Check out the new design

पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद । * - अनुवादहरूको सूची


अर्थको अनुवाद सूरः: अन्फाल   श्लोक:
وَاعْلَمُوْۤا اَنَّمَا غَنِمْتُمْ مِّنْ شَیْءٍ فَاَنَّ لِلّٰهِ خُمُسَهٗ وَلِلرَّسُوْلِ وَلِذِی الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنِ وَابْنِ السَّبِیْلِ ۙ— اِنْ كُنْتُمْ اٰمَنْتُمْ بِاللّٰهِ وَمَاۤ اَنْزَلْنَا عَلٰی عَبْدِنَا یَوْمَ الْفُرْقَانِ یَوْمَ الْتَقَی الْجَمْعٰنِ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీరు అల్లాహ్ పై మరియు మిమ్మల్ని మీ శతృవులపై విజయమును కలిగించినప్పుడు సత్యఅసత్యాల మధ్య అల్లాహ్ వేరుపరచిన బదర్ యుద్ధ దినమున మేము మా దాసుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన దానిపై విశ్వాసముని చూపేవారే అయితే మీరు అల్లాహ్ మార్గంలో పవిత్ర యుద్ధంలో ఆధిక్యతతో అవిశ్వాసపరుల నుండి ఏవైతే పొందారో అది ఐదు భాగములుగా విభజించబడునని,ఐదింటిలో నుండి నాలుగు భాగములు ముజాహిదీన్ లలో (రణ వీరుల్లో) పంచిపెట్టబడునని,మిగిలిన ఐదవ భాగములో ఐదు భాగములు చేయబడునని,ఒక భాగము అల్లాహ్ కొరకు మరియు ఆయన ప్రవక్త కొరకు అది ముస్లిముల సార్వజనికమైన ఖర్చుల్లో ఖర్చు చేయబడునని,ఒక భాగము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరి బందువులైన హాషిమ్ సంతతి,ముత్తలిబ్ సంతతి కొరకు,ఒక భాగము అనాధల కొరకు,ఒక భాగము నిరుపేదలు,అగత్యపరుల కొరకు ఒక భాగము మార్గములు కోల్పోయిన ప్రయాణికుల కొరకు అని మీరు తెలుసుకోండి.
अरबी व्याख्याहरू:
اِذْ اَنْتُمْ بِالْعُدْوَةِ الدُّنْیَا وَهُمْ بِالْعُدْوَةِ الْقُصْوٰی وَالرَّكْبُ اَسْفَلَ مِنْكُمْ ؕ— وَلَوْ تَوَاعَدْتُّمْ لَاخْتَلَفْتُمْ فِی الْمِیْعٰدِ ۙ— وَلٰكِنْ لِّیَقْضِیَ اللّٰهُ اَمْرًا كَانَ مَفْعُوْلًا ۙ۬— لِّیَهْلِكَ مَنْ هَلَكَ عَنْ بَیِّنَةٍ وَّیَحْیٰی مَنْ حَیَّ عَنْ بَیِّنَةٍ ؕ— وَاِنَّ اللّٰهَ لَسَمِیْعٌ عَلِیْمٌ ۟ۙ
మరియు మీరు ఆ వేళను ఒకసారి గుర్తు చేసుకోండి మీరు మదీనాకి ఆవల ఉన్న లోయ దిగువ వైపున ఉన్నారు,ముష్రికులు దానికి దూరాన మక్కాకు దగ్గర ఉన్న వైపున ఉన్నారు,వర్తక బిడారం ఎర్ర సముద్ర తీరమునకు దగ్గరలో మీకన్న దిగువ ప్రదేశంలో ఉన్నది.ఒక వేళ మీరు,ముష్రికులు బదర్ లో తలబడడం గురించి పరస్పరం తీర్మానం చేసుకుని ఉంటే మీలో నుండి కొందరు కొందరిని విభేదించి ఉండేవారు.కానీ అల్లాహ్ సుబహానహు వ తఆలా తీర్మానం లేకుండానే బదర్ లో మిమ్మల్ని సమీకరించాడు ముందే నిర్ణయించబడిన ఒక పనిని పరిపూర్ణం చేయటానికి అది విశ్వాసపరుల విజయము,అవిశ్వాసపరుల పరాభవం,ఆయన ధర్మమునకు ఆధిక్యత,షిర్క్ నకు అవమానము,విశ్వాసపరుల సంఖ్యా బలం,ఆయుధా బలం తక్కువగా ఉండి కూడా వారికి వారిపై విజయము ద్వారా వారిలోంచి (ముష్రికుల్లోంచి) మరణించేవాడు అతనిపై వాదన నిరూపితమైన తరువాత మరణించటానికి,జీవించి ఉండేవాడు జీవించటానికి ఆధారం ద్వారా,వాదన ద్వారా దాన్ని అల్లాహ్ అతని కొరకు బహిర్గతం చేశాడు.అయితే అల్లాహ్ కు వ్యతిరేకంగా వాదించటానికి ఎవరికీ ఎటువంటి వాదన ఉండదు.మరియు అల్లాహ్ అందరి మాటలను వినేవాడు,వారి కర్మలను తెలుసుకునేవాడు.వాటిలోంచి ఏది కూడా ఆయనపై గోప్యంగా ఉండదు.వాటి పరంగానే వారికి ఆయన ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
अरबी व्याख्याहरू:
اِذْ یُرِیْكَهُمُ اللّٰهُ فِیْ مَنَامِكَ قَلِیْلًا ؕ— وَلَوْ اَرٰىكَهُمْ كَثِیْرًا لَّفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِی الْاَمْرِ وَلٰكِنَّ اللّٰهَ سَلَّمَ ؕ— اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు మీ కలలో ముష్రికులను తక్కువ సంఖ్యలో చూపించినప్పుడు మీపై,విశ్వాసపరులపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును గుర్తు చేసుకోండి.అయితే మీరు విశ్వాసపరులకు దాని గురించి తెలియపరిస్తే వారు దాని ద్వారా మంచిని శుభవార్తగా పొందారు.మరియు వారి శతృవుతో కలవటానికి,అతనితో పోరాడటానికి వారి ఉద్దేశాలకు బలం చేకూరింది.ఒక వేళ అల్లాహ్ సుబహానహు వ తఆలా ముష్రికులను మీ కల్లో ఎక్కువగా చూపించి ఉంటే మీ సహచరుల ఉద్దేశాలు బలహీనమైపోయేవి.మరియు వారు యుద్ధం చేయటం నుండి భయపడేవారు.కాని ఆయన దాని నుండి రక్షించాడు.మరియు వారిని ఆయన జడవటం (అధైర్యం) నుండి రక్షించాడు.అయితే ఆయన వారిని తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిలో తక్కువగా చేసి చూపించాడు.నిశ్చయంగా ఆయన హృదయాల్లో ఉన్నవాటిని,మనస్సుల్లో దాగి ఉన్నవాటిని తెలుసుకునేవాడు.
अरबी व्याख्याहरू:
وَاِذْ یُرِیْكُمُوْهُمْ اِذِ الْتَقَیْتُمْ فِیْۤ اَعْیُنِكُمْ قَلِیْلًا وَّیُقَلِّلُكُمْ فِیْۤ اَعْیُنِهِمْ لِیَقْضِیَ اللّٰهُ اَمْرًا كَانَ مَفْعُوْلًا ؕ— وَاِلَی اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۟۠
ఓ విశ్వాసపరులారా మీరు ముష్రికులతో తలబడినప్పుడు అల్లాహ్ ముష్రికులను మీ దృష్టిలో తక్కువ చేసి చూపించి మీరు వారితో యుద్ధం చేయుటకు ముందడుగు వేయటానికి మీలో ధైర్యాన్ని నింపాడు.మరియు మిమ్మల్ని వారి దృష్టిలో తక్కువ చేసి చూపిస్తే వారు మీతో యుద్ధం చేయటానికి ముందడుగు వేశారు.ముష్రికులను హతమార్చి బందీలుగా చేసి ప్రతీకారము తీర్చుకోవటం ద్వారా,శతృవులపై విశ్వాసపరులకు విజయము,సాఫల్యము ద్వారా అనుగ్రహమును కలిగించటం ద్వారా అల్లాహ్ తాను ముందే నిర్ణయించిన కార్యమును పూర్తి చేయటం కొరకు వారు మరలటం గురించి ఆలోచించ లేదు.ఒక్కడైన అల్లాహ్ వైపునే సమస్త వ్యవహారాలన్ని మరలించబడుతాయి.అయితే ఆయన పాపాత్మునికి అతని పాపముపరంగా,పుణ్యాత్మునికి అతని పుణ్యపరంగా ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
अरबी व्याख्याहरू:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا لَقِیْتُمْ فِئَةً فَاثْبُتُوْا وَاذْكُرُوا اللّٰهَ كَثِیْرًا لَّعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟ۚ
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించే వారా మీరు అవిశ్వాసపరుల్లోంచి ఏదైన వర్గమును ఎదుర్కున్నప్పుడు వారితో యుద్ధ సమయంలో స్థిరంగా ఉండండి,అధైర్య పడకండి.మరియు మీరు అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి.మీరు కోరుకున్నది ఆయన మీకు చేరుస్తాడని,మీరు దేని నుండి జాగ్రత్త పడుతున్నారో దాని నుండి మిమ్మల్ని రక్షిస్తాడని ఆశిస్తూ ఆయననే మీరు వేడుకోండి.ఆయనే వారిపై మీకు విజయమును కలిగింపజేసే సామర్ధ్యం కలవాడు.
अरबी व्याख्याहरू:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• الغنائم لله يجعلها حيث شاء بالكيفية التي يريد، فليس لأحد شأن في ذلك.
యుధ్ధప్రాప్తులు అల్లాహ్ కి చెందినవి ఆయన వాటిని ఎక్కడ తలచుకుంటే అక్కడ ఏ విధంగా కోరుకుంటే ఆ విదంగా వినియోగిస్తాడు.

• من أسباب النصر تدبير الله للمؤمنين بما يعينهم على النصر، والصبر والثبات والإكثار من ذكر الله.
విశ్వాసపరుల కొరకు వారికి సహాయమునకు,సహనమునకు,స్థిరత్వమునకు,అల్లాహ్ స్మరణ ఎక్కువగా చేయటానికి తోడ్పాటు చేసే అల్లాహ్ తఆలా పర్యాలోచన విజయ కారణాల్లోంచిది

• قضاء الله نافذ وحكمته بالغة وهي الخير لعباد الله وللأمة كلها.
అల్లాహ్ తీర్పు శాసనమగును (ప్రకటితమగును) మరియు ఆయన వివేకము ఎంతో గొప్పది.మరియు అది అల్లాహ్ దాసులకు,పూర్తి జాతికి (ఉమ్మత్ కు) మంచిది.

 
अर्थको अनुवाद सूरः: अन्फाल
अध्यायहरूको (सूरःहरूको) सूची رقم الصفحة
 
पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद । - अनुवादहरूको सूची

मर्क्ज तफ्सीर लिद्दिरासात अल-कुर्आनियह द्वारा प्रकाशित ।

बन्द गर्नुस्