Check out the new design

पवित्र कुरअानको अर्थको अनुवाद - तेलगु अनुवाद : अब्दुर्रहीम बिन्हम् । * - अनुवादहरूको सूची

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

अर्थको अनुवाद सूरः: अनअाम   श्लोक:
فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِیْنَ ظَلَمُوْا ؕ— وَالْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟
ఈ విధంగా దుర్మార్గానికి పాల్పబడిన వారు సమూలంగా నిర్మూలించబడ్డారు. మరియు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు.
अरबी व्याख्याहरू:
قُلْ اَرَءَیْتُمْ اِنْ اَخَذَ اللّٰهُ سَمْعَكُمْ وَاَبْصَارَكُمْ وَخَتَمَ عَلٰی قُلُوْبِكُمْ مَّنْ اِلٰهٌ غَیْرُ اللّٰهِ یَاْتِیْكُمْ بِهٖ ؕ— اُنْظُرْ كَیْفَ نُصَرِّفُ الْاٰیٰتِ ثُمَّ هُمْ یَصْدِفُوْنَ ۟
ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్ మీ వినికిడినీ మరియు మీ చూపునూ పోగొట్టి, మీ హృదయాలపై ముద్ర వేస్తే! అల్లాహ్ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా? చూడు! మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నామో! అయినా వారు (వాటి నుండి) తప్పించుకొని పోతున్నారు.
अरबी व्याख्याहरू:
قُلْ اَرَءَیْتَكُمْ اِنْ اَتٰىكُمْ عَذَابُ اللّٰهِ بَغْتَةً اَوْ جَهْرَةً هَلْ یُهْلَكُ اِلَّا الْقَوْمُ الظّٰلِمُوْنَ ۟
ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్ శిక్ష మీపై (రాత్రివేళ) ఆకస్మాత్తుగా గానీ లేక (పగటివేళ) బహిరంగంగా గాని వచ్చి పడితే, దుర్మార్గులు తప్ప ఇతరులు నాశనం చేయబడతారా?[1]
[1] చూడండి, 10:50.
अरबी व्याख्याहरू:
وَمَا نُرْسِلُ الْمُرْسَلِیْنَ اِلَّا مُبَشِّرِیْنَ وَمُنْذِرِیْنَ ۚ— فَمَنْ اٰمَنَ وَاَصْلَحَ فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
మరియు మేము ప్రవక్తలను కేవలం శుభవార్తలు ఇచ్చేవారుగా మరియు హెచ్చరికలు చేసే వారుగా మాత్రమే పంపుతాము. కావున ఎవరైతే విశ్వసించి (తమ నడవడికను) సరిదిద్దుకుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖ పడరు కూడా!
अरबी व्याख्याहरू:
وَالَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا یَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟
కాని మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారికి, తమ అవిధేయతకు ఫలితంగా తప్పకుండా శిక్ష పడుతుంది.[1]
[1] చూడండి 'స. ముస్లిం, పు. 1, అధ్యాయం - 240. అబూ హురైరా (ర'ది.'అ) కథనం : "దైవప్రవక్త ('స'అస) అన్నారు : 'ఎవరి చేతిలోనైతే నా ప్రాణముందో ఆ అల్లాహ్ (సు.తా.) సాక్షిగా! ఈ కాలపు యూదులు మరియు క్రైస్తవులలో ఎవరేగానీ నా గురించి విని నా సందేశాన్ని విశ్వసించకుండా మరణిస్తారో వారు నరకవాసులవుతారు.' "
अरबी व्याख्याहरू:
قُلْ لَّاۤ اَقُوْلُ لَكُمْ عِنْدِیْ خَزَآىِٕنُ اللّٰهِ وَلَاۤ اَعْلَمُ الْغَیْبَ وَلَاۤ اَقُوْلُ لَكُمْ اِنِّیْ مَلَكٌ ۚ— اِنْ اَتَّبِعُ اِلَّا مَا یُوْحٰۤی اِلَیَّ ؕ— قُلْ هَلْ یَسْتَوِی الْاَعْمٰی وَالْبَصِیْرُ ؕ— اَفَلَا تَتَفَكَّرُوْنَ ۟۠
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గానీ లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ, నేను మీతో అనడం లేదు. లేదా నేను దేవదూతనని కూడా అనడం లేదు. కాని, నేను కేవలం నాపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే అనుసరిస్తున్నాను[1]. వారిని ఇలా అడుగు: "ఏమీ? అంధుడూ మరియు దృష్టి గలవాడు సమానులా? అయితే మీరెందుకు ఆలోచించరు?"
[1] చూడండి, 7:188.
अरबी व्याख्याहरू:
وَاَنْذِرْ بِهِ الَّذِیْنَ یَخَافُوْنَ اَنْ یُّحْشَرُوْۤا اِلٰی رَبِّهِمْ لَیْسَ لَهُمْ مِّنْ دُوْنِهٖ وَلِیٌّ وَّلَا شَفِیْعٌ لَّعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
మరియు తమ ప్రభువు సన్నిధిలో సమావేశ పరచబడతారని భయపడే వారికి ఆయన తప్ప వేరే రక్షించేవాడు గానీ, సిఫారసు చేసే వాడు గానీ ఉండడని, దీని (ఈ ఖుర్ఆన్) ద్వారా హెచ్చరించు, బహుశా వారు దైవభీతి గలవారు అవుతారేమో!
अरबी व्याख्याहरू:
وَلَا تَطْرُدِ الَّذِیْنَ یَدْعُوْنَ رَبَّهُمْ بِالْغَدٰوةِ وَالْعَشِیِّ یُرِیْدُوْنَ وَجْهَهٗ ؕ— مَا عَلَیْكَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَیْءٍ وَّمَا مِنْ حِسَابِكَ عَلَیْهِمْ مِّنْ شَیْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُوْنَ مِنَ الظّٰلِمِیْنَ ۟
మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ, ఆయన ముఖాన్ని[1] (చూడ) గోరుతున్నారో, వారిని నీవు దూరం చేయకు. వారి లెక్క కొరకు నీవు ఎంత మాత్రమూ జవాబుదారుడవు కావు. మరియు నీ లెక్క కొరకు వారూ జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరం చేస్తే నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు.
[1] ప్రళయదినాన విశ్వాసులకు లభించే అతి గొప్ప వరం అల్లాహ్ (సు.తా.) దర్శనం. అందుకే ఖుర్ఆన్ లో అనేక చోట్లలో: "అల్లాహ్ ముఖాన్ని చూడగోరేవారు..." అని చెప్పబడింది: "ఓ ప్రవక్తా! 'ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు గల అవిశ్వాసులైన ముష్రిక్ ల మాటలలో పడి - ఇస్లాం స్వీకరించి తమ ప్రభువైన అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించే - పేదవారిని, బానిసలను దూరం చేయకు.' "
अरबी व्याख्याहरू:
 
अर्थको अनुवाद सूरः: अनअाम
अध्यायहरूको (सूरःहरूको) सूची رقم الصفحة
 
पवित्र कुरअानको अर्थको अनुवाद - तेलगु अनुवाद : अब्दुर्रहीम बिन्हम् । - अनुवादहरूको सूची

अनुवाद अब्दुर्रहीम बिन मुहम्मद ।

बन्द गर्नुस्