पवित्र कुरअानको अर्थको अनुवाद - तेलगु अनुवाद : अब्दुर्रहीम बिन् मुहम्मद । * - अनुवादहरूको सूची

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

अर्थको अनुवाद श्लोक: (11) सूरः: सूरतुन्निसा
یُوْصِیْكُمُ اللّٰهُ فِیْۤ اَوْلَادِكُمْ ۗ— لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْاُنْثَیَیْنِ ۚ— فَاِنْ كُنَّ نِسَآءً فَوْقَ اثْنَتَیْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۚ— وَاِنْ كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ؕ— وَلِاَبَوَیْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ اِنْ كَانَ لَهٗ وَلَدٌ ۚ— فَاِنْ لَّمْ یَكُنْ لَّهٗ وَلَدٌ وَّوَرِثَهٗۤ اَبَوٰهُ فَلِاُمِّهِ الثُّلُثُ ۚ— فَاِنْ كَانَ لَهٗۤ اِخْوَةٌ فَلِاُمِّهِ السُّدُسُ مِنْ بَعْدِ وَصِیَّةٍ یُّوْصِیْ بِهَاۤ اَوْ دَیْنٍ ؕ— اٰبَآؤُكُمْ وَاَبْنَآؤُكُمْ لَا تَدْرُوْنَ اَیُّهُمْ اَقْرَبُ لَكُمْ نَفْعًا ؕ— فَرِیْضَةً مِّنَ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا ۟
మీ సంతాన వారసత్వాన్ని గురించి అల్లాహ్ మీకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని (భాగం) ఇద్దరు స్త్రీల భాగాలకు సమానంగా ఉండాలి.[1] ఒకవేళ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ స్త్రీ (సంతానం మాత్రమే) ఉంటే, వారికి విడిచిన ఆస్తిలో మూడింట రెండు భాగాలు ఉంటాయి. మరియు ఒకవేళ ఒకే ఆడపిల్ల ఉంటే అర్ధభాగానికి ఆమె హక్కుదారురాలు.[2] మరియు (మృతుడు) సంతానం కలవాడైతే, అతని తల్లిదండ్రులలో ప్రతి ఒక్కరికీ విడిచిన ఆస్తిలో ఆరోభాగం లభిస్తుంది. ఒకవేళ అతనికి సంతానం లేకుంటే అతని తల్లిదండ్రులు మాత్రమే వారసులుగా ఉంటే, అప్పుడు తల్లికి మూడోభాగం. మృతునికి సోదరసోదరీమణులు ఉంటే, తల్లికి ఆరోభాగం. (ఈ పంపకమంతా) మృతుని అప్పులు తీర్చి, అతని వీలునామా పై అమలు జరిపిన తరువాతనే జరగాలి. మీ తల్లిదండ్రులు మరియు మీ సంతానంలో ప్రయోజనం రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో, మీకు తెలియదు. ఇది అల్లాహ్ నియమించిన విధానం. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
[1] చిన్నవారైనా పెద్దవారైనా సంతానం అంతా వారసత్వానికి హక్కుదారులు. గర్భంలో ఉన్న సంతానం కూడా వారసత్వానికి హక్కుదారులు. అవిశ్వాసులైన సంతానం వారసత్వానికి హక్కుదారులు కారు. ఆడ మగ సంతానం ఉన్న పక్షంలో తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి 1/6. మిగతా 2/3 సంతానం కొరకు. భార్య లేక భర్త టే వారి హక్కు వారికిచ్చిన తరువాత మిగతాది సంతానం కొరకు. [2] ఒకవేళ ఒకే ఒక్క కుమారుడు ఉంటే, మొత్తం ఆస్తికి వారసుడు అవుతాడు. ఇతర వారసులు, అంటే తల్లి, తండ్రి, భార్య లేక భర్త ఉంటే, వారి హక్కు వారికిచ్చిన తరువాత మిగతా ఆస్తికి అతడు హక్కుదారుడు. మృతునికి ఒకే కుమార్తె ఉంటే, ఆమెకు 1/2 ఆస్తి, తల్లికి 1/6, తండ్రికి 2/6.
अरबी व्याख्याहरू:
 
अर्थको अनुवाद श्लोक: (11) सूरः: सूरतुन्निसा
अध्यायहरूको (सूरःहरूको) सूची رقم الصفحة
 
पवित्र कुरअानको अर्थको अनुवाद - तेलगु अनुवाद : अब्दुर्रहीम बिन् मुहम्मद । - अनुवादहरूको सूची

पवित्र कुर्आनको अर्थको तेलगु भाषामा अनुवाद, अनुवादक : अब्दुर्रहीम बिन मुहम्मद ।

बन्द गर्नुस्