Check out the new design

पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद । * - अनुवादहरूको सूची


अर्थको अनुवाद सूरः: हज्ज   श्लोक:
اُذِنَ لِلَّذِیْنَ یُقٰتَلُوْنَ بِاَنَّهُمْ ظُلِمُوْا ؕ— وَاِنَّ اللّٰهَ عَلٰی نَصْرِهِمْ لَقَدِیْرُ ۟ۙ
అల్లాహ్ ఆ విశ్వాసపరుల కొరకు ఎవరితోనైతే ముష్రికులు యధ్ధము చేస్తారో యుధ్ధము కొరకు అనుమతించాడు. ఎందుకంటే వారిపై వారి శతృవుల హింస వాటిల్లింది. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ విశ్వాసపరులకు వారి శతృవులకు వ్యతిరేకంగా యుధ్ధము లేకుండానే సహాయం చేయటంపై సామర్ధ్యం కలవాడు. కాని ఆయన విజ్ఞత విశ్వాసపరులను అవిశ్వాసపరులతో యుధ్ధముతో పరిక్షించాలని నిర్ణయిస్తుంది.
अरबी व्याख्याहरू:
١لَّذِیْنَ اُخْرِجُوْا مِنْ دِیَارِهِمْ بِغَیْرِ حَقٍّ اِلَّاۤ اَنْ یَّقُوْلُوْا رَبُّنَا اللّٰهُ ؕ— وَلَوْلَا دَفْعُ اللّٰهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَّهُدِّمَتْ صَوَامِعُ وَبِیَعٌ وَّصَلَوٰتٌ وَّمَسٰجِدُ یُذْكَرُ فِیْهَا اسْمُ اللّٰهِ كَثِیْرًا ؕ— وَلَیَنْصُرَنَّ اللّٰهُ مَنْ یَّنْصُرُهٗ ؕ— اِنَّ اللّٰهَ لَقَوِیٌّ عَزِیْزٌ ۟
ఎవరినైతే అవిశ్వాసపరులు దుర్మార్గంగా వారి ఇళ్ళ నుండి గెంటివేశారో. వారు తమ ప్రభువు అల్లాహ్ అని,మా కొరకు ఆయన తప్పా వేరే ప్రభువు లేడని పలకటం మాత్రమే వారు చేసిన పాపము. ఒక వేళ అల్లాహ్ దైవ ప్రవక్తల కొరకు, విశ్వాసపరుల కొరకు తమ శతృవుల పై యుధ్ధమును ధర్మబద్ధం చేయకుండా ఉంటే వారు ఆరాధన ప్రదేశాలపై దాడికి పాల్పడి సన్యాసుల మఠాలను,క్రైస్తవుల చర్చులను,యూదుల ఆరాధనాలయాలను,ముస్లిముల మస్జిదులు ఏవైతే నమాజు చేయటం కొరకు సిధ్ధం చేయబడి వాటిలో ముస్లిములు అల్లాహ్ స్మరణ ఎక్కువగా చేస్తారో నాశనం చేసేవారు. మరియు అల్లాహ్ తన ధర్మమును,తన ప్రవక్తకు సహాయం చేసేవాడికి తప్పక సహాయం చేస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన ధర్మమునకు సహాయం చేసే వాడికి సహాయం చేయటంలో బలవంతుడు,ఆయనపై ఎవరూ ఆధిక్యతను కనబరచని ఆధిక్యుడు.
अरबी व्याख्याहरू:
اَلَّذِیْنَ اِنْ مَّكَّنّٰهُمْ فِی الْاَرْضِ اَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ وَاَمَرُوْا بِالْمَعْرُوْفِ وَنَهَوْا عَنِ الْمُنْكَرِ ؕ— وَلِلّٰهِ عَاقِبَةُ الْاُمُوْرِ ۟
సహాయము ద్వారా వాగ్ధానం చేయబడిన వీరందరు వారే ఎవరినైతే ఒక వేళ మేము వారి శతృవులపై సహాయము చేసి భూమిలో వారికి అధికారమును ప్రసాదిస్తే వారు నమాజును పరిపూర్ణ పధ్ధతిలో పాటిస్తారు,తమ సంపదల నుండి జకాతును చెల్లిస్తారు. మరియు ధర్మం ఆదేశించిన దాన్ని ఆదేశిస్తారు. మరియు అది వారించిన దాన్ని వారిస్తారు. వ్యవహారలు వాటి పరంగా ప్రతిఫలం ప్రసాదించే విషయంలో,శిక్షించే విషయంలో మరలి వెళ్లే చోటు అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది.
अरबी व्याख्याहरू:
وَاِنْ یُّكَذِّبُوْكَ فَقَدْ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّعَادٌ وَّثَمُوْدُ ۟ۙ
ఓ ప్రవక్తా ఒక వేళ మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరిస్తే మీరు సహనం చూపండి ,జాతి వారు తిరస్కరించిన ప్రవక్తల్లోంచి మీరు మొట్ట మొదటి వారు కాదు. మీ జాతి వారి కన్నా ముందు నూహ్ అలైహిస్సలాం జాతి నూహ్ ను తిరస్కరించింది. ఆద్ జాతి హూద్ అలైహిస్సలాంను తిరస్కరించింది. మరియు సమూద్ జాతి సాలిహ్ అలైహిస్సలాంను తిరస్కరించింది.
अरबी व्याख्याहरू:
وَقَوْمُ اِبْرٰهِیْمَ وَقَوْمُ لُوْطٍ ۟ۙ
మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం జాతి ఇబ్రాహీం అలైహిస్సలాం ను తిరస్కరించింది. మరియు లూత్ అలైహిస్సలాం జాతి లూత్ అలైహిస్సలాంను తిరస్కరించింది.
अरबी व्याख्याहरू:
وَّاَصْحٰبُ مَدْیَنَ ۚ— وَكُذِّبَ مُوْسٰی فَاَمْلَیْتُ لِلْكٰفِرِیْنَ ثُمَّ اَخَذْتُهُمْ ۚ— فَكَیْفَ كَانَ نَكِیْرِ ۟
మరియు మద్యన్ వారు షుఐబ్ అలైహిస్సలాంను తిరస్కరించారు. ఫిర్ఔన్,అతని జాతి వారు మూసా అలైహిస్సలాంను తిరస్కరించారు. అప్పుడు నేను వారి జాతుల వారి నుండి శిక్షను క్రమక్రమంగా తీసుకెళ్ళటానికి ఆలస్యం చేశాను. ఆ తరువాత నేను వారిని శిక్షతో పట్టుకున్నాను. నా శిక్ష వారి పై ఎలా ఉన్నదో మీరు యోచన చేయండి. వారి తిరస్కారము వలన నేను వారిని నాశనం చేశాను.
अरबी व्याख्याहरू:
فَكَاَیِّنْ مِّنْ قَرْیَةٍ اَهْلَكْنٰهَا وَهِیَ ظَالِمَةٌ فَهِیَ خَاوِیَةٌ عَلٰی عُرُوْشِهَا ؗ— وَبِئْرٍ مُّعَطَّلَةٍ وَّقَصْرٍ مَّشِیْدٍ ۟
అయితే మేము చాలా బస్తీల వారిని కూకటి వేళ్ళతో నాశనం చేసే శిక్ష ద్వారా వినాశనమునకు గురి చేశాము. వారు తమ అవిశ్వాసం వలన దుర్మార్గులుగా ఉండేవారు. అప్పుడు వారి నివాస గృహాలు అందులో ఉండే నివాసుల నుండి ఖాళీ అయి ధ్వంసం అయి ఉన్నాయి. వారి వినాశనము వలన చాలా బావులు వాటి వద్దకు వచ్చే వారి నుండి ఖాళీగా పడి ఉన్నాయి. మరియు ఎత్తైన,అలంకరించబడిన చాలా రాజ భవనములు వాటిలో నివాసముండే వారిని శిక్ష నుండి రక్షించలేక పోయినాయి.
अरबी व्याख्याहरू:
اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَتَكُوْنَ لَهُمْ قُلُوْبٌ یَّعْقِلُوْنَ بِهَاۤ اَوْ اٰذَانٌ یَّسْمَعُوْنَ بِهَا ۚ— فَاِنَّهَا لَا تَعْمَی الْاَبْصَارُ وَلٰكِنْ تَعْمَی الْقُلُوْبُ الَّتِیْ فِی الصُّدُوْرِ ۟
ఏమీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వీరందరు వినాశనమునకు గురైన ఈ బస్తీల గుర్తులను కళ్లారా చూడటానికి భూమిలో సంచరించలేదా ?. అప్పుడు వారు గుణపాఠం నేర్చుకోవటానికి తమ బుద్దులతో యోచన చేసేవారు మరియు హితోపదేశం గ్రహించటానికి వారి గాధలను స్వీకరించే ఉద్దేశంతో వినేవారు. ఎందుకంటే అంధత్వం అనేది కళ్ళ అంధత్వం కాదు. కాని వినాశనమునకు గురి చేసే,అంతమొందించే అంధత్వము అంతర్దృష్టి అంధత్వము. ఏ విధంగా నంటే అది కలిగిన వాడికి గుణపాఠము,హితోపదేశం కలగదు.
अरबी व्याख्याहरू:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• إثبات صفتي القوة والعزة لله.
అల్లాహ్ కొరకు బలము,ఆధిక్యత రెండు గుణముల నిరూపణ.

• إثبات مشروعية الجهاد؛ للحفاظ على مواطن العبادة.
ఆరాధన స్థలాల రక్షణ కొరకు ధర్మ యుద్ధం ధర్మబద్ధం చేయబడిందని నిరూపణ.

• إقامة الدين سبب لنصر الله لعبيده المؤمنين.
ధర్మ స్థాపన విశ్వాసపరులైన తన దాసులకి అల్లాహ్ సహాయం కొరకు ఒక కారణం.

• عمى القلوب مانع من الاعتبار بآيات الله.
హృదయముల అంధత్వము అల్లాహ్ ఆయతులతో గుణపాఠము నేర్చుకోవటం నుండి ఆటంకమును కలిగిస్తుంది.

 
अर्थको अनुवाद सूरः: हज्ज
अध्यायहरूको (सूरःहरूको) सूची رقم الصفحة
 
पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद । - अनुवादहरूको सूची

मर्क्ज तफ्सीर लिद्दिरासात अल-कुर्आनियह द्वारा प्रकाशित ।

बन्द गर्नुस्