Check out the new design

Kilniojo Korano reikšmių vertimas - Kilniojo Korano sutrumpinto aiškinimo vertimas į telugų k. * - Vertimų turinys


Reikšmių vertimas Sūra: Az-Zumar   Aja (Korano eilutė):
اِنَّاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْكِتٰبَ لِلنَّاسِ بِالْحَقِّ ۚ— فَمَنِ اهْتَدٰی فَلِنَفْسِهٖ ۚ— وَمَنْ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیْهَا ۚ— وَمَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ ۟۠
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మేము ఖుర్ఆన్ ను మీపై ప్రజల కొరకు సత్యముతో అవతరింపజేశాము మీరు వారిని హెచ్చరించటానికి. ఎవరైతే సన్మార్గము పొందుతాడో అతని సన్మార్గం పొందటం యొక్క ప్రయోజనం అతని స్వయం కొరకే. అయితే అతని సన్మార్గం పొందటం అల్లాహ్ కు ప్రయోజనం చేకూర్చదు. ఎందుకంటే ఆయన దాని నుండి అక్కరలేనివాడు. మరియు ఎవరైతే అపమార్గము పొందుతాడో అతని అపమార్గం పొందటం యొక్క నష్టము అతని స్వయమునకే కలుగును. అయితే పరిశుద్ధుడైన అల్లాహ్ కు అతని అపమార్గము నష్టం కలిగించదు. మరియు మీరు వారిని సన్మార్గముపై బలవంతం చేయటానికి మీరు వారిపై బాధ్యులు కారు. వారికి చేరవేయమని మీకు ఆదేశించబడిన వాటిని చేరవేయటం మాత్రమే మీపై బాధ్యత కలదు.
Tafsyrai arabų kalba:
اَللّٰهُ یَتَوَفَّی الْاَنْفُسَ حِیْنَ مَوْتِهَا وَالَّتِیْ لَمْ تَمُتْ فِیْ مَنَامِهَا ۚ— فَیُمْسِكُ الَّتِیْ قَضٰی عَلَیْهَا الْمَوْتَ وَیُرْسِلُ الْاُخْرٰۤی اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ ۟
అల్లాహ్ యే ఆత్మలను వాటి ఆయుషు ముగిసేటప్పుడు స్వాధీనపరచుకుంటాడు. వేటి ఆయుషు పూర్తికాలేదో ఆ ఆత్మలను నిదుర సమయములో స్వాధీనపరచుకుని వేటి యొక్క మరణం నిర్ణయించబడినదో వాటిని ఆపుకుని వేటి పై దాని (మరణం) నిర్ణయం కాలేదో వాటిని పరిశుద్ధుడైన ఆయన జ్ఞానంలో నిర్ధారించబడిన వేళ వరకు వదిలివేస్తాడు. నిశ్చయంగా స్వాధీనపరచటం,వదిలివేయటం మరియు మరణం కలిగించటం,జీవింపజేయటంలో వీటిని చేసే సామర్ధ్యం కలవాడు ప్రజలను వారి మరణం తరువాతా లెక్కతీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మరణాంతరం లేపటంపై సామర్ధ్యం కలవాడని యోచన చేసే ప్రజలకు ఆధారాలు కలవు.
Tafsyrai arabų kalba:
اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ شُفَعَآءَ ؕ— قُلْ اَوَلَوْ كَانُوْا لَا یَمْلِكُوْنَ شَیْـًٔا وَّلَا یَعْقِلُوْنَ ۟
వాస్తవానికి ముష్రికులు తమ విగ్రహాలను అల్లాహ్ ను వదిలి వారి వద్ద ప్రయోజనమును ఆశిస్తూ సిఫారసు చేసేవారిగా చేసుకున్నారు. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : ఏమీ ఒక వేళ వారికి మీపై,వారి స్వయంపై ఎటువంటి అధికారము లేకపోయినా,వారు ఏమీ అర్ధం చేసుకోకపోయినా మీరు వారిని సిఫారసు చేసేవారిగా చేసుకుంటారా. వారు మాట్లాడలేని మూగబోయిన, వినలేని,చూడలేని,ప్రయోజనం కలిగించని,నష్టం కలిగించని రాతిపలకలు ?!.
Tafsyrai arabų kalba:
قُلْ لِّلّٰهِ الشَّفَاعَةُ جَمِیْعًا ؕ— لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— ثُمَّ اِلَیْهِ تُرْجَعُوْنَ ۟
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : సిఫారసు అంతా ఒక్కడైన అల్లాహ్ కే చెందుతుంది. ఆయన వద్ద ఆయన అనుమతించిన వారు మాత్రమే సిఫరసు చేస్తారు. మరియు ఆయన ఇష్టపడిన వారి కొరకు మాత్రమే సిఫారసు చేస్తాడు. ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు భూమి సామ్రాజ్యాధికారము ఆయన ఒక్కడి కొరకే చెందుతుంది. ఆ తరువాత ప్రళయదినమున లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఆయన ఒక్కడి వైపునకే మీరు మరలించబడుతారు. అప్పుడు ఆయన మీ ఆచరణల పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
وَاِذَا ذُكِرَ اللّٰهُ وَحْدَهُ اشْمَاَزَّتْ قُلُوْبُ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ ۚ— وَاِذَا ذُكِرَ الَّذِیْنَ مِنْ دُوْنِهٖۤ اِذَا هُمْ یَسْتَبْشِرُوْنَ ۟
మరియు ఒక్కడైన అల్లాహ్ ప్రస్తావన వచ్చినప్పుడు పరలోకమును మరియు అందులో ఉన్నటువంటి మరణాంతరం లేపబడటము,లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం పై విశ్వాసమును కనబరచని ముష్రికుల హృదయములు ధ్వేషిస్తాయి. మరియు అల్లాహ్ ను వదిలి వారు ఆరాధించే విగ్రహాల ప్రస్తావన వచ్చినప్పుడు వారు సంతోషపడేవారు,ఆనందపడేవారు.
Tafsyrai arabų kalba:
قُلِ اللّٰهُمَّ فَاطِرَ السَّمٰوٰتِ وَالْاَرْضِ عٰلِمَ الْغَیْبِ وَالشَّهَادَةِ اَنْتَ تَحْكُمُ بَیْنَ عِبَادِكَ فِیْ مَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ అల్లాహ్ భూమ్యాకాశములను పూర్వ నమూనా లేకుండా సృష్టించినవాడా, అగోచర,గోచరాలను తెలిసినవాడా వాటిలో నుండి ఏదీ నీపై గోప్యంగా ఉండదు. నీవు ఒక్కడే ప్రళయదినమున దాసుల మధ్య వారు ఇహలోకంలో విభేదించుకున్న వాటి విషయంలో తీర్పునిచ్చేవాడివి. అప్పుడు సత్యవంతుడు ,అసత్యవంతుడు మరియు పుణ్యాత్ముడు, దుష్టుడు స్పష్టమవుతారు.
Tafsyrai arabų kalba:
وَلَوْ اَنَّ لِلَّذِیْنَ ظَلَمُوْا مَا فِی الْاَرْضِ جَمِیْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لَافْتَدَوْا بِهٖ مِنْ سُوْٓءِ الْعَذَابِ یَوْمَ الْقِیٰمَةِ ؕ— وَبَدَا لَهُمْ مِّنَ اللّٰهِ مَا لَمْ یَكُوْنُوْا یَحْتَسِبُوْنَ ۟
మరియు ఒక వేళ షిర్కు,పాప కార్యములతో తమ స్వయముపై హింసకు పాల్పడిన వారి కొరకు భూమిలో ఉన్న విలువైన వస్తువులు,సంపదలు ఉంటే దాన్ని వారు మరణాంతరం లేపబడిన తరువాత చూసిన కఠినమైన శిక్షకు పరిహారంగా చెల్లిస్తారు. కాని అది వారి కొరకు ఉండదు. ఒక వేళ అది వారి వద్ద ఉన్నా అది వారి నుండి స్వీకరించబడదు. మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద నుండి వారు ఊహించని రకరకాల శిక్షలు బహిర్గతమవుతాయి.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• النوم والاستيقاظ درسان يوميان للتعريف بالموت والبعث.
నిద్ర మరియు నిద్ర నుండి మేల్కొలుపు మరణమును మరియు మరణాంతరం లేపబడటమును గుర్తు చేయటానికి రెండు రోజువారీ పాఠాలు.

• إذا ذُكِر الله وحده عند الكفار أصابهم ضيق وهمّ؛ لأنهم يتذكرون ما أمر به وما نهى عنه وهم معرضون عن هذا كله.
అవిశ్వాసపరుల వద్ద అల్లాహ్ ప్రస్తావన చేయబడినప్పుడు వారికి ఇబ్బంది,బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఆదేశించినది,వారించినది వారికి గుర్తు వస్తాయి. వాస్తవానికి వారు వాటన్నింటి నుండి విముఖత చూపినారు.

• يتمنى الكافر يوم القيامة افتداء نفسه بكل ما يملك مع بخله به في الدنيا، ولن يُقْبل منه.
అవిశ్వాసపరుడు ప్రళయదినమున తాను స్వయంగా తన ఆదీనంలో ఉన్న వాటన్నింటిని ఇహలోకంలో వాటి విషయంలో పిసినారి తనం చూపినా కూడా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధమవుతాడు. కాని అది అతని నుండి స్వీకరించబడదు.

 
Reikšmių vertimas Sūra: Az-Zumar
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - Kilniojo Korano sutrumpinto aiškinimo vertimas į telugų k. - Vertimų turinys

Išleido Korano studijų interpretavimo centras.

Uždaryti