؤون المتعلقة بالحياة الزوجية مبنية على التشاور والتراضي بين الزوجين.
వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రతీ విషయం భార్యాభర్తలిద్దరి పరస్పర సంప్రతింపులు,పరస్పర అంగీకారంతో జరగాలని ప్రోత్సహించడం జరిగింది.

وَالَّذِیْنَ یُتَوَفَّوْنَ مِنْكُمْ وَیَذَرُوْنَ اَزْوَاجًا یَّتَرَبَّصْنَ بِاَنْفُسِهِنَّ اَرْبَعَةَ اَشْهُرٍ وَّعَشْرًا ۚ— فَاِذَا بَلَغْنَ اَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَیْكُمْ فِیْمَا فَعَلْنَ فِیْۤ اَنْفُسِهِنَّ بِالْمَعْرُوْفِ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟
మరియు ఎవరైతే తమ వెనుక గర్భిణీలు కాని భార్యలను వదలి మరణిస్తారో,అటువంటి స్త్రీలు నాలుగు మాసాల పది రోజుల గడువు వరకు తమను తాము తప్పనిసరిగా ఆపుకోవాలి.వారు ఆ దినముల్లో తమ భర్త ఇంటి నుండి బయటకు రావటం నుండి,అలంకరణ నుండి,వివాహం నుండి ఆగి ఉండాలి.ఈ గడువు పూర్తైనప్పుడు ఓ సంరక్షకులారా వారు (ఆ స్త్రీలు) తమ తరుపు నుండి ఆ గడువులో వారింపబడిన వాటిని ధర్మపరంగా,సమాజంలో గుర్తింపు పొందిన విధంగా సంస్కారమైన విధానంలో చేస్తే మీ పై ఎటువంటి దోషం లేదు.మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కు బాగా తెలుసు.మీ బాహ్యంలో,మీ అంతరంగంలో ఉన్నవి ఏవీ ఆయనకు గోప్యం కావు.త్వరలోనే ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَلَا جُنَاحَ عَلَیْكُمْ فِیْمَا عَرَّضْتُمْ بِهٖ مِنْ خِطْبَةِ النِّسَآءِ اَوْ اَكْنَنْتُمْ فِیْۤ اَنْفُسِكُمْ ؕ— عَلِمَ اللّٰهُ اَنَّكُمْ سَتَذْكُرُوْنَهُنَّ وَلٰكِنْ لَّا تُوَاعِدُوْهُنَّ سِرًّا اِلَّاۤ اَنْ تَقُوْلُوْا قَوْلًا مَّعْرُوْفًا ؕ۬— وَلَا تَعْزِمُوْا عُقْدَةَ النِّكَاحِ حَتّٰی یَبْلُغَ الْكِتٰبُ اَجَلَهٗ ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا فِیْۤ اَنْفُسِكُمْ فَاحْذَرُوْهُ ۚ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَفُوْرٌ حَلِیْمٌ ۟۠
వితంతువు లేదా మూడు సార్లు విడాకులు పొందిన స్త్రీ కి ఇద్దత్ కాలంలో నికాహ్ కోరికను సూచన ప్రాయంగా ప్రకటించకుండా తెలపటంలో ఎటువంటి దోషం లేదు,ఉదాహరణకి మీరు ఇలా పలకటం :నీ ఇద్దత్ పూర్తయిన తరువాత నాకు తెలియపరచు.ఇద్దత్ గడుపుతున్న స్త్రీ తో ఇద్దత్ పూర్తయిన తరువాత నికాహ్ చేసుకునే కోరికను మీ మనసుల్లో దాచి ఉంచటం వలన మీ పై ఎటువంటి దోషం లేదు.వారి విషయంలో మీ యొక్క కోరిక ఎక్కువగా ఉండటం వలన మీరు వారికి తొందరలోనే తెలియ పరుస్తారని అల్లాహ్ కు తెలుసు,అందుకనే ప్రకటించకుండా సూచన ప్రాయంగా తెలపటంను ఆయన మీ కొరకు సమ్మతించాడు.వారితో వివాహం గురించి వారు ఇద్దత్లో ఉన్నప్పుడు రహస్యంగా వారితో ఒట్టు వేయించుకోవటం నుండి జాగ్రత్త పడండి.కాని మంచిని ఉద్దేశించి మాటలైతే సరి,అవి కూడా బహిర్గతంగా ఉండాలి.ఇద్దత్ కాలంలో నికాహ్ ఒప్పందాన్ని నిశ్చయం చేయకండి.మీ అంతర్యాల్లో దాచిన విషయాలను సయితం అల్లాహ్ తెలుసుకుంటాడని గుర్తుంచుకోండి.వాటిలో నుంచి మీ కొరకు సమ్మతించినవి మరియు మీ పై నిషేదించినవి ఉండవచ్చు,మీరు వాటి విషయంలో జాగ్రత్తపడండి.ఆయన ఆదేశమును వ్యతిరేకించకండి.మరియు నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి క్షమాపణ కోరే వారిని క్షమిస్తాడన్న విషయాన్ని,అతడు మృధు స్వభావి శిక్షించటంలో తొందర పడడని గుర్తుంచుకోండి.
Tafsyrai arabų kalba:
لَا جُنَاحَ عَلَیْكُمْ اِنْ طَلَّقْتُمُ النِّسَآءَ مَا لَمْ تَمَسُّوْهُنَّ اَوْ تَفْرِضُوْا لَهُنَّ فَرِیْضَةً ۖۚ— وَّمَتِّعُوْهُنَّ ۚ— عَلَی الْمُوْسِعِ قَدَرُهٗ وَعَلَی الْمُقْتِرِ قَدَرُهٗ ۚ— مَتَاعًا بِالْمَعْرُوْفِ ۚ— حَقًّا عَلَی الْمُحْسِنِیْنَ ۟
ఒక వేళ మీరు మీ భార్యలను వివాహం అయిన తరువాత సంభోగించకుండానే మహర్ ను నిర్ధారించకుండానే విడాకులిస్తే మీ పై ఎటువంటి దోషం లేదు.ఆ స్థితిలో వారికి మీరు విడాకులిస్తే మీరు వారికి మహర్ ను చెల్లించవలసిన అవసరం లేదు.కాని వారికి ప్రయోజనకరమైన వస్తువును వారి మనసుల పటుత్వమును చేకూర్చటానికి ఇవ్వాలి.స్థోమతను బట్టి స్థితిమంతుడు ఎక్కువ ధనమును లేదా పేద వాడు తక్కువ ధనమును ఇవ్వాలి.తమ కార్యాల్లో,తమ వ్యవహారాల్లో ఈ విధంగా ఇవ్వటం అన్నది ఉత్తమంగా వ్యవహరించే వారిపై విధిగా నిర్ణయించబడినది.
Tafsyrai arabų kalba:
وَاِنْ طَلَّقْتُمُوْهُنَّ مِنْ قَبْلِ اَنْ تَمَسُّوْهُنَّ وَقَدْ فَرَضْتُمْ لَهُنَّ فَرِیْضَةً فَنِصْفُ مَا فَرَضْتُمْ اِلَّاۤ اَنْ یَّعْفُوْنَ اَوْ یَعْفُوَا الَّذِیْ بِیَدِهٖ عُقْدَةُ النِّكَاحِ ؕ— وَاَنْ تَعْفُوْۤا اَقْرَبُ لِلتَّقْوٰی ؕ— وَلَا تَنْسَوُا الْفَضْلَ بَیْنَكُمْ ؕ— اِنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
ఒక వేళ మీరు మీ భార్యలకు సంభోగము తరువాత మహర్ ను నిర్ధారించిన తరువాత విడాకులిస్తే వారికి మీరు నిర్ణీత మహర్లో నుంచి సగం సొమ్మును ఇవ్వటం తప్పనిసరి.ఒక వేళ వారు హేతుబద్దంగా మీ కొరకు మన్నించి వదిలి పెడితే లేదా భర్తలు స్వయంగా భార్యల కొరకు నిర్ధారిత సగం మహర్ ను పూర్తిగా మన్నించి వేస్తే అది వేరే విషయం.మీ మధ్య హక్కుల విషయంలో పరస్పర మన్నింపుల వైఖరి అల్లాహ్ భయభీతి,ఆయన పై విధేయత చూపటంకు చాలా సన్నిహితమైనది.ఓ ప్రజలారా మీరు హక్కుల విషయంలో పరస్పర మన్నింపు వైఖరిని,మీలో ఒకరిపై ఒకరు ప్రాధాన్యతనివ్వటంను వదలకండి.నిశ్చయంగా అల్లాహ్ మీ కర్మలను వీక్షిస్తున్నాడు.అయితే మీరు అల్లాహ్ ప్రతిఫలాన్ని పొందటం కొరకు సత్కార్యాల్లో కృషి చేయండి.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• مشروعية العِدة على من توفي عنها زوجها بأن تمتنع عن الزينة والزواج مدة أربعة أشهر وعشرة أيام.
భర్త చనిపోయిన భార్యలు (వితంతువులు) అలంకరణ నుండి,వివాహము నుండి దూరంగా ఉండే గడువు (యిద్దత్) నాలుగు మాసముల పది దినములు ధర్మబద్దంగా చేయబడినది.

• معرفة المؤمن باطلاع الله عليه تَحْمِلُه على الحذر منه تعالى والوقوف عند حدوده.
విశ్వాసపరుడు అల్లాహ్ తనను గమనించి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంటే అది అతనికి అల్లాహ్ తో భయపడడానికి,ఆయన హద్దుల వద్ద ఆగటానికి దోహద పడుతుంది.

• الحث على المعاملة بالمعروف بين الأزواج والأقارب، وأن يكون العفو والمسامحة أساس تعاملهم فيما بينهم.
భార్యాభర్తల మధ్య,బంధువుల మధ్య సత్ప్రవర్తన గురించి ప్రోత్సహించటం,క్షమాపణ, పరస్పర మన్నింపుల వైఖరి వారి మధ్య సత్ప్రవర్తనకు పునాది కావాలి.

حٰفِظُوْا عَلَی الصَّلَوٰتِ وَالصَّلٰوةِ الْوُسْطٰی ۗ— وَقُوْمُوْا لِلّٰهِ قٰنِتِیْنَ ۟
మీరు నమాజులను అల్లాహ్ ఆదేశమునకు అనుగుణంగా పరిపూర్ణంగా పాటిస్తూ వాటిని కాపాడుకోండి. మరియు మీరు నమాజుల మధ్య ఉన్న మాధ్యమిక నమాజును కాపాడుకోండి,అది అసర్ నమాజు. మరియు మీరు మీ నమాజులలో అల్లాహ్ కొరకు వినయవిధేయతతో,అణుకువతో నిలబడండి.
Tafsyrai arabų kalba:
فَاِنْ خِفْتُمْ فَرِجَالًا اَوْ رُكْبَانًا ۚ— فَاِذَاۤ اَمِنْتُمْ فَاذْكُرُوا اللّٰهَ كَمَا عَلَّمَكُمْ مَّا لَمْ تَكُوْنُوْا تَعْلَمُوْنَ ۟
ఒక వేళ శతృవు వలన,అటువంటిదే ఏదైన మూలంగా మీరు భయాందోళనలకు గురై మీరు దానిని (నమాజును) పరిపూర్ణంగా పాటించలేకపోతే నడుస్తూ లేదా ఒంటెపై,గుర్రంపై,అలాంటిదే దేనిపైన స్వారీ చేస్తూ లేదా మీకు సౌలభ్యమైన ఏ విధంగానైన నమాజును పాటించండి. మీ నుండి భయాందోళనలు దూరమైనప్పుడు మీరు అల్లాహ్ ను వివిధరకాలుగా స్మరించండి. అందులో నుంచి నమాజు, దానిని పరిపూర్ణంగా చేయండి, ఏవిధంగానైతే సన్మార్గం గురించి,వెలుగు గురించి మీకు తెలియని జ్ఞానమును ఆయన మీకు తెలియజేశాడో.
Tafsyrai arabų kalba:
وَالَّذِیْنَ یُتَوَفَّوْنَ مِنْكُمْ وَیَذَرُوْنَ اَزْوَاجًا ۖۚ— وَّصِیَّةً لِّاَزْوَاجِهِمْ مَّتَاعًا اِلَی الْحَوْلِ غَیْرَ اِخْرَاجٍ ۚ— فَاِنْ خَرَجْنَ فَلَا جُنَاحَ عَلَیْكُمْ فِیْ مَا فَعَلْنَ فِیْۤ اَنْفُسِهِنَّ مِنْ مَّعْرُوْفٍ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟
మీలో నుంచి మరణించి తమ వెనుక భార్యలను వదిలి వెళ్ళే వారు వారు (భార్యలు)నివాసము,భరణం ద్వారా పూర్తి ఒక సంవత్సరం లబ్ది పొందుతారని మీ వారసులు వారిని బలవంతాన వారికి చెందవలసిన దాని నుండి వెళ్ళగొట్ట కూడదని వారి కొరకు వీలునామ వ్రాయటం వారిపై (భర్తలపై) బాధ్యత. మృతుని కొరకు పూర్తి చేయాలి. ఒక వేళ వారు సంవత్సరం పూర్తవకముందే తమ తరుపు నుండి బయటకు వెళ్ళి పోతే వారు తమ స్వయాన అలంకరణ చేసుకుంటే,సువాసన పూసుకుంటే మీపై,వారిపై ఎటువంటి దోషం లేదు.అల్లాహ్ సర్వాధిక్యుడు,ఆయనపై ఎవరూ ఆధిక్యతను చూపలేరు. తన కార్యనిర్వహణలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు.ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు చాలామంది ఈ వాఖ్యములో ఉన్న ఆదేశము '' మీలో ఎవరయినా మరణించి వారు భార్యలను వదిలి పోతే అటువంటి స్త్రీలు నాలుగు మాసాల పది రోజుల వరకూ తమనుతాము గడువులో ఆపుకోవాలి '' ( సూరతుల్ బఖ్రా-234 ) అన్న ఆయత్ ద్వారా రద్దు పరచబడినదని తెలిపారు.
Tafsyrai arabų kalba:
وَلِلْمُطَلَّقٰتِ مَتَاعٌ بِالْمَعْرُوْفِ ؕ— حَقًّا عَلَی الْمُتَّقِیْنَ ۟
విడాకులివ్వబడిన స్త్రీలకు విడాకుల వలన విరిగిన మనసులను కలపటానికి ప్రయోజనకరమైన వస్తువు దుస్తులు,ధనము,ఇంకా ఏదైన వస్తువును ఇవ్వటం వారి హక్కు,దాని ద్వారా వారు ప్రయోజనం చెందాలి. సమాజమునకు అనుకూలంగా భర్త స్థితిని బట్టి అతను ధనికుడా లేదా పేద వాడా చూడాలి. ఈ ఆదేశం అల్లాహ్ ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటున్న దైవభీతి కలవారి పై స్థిరమైన హక్కు.
Tafsyrai arabų kalba:
كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟۠
ఓ విశ్వాసపరులారా మునుపటి ప్రకటన లాగానే తన నిభందనలు,తన ఆదేశాలు కలిగిన ఆయతులను మీరు అర్ధం చేసుకుని వాటి ప్రకారంగా ఆచరిస్తారని మీ కొరకు వివరిస్తున్నాడు. దాని వలన మీరు ఇహపరాల్లో మేలును పొందగలుగుతారు.
Tafsyrai arabų kalba:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ خَرَجُوْا مِنْ دِیَارِهِمْ وَهُمْ اُلُوْفٌ حَذَرَ الْمَوْتِ ۪— فَقَالَ لَهُمُ اللّٰهُ مُوْتُوْا ۫— ثُمَّ اَحْیَاهُمْ ؕ— اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَی النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَشْكُرُوْنَ ۟
ఓ ప్రవక్త ప్లేగు వ్యాధి లేదా అటువంటిదేదో కారణం చేత మరణమునకు భయపడి చాలా మంది తమ ఇండ్ల నుండి బయటకు వచ్చేసిన వారి సమాచారము మీకు చేరలేదా,వారు ఇస్రాయీల్ సంతతికి చెందిన ఒక వర్గం. అల్లాహ్ వారితో చనిపోమని ఆదేశించాడు,వారు చనిపోయారు. ప్రతీ అధికారం తన చేతిలో ఉన్నదని,వారికి తమకు లాభం చేసుకోవటానికి,నష్టం చేసుకోవటానికి ఎటువంటి అధికారం లేదు అని తెలియపరచటానికి మరల వారిని బ్రతికింపజేశాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రజలపై ప్రసాదించే వాడును,దయ చూపే వాడును. కాని చాలా మంది అల్లాహ్ కి ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలుపుకోరు.
Tafsyrai arabų kalba:
وَقَاتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ ధర్మానికి సహాయంగా,ఆయన కలిమాను ఉన్నత శిఖరాలకు చేర్చటానికి అల్లాహ్ శతృవులతో పోరాడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ మాటలను వింటున్నాడని,మీ ఉద్దేశాలను,మీ ఆచరణలను తెలుసుకుంటాడని ,వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడని మీరు తెలుసుకోండి.
Tafsyrai arabų kalba:
مَنْ ذَا الَّذِیْ یُقْرِضُ اللّٰهَ قَرْضًا حَسَنًا فَیُضٰعِفَهٗ لَهٗۤ اَضْعَافًا كَثِیْرَةً ؕ— وَاللّٰهُ یَقْبِضُ وَیَبْصُۜطُ ۪— وَاِلَیْهِ تُرْجَعُوْنَ ۟
రుణం ఇచ్చే వారి కార్యం చేసేవాడు ఎవడైన ఉన్నాడా,అతడు తన సంపదను మంచి ఉద్దేశంతో,సహృదయంతో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తాడు,అది ఎన్నోరెట్లు అధికం అయ్యి అతని వద్దకు చేరుతుంది. మరియు అల్లాహ్ ఉపాధిని,ఆరోగ్యమును ఇతరత్రా వాటిని కుదించి వేస్తాడు,తన వివేకముతో,తన న్యాయముతో వాటిని విస్తరింపజేస్తాడు. ఆయన ఒక్కడి వైపే పరలోకంలో మీరు మరలింపబడుతారు. అతడు మీకు కర్మల ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• الحث على المحافظة على الصلاة وأدائها تامة الأركان والشروط، فإن شق عليه صلَّى على ما تيسر له من الحال.
నమాజును దాని పూర్తి భాగాలతో,షరతులతో పాటించి రక్షించటం పై ప్రోత్సాహం,వాటిని పాటించటంలో ఇబ్బందిగా ఉంటే స్థితిని బట్టి సౌలభ్యమైన పద్దతిలో నమాజును పాటించటం.

• رحمة الله تعالى بعباده ظاهرة، فقد بين لهم آياته أتم بيان للإفادة منها.
అల్లాహ్ తన ఆయతులను వాటి ద్వారా లబ్ది పొందటం కొరకు తన దాసులకు పూర్తిగా వివరించి వారిపై ప్రత్యక్షంగా కరుణించాడు.

• أن الله تعالى قد يبتلي بعض عباده فيضيِّق عليهم الرزق، ويبتلي آخرين بسعة الرزق، وله في ذلك الحكمة البالغة.
నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి కొంత మంది ఆహారోపాధిని కుదించి పరీక్షిస్తాడు. మరి కొందరి ఆహారోపాధిని విస్తరింపజేసి పరీక్షిస్తాడు. అందులో ఆయన గొప్ప జ్ఞానం ఉన్నది.

اَلَمْ تَرَ اِلَی الْمَلَاِ مِنْ بَنِیْۤ اِسْرَآءِیْلَ مِنْ بَعْدِ مُوْسٰی ۘ— اِذْ قَالُوْا لِنَبِیٍّ لَّهُمُ ابْعَثْ لَنَا مَلِكًا نُّقَاتِلْ فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ— قَالَ هَلْ عَسَیْتُمْ اِنْ كُتِبَ عَلَیْكُمُ الْقِتَالُ اَلَّا تُقَاتِلُوْا ؕ— قَالُوْا وَمَا لَنَاۤ اَلَّا نُقَاتِلَ فِیْ سَبِیْلِ اللّٰهِ وَقَدْ اُخْرِجْنَا مِنْ دِیَارِنَا وَاَبْنَآىِٕنَا ؕ— فَلَمَّا كُتِبَ عَلَیْهِمُ الْقِتَالُ تَوَلَّوْا اِلَّا قَلِیْلًا مِّنْهُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ ۟
ఓ ప్రవక్తా! మీకీవిషయం అందలేదా- మూసా అలైహిస్సలాం కాలం తరువాత ఇస్రాయీలు సంతతిలోని ప్రముఖుల సమాచారం. వారపుడు వారి ప్రవక్తతో అన్నారు : మాకొరకు ఒక రాజు ను నియమించండి, మేము అతనితో అల్లాహ్ మార్గంలో యుద్ధం చేస్తాము. అపుడు వారి ప్రవక్త వారితో అన్నారు : ఒకవేళ అల్లాహ్, మీపై అల్లాహ్ మార్గంలో పోరాడడాన్ని విధిగా చేస్తే మీరు పోరాడుతారా లేదా ? వారిలోని వెనుదిరిగి పోవాలనుకున్నవారు అన్నారు : అల్లాహ్ మార్గంలో పోరాడటం నుంచి మమ్మల్ని ఏ విషయం అడ్డుకుంటుంది మేము ఉన్నదే దాని కొరకైతే ? మా విరోధులు మా గ్రామాల నుంచి మమల్ని తరిమివేశారు, మా పిల్లల్ని ఖైదీలుగా చేసారు. మా గ్రామాలను పొందటానికి, మా బందీలను విడిపించటానికి మేము పోరాడాము. తీరా యుద్ధం విధిగా చేయబడినప్పుడు, వారిలో కొద్ది మంది మినహా మిగిలినవారంతా వెన్నుచూపారు. వాగ్దానాన్ని పూర్తి చేయలేదు. తన ఆజ్ఞను ధిక్కరించిన దుర్మార్గులను, తన వాగ్ధాన భంగం చేసిన వారిని అల్లాహ్ బాగా ఎరుగు. దీనికి త్వరలోనే ప్రతిఫలాన్ని పొందుతారు.
Tafsyrai arabų kalba:
وَقَالَ لَهُمْ نَبِیُّهُمْ اِنَّ اللّٰهَ قَدْ بَعَثَ لَكُمْ طَالُوْتَ مَلِكًا ؕ— قَالُوْۤا اَنّٰی یَكُوْنُ لَهُ الْمُلْكُ عَلَیْنَا وَنَحْنُ اَحَقُّ بِالْمُلْكِ مِنْهُ وَلَمْ یُؤْتَ سَعَةً مِّنَ الْمَالِ ؕ— قَالَ اِنَّ اللّٰهَ اصْطَفٰىهُ عَلَیْكُمْ وَزَادَهٗ بَسْطَةً فِی الْعِلْمِ وَالْجِسْمِ ؕ— وَاللّٰهُ یُؤْتِیْ مُلْكَهٗ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ ۟
వారి ప్రవక్త వారితో అన్నారు : అతని నేతృత్వంలో పోరాడటానికి అల్లాహ్ మీ కొరకు తాలూత్ ను మీపై రాజుగా నియమించాడు. ఈ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ, విముఖత చూపినవారు ఇలా ఆన్నారు : అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది ? రాజ్యాధికారానికి అతనికన్నా మేమే ఎక్కువ హక్కుదారులం. అతను రాకుమారుడు కూడా కాదు, పాలించటానికి సిరిసంపదల్లో కూడా అతనికి విస్త్రుతి ఒసగబడలేదే? వారి ప్రవక్త వారితో ఇలా అన్నారు : అల్లాహ్ అతన్నే మీపై నాయకునిగా ఎన్నుకున్నాడు. జ్ఞానంలో విస్త్రుతిని, శరీరంలో బలాన్ని అధికంగా ఇచ్చాడు. తన కారుణ్యంతో,వివేకంతో అల్లాహ్ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్ తాను కోరిన వారికి విశాలంగా ఇస్తాడు. తన సృష్టిలో అర్హులెవరో బాగా తెలిసినవాడు.
Tafsyrai arabų kalba:
وَقَالَ لَهُمْ نَبِیُّهُمْ اِنَّ اٰیَةَ مُلْكِهٖۤ اَنْ یَّاْتِیَكُمُ التَّابُوْتُ فِیْهِ سَكِیْنَةٌ مِّنْ رَّبِّكُمْ وَبَقِیَّةٌ مِّمَّا تَرَكَ اٰلُ مُوْسٰی وَاٰلُ هٰرُوْنَ تَحْمِلُهُ الْمَلٰٓىِٕكَةُ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لَّكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟۠
వారి ప్రవక్త వారితో ఇలా అన్నారు : మీపై అతన్ని రాజుగా నియమించటానికి గొప్ప నిదర్శనం ఏమిటంటే అల్లాహ్ తాబూత్ ను మీకు తిరిగి ప్రసాదిస్తాడు. ఆ పెట్టెలో ఇస్రాయీల్ వంశీయుల వైభవం, అందులో గుండె నిబ్బరం, మూసా,హారూన్ కుటుంబీకులు వదిలి వెళ్ళిన అవశేషాలు ఉన్నాయి. ఉదాహరణకు కర్ర. కొన్ని పత్రాలు. నిస్సందేహంగా ఇందులో మీకు స్పష్టమైన నిదర్శనం ఉంది ఒకవేళ మీరు నిజవిశ్వాసులైతే.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• التنبيه إلى أهم صفات القائد التي تؤهله لقيادة الناس؛ وهي العلم بما يكون قائدًا فيه، والقوة عليه.
ప్రజలకు నాయకత్వం వహించటానికి అతి ముఖ్యమైన లక్షణాలు ఉండాలి అని చెప్పబడింది. జ్ఞానం ఉండాలి , అలాగే బలం ఉండాలి.

• إرشاد من يتولى قيادة الناس إلى ألا يغتر بأقوالهم حتى يبلوهم، ويختبر أفعالهم بعد أقوالهم.
ఎవరు ప్రజలకు నాయకత్వం వహిస్తారో వారు వారిని పరీక్షించే వరకు వారి మాటలతో మోసపోకూడదు. వారి మాటల తరువాత వారి చేష్టలను పరీక్షించాలి.

• أن الاعتبارات التي قد تشتهر بين الناس في وزن الآخرين والحكم عليهم قد لا تكون هي الموازين الصحيحة عند الله تعالى، بل هو سبحانه يصطفي من يشاء من خلقه بحكمته وعلمه.
ఇతరులను తూకమేయటంలో,వారిపై ఆదేశం ఇవ్వటంలో ప్రజల మధ్య ప్రసిద్ధి చెందిన పరిగణలు అల్లాహ్ వద్ద సరైన పరిగణలు కాకపోవచ్చు. అంతే కాదు పరిశుద్ధుడైన ఆయన తన సృష్టిరాసుల్లోంచి తాను తలచుకున్న వారిని తన విజ్ఞతతో మరియు తన జ్ఞానంతో ఎన్నుకుంటాడు.

فَلَمَّا فَصَلَ طَالُوْتُ بِالْجُنُوْدِ ۙ— قَالَ اِنَّ اللّٰهَ مُبْتَلِیْكُمْ بِنَهَرٍ ۚ— فَمَنْ شَرِبَ مِنْهُ فَلَیْسَ مِنِّیْ ۚ— وَمَنْ لَّمْ یَطْعَمْهُ فَاِنَّهٗ مِنِّیْۤ اِلَّا مَنِ اغْتَرَفَ غُرْفَةً بِیَدِهٖ ۚ— فَشَرِبُوْا مِنْهُ اِلَّا قَلِیْلًا مِّنْهُمْ ؕ— فَلَمَّا جَاوَزَهٗ هُوَ وَالَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ ۙ— قَالُوْا لَا طَاقَةَ لَنَا الْیَوْمَ بِجَالُوْتَ وَجُنُوْدِهٖ ؕ— قَالَ الَّذِیْنَ یَظُنُّوْنَ اَنَّهُمْ مُّلٰقُوا اللّٰهِ ۙ— كَمْ مِّنْ فِئَةٍ قَلِیْلَةٍ غَلَبَتْ فِئَةً كَثِیْرَةً بِاِذْنِ اللّٰهِ ؕ— وَاللّٰهُ مَعَ الصّٰبِرِیْنَ ۟
తాలూత్ సైన్యాన్ని నగరం నుండి తీసుకుని బయలుదేరినప్పుడు వారితో ఇలా అన్నారు: నిస్సందేహంగా అల్లాహ్ ఒక కాలువ ద్వారా మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. అందులోని నీళ్ళని త్రాగినవాడు నా మార్గంలో లేడు. పోరాటంలో నాతో ఉండడు. త్రాగనివాడు మాత్రమే నా మార్గంలోనివాడు. పోరాటంలో నాతొ ఉంటాడు. చేత్తో గుక్కెడు నీరు త్రాగితే పర్వాలేదు. కాని కొద్దిమంది తప్ప మిగిలిన వారంతా త్రాగేశారు.కొద్దిమంది మాత్రం తీవ్ర దాహం ఉన్నప్పటికీ త్రాగకుండా సహనం వహించారు. తాలూత్ విశ్వాసులైన తన సైన్యంతో కాలువ దాటి ముందుకు సాగిపోతున్నప్పుడు, వారి సైన్యంలోని కొందరు ఇలా అన్నారు: జాలూత్తో, అతని సైన్యంతో తలపడే శక్తి ఈరోజు మాలో లేదు. కాని ప్రళయ దినాన అల్లాహ్ను కలుసు కోవలసి ఉందనే దృఢవిశ్వాసం గలవారు ఇలా అన్నారు: విశ్వాసుల ఒక చిన్న వర్గం, తిరస్కారుల ఒక పెద్ద వర్గాన్ని అల్లాహ్ ఆజ్ఞతో, సహాయంతో జయించటం ఎన్నోసార్లు జరిగింది. నీతి ఏమిటంటే సహాయం విశ్వాసంతో ఉంది, మెజారిటి [సంఖ్య]తో కాదు.అల్లాహ్ తన దాసుల్లోని సహనం చూపే వారికి అండగా ఉంటాడు. వారికి సహాయం అందిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَلَمَّا بَرَزُوْا لِجَالُوْتَ وَجُنُوْدِهٖ قَالُوْا رَبَّنَاۤ اَفْرِغْ عَلَیْنَا صَبْرًا وَّثَبِّتْ اَقْدَامَنَا وَانْصُرْنَا عَلَی الْقَوْمِ الْكٰفِرِیْنَ ۟ؕ
జాలూత్తో,మరియు అతని సైన్యంతో ముఖాముఖీ అయినప్పుడు వారు అల్లాహ్ వైపు మరలి ఇలా వేడుకున్నారు: ప్రభూ మా హృదయాలకు సహనాన్ని పుష్కలంగా ప్రసాదించు,మా ముందే మా శత్రువు ఓడిపోయేంతవరకు మా కాళ్ళకు నిలకడను ఇవ్వు. నీ తోడ్పాటు,శక్తితో అవిశ్వాసులపై మాకు సహాయపడు.
Tafsyrai arabų kalba:
فَهَزَمُوْهُمْ بِاِذْنِ اللّٰهِ ۙ۫— وَقَتَلَ دَاوٗدُ جَالُوْتَ وَاٰتٰىهُ اللّٰهُ الْمُلْكَ وَالْحِكْمَةَ وَعَلَّمَهٗ مِمَّا یَشَآءُ ؕ— وَلَوْلَا دَفْعُ اللّٰهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَّفَسَدَتِ الْاَرْضُ وَلٰكِنَّ اللّٰهَ ذُوْ فَضْلٍ عَلَی الْعٰلَمِیْنَ ۟
కడకు అల్లాహ్ ఆజ్ఞతో వారు వారిని[జాలూత్ సైన్యాన్ని] ఓడించారు. వారి నాయకుడైన జాలూత్ను దావూద్ సంహరించాడు.అల్లాహ్ దావూద్కు రాజ్యాధికారాన్ని, ప్రవక్త పదవిని ఇచ్చాడు. తాను కోరినంతా జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు.కొందరిని మరికొందరి ద్వారా వారి అలజడులను తొలగించటం అల్లాహ్ సంప్రదాయం కాకుంటే- అలజడులను రేకెత్తించేవారితో భువిలో కల్లోలం ప్రబలిఉండేది. కాని అల్లాహ్ లోకవాసులపై ఎంతో అనుగ్రహం కలవాడు.
Tafsyrai arabų kalba:
تِلْكَ اٰیٰتُ اللّٰهِ نَتْلُوْهَا عَلَیْكَ بِالْحَقِّ ؕ— وَاِنَّكَ لَمِنَ الْمُرْسَلِیْنَ ۟
ఇవి స్పష్టమైన, దృఢమైన అల్లాహ్ చిహ్నాలు. ఓ ప్రవక్తా! మేము మీకు వీటిని వినిపిస్తున్నాము. విషయాల్లో సత్యత, ఆదేశాల్లో న్యాయం ఉంటుంది. నిస్సందేహంగా నువ్వు సకల లోకాల ప్రభువు తరపు నుండి దైవసందేశహరులలోని వాడవు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• من حكمة القائد أن يُعرِّض جيشه لأنواع الاختبارات التي يتميز بها جنوده ويعرف الثابت من غيره.
నాయకుని వివేకంలోని ఒక విషయం ఏమిటంటే తన సైన్యాన్ని అనేక విధాలుగా పరీక్షీంచవచ్చు అందులో ఎవరు స్థిరత్వాన్ని కలిగి ఉన్నారో ,ఎవరు లేరో తెలుసుకోవచ్చు.

• العبرة في النصر ليست بمجرد كثرة العدد والعدة فقط، وإنما معونة الله وتوفيقه أعظم الأسباب للنصر والظَّفَر.
నీతి ఏమిటంటే భారీ సంఖ్యలోనో, పెద్ద బలగంలోనో విజయం లేదు. విజయానికి, గెలుపుకి అల్లాహ్ యొక్క సహాయం, సౌభాగ్యం గొప్ప కారణాలు.

• لا يثبت عند الفتن والشدائد إلا من عَمَرَ اليقينُ بالله قلوبَهم، فمثل أولئك يصبرون عند كل محنة، ويثبتون عند كل بلاء.
ఎవరి హృదయంలో అల్లాహ్ నమ్మకాన్ని నింపాడో వారు తప్ప ఇతరులు ఉపద్రవ, క్లిష్టమైన స్థితిలో నిలకడను చూపలేరు.

• الضراعة إلى الله تعالى بقلب صادق متعلق به من أعظم أسباب إجابة الدعاء، ولا سيما في مواطن القتال.
యుధ్ధ సమయంలో ఉన్నప్పటికీ, నిర్మల మనస్సుతో అల్లాహ్నుఅతిదీనంగా వేడుకోవటం దుఆల స్వీకరణకు ఒక గొప్ప సాధనం.

• من سُنَّة الله تعالى وحكمته أن يدفع شر بعض الخلق وفسادهم في الأرض ببعضهم.
అల్లాహ్ యొక్క సిద్ధాంతంలోని, ఆయన వివేకంలోని విషయం ఏమిటంటే భువిలో కొందరు రేకెత్తించే అరాచకం, చెడును మరికొందరి ద్వారా రుపుమాపుతాడు.

تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلٰی بَعْضٍ ۘ— مِنْهُمْ مَّنْ كَلَّمَ اللّٰهُ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجٰتٍ ؕ— وَاٰتَیْنَا عِیْسَی ابْنَ مَرْیَمَ الْبَیِّنٰتِ وَاَیَّدْنٰهُ بِرُوْحِ الْقُدُسِ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ مَا اقْتَتَلَ الَّذِیْنَ مِنْ بَعْدِهِمْ مِّنْ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنٰتُ وَلٰكِنِ اخْتَلَفُوْا فَمِنْهُمْ مَّنْ اٰمَنَ وَمِنْهُمْ مَّنْ كَفَرَ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ مَا اقْتَتَلُوْا ۫— وَلٰكِنَّ اللّٰهَ یَفْعَلُ مَا یُرِیْدُ ۟۠
మేము నీకు ఈ దైవసందేశహరుల గురించి ప్రస్తావించాము۔ దైవవాణి విషయంలో,అనుచరుల విషయంలో,స్థానముల విషయంలో వారిలో కొందరిని మేము కొందరిపై ప్రాధాన్యతను ప్రసాదించాము. వారిలో నుంచి అల్లాహ్ సంభాషించిన మూసా అలైహిస్సలాం లాంటి వారు ఉన్నారు. మరియు వారిలో నుంచి ఆయన ఉన్నత స్థానాలు ప్రసాదించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు. ఆయన ప్రజలందరి వైపు పంపించబడ్డ ప్రవక్త మరియు ఆయనతో దైవదౌత్యం పరిసమాప్తి చేయబడింది. మరియు ఆయన సమాజమునకు ఇతర సమాజములపై ఘనత ప్రసాదించబడినది. మరియు మేము మర్యమ్ కుమారుడగు ఈసా అలైహిస్సలాంనకు ఆయన దైవదౌత్యముపై సూచించే స్పష్టమైన మహిమలను ప్రసాదించాము. ఉదాహరణకు : పుట్టుగుడ్డినీ,కుష్టు రోగిని నయం చేయటం. మరియు మేము ఆయనకు జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ ఆదేశమును చేసే బలము ఆయనకు కలగటం కొరకు మద్దతునిచ్చాము. ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే ప్రవక్తల తరువాత వచ్చినవారు తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కలహించుకునేవారు కాదు. కాని వారు విబేధించుకుని విడిపోయారు. వారిలో నుండి అల్లాహ్ ను విశ్వసించిన వారు ఉన్నారు. మరియు వారిలో నుండి ఆయనను తిరస్కరించినవారు ఉన్నారు. ఒక వేళ అల్లాహ్ వారు కలహించుకోకూడదని తలచుకుంటే వారు కలహించుకునేవారు కాదు. కాని అల్లాహ్ తాను తలచుకున్న దాన్ని చేస్తాడు. కాబట్టి ఆయన తాను తలచుకున్న వారికి తన కారుణ్యము,అనుగ్రహము ద్వారా విశ్వాసం వైపునకు మార్గదర్శకం చేస్తాడు. మరియు తాను తలచుకున్న వారికి తన న్యాయము,విజ్ఞత ద్వారా అపమార్గమునకు లోను చేస్తాడు.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَنْفِقُوْا مِمَّا رَزَقْنٰكُمْ مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَ یَوْمٌ لَّا بَیْعٌ فِیْهِ وَلَا خُلَّةٌ وَّلَا شَفَاعَةٌ ؕ— وَالْكٰفِرُوْنَ هُمُ الظّٰلِمُوْنَ ۟
అల్లాహ్ ను విశ్వసిస్తూ ఆయన ప్రవక్తలను అనుసరించే ప్రజలారా! పునరుత్థాన దినం రాక ముందే, అల్లాహ్ మీకు ప్రసాదించిన వివిధ రకాల ఆమోదయోగ్యమైన సంపదల నుండి ఖర్చు చేయండి. ఆ దినాన, ఒక వ్యక్తి తనకు ఉపయోగపడే వస్తువులు కొనుక్కునేందుకు ఎలాంటి అమ్మకమూ ఉండదు, కష్టకాలంలో పనికి వచ్చే ఏ స్నేహమూ మిగిలి ఉండదు, అల్లాహ్ అనుమతి లేకుండా అతడిని ఎలాంటి హాని నుండైనా కాపాడే లేదా అతడికి ఎలాంటి ప్రయోజనాన్నైనా చేకూర్చే మధ్యవర్తిత్వమూ ఉండదు. నిజానికి అల్లాహ్ పై తమ విశ్వాసాన్ని దాయడం వలన, అవిశ్వాసులు దౌర్జన్యపరులవుతారు.
Tafsyrai arabų kalba:
اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— اَلْحَیُّ الْقَیُّوْمُ ۚ۬— لَا تَاْخُذُهٗ سِنَةٌ وَّلَا نَوْمٌ ؕ— لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— مَنْ ذَا الَّذِیْ یَشْفَعُ عِنْدَهٗۤ اِلَّا بِاِذْنِهٖ ؕ— یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ ۚ— وَلَا یُحِیْطُوْنَ بِشَیْءٍ مِّنْ عِلْمِهٖۤ اِلَّا بِمَا شَآءَ ۚ— وَسِعَ كُرْسِیُّهُ السَّمٰوٰتِ وَالْاَرْضَ ۚ— وَلَا یَـُٔوْدُهٗ حِفْظُهُمَا ۚ— وَهُوَ الْعَلِیُّ الْعَظِیْمُ ۟
కేవలం ఒక్క అల్లాహ్ మాత్రమే ఆరాధింప బడటానికి అర్హుడు. కేవలం ఆయన మాత్రమే ఎలాంటి మరణమూ లేదా లోపమూ లేకుండా సంపూర్ణంగా జీవించేవాడు. ఆయన స్వయంగా ఉనికిలో ఉన్నాడు మరియు ఆయనకు తన సృష్టిలోని దేని అవసరమూ / ఎవ్వరి అవసరమూ లేదు. ఆయన ద్వారానే సృష్టి ఉనికిలో ఉన్నది మరియు సృష్టికి ఎల్లప్పుడూ ఆయన అవసరం ఉన్నది. తన జీవితం మరియు ఉనికి యొక్క పరిపూర్ణత కారణంగా ఆయనకు కునుకూ పట్టదు, నిదురా రాదు. భూమ్యాకాశాలను కేవలం ఆయన మాత్రమే నియంత్రిస్తాడు. ఆయన సమ్మతి మరియు అనుమతి లేకుండా, ఎవ్వరూ ఆయన సమక్షంలో సిఫారసు చేయలేరు. పూర్వం ఏమి జరిగిందో మరియు భవిష్యత్తులో ఏమి జరగ బోతుందో ఆయన బాగా ఎరుగును. ఆయన అపారమైన జ్ఞానంలో సృష్టికి ఎలాంటి భాగస్వామ్యముూ లేదు, ఒకవేళ అందులో నుండి ఏదైనా కొంతభాగం వారికి ప్రసాదించ దలిస్తే తప్ప. ఆయన కుర్సీ సువిశాలమైన భూమ్యాకాశాలను ఆవరించి ఉన్నది. భూమ్యాకాశాలను రక్షించడం ఆయనకు ఏ మాత్రం కష్టం కాదు. ఆయన తన స్వభావము మరియు లక్షణాలలో ఉన్నతుడు, తన ఆధిపత్యము మరియు అధికారములలో ఘనుడు.
Tafsyrai arabų kalba:
لَاۤ اِكْرَاهَ فِی الدِّیْنِ ۚ— قَدْ تَّبَیَّنَ الرُّشْدُ مِنَ الْغَیِّ ۚ— فَمَنْ یَّكْفُرْ بِالطَّاغُوْتِ وَیُؤْمِنْ بِاللّٰهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقٰی ۗ— لَا انْفِصَامَ لَهَا ؕ— وَاللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ ۟
ఇస్లాం ధర్మం స్వీకరించమని ఎవ్వరినీ బలవంతం చేయరాదు. ఎందుకంటే ఇది స్పష్టంగా నిజమైన ధర్మం, దీనిని విశ్వసించమని ఎవరినీ బలవంతం చేయవలసిన అవసరం లేదు. అసత్యం నుండి సత్యం స్పష్టమై నిలుస్తుంది. ఎవరైతే అల్లాహ్ తో పాటు లేదా అల్లాహ్ కు సాటిగా ఆరాధించబడే వాటన్నింటినీ తిరస్కరిస్తారో మరియు స్వయంగా వాటిని త్యజిస్తారో; మరియు అల్లాహ్ పై మాత్రమే విశ్వాసం కలిగి ఉంటారో, అలాంటి వారు పునరుత్థాన రోజున మోక్షానికి చేర్చే బలమైన త్రాడును పట్టుకుని ఉన్నారు మరియు ఆ త్రాడు ఎన్నటికీ తెగదు. అల్లాహ్ తన దాసుల వాంగ్మూలాలకు సాక్ష్యమిస్తాడు, ఆయనకు వారి చర్యలు తెలుసు మరియు తదనుగుణంగా ఆయన వారికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• أن الله تعالى قد فاضل بين رسله وأنبيائه، بعلمه وحكمته سبحانه.
అల్లాహ్ తన జ్ఞానం మరియు వివేకంతో తన ప్రవక్తలకు మరియు సందేశహరులకు వేర్వేరు స్థానాలు కేటాయించాడు.

• إثبات صفة الكلام لله تعالى على ما يليق بجلاله، وأنه قد كلم بعض رسله كموسى ومحمد عليهما الصلاة والسلام.
అల్లాహ్ కొరకు ఆయన ఔన్నత్యమునకు తగిన విధంగా మాట్లాడే గుణము నిరూపణ. ఆయన నేరుగా కొందరు ప్రవక్తలతో మాట్లాడినాడు, ఉదాహరణకు మూసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం).

• الإيمان والهدى والكفر والضلال كلها بمشيئة الله وتقديره، فله الحكمة البالغة، ولو شاء لهدى الخلق جميعًا.
విశ్వాసం, మార్గదర్శకత్వం, అవిశ్వాసం మరియు సన్మార్గాన్ని విడిచి పెట్టడం మొదలైనవన్నీ అల్లాహ్ యొక్క చిత్తం మరియు ఆజ్ఞలపై ఆధారపడి ఉంటాయి. పరిపూర్ణమైన వివేకం కేవలం ఆయనకే చెందును: ఒకవేళ ఆయన తలుచుకుంటే, మొత్తం సృష్టికి మార్గనిర్దేశం చేసి ఉండేవాడు.

• آية الكرسي هي أعظم آية في كتاب الله، لما تضمنته من ربوبية الله وألوهيته وبيان أوصافه .
ఖుర్ఆన్ లోని అతి గొప్ప వచనం ఆయతుల్ కుర్సీ (2:255) వచనం, ఎందుకంటే అందులో అల్లాహ్ యొక్క ఏకత్వ (ఉలూహియా) లక్షణం మరియు ఆరాధింప బడే హక్కు కేవలం ఆయన మాత్రమే కలిగి ఉన్నాడనే (రుబూబియా) నిర్ధారణ, అలాగే ఆయనకు చెందిన కొన్ని దివ్యలక్షణాల స్పష్టీకరణ ప్రస్తావించ బడింది.

• اتباع الإسلام والدخول فيه يجب أن يكون عن رضًا وقَبول، فلا إكراه في دين الله تعالى.
అల్లాహ్ మార్గంలో ఎటువంటి బలవంతం, నిర్బంధం లేనందున ఇస్లాం ధర్మంలో ప్రవేశించి ముస్లిం కావాలనే నిర్ణయం పూర్తిగా తన హృదయపూర్వక అంగీకారం మరియు సుముఖతలపై ఆధారపడి ఉండాలి.

• الاستمساك بكتاب الله وسُنَّة رسوله أعظم وسيلة للسعادة في الدنيا، والفوز في الآخرة.
ఖుర్ఆన్ మరియు ప్రవక్త యొక్క సున్నతులను గట్టిగా పట్టుకోవడమే ఈ ప్రపంచంలో సుఖసంతోషాల్నిచ్చే మరియు మరణానంతర జీవితంలో విజయం సాధించి పెట్టే ఉత్తమ మార్గము.

اَللّٰهُ وَلِیُّ الَّذِیْنَ اٰمَنُوْا یُخْرِجُهُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ؕ۬— وَالَّذِیْنَ كَفَرُوْۤا اَوْلِیٰٓـُٔهُمُ الطَّاغُوْتُ یُخْرِجُوْنَهُمْ مِّنَ النُّوْرِ اِلَی الظُّلُمٰتِ ؕ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟۠
తన పై విశ్వాసం ఉంచిన వారిని అల్లాహ్ బాగా చూసుకుంటాడు. ఆయన వారికి సాఫల్యం మరియు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా, ఆయన వారిని అవిశ్వాసం మరియు అజ్ఞానంతో నిండిన చీకటి నుండి బయటికి తీసి, విశ్వాసం మరియు జ్ఞానంతో నిండిన వెలుగులోకి తీసుకు వెళతాడు. అవిశ్వాసుల స్నేహితులు - సాతాను మరియు అతని సహాయకులు. వారు అవిశ్వాసాన్ని వారికి ఆకర్షణీయంగా కనబడేలా చేస్తారు. ఇంకా, అవిశ్వాసులను విశ్వాసం మరియు జ్ఞానంతో నిండిన వెలుగు నుండి తప్పించి, అవిశ్వాసం మరియు అజ్ఞానంతో నిండిన చీకటిలోకి గెంటుతారు. అలాంటి ప్రజలే ఎల్లప్పుడూ నరకాగ్నిలో పడి ఉంటారు.
Tafsyrai arabų kalba:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْ حَآجَّ اِبْرٰهٖمَ فِیْ رَبِّهٖۤ اَنْ اٰتٰىهُ اللّٰهُ الْمُلْكَ ۘ— اِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّیَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ ۙ— قَالَ اَنَا اُحْیٖ وَاُمِیْتُ ؕ— قَالَ اِبْرٰهٖمُ فَاِنَّ اللّٰهَ یَاْتِیْ بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَاْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِیْ كَفَرَ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟ۚ
ఓ ప్రవక్తా! అల్లాహ్ యొక్క సార్వభౌమత్వం మరియు ఏకత్వం గురించి ఇబ్రాహీముతో వాదించిన తిరుగుబాటుదారుడి దురహంకారం గురించి మీకు తెలుసా? అల్లాహ్ యే అతనికి పరిపాలించే అధికారాన్ని ప్రసాదించాడు. కానీ, అతడు హద్దుమీరి, తనకు ప్రసాదించబడిన గౌరవ స్థానాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. తన ప్రభువు యొక్క దివ్యలక్షణాలను ఇబ్రాహీము అతడికి వివరిస్తూ, 'నా ప్రభువు సృష్టికి ప్రాణం పోస్తాడు మరియు వారికి మరణాన్ని ఇస్తాడు'. తిరుగుబాటుదారుడు మొండిగా, 'నేను కూడా జీవన్మరణాలు శాసించ గలను. నేను తలుచుకున్న వారిని చంపగలను మరియు నేను తలుచుకున్న వారిని క్షమించి విడిచి పెట్టగలను’. వెంటనే ఇబ్రాహీము అతడి ముందు మరో బలమైన వాదన పెట్టారు, 'నేను ఆరాధించే ప్రభువు సూర్యుడిని తూర్పు దిశలో ఉదయింప జేస్తాడు; కాబట్టి నీవు దానిని పడమటి దిశ నుండి ఉదయింపజేయి!' ఈ బలమైన వాదనతో తిరుగుబాటుదారుడికి దిమ్మతిరిగి పోయి, దిగ్భ్రాంతి చెందాడు. తమ అవిధేయత మరియు తిరుగుబాటు కారణంగా, అల్లాహ్ మార్గభ్రష్టులకు తన మార్గం వైపు మార్గనిర్దేశం చేయడానికి మరియు ఋజుమార్గం చూపడానికి అల్లాహ్ అనుమతించడు.
Tafsyrai arabų kalba:
اَوْ كَالَّذِیْ مَرَّ عَلٰی قَرْیَةٍ وَّهِیَ خَاوِیَةٌ عَلٰی عُرُوْشِهَا ۚ— قَالَ اَنّٰی یُحْیٖ هٰذِهِ اللّٰهُ بَعْدَ مَوْتِهَا ۚ— فَاَمَاتَهُ اللّٰهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهٗ ؕ— قَالَ كَمْ لَبِثْتَ ؕ— قَالَ لَبِثْتُ یَوْمًا اَوْ بَعْضَ یَوْمٍ ؕ— قَالَ بَلْ لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانْظُرْ اِلٰی طَعَامِكَ وَشَرَابِكَ لَمْ یَتَسَنَّهْ ۚ— وَانْظُرْ اِلٰی حِمَارِكَ۫— وَلِنَجْعَلَكَ اٰیَةً لِّلنَّاسِ وَانْظُرْ اِلَی الْعِظَامِ كَیْفَ نُنْشِزُهَا ثُمَّ نَكْسُوْهَا لَحْمًا ؕ— فَلَمَّا تَبَیَّنَ لَهٗ ۙ— قَالَ اَعْلَمُ اَنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
లేదా పైకప్పులు పడిపోయి, గోడలు కూలిపోయి, ప్రజలు చనిపోయి, నిర్మానుష్యంగా మారి, శిధిలమై పోయిన ఒక పట్టణం గుండా వెళ్ళిన వ్యక్తి యొక్క ఉపమానం మీకు తెలుసా? అతడు ఆశ్చర్యంగా, 'అల్లాహ్ ఈ ప్రజలను తిరిగి ఎలా బ్రతికిస్తాడో?' అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతడిని వంద సంవత్సరాల గడువు వరకు మరణింప జేసి, తర్వాత అతడిని తిరిగి బ్రతికించి, 'నీవు ఎంతకాలం వరకు చనిపోయి ఉన్నావు?' అని ప్రశ్నించాడు. దానికి అతడు ఇలా జవాబిచ్చాడు, 'నేను ఒక రోజు లేదా ఒక రోజు కన్నా తక్కువ ఆ స్థితిలో ఉన్నాను'. అప్పుడు అల్లాహ్ అతనితో ఇలా అన్నాడు, 'వాస్తవానికి, నీవు వంద సంవత్సరాలు అలా ఉన్నావు. నీ వద్ద నున్న ఆహారం వైపు చూడు, ఇంత సుదీర్ఘ కాలం గడిచి నప్పటికీ, అది కొంచెం కూడా చెడి పోకుండా ఎలా భద్రంగా ఉన్నదో! చెల్లాచెదురుగా పడి ఉన్న గాడిద ఎముకలను చూడు. నేను వాటిని ఎత్తి, ఒక చోట పోగు చేసి, వాటికి మాంసాన్ని తొడిగించి, మళ్ళీ ప్రాణం పోస్తాను’. దీనిని ప్రత్యక్షంగా చూడగానే, వాస్తవికత అతనికి స్పష్టమై పోయింది. తద్వారా అతడు అల్లాహ్ యొక్క అద్వితీయమైన శక్తిని గ్రహించి, సగౌరవంగా, 'అల్లాహ్కు అన్నింటిపై అధికారం ఉందని నాకు తెలుసు' అని అన్నాడు'.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• من أعظم ما يميز أهل الإيمان أنهم على هدى وبصيرة من الله تعالى في كل شؤونهم الدينية والدنيوية، بخلاف أهل الكفر.
విశ్వాసుల ప్రత్యేక లక్షణం ఏమిటంటే, అవిశ్వాసుల మాదిరిగా కాకుండా, వారి ప్రాపంచిక మరియు ధార్మిక పరమైన అన్నీ వ్యవహారాలలో అల్లాహ్ నుండి వారికి మార్గదర్శకత్వం మరియు అంతర్దృష్టి లభిస్తూ ఉంటుంది.

• من أعظم أسباب الطغيان الغرور بالقوة والسلطان حتى يعمى المرء عن حقيقة حاله.
తన సృష్టికర్తపై తిరుగుబాటు యొక్క ప్రధాన కారణాలలో ఒకటి ఏమిటంటే, అతడి శక్తి మరియు అధికారం ఆ వ్యక్తిని మోసగించి, వాస్తవికతను చూడలేని అంధుడిగా చేసి వేయడం.

• مشروعية مناظرة أهل الباطل لبيان الحق، وكشف ضلالهم عن الهدى.
సత్యాన్ని వివరించడానికి మరియు వారి తప్పిదాలను చూపించడానికి సత్యతిరస్కారులతో చర్చలు జరపడం ఆమోదయోగ్యమే.

• عظم قدرة الله تعالى؛ فلا يُعْجِزُهُ شيء، ومن ذلك إحياء الموتى.
అల్లాహ్ యొక్క శక్తి ఎంతో గొప్పది మరియు అతను జీవన్మరణాలను శాసించడంతో సహా ఏదైనా చేయగలడు.

وَاِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّ اَرِنِیْ كَیْفَ تُحْیِ الْمَوْتٰی ؕ— قَالَ اَوَلَمْ تُؤْمِنْ ؕ— قَالَ بَلٰی وَلٰكِنْ لِّیَطْمَىِٕنَّ قَلْبِیْ ؕ— قَالَ فَخُذْ اَرْبَعَةً مِّنَ الطَّیْرِ فَصُرْهُنَّ اِلَیْكَ ثُمَّ اجْعَلْ عَلٰی كُلِّ جَبَلٍ مِّنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ یَاْتِیْنَكَ سَعْیًا ؕ— وَاعْلَمْ اَنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟۠
ఓ ప్రవక్త! ఇబ్రాహీము ఇలా ప్రశ్నించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకో, 'నా ప్రభూ, చనిపోయినవారు తిరిగి ఎలా సజీవులు అవుతారో నాకు చూపించు'. దానికి అల్లాహ్ ఇలా బదులిచ్చాడు, ‘నీకు ఇందులో విశ్వాసం లేదా?’. ఇబ్రాహీము ఇలా జవాబిచ్చాడు, ‘నాకు విశ్వాసం ఉన్నది. కానీ, నా మనస్తృప్తి కోసం కోరుతున్నాను’. అప్పుడు అల్లాహ్ అతనికి ఇలా ఆదేశించాడు, ‘నాలుగు పక్షులను తీసుకుని, వాటిని మచ్చిక చేసుకో. ఆ తర్వాత వాటిని ముక్కలు ముక్కలు చేసి, ఆ ముక్కలను కలిపివేయి. తరువాత ఆ ముక్కలను నీ చుట్టుప్రక్కల ఉన్న ఒక్కో కొండపై ఉంచు. ఆ తర్వాత ఆ పక్షులను పిలువు. వెంటనే (వేర్వేరు కొండలపై ఉన్న పక్షుల ముక్కలలో ఆ యా పక్షులకు చెందిన ముక్కలు ఒక చోట చేరి,) అవి సజీవులై, ఎగురుకుంటూ నీ వద్దకు వస్తాయి. తెలుసుకో ఓ ఇబ్రాహీము! అల్లాహ్ తన అధికారము, ఆధిపత్యములో సాటిలేని వాడు, అంతేగాక తన ఉత్తర్వులలో మరియు శాసనాలలో ఎంతో వివేకవంతుడూను’.
Tafsyrai arabų kalba:
مَثَلُ الَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ كَمَثَلِ حَبَّةٍ اَنْۢبَتَتْ سَبْعَ سَنَابِلَ فِیْ كُلِّ سُنْۢبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ؕ— وَاللّٰهُ یُضٰعِفُ لِمَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ ۟
అల్లాహ్ మార్గంలో తమ సంపదను ఖర్చు చేసే విశ్వాసుల ప్రతిఫలం యొక్క ఉపమానం తన సారవంతమైన భూమిలో ఒక రైతు నాటిన ధాన్యపు గింజను పోలి ఉన్నది. ఈ ధాన్యపు గింజ ఏడు కంకులను ఉత్పత్తి చేస్తుంది, ప్రతీ కంకి వంద ధాన్యపు గింజలు కలిగి ఉంటుంది. అల్లాహ్ తన దాసులలో తనకు ఇష్టమైన వారి ప్రతిఫలాన్ని అనేక రెట్లు హెచ్చిస్తాడు మరియు వారికి లెక్కించలేనన్ని పుణ్యాలు ప్రసాదిస్తాడు. అల్లాహ్ అమితంగా దాతృత్వము చేసేవాడు మరియు అమితంగా ప్రసాదించేవాడు. తమ ప్రతిఫలం గుణించ బడటానికి ఎవరు అర్హులో ఆయనకు బాగా తెలుసు.
Tafsyrai arabų kalba:
اَلَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ ثُمَّ لَا یُتْبِعُوْنَ مَاۤ اَنْفَقُوْا مَنًّا وَّلَاۤ اَذًی ۙ— لَّهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۚ— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
అల్లాహ్ యొక్క విధేయత మరియు మెప్పు కోసం తమ సంపద ఖర్చు పెట్టేవారు తమ మాటలు లేదా చర్యల ద్వారా తాము చేసిన ఉపకారాన్ని ప్రజలకు ఎత్తి చూపుతూ తమ ప్రతిఫలాన్ని నాశనం చేసుకోరు మరియు తమ ప్రభువు నుండి వారు తప్పకుండా తమ ప్రతిఫలం అందుకుంటారు.
Tafsyrai arabų kalba:
قَوْلٌ مَّعْرُوْفٌ وَّمَغْفِرَةٌ خَیْرٌ مِّنْ صَدَقَةٍ یَّتْبَعُهَاۤ اَذًی ؕ— وَاللّٰهُ غَنِیٌّ حَلِیْمٌ ۟
ఒక విశ్వాసిని సంతోషపెట్టే మాట పలకడం లేదా చెడుగా వ్యవహరించిన వారిని క్షమించడం అనేది మాటిమాటికీ చేసిన ఉపకారాన్ని ఆ వ్యక్తికి ఎత్తి చూపటం వలన కలిగే హాని కంటే ఉత్తమమైనది. అల్లాహ్ కు తన దాసుల అవసరం లేదు; ఆయన వారిపై సహనం చూపిస్తూ ఉండటం వలన తరుచుగా ఆయన వారిని త్వరగా శిక్షించడు.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُبْطِلُوْا صَدَقٰتِكُمْ بِالْمَنِّ وَالْاَذٰی ۙ— كَالَّذِیْ یُنْفِقُ مَالَهٗ رِئَآءَ النَّاسِ وَلَا یُؤْمِنُ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— فَمَثَلُهٗ كَمَثَلِ صَفْوَانٍ عَلَیْهِ تُرَابٌ فَاَصَابَهٗ وَابِلٌ فَتَرَكَهٗ صَلْدًا ؕ— لَا یَقْدِرُوْنَ عَلٰی شَیْءٍ مِّمَّا كَسَبُوْا ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْكٰفِرِیْنَ ۟
అల్లాహ్ ను విశ్వసించే మరియు ఆయన ప్రవక్తను అనుసరించే ప్రజలారా! మీ దాతృత్వం గురించి ప్రగల్భాలు పలుకుతూ మరియు మీరు దానం ఇచ్చిన వ్యక్తిని బాధపెట్టడం ద్వారా మీ ప్రతిఫలాన్ని నాశనం చేసుకో వద్దు. అలాంటి తప్పు చేసే వ్యక్తి ప్రజలకు చూపడానికి మరియు ప్రశంసలు పొందటానికి ఖర్చు చేసిన వాడిగా, అల్లాహ్ పై విశ్వాసం మరియు పునరుత్థాన రోజున లభించబోయే ప్రతిఫలం మరియు శిక్షలపై విశ్వాసం లేనివాడిగా పరిగణించబడతాడు. దీని ఉపమానం, కొంత దుమ్మూ, ధూళి పడి ఉన్న మృదువైన రాయిని పోలి ఉన్నది: ఆ రాయిపై భారీ వర్షం పడినప్పుడు, దానిపై చేరిన దుమ్ము, ధూళి కొట్టుకు పోతుంది మరియు దానిపై ఏమీ లేకుండా, అది నున్నగా కనబడుతుంది. అదేవిధంగా, ఇతరులకు చూపించాలని చేసే పనుల మరియు దానధర్మాల ప్రతిఫలం అల్లాహ్ దృష్టిలో ఏమీ మిగలదు. అల్లాహ్ అవిశ్వాసులకు తను మెచ్చే వాటి వైపు మరియు వారికి ప్రయోజనం చేకూర్చే వాటి వైపు మార్గనిర్దేశం చేయడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• مراتب الإيمان بالله ومنازل اليقين به متفاوتة لا حد لها، وكلما ازداد العبد نظرًا في آيات الله الشرعية والكونية زاد إيمانًا ويقينًا.
విశ్వాసం యొక్క స్థాయిలు మరియు విశ్వాసం యొక్క దశలకు ఎలాంటి పరిమితి లేదు. దాసుడు అల్లాహ్ యొక్క షరయీ,విశ్వపు సూచనలను చూసినపప్పుడల్లా విశ్వసపరంగా,నమ్మకపరంగా అధికమవుతాడు.

• بَعْثُ الله تعالى للخلق بعد موتهم دليل ظاهر على كمال قدرته وتمام عظمته سبحانه.
ప్రజలు మరణించిన తరువాత మరలా వారి పునరుత్థానం అల్లాహ్ యొక్క పరిపూర్ణ సామర్థ్యం మరియు గొప్పతనానికి స్పష్టమైన నిదర్శనం.

• فضل الإنفاق في سبيل الله وعظم ثوابه، إذا صاحبته النية الصالحة، ولم يلحقه أذى ولا مِنّة محبطة للعمل.
ఎలాంటి చూపుగోలు మరియు చేసిన ఉపకారాన్ని ఎత్తి చూపడం వంటివి లేకుండా మంచి ఉద్దేశ్యంతో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తే, దానికి బదులుగా గొప్ప అనుగ్రహం మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నది.

• من أحسن ما يقدمه المرء للناس حُسن الخلق من قول وفعل حَسَن، وعفو عن مسيء.
ఒక వ్యక్తి చేయగలిగే ఒక ఉత్తమ పని ఏమిటంటే, మంచి పలుకుల ద్వారా లేదా మంచి పనుల ద్వారా, ఇంకా తనకు చెడు చేసిన వ్యక్తిని క్షమించడం ద్వారా తన మంచి ప్రవర్తన ప్రదర్శించడం.

وَمَثَلُ الَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمُ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ وَتَثْبِیْتًا مِّنْ اَنْفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ اَصَابَهَا وَابِلٌ فَاٰتَتْ اُكُلَهَا ضِعْفَیْنِ ۚ— فَاِنْ لَّمْ یُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
అల్లాహ్ యొక్క మన్నతును ఆశిస్తూ, తమ మనస్సులో అల్లాహ్ వాగ్దానం పై దృఢమైన నమ్మకంతో, అల్లాహ్ మార్గంలో తమ సంపదను వెచ్చించే విశ్వాసుల ఉపమానం – ‘మెరక ప్రాంతంలో ఉన్న సారవంతమైన భూమి వంటిది. ఒకవేళ దానిపై భారీ వర్షం కురిస్తే, అది రెట్టింపు పంటను ఉత్పత్తి చేస్తుంది. ఒక వేళ భారీ వర్షం కురవక పోయినా, భూమి సారవంతమైనది కనుక దానిపై పడే తేలికపాటి వర్షం సరిపోతుంది’. అదే విధంగా, చిత్తశుద్ధితో ఖర్చు చేసిన కొద్ది మొత్తాన్ని కూడా అల్లాహ్ అంగీకరిస్తాడు మరియు దాని ప్రతిఫలాన్ని హెచ్చిస్తాడు. అల్లాహ్ మీరు చేసే పనులను చూస్తున్నాడు: ఎవరు నిజాయితీపరుడో, ఎవరు కాదో ఆయన బాగా ఎరుగును మరియు ప్రతి ఒక్కరికీ ఆయన తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
اَیَوَدُّ اَحَدُكُمْ اَنْ تَكُوْنَ لَهٗ جَنَّةٌ مِّنْ نَّخِیْلٍ وَّاَعْنَابٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۙ— لَهٗ فِیْهَا مِنْ كُلِّ الثَّمَرٰتِ ۙ— وَاَصَابَهُ الْكِبَرُ وَلَهٗ ذُرِّیَّةٌ ضُعَفَآءُ ۖۚ— فَاَصَابَهَاۤ اِعْصَارٌ فِیْهِ نَارٌ فَاحْتَرَقَتْ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُوْنَ ۟۠
మీలో ఎవరైనా ఖర్జూరపు చెట్లు మరియు ద్రాక్ష తీగలు కలిగి ఉండి, మంచి నీటి సెలయేళ్ళు ప్రవహిస్తూ, అన్నీ రకాల పళ్ళుఫలాలు కలిగి ఉన్న తోటను కలిగి ఉండాలని కోరుకుంటున్నారా ?. తోట యజమాని వృద్ధాప్యం వలన ఇక పై పని చేసి సంపాదించలేని స్థితికి చేరుకున్నాడు. అతని పిల్లలు మరీ తక్కువ వయస్సులో ఉండటం వలన పని చేయలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు తీవ్రమైన మంటలతో కూడిన సుడిగాలి ఆ తోటను తాకింది. వృద్ధాప్యం మరియు బలహీనమైన చిన్న పిల్లలతో గడ్డుకాలం గడుపుతున్న అతడి అత్యంత అవసరమైన సమయంలోనే అది పూర్తిగా కాలిపోయింది. తన సంపదను ప్రజలకు చూపడానికి ఖర్చు చేసే వ్యక్తి పరిస్థితి ఈ మనిషి మాదిరిగానే ఉంటుంది. పునరుత్థాన దినమున అతడు అల్లాహ్ ముందు నిలబడిన తరువాత, అతనికి అత్యంత ఎక్కువగా అవసరమైన ఆ క్లిష్టసమయంలో అతని వద్ద పుణ్యఫలాలేవీ మిగిలి ఉండవు. ఈ విధంగా, మీరు శ్రద్ధగా ఆలోచించేందుకు, ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మీకు ఏమి ప్రయోజనకరంగా ఉంటుందో అల్లాహ్ మీకు వివరిస్తున్నాడు.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَنْفِقُوْا مِنْ طَیِّبٰتِ مَا كَسَبْتُمْ وَمِمَّاۤ اَخْرَجْنَا لَكُمْ مِّنَ الْاَرْضِ ۪— وَلَا تَیَمَّمُوا الْخَبِیْثَ مِنْهُ تُنْفِقُوْنَ وَلَسْتُمْ بِاٰخِذِیْهِ اِلَّاۤ اَنْ تُغْمِضُوْا فِیْهِ ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَنِیٌّ حَمِیْدٌ ۟
అల్లాహ్ పై విశ్వాసం ఉంచుతూ, ఆయన ప్రవక్తను అనుసరించే విశ్వాసులారా! మీరు సంపాదించిన స్వచ్ఛమైన, న్యాయమైన సంపద నుండి మరియు భూమి నుండి మేము మీ కోసం పండించిన ఉత్పత్తుల నుండి మాత్రమే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి. అలా ఖర్చు చేయడానికి నాసిరకం దాని కోసం వెతకకండి. ఎందుకంటే దానిని ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే, దాని నాణ్యత తక్కువగా ఉన్నందున మీరు తీసుకోవడానికి ఇష్టపడరు కదా! మరి, స్వయంగా మీ కోసం మీరు ఇష్టపడని దానిని అల్లాహ్ కు సమర్పించి, మీరు ఎలా సంతృప్తి చెందగలరు ? మీరు చేసే ఖర్చు అల్లాహ్ కు అస్సలు అవసరం లేదని తెలుసుకోండి. నిశ్చయంగా ఆయన తన ఉనికి మరియు దివ్యచర్యల ద్వారా ఆయన ప్రశంసించబడతాడు. పవిత్రమైన వాటిని మాత్రమే ఖర్చు చేయమని వారికి సూచించాడు.
Tafsyrai arabų kalba:
اَلشَّیْطٰنُ یَعِدُكُمُ الْفَقْرَ وَیَاْمُرُكُمْ بِالْفَحْشَآءِ ۚ— وَاللّٰهُ یَعِدُكُمْ مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ؕ— وَاللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ ۟
షైతాను మిమ్మల్ని పేదరికానికి భయపడేలా చేసి, పిసినారితనం వైపు ప్రేరేపిస్తాడు. ఇంకా వాడు మిమ్మల్ని పాపకార్యాల వైపు ఆహ్వానిస్తాడు. మరోవైపు అల్లాహ్ మీ పాపాలు క్షమిస్తానని మరియు మరింత ఉపాధి ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ ఎంతో ఔదార్యము గలవాడు మరియు తన దాసుల పరిస్థితి బాగా ఎరిగినవాడు.
Tafsyrai arabų kalba:
یُّؤْتِی الْحِكْمَةَ مَنْ یَّشَآءُ ۚ— وَمَنْ یُّؤْتَ الْحِكْمَةَ فَقَدْ اُوْتِیَ خَیْرًا كَثِیْرًا ؕ— وَمَا یَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ ۟
అల్లాహ్ తన దాసులలో నుండి ఎవరికైనా సరే, తమ పలుకులలో మరియు ఆచరణలలో స్థిరంగా ఉండగల సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. ఎవరికైతే అలాంటి సామర్థ్యం ప్రసాదించబడిందో, వారికి ఎంతో శుభం జరుగుతుంది. పరిపూర్ణ బుద్ధి కలవారు మాత్రమే అల్లాహ్ ఆయతుల ద్వారా ఉపదేశము పొందుతారు మరియు హితోపదేశం పొందుతారు. వారే ఆయన కాంతి ద్వారా వెలుగు పొందుతారు మరియు ఆయన ఋజుమార్గం ద్వారా మార్గం పొందుతారు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• المؤمنون بالله تعالى حقًّا واثقون من وعد الله وثوابه، فهم ينفقون أموالهم ويبذلون بلا خوف ولا حزن ولا التفات إلى وساوس الشيطان كالتخويف بالفقر والحاجة.
అల్లాహ్ ను విశ్వసించే నిజమైన విశ్వాసులు ఆయన వాగ్దానం మరియు ప్రతిఫలం గురించి ఖచ్చితమైన నమ్మకం కలిగి ఉంటారు: వారు తమ సంపదను ఎలాంటి భయం లేదా దుఃఖం లేకుండా,షైతాన్ దుష్ప్రేరణల వైపు చూడకుండా - ఉదాహరణకు పేదరికం,అవసరం గురించి భయపెట్టటం - ఖర్చు చేస్తారు.

• الإخلاص من أعظم ما يبارك الأعمال ويُنمِّيها.
చిత్తశుద్ధి ఆచరణలలో శుభాలను కలిగించే మరియు వాటిని పెంపొందించే గొప్ప సాధనం.

• أعظم الناس خسارة من يرائي بعمله الناس؛ لأنه ليس له من ثواب على عمله إلا مدحهم وثناؤهم.
తన మంచి పనులను, పుణ్యకార్యాలను ప్రజల ముందు ప్రదర్శించే వ్యక్తి అందరి కంటే ఎక్కువగా నష్టపోతాడు. ఎందుకంటే అతనికి లభించే ప్రతిఫలం కేవలం ప్రజల ప్రశంసలు మాత్రమే.

وَمَاۤ اَنْفَقْتُمْ مِّنْ نَّفَقَةٍ اَوْ نَذَرْتُمْ مِّنْ نَّذْرٍ فَاِنَّ اللّٰهَ یَعْلَمُهٗ ؕ— وَمَا لِلظّٰلِمِیْنَ مِنْ اَنْصَارٍ ۟
తనకు అవసరం లేకపోయినా, అల్లాహ్ మెప్పు కోసం లేదా అల్లాహ్ పేరున మొక్కుబడి కోసం చేసే ఏ పని గురించైనా సరే, అల్లాహ్ బాగా ఎరుగును. అది వ్యర్థం కాదు. దానికి బదులుగా ఆయన గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాడు. తమ బాధ్యతలు నెరవేర్చకపోవడం మరియు అల్లాహ్ విధించిన హద్దులను అధిగమించడం ద్వారా తప్పు చేసిన వారిని పునరుత్థాన దినం శిక్ష నుండి ఎవ్వరూ రక్షించలేరు.
Tafsyrai arabų kalba:
اِنْ تُبْدُوا الصَّدَقٰتِ فَنِعِمَّا هِیَ ۚ— وَاِنْ تُخْفُوْهَا وَتُؤْتُوْهَا الْفُقَرَآءَ فَهُوَ خَیْرٌ لَّكُمْ ؕ— وَیُكَفِّرُ عَنْكُمْ مِّنْ سَیِّاٰتِكُمْ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟
మీరు చేస్తున్న దానధర్మాలను బహిరంగంగా ప్రకటించటం కూడా ఒక మంచి పనే. కానీ మీరు దానిని రహస్యంగా ఉంచి, పేదలకు ఏకాంతంలో దానధర్మాలు చేయడమనేది స్వచ్ఛమైన నిజాయితీని సూచిస్తున్నందున ఇంకా ఎక్కువ మంచిపని అవుతుంది. అలా నిజాయితీతో, చిత్తశద్ధితో ఇచ్చే దానధర్మాలు పాపాలు కప్పబడటానికి మరియు క్షమించబడటానికి ఒక మాధ్యమంగా మారుతాయి. మీరు ఏమి చేస్తున్నారో అల్లాహ్ కు తెలుసు మరియు మీ వ్యవహారాలలో నుండి ఏదీ ఆయన నుండి దాచబడి లేదు.
Tafsyrai arabų kalba:
لَیْسَ عَلَیْكَ هُدٰىهُمْ وَلٰكِنَّ اللّٰهَ یَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ— وَمَا تُنْفِقُوْا مِنْ خَیْرٍ فَلِاَنْفُسِكُمْ ؕ— وَمَا تُنْفِقُوْنَ اِلَّا ابْتِغَآءَ وَجْهِ اللّٰهِ ؕ— وَمَا تُنْفِقُوْا مِنْ خَیْرٍ یُّوَفَّ اِلَیْكُمْ وَاَنْتُمْ لَا تُظْلَمُوْنَ ۟
ఓ ప్రవక్తా! వారు సత్యాన్ని విశ్వసించి, దానికి సమర్పించుకునేలా చేసే బాధ్యత మీపై లేదు. మీ కర్తవ్యం కేవలం వారికి సత్యం వైపు మార్గదర్శకత్వం చేయడం మరియు వారికి దానిని వివరించడం మాత్రమే. కేవలం అల్లాహ్ మాత్రమే వారిని సత్యం వైపు తీసుకురాగలడు. మరియు తాను కోరుకున్న వారికే ఆయన మార్గదర్శకత్వం చేస్తాడు. మీరు ఏదైనా మంచి పని కోసం ఖర్చు చేస్తే, అది మీ వైపుకే మరలింపబడుతుంది. అల్లాహ్ కు దాని (మీ దానధర్మాల) అవసరం లేదు. కాబట్టి, మీరు అల్లాహ్ మార్గంలో మాత్రమే దానధర్మాలు చేయండి. నిజమైన విశ్వాసి కేవలం అల్లాహ్ మెప్పు కొరకు మాత్రమే ఖర్చు చేస్తాడు. మీరు ఏదైనా మంచి కోసం ఎంత తక్కువ ఖర్చు చేసినా సరే, మీరు దాని మొత్తం ప్రతిఫలాన్ని తిరిగి పొందుతారు. ఎందుకంటే, అల్లాహ్ ఎవరికీ అన్యాయం చేయడు.
Tafsyrai arabų kalba:
لِلْفُقَرَآءِ الَّذِیْنَ اُحْصِرُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ لَا یَسْتَطِیْعُوْنَ ضَرْبًا فِی الْاَرْضِ ؗ— یَحْسَبُهُمُ الْجَاهِلُ اَغْنِیَآءَ مِنَ التَّعَفُّفِ ۚ— تَعْرِفُهُمْ بِسِیْمٰىهُمْ ۚ— لَا یَسْـَٔلُوْنَ النَّاسَ اِلْحَافًا ؕ— وَمَا تُنْفِقُوْا مِنْ خَیْرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِیْمٌ ۟۠
మీరు అల్లాహ్ మార్గంలో నిరంతరం కష్టపడుతూ ఉండే నిరుపేదలపై ఖర్చు చేయాలి. ఎందుకంటే ఆ నిరుపేదలకు ఏ అక్కరా లేదని వారి గురించి తెలియని వారు భావిస్తారు. అయితే, వారి శరీరం మరియు దుస్తులపై కనిపించే సంకేతాల ద్వారా జ్ఞానవంతులు వారిని ఇట్టే గుర్తిస్తారు. అంతేకాక వారు ఎల్లప్పుడూ అడుక్కుంటూ ఉండే ఇతర పేద వ్యక్తులకు భిన్నంగా ఉంటారు. మీరు చేసే ఏదైనా మంచి పని లేదా దానధర్మాల గురించి అల్లాహ్ బాగా ఎరుగును మరియు దానికి బదులుగా ఆయన మీకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
اَلَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ بِالَّیْلِ وَالنَّهَارِ سِرًّا وَّعَلَانِیَةً فَلَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۚ— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟ؔ
ఎవరైతే పేరుప్రఖ్యాతుల కోసమో లేదా చూపుగోలు కోసమో కాకుండా, కేవలం అల్లాహ్ కొరకు తమ సంపదలో నుండి రహస్యంగానూ మరియు బహిరంగంగానూ రాత్రింబవళ్ళు వెచ్చిస్తారో, పునరుత్థాన దినమున వారు తమ ప్రభువు నుండి గొప్ప ప్రతిఫలం పొందుతారు. అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆశీర్వాదం కారణంగా, వారికి పరలోకంలో ఏమి జరగబోతుందో అనే భయమూ ఉండదు మరియు ఇహలోకంలో కోల్పోయిన దాని దుఃఖమూ ఉండదు.అల్లాహ్ వద్ద నుండి భాగ్యము మరియు అనుగ్రహముగా.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• إذا أخلص المؤمن في نفقاته وصدقاته فلا حرج عليه في إظهارها وإخفائها بحسب المصلحة، وإن كان الإخفاء أعظم أجرًا وثوابًا لأنها أقرب للإخلاص.
ఒక విశ్వాసి అల్లాహ్ మార్గంలో చేసే ఖర్చు మరియు దాతృత్వంలో నిజాయితీగా ఉంటే, అతను దానిని బహిర్గతం చేసినా లేదా దాచిపెట్టినా ఎలాంటి హాని ఉండదు. అయితే, దానిని దాచడం ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది చిత్తశుద్ధికి చాలా దగ్గర.

• دعوة المؤمنين إلى الالتفات والعناية بالمحتاجين الذين تمنعهم العفة من إظهار حالهم وسؤال الناس.
తమ అవసరాలను ప్రజలకు వెల్లడించడాన్ని అగౌరవంగా భావించి, ఇతరుల సహాయాన్ని కోరడానికి వెనుకాడే అక్కరగల నిరుపేదల పట్ల శ్రద్ధ వహించాలని విశ్వాసులకు పిలుపు ఇవ్వబడింది.

• مشروعية الإنفاق في سبيل الله تعالى في كل وقت وحين، وعظم ثوابها، حيث وعد تعالى عليها بعظيم الأجر في الدنيا والآخرة.
ప్రతీ సమయంలో ప్రతీ వేళ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటం ధర్మబద్ధం చేయబడినది. మరియు దానికి గొప్ప పుణ్యం ఉన్నది. ఎందుకంటే అల్లాహ్ ఇహపరాలలో దానిపై గొప్ప ప్రతిఫలం గురించి వాగ్దానం చేశాడు.

اَلَّذِیْنَ یَاْكُلُوْنَ الرِّبٰوا لَا یَقُوْمُوْنَ اِلَّا كَمَا یَقُوْمُ الَّذِیْ یَتَخَبَّطُهُ الشَّیْطٰنُ مِنَ الْمَسِّ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْۤا اِنَّمَا الْبَیْعُ مِثْلُ الرِّبٰوا ۘ— وَاَحَلَّ اللّٰهُ الْبَیْعَ وَحَرَّمَ الرِّبٰوا ؕ— فَمَنْ جَآءَهٗ مَوْعِظَةٌ مِّنْ رَّبِّهٖ فَانْتَهٰی فَلَهٗ مَا سَلَفَ ؕ— وَاَمْرُهٗۤ اِلَی اللّٰهِ ؕ— وَمَنْ عَادَ فَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
వడ్డీ తిన్నవారు పునరుత్థాన దినాన వారి సమాధుల నుండి షైతానుచే ప్రభావితమైన వ్యక్తి మాదిరిగా పైకి లేస్తారు: వారు తమ సమాధుల నుండి లేచి నిలబడతారు. మరియు వెంటనే మూర్ఛరోగానికి గురైన వ్యక్తి వలే పడిపోతారు. ఎందుకంటే వారు వడ్డీని అనుమతించారు. ఇంకా, వడ్డీలు మరియు అల్లాహ్ అనుమతించిన క్రయవిక్రయాల ద్వారా సంపాదించిన లాభాల మధ్య ఎలాంటి వ్యత్యాసాన్నీ చూపలేదు. అంతటితో ఆగక వారు 'క్రయవిక్రయం కూడా వడ్డీ లాంటిదే' అంటే రెండూ సంపద పెరుగుదల వైపుకు దారితీస్తూ ఉండటం వలన రెండూ చట్టబద్ధమైనవే అని వాదించారు. అల్లాహ్ వారి పోలికను తీవ్రంగా ఖండించాడు. వస్తువుల క్రయవిక్రయాల వ్యాపారంలో ఉన్న సాధారణ మరియు నిర్దిష్ట ప్రయోజనాల కారణంగా వాటిని అనుమతించానని మరియు ప్రజల సంపదను వడ్డీ వ్యాపారం అన్యాయంగా కొల్లగొడుతున్నందున మరియు దుర్వినియోగం చేస్తున్నందున తాను దానిని నిషేధించానని స్పష్టం చేశాడు. ఎవరైతే వడ్డీ పై అల్లాహ్ యొక్క నిషేధాజ్ఞలు మరియు వడ్డీ తినేవారికి వ్యతిరేకంగా అల్లాహ్ ప్రకటించిన తీవ్రమైన హెచ్చరికల గురించి తెలుసుకున్న వెంటనే వడ్డీ తీసుకోవడం ఆపి వేసి, తాను పాల్పడిన పాపకార్యానికి పశ్చాత్తాప పడతారో, అలాంటి వారు తాము అంతకు ముందు సంపాదించిన వడ్డీ సొమ్మును తమ దగ్గర ఉంచు కోవడంలో ఎలాంటి దోషమూ లేదు. అయితే, అప్పటి నుండి అతను ఏమి చేసినా, అల్లాహ్ దానిని లెక్కలోనికి తీసుకుని, దానిపై తీర్పునిస్తాడు.ఎవరైతే వడ్డీ తీసుకోవడం నిషేధం అని తెలిసిన తర్వాత కూడా వడ్డీ తీసుకోవడం కొనసాగిస్తారో, వారిని అల్లాహ్ నరకాగ్నిలో పడవేస్తాడు మరియు అక్కడ వారు శాశ్వతంగా పడి ఉంటారు. ఎవరైతే అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించి కూడా వడ్డీ తీసుకున్న వారికి (ముస్లింలకు) సంబంధించి ‘శాశ్వతంగా నరకాగ్నిలో పడి ఉంటారనేది’ వారు సుదీర్ఘ కాలం వరకు నరకాగ్నిలో పడి ఉంటారని సూచిస్తుంది; ఎందుకంటే కేవలం అవిశ్వాసులు మాత్రమే నరకాగ్నిలో శాశ్వతంగా పడి ఉంటారు. ఏకదైవ విశ్వాసం కలవారు అందులో శాస్వతంగా ఉండరు.
Tafsyrai arabų kalba:
یَمْحَقُ اللّٰهُ الرِّبٰوا وَیُرْبِی الصَّدَقٰتِ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ كُلَّ كَفَّارٍ اَثِیْمٍ ۟
అల్లాహ్ వడ్డీని సమూలంగా నాశనం చేయడం ద్వారా లేదా దానిలో నుండి తన దీవెనలను తొలగించడం ద్వారా దానిని తుడిచి వేస్తాడు. అయితే, ఆయన దానధర్మాల ప్రతిఫలాన్ని పెంచుతాడు. ఆయన వారి దానధర్మాల ప్రతిఫలాన్ని పది రెట్ల నుండి ఏడు వందల రెట్లు లేదా అంతకంటే ఎక్కువ మోతాదుకు పెంచుతాడు మరియు తమ సంపదలో నుండి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసేవారిని ఆశీర్వదిస్తాడు. అల్లాహ్ నిషేధించిన వాటిని చట్టబద్ధమైనవిగా భావించే మరియు నిరంతరం పాపాలలో కొనసాగే మొండి, మూర్ఖపు అవిశ్వాసిని అల్లాహ్ అస్సలు ఇష్టపడడు.
Tafsyrai arabų kalba:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ لَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۚ— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
అల్లాహ్ పై విశ్వాసం కలిగి ఉండి, ఆయన ప్రవక్తను అనుసరిస్తూ, ‘మంచి పనులు చేసే, తమ నమాజులు పూర్తి స్థాయిలో నెరవేర్చే, అర్హులైన వారికి జకాతు ఇస్తూ ఉండే వారు’ తమ ప్రభువు నుండి గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు. వారికి పరలోకంలో ఏమి జరగబోతుందో అనే భయమూ ఉండదు మరియు ఇహలోకంలో కోల్పోయిన దాని దుఃఖమూ ఉండదు.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَذَرُوْا مَا بَقِیَ مِنَ الرِّبٰۤوا اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
అల్లాహ్ ను విశ్వసించే మరియు ఆయన ప్రవక్తను అనుసరించే విశ్వాసులారా! అల్లాహ్ ఆజ్ఞాపించిన వాటిని ఆచరించడం మరియు ఆయన నిషేదించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు భయపడండి. ఒకవేళ మీకు అల్లాహ్ పై మరియు ఆయన నిషేదాజ్ఞలపై నిజంగా విశ్వాసమే గనుక ఉంటే మీకు ప్రజలు బాకీ ఉన్న వడ్డీ సొమ్మును మీరు ఇక ఎన్నడూ డిమాండు చేయవద్దు.
Tafsyrai arabų kalba:
فَاِنْ لَّمْ تَفْعَلُوْا فَاْذَنُوْا بِحَرْبٍ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖ ۚ— وَاِنْ تُبْتُمْ فَلَكُمْ رُءُوْسُ اَمْوَالِكُمْ ۚ— لَا تَظْلِمُوْنَ وَلَا تُظْلَمُوْنَ ۟
ఒక వేళ మీరు పవిత్రమైన అల్లాహ్ యొక్క చట్టాన్ని పాటించకపోతే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఒక వేళ మీరు పశ్చాత్తాపపడి, అల్లాహ్ వద్ద క్షమాపణ వేడుకుంటూ, వడ్డీని వదిలి వేస్తే, మీ మూలధనం నుండి అప్పుగా మీరు మొదట ఇచ్చిన అసలు మొత్తాన్ని మాత్రమే వాపసు తీసుకోండి. అయితే ఇలా చేయడంలో మీరు మొదట ఇచ్చిన అసలు మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోకూడదు, తద్వారా ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలి. ఇంకా, అసలు మొత్తం కంటే తక్కువ తీసుకోవడం ద్వారా మీకూ అన్యాయం జరగ కూడదు.
Tafsyrai arabų kalba:
وَاِنْ كَانَ ذُوْ عُسْرَةٍ فَنَظِرَةٌ اِلٰی مَیْسَرَةٍ ؕ— وَاَنْ تَصَدَّقُوْا خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
మీ వద్ద తీసుకున్న రుణాన్ని వాపసు చేయమని మీరు డిమాండు చేస్తున్న వ్యక్తి ఒక వేళ కష్టాల్లో ఉండి, రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, అతడు డబ్బు సంపాదించి, మీ అప్పు చెల్లించే వరకు మీరు అతడిని రుణం వాపసు చేయమని అడగడం మానేయండి. మరియు అల్లాహ్ దృష్టిలో దాని విలువ మీకు తెలిస్తే, మీ అప్పులో కొంత భాగాన్ని దానంగా పరిగణించి, దానిని డిమాండ్ చేయకుండా అతడికి దానం చేయడంలో మీ కొరకు శుభం ఉన్నది.
Tafsyrai arabų kalba:
وَاتَّقُوْا یَوْمًا تُرْجَعُوْنَ فِیْهِ اِلَی اللّٰهِ ۫— ثُمَّ تُوَفّٰی كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟۠
మీరంతా అల్లాహ్ వద్దకు మరలి వచ్చే దినం శిక్షలకు భయపడండి మరియు మీరు ఆయన ముందు నిలబడ వలసి ఉంది. అప్పుడు ప్రతీ వ్యక్తికి అతను చేసిన మంచి లేదా చెడు పనికి బదులుగా ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారి మంచిపనుల కంటే తక్కువ ప్రతిఫలం ప్రసాదించబడటం లేదా వారి చెడుపనుల కంటే ఎక్కువ శిక్ష విధించబడటం వంటివి జరుగవు, అంటే వారికి ఎలాంటి అన్యాయమూ జరగదు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• من أعظم الكبائر أكل الربا، ولهذا توعد الله تعالى آكله بالحرب وبالمحق في الدنيا والتخبط في الآخرة.
అత్యంత తీవ్రమైన ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం వడ్డీ తినడం. ఈ కారణంగా, అల్లాహ్ వడ్డీ తినే వాడిని యుద్ధానికి,ఇహలోకంలో నష్టానికి మరియు పరలోకంలో గందరగోళానికి గురి కావడానికి తయారుగా ఉండమని హెచ్చరించాడు.

• الالتزام بأحكام الشرع في المعاملات المالية ينزل البركة والنماء فيها.
వ్యాపార లావాదేవీలలో పవిత్ర షరీఅహ్ చట్టాన్ని అనుసరిస్తే, అల్లాహ్ యొక్క ఆశీర్వాదం మరియు వృద్ధి లభిస్తుంది.

• فضل الصبر على المعسر، والتخفيف عنه بالتصدق عليه ببعض الدَّين أو كله.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిపై సహనం చూపడం మరియు అతనికి ఇచ్చిన అప్పును పాక్షికంగా లేదా పూర్తిగా క్షమించడం ద్వారా అతనికి సౌలభ్యాన్ని కలగ జేయడం అనేది ఒక ఉత్తమమైన ఆచరణ.

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا تَدَایَنْتُمْ بِدَیْنٍ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی فَاكْتُبُوْهُ ؕ— وَلْیَكْتُبْ بَّیْنَكُمْ كَاتِبٌ بِالْعَدْلِ ۪— وَلَا یَاْبَ كَاتِبٌ اَنْ یَّكْتُبَ كَمَا عَلَّمَهُ اللّٰهُ فَلْیَكْتُبْ ۚ— وَلْیُمْلِلِ الَّذِیْ عَلَیْهِ الْحَقُّ وَلْیَتَّقِ اللّٰهَ رَبَّهٗ وَلَا یَبْخَسْ مِنْهُ شَیْـًٔا ؕ— فَاِنْ كَانَ الَّذِیْ عَلَیْهِ الْحَقُّ سَفِیْهًا اَوْ ضَعِیْفًا اَوْ لَا یَسْتَطِیْعُ اَنْ یُّمِلَّ هُوَ فَلْیُمْلِلْ وَلِیُّهٗ بِالْعَدْلِ ؕ— وَاسْتَشْهِدُوْا شَهِیْدَیْنِ مِنْ رِّجَالِكُمْ ۚ— فَاِنْ لَّمْ یَكُوْنَا رَجُلَیْنِ فَرَجُلٌ وَّامْرَاَتٰنِ مِمَّنْ تَرْضَوْنَ مِنَ الشُّهَدَآءِ اَنْ تَضِلَّ اِحْدٰىهُمَا فَتُذَكِّرَ اِحْدٰىهُمَا الْاُخْرٰی ؕ— وَلَا یَاْبَ الشُّهَدَآءُ اِذَا مَا دُعُوْا ؕ— وَلَا تَسْـَٔمُوْۤا اَنْ تَكْتُبُوْهُ صَغِیْرًا اَوْ كَبِیْرًا اِلٰۤی اَجَلِهٖ ؕ— ذٰلِكُمْ اَقْسَطُ عِنْدَ اللّٰهِ وَاَقْوَمُ لِلشَّهَادَةِ وَاَدْنٰۤی اَلَّا تَرْتَابُوْۤا اِلَّاۤ اَنْ تَكُوْنَ تِجَارَةً حَاضِرَةً تُدِیْرُوْنَهَا بَیْنَكُمْ فَلَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ اَلَّا تَكْتُبُوْهَا ؕ— وَاَشْهِدُوْۤا اِذَا تَبَایَعْتُمْ ۪— وَلَا یُضَآرَّ كَاتِبٌ وَّلَا شَهِیْدٌ ؕ۬— وَاِنْ تَفْعَلُوْا فَاِنَّهٗ فُسُوْقٌ بِكُمْ ؕ— وَاتَّقُوا اللّٰهَ ؕ— وَیُعَلِّمُكُمُ اللّٰهُ ؕ— وَاللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟
అల్లాహ్ ను విశ్వసించే మరియు ఆయన ప్రవక్తను అనుసరించే విశ్వాసులారా! మీరు అప్పుతో కూడిన లావాదేవీలు చేసేటప్పుడు అంటే మీరు నిర్ణీత వ్యవధి కొరకు ఒకరికొకరు అప్పు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు, దాన్ని లిఖితరూపంలో వ్రాసుకోండి. వ్రాయటం వచ్చిన వ్యక్తి దానిని న్యాయంగా మరియు పవిత్రమైన అల్లాహ్ చట్టానికి అనుగుణంగా వ్రాయాలి. అంతేగాని అతడు న్యాయంగా వ్రాయటం గురించి అల్లాహ్ తనకు నేర్పించిన దాన్ని అనుసరిస్తూ, రుణపత్రం వ్రాయడానికి నిరాకరించకూడదు. హక్కుదారుడు నిర్దేశించిన దానిని అతను వ్రాయాలి. తద్వారా అది అతని సమ్మతిగా పని చేస్తుంది. ప్రతీది అల్లాహ్ గమనిస్తూ ఉంటాడనే సత్యాన్ని గుర్తు చేసుకుంటూ అతడు వ్రాయాలి మరియు రుణం విలువ లేదా వివరణలలో దేనినీ తగ్గించి వ్రాయకూడదు. ఒకవేళ అప్పు పుచ్చుకునేవాడికి లావాదేవీలు చేయడంలో అనుభవం లేకపోయినా, తక్కువ వయస్సు వాడైనా, మతిస్థిమితం లేని వాడైనా, మూగతనం లేదా వేరే ఇతర కారణాల వల్ల చెప్పి వ్రాయించుకోవటం కుదరకపోతే, అతడి తరుపున అతడి అధికార సంరక్షకుడు దానిని న్యాయబద్ధంగా చెప్పి వ్రాయించాలి. అలాగే, ఇద్దరు బుద్ధిమంతులు మరియు సత్పురుషులను సాక్ష్యం కోసం పిలవాలి. ఇద్దరు పురుషులు లభించకపోతే, వారి ధర్మం మరియు నిజాయితీతో మీరు సంతృప్తి చెందిన ఒక మగ మరియు ఇద్దరు స్త్రీలను పిలవాలి. తద్వారా స్త్రీలలో ఒకరు మర్చిపోతే, మరొకరు ఆమెకు గుర్తు చేయవచ్చు. సాక్షులు ఈ రుణం విషయంలో సాక్షులుగా ఉండటానికి నిరాకరించకూడదు. అవసరమైనప్పుడు వారు తప్పనిసరిగా సాక్ష్యమివ్వాలి. ఎంత చిన్న మొత్తమైనా సరే. అప్పు పత్రం వ్రాయడాన్ని తేలిగ్గా తీసుకో వద్దు. ఎందుకంటే ఇది అల్లాహ్ చట్టంలో ఎంతో న్యాయమైనది. సముచితమైన సాక్ష్యాధారాలతో ఎంతో విశ్వసనీయమైనది. ఇంకా తరువాత కాలంలో అప్పు రకం, మొత్తం లేదా వ్యవధిలో ఏవైనా సందేహాలు వస్తే, వాటిని సులభంగా తొలగించే అవకాశం కల్పిస్తుంది. ఏదేమైనా, మంచి ధరకు బదులుగా ఒక వస్తువు మార్పిడి చేసుకోవడం వంటి లావాదేవీ అయితే, దానిని వ్రాయక పోవడం వల్ల ఎలాంటి హానీ ఉండదు. ఎందుకంటే అలా చేయవలసిన అవసరం లేదు. వివాదాలు తలెత్తకుండా సాక్షులను పిలవడం అనేది చట్టబద్ధమైన చర్యయే. సాక్షులకు లేదా వ్రాసే వానికి ఏదైనా హాని కలిగించడం చట్టబద్ధం కాదు; రుణపత్రం వ్రాయమని లేదా సాక్షిగా నిలబడమని అభ్యర్థించిన వారికీ ఎలాంటి హానీ కలిగించకూడదు. ఒకవేళ ఎవరైనా వారికి హాని కలిగించినట్లయితే, అతను అల్లాహ్ యొక్క పవిత్రమైన చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాడవుతాడు. ఓ విశ్వాసులారా! అల్లాహ్ ఆజ్ఞలను నెరవేర్చడం మరియు ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండటం ద్వారా ఆయన ఉనికిని సదా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇహపరలోకాలలో మీ కొరకు ఏది ఉత్తమమో అల్లాహ్ మీకు బోధిస్తాడు. అల్లాహ్ అన్నీ ఎరుగును మరియు ఆయన నుండి ఏమీ దాగదు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• وجوب تسمية الأجل في جميع المداينات وأنواع الإجارات.
తరువాత ఎదురయ్యో అసమ్మతులు లేదా వివాదాలను నివారించడానికి అప్పులు మరియు అన్నీ వాణిజ్య లావాదేవీలను నమోదు చేసుకోవటం ధర్మబద్ధం చేయబడినది.

మతిస్థిమితం, మానసిక బలహీనత లేదా తక్కువ వయస్సు కారణంగా తమ వ్యవహారాలు సరిగ్గా చూసుకోలేని వారి విషయంలో అల్లాహ్ యొక్క పవిత్ర చట్టం సంరక్షకత్వాన్ని ఆదేశిస్తుంది.

అప్పులు మరియు హక్కులను గుర్తించడానికి సాక్షులను ఏర్పాటు చేయటం ధర్మబద్ధం చేయబడినది.

లావాదేవీకి సంబంధించిన సరైన పదాలు మరియు వాక్యాలను ఉపయోగించడం ఉత్తమమైన మరియు అత్యంత సరైన మార్గం.

రుణపత్రం వ్రాస్తున్నప్పుడు దాని హక్కులను కలిగి ఉన్నవారు లేదా వాటిని రికార్డ్ చేస్తున్నవారు లేదా సాక్ష్యుల ద్వారా అప్పులు మరియు హక్కులను నమోదు చేసేటప్పుడు ఎవరికీ ఎలాంటి హాని జరగకూడదు.

وَاِنْ كُنْتُمْ عَلٰی سَفَرٍ وَّلَمْ تَجِدُوْا كَاتِبًا فَرِهٰنٌ مَّقْبُوْضَةٌ ؕ— فَاِنْ اَمِنَ بَعْضُكُمْ بَعْضًا فَلْیُؤَدِّ الَّذِی اؤْتُمِنَ اَمَانَتَهٗ وَلْیَتَّقِ اللّٰهَ رَبَّهٗ ؕ— وَلَا تَكْتُمُوا الشَّهَادَةَ ؕ— وَمَنْ یَّكْتُمْهَا فَاِنَّهٗۤ اٰثِمٌ قَلْبُهٗ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ عَلِیْمٌ ۟۠
ఒకవేళ మీరు ప్రయాణంలో ఉంటే మరియు మీ కోసం రుణపత్రం వ్రాయగల వారెవరూ కనబడకపోతే, అప్పు చెల్లించే వరకు రుణగ్రహీత తన హక్కుకు భద్రతగా రుణదాతకు ఆస్తిని తాకట్టు పెట్టవచ్చు. మీరు ఒకరినొకరు విశ్వసిస్తే, రుణపత్రం వ్రాయడం, సాక్షులను పిలవడం లేదా వాగ్దానం చేయడం మొదలైన వాటి అవసరం లేదు. అలాంటి సందర్భాలలో, అప్పు రుణగ్రహీత యొక్క బాధ్యతగా ఉంటుంది. అతను దానిని చెల్లించాలి. తరువాత దానిని తిరస్కరించకుండా అల్లాహ్ ఉనికిని గుర్తుంచు కోవాలి. ఒకవేళ అతడు తరువాత దానిని తిరస్కరించినట్లయితే, లావాదేవీ సమయంలో ఉన్న వ్యక్తి తప్పనిసరిగా సాక్ష్యం ఇవ్వాలి మరియు అతడు ఏదీ దాచకూడదు. ఒకవేళ ఎవరైనా సాక్ష్యాలు దాచిపెడితే, అలా చేయడమనేది అతని హృదయం పాపభరితమైందని సూచిస్తుంది. మీరు ఏమి చేస్తున్నారో అల్లాహ్ బాగా ఎరుగును. ఆయన నుండి ఏమీ దాగదు. మరియు మీ చర్యలకు ఆయన మీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు.
Tafsyrai arabų kalba:
لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاِنْ تُبْدُوْا مَا فِیْۤ اَنْفُسِكُمْ اَوْ تُخْفُوْهُ یُحَاسِبْكُمْ بِهِ اللّٰهُ ؕ— فَیَغْفِرُ لِمَنْ یَّشَآءُ وَیُعَذِّبُ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్ కే చెందినది. ఆయన సృష్టి అంతటినీ సృష్టించాడు. తన ఆధీనములో ఉంచుకున్నాడు మరియు నియంత్రిస్తున్నాడు. మీరు మీ హృదయంలో ఉన్నదాన్ని బహిరంగ పరిచినా లేదా దాచినా, అల్లాహ్ కు దాని గురించి తెలుసు మరియు ఆయన దాని లెక్క మీ నుండి తీసుకుంటాడు. తన దయ మరియు కరుణ కారణంగా ఆయన తాను తలుచుకున్న వారిని క్షమిస్తాడు. తన వివేకం మరియు న్యాయంతో ఆయన తాను తలుచుకున్న వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Tafsyrai arabų kalba:
اٰمَنَ الرَّسُوْلُ بِمَاۤ اُنْزِلَ اِلَیْهِ مِنْ رَّبِّهٖ وَالْمُؤْمِنُوْنَ ؕ— كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓىِٕكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ ۫— لَا نُفَرِّقُ بَیْنَ اَحَدٍ مِّنْ رُّسُلِهٖ ۫— وَقَالُوْا سَمِعْنَا وَاَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَاِلَیْكَ الْمَصِیْرُ ۟
తన ప్రభువు ద్వారా తనపై అవతరించిన ప్రతీదానినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం విశ్వసించారు. అలాగే విశ్వాసులు కూడా. వారందరూ అల్లాహ్ ను, ఆయన దైవదూతలందరినీ, వివిధ సందేశహరులపై ఆయన అవతరింపజేసిన దివ్యగ్రంథాలన్నింటినీ మరియు ఆయన పంపిన సందేశహరులందరినీ విశ్వసించారు. వారు ఆ సందేశహరుల మధ్య ఎలాంటి భేదం చూపకుండా, వారందరినీ నమ్ముతారు. వారిలా అంటారు : మీ ఆజ్ఞలు మరియు నిషేధాల గురించి మేము విన్నాము. మీ ఆజ్ఞలను పాటిస్తూ మరియు మీ నిషేధాలను వదిలివేయడం ద్వారా మేము మీకు విధేయులం అవుతాము. ప్రభువా! మమ్మల్ని క్షమించమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము, ఎందుకంటే మాకు సంబంధించిన విషయాలన్నింటిలో మేము మీ వద్దకే ఒంటరిగా మరలి వస్తాము.
Tafsyrai arabų kalba:
لَا یُكَلِّفُ اللّٰهُ نَفْسًا اِلَّا وُسْعَهَا ؕ— لَهَا مَا كَسَبَتْ وَعَلَیْهَا مَا اكْتَسَبَتْ ؕ— رَبَّنَا لَا تُؤَاخِذْنَاۤ اِنْ نَّسِیْنَاۤ اَوْ اَخْطَاْنَا ۚ— رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَیْنَاۤ اِصْرًا كَمَا حَمَلْتَهٗ عَلَی الَّذِیْنَ مِنْ قَبْلِنَا ۚ— رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهٖ ۚ— وَاعْفُ عَنَّا ۥ— وَاغْفِرْ لَنَا ۥ— وَارْحَمْنَا ۥ— اَنْتَ مَوْلٰىنَا فَانْصُرْنَا عَلَی الْقَوْمِ الْكٰفِرِیْنَ ۟۠
అల్లాహ్ ఒక వ్యక్తిపై అతడు భరించ గలిగినంత భారాన్ని మాత్రమే వేస్తాడు. అల్లాహ్ యొక్క ధర్మం సౌలభ్యం మీదే ఆధారపడి ఉంటుంది తప్ప కష్టతరం, దుర్లభం మీద కాదు. ఒక వేళ ఎవరైనా మంచి చేస్తే, బదులుగా అతడు దాని మొత్తం ప్రతిఫలాన్ని ఏమీ తగ్గకుండా పొందుతాడు. అలాగే ఒక వేళ ఎవరైనా చెడు చేస్తే, అతను చేసిన పాపానికి సరిసమానమైన శిక్ష మాత్రమే అతడి పై పడుతుంది మరియు అతని శిక్షను వేరెవ్వరూ మోయరు. సందేశహరులు మరియు విశ్వాసులు ఇలా వేడుకున్నారు, 'ఓ ప్రభూ! ఒక వేళ మేము ఏదైనా మరిచిపోయినా, ఏదైనా చేస్తున్నప్పుడు తప్పు చేసినా, అనాలోచితంగా ఏదైనా నోరు జారినా మమ్మల్ని శిక్షించకు. ఓ ప్రభూ! మా శక్తికి మించిన భారాన్ని మరియు ఆజ్ఞలను మాపై మోపకు - వేటినైతే మాకు పూర్వం ప్రజలకు నీవు ఇచ్చినావో మరియు ఆ ఆజ్ఞలను పాటించడంలో తాము చేసిన తప్పులకు బదులుగా వారు శిక్షించబడ్డారో (యోదుల వలే). మా కొరకు కష్టతరమైన మరియు మేము పూర్తి చేయలేనటువంటి ఆజ్ఞలను,నిషేదాలను మాపై మోపకు నీవు కరుణతో మా పాపాలను పట్టించుకోకు, మమ్మల్ని క్షమించు మరియు మాపై దయ చూపు. నీవే మా సంరక్షకుడివి మరియు సహాయకుడివి, కాబట్టి అవిశ్వాసులపై మాకు విజయం ప్రసాదించు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• جواز أخذ الرهن لضمان الحقوق في حال عدم القدرة على توثيق الحق، إلا إذا وَثِقَ المتعاملون بعضهم ببعض.
వ్యవహారమును చేసేవారు ఒకరి పై మరొకరికి నమ్మకం ఉంటే తప్ప, ఒక వేళ వారి మధ్య ఒప్పందాన్ని వ్రాతపూర్వకంగా నమోదు చేయడం కుదరక పోతే, హక్కులు కాపాడుకోవటానికి తాకట్టు తీసుకోవటం సమ్మతము.

• حرمة كتمان الشهادة وإثم من يكتمها ولا يؤديها.
సాక్ష్యామును దాచడం యొక్క నిషేధత; మరియు దానిని దాచి, సాక్ష్యం ఇవ్వని వ్యక్తి యొక్క పాపం.

• كمال علم الله تعالى واطلاعه على خلقه، وقدرته التامة على حسابهم على ما اكتسبوا من أعمال.
అల్లాహ్ కు తన సృష్టి యొక్క జ్ఞానం మరియు అవగాహన యొక్క పరిపూర్ణత. నిశ్చయంగా వారి చర్యల పై లెక్క తీసుకోవటంపై ఆయన పూర్తి సామర్ధ్యత.

• تقرير أركان الإيمان وبيان أصوله.
విశ్వాసం యొక్క స్తంభాల యొక్క నివేదిక మరియు దాని మూలాల ప్రకటన.

• قام هذا الدين على اليسر ورفع الحرج والمشقة عن العباد، فلا يكلفهم الله إلا ما يطيقون، ولا يحاسبهم على ما لا يستطيعون.
ఇస్లాం ధర్మం ప్రజలకు సులభతరమైన జీవితాన్ని అందించడం, ప్రజల జీవితాల నుండి హాని మరియు కష్టాలను తొలగించడం మీద ఆధారపడి ఉన్నది. ప్రజల శక్తిమేరకు మాత్రమే అల్లాహ్ వారి పై భారం మోపుతాడు మరియు వారు చేయగల శక్తిలేని వాటికి వారిని బాధ్యులుగా చేయడు.

 
Reikšmių vertimas Sūra: Sūra Al-Bakara
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Vertimų turinys

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uždaryti