Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Vertimų turinys


Reikšmių vertimas Aja (Korano eilutė): (272) Sūra: Sūra Al-Bakara
لَیْسَ عَلَیْكَ هُدٰىهُمْ وَلٰكِنَّ اللّٰهَ یَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ— وَمَا تُنْفِقُوْا مِنْ خَیْرٍ فَلِاَنْفُسِكُمْ ؕ— وَمَا تُنْفِقُوْنَ اِلَّا ابْتِغَآءَ وَجْهِ اللّٰهِ ؕ— وَمَا تُنْفِقُوْا مِنْ خَیْرٍ یُّوَفَّ اِلَیْكُمْ وَاَنْتُمْ لَا تُظْلَمُوْنَ ۟
ఓ ప్రవక్తా! వారు సత్యాన్ని విశ్వసించి, దానికి సమర్పించుకునేలా చేసే బాధ్యత మీపై లేదు. మీ కర్తవ్యం కేవలం వారికి సత్యం వైపు మార్గదర్శకత్వం చేయడం మరియు వారికి దానిని వివరించడం మాత్రమే. కేవలం అల్లాహ్ మాత్రమే వారిని సత్యం వైపు తీసుకురాగలడు. మరియు తాను కోరుకున్న వారికే ఆయన మార్గదర్శకత్వం చేస్తాడు. మీరు ఏదైనా మంచి పని కోసం ఖర్చు చేస్తే, అది మీ వైపుకే మరలింపబడుతుంది. అల్లాహ్ కు దాని (మీ దానధర్మాల) అవసరం లేదు. కాబట్టి, మీరు అల్లాహ్ మార్గంలో మాత్రమే దానధర్మాలు చేయండి. నిజమైన విశ్వాసి కేవలం అల్లాహ్ మెప్పు కొరకు మాత్రమే ఖర్చు చేస్తాడు. మీరు ఏదైనా మంచి కోసం ఎంత తక్కువ ఖర్చు చేసినా సరే, మీరు దాని మొత్తం ప్రతిఫలాన్ని తిరిగి పొందుతారు. ఎందుకంటే, అల్లాహ్ ఎవరికీ అన్యాయం చేయడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• إذا أخلص المؤمن في نفقاته وصدقاته فلا حرج عليه في إظهارها وإخفائها بحسب المصلحة، وإن كان الإخفاء أعظم أجرًا وثوابًا لأنها أقرب للإخلاص.
ఒక విశ్వాసి అల్లాహ్ మార్గంలో చేసే ఖర్చు మరియు దాతృత్వంలో నిజాయితీగా ఉంటే, అతను దానిని బహిర్గతం చేసినా లేదా దాచిపెట్టినా ఎలాంటి హాని ఉండదు. అయితే, దానిని దాచడం ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది చిత్తశుద్ధికి చాలా దగ్గర.

• دعوة المؤمنين إلى الالتفات والعناية بالمحتاجين الذين تمنعهم العفة من إظهار حالهم وسؤال الناس.
తమ అవసరాలను ప్రజలకు వెల్లడించడాన్ని అగౌరవంగా భావించి, ఇతరుల సహాయాన్ని కోరడానికి వెనుకాడే అక్కరగల నిరుపేదల పట్ల శ్రద్ధ వహించాలని విశ్వాసులకు పిలుపు ఇవ్వబడింది.

• مشروعية الإنفاق في سبيل الله تعالى في كل وقت وحين، وعظم ثوابها، حيث وعد تعالى عليها بعظيم الأجر في الدنيا والآخرة.
ప్రతీ సమయంలో ప్రతీ వేళ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటం ధర్మబద్ధం చేయబడినది. మరియు దానికి గొప్ప పుణ్యం ఉన్నది. ఎందుకంటే అల్లాహ్ ఇహపరాలలో దానిపై గొప్ప ప్రతిఫలం గురించి వాగ్దానం చేశాడు.

 
Reikšmių vertimas Aja (Korano eilutė): (272) Sūra: Sūra Al-Bakara
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Vertimų turinys

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uždaryti