Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Index van vertaling


Vertaling van de betekenissen Surah: Soerat Aal-Imraan ( Het Huis van Imraan )   Vers:

సూరహ్ ఆలె ఇమ్రాన్

Het doel van deze surah:
إثبات أن دين الإسلام هو الحق ردًّا على شبهات أهل الكتاب، وتثبيتا للمؤمنين.
గ్రంథవహుల సందేహాలకు ప్రతిస్పందనగా మరియు విశ్వాసులకు దృవీకరణగా ఇస్లాం ధర్మం సత్యమని నిరూపణ.

الٓمَّٓ ۟ۙۚ
అలిఫ్ లామ్ మీమ్ – ఈ విడి విడి అక్షరాల గురించి ఇంతకు పూర్వం సూరతుల్ బఖరహ్ ప్రారంభంలో చర్చించ బడింది. ఇవి ఖుర్ఆన్ వంటి గ్రంధాన్ని రచించడంలోని అరబ్బుల అసమర్దతను సూచిస్తున్నాయి. ఎందుకంటే ఈ సూరహ్ ప్రారంభంలో వచ్చిన ఇలాంటి విడి విడి అక్షరాలు వాస్తవానికి వారి స్వంత పలుకులలోని అక్షరాలే అయినప్పటికీ వాటి ఉనికిని వారు విశ్లేషించ లేక పోయారు.
Arabische uitleg van de Qur'an:
اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْحَیُّ الْقَیُّوْمُ ۟ؕ
కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడు. ఎలాంటి మరణమూ లేదా లోటూ లేకుండా సంపూర్ణంగా జీవించేది కేవలం ఆయన మాత్రమే. స్వయంగా ఉనికిలో ఉన్నవాడు కావున ఆయనకు తన సృష్టిలోని దేని అవసరమూ లేదు. కేవలం ఆయన ద్వారా మాత్రమే సృష్టి ఉనికిలో ఉన్నది మరియు దానికి ఎల్లప్పుడూ అల్లాహ్ అవసరము ఖచ్చితంగా ఉంటుంది.
Arabische uitleg van de Qur'an:
نَزَّلَ عَلَیْكَ الْكِتٰبَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ وَاَنْزَلَ التَّوْرٰىةَ وَالْاِنْجِیْلَ ۟ۙ
ఓ ప్రవక్తా! పూర్వ గ్రంథాలలో అవతరింపజేయబడిన ధర్మాజ్ఞలు మరియు నిజమైన గాథలతో ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఆయన నీపై అవతరింప జేశాడు. ఈ గ్రంథాలన్నింటి మధ్య ఎలాంటి వైరుధ్యమూ లేదు. నీపై ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింప జేయక పూర్వం, ఆయన మూసా అలైహిస్సలాం పై తౌరాతు గ్రంథాన్నీ మరియు ఈసా అలైహిస్సలాం పై ఇంజీలు గ్రంథాన్నీ అవతరింపజేసి ఉన్నాడు. ఈ దైవగ్రంథాలన్నీ మార్గదర్శకత్వం కలిగి ఉన్నాయి. అవి ప్రజలను ఇహపరలోకాలలోని అతి ఉత్తమమైన దాని వైపు మార్గదర్శకత్వం చేశాయి. ఆయన ఈ గ్రంధాలలో సత్యం మరియు అపమార్గాల మధ్య భేదాన్ని ఎలా గుర్తించాలో వివరించాడు. అవిశ్వాసులు భయంకరమైన శిక్షలకు గురి చేయబడతారని అల్లాహ్ ఈ ఆయతులలో ప్రకటించినాడు. అల్లాహ్ సర్వశక్తిమంతుడు మరియు ఆయనను ఎవ్వరూ, ఏ శక్తీ అధిగమించలేదు. అల్లాహ్ కు, తన ప్రవక్తలను మరియు తన సందేశాన్ని తిరస్కరించిన వారిపై ప్రతీకారం తీర్చుకునే శక్తి ఖచ్చితంగా ఉన్నది.
Arabische uitleg van de Qur'an:
مِنْ قَبْلُ هُدًی لِّلنَّاسِ وَاَنْزَلَ الْفُرْقَانَ ؕ۬— اِنَّ الَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِ اللّٰهِ لَهُمْ عَذَابٌ شَدِیْدٌ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ ذُو انْتِقَامٍ ۟ؕ
ఈ దైవగ్రంథాలన్నీ మార్గదర్శకత్వం కలిగి ఉన్నాయి. అవి ప్రజలను ఇహపరలోకాలలోని అతి ఉత్తమమైన దాని వైపు మార్గదర్శకత్వం చేశాయి. ఆయన ఈ గ్రంథాలలో సత్యం మరియు అసత్యం మధ్య భేదాన్ని, సన్మార్గం మరియు అపమార్గాల మధ్య భేదాన్ని ఎలా గుర్తించాలో వివరించాడు. అవిశ్వాసులు భయంకరమైన శిక్షలకు గురి చేయబడతారని అల్లాహ్ ఈ ఆయతులలో ప్రకటించాడు. అల్లాహ్ సర్వశక్తిమంతుడు మరియు ఆయనను ఎవ్వరూ, ఏ శక్తీ అధిగమించలేదు. అల్లాహ్ కు, తన ప్రవక్తలను మరియు తన సందేశాన్ని తిరస్కరించిన వారి పై ప్రతీకారం తీర్చుకునే శక్తి ఖచ్చితంగా ఉన్నది.
Arabische uitleg van de Qur'an:
اِنَّ اللّٰهَ لَا یَخْفٰی عَلَیْهِ شَیْءٌ فِی الْاَرْضِ وَلَا فِی السَّمَآءِ ۟ؕ
భూమ్యాకాశాలలోని ఏ విషయమూ అల్లాహ్ నుండి దాగదు - అది బహిర్గతమైనదైనా లేక గుప్తమైనదైనా సరే. ప్రతీది ఆయనకు తెలుసు.
Arabische uitleg van de Qur'an:
هُوَ الَّذِیْ یُصَوِّرُكُمْ فِی الْاَرْحَامِ كَیْفَ یَشَآءُ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
మీ తల్లుల గర్భంలో వేర్వేరు రూపాలలో తన ఇష్టానుసారం మిమ్మల్ని సృష్టించేది ఆయనే. పురుషుడు లేదా స్త్రీగా, అందమైన లేదా అందవిహీనమైన రూపంలో, నలుపు లేదా తెలుపు రంగులలో. ఆయనతో పాటు ప్రేమాభిమానాలతో ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు. ఆయన సర్వశక్తిమంతుడు మరియు ఆయనను ఎవ్వరూ అధిగమించలేరు. తన ప్రణాళికలలో మరియు ధర్మాజ్ఞలలో ఆయన అత్యంత వివేకవంతుడు.
Arabische uitleg van de Qur'an:
هُوَ الَّذِیْۤ اَنْزَلَ عَلَیْكَ الْكِتٰبَ مِنْهُ اٰیٰتٌ مُّحْكَمٰتٌ هُنَّ اُمُّ الْكِتٰبِ وَاُخَرُ مُتَشٰبِهٰتٌ ؕ— فَاَمَّا الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ زَیْغٌ فَیَتَّبِعُوْنَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَآءَ الْفِتْنَةِ وَابْتِغَآءَ تَاْوِیْلِهٖ ؔۚ— وَمَا یَعْلَمُ تَاْوِیْلَهٗۤ اِلَّا اللّٰهُ ۘؐ— وَالرّٰسِخُوْنَ فِی الْعِلْمِ یَقُوْلُوْنَ اٰمَنَّا بِهٖ ۙ— كُلٌّ مِّنْ عِنْدِ رَبِّنَا ۚ— وَمَا یَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ ۟
ఓ ప్రవక్తా! ఖుర్ఆన్ ను మీపై అవతరింప జేసింది ఆయనే. అది స్పష్టమైన మరియు తేటతెల్లమైన అసందిగ్ధ ఆయతులు కలిగి ఉన్నది. అలాంటి ఆయతులు ఖుర్ఆన్ లో చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అవి ప్రమాణంగా మార్గదర్శకత్వం వహిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఇచ్చే ఆయతులను కూడా ఖుర్ఆన్ కలిగి ఉన్నది మరియు అవి చాలా మందిని అయోమయంలో పడవేస్తాయి. సత్యాన్ని విడిచిపెట్టి, మరొకటి కోరుకునే వారు స్పష్టమైన ఆయతులను వదిలి, అస్పష్టంగా ఉన్న వాటిపై దృష్టి పెడతారు. వాటి ద్వారా ప్రజలలో సందేహాలు సృష్టించడానికి మరియు వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు మరియు వారి కలుషిత, భ్రష్టుపట్టిన అభిప్రాయాలకు అనుగుణంగా వాటిని అర్థం చేసుకుంటారు. అలాంటి ఆయతుల యొక్క నిజమైన అర్థం అల్లాహ్ కు తప్ప వేరెవ్వరికీ తెలియదు. ఎవరైతే ధర్మజ్ఞానంలో దృఢంగా ఉన్నారో, అలాంటి వారు 'మాకు మొత్తం ఖుర్ఆన్ మీద విశ్వాసం ఉంది, ఎందుకంటే అదంతా అల్లాహ్ నుండి మాత్రమే అవతరించింది' అంటారు. వారు అస్పష్టమైన ఆయతులను, స్పష్టమైన ఆయతుల వెలుగులో అర్థం చేసుకుంటారు. ఎవరికైతే మంచి మనస్సు ఉన్నదో, వారు మాత్రమే ఈ విషయంపై తమ దృష్టి పెడతారు.
Arabische uitleg van de Qur'an:
رَبَّنَا لَا تُزِغْ قُلُوْبَنَا بَعْدَ اِذْ هَدَیْتَنَا وَهَبْ لَنَا مِنْ لَّدُنْكَ رَحْمَةً ۚ— اِنَّكَ اَنْتَ الْوَهَّابُ ۟
ధర్మజ్ఞానంలో దృఢంగా ఉన్నవారు, 'ఓ మా ప్రభూ! నీవు మాకు సత్యాన్ని చూపించిన తరువాత మా హృదయాలను సత్యానికి దూరంగా పోనివ్వవద్దు. సత్యం నుండి దూరంగా వెళ్లిపోయిన వారు గురి చేయబడినటు వంటి శిక్షల నుండి మమ్మల్ని రక్షించు. నీ అపారమైన దయ నుండి, మా హృదయాలకు మార్గనిర్దేశం చేసే మరియు మమ్మల్ని తప్పుదారి పట్టించకుండా కాపాడే దానిని మాకు ప్రసాదించు. ఓ మా ప్రభూ! అమితంగా ప్రసాదించేవాడివి నీవే.
Arabische uitleg van de Qur'an:
رَبَّنَاۤ اِنَّكَ جَامِعُ النَّاسِ لِیَوْمٍ لَّا رَیْبَ فِیْهِ ؕ— اِنَّ اللّٰهَ لَا یُخْلِفُ الْمِیْعَادَ ۟۠
ఓ మా ప్రభూ! ఎలాంటి సందేహమూ లేని ఆ దినాన నీవు మానవులందరినీ వారి లెక్క తీసుకోవడానికి నీ వద్ద సమీకరిస్తావు. అది ఖచ్చితంగా వచ్చితీరుతుంది. ఓ మా ప్రభూ! నీవు చేసిన వాగ్దానాలను ఉల్లంఘించవు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• أقام الله الحجة وقطع العذر عن الخلق بإرسال الرسل وإنزال الكتب التي تهدي للحق وتحذر من الباطل.
అల్లాహ్ ప్రవక్తలను పంపించి,సత్యమును మార్గదర్శకం చేసే,అసత్యము నుండి హెచ్చరించే గ్రంధములను అవతరింపజేసి వాదనను నెలకొల్పాడు మరియు సృష్టి నుండి సాకులను తొలగించాడు.

• كمال علم الله تعالى وإحاطته بخلقه، فلا يغيب عنه شيء في الأرض ولا في السماء، سواء كان ظاهرًا أو خفيًّا.
అల్లాహ్ యొక్క జ్ఞాన పరిపూర్ణత మరియు ఆయన తన సృష్టిని చుట్టముట్టడం మరియు భూమ్యాకాశాలలో ఏదీ ఆయన నుండి దాగిలేదు – అది బహిరంగమైనదైనా లేదా గుప్తమైనదైనా సరే.

• من أصول أهل الإيمان الراسخين في العلم أن يفسروا ما تشابه من الآيات بما أُحْكِم منها.
దృఢమైన జ్ఞానం గల విశ్వాసులు పాటించవలసిన ప్రాథమిక నియమాలలోని ఒక నియమం ఏమిటంటే, అస్పష్టమైన ఆయతులను స్పష్టమైన ఆయతుల సహాయంతో వ్యాఖ్యానించటం.

• مشروعية دعاء الله تعالى وسؤاله الثبات على الحق، والرشد في الأمر، ولا سيما عند الفتن والأهواء.
సత్యం పై నిలకడగా, స్థిరంగా ఉండటమును,వ్యవహారాల్లో సన్మార్గం పొందటమును ప్రత్యేకించి ఉపద్రవాలు,మనోవాంఛలు చెలరేగినప్పుడు అల్లాహ్ ను అర్ధించటం మరియు ఆయనను వేడుకోవటం ధర్మబద్ధం చేయబడింది.

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا لَنْ تُغْنِیَ عَنْهُمْ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ مِّنَ اللّٰهِ شَیْـًٔا ؕ— وَاُولٰٓىِٕكَ هُمْ وَقُوْدُ النَّارِ ۟ۙ
అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించని ప్రజల సంపద మరియు సంతానం, ఇహపరలోకాలలో అల్లాహ్ యొక్క శిక్ష నుండి వారిని కాపాడలేవు. ప్రళయదినం నాడు అటువంటి అవిశ్వాసులు నరకాగ్ని కొరకు ఇంధనంగా మారతారు మరియు వారితో నరకాగ్ని ముట్టించబడుతుంది.
Arabische uitleg van de Qur'an:
كَدَاْبِ اٰلِ فِرْعَوْنَ ۙ— وَالَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— كَذَّبُوْا بِاٰیٰتِنَا ۚ— فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْ ؕ— وَاللّٰهُ شَدِیْدُ الْعِقَابِ ۟
అటువంటి అవిశ్వాసుల పరిస్థితి అల్లాహ్ ను మరియు ఆయన ఆయతులను తిరస్కరించిన ఫిరౌను మరియు అతడికి పూర్వం జీవించిన అవిశ్వాసుల మాదిరిగా ఉంది. కాబట్టి, వారి పాపాల కారణంగా అల్లాహ్ వారిని శిక్షించాడు. ఆ అవిశ్వాసుల సంపద మరియు సంతానం వారిని ఏమాత్రమూ కాపాడ లేక పోయింది. తనపై మరియు తన ఆయతులపై విశ్వాసం చూపని అవిశ్వాసులను అల్లాహ్ చాలా తీవ్రంగా శిక్షిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
قُلْ لِّلَّذِیْنَ كَفَرُوْا سَتُغْلَبُوْنَ وَتُحْشَرُوْنَ اِلٰی جَهَنَّمَ ؕ— وَبِئْسَ الْمِهَادُ ۟
ఓ ప్రవక్తా! ఏ ధర్మాన్ని అనుసరించే అవిశ్వాసులైనా సరే, వారితో ఇలా చెప్పండి, “విశ్వాసులు మిమ్మల్ని ఓడిస్తారు. మీరు అవిశ్వాసులుగా చనిపోతారు. తరువాత అల్లాహ్ మిమ్మల్ని నరకంలో జమ చేస్తాడు. మీ కొరకు అది ఎంత చెడ్డ నివాస స్థలమో!”
Arabische uitleg van de Qur'an:
قَدْ كَانَ لَكُمْ اٰیَةٌ فِیْ فِئَتَیْنِ الْتَقَتَا ؕ— فِئَةٌ تُقَاتِلُ فِیْ سَبِیْلِ اللّٰهِ وَاُخْرٰی كَافِرَةٌ یَّرَوْنَهُمْ مِّثْلَیْهِمْ رَاْیَ الْعَیْنِ ؕ— وَاللّٰهُ یُؤَیِّدُ بِنَصْرِهٖ مَنْ یَّشَآءُ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَعِبْرَةً لِّاُولِی الْاَبْصَارِ ۟
బదర్ యుద్ధంలో పోరాడటానికి ఎదురు బదురైన రెండు వర్గాలలో ఒక స్పష్టమైన సంకేతం మరియు గుణపాఠం ఉన్నది. అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ఆయన సహచరులతో ఒక వర్గం ఏర్పడినది; వారు అల్లాహ్ కొరకు పోరాడుతున్నారు మరియు అవిశ్వాసుల అసత్యాలకు వ్యతిరేకంగా అల్లాహ్ యొక్క సత్యసందేశాన్ని స్థాపించడానికి వారు పోరాడుతున్నారు. మక్కాలోని అవిశ్వాసులతో రెండో వర్గం ఏర్పడినది; వారు దురహంకారంతో మరియు ప్రదర్శనా బుద్ధితో పోరాడేందుకు వచ్చారు. విశ్వాసులు తమ సంఖ్య కంటే రెండింతలు అధికంగా ఉన్న అవిశ్వాసులను చూశారు; కానీ, అల్లాహ్ తన వర్గానికి సహాయం చేశాడు. అల్లాహ్ తాను ఎవరికి తలిస్తే వారికి సహాయం చేస్తాడు. సంఖ్యలో తక్కువగా ఉన్నా సరే, ఇందులో అల్లాహ్ యొక్క సహాయం విశ్వాసులకు చేరుతుందని మరియు సంఖ్యలో అధికంగా ఉన్నప్పటికీ అసత్యంపై ఉన్నవారు ఓడిపోతారనే వాస్తవాన్ని గ్రహించేందుకు అంతర్ దృష్టి గల వారికి ఒక గుణపాఠం మరియు హెచ్చరిక ఉన్నది.
Arabische uitleg van de Qur'an:
زُیِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوٰتِ مِنَ النِّسَآءِ وَالْبَنِیْنَ وَالْقَنَاطِیْرِ الْمُقَنْطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَیْلِ الْمُسَوَّمَةِ وَالْاَنْعَامِ وَالْحَرْثِ ؕ— ذٰلِكَ مَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَاللّٰهُ عِنْدَهٗ حُسْنُ الْمَاٰبِ ۟
ప్రజలను పరీక్షించేందుకు, ప్రాపంచిక విషయాలను ఆకర్షణీయంగా, ప్రజలు వాటిని ప్రేమించేలా చేశానని అల్లాహ్ తెలుపు తున్నాడు. వీటిలో స్త్రీలు, పిల్లలు, దినదినాభివృద్ది చెందుతూ కుప్పలు కుప్పలుగా పడి ఉండే సంపద (బంగారం మరియు వెండి రూపాలలో), సుశిక్షితులైన అందమైన గుర్రాలు, పశుసంపద (ఒంటెలు, ఆవులు మరియు గొర్రెలు వంటివి), పంటపొలాలు మొదలైన వన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ ప్రాపంచిక భోగభాగ్యాలు అనుభవించేందుకు కొద్దికాలం వరకు మాత్రమే పనికి వస్తాయి. ఒక విశ్వాసి ఇలాంటి విషయాల వైపు ఆకర్షించ బడకూడదు, ఎందుకంటే అతడి మంచిపనులకు బదులుగా ఎంతో ఉత్తమమైన స్థానాన్ని అల్లాహ్ అతడికి ప్రసాదించ బోతున్నాడు - అది భూమ్యాకాశాలంత విశాలమైన స్వర్గం.
Arabische uitleg van de Qur'an:
قُلْ اَؤُنَبِّئُكُمْ بِخَیْرٍ مِّنْ ذٰلِكُمْ ؕ— لِلَّذِیْنَ اتَّقَوْا عِنْدَ رَبِّهِمْ جَنّٰتٌ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا وَاَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَّرِضْوَانٌ مِّنَ اللّٰهِ ؕ— وَاللّٰهُ بَصِیْرٌ بِالْعِبَادِ ۟ۚ
ఓ ప్రవక్తా! ప్రకటించండి, ఈ వాంఛల కంటే ఉత్తమమైన వాటి గురించి మీకు తెలుప మంటారా ? అల్లాహ్ యొక్క ధర్మాజ్ఞలు పాటిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ సదా అల్లాహ్ ను గుర్తు చేసుకుంటూ జీవితం గడిపే వారి కొరకు చెట్ల క్రింద నుండి ప్రవహించే నదులతో నిండిన ఆహ్లాదకరమైన తోటలు మరియు అందమైన భవనాలు ఉన్నాయి. అక్కడ వారు మరణించరు మరియు నశించిపోరు, శాశ్వతంగా జీవిస్తారు. వారి కొరకు అక్కడ తమ రూపురేఖలలో మరియు గుణగణాలలో ఎలాంటి లోపాలు మరియు కొరతలు లేని, అన్నీ విధాలుగా పరిశుద్ధమైన భార్యలు కూడా ఉంటారు. అదనంగా వారు అల్లాహ్ యొక్క ఇష్టత పొందుతారు. అల్లాహ్ వారిపై ఎన్నటికీ కోపగించుకోడు. అల్లాహ్ తన దాసుల చర్యలు గమనిస్తూ ఉన్నాడు. ఆయన నుండి ఏదీ దాగదు. వారు చేసే పనులకు ఆయన తగిన ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• أن غرور الكفار بأموالهم وأولادهم لن يغنيهم يوم القيامة من عذاب الله تعالى إذا نزل بهم.
ఎప్పుడైతే అవిశ్వాసులపై ప్రళయదినం నాడు అల్లాహ్ యొక్క శిక్ష పడుతుందో, తమ సంపద మరియు సంతానం పై వారికున్న అహంకారం అక్కడ వారిని దాని నుండి కాపాడదు.

• النصر حقيقة لا يتعلق بمجرد العدد والعُدة، وانما بتأييد الله تعالى وعونه.
విజయం అనేది సైనికుల సంఖ్యాబలం మరియు యుద్ధసామగ్రి (తయారీ)పై ఆధారపడి ఉండదు. అది కేవలం అల్లాహ్ యొక్క సహాయం మరియు మద్దతుపైనే ఆధారపడి ఉంటుంది.

• زَيَّن الله تعالى للناس أنواعًا من شهوات الدنيا ليبتليهم، وليعلم تعالى من يقف عند حدوده ممن يتعداها.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రజలను పరీక్షించేందుకు గాను ప్రాపంచిక మనోవాంఛలను ఆకర్షణీయంగా చేసాడు. ఆయన విధించిన హద్దులను ఎవరు గౌరవిస్తారో మరియు ఎవరు అతిక్రమిస్తారో, ఆయన తెలుసుకోవటానికి.

• كل نعيم الدنيا ولذاتها قليل زائل، لا يقاس بما في الآخرة من النعيم العظيم الذي لا يزول.
ప్రపంచంలోని అన్నీ వినోదాలు మరియు ఉల్లాసాలు కొద్దికాలం మాత్రమే ఉంటాయి, అవి క్షణికమైనవి. మరణానంతరం లభించబోయే అనుగ్రహాలతో వాటిని పోల్చలేము ఎందుకంటే అవి ఎన్నటికీ అంతం కానివి మరియు శాశ్వతమైనవి.

اَلَّذِیْنَ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اِنَّنَاۤ اٰمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَقِنَا عَذَابَ النَّارِ ۟ۚ
స్వర్గవాసులు తమ ప్రభువు వద్ద వేడుకునే ప్రార్థనలలో ఇలా పలికేవారు, “ఓ మా ప్రభూ! మేము నిన్ను విశ్వసించాము మరియు నీ ప్రవక్తలపై అవతరించిన దానినీ విశ్వసించాము. మేము నీ షరీఅహ్ (పవిత్ర చట్టాన్ని) ను అనుసరించాము. కాబట్టి మేము చేసిన పాపాలను క్షమించు మరియు నరకాగ్ని బాధల నుండి మమ్మల్ని కాపాడు”.
Arabische uitleg van de Qur'an:
اَلصّٰبِرِیْنَ وَالصّٰدِقِیْنَ وَالْقٰنِتِیْنَ وَالْمُنْفِقِیْنَ وَالْمُسْتَغْفِرِیْنَ بِالْاَسْحَارِ ۟
మరియు వారు అల్లాహ్ కు విధేయత చూపడంలో, చెడు పనులకు దూరంగా ఉండటంలో, తమపై వచ్చి పడిన ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, ఆపదలను ఎదుర్కొనడంలో సహనం, ఓర్పు వహించేవారు. తమ మాటలలో మరియు చేతలలో సత్యవంతులై ఉండేవారు. అల్లాహ్ యొక్క షరీఅహ్ (పవిత్ర ధర్మచట్టాన్ని) ను పూర్తిగా అనుసరించేవారు. అల్లాహ్ మార్గంలో తమ సంపద ఖర్చు పెట్టేవారు. ప్రార్థనలు ఆమోదించబడే మరియు మనస్సు చలించకుండా ఏకాగ్రతతో ఉండే రాత్రి చివరి జాము వేళ తమను మన్నించమని, క్షమించమని అల్లాహ్ ను వేడుకునేవారు.
Arabische uitleg van de Qur'an:
شَهِدَ اللّٰهُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۙ— وَالْمَلٰٓىِٕكَةُ وَاُولُوا الْعِلْمِ قَآىِٕمًا بِالْقِسْطِ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟ؕ
తన ఏకదైవత్వాన్ని సూచించే షరిఅహ్ చట్టం (పవిత్ర ధర్మశాసనం) మరియు సార్వత్రిక చిహ్నాల ఆధారంగా కేవలం తాను మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. దైవదూతలు మరియు జ్ఞానులు కూడా ఆయన ఏకత్వాన్ని బహిరంగంగా ప్రకటించడం మరియు ఆహ్వానించడం ద్వారా దీనికి సాక్ష్యమిస్తున్నారు. ఎవరైనా సాక్ష్యమివ్వ గలిగే విషయాలన్నింటిలోని అతి గొప్ప విషయంపై వారు సాక్ష్యమిస్తున్నారు అంటే కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధించబడే సంపూర్ణ హక్కు, ఇంకా ఆయన సృష్టి మరియు షరీఅహ్ (పవిత్ర ధర్మశాసనం) చట్టంలోని పరిపూర్ణ న్యాయంపై సాక్ష్యం ఇవ్వడం. అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడూ లేడని, ఆయనను అధిగమించే శక్తి ఎవ్వరికీ లేదని, తన సృష్టిలో, ప్రణాళికలో మరియు శాసించడంలో ఆయనను మించిన వివేకవంతులు లేరనే సాక్ష్యం, ఎవరైనా ఇవ్వగలిగే సాక్ష్యాలన్నింటి కంటే అత్యంత గొప్ప సాక్ష్యం.
Arabische uitleg van de Qur'an:
اِنَّ الدِّیْنَ عِنْدَ اللّٰهِ الْاِسْلَامُ ۫— وَمَا اخْتَلَفَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْ بَعْدِ مَا جَآءَهُمُ الْعِلْمُ بَغْیًا بَیْنَهُمْ ؕ— وَمَنْ یَّكْفُرْ بِاٰیٰتِ اللّٰهِ فَاِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟
అల్లాహ్ దృష్టిలో ఆమోదయోగ్యమైన మార్గం ఇస్లాం మార్గం మాత్రమే, సృష్టికర్తకు సమర్పించుకునే ఏకైక మార్గం - అంటే మంచిపనులన్నీ భక్తితో కేవలం అల్లాహ్ కు మాత్రమే అర్పించుకోవడం, వినయవిధేయతలతో మరియు అణుకువతో కేవలం అల్లాహ్ కు మాత్రమే దాస్యం చేయడం తో పాటు, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో సహా అల్లాహ్ యొక్క ప్రవక్తలందరినీ నమ్మడం, అంతిమ ప్రవక్త తరువాత దివ్యసందేశాల పరంపర ముగిసి పోయిందని మరియు ఆయన సల్లల్లాహుఅలైహివసల్లం తరువాత అంతిమదినం వరకు ఆయన సల్లల్లాహుఅలైహివసల్లం యొక్క షరిఅహ్ (పవిత్ర ధర్మశాసనం) తప్ప మరే చట్టమూ చెల్లదని నమ్మడం. తమ వద్దకు జ్ఞానం రూపంలో వచ్చినది తమకు వ్యతిరేకంగా సాక్ష్యంగా స్థాపితమైన తర్వాత, ప్రాపంచిక ఈర్ష్యాద్వేషాలు మరియు అత్యాశల కారణంగా, యూదులు మరియు క్రైస్తవులు అనేక వర్గాలుగా మరియు తెగలుగా విడిపోయారు. ఇంకా ఎవరైతే తన ప్రవక్తపై అల్లాహ్ అవతరింపజేసిన ఆయతులను (వచనాలను) తిరస్కరిస్తారో, అలాంటి వారిని అంటే తనను మరియు తన ప్రవక్తలను విశ్వసించని వారిని శిక్షించడంలో అల్లాహ్ ఏమాత్రం ఆలస్యం చేయడు.
Arabische uitleg van de Qur'an:
فَاِنْ حَآجُّوْكَ فَقُلْ اَسْلَمْتُ وَجْهِیَ لِلّٰهِ وَمَنِ اتَّبَعَنِ ؕ— وَقُلْ لِّلَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ وَالْاُمِّیّٖنَ ءَاَسْلَمْتُمْ ؕ— فَاِنْ اَسْلَمُوْا فَقَدِ اهْتَدَوْا ۚ— وَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا عَلَیْكَ الْبَلٰغُ ؕ— وَاللّٰهُ بَصِیْرٌ بِالْعِبَادِ ۟۠
ఓ ప్రవక్తా! మీపై అవతరింపజేయబడిన సత్యసందేశంపై ఒకవేళ వారు మీతో వాదనలకు దిగితే, వారికి ఇలా జవాబివ్వండి “నేను మరియు నన్ను అనుసరించే విశ్వాసులు అల్లాహ్ కు సమర్పించుకున్నాము”. అలాగే ఓ ప్రవక్తా! గ్రంథప్రజలతో మరియు విగ్రహారాధకులతో ఇలా ప్రశ్నించండి, “నేను తెచ్చినదాన్ని (దివ్యసందేశాన్ని) అనుసరిస్తూ, మనస్పూర్తిగా మీరు అల్లాహ్ కు సమర్పించుకుంటారా ?” ఒకవేళ వారు అల్లాహ్ కు సమర్పించుకుని, మీ షరిఅహ్ (పవిత్ర ధర్మశాసనం) చట్టాన్ని అనుసరిస్తే, వారు సన్మార్గంపై ఉన్నట్లే. ఒకవేళ వారు ఇస్లాం నుండి మరలిపోతే, మీ బాధ్యత కేవలం వారికి మీ సందేశాన్ని అందజేయడం వరకే. అలాంటి వారి గురించి అల్లాహ్ నిర్ణయిస్తాడు. ఆయన తన దాసులను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు మరియు వారి పనులకు బదులుగా ఆయన వారికి తగిన ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
اِنَّ الَّذِیْنَ یَكْفُرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ وَیَقْتُلُوْنَ النَّبِیّٖنَ بِغَیْرِ حَقٍّ ۙ— وَّیَقْتُلُوْنَ الَّذِیْنَ یَاْمُرُوْنَ بِالْقِسْطِ مِنَ النَّاسِ ۙ— فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِیْمٍ ۟
కేవలం అల్లాహ్ మాత్రమే సర్వలోకాల ప్రభువు అనీ, సకల ఆరాధనలకు ఏకైక అర్హుడనీ సూచించే అల్లాహ్ యొక్క ఆయతులను (సంకేతాలను, చిహ్నాలను) విశ్వసించని వారు, ద్వేషం కారణంగా ఆయన యొక్క ప్రవక్తలను మరియు మంచిపనులు చేయమని, చెడుపనులు చేయవద్దని ఆజ్ఞాపిస్తూ న్యాయస్థాపన వైపు ఆహ్వానించే వారిని అన్యాయంగా వధించేవారి కొరకు బాధాకరమైన శిక్ష వేచి ఉన్నదనే వార్తను ఈ హంతకులైన అవిశ్వాసపరులకు శుభవార్త తెలుపండి.
Arabische uitleg van de Qur'an:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ؗ— وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِیْنَ ۟
విశ్వసించకపోవడం వలన అలాంటి వారి ఆచరణలన్నీ వ్యర్థమై పోతాయి. ఈ ప్రపంచంలోనూ మరియు పరలోకంలోనూ వారికి అవి ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చవు. నరకాగ్ని శిక్షల నుండి వారిని కాపాడే వారెవరూ ఉండరు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• من أعظم ما يُكفِّر الذنوب ويقي عذاب النار الإيمان بالله تعالى واتباع ما جاء به الرسول صلى الله عليه وسلم.
పాపాలను తుడిచి పెట్టే మరియు నరకాగ్ని శిక్షల నుండి కాపాడే అత్యంత గొప్ప విషయం ఏమిటంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను విశ్వసించడం మరియు ప్రవక్త తీసుకు వచ్చిన దానిని అనుసరించడం.

• أعظم شهادة وحقيقة هي ألوهية الله تعالى ولهذا شهد الله بها لنفسه، وشهد بها ملائكته، وشهد بها أولو العلم ممن خلق.
అత్యంత గొప్పదైన మరియు వాస్తవమైన సాక్ష్యము ఏదంటే కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. అందువలన అల్లాహ్ స్వయంగా దీనిపై సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేగాక ఆయన యొక్క దైవదూతలు మరియు జ్ఞానులు కూడా దీనిపై సాక్ష్యం ఇస్తున్నారు.

• البغي والحسد من أعظم أسباب النزاع والصرف عن الحق.
తిరుగుబాటు మరియు అసూయ అనేవి సంఘర్షణకు దారి తీస్తాయి మరియు సత్యం నుండి దూరం చేసి పరధ్యానానికి గురి చేస్తాయి.

اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ اُوْتُوْا نَصِیْبًا مِّنَ الْكِتٰبِ یُدْعَوْنَ اِلٰی كِتٰبِ اللّٰهِ لِیَحْكُمَ بَیْنَهُمْ ثُمَّ یَتَوَلّٰی فَرِیْقٌ مِّنْهُمْ وَهُمْ مُّعْرِضُوْنَ ۟
ఓ ప్రవక్తా! తౌరాతు జ్ఞానం కలిగి ఉండి నీ ప్రవక్తత్త్వానికి సాక్ష్యం ఇస్తున్న యూదులను నీవు చూడలేదా ? ఏ విషయంలోనైతే వారు విభేదిస్తున్నారో, దాని గురించి తేల్చేందుకు అల్లాహ్ గ్రంథమైన తౌరాతు గ్రంథాన్ని పరిశీలించమని వారికి పిలుపు ఇచ్చినప్పుడు, తౌరాతులోని ధర్మాదేశాల గురించి తాము ఎరుగనట్లు వారిలోని ఒక పండితుల మరియు నాయకుల బృందం వెనుదిరిగి పోయింది. ఎందుకంటే ఆ తౌరాతు గ్రంథంలోని ధర్మాదేశాలు వారి వాంఛలతో ఏకీభవించడం లేదు. వారు తౌరాతు గ్రంథాన్ని అనుసరిస్తూ, దాని తీర్పును యథాతథంగా, నిస్సంకోచంగా స్వీకరించడమే వారి కొరకు సరైన విషయమై ఉండేది.
Arabische uitleg van de Qur'an:
ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْا لَنْ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعْدُوْدٰتٍ ۪— وَّغَرَّهُمْ فِیْ دِیْنِهِمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟
వారు సత్యం నుండి దూరంగా పోయారు మరియు సత్యాన్ని ఉపేక్షించారు. ఎందుకంటే ప్రళయదినాన తమను నరకాగ్ని కొన్ని రోజులు మాత్రమే తాకుతుందని, ఆ తరువాత స్వర్గంలో ప్రవేశిస్తామని వారు వాదించేవారు. వారు కల్పించుకున్న అసత్యాలు,అబద్దాలైన ఆలోచన వారిని మోసానికి గురి చేసింది. ఈ విధంగా వారు అల్లాహ్ కు ఆయన ధర్మమునకు వ్యతిరేకంగా ధైర్యం చేశారు.
Arabische uitleg van de Qur'an:
فَكَیْفَ اِذَا جَمَعْنٰهُمْ لِیَوْمٍ لَّا رَیْبَ فِیْهِ ۫— وَوُفِّیَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
వారి పరిస్థితి ఏమవుతుంది మరియు వారు ఎంతగా బాధపడతారు, పశ్చాత్తాప పడతారు ? పునరుత్థాన దినాన లెక్క తీసుకోవడానికి మేము వారిని జమ చేసినప్పుడు, అది చాలా భయంకరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మంచి పనులలో తగ్గింపు లేదా చెడు పనులలో హెచ్చింపు వంటి దౌర్జన్యాలు, అన్యాయాలకు తావు లేకుండా ప్రతీ వ్యక్తికీ, అతడి ఆచరణలకు బదులుగా తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది.
Arabische uitleg van de Qur'an:
قُلِ اللّٰهُمَّ مٰلِكَ الْمُلْكِ تُؤْتِی الْمُلْكَ مَنْ تَشَآءُ وَتَنْزِعُ الْمُلْكَ مِمَّنْ تَشَآءُ ؗ— وَتُعِزُّ مَنْ تَشَآءُ وَتُذِلُّ مَنْ تَشَآءُ ؕ— بِیَدِكَ الْخَیْرُ ؕ— اِنَّكَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
ఓ ప్రవక్తా! నీ ప్రభువును స్తుతిస్తూ మరియు ఆయన ఘనతను ప్రకటించడంలో ఇలా ప్రశంసించు: ఓ అల్లాహ్! ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో అధికారమంతా నీకే చెందుతుంది. నీవు నీ సృష్టిలో ఎవరికి కావాలనుకుంటే వారికి అధికారం ఇస్తావు మరియు నీ సృష్టిలో నీవు కోరుకునే వారి నుండి దాన్ని తొలగిస్తావు. నీవు కోరుకున్న వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరుకున్న వారిని అవమానిస్తావు. ఇవన్నీ నీ జ్ఞానం మరియు న్యాయం ప్రకారమే జరుగుతాయి. మంచి అంతా నీ చేతిలో మాత్రమే ఉంది. ప్రతిదానిపై నీకు అధికారం ఉంది.
Arabische uitleg van de Qur'an:
تُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَتُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ ؗ— وَتُخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَتُخْرِجُ الْمَیِّتَ مِنَ الْحَیِّ ؗ— وَتَرْزُقُ مَنْ تَشَآءُ بِغَیْرِ حِسَابٍ ۟
(ఓ అల్లాహ్) నీ శక్తి యొక్క ప్రదర్శన ఏమిటంటే, నీ వలననే రాత్రి పగటిలోకి ప్రవేశించడం ద్వారా రాత్రి సుదీర్ఘం అవుతుంది మరియు పగటి రాత్రిలోకి ప్రవేశించడం ద్వారా పగలు సుదీర్ఘం అవుతున్నది. దీనికి కారణం నీవే. నీవు అవిశ్వాసిలో నుండి విశ్వాసిని మరియు విత్తనాల నుండి పంటలను బయటికి తీసినట్లుగా, నీవు నిర్జీవమైన వాటి నుండి జీవమున్న వాటిని బయటికి తీస్తావు. అలాగే విశ్వాసిలో నుండి అవిశ్వాసిని మరియు కోడిలో నుండి గ్రుడ్డును బయటికి తీసినట్లుగా నీవు జీవమున్న వాటి నుండి నిర్జీవమైన వాటిని బయటికి తీస్తావు. నీవు తలిచిన వారికి ఎలాంటి పరిమితి లేదా లెక్క లేకుండా సమృద్ధిగా ప్రసాదిస్తావు.
Arabische uitleg van de Qur'an:
لَا یَتَّخِذِ الْمُؤْمِنُوْنَ الْكٰفِرِیْنَ اَوْلِیَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِیْنَ ۚ— وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ فَلَیْسَ مِنَ اللّٰهِ فِیْ شَیْءٍ اِلَّاۤ اَنْ تَتَّقُوْا مِنْهُمْ تُقٰىةً ؕ— وَیُحَذِّرُكُمُ اللّٰهُ نَفْسَهٗ ؕ— وَاِلَی اللّٰهِ الْمَصِیْرُ ۟
ఓ విశ్వాసులారా! ఇతర విశ్వాసులను విడిచి పెట్టి, మీరు ప్రేమించే మరియు మద్దతునిచ్చే అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోకండి: ఇలా చేసిన వారికి అల్లాహ్ ఏ విధంగానూ సహాయం చేయడు. అయితే, ఒకవేళ మీరు వారి అధికారం కింద ఉండి, ప్రాణభయంతో ఉంటే, మనసు లోపల వారిని అసహ్యించుకుంటూ, పైకి మాత్రం మీ మాటల్లో మరియు చేతల్లో వారితో మంచిగా ప్రవర్తిస్తే అందులో ఎలాంటి హానీ ఉండదు. అల్లాహ్ తన గురించి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆయనకు భయపడండి మరియు పాపాలు చేయడం ద్వారా ఆయన కోపానికి గురికాకండి. పునరుత్థాన దినం నాడు తమ ఆచరణల ప్రతిఫలం కోసం మానవులందరూ అల్లాహ్ వైపునకే మరలుతారు.
Arabische uitleg van de Qur'an:
قُلْ اِنْ تُخْفُوْا مَا فِیْ صُدُوْرِكُمْ اَوْ تُبْدُوْهُ یَعْلَمْهُ اللّٰهُ ؕ— وَیَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
ఓ ప్రవక్తా! ప్రకటించండి : అల్లాహ్ నిషేధించిన అవిశ్వాసులతో స్నేహం చేయడం వంటి వాటిని మీరు మీ హృదయాల్లో దాచుకున్నా లేదా అదే బయటికి వెల్లడించినా, దాని గురించి అల్లాహ్ కు తెలిసి పోతుంది. ఆయన నుండి ఏదీ దాగదు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదీ ఆయనకు తెలుసు. ఆయన ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నాడు. ఆయనను ఏదీ అశక్తుడినిగా చేయదు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• أن التوفيق والهداية من الله تعالى، والعلم - وإن كثر وبلغ صاحبه أعلى المراتب - إن لم يصاحبه توفيق الله لم ينتفع به المرء.
కేవలం అల్లాహ్ నుండి మాత్రమే మార్గదర్శకత్వం మరియు సాఫల్యం లభిస్తుంది. ఎంతో తెలివైన వ్యక్తి, అత్యున్నత స్థానాలకు చేరుకున్నప్పటికీ, అల్లాహ్ యొక్క అనుగ్రహం లేకుండా అది అతడికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు.

• أن الملك لله تعالى، فهو المعطي المانع، المعز المذل، بيده الخير كله، وإليه يرجع الأمر كله، فلا يُسأل أحد سواه.
అధికారం మొత్తం కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది: ఆయన మాత్రమే ప్రసాదించేవాడు మరియు వెనక్కి తీసుకునేవాడూను; గౌరవం ప్రసాదించేవాడూ మరియు అవమానం పాలు చేసేవాడూను. అన్నీ విషయాలు ఆయనతోనే ఉన్నాయి కనుక ఎవ్వరూ, ఆయనను వదిలి మరెవ్వరినీ అర్థించ కూడదు.

• خطورة تولي الكافرين، حيث توعَّد الله فاعله بالبراءة منه وبالحساب يوم القيامة.
విశ్వాసులతో స్నేహం చేయడం మరియు అవిశ్వాసులను వదిలివేయడం అవసరం. ప్రళయదినం నాడు అల్లాహ్ దీనిని ఉపేక్షించిన వారి లెక్కతీసుకుంటానని హెచ్చరిస్తున్నాడు.

یَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَیْرٍ مُّحْضَرًا ۖۚۛ— وَّمَا عَمِلَتْ مِنْ سُوْٓءٍ ۛۚ— تَوَدُّ لَوْ اَنَّ بَیْنَهَا وَبَیْنَهٗۤ اَمَدًاۢ بَعِیْدًا ؕ— وَیُحَذِّرُكُمُ اللّٰهُ نَفْسَهٗ ؕ— وَاللّٰهُ رَءُوْفٌۢ بِالْعِبَادِ ۟۠
పునరుత్థాన దినాన ప్రతి వ్యక్తీ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా తాను చేసిన మంచిపనులను తన ముందు కనుగొంటాడు. మరి, చెడుపనులు చేసిన వారు తమకూ మరియు తమ చెడుపనులకూ మధ్య చాలా దూరం ఉండాలని కోరుకుంటారు. కానీ వారి కోరికకు ఎలాంటి విలువా ఉండదు! అల్లాహ్ తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి పాపాలు చేయడం ద్వారా ఆయన కోపానికి గురికావద్దు. అల్లాహ్ తన దాసులపై ఎంతో దయ చూపుతాడు. అందువలన వారిని ముందుగానే హెచ్చరిస్తున్నాడు మరియు భయపెడుతున్నాడు.
Arabische uitleg van de Qur'an:
قُلْ اِنْ كُنْتُمْ تُحِبُّوْنَ اللّٰهَ فَاتَّبِعُوْنِیْ یُحْبِبْكُمُ اللّٰهُ وَیَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఓ ప్రవక్తా! ఇలా ప్రకటించండి : మీరు నిజంగా అల్లాహ్ ను ప్రేమిస్తే, గుప్తంగానూ మరియు బహిరంగంగానూ నేను తెచ్చిన దానిని అనుసరించండి. అలా చేయడం ద్వారా, మీరు అల్లాహ్ ప్రేమను పొందుతారు. మరియు ఆయన మీ పాపాలను మన్నిస్తాడు. అల్లాహ్ తన పట్ల పశ్చాత్తాపపడే వారిని క్షమించేవాడూ మరియు ఎంతో దయచూపే వాడూను.
Arabische uitleg van de Qur'an:
قُلْ اَطِیْعُوا اللّٰهَ وَالرَّسُوْلَ ۚ— فَاِنْ تَوَلَّوْا فَاِنَّ اللّٰهَ لَا یُحِبُّ الْكٰفِرِیْنَ ۟
ఓ ప్రవక్తా! ఇలా ప్రకటించండి : అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించడం మరియు నిషేధించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను అనుసరించండి. ఒకవేళ వారు ధర్మాజ్ఞల నుండి మరలిపోతే, తన షరిఅహ్ (పవిత్ర ధర్మశాసనం) కు మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా పోయే అవిశ్వాసులను అల్లాహ్ ప్రేమించడని తెలుసుకోండి.
Arabische uitleg van de Qur'an:
اِنَّ اللّٰهَ اصْطَفٰۤی اٰدَمَ وَنُوْحًا وَّاٰلَ اِبْرٰهِیْمَ وَاٰلَ عِمْرٰنَ عَلَی الْعٰلَمِیْنَ ۟ۙ
అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను ఎంచుకున్నాడు. మరియు దైవదూతలను అతని ముందు సాష్టాంగ పడమని ఆజ్ఞాపించడం ద్వారా అల్లాహ్ ఆదం(అలైహిస్సలాం) ను గౌరవించాడు. భూమిపై నివసించే ప్రజల కొరకు మొట్టమొదటి రసూల్ గా (సందేశహరుడిగా) చేసి అల్లాహ్ నూహ్(అలైహిస్సలాం) ను గౌరవించాడు. ప్రవక్తత్వాన్ని తన సంతానంలో కొనసాగించడం ద్వారా ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబాన్ని అల్లాహ్ గౌరవించాడు. ఈసా (జీసెస్) (అలైహిస్సలాం) వలన మర్యం (మేరీ) తండ్రి అయిన ఇమ్రాన్ కుటుంబాన్ని అల్లాహ్ గౌరవించాడు. ఆయన వారి వారి కాలములలోని వ్యక్తులందరినీ ఎంచుకున్నాడు.
Arabische uitleg van de Qur'an:
ذُرِّیَّةً بَعْضُهَا مِنْ بَعْضٍ ؕ— وَاللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ ۟ۚ
అల్లాహ్ ఏకత్వాన్ని ప్రకటించడం మరియు మంచి చేయడం ద్వారా ఈ ప్రవక్తలు మరియు వారి అనుచరులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారవుతారు. వారు గొప్ప స్వభావం మరియు సద్గుణాలను ఒకరికొకరు అంది పుచ్చు కుంటారు. అల్లాహ్ తన దాసుల పలుకులు వింటాడు మరియు వారి చర్యల గురించి తెలుసుకుంటాడు; ఆ విధంగా తాను ఇష్టపడే వారిని ఆయన ఎంచుకుంటాడు.
Arabische uitleg van de Qur'an:
اِذْ قَالَتِ امْرَاَتُ عِمْرٰنَ رَبِّ اِنِّیْ نَذَرْتُ لَكَ مَا فِیْ بَطْنِیْ مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّیْ ۚ— اِنَّكَ اَنْتَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
ఓ ప్రవక్తా! గుర్తుంచుకో: మర్యం(మేరీ) తల్లి ఇమ్రాన్ భార్య చెప్పినప్పుడు: ఓ ప్రభూ! నా పుట్టబోయే బిడ్డను నీకు పూర్తిగా అంకితం చేయడాన్ని, నిన్నుఆరాధించడాన్ని మరియు నీ గృహానికి సేవచేయడాన్ని నేను నా బాధ్యతగా చేసుకున్నాను, కాబట్టి దీనిని నా నుండి స్వీకరించు. నా ప్రార్థనలు వినేది నీవే. మరియు నా ఉద్దేశము తెలిసినవాడివీ నీవే.
Arabische uitleg van de Qur'an:
فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ اِنِّیْ وَضَعْتُهَاۤ اُ ؕ— وَاللّٰهُ اَعْلَمُ بِمَا وَضَعَتْ ؕ— وَلَیْسَ الذَّكَرُ كَالْاُ ۚ— وَاِنِّیْ سَمَّیْتُهَا مَرْیَمَ وَاِنِّیْۤ اُعِیْذُهَا بِكَ وَذُرِّیَّتَهَا مِنَ الشَّیْطٰنِ الرَّجِیْمِ ۟
ఆమె గర్భం ముగిసి, బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, మగపిల్లవాడు పుడతాడని ఆశించడం వలన ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె 'ఓ ప్రభూ! నేను ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చాను' అని పలికింది. ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వాస్తవానికి ఒక ఆడబిడ్డకు, ఆమె ఆశించిన మగబిడ్డ కలిగి ఉండేంత బలం మరియు రూపం ఉండదు కదా! అప్పుడు ఆమె ఇలా అన్నది, 'నేను ఆమెకు మర్యం (మేరీ) అనే పేరు పెట్టాను మరియు ధూత్కరించబడిన షైతాను బారి నుండి ఆమెను మరియు ఆమె పిల్లలను కాపాడటంలో నీ అనుగ్రహాన్ని, సహాయాన్ని అర్థిస్తున్నాను'.
Arabische uitleg van de Qur'an:
فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُوْلٍ حَسَنٍ وَّاَنْۢبَتَهَا نَبَاتًا حَسَنًا ۙ— وَّكَفَّلَهَا زَكَرِیَّا ؕ— كُلَّمَا دَخَلَ عَلَیْهَا زَكَرِیَّا الْمِحْرَابَ ۙ— وَجَدَ عِنْدَهَا رِزْقًا ۚ— قَالَ یٰمَرْیَمُ اَنّٰی لَكِ هٰذَا ؕ— قَالَتْ هُوَ مِنْ عِنْدِ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ یَرْزُقُ مَنْ یَّشَآءُ بِغَیْرِ حِسَابٍ ۟
అల్లాహ్ దయతో ఆ సమర్పణను అంగీకరించి, ఆమెను బాగా పెంచాడు. ఆయన తన భక్తుల హృదయాలను ఆమె పట్ల శ్రద్ధ చూపేటట్లు చేసాడు మరియు ఆమెను ప్రవక్త జకరియా అలైహిస్సలాం సంరక్షణలో ఉంచాడు. ఎప్పుడైతే జకరియా ఆమె ఆరాధనా స్థలంలోనికి ప్రవేశించాడో, అక్కడ అతను తాజా ఆహారాన్ని చూశాడు. అప్పుడు అతను ఆమెను 'ఓ మర్యం (మేరీ), నీ వద్దకు ఈ ఆహారం ఎక్కడ నుండి వచ్చింది?' అని అడుగగా, ఆమె ఇలా జవాబిచ్చినది, 'ఈ ఆహారం అల్లాహ్ నుండి వచ్చింది. లెక్క లేకుండా అల్లాహ్ తనకు తోచిన వారికి సమృద్ధిగా ఇస్తాడు '.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• عظم مقام الله وشدة عقوبته تجعل العاقل على حذر من مخالفة أمره تعالى.
అల్లాహ్ యొక్క మహోన్నత స్థానం మరియు ఆయన శిక్షలలోని తీవ్రత, కఠినత్వం ఏ తెలివైన వ్యక్తినైనా సరే, ఆయన ధర్మాజ్ఞలను ఉల్లంఘించకుండా జాగ్రత్త పడేలా చేస్తుంది.

• برهان المحبة الحقة لله ولرسوله باتباع الشرع أمرًا ونهيًا، وأما دعوى المحبة بلا اتباع فلا تنفع صاحبها.
అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై చూపే నిజమైన ప్రేమకు నిదర్శనం ఏమిటంటే ఆయన షరీఅహ్ (పవిత్ర ధర్మశాసనం) లోని ధర్మాజ్ఞలను మరియు నిషేధాజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించడం. విధేయత లేని ప్రేమ వాదన వాదించేవాడికి ప్రయోజనం కలిగించదు.

• أن الله تعالى يختار من يشاء من عباده ويصطفيهم للنبوة والعبادة بحكمته ورحمته، وقد يخصهم بآيات خارقة للعادة.
తన వివేకం మరియు అనుగ్రహం ద్వారా అల్లాహ్ తన దాసులలో నుండి తనకు తోచిన వారిని ప్రవక్త పదవి కోసం మరియు తన ఆరాధన కోసం మరియు ప్రవక్త మహిమల కోసం ఎంచుకుంటాడు.

هُنَالِكَ دَعَا زَكَرِیَّا رَبَّهٗ ۚ— قَالَ رَبِّ هَبْ لِیْ مِنْ لَّدُنْكَ ذُرِّیَّةً طَیِّبَةً ۚ— اِنَّكَ سَمِیْعُ الدُّعَآءِ ۟
అల్లాహ్ ఆమెకు (మర్యంకు) అసాధారణంగా ప్రసాదిస్తున్న ఆహారాన్ని చూసిన తరువాత, తను ముసలివాడైనప్పటికీ మరియు తన భార్య గొడ్రాలు అయినప్పటికీ, తప్పకుండా అల్లాహ్ తనకు కూడా బిడ్డను ప్రసాదిస్తాడనే ఆశ ప్రవక్త జకరియ్యాలో చిగురించింది. అప్పుడు జకరియ్యా అల్లాహ్ తో ఇలా మొరపెట్టుకున్నాడు, “ఓ ప్రభూ! నాకు మంచి బిడ్డను ప్రసాదించు. నిన్ను అర్థించే వాని ప్రార్థన నీవు తప్పకుండా వింటావు మరియు నీకు నా పరిస్థితి బాగా తెలుసు”.
Arabische uitleg van de Qur'an:
فَنَادَتْهُ الْمَلٰٓىِٕكَةُ وَهُوَ قَآىِٕمٌ یُّصَلِّیْ فِی الْمِحْرَابِ ۙ— اَنَّ اللّٰهَ یُبَشِّرُكَ بِیَحْیٰی مُصَدِّقًا بِكَلِمَةٍ مِّنَ اللّٰهِ وَسَیِّدًا وَّحَصُوْرًا وَّنَبِیًّا مِّنَ الصّٰلِحِیْنَ ۟
అతను తన ప్రార్థనా స్థలంలో సలాహ్ (నమాజు) లో నిలబడి ఉన్నప్పుడు, దైవదూతలు అతడిని పిలిచారు. అతనితో ఇలా అన్నారు : అల్లాహ్ మీకు త్వరలో ఒక బిడ్డ పుట్టబోతున్నాడనే శుభవార్తను ఇస్తున్నాడు. అతడి పేరు యహ్యా. అతను అల్లాహ్ పదాన్ని ధృవీకరిస్తాడు. ఇది మర్యం కుమారుడైన ఈసాను సూచిస్తున్నది. ఎందుకంటే అతను అల్లాహ్ నుండి ఒక పదం ద్వారా ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు. ఈ బిడ్డ తన జ్ఞానం మరియు ఆరాధనలతో తన ప్రజలకు నాయకుడిగా ఉంటాడు. అతను నీతిమంతుడిగా ప్రఖ్యాతి చెందుతాడు, స్త్రీలను దరిచేర్చడం వంటి కోరికలకు దూరంగా ఉంటాడు. అతను తన ప్రభువును ఆరాధించడానికి తనను తాను అంకితం చేసుకుంటాడు. మరియు సత్ పురుషులలోని ఒక ప్రవక్త అవుతాడు.
Arabische uitleg van de Qur'an:
قَالَ رَبِّ اَنّٰی یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّقَدْ بَلَغَنِیَ الْكِبَرُ وَامْرَاَتِیْ عَاقِرٌ ؕ— قَالَ كَذٰلِكَ اللّٰهُ یَفْعَلُ مَا یَشَآءُ ۟
యహ్యా గురించి దైవదూతలు అతనికి శుభవార్త అందజేసినప్పుడు, జకరియ్యా ఇలా అన్నాడు, 'ఓ ప్రభూ! నేను వృద్ధుడినయ్యాను మరియు నా భార్య పిల్లలను కనలేని గొడ్రాలు. మరి నాకు బిడ్డ ఎలా పుడతాడు?' దానికి అల్లాహ్ ఇలా జవాబిచ్చాడు, ‘నీవు వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ మరియు నీ భార్య గొడ్రాలు అయినప్పటికీ మీకు పుట్టబోయే యహ్యా ఉదాహరణ అల్లాహ్ అసాధారణంగా తాను సృష్టించాలనుకున్న దానిని సృష్టించడాన్ని పోలి ఉంటుంది’ అని సమాధానమిచ్చాడు. ఎందుకంటే అల్లాహ్ ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నాడు, ఆయన తన జ్ఞానం మరియు వివేకంతో తాను తలచినది చేస్తాడు.
Arabische uitleg van de Qur'an:
قَالَ رَبِّ اجْعَلْ لِّیْۤ اٰیَةً ؕ— قَالَ اٰیَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَةَ اَیَّامٍ اِلَّا رَمْزًا ؕ— وَاذْكُرْ رَّبَّكَ كَثِیْرًا وَّسَبِّحْ بِالْعَشِیِّ وَالْاِبْكَارِ ۟۠
జకరియ్యా ఇలా అన్నాడు : “ఓ ప్రభూ! నా భార్య గర్భవతి అయితే నాకేదైనా ఒక సూచన ఇవ్వండి”. దానికి అల్లాహ్ ఇలా తెలిపాడు : “నీ కొరకు సంకేతం ఏమిటంటే, నీవు చేతి సైగలు తప్ప, మూడు రోజులు మాట్లాడలేవు. ఇది ఏదైనా వైకల్యం కారణంగా కాదు. కాబట్టి, అల్లాహ్ ను ఎక్కువగా ధ్యానించు మరియు ప్రతి రోజూ ఉదయం సాయంకాల సమయాల్లో ఆయనను కీర్తించు”.
Arabische uitleg van de Qur'an:
وَاِذْ قَالَتِ الْمَلٰٓىِٕكَةُ یٰمَرْیَمُ اِنَّ اللّٰهَ اصْطَفٰىكِ وَطَهَّرَكِ وَاصْطَفٰىكِ عَلٰی نِسَآءِ الْعٰلَمِیْنَ ۟
ఓ ప్రవక్తా! గుర్తుంచుకో, దైవదూతలు మర్యంతో ఇలా చెప్పిన విషయం: “నీలోని ప్రశంసించదగిన లక్షణాల కారణంగా అల్లాహ్ నిన్ను ఎంచుకున్నాడు. ఆయన నిన్ను అన్నీ లోపాల నుండి శుద్ధి చేసాడు మరియు నీ కాలంలోని ఇతర మహిళలందరిలో నిన్ను ఎంచుకున్నాడు”.
Arabische uitleg van de Qur'an:
یٰمَرْیَمُ اقْنُتِیْ لِرَبِّكِ وَاسْجُدِیْ وَارْكَعِیْ مَعَ الرّٰكِعِیْنَ ۟
ఓ మర్యం నమాజులో ఎక్కువ సేపు నిలబడు. నీ ప్రభువుకు సజ్దా చేయి. మరియు రుకూ చేసే ఆయన ఉత్తమ దాసులతో రుకూ చేయి.
Arabische uitleg van de Qur'an:
ذٰلِكَ مِنْ اَنْۢبَآءِ الْغَیْبِ نُوْحِیْهِ اِلَیْكَ ؕ— وَمَا كُنْتَ لَدَیْهِمْ اِذْ یُلْقُوْنَ اَقْلَامَهُمْ اَیُّهُمْ یَكْفُلُ مَرْیَمَ ۪— وَمَا كُنْتَ لَدَیْهِمْ اِذْ یَخْتَصِمُوْنَ ۟
ఓ ప్రవక్తా! ఇది నేను మీకు వెల్లడించే అజ్ఞాత (గైబ్) నివేదికలలో జకరియ్యా మరియు మర్యం (అలైహిస్సలాంల) కథ కూడా ఒకటి. మర్యంను పెంచడానికి ఎవరు ఎక్కువ అర్హులు అనే వాదన జరిగినప్పుడు నీవు ఆ పండితుల మరియు ఆరాధకులతో పాటు లేవు. చివరికి వారు తమ పెన్నులు విసిరి లాట్లు (లాటరీ) తీయాలని నిర్ణయించుకున్నారు, మరియు జకరియ్యా కలము గెలిచింది.
Arabische uitleg van de Qur'an:
اِذْ قَالَتِ الْمَلٰٓىِٕكَةُ یٰمَرْیَمُ اِنَّ اللّٰهَ یُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ ۙۗ— اسْمُهُ الْمَسِیْحُ عِیْسَی ابْنُ مَرْیَمَ وَجِیْهًا فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ وَمِنَ الْمُقَرَّبِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా! గుర్తుంచుకో: దైవదూతలు మర్యంతో ఇలా అన్నారు, “ఓ మర్యం, తండ్రి అవసరం లేకుండానే సృష్టించబడే పిల్లవాని గురించి అల్లాహ్ నీకు శుభవార్త ఇస్తున్నాడు: అల్లాహ్ నుండి కేవలం 'అయిపో' అనే మాట వెలువడగానే, అల్లాహ్ ఆజ్ఞతో బిడ్డ ఉనికిలోనికి వచ్చేస్తాడు. ఆ బిడ్డ పేరు మర్యం కుమారుడైన ఈసా. అతను ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో ఉన్నత స్థాయి కలిగి ఉంటాడు మరియు అల్లాహ్ కు సన్నిహితంగా ఉండే వారిలో అతను ఒకడు అవుతాడు”.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• عناية الله تعالى بأوليائه، فإنه سبحانه يجنبهم السوء، ويستجيب دعاءهم.
చెడుపనుల నుండి రక్షించడం ద్వారా మరియు వారి ప్రార్థనలకు స్పందించడం ద్వారా అల్లాహ్ తన స్నేహితుల పట్ల చాలా ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు మరియు వారి ప్రార్థనలకు స్పందిస్తాడు.

• فَضْل مريم عليها السلام حيث اختارها الله على نساء العالمين، وطهَّرها من النقائص، وجعلها مباركة.
ఇస్లాం ధర్మంలో మర్యం కొరకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఎందుకంటే ఇతర స్త్రీలందరిపై అల్లాహ్ ఆమెను ఎంచుకున్నాడు, అన్నీరకాల లోపాల నుండి ఆమెను శుద్ధి చేసాడు మరియు ఆమెను శుభదాయకంగా చేశాడు.

• كلما عظمت نعمة الله على العبد عَظُم ما يجب عليه من شكره عليها بالقنوت والركوع والسجود وسائر العبادات.
అల్లాహ్ తన దాసుడిపై ఎంత ఎక్కువగా అనుగ్రహిస్తే, అతడు అంత ఎక్కువగా అల్లాహ్ కు కృతజ్ఞతలు చూపాలి విధేయత చూపుతూ,రుకూ,సజదా మరియు అన్ని ఆరాధనలు చేస్తూ.

• مشروعية القُرْعة عند الاختلاف فيما لا بَيِّنة عليه ولا قرينة تشير إليه.
ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు, పరిష్కారం కోసం ఎలాంటి ఆధారం, సూచన లభించక పోతే, లాట్లు తీయడం ద్వారా పరిష్కరించడాన్ని పవిత్ర చట్టం ఆమోదిస్తున్నది.

وَیُكَلِّمُ النَّاسَ فِی الْمَهْدِ وَكَهْلًا وَّمِنَ الصّٰلِحِیْنَ ۟
ఆశ్చర్యకరంగా ఈ బాలుడు పసిబిడ్డగా ఉన్నప్పుడే (తల్లి ఒడిలో నుండి) మాట్లాడుతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత కూడా అద్భుతంగా మాట్లాడుతాడు. ఆయన ప్రజలకు తమ ధర్మంలో ఏది ఉత్తమమో మరియు ప్రాపంచిక విషయాలలో ఏది ఉత్తమమో చెబుతాడు. అంతేగాక తమ మాటలలో మరియు ఆచరణలలో ఉత్తములైన వారిలో ఒకడిగా గుర్తించబడతాడు.
Arabische uitleg van de Qur'an:
قَالَتْ رَبِّ اَنّٰی یَكُوْنُ لِیْ وَلَدٌ وَّلَمْ یَمْسَسْنِیْ بَشَرٌ ؕ— قَالَ كَذٰلِكِ اللّٰهُ یَخْلُقُ مَا یَشَآءُ ؕ— اِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟
‘భర్త లేకుండానే తను ఒక బిడ్డకు జన్మ నివ్వబోతున్నదనే’ వార్తతో మర్యం అమితంగా ఆశ్చర్యపోయి, వెంటనే ఇలా అడిగింది : ‘చట్టబద్ధంగా (వివాహ బంధం ద్వారా) లేదా అక్రమంగా ఏ వ్యక్తీ నన్ను స్పర్శించకుండా నాకు బిడ్డ ఎలా కలుగుతుంది?. దానికి ఆ దైవదూత ఇలా జవాబిచ్చాడు “తండ్రి లేకుండానే అల్లాహ్ నీ ద్వారా ఒక బిడ్డను సృష్టిస్తాడు. అసాధారణమైనా సరే. ఆయన ఏది కోరుకుంటే అది సృష్టిస్తాడు. అల్లాహ్ ఏదైనా జరగాలని కోరుకున్నప్పుడు, ఆయన కేవలం 'అయిపో' అని అంటాడు, వెంటనే అది అయిపోతుంది. తన ఇష్టానుసారం చేయడం నుండి ఆయన్ను ఏదీ ఆపలేదు.
Arabische uitleg van de Qur'an:
وَیُعَلِّمُهُ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَالتَّوْرٰىةَ وَالْاِنْجِیْلَ ۟ۚ
అల్లాహ్ ఆయనకు ఉత్తమరీతిలో సంభాషించడం మరియు మంచిపనులు చేయడం గురించి భోదిస్తాడు. ఇంకా అల్లాహ్ మూసా అలైహిస్సలాం పై అవతరింపజేసిన తౌరాతు గ్రంథాన్ని ఆయనకు నేర్పుతాడు మరియు ఇంజీలు గ్రంథాన్ని (సువార్తను) ఆయనపై అవతరింపజేస్తాడు.
Arabische uitleg van de Qur'an:
وَرَسُوْلًا اِلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ ۙ۬— اَنِّیْ قَدْ جِئْتُكُمْ بِاٰیَةٍ مِّنْ رَّبِّكُمْ ۙۚ— اَنِّیْۤ اَخْلُقُ لَكُمْ مِّنَ الطِّیْنِ كَهَیْـَٔةِ الطَّیْرِ فَاَنْفُخُ فِیْهِ فَیَكُوْنُ طَیْرًا بِاِذْنِ اللّٰهِ ۚ— وَاُبْرِئُ الْاَكْمَهَ وَالْاَبْرَصَ وَاُحْیِ الْمَوْتٰی بِاِذْنِ اللّٰهِ ۚ— وَاُنَبِّئُكُمْ بِمَا تَاْكُلُوْنَ وَمَا تَدَّخِرُوْنَ ۙ— فِیْ بُیُوْتِكُمْ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لَّكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟ۚ
అల్లాహ్ ఆయనను ఇస్రాయీల్ సంతతి వారి కొరకు ఒక సందేశహరుడిగా చేస్తాడు మరియు వారితో ఇలా చెప్పమని ఆదేశిస్తాడు: “నేను మీ కొరకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుడిని. నా ప్రవక్తత్వాన్ని సూచించే సంకేతాన్ని నేను మీ ముందుకు తీసుకు వచ్చాను: మట్టితో పక్షి ఆకారాన్ని తయారు చేసి, అందులో ఊదుతాను. అల్లాహ్ అనుజ్ఞతో, అది సజీవమైన పక్షిగా మారి పోతుంది. అలాగే, పుట్టుకతో అంధుడైన వ్యక్తిని నేను నయం చేస్తాను, తద్వారా అతను చూడగలుగుతాడు మరియు కుష్ఠురోగి తన వ్యాధి నుండి కోలుకుంటాడు; మరియు నేను చనిపోయినవారిని బ్రతికిస్తాను. కేవలం అల్లాహ్ అనుమతితో మాత్రమే నేను ఇవన్నీ చేస్తాను. మీరు ఏమి తిన్నారో మరియు మీ ఇళ్లల్లో ఏమి దాచుకున్నారో నేను మీకు చెబుతాను. నేను చెప్పిన మానవులు చేయలేని ఈ అసాధారణమైన విషయాలన్నింటిలో ‘నేను అల్లాహ్ యొక్క సందేశహరుడిని’ అనే స్పష్టమైన సూచన ఉన్నది. ఒకవేళ మీరు విశ్వాసం కలిగి ఉండాలని కోరుకుంటే, ఈ ఋజువు ఒప్పుకోండి.
Arabische uitleg van de Qur'an:
وَمُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیَّ مِنَ التَّوْرٰىةِ وَلِاُحِلَّ لَكُمْ بَعْضَ الَّذِیْ حُرِّمَ عَلَیْكُمْ وَجِئْتُكُمْ بِاٰیَةٍ مِّنْ رَّبِّكُمْ ۫— فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟
నాకు పూర్వం వచ్చిన తౌరాతు అవతరణను ధృవీకరించడానికి, పూర్వం నిషేధించబడిన వాటిలో కొన్నింటిని చట్టబద్ధం చేయడానికి, మీ కొరకు వాటిని సులభతరం చేయడానికి నేను మీ వద్దకు వచ్చాను. పలుకులలోని నిజాయితీని నిరూపించే స్పష్టమైన ఋజువును నేను మీ ముందుకు తెచ్చాను. కాబట్టి అల్లాహ్ సూచనలను నెరవేర్చడం ద్వారా మరియు ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనను సదా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి; మరియు నేను మీకు అందజేస్తున్న సందేశాన్ని అనుసరించండి.
Arabische uitleg van de Qur'an:
اِنَّ اللّٰهَ رَبِّیْ وَرَبُّكُمْ فَاعْبُدُوْهُ ؕ— هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ ۟
ఎందుకంటే అల్లాహ్ యే నా ప్రభువూ మరియు మీ ప్రభువూను, ఆయన మాత్రమే విధేయత చూపేందుకు మరియు భయపడేందుకు అర్హతలు కలిగి ఉన్నాడు. కాబట్టి, ఆయనను మాత్రమే ఆరాధించండి. అల్లాహ్ యొక్క ఈ ఆరాధన మరియు ఆయన గురించి నేను మీకు అందించిన సూచనలు గుర్తుంచుకోవడమే వంకర టింకరలు లేని ఋజుమార్గము.
Arabische uitleg van de Qur'an:
فَلَمَّاۤ اَحَسَّ عِیْسٰی مِنْهُمُ الْكُفْرَ قَالَ مَنْ اَنْصَارِیْۤ اِلَی اللّٰهِ ؕ— قَالَ الْحَوَارِیُّوْنَ نَحْنُ اَنْصَارُ اللّٰهِ ۚ— اٰمَنَّا بِاللّٰهِ ۚ— وَاشْهَدْ بِاَنَّا مُسْلِمُوْنَ ۟
వారు తమ అవిశ్వాసాన్ని కొనసాగించడంపైనే పట్టుబడుతున్నారని ఈసా అలైహిస్సలాం గ్రహించినప్పుడు, అతను ఇస్రాయీల్ సంతతి వారిని ఉద్దేశించి, 'అల్లాహ్ వైపు పిలవడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?' అని పలికారు. వారిలో నుండి అల్లాహ్ ఎంచుకున్న అనుచరులు ఇలా అన్నారు: ‘మేము అల్లాహ్ ధర్మానికి సహాయకులుగా ఉంటాము. మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మేము నిన్ను అనుసరిస్తాము. ఓ ఈసా నీవు సాక్షిగా ఉండు, మేము అల్లాహ్ కు ఆయన ఏకత్వాన్ని అంగీకరించడం ద్వారా మరియు ఆయనను అనుసరించడం ద్వారా సమర్పించుకుంటున్నాము’.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• شرف الكتابة والخط وعلو منزلتهما، حيث بدأ الله تعالى بذكرهما قبل غيرهما.
ఇతర విషయాలను ప్రస్తావించడం కంటే ముందు అల్లాహ్ వ్రాయడం గురించి ప్రస్తావించడం వలన, అది ఒక శ్రేష్ఠమైన పనిగా పరిగణించబడుతుంది.

• من سنن الله تعالى أن يؤيد رسله بالآيات الدالة على صدقهم، مما لا يقدر عليه البشر.
అల్లాహ్ యొక్క సంప్రదాయం ఏమిటంటే తన ప్రవక్తలను, సందేశహరులను ఆయన సత్యాన్ని నిరూపించే మానవాతీతమైన అద్భుతాలతో, మహిమలతో మద్దతు ఇస్తూ ఉంటాడు.

• جاء عيسى بالتخفيف على بني إسرائيل فيما شُدِّد عليهم في بعض شرائع التوراة، وفي هذا دلالة على وقوع النسخ بين الشرائع.
ఈసా అలైహిస్సలాం తౌరాతులోని కొన్ని శాసనాలలో నొక్కి చెప్పిన ధర్మాజ్ఞలను ఇస్రాయీల్ సంతతిపై సులభతరం చేసేందుకు వచ్చారు. ఇది శాసనాల మధ్య కొన్ని అంశాలు రద్దుచేయబడతాయనే దానిని సూచిస్తున్నది.

رَبَّنَاۤ اٰمَنَّا بِمَاۤ اَنْزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُوْلَ فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِیْنَ ۟
ఈసా అలైహిస్సలాం శిష్యులు కూడా ఇలా అన్నారు: ఓ మా ప్రభువా! మీరు అవతరింపజేసిన ఇంజీలును మేము విశ్వసించాము మరియు మేము ప్రవక్త ఈసా అలైహిస్సలాంను అనుసరించాము. కాబట్టి మమ్ముల్ని నీపై మరియు నీ ప్రవక్తలపై విశ్వాసం కలిగి ఉండే మరియు సత్యానికి సాక్షులుగా ఉండే వారిలా చేయి.
Arabische uitleg van de Qur'an:
وَمَكَرُوْا وَمَكَرَ اللّٰهُ ؕ— وَاللّٰهُ خَیْرُ الْمٰكِرِیْنَ ۟۠
ఇశ్రాయేలీయులలోని అవిశ్వాసులు ఈసా అలైహిస్సలాం ను చంపడానికి పన్నాగం పన్నారు, కాబట్టి అల్లాహ్ వారిని వారి మార్గభ్రష్టత్వంలో వదిలి వేశాడు; మరియు ఆయనను చంపడానికి పన్నాగం పన్నిన ఆయన శిష్యుడిని ఈసా అలైహిస్సలాం (యేసు) మాదిరి కనబడేలా చేశాడు. అల్లాహ్ అత్యుత్తమంగా పన్నాగం పన్నే వాడు, ఎందుకంటే ఆయన శత్రువులపై ఆయన పన్నాగం కంటే తీవ్రమైనది మరొకటి ఉండదు.
Arabische uitleg van de Qur'an:
اِذْ قَالَ اللّٰهُ یٰعِیْسٰۤی اِنِّیْ مُتَوَفِّیْكَ وَرَافِعُكَ اِلَیَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِیْنَ كَفَرُوْا وَجَاعِلُ الَّذِیْنَ اتَّبَعُوْكَ فَوْقَ الَّذِیْنَ كَفَرُوْۤا اِلٰی یَوْمِ الْقِیٰمَةِ ۚ— ثُمَّ اِلَیَّ مَرْجِعُكُمْ فَاَحْكُمُ بَیْنَكُمْ فِیْمَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ ۟
ఈసా అలైహిస్సలాం తో ఇలా చెప్పడం ద్వారా అల్లాహ్ వారికి వ్యతిరేకంగా ప్రణాళిక వేశాడు : ఓ ఈసా! నేను నిన్ను సజీవంగా పైకి తీసుకువెళతాను, నీ శరీరాన్ని మరియు ఆత్మను నా వద్దకు లేపుతాను, నిన్ను విశ్వసించని వారి మురికిని తొలగించి, నిన్ను వారికి దూరం చేస్తాను. నిన్ను అనుసరించే వారిని ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ను అంతిమ ప్రవక్తగా విశ్వసించడంతో పాటు సత్యధర్మాన్ని పాటించేలా చేస్తాను; మరియు పునరుత్థాన దినం వరకు నిన్ను నమ్మని వారిపై వారి వద్ద గొప్ప ఋజువు మరియు గౌరవమూ ఉంటుంది. చివరికి పునరుత్థాన దినాన మీరు నా వైపు మాత్రమే మరలి వస్తారు మరియు మీ విభేదాలకు సంబంధించి నేను మీ మధ్య నిజమైన తీర్పునిస్తాను.
Arabische uitleg van de Qur'an:
فَاَمَّا الَّذِیْنَ كَفَرُوْا فَاُعَذِّبُهُمْ عَذَابًا شَدِیْدًا فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ؗ— وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِیْنَ ۟
నిన్నూ మరియు నీవు తెచ్చిన సత్యాన్నీ విశ్వసించని వారిని ఈ ప్రపంచంలో హత్యలకు గురి చేయడం ద్వారా, ఖైదీలుగా బంధించడం ద్వారా, అవమానానికి గురి చేయడం ద్వారా నేను కఠినంగా శిక్షిస్తాను; మరియు పరలోకంలో వారిని నరకాగ్నిలో పడవేసి, శిక్షిస్తాను. ఆ శిక్ష నుండి వారికి సహాయం చేసే వారెవ్వరూ ఉండరు.
Arabische uitleg van de Qur'an:
وَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَیُوَفِّیْهِمْ اُجُوْرَهُمْ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ الظّٰلِمِیْنَ ۟
"నిన్నూ మరియు నీవు తీసుకువచ్చిన సత్యాన్నీ విశ్వసించి, (ఆరాధనలు, దానధర్మాలు, ఉపవాసాలు, రక్తసంబంధాలను కాపాడటం మొదలైన) మంచిపనులు చేసిన వారికి వారి ఆచరణలకు బదులుగా, ఎలాంటి తగ్గింపు లేకుండా అల్లాహ్ వారికి పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఆగమనానికి పూర్వపు మూసా అలైహిస్సలాం అనుచరులకు కూడా వర్తిస్తుంది. తన తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం రాబోతున్నారని మూసా అలైహిస్సలాం స్వయంగా ధృవీకరించి ఉన్నారు. అల్లాహ్ దుర్మార్గమునకు పాల్పడే వారిని ప్రేమించడు మరియు దుర్మర్గముల్లోంచి అతి పెద్ద దుర్మార్గం ఏదంటే అల్లాహ్ కు భాగస్వాములను ఆపాదించడం మరియు ఆయన ప్రవక్తలను నిరాకరించడం".
Arabische uitleg van de Qur'an:
ذٰلِكَ نَتْلُوْهُ عَلَیْكَ مِنَ الْاٰیٰتِ وَالذِّكْرِ الْحَكِیْمِ ۟
మీకు చెప్పబడిన ఈసా అలైహిస్సలాం యొక్క ఈ వృత్తాంతం మీకు వెల్లడి చేయబడిన సత్యాన్ని సూచించే స్పష్టమైన సంకేతాలలో ఒకటి. అల్లాహ్ గురించి ఆలోచించే వారి కొరకు ఇది ఒక నిర్దుష్టమైన సందేశం, ఎందుకంటే ఇందులో ఎలాంటి అబద్ధమూ లేదు.
Arabische uitleg van de Qur'an:
اِنَّ مَثَلَ عِیْسٰی عِنْدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَ ؕ— خَلَقَهٗ مِنْ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟
"అల్లాహ్ వద్ద, ఈసా అలైహిస్సలాం సృష్టి యొక్క ఉదాహరణ ఆదమ్ అలైహిస్సలాం యొక్క సృష్టి లాంటిదే - అతను (ఆదము) తల్లిదండ్రులు లేకుండా మట్టి నుండి సృష్టించబడ్డాడు. అల్లాహ్ అతనితో కేవలం ఇలా అన్నాడు: ‘మనిషిగా మారు’. మరియు అతను వెంటనే అల్లాహ్ ఇచ్ఛ మేరకు మనిషిగా మారిపోయాడు. మరి, తల్లిదండ్రులు ఉభయులూ లేకుండా సృష్టించబడిన ఆదము అలైహిస్సలాంను మీరు మనిషిగా అంగీకరించిన తరువాత, కేవలం తండ్రి మాత్రమే లేకుండా సృష్టించ బడిన ఈసా అలైహిస్సలాంను మీరెలా దైవంగా భావించ గలరు ?
Arabische uitleg van de Qur'an:
اَلْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُنْ مِّنَ الْمُمْتَرِیْنَ ۟
ఈసా అలైహిస్సలాం గురించి మీ ప్రభువైన అల్లాహ్ మీకు వెల్లడించినదే ఖచ్చితమైన సత్యము. కాబట్టి మీరు సందేహించే మరియు అనుమానించే వారిలో ఒకరు కాకండి. దానికి బదులుగా, మీ వద్ద ఉన్న సత్యంపై మీరు దృఢంగా ఉండండి.
Arabische uitleg van de Qur'an:
فَمَنْ حَآجَّكَ فِیْهِ مِنْ بَعْدِ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ اَبْنَآءَنَا وَاَبْنَآءَكُمْ وَنِسَآءَنَا وَنِسَآءَكُمْ وَاَنْفُسَنَا وَاَنْفُسَكُمْ ۫— ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَلْ لَّعْنَتَ اللّٰهِ عَلَی الْكٰذِبِیْنَ ۟
ఓ ప్రవక్తా! క్రైస్తవులలో ఎవరైనా ఈసా అలైహిస్సలాం విషయానికి సంబంధించి మీతో వివాదానికి దిగితే, మీకు సరైన జ్ఞానం అందిన తరువాత కూడా అతను అల్లాహ్ దాసుడు కాదని మీతో వాదిస్తే, వారితో 'రండి! మా కొడుకులు మరియు మీ కొడుకులు; మా మహిళలు మరియు మీ మహిళలు; ఇంకా స్వయంగా మేము మరియు మీరు - మనమందరం ఒకచోట సమావేశమై, అబద్ధం చెప్పే వారిపై తన శాపాన్ని పంపమని అల్లాహ్ ను ప్రార్థిద్దాం.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• من كمال قدرته تعالى أنه يعاقب من يمكر بدينه وبأوليائه، فيمكر بهم كما يمكرون.
తన ధర్మం మరియు తన స్నేహితులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారిపై అల్లాహ్ తన పరిపూర్ణ శక్తితో తీవ్రమైన చర్య తీసుకుంటాడు.

• بيان المعتقد الصحيح الواجب في شأن عيسى عليه السلام، وبيان موافقته للعقل فهو ليس بدعًا في الخلقة، فآدم المخلوق من غير أب ولا أم أشد غرابة والجميع يؤمن ببشريته.
ఈసా అలైహిస్సలాంకు సంబంధించి సరైన విశ్వాసం గురించి చక్కటి వివరణ ఉన్నది. తండ్రి ప్రమేయం లేకుండా సృష్టించబడటం వలన అతడు కూడా దైవమని తప్పుగా అర్థం చేసుకున్న వారి విశ్వాసాన్ని అది స్పష్టంగా ఖండిస్తున్నది. ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా సృష్టించబడిన ఆదము సృష్టి మరింత విచిత్రమైనది, కానీ యావత్తు మానవజాతి అతడిని మానవుడిగా అంగీకరించింది కదా!

• مشروعية المُباهلة بين المتنازعين على الصفة التي وردت بها الآية الكريمة.
ఇద్దరి మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు, ఇద్దరిలో ఎవరు అసత్యంపై ఉంటే వారు అల్లాహ్ యొక్క శాపానికి గురి అవ్వాలని బహిరంగంగా ప్రమాణం చేసే విధానం చట్టబద్ధమైనదే.

اِنَّ هٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ— وَمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُ ؕ— وَاِنَّ اللّٰهَ لَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
నిశ్చయంగా ఈసా అలైహిస్సలాం గురించి మీకు తెలుపబడినది ఎలాంటి అబద్ధమూ లేదా సందేహమూ లేని ఒక నిజమైన వృత్తాంతము. ఏకైకుడైన అల్లాహ్ తప్ప నిజంగా ఆరాధనలకు అర్హులు ఎవ్వరూ లేరు. అల్లాహ్ తన అధికారంలో శక్తివంతమైనవాడు. ఇంకా ఆయన తన ప్రణాళికలలో మరియు ఆదేశాలలో అత్యంత తెలివైనవాడు.
Arabische uitleg van de Qur'an:
فَاِنْ تَوَلَّوْا فَاِنَّ اللّٰهَ عَلِیْمٌۢ بِالْمُفْسِدِیْنَ ۟۠
ఒకవేళ మీరు తీసుకువచ్చిన దాని నుండి (సత్యసందేశం నుండి) వారు మరలిపోతే మరియు మిమ్మల్ని అనుసరించకపోతే, నిశ్చయంగా దానికి కారణం వారు అవినీతిపరులు కావడమే. భూమిపై అవినీతిని వ్యాపింపజేసే వారిని అల్లాహ్ బాగా ఎరుగును. ఆయన వారికి తప్పకుండా బదులు ఇస్తాడు.
Arabische uitleg van de Qur'an:
قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ تَعَالَوْا اِلٰی كَلِمَةٍ سَوَآءٍ بَیْنَنَا وَبَیْنَكُمْ اَلَّا نَعْبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشْرِكَ بِهٖ شَیْـًٔا وَّلَا یَتَّخِذَ بَعْضُنَا بَعْضًا اَرْبَابًا مِّنْ دُوْنِ اللّٰهِ ؕ— فَاِنْ تَوَلَّوْا فَقُوْلُوا اشْهَدُوْا بِاَنَّا مُسْلِمُوْنَ ۟
ఓ ప్రవక్తా! ఇలా ప్రకటించండి : “గ్రంథ ప్రజలలోని యూదులు మరియు క్రైస్తవులారా! రండి, న్యాయమైన మరియు మనందరి కొరకు సమానమైన ఒక స్వచ్ఛమైన పదంపై మనమందరం ఏకీభవిద్దాము. అదేమిటంటే, మనం కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుదాము. మరియు ఆయనతో పాటు ఎవ్వరినీ ఆరాధించకుండా ఉందాము. అలాంటి వారి స్థితి, అంతస్తు, హోదా ఎంత గొప్పగా ఉన్నా సరే; మరియు అల్లాహ్ తో పాటు లేదా అల్లాహ్ కు సాటిగా వేరొకరిని మనం ఆరాధించే మరియు అనుసరించే ప్రభువులుగా చేసుకోకుండా ఉందాము”. ఒకవేళ మీరు వారిని పిలుస్తున్న సత్యం మరియు న్యాయం నుండి మరలిపోతే, ఓ విశ్వాసులారా! వారితో ఇలా చెప్పండి - మేము అల్లాహ్ కు సమర్పించుకున్నామని మరియు ఆయనకు విధేయులుగా ఉన్నామని మీరు సాక్ష్యులుగా ఉండండి.
Arabische uitleg van de Qur'an:
یٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تُحَآجُّوْنَ فِیْۤ اِبْرٰهِیْمَ وَمَاۤ اُنْزِلَتِ التَّوْرٰىةُ وَالْاِنْجِیْلُ اِلَّا مِنْ بَعْدِهٖ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
ఓ గ్రంథ ప్రజలారా!ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క విశ్వాసం గురించి మీరు ఎందుకు వాదించు కుంటున్నారు ?. యూదులు అతను యూదుడని మరియు క్రైస్తవులు అతను క్రైస్తవుడని వాదిస్తున్నారు. యూదమతం మరియు క్రైస్తవమతం అతను గతించిన చాలా కాలం తరువాత ఆవిర్భవించాయనేది మీకు బాగా తెలుసు. మీ వాదనలోని అబద్ధం మరియు లోపం మీకు కనబడటం లేదా ?.
Arabische uitleg van de Qur'an:
هٰۤاَنْتُمْ هٰۤؤُلَآءِ حَاجَجْتُمْ فِیْمَا لَكُمْ بِهٖ عِلْمٌ فَلِمَ تُحَآجُّوْنَ فِیْمَا لَیْسَ لَكُمْ بِهٖ عِلْمٌ ؕ— وَاللّٰهُ یَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟
ఓ గ్రంథ ప్రజలారా! మీ మతం గురించి మరియు మీ గ్రంథాలలోని దాని గురించి మీకు జ్ఞానం లేకుండానే మీరు ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం తో వాదించారు. మీ గ్రంథంలో లేకపోవటం వలన మరియు మీ ప్రవక్తలు దాని గురించి చర్చించక పోవటం వలన మీకు తెలియని ఇబ్రాహీమ్ అలైహిస్సలాం మరియు అతని మతం గురించి మీరు ఎందుకు వాదిస్తున్నారు? అల్లాహ్ కు వాస్తవాల గురించి బాగా తెలుసు మరియు మీకు తెలియదు.
Arabische uitleg van de Qur'an:
مَا كَانَ اِبْرٰهِیْمُ یَهُوْدِیًّا وَّلَا نَصْرَانِیًّا وَّلٰكِنْ كَانَ حَنِیْفًا مُّسْلِمًا ؕ— وَمَا كَانَ مِنَ الْمُشْرِكِیْنَ ۟
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం విశ్వాసంలో యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. కానీ అతను అన్ని అసత్య మతాలను వ్యతిరేకించాడు మరియు కేవలం అల్లాహ్ కు మాత్రమే విధేయుడయ్యాడు. అతను అల్లాహ్ కు భాగస్వాములను ఆపాదించే వారిలోని వాడు కాదు - అతని విశ్వాసాన్నే అనుసరిస్తున్నామని దావా చేస్తున్న అరబ్బు విగ్రహారాధకులకు భిన్నంగా.
Arabische uitleg van de Qur'an:
اِنَّ اَوْلَی النَّاسِ بِاِبْرٰهِیْمَ لَلَّذِیْنَ اتَّبَعُوْهُ وَهٰذَا النَّبِیُّ وَالَّذِیْنَ اٰمَنُوْا ؕ— وَاللّٰهُ وَلِیُّ الْمُؤْمِنِیْنَ ۟
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కాలంలో అతనిని అనుసరించిన ప్రజలు, అతనిని విశ్వసించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం మరియు ఆయన సమాజం మాత్రమే ఇబ్రాహీముతో సంబంధం ఉందని వాదించేందుకు ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారు. అల్లాహ్ విశ్వాసులకు సహాయపడతాడు మరియు కాపాడుతాడు.
Arabische uitleg van de Qur'an:
وَدَّتْ طَّآىِٕفَةٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ یُضِلُّوْنَكُمْ ؕ— وَمَا یُضِلُّوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا یَشْعُرُوْنَ ۟
ఓ విశ్వాసులారా! యూదుల మరియు క్రైస్తవుల పండితులు మిమ్మల్ని, అల్లాహ్ నిర్దేశించిన సత్యమార్గానికి దూరంగా తప్పుదోవ పట్టించాలని కోరుకుంటారు. కానీ, వారు స్వయంగా తమకు తామే తప్పుదోవ పట్టిస్తారు. ఎందుకంటే విశ్వాసులను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న వారి ప్రయత్నం వారి మార్గభ్రష్టత్వాన్ని పెంచుతుంది మరియు వారి చర్యల పర్యవసానం గురించి వారు ఎరుగరు.
Arabische uitleg van de Qur'an:
یٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَكْفُرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ وَاَنْتُمْ تَشْهَدُوْنَ ۟
ఓ గ్రంథ ప్రజలలోని యూదులారా మరియు క్రైస్తవులారా! వాస్తవానికి, మీ గ్రంథాలలో ప్రస్తావించబడిన సత్యమైన వచనాలకు మీరు సాక్షులై ఉండీ, మీ కొరకు పంపబడిన మీ గ్రంథాలలోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహినసల్లం ఆవిర్భావానికి సంబంధించిన అల్లాహ్ యొక్క స్పష్టమైన సూచనలను మీరు ఎందుకు నమ్మటం లేదు?
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• أن الرسالات الإلهية كلها اتفقت على كلمة عدل واحدة، وهي: توحيد الله تعالى والنهي عن الشرك.
దైవ సందేశాలన్నీ ఒకే ఒక ముఖ్యాంశాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి – అది అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ప్రకటించడం మరియు అల్లాహ్ తో భాగస్వాములు కల్పించడాన్ని నిషేధించడం.

• أهمية العلم بالتاريخ؛ لأنه قد يكون من الحجج القوية التي تُرَدُّ بها دعوى المبطلين.
చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే కొన్నిసార్లు అది తప్పుడు వాదనలు తిరస్కరించడానికి ఋజువుగా ఉపయోగించబడుతుంది.

• أحق الناس بإبراهيم عليه السلام من كان على ملته وعقيدته، وأما مجرد دعوى الانتساب إليه مع مخالفته فلا تنفع.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క విశ్వాసాలు మరియు ధార్మిక సిద్ధాంతాలను నమ్మేవారే అతనికి చెందిన వారని ప్రకటించు కోవడానికి అత్యంత అర్హులు. కేవలం అతనికి చెందిన వారమని వాదిస్తూ, అతనికి వ్యతిరేకంగా విశ్వసించడం, ఆచరించడం వలన ఎలాంటి ఉపయోగమూ ఉండదు.

• دَلَّتِ الآيات على حرص كفرة أهل الكتاب على إضلال المؤمنين من هذه الأمة حسدًا من عند أنفسهم.
గ్రంథప్రజలలోని అవిశ్వాసులు తమ ఈర్ష్యాసూయాల కారణంగా ఈ సమాజంలోని విశ్వాసులను తప్పుదోవ పట్టించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారని ఈ ఆయతులు సూచిస్తున్నాయి.

یٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَلْبِسُوْنَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوْنَ الْحَقَّ وَاَنْتُمْ تَعْلَمُوْنَ ۟۠
ఓ గ్రంథ ప్రజలారా! మీ గ్రంథాలలో ఉన్న సత్యాన్ని స్వయంగా మీరు కల్పించిన అబద్ధాలతో ఎందుకు మిళితం చేస్తున్నారు?. ఏది నిజమో, ఏది అబద్దమో మీకు తెలిసిన తరువాత కూడా, ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ప్రవక్తత్వం యొక్క సత్యత గురించి మీ గ్రంథంలో ఉన్న సత్యాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని మీరు ఎందుకు దాచిపెడుతున్నారు ?.
Arabische uitleg van de Qur'an:
وَقَالَتْ طَّآىِٕفَةٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ اٰمِنُوْا بِالَّذِیْۤ اُنْزِلَ عَلَی الَّذِیْنَ اٰمَنُوْا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوْۤا اٰخِرَهٗ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟ۚۖ
యూద పండితుల ఒక బృందం ఇలా చెప్పింది : “బహిరంగంగా, రోజూ ఉదయంపూట విశ్వాసుల వైపు అవతరింప జేయబడిన ఖుర్ఆన్ ను అంగీకరించి, ఆ రోజు చివరి సమయంలో దానిని తిరస్కరించండి. ఆ విధంగా దీనిని చూసిన తరువాత విశ్వాసులకు తమ ధర్మం పట్ల సందేహాలు మొదలవుతాయి. చివరికి వారు కూడా తమ ధర్మం నుండి మరలిపోతూ, 'ఈ వ్యక్తులకు అల్లాహ్ యొక్క గ్రంథం గురించి బాగా తెలుసు, అయినా వారు మరలిపోయారు కదా!' అంటారు”.
Arabische uitleg van de Qur'an:
وَلَا تُؤْمِنُوْۤا اِلَّا لِمَنْ تَبِعَ دِیْنَكُمْ ؕ— قُلْ اِنَّ الْهُدٰی هُدَی اللّٰهِ ۙ— اَنْ یُّؤْتٰۤی اَحَدٌ مِّثْلَ مَاۤ اُوْتِیْتُمْ اَوْ یُحَآجُّوْكُمْ عِنْدَ رَبِّكُمْ ؕ— قُلْ اِنَّ الْفَضْلَ بِیَدِ اللّٰهِ ۚ— یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ ۟ۚۙ
మరియు వారు ఇలా కూడా పలికారు మీ ధర్మాన్ని అనుసరించేవారిని తప్ప ఇంకెవ్వరినీ నమ్మవద్దు మరియు అంగీకరించవద్దు. ఓ ప్రవక్తా! ఇలా ప్రకటించండి: సత్యం వైపు మార్గదర్శకత్వం అంటే అల్లాహ్ వైపు మార్గదర్శకత్వం; మీకు ఇవ్వబడినటువంటి బహుమతిని ఇంకెవరికైనా ఇవ్వవచ్చనే భయంతో లేదా వారి వైపు అవతరించబడిన విషయాన్ని మీరు ఒప్పుకుంటే మీ ప్రభువు ముందు వారు మీతో వాదిస్తారనే భయంతో, మీరు ప్రదర్శిస్తున్న అవిశ్వాసం మరియు మొండితనం ఎంత మాత్రమూ కాదు. ఓ ప్రవక్తా! ప్రకటించండి: అనుగ్రహం అనేది కేవలం అల్లాహ్ చేతిలో మాత్రమే ఉంది మరియు దానిని ఆయన తన దాసులలో తాను తలుచుకున్న వారికి ప్రసాదిస్తాడు: ఆయన అనుగ్రహం ఏ ఒక్క జాతికో, సమాజానికో పరిమితం కాదు. అల్లాహ్ విశాలమైన అనుగ్రహం కలవాడు మరియు ఆయన అనుగ్రహానికి ఎవరు అర్హులో ఆయనకు బాగా తెలుసు.
Arabische uitleg van de Qur'an:
یَّخْتَصُّ بِرَحْمَتِهٖ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ ۟
ఆయన తన ఇష్టానుసారం తన సృష్టిలో నుండి తన అనుగ్రహాన్ని పొందేవారిని ఎంచుకుని, వారిని మార్గదర్శకత్వం, ప్రవక్తత్వం మరియు అనేక శుభాలతో అనుగ్రహిస్తాడు. అల్లాహ్ యొక్క అనుగ్రహం ఎంతో గొప్పది మరియు అంతులేనిదీను.
Arabische uitleg van de Qur'an:
وَمِنْ اَهْلِ الْكِتٰبِ مَنْ اِنْ تَاْمَنْهُ بِقِنْطَارٍ یُّؤَدِّهٖۤ اِلَیْكَ ۚ— وَمِنْهُمْ مَّنْ اِنْ تَاْمَنْهُ بِدِیْنَارٍ لَّا یُؤَدِّهٖۤ اِلَیْكَ اِلَّا مَا دُمْتَ عَلَیْهِ قَآىِٕمًا ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْا لَیْسَ عَلَیْنَا فِی الْاُمِّیّٖنَ سَبِیْلٌ ۚ— وَیَقُوْلُوْنَ عَلَی اللّٰهِ الْكَذِبَ وَهُمْ یَعْلَمُوْنَ ۟
గ్రంథ ప్రజలలో ఎవరికైనా మీరు పెద్ద మొత్తంలో సంపదను అప్పగిస్తే, తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దానిని గౌరవించే కొంతమంది గ్రంథ ప్రజలు ఉన్నారు. మరోవైపు, వారిలో కొంతమంది ఇలాంటి వారు కూడా ఉన్నారు, ఒకవేళ మీరు వారిపై నమ్మకం ఉంచి ఏదైనా చిన్న మొత్తం వారి వద్ద ఉంచితే, తమపై ఉంచిన నమ్మకాన్ని వారు గౌరవించరు, వెంటపడి అనేక సార్లు అడిగితే గానీ వాపసు చేయరు. దీనికి కారణం, అల్లాహ్ వారి కోసం అనుమతించినందున వారు అరబ్బులపై ఎలాంటి నేరాలకు పాల్పడినా లేదా అరబ్బుల సంపదను అధర్మంగా వాడుకున్నా, వారిపై ఎలాంటి పాపం ఉండదని వారు చేస్తున్న వాదన. తాము అల్లాహ్ కు అంటగడుతున్నది ఒక తప్పుడు లక్షణమని తెలిసి కూడా వారు ఇలాంటి అసత్యాలు పలుకుతున్నారు.
Arabische uitleg van de Qur'an:
بَلٰی مَنْ اَوْفٰی بِعَهْدِهٖ وَاتَّقٰی فَاِنَّ اللّٰهَ یُحِبُّ الْمُتَّقِیْنَ ۟
వారు చెబుతున్నది సత్యం కాదు. నిజానికి, వారి కొరకు పాపం వేచి ఉన్నది. ఏదేమైనా, ఎవరైనా అల్లాహ్ పై తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లయితే; ఆయనపై మరియు ఆయన ప్రవక్త పై విశ్వాసం ఉంచినట్లయితే; అలాగే ప్రజలు వారిపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లయితే; మరియు అల్లాహ్ యొక్క ఆదేశాలు నెరవేర్చడం మరియు ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ ను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ జీవించి నట్లయితే; గుర్తుంచుకోండి! అల్లాహ్ తనను జ్ఞాపకం పెట్టుకునే వారిని అమితంగా ప్రేమిస్తాడు మరియు వారికి అత్యుత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
اِنَّ الَّذِیْنَ یَشْتَرُوْنَ بِعَهْدِ اللّٰهِ وَاَیْمَانِهِمْ ثَمَنًا قَلِیْلًا اُولٰٓىِٕكَ لَا خَلَاقَ لَهُمْ فِی الْاٰخِرَةِ وَلَا یُكَلِّمُهُمُ اللّٰهُ وَلَا یَنْظُرُ اِلَیْهِمْ یَوْمَ الْقِیٰمَةِ وَلَا یُزَكِّیْهِمْ ۪— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
ఎవరైతే తన దివ్యసందేశాన్ని మరియు తన ప్రవక్తలను అనుసరించమని అల్లాహ్ తమకు ఇచ్చిన సందేశానికి బదులుగా మరియు అల్లాహ్ యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చడానికి వారు చేసిన ప్రమాణాలకు బదులుగా ఈ ప్రపంచంలో కొద్ది మొత్తాన్ని తీసుకుంటారో, అలాంటి వారికి పరలోకంలో ప్రసాదించబడే ప్రతిఫలంలో ఎలాంటి భాగస్వామ్యమూ ఉండదు. పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో దయతో మాట్లాడడు మరియు వారి వైపు దయతో చూడడు. మరియు వారిని వారి పాపముల,వారి అవిశ్వాపు మాలిన్యము నుండి పరిశుద్ధపరచడు. వారు బాధాకరమైన శిక్షను చవి చూస్తారు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• من علماء أهل الكتاب من يخدع أتباع ملتهم، ولا يبين لهم الحق الذي دلت عليه كتبهم، وجاءت به رسلهم.
గ్రంథ ప్రజలలోని కొందరు పండితులు తమ మతాన్ని అనుసరించే వారిని మోసం చేస్తున్నారు మరియు వారి ప్రవక్తలపై అవతరించిన వారి గ్రంథాల్లోని అసలు సత్యాన్ని ప్రజలకు చూపించడం లేదు.

• من وسائل الكفار الدخول في الدين والتشكيك فيه من الداخل.
అవిశ్వాసుల పన్నాగాలలో ఒక పన్నాగం ఏమిటంటే, పైకి వారు ధర్మాన్ని స్వీకరించి, దానిని అనుసరిస్తున్న వారిలో పలు సందేహాలు, అనుమానాలు లేవదీస్తారు.

• الله تعالى هو الوهاب المتفضل، يعطي من يشاء بفضله، ويمنع من يشاء بعدله وحكمته، ولا ينال فضله إلا بطاعته.
కేవలం అల్లాహ్ మాత్రమే ప్రసాదించేవాడు మరియు స్వయం సమృద్ధుడూను. ఆయన తను తలిచిన వారికి తన దయ ద్వారా ప్రసాదిస్తాడు. అలాగే ఆయన తను తలిచిన వారికి తన న్యాయం మరియు వివేకం ద్వారా ప్రసాదించకుండా ఆపివేస్తాడు. ఎవరైనా ఆయనను అనుసరించడం ద్వారా మాత్రమే ఆయన అనుగ్రహాన్ని పొందగలరు.

• كل عِوَضٍ في الدنيا عن الإيمان بالله والوفاء بعهده - وإن كان عظيمًا - فهو قليل حقير أمام ثواب الآخرة ومنازلها.
అల్లాహ్ మీద విశ్వాసం మరియు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు ఈ ప్రపంచంలో మీకు చెందినది ఏదైనా తీసుకోబడితే, త్యాగం చేయవలసి వస్తే - అది ఎంత గొప్పదైనా సరే – పరలోకంలో ప్రసాదించబడే అనుగ్రహాలు మరియు హోదాతో పోల్చినపుడు, అది చాలా తక్కువైనది మరియు విలువలేనిదిగా కనబడుతుంది.

وَاِنَّ مِنْهُمْ لَفَرِیْقًا یَّلْوٗنَ اَلْسِنَتَهُمْ بِالْكِتٰبِ لِتَحْسَبُوْهُ مِنَ الْكِتٰبِ وَمَا هُوَ مِنَ الْكِتٰبِ ۚ— وَیَقُوْلُوْنَ هُوَ مِنْ عِنْدِ اللّٰهِ وَمَا هُوَ مِنْ عِنْدِ اللّٰهِ ۚ— وَیَقُوْلُوْنَ عَلَی اللّٰهِ الْكَذِبَ وَهُمْ یَعْلَمُوْنَ ۟
యూదులలో ఒక వర్గం వారు తాము పఠిస్తున్న దానిని ప్రజలు తౌరాత్ గా భావించాలని అల్లాహ్ అవతరింప చేయని విషయాలను సైతం తమ నాలుకలను త్రిప్పి చదివేవారు. వాస్తవానికి అది తౌరాత్ కాదు కదా వారు పలికిన అబద్ధం. వారు అల్లాహ్ పై అసత్యాన్ని ఆపాదిస్తున్నారు. మరియు వారు మేము పటిస్తున్నది అల్లాహ్ తరపునుండి అవతరింప చేయబడిందని అంటున్నారు. వాస్తవానికి అది అల్లాహ్ తరపునుండి అవతరింప చేయబడలేదు. వారు అల్లాహ్ గురించి అసత్యం పలుకుతున్నారు. తాము అల్లాహ్ మరియు ప్రవక్త గురించి అసత్యం పలుకుతున్నామన్న విషయం వారికి బాగా తెలుసు.
Arabische uitleg van de Qur'an:
مَا كَانَ لِبَشَرٍ اَنْ یُّؤْتِیَهُ اللّٰهُ الْكِتٰبَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ یَقُوْلَ لِلنَّاسِ كُوْنُوْا عِبَادًا لِّیْ مِنْ دُوْنِ اللّٰهِ وَلٰكِنْ كُوْنُوْا رَبّٰنِیّٖنَ بِمَا كُنْتُمْ تُعَلِّمُوْنَ الْكِتٰبَ وَبِمَا كُنْتُمْ تَدْرُسُوْنَ ۟ۙ
ఏ మానవునికైనా అల్లాహ్ తన వైపు నుండి గ్రంథాన్ని అవతరింపజేసి అతనికి జ్ఞానాన్ని,వివేకాన్నిప్రసాదించి ప్రవక్తగా ఎన్నుకున్న పిదప మీరు అల్లాహ్ కు బదులుగా నన్ను ప్రార్థించండి అని అనటం ఎంత మాత్రం తగినది కాదు. కానీ వారితో మీరు జ్ఞానంపొంది, ఆచరించి, ప్రజలకు శిక్షణ ఇచ్చి,వారి కార్యాలను సంస్కరించే వారిలో చేరిపోండి అని అనటమే తగినది. ఈ విషయాన్నే మీరు ప్రజలకు బోధించటానికి గ్రంథం అవతరింప చేయబడింది ఏ గ్రంథాన్నయితే మీరు కంఠస్థం చేస్తూ అర్థం చేసుకుంటూ అభ్యసిస్తూ ఉండేవారో.
Arabische uitleg van de Qur'an:
وَلَا یَاْمُرَكُمْ اَنْ تَتَّخِذُوا الْمَلٰٓىِٕكَةَ وَالنَّبِیّٖنَ اَرْبَابًا ؕ— اَیَاْمُرُكُمْ بِالْكُفْرِ بَعْدَ اِذْ اَنْتُمْ مُّسْلِمُوْنَ ۟۠
మరియు ఆయనకు ఇది శోభస్కరము కాదు-అలాగే-మీరు దైవదూతలనో మరియు ప్రవక్తలనో అల్లాహ్ ను వదిలి ఆరాధించడానికి ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. మీరు అల్లాహ్’తో అవిశ్వాసానికి తిరస్కార వైఖరి’ ఒడిగట్టమని మిమ్మల్ని ఆజ్ఞాపించడం ఆయనకు తగునా? అదికూడా !మీరు అల్లాహ్ కు విధేయులుగా లొంగి,సమర్పించుకున్న తరువాత ?.
Arabische uitleg van de Qur'an:
وَاِذْ اَخَذَ اللّٰهُ مِیْثَاقَ النَّبِیّٖنَ لَمَاۤ اٰتَیْتُكُمْ مِّنْ كِتٰبٍ وَّحِكْمَةٍ ثُمَّ جَآءَكُمْ رَسُوْلٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهٖ وَلَتَنْصُرُنَّهٗ ؕ— قَالَ ءَاَقْرَرْتُمْ وَاَخَذْتُمْ عَلٰی ذٰلِكُمْ اِصْرِیْ ؕ— قَالُوْۤا اَقْرَرْنَا ؕ— قَالَ فَاشْهَدُوْا وَاَنَا مَعَكُمْ مِّنَ الشّٰهِدِیْنَ ۟
జ్ఞాపకం చేసుకోండి- ఓ ప్రవక్తా –అల్లాహ్ దైవప్రవక్తలకు చెప్తూ తీసుకున్న గట్టి ప్రమాణం గురించి : ఎప్పుడైతే గ్రంథం మీకు ఇచ్చామో మీపై దాన్నిఅవతరింపచేశాము,దానితో పాటు వివేకాన్ని కూడా మీకు బోధించాము,ఆపై మా వైపు నుండి మీ వద్దకి ఒక ప్రవక్త ఉద్బవించాడు’-ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్’-ఆయన మీ వద్ద ఉన్న పుస్తకాన్ని,వివేకాన్ని సత్యపర్చాడు. తద్వారా మీరు ఆయన తెచ్చిన సందేశాన్నివిశ్వసించగలరు మరియు ఆయనకు విదేయులుగా మారి సహాయసహకారాలు అందించగలరు,-ఓ ప్రవక్తలారా!-మరి మీరు దీన్ని అంగీకరిస్తున్నారా? దీనిపై నా ఈ గట్టి ప్రమాణాన్ని స్వీకరిస్తున్నారా?అప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు : మేము అంగీకరించాము,అప్పుడు అల్లాహ్ అన్నాడు : అయితే, మీరు దీనికి మరియు మీజాతులకు సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు మీపై మరియు వారిపట్ల సాక్షిగా ఉంటాను.
Arabische uitleg van de Qur'an:
فَمَنْ تَوَلّٰی بَعْدَ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الْفٰسِقُوْنَ ۟
ఎవరైతే అల్లాహ్ మరియు దైవప్రవక్తకు చేసిన ఈ గట్టి ప్రమాణాన్నిఅతిక్రమిస్తారో నిజానికి వారు అల్లాహ్ ధర్మం నుండి మరియు ఆయన విధేయత నుండి బహిష్కృతులవుతారు.
Arabische uitleg van de Qur'an:
اَفَغَیْرَ دِیْنِ اللّٰهِ یَبْغُوْنَ وَلَهٗۤ اَسْلَمَ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ طَوْعًا وَّكَرْهًا وَّاِلَیْهِ یُرْجَعُوْنَ ۟
ఏమిటి ? అల్లాహ్ తన దాసుల కొరకు ఎంచిన ధర్మం అనగా -ఇస్లాము-కాకుండా మరొకటి ఎంపికచేయాలా ? అల్లాహ్ ధర్మం మరియు ఆయన విధేయత నుండి బహిష్కృతులైన వీరు కోరుతున్నారా ? ఆ పరమపవిత్రుడి కొరకు భూమ్యాకాశాలలో ఉన్న సమస్త జీవులు సమర్పితమై’ముమినీనుల వలె ఇష్టంగా మరియు కాఫిర్ల వలె కష్టంగా విధేయులుగా ఉన్నారు,పిదప ఆ మహోన్నతుడి వైపుకే సమస్త సృష్టి ప్రళయదినాన లెక్కచెప్పుకోవడానికి,ప్రతిఫలం పొందటానికి మరలుతుంది.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• ضلال علماء اليهود ومكرهم في تحريفهم كلام الله، وكذبهم على الناس بنسبة تحريفهم إليه تعالى.
యూదపండితులు పాల్పడిన భ్రష్టత్వం మరియు మోసం ఏమనగా ‘అల్లాహ్ వాక్కును వక్రీకరించడం మరియు దాన్ని ప్రజలతో అల్లాహ్’కు ఆపాదిస్తూ అసత్యంచెప్పడం.

• كل من يدعي أنه على دين نبي من أنبياء الله إذا لم يؤمن بمحمد عليه الصلاة والسلام فهو ناقض لعهده مع الله تعالى.
ప్రవక్తల ధర్మం పై ఉన్నామని వాదించే వారు‘ఒకవేళ మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్’ను విశ్వసించనట్లైతే మహోన్నతుడైన అల్లాహ్ కు చేసిన అతని ప్రమాణం అసంపూర్ణమవుతుంది.

• أعظم الناس منزلةً العلماءُ الربانيون الذين يجمعون بين العلم والعمل، ويربُّون الناس على ذلك.
ప్రజల్లో అంతస్తుల పరంగా గొప్పవారు’ భయభీతులు కలిగిన ఉలమాలు ఎవరంటే వారే విజ్ఞత,ఆచరణలను కలిగిన భక్తిపరులు మరియు ప్రజలకు దీని గురించి అవగాహనపరుచువారు.

• أعظم الضلال الإعراض عن دين الله تعالى الذي استسلم له سبحانه الخلائق كلهم بَرُّهم وفاجرهم.
అతి పెద్ద మార్గభ్రష్టత–మహోన్నతుడైన ఆ అల్లాహ్ యొక్క ధర్మం నుండి విముఖత చూపడం, ఎవరికైతే సర్వసృష్టి లోని పుణ్యాత్ములు,పాపాత్ములు అందరూ విధేయతచూపుతున్నారు.

قُلْ اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ عَلَیْنَا وَمَاۤ اُنْزِلَ عَلٰۤی اِبْرٰهِیْمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَمَاۤ اُوْتِیَ مُوْسٰی وَعِیْسٰی وَالنَّبِیُّوْنَ مِنْ رَّبِّهِمْ ۪— لَا نُفَرِّقُ بَیْنَ اَحَدٍ مِّنْهُمْ ؗ— وَنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : -అల్లాహ్ ను దైవంగా విశ్వసించాము,ఆయన మాకు ఆదేశించిన విషయాల ప్రకారంగా ఆయనకు మేము విధేయత చూపాము,మా పై అవతరింపబడిన దైవవాణిని విశ్వసించాము,మరియు ఇబ్రాహీం,ఇస్మాయీల్,ఇస్హాఖ్,యాఖూబు అలైహిముస్సలాముల పై అవతరించిన దానిని విశ్వసించాము,మరియు యాఖూబు సంతతి ప్రవక్తలపై అవతరించిన దాన్ని విశ్వసించాము,ఇదేవిధంగా మూసా,ఈసా మరియు సమస్త ప్రవక్తలకు తన ప్రభువు తరుపున ఇవ్వబడిన గ్రంధాలు మరియు ఆయతులను విశ్వసించాము,వారిలో ఒకరిని విశ్వసించి,ఇంకొకరిని దిక్కరించడం’లాంటి తారతమ్యం చూపకుండా విశ్వసిస్తున్నాము,మరియు మేము ఏకైకుడైన అల్లాహ్’కొరకు ఆచరిస్తూ ఆయన కొరకు మాత్రమే విధేయతకలిగి ఉంటాము.
Arabische uitleg van de Qur'an:
وَمَنْ یَّبْتَغِ غَیْرَ الْاِسْلَامِ دِیْنًا فَلَنْ یُّقْبَلَ مِنْهُ ۚ— وَهُوَ فِی الْاٰخِرَةِ مِنَ الْخٰسِرِیْنَ ۟
అల్లాహ్ ఇష్టపడిన ధర్మం అనగా ‘ఇస్లాం’ను వదిలి వేరే ధర్మాన్ని కోరినట్లైతే అల్లాహ్ దాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించడు,మరియు పరలోకంలో వారు తమను నరకాగ్నికి గురిచేసి నష్టపరుల్లో చేరిపోతారు.
Arabische uitleg van de Qur'an:
كَیْفَ یَهْدِی اللّٰهُ قَوْمًا كَفَرُوْا بَعْدَ اِیْمَانِهِمْ وَشَهِدُوْۤا اَنَّ الرَّسُوْلَ حَقٌّ وَّجَآءَهُمُ الْبَیِّنٰتُ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟
అల్లాహ్ తనను మరియు ప్రవక్తను విశ్వసించేభాగ్యం ఇలాంటి జాతికి ఎందుకు అనుగ్రహిస్తాడు ? వీరు అల్లాహ్’ను విశ్వసించి,ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్’తెచ్చిన సందేశాన్నిసత్యమని’సాక్ష్యమిచ్చిన తరువాత తిరస్కరించారు,మరియు వారి దగ్గరికి స్పష్టమైన నిదర్శనాలు వచ్చాయి. నిశ్చయంగా ఇలాంటి కర్కశత్వపుజాతికి ఈమాన్ అనుగ్రహాన్ని అల్లాహ్ ఎన్నటికీ నొసగడు,వీరు ఋజుమార్గానికి బదులు బ్రష్టత్వాన్ని ఎంచుకున్నారు.
Arabische uitleg van de Qur'an:
اُولٰٓىِٕكَ جَزَآؤُهُمْ اَنَّ عَلَیْهِمْ لَعْنَةَ اللّٰهِ وَالْمَلٰٓىِٕكَةِ وَالنَّاسِ اَجْمَعِیْنَ ۟ۙ
నిశ్చయంగా ఇలాంటి అసత్యాన్ని ఎంచుకున్న కర్కశుల ప్రతిఫలం అల్లాహ్ శాపం,దైవదూతల శాపం,మరియు సమస్త ప్రజల శాపం వారిపై కురుస్తుంది,వారు అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి దూరంగా దుత్కరింపబడతారు.
Arabische uitleg van de Qur'an:
خٰلِدِیْنَ فِیْهَا ۚ— لَا یُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟ۙ
శాశ్వతంగా నరకాగ్నిలో ఉంటారు ఎప్పటికీ బయటికి రాలేరు,వారి శిక్షను ఏ మాత్రం తగ్గించబడదు,మరియు వారికి ‘తౌబా చెందుటకు మరియు సాకు చెప్పుకునుటకు గడువుకూడా ఇవ్వబడదు.
Arabische uitleg van de Qur'an:
اِلَّا الَّذِیْنَ تَابُوْا مِنْ بَعْدِ ذٰلِكَ وَاَصْلَحُوْا ۫— فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
కానీ,తిరస్కారం మరియు అన్యాయం తరువాత అల్లాహ్ వైపుకు మరలుతూ తమ కార్యాలను సంస్కరించుకున్నట్లయితే నిశ్చయంగా అల్లాహ్ తౌబా(క్షమాపణ)చేసుకున్నతన దాసుల కొరకు పరమ క్షమాశీలుడు,మరియు అపార కరుణామయుడు.
Arabische uitleg van de Qur'an:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا بَعْدَ اِیْمَانِهِمْ ثُمَّ ازْدَادُوْا كُفْرًا لَّنْ تُقْبَلَ تَوْبَتُهُمْ ۚ— وَاُولٰٓىِٕكَ هُمُ الضَّآلُّوْنَ ۟
విశ్వసించి మళ్ళీ అవిశ్వాసానికి పాల్పడి మరణం చివరిక్షణాలకు చేరిపోయెంత వరకు దానిపై నిలకడగా ఉండి,మరణం అంచుల్లోకి వెళ్ళిన పిదప సమయం గడిచిన తరువాత చేసుకున్నఆ తౌబాను అల్లాహ్ ఎన్నటికీ ఆమోదించడు. మహోన్నతుడైన అల్లాహ్ వైపుకు చేర్చే ఋజుమార్గం నుండి బ్రష్టులైనవారు వీరే.
Arabische uitleg van de Qur'an:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَمَاتُوْا وَهُمْ كُفَّارٌ فَلَنْ یُّقْبَلَ مِنْ اَحَدِهِمْ مِّلْءُ الْاَرْضِ ذَهَبًا وَّلَوِ افْتَدٰی بِهٖ ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌۙ— وَّمَا لَهُمْ مِّنْ نّٰصِرِیْنَ ۟۠
ఎవరైతే తిరస్కరించి,ఆ విశ్వాసం తోనే మరణిస్తారో నరకాగ్ని నుండి రక్షణ పొందుటకై భూమిని తూచేబంగారం’వారిలోని ఏ ఒక్కరి నుండి ప్రవేశపెట్టినను స్వీకరించబడదు,వారందరి కొరకు బాధాకరమైన శిక్షలు సిద్దంగా ఉన్నాయి,మరియు పునరుత్తాన దినమున ఆ శిక్షల నుంచి వీరిని కాపాడే నాధులు ఎవరూ ఉండరు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• يجب الإيمان بجميع الأنبياء الذين أرسلهم الله تعالى، وجميع ما أنزل عليهم من الكتب، دون تفريق بينهم.
అల్లాహ్ ప్రబవింపచేసిన దైవప్రవక్తలను మరియు వారిపై అవతరింపచేసిన పుస్తకాలను ఎటువంటి తారతమ్యము లేకుండా విశ్వసించడం తప్పనిసరి.

• لا يقبل الله تعالى من أحد دينًا أيًّا كان بعد بعثة النبي محمد صلى الله عليه وسلم إلا الإسلام الذي جاء به.
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రభవించిన పిమ్మట ఆయన తెచ్చిన ఇస్లామును తప్ప మహోన్నతుడైన అల్లాహ్ ఏ ధర్మాన్ని ఆమోదించడు.

• مَنْ أصر على الضلال، واستمر عليه، فقد يعاقبه الله بعدم توفيقه إلى التوبة والهداية.
మార్గభ్రష్టత్వం పై మొండివైఖరితో నిలదొక్కుకపోయినవాడిని అల్లాహ్ తౌబా మరియు ఋజుమార్గపు అనుగ్రహం నుండి దూరం చేసి శిక్షిస్తాడు.

• باب التوبة مفتوح للعبد ما لم يحضره الموت، أو تشرق الشمس من مغربها، فعندئذ لا تُقْبل منه التوبة.
తౌబా తలుపులు దాసుడి మరణం దరిచేరనంతవరకు అతనికోసం తెరవబడియున్నాయి,లేదా సూర్యుడు పడమటన ఉదయించనంత వరకు సమయం ఉంది,ఆ సమయం దాటితే తౌబా స్వీకరించబడదు.

• لا ينجي المرء يوم القيامة من عذاب النار إلا عمله الصالح، وأما المال فلو كان ملء الأرض لم ينفعه شيئًا.
పునరుత్తానదినమున మనిషి నరకాగ్ని నుండి రక్షణ పొందలేడు కానీ అది కేవలం సత్కార్యాల వల్ల సాధ్యమవుతుంది. ఇక సంపద విషయానికొస్తే అది భూమినిండా ఉన్నాసరే అతనికి కొంచెం కూడా ఉపయోగపడదు.

لَنْ تَنَالُوا الْبِرَّ حَتّٰی تُنْفِقُوْا مِمَّا تُحِبُّوْنَ ؕ۬— وَمَا تُنْفِقُوْا مِنْ شَیْءٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِیْمٌ ۟
మీరు –ఓ విశ్వాసులారా- మీరు అతిగా ప్రేమించే మీ సంపదను దైవమార్గంలో ఖర్చుచేయనంతవరకు పుణ్యాత్ముల పుణ్యమును మరియు వారి స్థానమును ఎన్నటికీ పొందలేరు,మీరు ఏ చిన్నదానం లేక పెద్ద దానం చేసిన ఆ అల్లాహ్ మీ సంకల్పాల మరియు కార్యాల పట్ల జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు,అతి త్వరలో అతని పనికి తగ్గ పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ اِلَّا مَا حَرَّمَ اِسْرَآءِیْلُ عَلٰی نَفْسِهٖ مِنْ قَبْلِ اَنْ تُنَزَّلَ التَّوْرٰىةُ ؕ— قُلْ فَاْتُوْا بِالتَّوْرٰىةِ فَاتْلُوْهَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఇస్రాయీల్ సంతతివాసులకు పరిశుద్దపదార్థాలన్నీ హలాలుగా ఉండేవి,యాఖూబ్ తన పై తౌరాతు అవతరణకు ముందు నిషేదించుకున్నవి మినహా అందులో ఏమి వారిపై నిషేధించబడలేదు. కానీ ఆ నిషేధం తౌరాతు లోనిదే అని యూదులు వాదిస్తారు,కానీ అది అలా లేదు-ఓ దైవప్రవక్త-మీరు వారికి చెప్పండి : తౌరాతును తీసుకురండి మరియు దాన్ని చదవండి ఒకవేళ మీ ఈ వాదనలో మీరు సత్యవంతులైతే,అప్పుడు వారి ముఖాలు తెల్లబోయాయి,దానిని ప్రవేశపెట్టలేదు,తౌరాతులో యూదుల అసత్య మోసానికి మరియు దాని అంశాల వక్రీకరణకు ఇది ఒక ఉదాహరణ.
Arabische uitleg van de Qur'an:
فَمَنِ افْتَرٰی عَلَی اللّٰهِ الْكَذِبَ مِنْ بَعْدِ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟ؔ
‘సత్యమైన తీర్పు అనగా ‘యాఖూబు అలైహిస్సలాము నిషేదించినవి స్వయంగా ఆయన నిషేదించుకున్నవే తప్ప అల్లాహ్ నిషేదించినవికాదు’-అనే సత్యం వెలుగుచూసిన తరువాత కూడా అల్లాహ్’కు అసత్యాన్నిఆపాదించినవారే సత్యాన్ని వదిలి తమపై దౌర్జన్యం చేసుకున్న దుర్మార్గులు.
Arabische uitleg van de Qur'an:
قُلْ صَدَقَ اللّٰهُ ۫— فَاتَّبِعُوْا مِلَّةَ اِبْرٰهِیْمَ حَنِیْفًا ؕ— وَمَا كَانَ مِنَ الْمُشْرِكِیْنَ ۟
మీరు చెప్పండి-ఓ దైవప్రవక్త-:-యాఖూబు అలైహిస్సలాము గురించి తెలియజేసిన పూర్తి సమాచారం,అవతరించబడినది మరియు శాసనాలుగా మార్చిన సమస్త విషయాలు'అల్లాహ్ సత్యమని దృవీకరించాడు,అంచేత ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని అనుసరించండి. అన్నీ మతాల్లో అది మాత్రమే ఇస్లాము వైపుకు మరలుతుంది,మరియు అల్లాహ్’కు ఇతరులను భాగస్వామ్యం కల్పించదు.
Arabische uitleg van de Qur'an:
اِنَّ اَوَّلَ بَیْتٍ وُّضِعَ لِلنَّاسِ لَلَّذِیْ بِبَكَّةَ مُبٰرَكًا وَّهُدًی لِّلْعٰلَمِیْنَ ۟ۚ
అల్లాహ్ ఆరాధన నిమిత్తం సమస్తప్రజల కోసం మొట్టమొదటగా భూమండలం పై నిర్మితమైన కట్టడం’మక్కాలోని‘అల్ హరాము’గా పిలువబడే 'అల్లాహ్ గృహం’ఇది పవిత్రమైన గృహం,ఇందులో ప్రాపంచిక,పరలోక పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి,మరియు ఇందులో సర్వలోకాల కొరకు మార్గదర్శకత్వం ఉంది.
Arabische uitleg van de Qur'an:
فِیْهِ اٰیٰتٌۢ بَیِّنٰتٌ مَّقَامُ اِبْرٰهِیْمَ ۚ۬— وَمَنْ دَخَلَهٗ كَانَ اٰمِنًا ؕ— وَلِلّٰهِ عَلَی النَّاسِ حِجُّ الْبَیْتِ مَنِ اسْتَطَاعَ اِلَیْهِ سَبِیْلًا ؕ— وَمَنْ كَفَرَ فَاِنَّ اللّٰهَ غَنِیٌّ عَنِ الْعٰلَمِیْنَ ۟
ఈ గృహంలో దీని యొక్క గౌరవం మరియు ఘనతలను సూచించే కొన్ని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి 'అనగా "అల్-మనాసిక్ మరియు అల్-మశాయిర్’లాంటివి,ఈ సంకేతాల్లో ఒకటి ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా గోడలను నిర్మించే క్రమంలో నిలబడిన రాయి.మరొక గుర్తు ‘ఇందులో ప్రవేశించినవాడికి భయం ఉండదు,ఎటువంటి హానీ అతనికి కలుగదు,అల్లాహ్ కొరకు హజ్జ్’ఆచరణలు పూర్తిచేయడానికి అక్కడికి వెళ్ళగలిగే శక్తి,సామర్థ్యాలు కలిగిన ప్రజలు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి,మరెవడైతే విధి చేయబడిన హజ్జ్’ను తిరస్కరిస్తాడో . నిశ్ఛయంగా అల్లాహ్ ఈ అవిశ్వాసపరుడి నుండి మరియు సర్వలోకాల నుండి ఎటువంటి అక్కర లేనివాడు.
Arabische uitleg van de Qur'an:
قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَكْفُرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ ۖۗ— وَاللّٰهُ شَهِیْدٌ عَلٰی مَا تَعْمَلُوْنَ ۟
మీరు చెప్పండి–ఓ దైవప్రవక్త –ఓ గ్రంధవహకులైన యూదులు మరియు క్రైస్తవులారా! మీరెందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యొక్క ద్యోతకం సత్యమని నిరూపించే స్పష్టమైన రుజువులకు విరుద్దంగా వాదిస్తున్నారు,అప్పటికి అందులోని కొన్ని నిదర్శనాలు తౌరాతు మరియు ఇంజీలులో వచ్చియున్నాయి కదా ? నిశ్చయంగా అల్లాహ్ మీ ఈ కర్మల పట్ల దృష్టిసారించి,దానిపై సాక్ష్యంగా ఉన్నాడు,ఆయన అతిత్వరలో మీకు దాని ప్రతిఫలం ఇస్తాడు.
Arabische uitleg van de Qur'an:
قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ مَنْ اٰمَنَ تَبْغُوْنَهَا عِوَجًا وَّاَنْتُمْ شُهَدَآءُ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
మీరు చెప్పండి –ఓ దైవప్రవక్త-ఓ గ్రంథవహకులైన యూదులు మరియు క్రైస్తవులారా విశ్వసించిన ప్రజలను అల్లాహ్ మార్గం నుండి ఎందుకని ఆపుతున్నారు,మీరు దైవధర్మం కొరకు సత్యం నుండి అసత్యం వైపునకు మారమని కోరుతున్నారు,అప్పటికి దానిని విశ్వసించినవారు సన్మార్గం నుండి బ్రష్టులయ్యారు,మరియు మీరు ఈ మాట పై సాక్ష్యులుగా ఉన్నారు అది ఈ ధర్మమే సత్యమైనది,మరియు మీ పుస్తకములో ఉన్నది సత్యపరిచింది కదా ? మీరు ఆయనకు ఒడిగట్టే అవిశ్వాసం,ఆయన మార్గం నుంచి ఆపడం వంటి చేష్టలను నుంచి అల్లాహ్ పరధ్యానంలో లేడు. ఆయన దీనికి ప్రతిఫలం అతిత్వరలో మీకు ఇవ్వబోతున్నాడు.
Arabische uitleg van de Qur'an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ تُطِیْعُوْا فَرِیْقًا مِّنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ یَرُدُّوْكُمْ بَعْدَ اِیْمَانِكُمْ كٰفِرِیْنَ ۟
ఓ అల్లాహ్’ను విశ్వసించి, మరియు ఆయన ప్రవక్తను అనుసరించినవారా ఒకవేళ మీరు గ్రంథవహులైన యూదులు మరియు క్రైస్తవులు చెప్తున్న విషయాలకు కనుక విధేయత కనబరిచినా,వారు వాదించే ఆలోచనలను స్వీకరించిన అది మిమ్ములను విశ్వాసం తరువాత వారిలోని అసూయ,బ్రష్టత్వం వలన సన్మార్గం నుండి కుఫ్ర్,అవిశ్వాసం వైపునకు మరలుస్తుంది.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• كَذِبُ اليهود على الله تعالى وأنبيائه، ومن كذبهم زعمهم أن تحريم يعقوب عليه السلام لبعض الأطعمة نزلت به التوراة.
యూదులు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలపై అబద్దం మోపారు,వారి అబద్దమేమిటంటే ‘యాఖూబు అలైహిస్సలాము కొన్నిఆహారపదార్థాలను నిషేదించారు వాటిని తౌరాతు నిషేదించింది అని వారి వాదన

• أعظم أماكن العبادة وأشرفها البيت الحرام، فهو أول بيت وضع لعبادة الله، وفيه من الخصائص ما ليس في سواه.
ఆరాధించబడే ప్రదేశాలలో గొప్పది మరియు గౌరవప్రదమైనది ‘అల్ హరాము గృహం’ఇది అల్లాహ్ ఆరాధన నిమిత్తం మొట్టమొదట నిర్మితమైనది,దీనియందు గల ప్రత్యేకతలు మరొకదానిలో లేవు.

• ذَكَرَ الله وجوب الحج بأوكد ألفاظ الوجوب تأكيدًا لوجوبه.
అల్లాహ్ హజ్జ్’విధి కావడాన్ని ప్రస్తావించాడు దానీకోసం విధి’ని సూచించే పదాల ద్వారా తాకీదు చేశాడు.

وَكَیْفَ تَكْفُرُوْنَ وَاَنْتُمْ تُتْلٰی عَلَیْكُمْ اٰیٰتُ اللّٰهِ وَفِیْكُمْ رَسُوْلُهٗ ؕ— وَمَنْ یَّعْتَصِمْ بِاللّٰهِ فَقَدْ هُدِیَ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟۠
మీరు అల్లాహ్ ను విశ్వసించిన తరువాత ఆయన’ను ఎలా తిరస్కరిస్తున్నారు ? విశ్వాసాన్ని నిరూపించడానికి పెద్ద కారణం మీ వద్ద ఉంది! అల్లాహ్ ఆయతులు చదివి మీకు వినిపించబడుతున్నాయి,ముహమ్మద్ దైవప్రవక్త మీ కొరకు వాటిని వివరిస్తున్నారు,ఎవరైతే అల్లాహ్ గ్రంథాన్ని మరియు దైవప్రవక్త సాంప్రదాయాన్ని గట్టిగా పట్టుకుంటాడో అల్లాహ్ అతనికి సరళమార్గం’ఋజుమార్గాన్ని అనుగ్రహిస్తాడు,అందులో కొంచెం కూడా వంకరతనం ఉండదు.
Arabische uitleg van de Qur'an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ حَقَّ تُقٰتِهٖ وَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَ ۟
అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తకు విధేయత చూపిన జనులారా! మీ ప్రభువుకు తగిన ప్రకారం భయాన్ని కలిగి ఉండండి,అది ఆయన ఆదేశాలను ఆచరించడం,నిషేధాలకు దూరంగా ఉండటం,అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం,మీరు మీ ధర్మాన్ని దృఢంగా పట్టుకోండి,చివరికి మీ మరణం వరకు దానిపై మీరు స్థిరంగా ఉండాలి.
Arabische uitleg van de Qur'an:
وَاعْتَصِمُوْا بِحَبْلِ اللّٰهِ جَمِیْعًا وَّلَا تَفَرَّقُوْا ۪— وَاذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَیْكُمْ اِذْ كُنْتُمْ اَعْدَآءً فَاَلَّفَ بَیْنَ قُلُوْبِكُمْ فَاَصْبَحْتُمْ بِنِعْمَتِهٖۤ اِخْوَانًا ۚ— وَكُنْتُمْ عَلٰی شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَاَنْقَذَكُمْ مِّنْهَا ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟
మరియు -ఓ విశ్వాసులారా-దృఢంగా పట్టుకోండి గ్రంథం మరియు సున్నతును,మిమ్ము విభేదాలలో పడవేయు కార్యాలకు పాల్పడకండి,గుర్తుచేసుకోండి! అల్లాహ్ మీపై కురిపించిన అనుగ్రహాలను,ఇస్లాము కు ముందు మీరు పరస్పరం శత్రువులుగా ఉండేవారు అతి చిన్నకారణాలకు యుద్దాలు చేసుకునేవారు,అప్పుడు అల్లాహ్ మీ హృదయాలను ఇస్లాం ద్వారా జోడించాడు,తద్వారా మీరు ఆయన దయతో ఒండోకరికి ఉపదేశించుకునేవారుగా,దయచూపేవారుగా ,ధార్మిక సహోదరులుగా మారారు,ఇంతకుముందు మీరు మీ అవిశ్వాసం కారణంగా నరకాగ్ని అంచుల్లో ఉండేవారు,అప్పుడు అల్లాహ్ మీ అందరినీ ఇస్లాం ద్వారా దాని నుండి కాపాడాడు,మీకు సవ్యమైన ఈమాన్ యొక్క మార్గదర్శకత్వం చేశాడు.ఇది మీకు అల్లాహ్ వివరించాడు,అలాగే మీకు ప్రాపంచిక, పరలోక పరంగా సంస్కరించుకునే విషయాలను కూడా వివరిస్తున్నాడు,తద్వారా మీరు సన్మార్గం పొందగలరు మరియు స్థిరమైన మార్గం పై నడువగలరు.
Arabische uitleg van de Qur'an:
وَلْتَكُنْ مِّنْكُمْ اُمَّةٌ یَّدْعُوْنَ اِلَی الْخَیْرِ وَیَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَیَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ ؕ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟
మీలో నుంచి -ఓ విశ్వాసులరా- ఒక సముదాయం అల్లాహ్ ప్రేమించే ప్రతీమంచి వైపునకు పిలువాలి,శరీయతు ప్రమాణమైన మంచిని,నైతికతను ఆదేశించాలి,మరియు శరియతుపర,బుద్దిపర చెడును ఖండించాలి,ఇలాంటి గుణాలను కలిగి ఉన్నవాడు ప్రాపంచిక పరలోక పరంగా సంపూర్ణంగా సఫలీకృతుడవుతాడు.
Arabische uitleg van de Qur'an:
وَلَا تَكُوْنُوْا كَالَّذِیْنَ تَفَرَّقُوْا وَاخْتَلَفُوْا مِنْ بَعْدِ مَا جَآءَهُمُ الْبَیِّنٰتُ ؕ— وَاُولٰٓىِٕكَ لَهُمْ عَذَابٌ عَظِیْمٌ ۟ۙ
ఓ విశ్వాసులారా-మీరు గ్రంథవహకుల మాదిరి పరస్పరం విభేదించుకుని సముదాయాలు మరియు వర్గాలుగా మారిపోకండి,వారు అల్లాహ్ వద్ద నుండి స్పష్టమైన ఆయతులు వచ్చిన తరువాత తమ ధర్మవిషయాల్లో విభేదించారు,ఇక్కడ ప్రస్తావించిన వారి కొరకు అల్లాహ్ నుండి పెద్దశిక్ష ఉంటుంది.
Arabische uitleg van de Qur'an:
یَّوْمَ تَبْیَضُّ وُجُوْهٌ وَّتَسْوَدُّ وُجُوْهٌ ۚ— فَاَمَّا الَّذِیْنَ اسْوَدَّتْ وُجُوْهُهُمْ ۫— اَكَفَرْتُمْ بَعْدَ اِیْمَانِكُمْ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ ۟
పునరుత్థానరోజున వారిపై ఈ పెద్ద శిక్ష విరుచుకుపడుతుంది,ఆనాడు విశ్వాసుల ముఖాలు సంతోషంతో,ఆనందంతో వెలిగిపోతాయి.మరియు అవిశ్వాసుల ముఖాలు విచారం మరియు భాధతో నల్లబడుతాయి.ఇక ఆ గొప్ప రోజున ఎవరి ముఖాలు నల్లబోతాయో వారిని మందలిస్తూ ఇలా ప్రశ్నించబడుతుంది:- మీ యొక్క ధృవీకరణ,ఆమోదం,అల్లాహ్ మరియు అతని ఏకత్వ ప్రమాణం,ఆయనకు ఎవరిని సాటి కల్పించవద్దని మీ ద్వారా తీసుకోబడిన ప్రమాణాన్ని మీరు తిరస్కరించారా ? అయితే ఇప్పుడు అల్లాహ్ మీ అవిశ్వాసానికి బదులుగా మీకోసం సంసిద్దం చేసిన శిక్షను రుచిచూడండి.
Arabische uitleg van de Qur'an:
وَاَمَّا الَّذِیْنَ ابْیَضَّتْ وُجُوْهُهُمْ فَفِیْ رَحْمَةِ اللّٰهِ ؕ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
ఇక ఎవరి ముఖాలు కాంతిమయమై మెరుస్తూ ఉంటాయో వారి నివాసము అనుగ్రహాలతో నిండిన తోటల్లో ఉంటుంది,అక్కడ వారు అంతమవ్వని,చెక్కుచెదరని అనుగ్రహలలో శాశ్వతంగా ఉంటారు.
Arabische uitleg van de Qur'an:
تِلْكَ اٰیٰتُ اللّٰهِ نَتْلُوْهَا عَلَیْكَ بِالْحَقِّ ؕ— وَمَا اللّٰهُ یُرِیْدُ ظُلْمًا لِّلْعٰلَمِیْنَ ۟
ఈ ఆయతులు ‘అల్లాహ్ యొక్క వాగ్దానం మరియు హెచ్చరికలను కలిగి ఉన్నాయి,మేము వాటిని మీకు-ఓ దైవప్రవక్త -సత్యమైన సమాచారం,న్యాయమైన ఆదేశాలతో చదివి వినిపిస్తున్నాము,సర్వలోకాల్లో దేనిపట్లా అల్లాహ్ అన్యాయంగా వ్యవహరించడు,కానీ తమ సుహస్తాలతో చేసుకున్న పాపాలకు మాత్రమే ఆయన శిక్షిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• متابعة أهل الكتاب في أهوائهم تقود إلى الضلال والبعد عن دين الله تعالى.
తమ అభీష్టాల అనుసరణ గ్రంథవహుల మార్గబ్రష్టత్వానికి దారితీసింది మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ధర్మం నుండి దూరం చేసింది.

• الاعتصام بالكتاب والسُّنَّة والاستمساك بهديهما أعظم وسيلة للثبات على الحق، والعصمة من الضلال والافتراق.
పవిత్ర దైవగ్రంథం (పవిత్ర ఖుర్ఆను) మరియు –దైవప్రవక్త సున్నతును దృఢంగా పట్టుకుని పటిష్టంగా వాటి మార్గదర్శకత్వం పై ఉండటం "సత్యం పై స్థైర్యంగా ఉండటానికి మరియు బ్రష్టత్వం,విభేదాల నుండి పరిరక్షించుకోవడానికి"గల గొప్ప మాద్యమాలు.

• الافتراق والاختلاف الواقع في هذه الأمة في قضايا الاعتقاد فيه مشابهة لمن سبق من أهل الكتاب.
విశ్వాసాలను పూరించే విషయంలో ఈ ఉమ్మతులో ఏర్పడే విభజనలు మరియు విభేదాలు గతించిన గ్రంథప్రజలను పోలినవిగా ఉంటాయి.

• وجوب الأمر بالمعروف والنهي عن المنكر؛ لأن به فلاح الأمة وسبب تميزها.
మంచిని ఆదేశించడం,చెడును ఖండించడం తప్పనిసరి,ఎందుకంటే ఉమ్మతు యొక్క సాఫల్యం మరియు ఉమ్మతుకు గల ప్రత్యేకత'ఇందులో కలవు.

وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاِلَی اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۟۠
భూమ్యాకాశాలలో ఉన్న సమస్తం ‘సృష్టి’ మరియు ‘ఆజ్ఞ’ పరంగా సర్వశక్తిమంతుడు,ఏకైకుడైన అల్లాహ్’ ఆధీనంలో ఉన్నది.ప్రతీ జీవి వ్యవహారం ఆయనవైపుకు మరలించబడుతుంది,వారిలోని ప్రతీ ఒక్కరికీ వారి హక్కుప్రకారం ప్రతిఫలం నొసగబడుతుంది.
Arabische uitleg van de Qur'an:
كُنْتُمْ خَیْرَ اُمَّةٍ اُخْرِجَتْ لِلنَّاسِ تَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَتُؤْمِنُوْنَ بِاللّٰهِ ؕ— وَلَوْ اٰمَنَ اَهْلُ الْكِتٰبِ لَكَانَ خَیْرًا لَّهُمْ ؕ— مِنْهُمُ الْمُؤْمِنُوْنَ وَاَكْثَرُهُمُ الْفٰسِقُوْنَ ۟
ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ జాతీయులారా! ప్రజలకొరకు అల్లాహ్ ఎంచిన జాతుల్లో-విశ్వాసం,ఆచరణ- పరంగా అతిశ్రేష్టమైన జాతిమీది,మరియు ప్రజలకొరకు అతి ప్రయోజనకరమైన వారు మీరు,శరీయతుపరమైన మరియు నైతికపరమైన మంచి వైపుకు మీరు ఆహ్వానిస్తారు,శరియతు వారించి,అనైతికమైన చెడు నుంచి ఆపుతారు,మరియు మీరు అల్లాహ్ పట్ల దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు,ఆచరణలు దానిని సత్యపరుస్తాయి,ఒకవేళ గ్రంథవాసులైన యూదులు మరియు క్రైస్తవులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ను విశ్వసిస్తే అది వారి కొరకు ప్రాపంచిక పరలోక పరమైన మేలు చేకూరుస్తుంది.గ్రంథవహుల్లో అతి తక్కువ మాత్రమే ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెచ్చిన దాన్ని విశ్వసిస్తారు,వారిలోని అత్యధికులు అల్లాహ్ ధర్మం మరియు శరియతు నుంచి తొలగిపోతారు.
Arabische uitleg van de Qur'an:
لَنْ یَّضُرُّوْكُمْ اِلَّاۤ اَذًی ؕ— وَاِنْ یُّقَاتِلُوْكُمْ یُوَلُّوْكُمُ الْاَدْبَارَ ۫— ثُمَّ لَا یُنْصَرُوْنَ ۟
మరియు -ఓ విశ్వాసులారా-వారిలోని శతృత్వం ఎట్టి పరిస్థితుల్లో మీ ధర్మం మరియు ప్రాణాలకు హానీ చేయలేదు,కానీ ధర్మాన్నికించ పర్చడం,మరియు మిమ్మల్ని అపహాస్యం చేయడం లాంటి విషయాల వల్ల వారి నోటికి హనీ కలుగుతుంది,ఒక వేళ మీరు వారితో తలపడితే పరాజయంతో ముడుచుకుని దూరంగా పారిపోతారు,వారికి ఎన్నటికి మీకు వ్యతిరేఖంగా సహాయం లభించదు.
Arabische uitleg van de Qur'an:
ضُرِبَتْ عَلَیْهِمُ الذِّلَّةُ اَیْنَ مَا ثُقِفُوْۤا اِلَّا بِحَبْلٍ مِّنَ اللّٰهِ وَحَبْلٍ مِّنَ النَّاسِ وَبَآءُوْ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَضُرِبَتْ عَلَیْهِمُ الْمَسْكَنَةُ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ كَانُوْا یَكْفُرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ وَیَقْتُلُوْنَ الْاَنْۢبِیَآءَ بِغَیْرِ حَقٍّ ؕ— ذٰلِكَ بِمَا عَصَوْا وَّكَانُوْا یَعْتَدُوْنَ ۟ۗ
అవమానం మరియు పరాభావం యూదులను ఆవరించింది,వారు ఎక్కడ ఉన్నా వారిని పట్టుకుంటుంది,శాంతిని వారు కేవలం ప్రమాణం పూర్తిచేసి పొందగలరు,లేదా అల్లాహ్ నుండి లేదా ప్రజల నుండి పొందగలరు,కానీ వారు అల్లాహ్ ఆగ్రహంతో మరలారు,వారిని దరిధ్రము,అపేక్ష’కు గురిచేస్తూ కప్పి వేయబడింది,అల్లాహ్ ఆయతులను వారు తిరస్కరించడం వల్ల’మరియు అన్యాయంగా వారి ప్రవక్తలను హత్యచేయడంవల్ల ఇలా అవమానించబడ్డారు,అంతేకాదు వారి పాపానికి గానూ అల్లాహ్ హద్దుల అతిక్రమణకు గాని ఇలా చేయబడింది.
Arabische uitleg van de Qur'an:
لَیْسُوْا سَوَآءً ؕ— مِنْ اَهْلِ الْكِتٰبِ اُمَّةٌ قَآىِٕمَةٌ یَّتْلُوْنَ اٰیٰتِ اللّٰهِ اٰنَآءَ الَّیْلِ وَهُمْ یَسْجُدُوْنَ ۟
గ్రంథ ప్రజలందరి స్థితి సమానం కాదు,వారిలో అల్లాహ్ ధర్మం పై నడుస్తూ,ఆయన ఆదేశాలను మరియు నిషేధాలను పాటిస్తూ ఆచరించే ఒక విభాగం ఉంది.అల్లాహ్ ఆయతులను రాత్రి చదువుతూ ఉంటారు మరియు కేవలం అల్లాహ్ కొరకు నమాజులు ఆచరిస్తూ ఉంటారు,ఈ రకమైన సమూహం మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రభవించక ముందు ఉండేది,వారిలో ఈ దైవదౌత్యాన్ని పొందినవారు ముస్లిములుగా మారారు.
Arabische uitleg van de Qur'an:
یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَیَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَیَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَیُسَارِعُوْنَ فِی الْخَیْرٰتِ ؕ— وَاُولٰٓىِٕكَ مِنَ الصّٰلِحِیْنَ ۟
వారు అల్లాహ్’ను మరియు పరలోకాన్ని దృఢనిశ్చయంతో విశ్వసిస్తారు,మంచిని,మేలును ఆదేశిస్తారు,చెడును,కీడును ఖండిస్తారు,మరియు సదాచారణలు చేయడానికి పోటీపడుతూ ఉంటారు,పుణ్యకాలాలకు అతీతంగా విధేయతతో అమలుచేస్తారు,దైవదాసుల్లో తెలియజేసిన లక్షణాలను కలిగి ఉన్నవారు వీరే,మరియు తమ సంకల్పాలను,ఆచరణలను సంస్కరించుకుంటూ ఉంటారు.
Arabische uitleg van de Qur'an:
وَمَا یَفْعَلُوْا مِنْ خَیْرٍ فَلَنْ یُّكْفَرُوْهُ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالْمُتَّقِیْنَ ۟
వీరు చేసే మంచి చిన్నదైన లేక పెద్దదైన వారి పుణ్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో వృథా చేయబడదు మరియు వారి ప్రతిఫలం కించిత్ కూడా తగ్గించబడదు,అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,నిషేధాలకు దూరంగా ఉండే దైవభీతి పరుల పట్ల సర్వజ్ఞానం కలిగి ఉన్నాడు,వారి ఆచరణల్లోని అనువు కూడా ఆయనపై దాగిలేదు,మరియు ఆయన దానికి తగినట్లు అతిత్వరలో వారికి పూర్తి బహుమానం అనుగ్రహిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• أعظم ما يميز هذه الأمة وبه كانت خيريتها - بعد الإيمان بالله - الأمر بالمعروف والنهي عن المنكر.
ఈమాను తరువాత ఈ ఉమ్మతును ప్రత్యేక పరిచేది,వారికి శ్రేష్టతను చేకూర్చే విషయం “మంచిని ఆహ్వానించడం మరియు చెడును ఖండించడం.

• قضى الله تعالى بالذل على أهل الكتاب لفسقهم وإعراضهم عن دين الله، وعدم وفائهم بما أُخذ عليهم من العهد.
ధర్మంలో గ్రంథవహుల పోకిరితనం,విముఖత మరియు చేసిన ప్రమాణాన్ని పూర్తి చేయకపోవడం వల్ల పరాభవం చెందమని మహోన్నతుడైన అల్లాహ్ తీర్పుచేశాడు.

• أهل الكتاب ليسوا على حال واحدة؛ فمنهم القائم بأمر الله، المتبع لدينه، الواقف عند حدوده، وهؤلاء لهم أعظم الأجر والثواب. وهذا قبل بعثة النبي محمد صلى الله عليه وسلم.
గ్రంథవహులు ఒకే స్థితిలో లేరు,అందులో కొందరు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తారు,ఆయన ధర్మాన్ని అనుసరిస్తారు,హద్దులుమీరరు,అలాంటివారి కొరకు గొప్ప బహుమానం మరియు ప్రతిఫలం ఉన్నాయి.అయితే వీరు మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్’దైవదౌత్యానికి ముందు ఉండేవారు.

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا لَنْ تُغْنِیَ عَنْهُمْ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ مِّنَ اللّٰهِ شَیْـًٔا ؕ— وَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
నిశ్చయంగా అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను అవిశ్వసించిన వారి యొక్క ధనసంపద గానీ సంతానం గానీ అల్లాహ్ నుంచి కాపాడలేవు,మరియు ఆయన శిక్షను ఆపనూలేవు,వారి కోసం జాలి,కరుణ తేలేవు,బదులుగా అవి వారిశిక్షను పెంచుతాయి మరియు క్షోభకు గురిచేస్తాయి.వారే నరకవాసులు,కలకాలం దానిలో ఉంటారు.
Arabische uitleg van de Qur'an:
مَثَلُ مَا یُنْفِقُوْنَ فِیْ هٰذِهِ الْحَیٰوةِ الدُّنْیَا كَمَثَلِ رِیْحٍ فِیْهَا صِرٌّ اَصَابَتْ حَرْثَ قَوْمٍ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ فَاَهْلَكَتْهُ ؕ— وَمَا ظَلَمَهُمُ اللّٰهُ وَلٰكِنْ اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟
ఈ కాఫిరులు పుణ్యప్రాప్తి కొరకు చేసే దానము మరియు పుణ్యం కొరకు వేచిచూడటం యొక్క ఉపమానం,గాలి’లాంటిది,ఇది అధిక మంచుతో కూడి తమప్రాణాలపై దౌర్జన్యం చేసుకున్నవారి పొలాలపై విరుచుకుపడుతుంది అప్పటికి దాని నుండి వారు ఎంతో మేలును ఆశిస్తుండగా అది వారి పంటను సర్వనాశనం చేస్తుంది,ఎలాగైతే పంటను ఈ గాలి నష్టపరిచి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదో అలాగే అవిశ్వాసం’ పుణ్యార్జనను ఆశిస్తూ చేసిన వారి ఆచరణల పుణ్యాన్నినాశనం చేస్తుంది.అల్లాహ్ వారిపై ఎలాంటి దౌర్జన్యం’ చేయలేదు-నిజానికి ఆయన ఇలాంటి వాటినుంచి ఎంతో మహోన్నతుడు-.వాస్తవానికి వారు స్వయంగా అల్లాహ్ ను అవిశ్వసించి ఆయన ప్రవక్తలను దిక్కరించి తమ ప్రాణాలపై దౌర్జన్యం చేసుకున్నారు.
Arabische uitleg van de Qur'an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْا بِطَانَةً مِّنْ دُوْنِكُمْ لَا یَاْلُوْنَكُمْ خَبَالًا ؕ— وَدُّوْا مَا عَنِتُّمْ ۚ— قَدْ بَدَتِ الْبَغْضَآءُ مِنْ اَفْوَاهِهِمْ ۖۚ— وَمَا تُخْفِیْ صُدُوْرُهُمْ اَكْبَرُ ؕ— قَدْ بَیَّنَّا لَكُمُ الْاٰیٰتِ اِنْ كُنْتُمْ تَعْقِلُوْنَ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారలారా !మీరు (మూమినేతరులను) ముస్లిమేతరులను సన్నిహితులుగా,మిత్రులుగా చేసుకోవద్దు,మీరు మీ రహస్యాలను వారికి తెలుపుతారు,మీ పరిస్థితులను లోతుగా తెలుసుకుంటారు,వారు మీకు హానీ కలిగించడంలో మరియు మీ పరిస్థితిని తలక్రిందులుగా మార్చుటకు ఎటువంటి ప్రయత్నాన్నివదలరు,వారు మీకు హనీ కలగాలని,జీవితం కఠినతరం,దుర్భరం కావాలని కోరుకుంటారు,నిశ్చయంగా వారి ద్వేషం అసహ్యత మరియు శతృత్వం వారి నోటితో మీ ధర్మాన్ని కించపర్చడం,మీ మధ్య గొడవ పెట్టడం,మరియు మీ రహస్యాలు బహిర్గతం చేయడం ద్వారా కనిపిస్తాయి,మరియు వారి హృదయాలు దాచిఉంచిన ద్వేషం అత్యంత నీచమైనది,మేము మీకు -ఓ విశ్వాసులారా - ఈ లోకంలో మరియు పరలోకంలో ప్రయోజనం చేకూర్చే స్పష్టమైన రుజువులను మేము మీకు వివరంగా భోదించాము,ఒకవేళ మీరు మీ ప్రభువు పట్ల,ఆయన దైవవాణి యొక్కబుద్దిని కలిగి ఉన్నట్లైతే.
Arabische uitleg van de Qur'an:
هٰۤاَنْتُمْ اُولَآءِ تُحِبُّوْنَهُمْ وَلَا یُحِبُّوْنَكُمْ وَتُؤْمِنُوْنَ بِالْكِتٰبِ كُلِّهٖ ۚ— وَاِذَا لَقُوْكُمْ قَالُوْۤا اٰمَنَّا ۖۗۚ— وَاِذَا خَلَوْا عَضُّوْا عَلَیْكُمُ الْاَنَامِلَ مِنَ الْغَیْظِ ؕ— قُلْ مُوْتُوْا بِغَیْظِكُمْ ؕ— اِنَّ اللّٰهَ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟
మీరు –ఓ విశ్వాసులారా-ఆ జాతిని ప్రేమిస్తారు,మరియు వారి కొరకు మేలును ఆశిస్తారు,అయితే వారు మిమ్మల్ని ప్రేమించరు,మీకోసం మేలును ఆశించరు,కానీ మిమ్మల్ని వారు ద్వేషిస్తారు,మీరు అన్ని ఆకాశగ్రంథాలను విశ్వసిస్తారు అందులో వారి గ్రంధముకూడా ఉంటుంది,అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపచేసిన గ్రంథాన్ని మాత్రం వారు విశ్వసించరూ,వారు మిమ్మల్ని కలిసినప్పుడు తమ నోటితో ఇలా అంటారు:-మేము సత్యమని నమ్ముతున్నాము,ఆపై వారు పరస్పరం ఒంటరిగా కలిసినప్పుడు తమ వ్రేళ్ళ కొనలు భాధతో,కోపంతో కోరుకుతూ ఉంటారు అప్పటికి మీరు ఏకత్వం పై ,ఒకే కలిమా పై సమిష్టిగా ఉండటం,మరియు ఇస్లాం యొక్క గౌరవం పొందటం వల్ల,వారు అప్రతిష్టపై ఉంటారు,మీరు చెప్పండి ఓ దైవప్రవక్త ఆ జాతితో – “ మీరు భాధతో,కోపంతో చచ్చేంత వరకు దానిపైనే ఉండండి,నిశ్చయంగా అల్లాహ్ హృదయాలలో ఉన్న విశ్వాసాన్ని మరియు అవిశ్వాసాన్ని,మంచీచెడు సమస్తము తెలిసినవాడు.
Arabische uitleg van de Qur'an:
اِنْ تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْ ؗ— وَاِنْ تُصِبْكُمْ سَیِّئَةٌ یَّفْرَحُوْا بِهَا ؕ— وَاِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا لَا یَضُرُّكُمْ كَیْدُهُمْ شَیْـًٔا ؕ— اِنَّ اللّٰهَ بِمَا یَعْمَلُوْنَ مُحِیْطٌ ۟۠
ఓ విశ్వాసులారా – ఒకవేళ శత్రువులకు వ్యతిరేఖంగా మీకు విజయం కలిగినా లేదా ధన,సంతానంలో పెరుగుదల పొందిన వారికి ఆందోళన మరియు భాధ కలుగుతాయి,ఒకవేళ మీ పై శత్రువులకు సహాయం అందితే లేదా ధన సంతానం తగ్గిన అది వారికి సంతోషాన్ని కలిగిస్తుంది,మరియు రాక్షస ఆనందాన్ని పొందుతారు,ఒకవేళ మీరు వారి వ్యవహారాలపై మరియు అధికారాలపై సహనం పాటించి,అల్లాహ్ మీపై చూపే ఆగ్రహం పట్ల భయభీతి కలిగినట్లైతే వారి మోసం,కీడు ఎలాంటి హానీ మీకు చేకూర్చలేవు,నిశ్చయంగా అల్లాహ్ వారి దుర్మార్గపు మోసపూరిత చర్యలను చుట్టుముట్టియున్నాడు,మరియు త్వరలో వారిని ‘అసఫలులుగా’మరలుస్తాడు.
Arabische uitleg van de Qur'an:
وَاِذْ غَدَوْتَ مِنْ اَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِیْنَ مَقَاعِدَ لِلْقِتَالِ ؕ— وَاللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ ۟ۙ
మీరు గుర్తుచేసుకోండి–ఓ దైవప్రవక్త –మీరు మదీనా నుండి ఉదయాన్నే ముష్రికులతో యుద్దం చేయడానికి ఉహద్'కి బయల్దేరారు’అప్పుడు మీరు యుద్దంలో విశ్వాసులకు వారి స్థానాలను నిర్దేశించారు,ప్రతీ ఒక్కరికీ వారి స్థానాన్ని వివరించారు,నిశ్చయంగా అల్లాహ్ మీ మాటలను వినువాడు మరియు మీ కార్యకలాపాల గురించి తెలిసినవాడు
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• نَهْي المؤمنين عن موالاة الكافرين وجَعْلهم أَخِلّاء وأصفياء يُفْضَى إليهم بأحوال المؤمنين وأسرارهم.
•విశ్వాసపరులను కాఫిరులతో స్నేహం చేయవద్దని మరియు వారిని మిత్రులుగా సన్నిహితులుగా చేసుకోవద్దని వారించడం జరిగింది,ఎందుకంటే దానివల్ల వారికి ముస్లిముల స్థితిగతులు మరియు రహస్యాలు తెలిసే అవకాశం ఉంటుంది.

• من صور عداوة الكافرين للمؤمنين فرحهم بما يصيب المؤمنين من بلاء ونقص، وغيظهم إن أصابهم خير.
•ముస్లిముల పట్ల కాఫిరులకు అనేక రకాలుగా శతృత్వం'ఉంది ఆ రకాలలో ఒకటి ‘ముస్లిములకు ఎదురయ్యే విపత్తు,నష్టం వల్ల వారికి ఆనందం కలుగుతుంది,ఒకవేళ వారికి మేలు కలిగితే ఆగ్రహం కలుగుతుంది.

• الوقاية من كيد الكفار ومكرهم تكون بالصبر وعدم إظهار الخوف، ثم تقوى الله والأخذ بأسباب القوة والنصر.
•‘సహనం పాటించడం’భయాన్ని దాచియుంచడం’మరియు అల్లాహ్ యొక్క భయభీతి కలిగి ఉండటం,శక్తిని మరియు సహాయాన్ని చేకూర్చే వనరులను చేపట్టడం వల్ల కాఫిరుల మోసపూరిత ప్రణాళికలను భస్మం చేయడానికి,(కాఫిరుల) నుండి ద్రోహానికి గురికాకుండా పరిరక్షిస్తాయి.

اِذْ هَمَّتْ طَّآىِٕفَتٰنِ مِنْكُمْ اَنْ تَفْشَلَا ۙ— وَاللّٰهُ وَلِیُّهُمَا ؕ— وَعَلَی اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ ۟
గుర్తుచేసుకోండి- ఓ దైవప్రవక్త- బనూ సల్మా మరియు బనూ హారిసా కు చెందిన రెండు ముస్లిము తెగలు పరస్పరం శతృత్వం లో రగులుతూ ఉండేవి,అప్పుడు అవి బలహీనంగా ఉండేవి,కపటులైన మునాఫిఖులు వెనుదిరిగినప్పుడు వారితోపాటు వీరుకూడా మరళిపోదామని భావించారు,కానీ మహోన్నతుడైన అల్లాహ్ యుద్ద రంగంలో స్థిరపరిచి వారి ఉద్దేశ్యాన్ని మార్చాడు,(మూమినులైన) విశ్వాసులు ఎలాంటి పరిస్థితిలోనైన ఏకైకుడైన అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి ఉండాలి.
Arabische uitleg van de Qur'an:
وَلَقَدْ نَصَرَكُمُ اللّٰهُ بِبَدْرٍ وَّاَنْتُمْ اَذِلَّةٌ ۚ— فَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟
బదర్ యుద్ద సంగ్రామంలో అల్లాహ్ మీకు ముష్రికులకు వ్యతిరేఖంగా విజయాన్ని చేకూర్చాడు,అప్పుడు మీరు చిన్నసంఖ్యలో,సరైన యుద్దసామాగ్రిలేక బలహీనమైన స్థితిలో ఉన్నారు’-అల్లాహ్ కు భయభీతులు కలిగి ఉండండి,తద్వారా మీకు కలిగిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞులు అవుతారు.
Arabische uitleg van de Qur'an:
اِذْ تَقُوْلُ لِلْمُؤْمِنِیْنَ اَلَنْ یَّكْفِیَكُمْ اَنْ یُّمِدَّكُمْ رَبُّكُمْ بِثَلٰثَةِ اٰلٰفٍ مِّنَ الْمَلٰٓىِٕكَةِ مُنْزَلِیْنَ ۟ؕ
గుర్తుచేయండి–ఓ దైవప్రవక్త- మీరు విశ్వాసులతో బదర్ సంగ్రామంలో శత్రువులైన ముష్రికులకు సహాయం అందిందని విన్నప్పుడు వారితో యుద్దంలో స్థిరంగా ఉండమని ఇలా చెప్పారు: “ మీ యుద్ద పోరాటంలో మిమ్మల్ని బలోపేతం చేయడానికి ప్రభువు తన నుండి మూడు వేల దైవదూతలను దింపి మీకు సహాయం చేయటం మీకు సరిపోదా?!
Arabische uitleg van de Qur'an:
بَلٰۤی ۙ— اِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا وَیَاْتُوْكُمْ مِّنْ فَوْرِهِمْ هٰذَا یُمْدِدْكُمْ رَبُّكُمْ بِخَمْسَةِ اٰلٰفٍ مِّنَ الْمَلٰٓىِٕكَةِ مُسَوِّمِیْنَ ۟
అవును (చాలు)! నిశ్చయంగా ఇది మీకు సరిపోతుంది,మీ కొరకు అల్లాహ్ తరుపునుండి మరొక శుభవార్త ఇవ్వబడింది : ఒకవేళ యుద్దంలో మీరు సహనంవహించి,అల్లాహ్ కు భయభీతి కలిగియున్నట్లైతే‘శత్రువులు మీపై వేగంగా దాడిచేసే సమయంలో వారికి వ్యతిరేఖంగా మీకు సహాయం చేకూరుతుంది,అలా జరిగినప్పుడు నిశ్చయంగా మీ ప్రభువు ఐదువేల మంది దైవదూతలతో మీకు సహాయం చేస్తాడు,వారు తమను మరియు తమ గుర్రాలను స్పష్టమైన గుర్తులతో అలంకరించి ఉంటారు.
Arabische uitleg van de Qur'an:
وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشْرٰی لَكُمْ وَلِتَطْمَىِٕنَّ قُلُوْبُكُمْ بِهٖ ؕ— وَمَا النَّصْرُ اِلَّا مِنْ عِنْدِ اللّٰهِ الْعَزِیْزِ الْحَكِیْمِ ۟ۙ
దైవదూతల ద్వారా అల్లాహ్ చేసిన ఈ సహాయం మరియు ఈ సహకారం మీకు సంతోషాన్ని కలిగించే శుభం తప్ప మరేమీకాదు తద్వారా మీ హృదయాలు శాంతిని పొందగలవు,నిశ్చయంగా ఈ విజయం నిజమైనది,కేవలం కనిపించే బహిర్గత కారణాల వల్ల మాత్రమే ఇది సాద్యపడలేదు,నిశ్చయంగా ఇది ఆ అల్లాహ్ తరుపునుండి లభించిన ఒక వాస్తవ విజయం.ఆయనే ఓటమి లేని సర్వశక్తిమంతుడు,తన శాసనంలో,వ్యవహారంలో వివేకవంతుడు.
Arabische uitleg van de Qur'an:
لِیَقْطَعَ طَرَفًا مِّنَ الَّذِیْنَ كَفَرُوْۤا اَوْ یَكْبِتَهُمْ فَیَنْقَلِبُوْا خَآىِٕبِیْنَ ۟
బదర్ సంగ్రామం లో మీకు లభించిన ఈ విజయం ద్వారా అల్లాహ్ ‘కాఫిరులైన ఒక శత్రుసమూహాన్ని యుద్దం ద్వారా సర్వనాశనం చేయదలిచాడు,మరొక వర్గాన్ని అప్రతిష్టకు,అవమానానికి గురిచేసి కించపరిచాడు,మరియు వారిని ఓడించి ఆగ్రహించాడు,అప్పుడు వారు వైఫల్యంతో,అవమానంతో తిరిగివెళ్లసాగారు.
Arabische uitleg van de Qur'an:
لَیْسَ لَكَ مِنَ الْاَمْرِ شَیْءٌ اَوْ یَتُوْبَ عَلَیْهِمْ اَوْ یُعَذِّبَهُمْ فَاِنَّهُمْ ظٰلِمُوْنَ ۟
ఉహద్ యుద్దం జరిగిన తరువాత దైవప్రవక్త ముష్రికుల సర్దారుల వినాశనం గురించి దుఆ చేసినప్పుడు మహోన్నతుడైన అల్లాహ్ ఆయనతో ఇలా చెప్పాడు :వారి వ్యవహారంలో నీకు ఎలాంటి జోక్యం లేదు,వ్యవహారం కేవలం అల్లాహ్ చేతిలోనే ఉంది,అల్లాహ్ మీ మధ్య తీర్పు చేసేంతవరకు మీరు సహనం వహించండి లేదా అల్లాహ్ వారికి తౌబా’అనుగ్రహం కలిగిస్తాడు తద్వారా వారు రక్షణ పొందుతారు,లేదా వారు తమ తిరస్కార కుఫ్ర్ వైఖరి పై మొండిగా ఉండి తద్వార శిక్షించబడతారు,నిశ్చయంగా వారు మహాదుర్మార్గులు శిక్షకు అర్హులు.
Arabische uitleg van de Qur'an:
وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— یَغْفِرُ لِمَنْ یَّشَآءُ وَیُعَذِّبُ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
భూమ్యాకాశాలలో ఉన్న సమస్తం సృష్టి,ప్రణాళిక పరంగా అల్లాహ్’కు మాత్రం చెందుతుంది,తాను కోరిన దాసుల పాపాలను కారుణ్యంతో ప్రక్షాళిస్తాడు,మరియు తాను కోరిన వారిని న్యాయబద్దంగా శిక్షిస్తాడు,అల్లాహ్ తౌబా చేసుకునే దాసుల పట్ల క్షమాశీలుడు మరియు వారిపట్ల అపారకరుణశీలుడు.
Arabische uitleg van de Qur'an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَاْكُلُوا الرِّبٰۤوا اَضْعَافًا مُّضٰعَفَةً ۪— وَّاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟ۚ
ఓ అల్లాహ్ ను విశ్వసించి ప్రవక్తను అనుసరించేవారులారా! మీరు రుణం తీసుకున్నప్పుడు మీ మూలధనానికి మించి పై వడ్డీని తీసుకోకుండా ఉండండి.అజ్ఞాన కాలవాసులు వడ్డీ తీసుకునేవారు,దేవుని ఆజ్ఞలను పాటిస్తూ,దైవ నిషేధాలకు దూరంగా ఉంటూ ఆయనకు భయపడండి,బహుశా మీరు ఇహపర లోకాల్లో కోరుకునే మంచిని పొందగలరు.
Arabische uitleg van de Qur'an:
وَاتَّقُوا النَّارَ الَّتِیْۤ اُعِدَّتْ لِلْكٰفِرِیْنَ ۟ۚ
మీకు మరియు కాఫిరుల కొరకు అల్లాహ్ సిద్దం చేసిన నరకాగ్నికి మధ్య రక్షణకవచాన్ని ఏర్పర్చుకోండి,ఆ కవచము"పుణ్యకర్మలుచేసుకోవడం మరియు నిషేధాలను వీడటం.
Arabische uitleg van de Qur'an:
وَاَطِیْعُوا اللّٰهَ وَالرَّسُوْلَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟ۚ
ఆదేశాలను శిరసావహిస్తూ,నిషేదాలకు దూరంగా ఉంటూ అల్లాహ్'కు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి,బహుశా తద్వారా మీరు ఇహపరలోకాల్లో కారుణ్యాన్నిపొందగలరు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• مشروعية التذكير بالنعم والنقم التي تنزل بالناس حتى يعتبر بها المرء.
•ప్రజలపై అవతరించే అనుగ్రహాలను మరియు విపత్తులను పరిశీలించి తద్వారా మనిషి గుణపాఠం పొందడం శరీయతు బద్దమైనది.

• من أعظم أسباب تَنَزُّل نصر الله على عباده ورحمته ولطفه بهم: التزامُ التقوى، والصبر على شدائد القتال.
• దాసుల పై అల్లాహ్ సహాయం ఆయన దయాకారుణ్యం లభించే పెద్దకారణాలు :- తఖ్వా కలిగి ఉండటం,కఠినమైన యుద్దసమయాల్లో సహనం వహించడం.

• الأمر كله لله تعالى، فيحكم بما يشاء، ويقضي بما أراد، والمؤمن الحق يُسَلم لله تعالى أمره، وينقاد لحكمه.
• ప్రతీవ్యవహారం మహోన్నతుడైన అల్లాహ్ కు చెందుతుంది,ఆయనకు నచ్చినట్లు ఆదేశిస్తాడు, ఆయన కోరినట్లు తీర్పుచేస్తాడు,నిజమైన విశ్వాసి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కి సమర్పించుకుంటాడు మరియు ఆయన ఆదేశానికి కట్టుబడి ఉంటాడు.

• الذنوب - ومنها الربا - من أعظم أسباب خِذلان العبد، ولا سيما في مواطن الشدائد والصعاب.
• పాపాలు-అందులో ముఖ్యంగా వడ్డీ-ఒక దైవదాసుడి వైఫల్యానికి గల కారణాలలో అతిపెద్దది,ముఖ్యంగా ఆపదసమయాల్లో మరియు గడ్డుపరిస్థితులలో.

• مجيء النهي عن الربا بين آيات غزوة أُحد يشعر بشمول الإسلام في شرائعه وترابطها بحيث يشير إلى بعضها في وسط الحديث عن بعض.
• ఇస్లామీయ చట్టాలలోని పరిపూర్ణత మరియు వాటిమద్యనున్నపరస్పర సంబంధం యొక్క భావన కలిగించడానికి ఉహద్ యుద్ధం యొక్క ఆయతుల మధ్య వడ్డీపై నిషేధం వచ్చింది,తద్వారా సంభాషణలో ఒకదానితో మరొకదానికి గల సంభంధాన్ని అది సూచిస్తుంది.

وَسَارِعُوْۤا اِلٰی مَغْفِرَةٍ مِّنْ رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمٰوٰتُ وَالْاَرْضُ ۙ— اُعِدَّتْ لِلْمُتَّقِیْنَ ۟ۙ
సత్కార్యముల ఆచరణకై త్వరపడండి,పోటీపడండి మరియు అన్నీరకాల సదాచారణలతో విధేయత చూపుతూ అల్లాహ్'కు దగ్గరవ్వండి,తద్వారా అల్లాహ్ నుండి గొప్ప క్షమాపణను మీరు పొందుతారు మరియు భూమ్యాకాశాల విస్తీర్ణం గల స్వర్గపుతోటలో ప్రవేశిస్తారు,అల్లాహ్ తన దాసులలో భయభీతులు కలిగి ఉన్నవారికై దానిని సిద్దంచేసి పెట్టాడు.
Arabische uitleg van de Qur'an:
الَّذِیْنَ یُنْفِقُوْنَ فِی السَّرَّآءِ وَالضَّرَّآءِ وَالْكٰظِمِیْنَ الْغَیْظَ وَالْعَافِیْنَ عَنِ النَّاسِ ؕ— وَاللّٰهُ یُحِبُّ الْمُحْسِنِیْنَ ۟ۚ
భయభీతికలిగిన వారే తమ డబ్బును కలిమిలో,లేమిలో దైవమార్గంలో ఖర్చు చేసేవారు, మరియు ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యం కలిగి కూడా తమకోపాన్ని నిరోధించుకునేవారు, ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యం ఉండి కూడా తమకోపాన్ని నిలువరించేవారు, తమకు అన్యాయం చేసిన వారికి వ్యతిరేకంగా నిలబడేవారు,అల్లాహ్ ఇలాంటి ఉత్తమనైతికత,సత్ప్రవర్తన కలిగిన సత్పురుషులను ప్రేమిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
وَالَّذِیْنَ اِذَا فَعَلُوْا فَاحِشَةً اَوْ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ ذَكَرُوا اللّٰهَ فَاسْتَغْفَرُوْا لِذُنُوْبِهِمْ۫— وَمَنْ یَّغْفِرُ الذُّنُوْبَ اِلَّا اللّٰهُ ۪۫— وَلَمْ یُصِرُّوْا عَلٰی مَا فَعَلُوْا وَهُمْ یَعْلَمُوْنَ ۟
మరియు వారు పెద్ద పాపాలకు పాల్పడతారు లేదా అవికాక చిన్నవి చేస్తూ తమ అదృష్టానికి గండికొడతారు,వారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను స్మరిస్తారు మరియు అవిధేయులకు చేసిన హెచ్చరికనీ,నీతిమంతులైన దైవభీతిపరులకు చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసుకుంటారు,పిదప వారు తమ పాపాలను దాచమని,వాటికి బదులుగా పట్టుకోకూడదని సిగ్గుతో చింతిస్తూ తమ ప్రభువును వేడుకుంటారు. ఎందుకంటే ఏకైకుడైన అల్లాహ్'ను వదలి ఇతరులను పాపప్రక్షాళన చేయమని వేడుకోలేదు,అలాగే తమ పాపాలపై మొండి వైఖరిని ప్రదర్శించలేదు వారు పాపులన్న సంగతి,మరియు అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడని 'వారికి తెలుసు.
Arabische uitleg van de Qur'an:
اُولٰٓىِٕكَ جَزَآؤُهُمْ مَّغْفِرَةٌ مِّنْ رَّبِّهِمْ وَجَنّٰتٌ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— وَنِعْمَ اَجْرُ الْعٰمِلِیْنَ ۟ؕ
వారు ఇటువంటి ప్రశంసనీయ సద్గుణాలు,మరియు అద్భుతమైన లక్షణాలను కలిగి ఉన్నారు,అంచేత వారికి కలిగే పుణ్యఫలం ఏమిటంటే ‘అల్లాహ్ వారి పాపాలను దాచేస్తాడు,వాటిని మన్నించివేస్తాడు,మరియు వారికొరకు పరలోకంలో స్వర్గవనాలు ఉన్నాయి,వాటి భవనాల క్రింది నుండి నదులు ప్రవహిస్తాయి,అందులో వారు శాశ్వతంగా ఉంటారు,మరియు అల్లాహ్’కు విధేయులైన వారికి ఇది ఎంతో అద్భుతమైన ప్రతిఫలం.
Arabische uitleg van de Qur'an:
قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ سُنَنٌ ۙ— فَسِیْرُوْا فِی الْاَرْضِ فَانْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِیْنَ ۟
ఉహద్ రోజున విరుచుకుపడిన ఆపదతో విశ్వాసులను పరీక్షించినప్పుడు అల్లాహ్ వారిని ఓదారుస్తూ చెప్పాడు :- అవిశ్వాసులను నాశనం చేయడంలో గల దైవికచట్టాలు ఎన్నో మీకు పూర్వం గతించాయి, విశ్వాసులకు భాధలతో పరీక్షించబడిన తరువాతే ప్రతిఫలం ఉంది,కావాలంటే మీరు భూమిలో సంచరించి ‘అల్లాహ్ మరియు దైవప్రవక్తను దిక్కరించిన వారి పర్యావసానం ఏమైందో పరిశీలించండి,వారి ఇళ్ళులు నిర్జనమైపోయాయి,మరియు వారి అధికారం నశించింది.
Arabische uitleg van de Qur'an:
هٰذَا بَیَانٌ لِّلنَّاسِ وَهُدًی وَّمَوْعِظَةٌ لِّلْمُتَّقِیْنَ ۟
ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం సమస్తప్రజలకు సత్యాన్ని ప్రకటిస్తుంది,అసత్యంనుండి వారిస్తుంది,మరియు సన్మార్గం వైపునకు మార్గదర్శనం చేస్తుంది,దైవభీతిపరులను హెచ్చరిస్తుంది ఎందుకంటే వారు మాత్రమే అందులోని సన్మార్గాన్ని మరియు మార్గదర్శకత్వంతో ప్రయోజనం పొందుతారు.
Arabische uitleg van de Qur'an:
وَلَا تَهِنُوْا وَلَا تَحْزَنُوْا وَاَنْتُمُ الْاَعْلَوْنَ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
బలహీనపడకండి - ఓ విశ్వాసులరా-మరియు ఉహద్ రోజున మీకు కలిగిన హానీ గురించి ఆందోళనచెందవద్దు, ఖచ్చితంగా విజయం మిమ్ము వరిస్తుంది,మీ విశ్వాసం వల్ల మీరు ప్రాబల్యం పొందుతారు,అల్లాహ్ సహాయంతో ఆయనపై మీకు గల నమ్మకంతో ప్రాబల్యం లభిస్తుంది,మీరు అల్లాహ్’ను మరియు ఆయన దైవభీతి పరులైన తన దాసులకు చేసిన వాగ్దానాన్ని విశ్వసించినట్లైతే.
Arabische uitleg van de Qur'an:
اِنْ یَّمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِّثْلُهٗ ؕ— وَتِلْكَ الْاَیَّامُ نُدَاوِلُهَا بَیْنَ النَّاسِ ۚ— وَلِیَعْلَمَ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا وَیَتَّخِذَ مِنْكُمْ شُهَدَآءَ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ الظّٰلِمِیْنَ ۟ۙ
ఒకవేళ –ఓ విశ్వాసులారా –మీరు ఉహద్ రోజున గాయపడి,చంపబడ్డారు అయితే మీకు జరిగినట్లుగానే సత్యతిరస్కారులైన అవిశ్వాసులు కూడా గాయపడ్డారు మరియు చంపబడ్డారు,విశ్వాసుల మరియు అవిశ్వాసుల మధ్య విజయం మరియు ఓటమి కలిగిస్తూ అల్లాహ్ కోరిన విధంగా రోజులను మారుస్తూ ఉంటాడు,గొప్ప వివేకం నిమిత్తం-అది-కపటుల నుండి సిసలైన విశ్వాసులను ప్రస్పుటం చేయడం,దైవమార్గంలో తాను కోరిన వారికి అమరత్వగౌరవాన్ని ప్రసాదించడం,అల్లాహ్ మార్గంలో ధర్మయుద్దమైన జిహాదును త్యజించే దుర్మార్గులను ఎన్నటికీ ప్రేమించడు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• الترغيب في المسارعة إلى عمل الصالحات اغتنامًا للأوقات، ومبادرة للطاعات قبل فواتها.
•సమయాన్నిఅదృష్టంగా భావించి సత్కర్మల ఆచరణకై త్వరపడాలని మరియు విధేయతలను కోల్పోక ముందే ఆచరణకై త్వరపడాలని ప్రోత్సహించబడుతుంది.

• من صفات المتقين التي يستحقون بها دخول الجنة: الإنفاق في كل حال، وكظم الغيظ، والعفو عن الناس، والإحسان إلى الخلق.
•స్వర్గ ప్రవేశ అర్హతపొందే దైవభీతిపరుల లక్షణాలలో కొన్నిఇవి:- ఏ పరిస్థితిలో ఉన్నా దైవమార్గంలో ఖర్చుచేయడం,కోపాన్ని నిగ్రహించుకోవడం,ప్రజలను క్షమించడం,ఉత్తమవైఖరితో జనులతో మెలగడం.

• النظر في أحوال الأمم السابقة من أعظم ما يورث العبرة والعظة لمن كان له قلب يعقل به.
•మునుపటి జాతుల పరిస్థితులను పరిశీలించే బుద్దిగల వారికి ఇందులో గొప్పగుణపాఠం మరియు ఉపదేశం లభిస్తుంది.

وَلِیُمَحِّصَ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا وَیَمْحَقَ الْكٰفِرِیْنَ ۟
ఈ వివేకంలో విశ్వాసులను వారి పాపాల నుండి శుభ్రపరచడం, మరియు కపటవాదుల నుండి వారి పంక్తులను వేరుచేయడం,తద్వారా సత్యతిరస్కారులైన అవిశ్వాసులను మట్టుపెట్టి రూపుమాపబడుతుంది.
Arabische uitleg van de Qur'an:
اَمْ حَسِبْتُمْ اَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا یَعْلَمِ اللّٰهُ الَّذِیْنَ جٰهَدُوْا مِنْكُمْ وَیَعْلَمَ الصّٰبِرِیْنَ ۟
ఓ విశ్వాసులారా- మీరు స్వర్గంలో ఎటువంటి పరీక్షకు గురికాకుండా,సహనం లేకుండా ప్రవేశిస్తారని భావిస్తున్నారా? అల్లాహ్ మార్గంలో పోరాడే సిసలైన ధర్మయుద్దయోధులు మరియు ఆ యుద్దంలో కలిగిన కష్టం పట్ల సహనం వహించువారు ఎవరనేది? దీని ద్వారా స్పష్టమవుతుంది.
Arabische uitleg van de Qur'an:
وَلَقَدْ كُنْتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِنْ قَبْلِ اَنْ تَلْقَوْهُ ۪— فَقَدْ رَاَیْتُمُوْهُ وَاَنْتُمْ تَنْظُرُوْنَ ۟۠
నిశ్చయంగా –ఓ విశ్వాసులారా- మీరు అల్లాహ్ మార్గంలో షహీద్ అవ్వడానికి సత్యతిరస్కారులైన అవిశ్వాసులతో యుద్దం చేయాలని ఉవ్విళ్లూరారు,బదర్ సంగ్రామంలో మీ సోదరులు సాధించినట్లు, మరణాన్ని మరియు దాని తీవ్రతను పొందటానికి ముందు ఇదిగో మీరు కోరుకున్నది ఉహద్ రోజున జరిగింది దాన్ని ప్రత్యక్షంగా మీ కళ్ళతో మీరు చూడసాగారు.
Arabische uitleg van de Qur'an:
وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوْلٌ ۚ— قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ ؕ— اَفَاۡىِٕنْ مَّاتَ اَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلٰۤی اَعْقَابِكُمْ ؕ— وَمَنْ یَّنْقَلِبْ عَلٰی عَقِبَیْهِ فَلَنْ یَّضُرَّ اللّٰهَ شَیْـًٔا ؕ— وَسَیَجْزِی اللّٰهُ الشّٰكِرِیْنَ ۟
ముహమ్మద్ ఒక సందేశహరుడు తప్ప మరేమీ కాదు,గతించిన సందేశహరుల జాతికి చెందినవారు,అందులో కొందరు చనిపోయారు మరి కొందరు చంపబడ్డారు,అయితే అతను చనిపోయినా లేదా చంపబడినా మీరు మీ ధర్మాన్ని త్యజించి జిహాద్'ని విడిచిపెట్టి పోతారా?!-మీలో ఎవరైతే తన ధర్మం నుండి మతభ్రష్టులవుతారో అల్లాహ్ కు ఎటువంటి హాని చేయలేరు. ఎందుకంటే అతడు (అల్లాహ్) బలవంతుడు,శక్తిమంతుడు. ధర్మబ్రష్టుడై విముఖత చూపుతూ ముర్తద్'గా ఇహపరలోకాలకు నష్టం కలిగించుకుంటూ స్వయంగా తనకు తానే హానీ చేసుకుంటాడు,అల్లాహ్ అతి తొందరలో కృతజ్ఞులకు వారి ధర్మస్థైర్యానికి మరియు అల్లాహ్ మార్గంలో చేసిన ధర్మపోరాటం’జిహాదు’కు బదులుగా అత్యున్నతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
وَمَا كَانَ لِنَفْسٍ اَنْ تَمُوْتَ اِلَّا بِاِذْنِ اللّٰهِ كِتٰبًا مُّؤَجَّلًا ؕ— وَمَنْ یُّرِدْ ثَوَابَ الدُّنْیَا نُؤْتِهٖ مِنْهَا ۚ— وَمَنْ یُّرِدْ ثَوَابَ الْاٰخِرَةِ نُؤْتِهٖ مِنْهَا ؕ— وَسَنَجْزِی الشّٰكِرِیْنَ ۟
ప్రతీ ప్రాణీ కేవలం అల్లాహ్ ఆజ్ఞతోనే చనిపోతుంది,దాని కొరకు నిర్దారించిన గడువు,వయస్సు పూర్తిచేసుకున్న తరువాత ఎలాంటి హెచ్చుతగ్గులు చేయబడవు,ఎవరైనా తన కార్యసాధనకు బదులుగా ఇహలోక ప్రతిఫలం కోరితే అతనికి నిర్దారించబడిన భాగాన్ని మేము ప్రసాదిస్తాము,పరలోకంలో అతని కొరకు అందులో ఎలాంటి వాటా ఉండదు,మరెవరైతే తన కార్యసాధన ద్వారా పరలోకంలో దేవుని ప్రతిఫలం కోరుకుంటారో,మేము దాని ప్రతిఫలాన్ని అతనికి ఇస్తాము,మరియు తమ ప్రభువుకు కృతజ్ఞతపూర్వకంగా ఉన్నందుకు గాను మేము వారికి గొప్ప బహుమతిని ఇస్తాము.
Arabische uitleg van de Qur'an:
وَكَاَیِّنْ مِّنْ نَّبِیٍّ قٰتَلَ ۙ— مَعَهٗ رِبِّیُّوْنَ كَثِیْرٌ ۚ— فَمَا وَهَنُوْا لِمَاۤ اَصَابَهُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ وَمَا ضَعُفُوْا وَمَا اسْتَكَانُوْا ؕ— وَاللّٰهُ یُحِبُّ الصّٰبِرِیْنَ ۟
చాలామంది అల్లాహ్ ప్రవక్తలతో వారి అనుచర సముదాయాలు యుద్దాలు చేశారు,దైవమార్గంలో మరణించినప్పుడు మరియు గాయపడినప్పుడు వారు జిహాదు నుంచి జంకలేదు,శత్రువులతో పోరాడటంలో బలహీనత చూపలేదు, వారికి లొంగలేదు. బదులుగా సహనస్థైర్యాలను కలిగి పట్టుదలతో పోరాడారు, మరియు తన మార్గంలో ఏర్పడే క్లిష్టపరిస్థితులను మరియు కష్టములను సహనం వహించిన వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
وَمَا كَانَ قَوْلَهُمْ اِلَّاۤ اَنْ قَالُوْا رَبَّنَا اغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَاِسْرَافَنَا فِیْۤ اَمْرِنَا وَثَبِّتْ اَقْدَامَنَا وَانْصُرْنَا عَلَی الْقَوْمِ الْكٰفِرِیْنَ ۟
ఇలాంటి ఆపదలు సహనశీలుల పై విరుచుకుపడినప్పుడు ఇలా పలుకుతారు :- ఓ మా ప్రభూ ! మా పాపాలను క్షమించు,మేము మా వ్యవహారాలలో హద్దులను అతిక్రమించాము,శత్రువులతో పోరాడేటప్పుడు మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు,సత్యతిరస్కారులైన అవిశ్వాసులకు వ్యతిరేఖంగా నీ అనుమతితో మాకు విజయాన్ని ప్రసాదించు.
Arabische uitleg van de Qur'an:
فَاٰتٰىهُمُ اللّٰهُ ثَوَابَ الدُّنْیَا وَحُسْنَ ثَوَابِ الْاٰخِرَةِ ؕ— وَاللّٰهُ یُحِبُّ الْمُحْسِنِیْنَ ۟۠
అప్పుడు అల్లాహ్ వారికి సహాయం అందిస్తూ విజయాన్ని ప్రసాదించి ప్రాపంచిక ప్రతిఫలం అనుగ్రహించాడు,మరియు పరలోకజీవితంలో అత్యుత్తమ బహుమతిని ప్రసాదిస్తాడు వారిపట్ల ప్రసన్నుడై వరాలతో నిండిన స్వర్గములో శాశ్వత నివాసాన్ని ఏర్పరుస్తాడు,తమ ఆరాధనలో,ఆచరణలలో సజ్జనులైనవారిని నిశ్చయంగా అల్లాహ్ ప్రేమిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• الابتلاء سُنَّة إلهية يتميز بها المجاهدون الصادقون الصابرون من غيرهم.
• కష్టాలతో పరీక్షించడం' దైవికసాంప్రదాయం,తద్వారా ఇతరుల నుండి సత్యవంతులు ,నిజాయితీపరులు,సహనశీలులైన ముజాహిదీనులు ప్రత్యేకించబడతారు.

• يجب ألا يرتبط الجهاد في سبيل الله والدعوة إليه بأحد من البشر مهما علا قدره ومقامه.
•దైవమార్గంలో చేసే జిహాద్ మరియు దావతు ఇలల్లాహ్’కార్యాన్ని ఏ వ్యక్తితో జోడించకూడదు.ఆ వ్యక్తి స్థితిపరంగా హోదా పరంగా ఎంత గొప్పవాడైనా సరే.

• أعمار الناس وآجالهم ثابتة عند الله تعالى، لا يزيدها الحرص على الحياة، ولا ينقصها الإقدام والشجاعة.
•అల్లాహ్ వద్ద ప్రజల వయస్సు,మరణం నిర్దారీతమై ఉంటాయి,జీవితం పై గల ఆశ’ దాన్నిపెంచలేదు,మరియు పోరాటం మరియు ధైర్యం దాన్ని తగ్గించలేవు.

• تختلف مقاصد الناس ونياتهم، فمنهم من يريد ثواب الله، ومنهم من يريد الدنيا، وكلٌّ سيُجازَى على نيَّته وعمله.
• ప్రజల ఉద్దేశ్యాలు సంకల్పాలు విభిన్నమైనవి,వారిలో కొందరు పరలోకబహుమతిని కోరుకుంటారు మరికొందరు ఇహలోకాన్నిఆశిస్తారు,ప్రతీ ఒక్కరికీ వారి సంకల్పం మరియు ఆచరణ పరంగా అతిత్వరలో ప్రతిఫలం ఇవ్వబడుతుంది.

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ تُطِیْعُوا الَّذِیْنَ كَفَرُوْا یَرُدُّوْكُمْ عَلٰۤی اَعْقَابِكُمْ فَتَنْقَلِبُوْا خٰسِرِیْنَ ۟
అల్లాహ్’ను,ఆయనప్రవక్తను విశ్వసించిన ప్రజలారా! ఒకవేళ మీరు సత్యతిరస్కారులైన యూదులను,క్రైస్తవులను మరియు బహుదైవారాధకులను అనుసరిస్తే వారు నడిచే బ్రష్టత్వాన్ని మీకు ఆదేశిస్తారు,మరియు మీరు విశ్వసించినదాని నుంచి సత్యతిరస్కారులైన కాఫీరులు నమ్మే విశ్వాసం వైపుకు మిమ్మల్ని మరలుస్తారు,అప్పుడు మీరు ఇహపరలోకాలలో దురదృష్టవంతులుగా మిగిలిపోతారు.
Arabische uitleg van de Qur'an:
بَلِ اللّٰهُ مَوْلٰىكُمْ ۚ— وَهُوَ خَیْرُ النّٰصِرِیْنَ ۟
ఈ సత్యతిరస్కారులకు విధేయత చూపితే వారు మీకు ఎలాంటి మద్దతు ఇవ్వరు నిజానికి ఆ అల్లాహ్’యే మీకు శత్రువులపై విజయాన్ని నొసగేవాడు,కాబట్టి ఆయనకి విధేయత చూపండి,ఆయన పరిశుద్దుడు,అత్యుత్తమ సహాయకుడు,ఆయన తరువాత మీకు ఎవరి మద్దతు అవసరం ఉండదు.
Arabische uitleg van de Qur'an:
سَنُلْقِیْ فِیْ قُلُوْبِ الَّذِیْنَ كَفَرُوا الرُّعْبَ بِمَاۤ اَشْرَكُوْا بِاللّٰهِ مَا لَمْ یُنَزِّلْ بِهٖ سُلْطٰنًا ۚ— وَمَاْوٰىهُمُ النَّارُ ؕ— وَبِئْسَ مَثْوَی الظّٰلِمِیْنَ ۟
తొందరలోనే అల్లాహ్ ను తిరస్కరించిన కాఫిరుల గుండెలను తీవ్రమైన భయానికి గురిచేస్తాము,దాంతో వారు మీతో యుద్దం చేయడంలో స్థైర్యాన్ని కోల్పోతారు ఎందుకంటే వీరు అల్లాహ్ కు ఇతర బూటకపుదైవాలను తమ మనోవాంఛలనుసారంగా ఆపాదించి ఆరాధిస్తారు,దాని గురించి అల్లాహ్ ఏ రకమైన ఆధారాన్ని దింపలేదు,వారు శాశ్వతంగా ఉండబోయే వారి నివాసం నరకాగ్ని అయి ఉంటుంది,నరకాగ్ని’దుర్మార్గుల కోసం సిద్దం చేయబడిన అతిహీనమైన నివాసం.
Arabische uitleg van de Qur'an:
وَلَقَدْ صَدَقَكُمُ اللّٰهُ وَعْدَهٗۤ اِذْ تَحُسُّوْنَهُمْ بِاِذْنِهٖ ۚ— حَتّٰۤی اِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِی الْاَمْرِ وَعَصَیْتُمْ مِّنْ بَعْدِ مَاۤ اَرٰىكُمْ مَّا تُحِبُّوْنَ ؕ— مِنْكُمْ مَّنْ یُّرِیْدُ الدُّنْیَا وَمِنْكُمْ مَّنْ یُّرِیْدُ الْاٰخِرَةَ ۚ— ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِیَبْتَلِیَكُمْ ۚ— وَلَقَدْ عَفَا عَنْكُمْ ؕ— وَاللّٰهُ ذُوْ فَضْلٍ عَلَی الْمُؤْمِنِیْنَ ۟
మరియు ఉహద్ రోజున శత్రువులపై మీకు విజయం కల్పిస్తానని అల్లాహ్ మీకు చేసిన వాగ్దానం నెరవేర్చాడు. మీరు ఆయన అనుమతితో వారితో తీవ్రంగా పోరాడసాగారు కానీ చివరికి దైవప్రవక్త ఇచ్చిన ఆదేశం పట్ల స్థైర్యాన్ని కోల్పోయి పిరికివారుగా,బలహీనులుగా మారిపోయారు. మీకు నిర్దేశించిన స్థానాల్లో ఉండాలో లేక దాన్ని వదలడమా అనే విషయంలో విభేదించారు. మరియు యుద్ద ప్రాప్తి సొమ్మును ప్రోగుచేశారు. మరియు దైవప్రవక్త మీకు’-ఎట్టి పరిస్థితిలో మీ స్థానాలలో మీరు ఉండాలి’అని ఆదేశించిన ఆజ్ఞకు అవిధేయత చూపారు. మీ శత్రువులపై మీరు ఇష్టపడే విజయాన్ని అల్లాహ్ మీకు చూపించిన తరువాత ఇది జరిగింది. మీలో కొందరు ప్రాపంచిక సొమ్మును కోరుకున్నారు. వారు తమ స్థానాలను విడిచిపెట్టిన వారు. మరియు మీలో కొందరు పరలోక ప్రతిఫలం కోరుకున్నారు. వారు ప్రవక్త యొక్క ఆజ్ఞను పాటిస్తూ వారి స్థానాల్లోనే ఉన్నారు. తరువాత అల్లాహ్ వారి వైపుకు మార్చాడు. మీ పై వారిని చెలాయించాడు. తద్వారా మిమ్మల్ని పరీక్షించదల్చాడు. అప్పుడు పాదాలనుజార్చే,బలహీన పర్చే విపత్తును సహించే అసలైన విశ్వాసులెవరనేది స్పష్టమైంది. తన ప్రవక్త యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినందుకు అల్లాహ్ మిమ్మల్ని క్షమించాడు. మరియు విశ్వాసులపై అల్లాహ్ గొప్ప దయకరుణను కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన వారిని విశ్వాసానికి మార్గనిర్దేశం చేశాడు. వారి పాపాలను క్షమించాడు మరియు వారి ఆపదలకు బదులుగా ప్రతిఫలమిచ్చాడు.
Arabische uitleg van de Qur'an:
اِذْ تُصْعِدُوْنَ وَلَا تَلْوٗنَ عَلٰۤی اَحَدٍ وَّالرَّسُوْلُ یَدْعُوْكُمْ فِیْۤ اُخْرٰىكُمْ فَاَثَابَكُمْ غَمًّا بِغَمٍّ لِّكَیْلَا تَحْزَنُوْا عَلٰی مَا فَاتَكُمْ وَلَا مَاۤ اَصَابَكُمْ ؕ— وَاللّٰهُ خَبِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟
గుర్తుచేసుకోండి - ఓ విశ్వాసులారా - మీరు ఉహద్ రోజున దైవప్రవక్త ఆదేశాన్ని ఉల్లఘించడంవల్ల కలిగిన వైఫల్యంతో యుద్దరంగం నుండి పారిపోసాగారు,మీలో ఎవరూ ఎవరినీ చూడటంలేదు,మీకు మరియు శత్రువులకు మధ్య ఉన్న దైవప్రవక్త మిమ్మల్ని మీ వెనుక నుండి ఇలా పిలువసాగారు:- నా వైపుకు మరలండి దైవదాసులారా!, నా వైపుకు మరలండి దైవదాసులారా! ఈ విధంగా విజయాన్ని మరియు (గనీమతుసొమ్ము)యుద్దప్రాప్తిసొమ్మును దూరంచేసి మిమ్మల్ని భాధకు,కష్టానికి గురిచేశాడు,దానితో పాటు భాధ కష్టం వెంబడించింది,మరియు మీ మధ్య ‘ప్రవక్త హత్యకు గురైనట్లుగా వ్యాపించిన వార్తను అల్లాహ్’యే మీ మధ్య దింపాడు తద్వారా మీరు ఓటమి మరియు పోగొట్టుకున్న గనీమతు సొమ్ము (యుద్ధ ప్రాప్తి),హత్యకు గురైనవారి గురించి మరియు గాయాల గురించి దిగులు చెందకుండా ఉన్నారు,మరి ఎప్పుడైతే మీకు దైవప్రవక్త ప్రాణాలతో ఉన్నారు అనే సంగతి తెలిసిందో అప్పుడు మీకు కలిగిన ప్రతీ నష్టం మరియు భాధ తేలికపాటిదిగా మారింది,అల్లాహ్ కు మీరు చేసే కర్మల గురించి బాగా తెలుసు,మీ హృదయాల స్థితిగతుల్లో మరియు మీ అవయవాలు చేసే కర్మలలో ఆయన పై ఏది దాగిలేదు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• التحذير من طاعة الكفار والسير في أهوائهم، فعاقبة ذلك الخسران في الدنيا والآخرة.
•సత్యతిరస్కారులైన అవిశ్వాసులకు విధేయత చూపడం,వారి మనోవంఛలను అనుసరించడం పట్ల హెచ్చరించబడింది,దీనికి శిక్షగా ఇహపరలోకాల్లో నష్టానికి గురవుతాడు.

• إلقاء الرعب في قلوب أعداء الله صورةٌ من صور نصر الله لأوليائه المؤمنين.
• అల్లాహ్ యొక్క శత్రువుల గుండెల్లో భయాందోళనల ద్వారా గుబులు పుట్టించడం కూడా తన మిత్రులైన విశ్వాసులకు అల్లాహ్ చేసే సహాయంలో ఒకటి.

• من أعظم أسباب الهزيمة في المعركة التعلق بالدنيا والطمع في مغانمها، ومخالفة أمر قائد الجيش.
• యుద్ధంలో ఓటమికి గల ప్రధాన కారణాలు :- ప్రాపంచిక అనుబంధం మరియు దాని సంపదపట్ల ఆశ కలిగి ఉండటం,మరియు సైన్య సేనాధిపతి ఆదేశాన్ని ఉల్లంఘించడం.

• من دلائل فضل الصحابة أن الله يعقب بالمغفرة بعد ذكر خطئهم.
•సహాబాల విశీష్టతను సూచించే విషయాల్లో ఒకటి వారి తప్పులను అల్లాహ్ ప్రస్తావించి క్షమాపణతో శిక్షిస్తాడు

ثُمَّ اَنْزَلَ عَلَیْكُمْ مِّنْ بَعْدِ الْغَمِّ اَمَنَةً نُّعَاسًا یَّغْشٰی طَآىِٕفَةً مِّنْكُمْ ۙ— وَطَآىِٕفَةٌ قَدْ اَهَمَّتْهُمْ اَنْفُسُهُمْ یَظُنُّوْنَ بِاللّٰهِ غَیْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِیَّةِ ؕ— یَقُوْلُوْنَ هَلْ لَّنَا مِنَ الْاَمْرِ مِنْ شَیْءٍ ؕ— قُلْ اِنَّ الْاَمْرَ كُلَّهٗ لِلّٰهِ ؕ— یُخْفُوْنَ فِیْۤ اَنْفُسِهِمْ مَّا لَا یُبْدُوْنَ لَكَ ؕ— یَقُوْلُوْنَ لَوْ كَانَ لَنَا مِنَ الْاَمْرِ شَیْءٌ مَّا قُتِلْنَا هٰهُنَا ؕ— قُلْ لَّوْ كُنْتُمْ فِیْ بُیُوْتِكُمْ لَبَرَزَ الَّذِیْنَ كُتِبَ عَلَیْهِمُ الْقَتْلُ اِلٰی مَضَاجِعِهِمْ ۚ— وَلِیَبْتَلِیَ اللّٰهُ مَا فِیْ صُدُوْرِكُمْ وَلِیُمَحِّصَ مَا فِیْ قُلُوْبِكُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟
సంకుచితం మరియు బాధ తరువాత మీలో ప్రశాంతత మరియు దృఢనమ్మకంను నేను దింపాను,మరియు మీలో ఒక సమూహాన్ని - దేవుని వాగ్దానంలో నమ్మకంగా ఉన్నవారిని - వారి హృదయాల్లోని శాంతి మరియు ప్రశాంతత వల్ల కునుకు వారిని కప్పివేసింది. ఇంకొక వర్గం వారు ప్రశాంతతను మరియు కునుకును పొందలేదు,వారు తమ స్వంత భద్రత గురించి మాత్రమే పట్టించుకునే (మునాఫిఖులు)కపటవాదులు. వారు విచారంతో,భయంతో ఉన్నారు. అల్లాహ్ తన ప్రవక్తకు సహాయం చేయడు మరియు తన సేవకులకు మద్దతు ఇవ్వడు అని ఆజ్ఞానుల వలె భావిస్తారు,ఆజ్ఞానులు అల్లాహ్ యొక్క శక్తిసామర్థ్యాలను సరైన విధంగా అంచనా వేయలేదు.ఈ మునాఫిఖులు తమ అజ్ఞానంతో అల్లాహ్ పట్ల ఇలా అన్నారు యుద్దం కొరకు బయల్దేరడంలో మాకు ఎలాంటి ఆలోచన లేదు,ఒకవేళ మాకు తెలిసి ఉంటే మేము బయల్దేరేవారం కాదు. ఓ దైవప్రవక్త ! మీరు వారికి సమాధానమిస్తూ చెప్పండి:-సర్వ వ్యవహారాలు అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయి,ఆయన కోరిన దాన్ని నిర్వహిస్తాడు,కోరినదాన్ని ఆదేశిస్తాడు,ఆయనే మీ వెళ్లడాన్ని విధిచేశాడు,ఈ మునాఫిఖులంతా తమ మనసులోని సంకోచం మరియు అనుమానం వల్ల భయపడుతూ ఉన్నారు,అది మీకు వెల్లిబుచ్చలేదు: ఇలా అనసాగారు:- ఒకవేళ మాకు బయల్దేరేటప్పుడు తెలిసిఉంటే మేము ఈ చోట చంపబడేవారము కాదు,ఓ ప్రవక్త మీరు వారికి బదులు ఇస్తూ చెప్పండి :- ఒకవేళ మీరు మరణస్థలానికి లేదా హత్యా స్థలానికి దూరంగా ఇళ్ళలో ఉన్నప్పటికి అల్లాహ్ చంపడానికి నియమించిన వారు మీ నుండి వారి హత్య జరిగే చోటికి వెళ్లిపోతారు, మీ మనసులోని ఉద్దేశాలను మరియు సంకల్పాలను పరీక్షించడానికి మరియు వారిలో గల విశ్వాసం మరియు కపటత్వంను వేరుచేయడానికి అల్లాహ్ ఈ విధంగా వ్రాసాడు,అల్లాహ్ కు తన దాసులమదిలో ఉన్నదంతా తెలుసు,అందులోని ఏ విషయం ఆయన వద్ద దాగిలేదు.
Arabische uitleg van de Qur'an:
اِنَّ الَّذِیْنَ تَوَلَّوْا مِنْكُمْ یَوْمَ الْتَقَی الْجَمْعٰنِ ۙ— اِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّیْطٰنُ بِبَعْضِ مَا كَسَبُوْا ۚ— وَلَقَدْ عَفَا اللّٰهُ عَنْهُمْ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ حَلِیْمٌ ۟۠
మీలో ఓడిపోయిన వారు – ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ సహచరులారా-ముష్రికుల సమూహం ఉహద్'లో ముస్లింల సమూహంతో యుద్దంచేసిన రోజు, బదులుగా,షైతాను వారు చేసిన కొన్ని పాపాల వల్ల వారిని జారిపోయేలా చేశాడు,అల్లాహ్ వారితప్పులను పట్టుకోకుండా దయకారుణ్యంతో క్షమించాడు,నిస్సందేహంగా అల్లాహ్ తౌబా చేసుకునేవారిపట్ల క్షమాశీలుడు,మరియు సహనశీలుడు శిక్షించడంలో త్వరపడడు.
Arabische uitleg van de Qur'an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَكُوْنُوْا كَالَّذِیْنَ كَفَرُوْا وَقَالُوْا لِاِخْوَانِهِمْ اِذَا ضَرَبُوْا فِی الْاَرْضِ اَوْ كَانُوْا غُزًّی لَّوْ كَانُوْا عِنْدَنَا مَا مَاتُوْا وَمَا قُتِلُوْا ۚ— لِیَجْعَلَ اللّٰهُ ذٰلِكَ حَسْرَةً فِیْ قُلُوْبِهِمْ ؕ— وَاللّٰهُ یُحْیٖ وَیُمِیْتُ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
అల్లాహ్’ను విశ్వసించి, ఆయన ప్రవక్తను అనుసరించేవారలారా, కపటఅవిశ్వాసుల వలె కాకండి. వారు తమ బంధువులతో ఇలా చెప్పేవారు : వారు జీవనోపాధి కోసం ప్రయాణించి లేదా యోదులుగా పొరాడినప్పుడు చనిపోయారు లేదా చంపబడ్డారు:ఒకవేళ వారు మాతో ఉండి,బయటికి వెళ్లకపోతే,మరియు వారు యుద్దం చేయకపోతే చనిపోయీ లేదా చంపబడి ఉండేవారు కాదు,అల్లాహ్ వారి ఈ నమ్మకాన్నివారి హృదయాలలో సిగ్గు,ఆందోళనను పెంచడానికి చేశాడు,అల్లాహ్ ఒకేఒక్కడు,ఆయనే తాను కోరినవారికి జీవమరణాలను కలిగిస్తాడు,ఆయన విధివ్రాతను కూర్చున్నవాడు ఆపలేడు,బయటికి వెళ్ళేవాడు దాన్ని తొందరపెట్టలేడు,అల్లాహ్ మీరు ఏమి చేస్తున్నారో బహుబాగా వీక్షిస్తున్నాడు,ఆయనవద్ద మీ కార్యాలు దాచబడవు,అతీత్వరలోనే మీకు వాటి ప్రతిఫలం ఇస్తాడు.
Arabische uitleg van de Qur'an:
وَلَىِٕنْ قُتِلْتُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ اَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ اللّٰهِ وَرَحْمَةٌ خَیْرٌ مِّمَّا یَجْمَعُوْنَ ۟
ఒక వేళ మీరు దైవమార్గంలో అమరులైన లేదా మరణించిన – ఓ విశ్వాసులారా – అల్లాహ్ మిమ్మల్ని గొప్పక్షమాపణతో ప్రక్షాళిస్తాడు మరియు తన కారుణ్యాన్ని మీపై కురిపిస్తాడు,అది ఈ ప్రపంచం మరియు అందులో ప్రజలు కూడబెట్టే తరిగిపోయే సంపద కంటే ఎంతో మేలైనది.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• الجهل بالله تعالى وصفاته يُورث سوء الاعتقاد وفساد الأعمال.
• మహోన్నతుడైన అల్లాహ్ మరియు ఆయన గుణగణాల సరైన జ్ఞానం లేకపోతే అది చెడు విశ్వాసానికి మరియు చెడు కార్యాలకు దారితీస్తుంది.

• آجال العباد مضروبة محدودة، لا يُعجلها الإقدام والشجاعة، ولايؤخرها الجبن والحرص.
• దాసుల వయసు పరిమితి నిర్దారించబడింది,ధైర్యసహాసము,పరాక్రమము దాన్ని తొందరపెట్టలేవు,పిరికితనం,దురాశ దాన్నివాయిదా వేయలేవు.

• من سُنَّة الله تعالى الجارية ابتلاء عباده؛ ليميز الخبيث من الطيب.
•సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సంప్రదాయం ప్రకారం దాసుల పరీక్ష కొనసాగుతుంది. తద్వారా సజ్జనుల నుండి దుర్జనులను వేరు చేయబడుతుంది.

• من أعظم المنازل وأكرمها عند الله تعالى منازل الشهداء في سبيله.
• సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దృష్టిలో అత్యంత గొప్పవి మరియు గౌరవనీయమైన స్థానాలు దైవమార్గంలో పోరాడిన అమరవీరుల అంతస్తులు.

وَلَىِٕنْ مُّتُّمْ اَوْ قُتِلْتُمْ لَاۡاِلَی اللّٰهِ تُحْشَرُوْنَ ۟
మరియు ఒకవేళ మీరు ఎటువంటి స్థితిలో మరణించిన లేదా చంపబడ్డ ఏకైకుడైన ఆ అల్లాహ్ వైపునకే మీరంతా మరలించబడతారు;అప్పుడు ఆయన మీకార్యాలకనుగుణంగా ప్రతిఫలమిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
فَبِمَا رَحْمَةٍ مِّنَ اللّٰهِ لِنْتَ لَهُمْ ۚ— وَلَوْ كُنْتَ فَظًّا غَلِیْظَ الْقَلْبِ لَانْفَضُّوْا مِنْ حَوْلِكَ ۪— فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِی الْاَمْرِ ۚ— فَاِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَی اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُتَوَكِّلِیْنَ ۟
అల్లాహ్ యొక్క గొప్ప కారుణ్యం పొందడానికి గల కారణం మీ నైతికత - ఓ ప్రవక్త -సహచరుల'కు సులభతరం కొరకు,ఒకవేళ మీ మాటలు మరియు చర్యలు తీవ్రంగా ఉన్నా,మీరు కఠినమైన మనసు కలిగిన, వారు మీ నుండి విడిపోయేవారు,కాబట్టి మీ హక్కులో వారి నిర్లక్ష్యాన్ని పట్టించుకోకండి,వారిని క్షమించమని దుఆ చేయండి,మరియు ఏదైన విషయంలో సలహాల అవసరం కలిగితే వారి అభిప్రాయాన్ని అడగండి.సంప్రదింపుల తరువాత ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే,దానితో ముందుకు సాగండి మరియు అల్లాహ్ పై నమ్మకం ఉంచండి.అల్లాహ్ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు,మరియు వారికి సహాయం చేస్తాడు మరియు వారికి మద్దతు ఇస్తాడు.
Arabische uitleg van de Qur'an:
اِنْ یَّنْصُرْكُمُ اللّٰهُ فَلَا غَالِبَ لَكُمْ ۚ— وَاِنْ یَّخْذُلْكُمْ فَمَنْ ذَا الَّذِیْ یَنْصُرُكُمْ مِّنْ بَعْدِهٖ ؕ— وَعَلَی اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ ۟
ఒక వేళ అల్లాహ్ తన సహాయం ద్వారా మీకు విజయం చేకూర్చి మద్దతు తెలిపితే' మీకు వ్యతిరేకంగా భూలోక వాసులంతా కలిసికట్టుగా సమావేశమైనప్పటికీ, ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు,మరియు ఆయన మీకు తన సహాయంతో మద్దతు ఇవ్వకుండా,మిమ్మల్ని మీ స్వయానికి అప్పగించినట్లయితే,ఆయన తరువాత ఎవరూ మీకు సహాయం చేయలేరు.ఏకైకుడైన ఆయన చేతుల్లోనే విజయం మద్దతు ఉంది,మరియు అల్లాహ్ పై మాత్రమే విశ్వాసులు నమ్మకం కలిగిఉండాలి,ఆయనను కాదని ఎవరిపై ఆధారపడకూడదు.
Arabische uitleg van de Qur'an:
وَمَا كَانَ لِنَبِیٍّ اَنْ یَّغُلَّ ؕ— وَمَنْ یَّغْلُلْ یَاْتِ بِمَا غَلَّ یَوْمَ الْقِیٰمَةِ ۚ— ثُمَّ تُوَفّٰی كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
ప్రవక్తలలో ఏ ప్రవక్త అల్లాహ్ కేటాయించని యుద్ద ప్రాప్తిసొమ్ము వాటాను తీసుకుని ద్రోహం చేయలేరు.మరి ఎవరైతే మీలో యుద్దప్రాప్తి సొమ్ము తీసుకుని ద్రోహానికి పాల్పడుతారో పునరుత్థాన రోజున బహిర్గతమై శిక్షించబడతారు.అప్పుడు అతను దొంగిలించిన ఆ సొమ్మును మోస్తూ జనుల ముందుకు వస్తాడు,అప్పుడు ప్రతి ప్రాణికి దాని సంపాదనకు బదులుగా కొరత విధించకుండా పూర్తిగా ప్రతిఫలం ఇవ్వబడుతుంది,మరియు వారి చెడుపనుల ఆధిక్యత వల్ల లేదా మంచి పనుల కొరత వల్ల వారిపై ఎలాంటి అన్యాయం జరుగదు.
Arabische uitleg van de Qur'an:
اَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللّٰهِ كَمَنْ بَآءَ بِسَخَطٍ مِّنَ اللّٰهِ وَمَاْوٰىهُ جَهَنَّمُ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟
అల్లాహ్ దృష్టిలో ఈమాన్ మరియు సదాచారణల ప్రసన్నతను పొంది అనుసరించేవాడు మరియు అల్లాహ్ ను తిరస్కరించి దుష్కార్యాలు చేయువాడు ఎన్నటికీ సమానం కాదు,అల్లాహ్ యొక్క తీవ్రమైన కోపంతో అతను మరలుతాడు,నరకం అతని నివాసమవుతుంది,గమ్యం మరియు నివాసం పరంగా అది మహాచెడ్డది.
Arabische uitleg van de Qur'an:
هُمْ دَرَجٰتٌ عِنْدَ اللّٰهِ ؕ— وَاللّٰهُ بَصِیْرٌ بِمَا یَعْمَلُوْنَ ۟
అల్లాహ్ వద్ద ఇహ,పరలోకాల్లో వారి అంతస్తులు వేర్వేరుగా ఉంటాయి,వారు ఏమిచేస్తున్నారో అల్లాహ్ చూస్తున్నాడు,ఆయన వద్ద ఏదీ దాగదు,త్వరలోనే వారికర్మలకు తగ్గ పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది.
Arabische uitleg van de Qur'an:
لَقَدْ مَنَّ اللّٰهُ عَلَی الْمُؤْمِنِیْنَ اِذْ بَعَثَ فِیْهِمْ رَسُوْلًا مِّنْ اَنْفُسِهِمْ یَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِهٖ وَیُزَكِّیْهِمْ وَیُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ ۚ— وَاِنْ كَانُوْا مِنْ قَبْلُ لَفِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
అల్లాహ్ విశ్వాసులపై ఒక ప్రవక్తను వారి నుంచి ప్రభవింపచేసి వారిని అనుగ్రహించి మహోపకారం చేశాడు,అతను పవిత్ర ఖుర్’ఆను గ్రంథాన్నివారికి చదివి వినిపిస్తాడు,షిర్కు మరియు తుచ్ఛమైన అనైతికతను శుద్దిచేస్తాడు,మరియు వారికి పవిత్ర ఖుర్’ఆను మరియు సున్నతు’ను బోధిస్తాడు,ఈ ప్రవక్తకు ముందు గతంలో వారు సన్మార్గం, ఋజుమార్గానికి దూరంగా స్పష్టమైన బ్రష్టత్వంలో ఉండేవారు.
Arabische uitleg van de Qur'an:
اَوَلَمَّاۤ اَصَابَتْكُمْ مُّصِیْبَةٌ قَدْ اَصَبْتُمْ مِّثْلَیْهَا ۙ— قُلْتُمْ اَنّٰی هٰذَا ؕ— قُلْ هُوَ مِنْ عِنْدِ اَنْفُسِكُمْ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
ఓ విశ్వాసులారా! -మీరు ఉహద్’లో ఓడిపోయి మరియు చంపబడుతూ ఒక విపత్తు మీకు సంభవించింది,అయితే మీరు బదర్ యుద్దంలో మీ శత్రువులను హతమార్చి ఇంకా బంధించి దీనికి రెండురెట్లు అధికంగా నష్టపర్చారు,మీరు ఇలా అన్నారు : మేము విశ్వాసులము,అల్లాహ్ ప్రవక్త మాలో ఉన్నప్పటికి ఇలా ఎందుకు జరిగింది ?! చెప్పండి - ఓ ప్రవక్త -:మీరు గొడవపడినందుకు,దైవప్రవక్తకు అవిధేయత చూపినందుకు బదులుగా ఈ విపత్తు మీకు సంభవించింది,నిశ్చయంగా అల్లాహ్ ప్రతీవస్తువుపట్ల శక్తిని కలిగి ఉన్నాడు,ఆయన కోరినవారికి విజయాన్ని ప్రాప్తిస్తాడు మరియు తాను కోరినవారిని మట్టికరిపిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• النصر الحقيقي من الله تعالى، فهو القوي الذي لا يحارب، والعزيز الذي لا يغالب.
•నిజమైన విజయం’సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి ప్రాప్తిస్తుంది, ఆయన ఓడించబడని బలవంతుడు మరియు అపజయం లేని శక్తిమంతుడు.

• لا تستوي في الدنيا حال من اتبع هدى الله وعمل به وحال من أعرض وكذب به، كما لا تستوي منازلهم في الآخرة.
•అల్లాహ్ మార్గదర్శకాన్ని అనుసరించి దానిప్రకారం ఆచరించే వారి స్థితి,మరియు తిరస్కరించి దానిని ఖండించేవారి స్థితి ఈ ప్రపంచంలో ఎన్నటికీ సమానం కాదు.‘వీరి పరలోక అంతస్తులు సమానంగా లేని మాదిరిగానే

• ما ينزل بالعبد من البلاء والمحن هو بسبب ذنوبه، وقد يكون ابتلاء ورفع درجات، والله يعفو ويتجاوز عن كثير منها.
•దాసుడిపై విరుచుకుపడే విపత్తులు బాధలు స్వయం అతని అపరాధాల వల్ల సంభవిస్తాయి,ఆ విపత్తులు దాసుడి స్థాయిని పెంచుతాయి,అల్లాహ్ వాటిలో ఎన్నో పాపాలు మన్నిస్తాడు మరియు క్షమిస్తాడు.

وَمَاۤ اَصَابَكُمْ یَوْمَ الْتَقَی الْجَمْعٰنِ فَبِاِذْنِ اللّٰهِ وَلِیَعْلَمَ الْمُؤْمِنِیْنَ ۟ۙ
ఉహద్ యుద్దంలో మీకు మరియు ముష్రికులైన శత్రువులకు మధ్య. యుద్దం జరిగినప్పుడు మీకు కలిగిన మరణాలు,గాయాలు,ఓటమి’అల్లాహ్ అనుమతితో మరియు ఆయన వ్రాసిన విధి ప్రకారం జరిగింది,గొప్ప వివేకం అందులో దాగిఉంది తద్వారా సత్యవంతులైన విశ్వాసులు ఎవరు అనేది స్పష్టమవుతుంది.
Arabische uitleg van de Qur'an:
وَلِیَعْلَمَ الَّذِیْنَ نَافَقُوْا ۖۚ— وَقِیْلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ اَوِ ادْفَعُوْا ؕ— قَالُوْا لَوْ نَعْلَمُ قِتَالًا لَّاتَّبَعْنٰكُمْ ؕ— هُمْ لِلْكُفْرِ یَوْمَىِٕذٍ اَقْرَبُ مِنْهُمْ لِلْاِیْمَانِ ۚ— یَقُوْلُوْنَ بِاَفْوَاهِهِمْ مَّا لَیْسَ فِیْ قُلُوْبِهِمْ ؕ— وَاللّٰهُ اَعْلَمُ بِمَا یَكْتُمُوْنَ ۟ۚ
కపటవాదులు బయటపడ్డారు వారితో ఇలా చెప్పినప్పుడు: ‘అల్లాహ్ కొరకు పోరాడండి,లేదా మీరు ముస్లింలను రక్షించండి. వారు సమాధానమిస్తూ ఇలా అన్నారు : యుద్దం జరుగుతుందని మాకు తెలిస్తే,మేము మిమ్మల్ని ఖచ్చితంగా అనుసరించేవారము. కాని మీకు మరియు శత్రువులకు మధ్య యుద్దం జరుగుతుందని మేము భావించలేదు. వారు ఆ సమయంలో కలిగి ఉన్న స్థితి విశ్వాసం కంటే అవిశ్వాసాన్ని అధికంగా సూచిస్తుంది. వారి మనసులో లేనిదాన్నివారు తమ నోటితో చెప్పసాగారు. తమ మదిలో వారు దాస్తున్న విషయాల గురించి అల్లాహ్’కు చాలా బాగా తెలుసు. త్వరలోనే దానికి బదులుగా వారిని శిక్షిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
اَلَّذِیْنَ قَالُوْا لِاِخْوَانِهِمْ وَقَعَدُوْا لَوْ اَطَاعُوْنَا مَا قُتِلُوْا ؕ— قُلْ فَادْرَءُوْا عَنْ اَنْفُسِكُمُ الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ధర్మపోరాటం నుండి వెనుకుండి నిష్క్రమించిన వారు ఉహద్ యుద్దంలో గాయపడిన తమబంధువులతో ఇలా అన్నారు : ఒకవేళ వారు మాకు విధేయత చూపుతూ యుద్దానికి వెళ్ళియుండకపోతే చంపబడేవారు కాదు.-ఓ ప్రవక్త- మీరు వారిని ఖండిస్తూ చెప్పండి :-‘ఒకవేళ మీరు చేసిన వాదనలో సంత్యవంతులైతే,అనగా -ఎవరైతే మీకు విధేయత చూపుతూ మీతో పాటు కూర్చుని ఉంటే చనిపోయేవారు కాదు’అని’మరియు దైవమార్గంలో చేసే జిహాదు నుంచి వెనక కూర్చుండిపోవడమే మీరు బ్రతికిపోవడానికి అసలు కారణమైతే ‘మరణం’ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోండి!
Arabische uitleg van de Qur'an:
وَلَا تَحْسَبَنَّ الَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ اَمْوَاتًا ؕ— بَلْ اَحْیَآءٌ عِنْدَ رَبِّهِمْ یُرْزَقُوْنَ ۟ۙ
మరియు -ఓ ప్రవక్త – దైవమార్గంలో పోరాడుతూ జిహాద్లో చంపబడినవారు మృతిచెందారని అనుకోకండి. వారు సజీవులుగా ఉన్నారు, తమప్రభువు వద్ద గౌరవనీయమైన గృహంలో ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతున్నారు. రకరకాల అనుగ్రహాలు వారికి ప్రసాదించబడుతున్నాయి,అవి ఏమిటో అల్లాహ్’కు తప్ప ఎవరికి తెలియదు.
Arabische uitleg van de Qur'an:
فَرِحِیْنَ بِمَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ۙ— وَیَسْتَبْشِرُوْنَ بِالَّذِیْنَ لَمْ یَلْحَقُوْا بِهِمْ مِّنْ خَلْفِهِمْ ۙ— اَلَّا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟ۘ
అల్లాహ్ తన దయతో వారిపై చూపిన అనుగ్రహంతో వారు ఆనందంతో మునిగిపోయారు,సంతోషం వారిని కప్పివేసింది. ఈ ప్రపంచంలో ఉండిపోయిన సోదరులు కూడా తమతో చేరాలని వారు ఆశిస్తు ఎదురు చూస్తున్నారు,జిహాద్’లో వీరుకూడా చంపబడితే వారి మాదిరిగానే దైవానుగ్రహాన్ని పొందుతారు,పరలోకంలో ఎదురయ్యే సమస్యల పట్ల వారికి ఎలాంటి చింతలేదు,మరియు ప్రపంచంలో కోల్పోయిన తమ సంపద పట్ల ఎలాంటి ఆందోళన వారికి ఉండదు.
Arabische uitleg van de Qur'an:
یَسْتَبْشِرُوْنَ بِنِعْمَةٍ مِّنَ اللّٰهِ وَفَضْلٍ ۙ— وَّاَنَّ اللّٰهَ لَا یُضِیْعُ اَجْرَ الْمُؤْمِنِیْنَ ۟
వారు అల్లాహ్ నుండి ఆశించిన ఈ గొప్ప బహుమతి మరియు అదనంగా లభించిన గొప్ప ప్రతిఫలం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ విశ్వాసుల పుణ్యఫలాలను వ్యర్థం కానివ్వడు,బదులుగా ఆయన వారికి సంపూర్ణంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు మరియు దానిలో అభివృద్దిని ఒసగుతాడు.
Arabische uitleg van de Qur'an:
اَلَّذِیْنَ اسْتَجَابُوْا لِلّٰهِ وَالرَّسُوْلِ مِنْ بَعْدِ مَاۤ اَصَابَهُمُ الْقَرْحُ ۛؕ— لِلَّذِیْنَ اَحْسَنُوْا مِنْهُمْ وَاتَّقَوْا اَجْرٌ عَظِیْمٌ ۟ۚ
జిహాదు కొరకు అల్లాహ్ మార్గంలో ఉహద్ యుద్దం తరువాత జరిగిన ‘హమ్రాఉల్ అసద్’యుద్దంలో బహుదైవారాధకుల్లోని శత్రువులతో పోరాటానికి బయల్దేరమని ప్రకటించినప్పుడు,ఉహద్ యుద్దంలో గాయపడినప్పటికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞకు బదులిస్తూ ప్రతిస్పందించారు,వారిగాయాలు అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క ప్రకటన నుండి ఆచరణల పరంగా ఉత్తములైన వారిని నిరోధించలేదు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,నిషేధాలకు దూరంగా ఉంటూ భయభీతి చెందే వారికి గొప్ప బహుమతి ఉంది,అదియే స్వర్గము.
Arabische uitleg van de Qur'an:
اَلَّذِیْنَ قَالَ لَهُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدْ جَمَعُوْا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ اِیْمَانًا ۖۗ— وَّقَالُوْا حَسْبُنَا اللّٰهُ وَنِعْمَ الْوَكِیْلُ ۟
కొంతమంది బహుదైవారాధకులు వారితో చెప్పారు : నిశ్చయంగా ఖురైష్ తెగవారు ‘అబూసుఫ్యాన్’ నాయకత్వంలో యుద్దం చేయడానికి మీ అందరినీ హతమార్చడానికి ఒక పెద్ద సమూహాన్ని ఏర్పాటుచేసుకున్నారు,వారితో జాగ్రత్తగా ఉండండి,వారితో యుద్దం చేయటం నుండి జాగ్రత్తపడండి,అప్పుడు ఈ మాటలు,బెదిరింపులు అల్లాహ్ పట్ల వారికి గల విశ్వాసాన్ని మరియు ఆయన వాగ్దానం పట్ల నమ్మకాన్ని పెంచాయి,వెంటనే వారితో యుద్దం చేయడానికి బయల్దేరుతూ ఇలా అన్నారు:- మహోన్నతుడైన అల్లాహ్’యే మాకు చాలు,ఆయన మా వ్యవహారాలను ఎంతో ఉత్తమంగా నిర్వహిస్తాడు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• من سنن الله تعالى أن يبتلي عباده؛ ليتميز المؤمن الحق من المنافق، وليعلم الصادق من الكاذب.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దాసులను విపత్తులకు గురిచేసి పరీక్షించడం”ఆయన సాంప్రదాయంలోనిది, తద్వారా కపటవాదుల నుండి సత్యవంతులైన విశ్వాసులను వేరుచేయబడుతుంది,మరియు అసత్యవంతుల నుండి సత్యవంతులెవరూ అని తెలుసుకోబడుతుంది.

• عظم منزلة الجهاد والشهادة في سبيل الله وثواب أهله عند الله تعالى حيث ينزلهم الله تعالى بأعلى المنازل.
అల్లాహ్ మార్గంలో జిహాదు మరియు షహాదతు(అమరత్వం) యొక్క గొప్పతనం మరియు మహోన్నతుడైన అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం’ ‘అల్లాహ్ వారికి ఎత్తైనఅంతస్తుల్లో కల్పించే నివాసంద్వారా’స్పష్టమవుతుంది.

• فضل الصحابة وبيان علو منزلتهم في الدنيا والآخرة؛ لما بذلوه من أنفسهم وأموالهم في سبيل الله تعالى.
సహచరుల(సహబాల)విశిష్టత మరియు ఇహపరలోకాల్లో వారికి గల ఉన్నత స్థాయి గురించి ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో సహచరుల విశిష్టత మరియు వారి ఉన్నత స్థితి తెలియజేయబడింది;ఎందుకంటే వారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిమిత్తం తమప్రాణాలను మరియు సంపదను ఖర్చు చేశారు.

فَانْقَلَبُوْا بِنِعْمَةٍ مِّنَ اللّٰهِ وَفَضْلٍ لَّمْ یَمْسَسْهُمْ سُوْٓءٌ ۙ— وَّاتَّبَعُوْا رِضْوَانَ اللّٰهِ ؕ— وَاللّٰهُ ذُوْ فَضْلٍ عَظِیْمٍ ۟
“హమ్రాఉల్-అసద్”కు వెళ్ళినవారు అల్లాహ్ యొక్క గొప్ప బహుమతితో తిరిగి వచ్చారు,వారి స్థాయి పెరిగింది,శత్రువుల నుండి రక్షణ పొందారు మరణం కానీ గాయపడటం కానీ జరుగలేదు,అల్లాహ్’కు విధేయత చూపుతూ,ఆవిధేయతకు పాల్పడకుండా ఆయన ప్రసన్నతను పొందే కార్యాలను వారు అనుసరించారు,నిశ్చయంగా అల్లాహ్ తన విశ్వాసులైన దాసుల పట్ల గొప్ప దయామయుడు.
Arabische uitleg van de Qur'an:
اِنَّمَا ذٰلِكُمُ الشَّیْطٰنُ یُخَوِّفُ اَوْلِیَآءَهٗ ۪— فَلَا تَخَافُوْهُمْ وَخَافُوْنِ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
నిశ్చయంగా మిమ్మల్ని షైతాను భయానికి గురిచేస్తున్నాడు,తన సహాయకులతో మరియు మద్దతుదారులతో కలిసి భయపెడతాడు,మీరు వారితో పిరికివైఖరిని అవలంభించవద్దు,నిశ్చయంగా వారికి ఎలాంటి శక్తియుక్తులు లేవు,మీరు నిజంగా విశ్వాసులే అయితే ఏకైకుడైన ఆ అల్లాహ్ కు విధిగా విధేయత కనబరుస్తూ ఆయనకు మాత్రమే భయభీతిని కలిగి ఉండండి.
Arabische uitleg van de Qur'an:
وَلَا یَحْزُنْكَ الَّذِیْنَ یُسَارِعُوْنَ فِی الْكُفْرِ ۚ— اِنَّهُمْ لَنْ یَّضُرُّوا اللّٰهَ شَیْـًٔا ؕ— یُرِیْدُ اللّٰهُ اَلَّا یَجْعَلَ لَهُمْ حَظًّا فِی الْاٰخِرَةِ ۚ— وَلَهُمْ عَذَابٌ عَظِیْمٌ ۟
ఓ దైవప్రవక్త – అవిశ్వాసంలో త్వరపడుతూ వెన్ను చూపుతూ తిరిగిపోయే కపటులు’మిమ్మల్నిభాదకి గురిచేయకూడదు,నిస్సందేహంగా వారు అల్లాహ్ కు ఎలాంటి హనీకల్గించలేరు,అల్లాహ్’ విశ్వాసానికి,విధేయతకు దూరంగా ఉంటూ వారు తమ స్వయానికే హానీ తలపెట్టుకుంటున్నారు,అల్లాహ్ వారి కొరకు అపజయాన్ని మరియు వైఫల్యాన్ని కోరుకుంటున్నాడు,పరలోక అనుగ్రహల్లో వారికి ఎలాంటి వాటా ఉండదు,వారికోసం నరకంలో చిత్రహింసలతో కూడిన శిక్షలు ఉంటాయి.
Arabische uitleg van de Qur'an:
اِنَّ الَّذِیْنَ اشْتَرَوُا الْكُفْرَ بِالْاِیْمَانِ لَنْ یَّضُرُّوا اللّٰهَ شَیْـًٔا ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
అవిశ్వాసంతో విశ్వాసాన్ని మార్చుకున్న వారు అల్లాహ్ కు ఏ హాని చేయలేరు.వారు స్వయానికి హానీ తల్పెట్టుకుంటారు,వారికొరకు పరలోకంలో బాధాకరమైన శిక్ష ఉంది.
Arabische uitleg van de Qur'an:
وَلَا یَحْسَبَنَّ الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّمَا نُمْلِیْ لَهُمْ خَیْرٌ لِّاَنْفُسِهِمْ ؕ— اِنَّمَا نُمْلِیْ لَهُمْ لِیَزْدَادُوْۤا اِثْمًا ۚ— وَلَهُمْ عَذَابٌ مُّهِیْنٌ ۟
తమ ప్రభువును తిరస్కరించి,ఆయన ధర్మశాస్త్రాన్ని ధిక్కరించినవారు ‘వారికివ్వబడిన గడువు మరియు వయస్సు వారి అవిశ్వాసం వల్లనే అని అది తమకు మంచిదని ఎన్నటికీ భావించవద్దు. వ్యవహారం వారు భావించినట్లుగా లేదు,నిశ్చయంగా మేము వారికి గడువును ఇస్తున్నాము తద్వారా వారు ఎక్కువపాపాలకు పాల్పడి అధికంగా ఆవిధేయత చూపుతారు. మరియు వారికొరకు అతిహీనమైన శిక్ష ఉంది.
Arabische uitleg van de Qur'an:
مَا كَانَ اللّٰهُ لِیَذَرَ الْمُؤْمِنِیْنَ عَلٰی مَاۤ اَنْتُمْ عَلَیْهِ حَتّٰی یَمِیْزَ الْخَبِیْثَ مِنَ الطَّیِّبِ ؕ— وَمَا كَانَ اللّٰهُ لِیُطْلِعَكُمْ عَلَی الْغَیْبِ وَلٰكِنَّ اللّٰهَ یَجْتَبِیْ مِنْ رُّسُلِهٖ مَنْ یَّشَآءُ ۪— فَاٰمِنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ ۚ— وَاِنْ تُؤْمِنُوْا وَتَتَّقُوْا فَلَكُمْ اَجْرٌ عَظِیْمٌ ۟
కపటవాదులతో మీరు కలిసి ఉండేలా వదలడం మరియు మీ మధ్య వ్యత్యాసం చూపకపోవడం,సత్యపరులైన విశ్వాసులను స్పష్టపరచకపోవడం’లో అల్లాహ్ యొక్క ఆంతర్యం ఏమిటి,ఆయన మిమ్మల్ని రకరకాల ఆపదలు మరియు విపత్తుల ద్వారా వేరుపరుస్తాడు,తద్వారా దుష్ట కపటుల నుంచి మేలైనవిశ్వాసులు స్పష్టమవుతారు.మరియు ఆయన ఒకవేళ మిమ్మల్ని అగోచర జ్ఞానాన్ని తెలియపరిస్తే విశ్వాసులను మరియు మునాఫిఖులను మీరు వేరుపరిచేవారు,కానీ అల్లాహ్ తాను కోరిన వారిని ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు మరియు వారికి అగోచర విషయాలలో కొన్ని తెలియజేస్తాడు,అలాగే తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు కూడా మునాఫిఖుల స్థితి గురించి తెలియజేశాడు,మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల నిజమైన విశ్వాసాన్నికలిగి ఉండండి,మీరు అల్లాహ్ ను వాస్తవంగా విశ్వసించి,అల్లాహ్’కు ‘ఆయన ఆదేశాలను శిరసావహిస్తూ నిషేధాలకు దూరంగా ఉంటూ భయపడండి,అప్పుడు మీకు అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
Arabische uitleg van de Qur'an:
وَلَا یَحْسَبَنَّ الَّذِیْنَ یَبْخَلُوْنَ بِمَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ هُوَ خَیْرًا لَّهُمْ ؕ— بَلْ هُوَ شَرٌّ لَّهُمْ ؕ— سَیُطَوَّقُوْنَ مَا بَخِلُوْا بِهٖ یَوْمَ الْقِیٰمَةِ ؕ— وَلِلّٰهِ مِیْرَاثُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟۠
అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన వాటిలో లోభత్వాన్ని(పిసినారితనాన్ని) వహించే వారు,తమకు ఆ (లోభమే) మేలైనదని భావించ రాదు,వారు అందులో అల్లాహ్ యొక్క హక్కును ఆపుకుంటారు,అది వారికి ఎంతో మేలైనదని భావించరాదు వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది.ఎందుకంటే వారు లోభత్వం వహించేవి అతి త్వరలో బేడీలుగా మారుతాయి,పరలోకదినాన ఆ బేడీలు వారి మెడలో చుట్టబడతాయి వాటిద్వారా శిక్షించబడుతుంది.ఏకైకుడైన అల్లాహ్’యే భూమ్యాకాశాలలో ఉన్న దానిని మారుస్తున్నాడు,సృష్టి పూర్తిగా అంతమయిన తరువాత కూడా ఆయన సజీవంగా ఉంటాడు,నిశ్చయంగా అల్లాహ్’కు మీరు చేసే సూక్ష్మ విషయాలు కూడా తెలుసు,మరియు అతిత్వరలో దానికి ప్రతిఫలం ఇస్తాడు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• ينبغي للمؤمن ألا يلتفت إلى تخويف الشيطان له بأعوانه وأنصاره من الكافرين، فإن الأمر كله لله تعالى.
సత్యతిరస్కరులైన కాఫీరుల్లో షైతాను తన సహాయకులు మరియు మద్దతుదారులతో బెదిరించినప్పుడు విశ్వాసి బెదరకూడదు,నిశ్చయంగా సర్వవ్యవహారాలు అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయి.

• لا ينبغي للعبد أن يغتر بإمهال الله له، بل عليه المبادرة إلى التوبة، ما دام في زمن المهلة قبل فواتها.
ఒకదాసుడు అల్లాహ్ ఇచ్చిన గడువు పట్ల ఎన్నడూ మోసపోకూడదు,బదులుగా,అతను మరణానికి ముందు అనుగ్రహించబడిన గడువు సమయంలో ఉన్నంత కాలం పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి.

• البخيل الذي يمنع فضل الله عليه إنما يضر نفسه بحرمانها المتاجرة مع الله الكريم الوهاب، وتعريضها للعقوبة يوم القيامة.
అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాన్ని ఆపుకునే పిసినారి దయామయుడు,కనికరించేవాడు అయిన అల్లాహ్ తో వర్తకం చేయకుండా తనకు తానే స్వయంగా హాని చేసుకుంటాడు మరియు పరలోకంలో దాని ద్వారా శిక్షించబడుతుంది.

لَقَدْ سَمِعَ اللّٰهُ قَوْلَ الَّذِیْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ فَقِیْرٌ وَّنَحْنُ اَغْنِیَآءُ ۘ— سَنَكْتُبُ مَا قَالُوْا وَقَتْلَهُمُ الْاَنْۢبِیَآءَ بِغَیْرِ حَقٍّ ۙۚ— وَّنَقُوْلُ ذُوْقُوْا عَذَابَ الْحَرِیْقِ ۟
యూదుల మాటలు అల్లాహ్ విన్నాడు,వారు చెప్పారుల: "అల్లాహ్ పేదవాడు,ఎందుకంటే ఆయన మాతో రుణం కోరాడు,మరియు మా దగ్గర ఉన్న సంపద వల్ల మేము ధనవంతులం". వారు తమ ప్రభువు పై మోపిన అభాండాలను మరియు అభియోగాలను మరియు అకారణంగా వారి ప్రవక్తలను చంపడం గురించి వారు చెప్పిన వాటిని మేము నమోదుచేస్తాము,మరియు వారికి ఇలా చెప్తాము:- నరకంలో కాల్చేహింసను రుచి చూడండి.
Arabische uitleg van de Qur'an:
ذٰلِكَ بِمَا قَدَّمَتْ اَیْدِیْكُمْ وَاَنَّ اللّٰهَ لَیْسَ بِظَلَّامٍ لِّلْعَبِیْدِ ۟ۚ
ఓ యూదులారా -ఆ శిక్ష మీ సుహస్తాలతో మీరు పంపుకున్న మోసాలు మరియు పాపాకర్మల ప్రతిఫలం,అల్లాహ్ తనదాసులలో ఎవరికి అనువంత అన్యాయం కూడా చేయడు.
Arabische uitleg van de Qur'an:
اَلَّذِیْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ عَهِدَ اِلَیْنَاۤ اَلَّا نُؤْمِنَ لِرَسُوْلٍ حَتّٰی یَاْتِیَنَا بِقُرْبَانٍ تَاْكُلُهُ النَّارُ ؕ— قُلْ قَدْ جَآءَكُمْ رُسُلٌ مِّنْ قَبْلِیْ بِالْبَیِّنٰتِ وَبِالَّذِیْ قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوْهُمْ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
వారు అబద్ధాలు మరియు కల్పితాలు ఆపాదిస్తూ చెప్పారు :- అల్లాహ్ తన గ్రంథములో మరియు ప్రవక్తల నోటితో-‘మేము ఏ ప్రవక్తను తన మాటలను సత్యమని రుజువుపర్చనంత వరకు నమ్మవద్దని ఆజ్ఞాపించాడు.అదికూడా ‘అల్లాహ్’కు దానం సమర్పించాలీ దాన్ని ఆకాశం నుండి అగ్నివచ్చి కాల్చాలి’- వాస్తావానికి వారికి చేయబడ్డ వీలునామా విషయంలో ప్రవక్తను సత్యవంతుడని నిరూపించుకోవడానికి వారు ప్రస్తావించిన పద్దతిలో అల్లాహ్ పై అబద్దాన్ని మోపారు,అంచేత అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు వారికి ఇలా చెప్పమని ఆదేశించాడు :- నిశ్చయంగా గతంలో నాకు పూర్వం చాలా మంది ప్రవక్తలు సత్యవంతులుగా చూపే స్పష్టమైన సాక్ష్యాలతో మీ వద్దకి వచ్చారు,మరియు మీరు ప్రస్తావించిన ఖుర్బానీ రుజువు ‘అంటే ఆకాశం నుండి వచ్చిన అగ్ని దాన్ని కాల్చేయడం ‘కూడా జరిగింది మరి ఎందుకని వారిని మీరు ధిక్కరించారు,మరియు హతమార్చారు? మీ మాటల్లో సత్యవంతులైతే చెప్పండి ?.
Arabische uitleg van de Qur'an:
فَاِنْ كَذَّبُوْكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِّنْ قَبْلِكَ جَآءُوْ بِالْبَیِّنٰتِ وَالزُّبُرِ وَالْكِتٰبِ الْمُنِیْرِ ۟
మీరు తిరస్కరించబడితే - ఓ ప్రవక్త - విచారపడకండి, ఎందుకంటే ఇది అవిశ్వాసుల అలవాటు,మీకు పూర్వం అనేక ప్రవక్తలు తిరస్కరించబడ్డారు,వారు స్పష్టమైన సాక్ష్యాలు,మరియు ఉపదేశాలు,గుణపాఠాలతో నిండిన గ్రంథాలు మరియు ఆదేశాలు, చట్టాలను,శాసనాలను భోదించే మార్గదర్శక పుస్తకాలు తీసుకువచ్చారు.
Arabische uitleg van de Qur'an:
كُلُّ نَفْسٍ ذَآىِٕقَةُ الْمَوْتِ ؕ— وَاِنَّمَا تُوَفَّوْنَ اُجُوْرَكُمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— فَمَنْ زُحْزِحَ عَنِ النَّارِ وَاُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ؕ— وَمَا الْحَیٰوةُ الدُّنْیَاۤ اِلَّا مَتَاعُ الْغُرُوْرِ ۟
ప్రతీప్రాణీ ఏ చోట ఉన్నా ఖచ్చితంగా మరణాన్ని రుచిచూడవలసి ఉంది,ఈ ప్రపంచం వల్ల ఎవరు మోసానికి గురికాకూడదు,పరలోకదినాన ఎటువంటి కోత లేకుండా మీ కార్యాలకు పూర్తిగా ప్రతిఫలం ఇవ్వబడుతుంది,అప్పుడు ఎవరినైతే అల్లాహ్ నరకాగ్ని నుండి రక్షించి స్వర్గంలో నివాసం కల్పిస్తాడో నిశ్చయంగా అతను ఆశించిన మేలును పొందాడు,మరియు భయపడిన కీడు నుండి బయటపడ్డాడు,ఈ ప్రాపంచిక జీవితం అంతమయ్యే వస్తుసామాగ్రి తప్ప మరేమీ కాదు,మోసపోయినవాడు మాత్రమే దీనిని అంటిపెట్టుకుని ఉంటాడు.
Arabische uitleg van de Qur'an:
لَتُبْلَوُنَّ فِیْۤ اَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْ ۫— وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ وَمِنَ الَّذِیْنَ اَشْرَكُوْۤا اَذًی كَثِیْرًا ؕ— وَاِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا فَاِنَّ ذٰلِكَ مِنْ عَزْمِ الْاُمُوْرِ ۟
ఓ విశ్వాసులారా-మీరు మీ సంపదలలో విధి హక్కులను చెల్లించే విషయంగా,మరియు దానివల్ల ఎదురయ్యే ఆపదల ద్వారా ఖచ్చితంగా పరీక్షించబడతారు మరియు షరీఅతు పరమైన విధులను స్థాపించడంలో మరియు మీకు ఎదురయ్యే రకరకాలైన సమస్యల ద్వారా పరీక్షించబడతారు,మరియు మీరు ఖచ్చితంగా గ్రంథవహుల మరియు బహుదైవారాధకుల నుండి మీ పట్ల మరియు మీ ధర్మం పట్ల దూషణను వింటారు,ఒకవేళ మీకు ఎదురైన రకరకాల ఆపదలు మరియు విపత్తులను ఓర్పుతో సహిస్తూ ఉండడం,మరియు అల్లాహ్ ఆదేశాలు పాటిస్తూ మరియు నిషేధాలకు దూరంగా ఉంటూ భయపడుతూ ఉండండం,నిశ్చయంగా ఇవి దృఢసంకల్ప వ్యవహారాలకు చెందినవి,పోటీదారులు ఇందులో పోటీపడతారు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• من سوء فعال اليهود وقبيح أخلاقهم اعتداؤهم على أنبياء الله بالتكذيب والقتل.
యూదులు ఘోరమైన అపరాధం మరియు వారి వికారమైన నైతికతేమిటంటే దైవప్రవక్తలను తిరస్కరించడం మరియు శతృత్వంతో హతమార్చడం.

• كل فوز في الدنيا فهو ناقص، وإنما الفوز التام في الآخرة، بالنجاة من النار ودخول الجنة.
ప్రపంచంలో కలిగే ప్రతి విజయం అసంపూర్ణమే,పునరుత్తానదినమున సంపూర్ణ విజయం నరకం నుండి తప్పించుకుని స్వర్గంలో ప్రవేశించడం ద్వారా లభిస్తుంది.

• من أنواع الابتلاء الأذى الذي ينال المؤمنين في دينهم وأنفسهم من قِبَل أهل الكتاب والمشركين، والواجب حينئذ الصبر وتقوى الله تعالى.
దైవికపరిక్షలో ఒకటి-‘;;గ్రంధవహులకు మరియు బహుదైవారాధకులకంటే ముందు తన ధర్మం మరియు ప్రాణంలో విశ్వాసి బాధను పొందుతాడు. అలాంటప్పుడు ఓర్పు మరియు మహోన్నతుడైన అల్లాహ్ భయభీతిని కలిగి ఉండటం తప్పనిసరైన విధి.

وَاِذْ اَخَذَ اللّٰهُ مِیْثَاقَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ لَتُبَیِّنُنَّهٗ لِلنَّاسِ وَلَا تَكْتُمُوْنَهٗ ؗۗ— فَنَبَذُوْهُ وَرَآءَ ظُهُوْرِهِمْ وَاشْتَرَوْا بِهٖ ثَمَنًا قَلِیْلًا ؕ— فَبِئْسَ مَا یَشْتَرُوْنَ ۟
మరియు ప్రవక్త - గుర్తుంచుకోండి,గ్రంధవహులైన యూదులు మరియు క్రైస్తవులలోని పండితులతో ;వారు ప్రజలకు ఖచ్చితంగా అల్లాహ్ గ్రంధాన్ని వివరించి చెప్పాలి’మరియు అందులోని మార్గదర్శనాలను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ దైవదౌత్యాన్ని సూచించే రుజువులు మీరు దాచకూడదు’అని గట్టి ఒడంబడికను అల్లాహ్ తీసుకున్నాడు,కానీ వారు ఆ ప్రమాణాన్ని విసిరేశారు,పట్టించుకోలేదు,ఆపై వారు సత్యాన్ని దాచారు మరియు అసత్యాన్ని చూపించారు,మరియు అల్లాహ్ ప్రమాణాన్ని తుచ్చ మూల్యానికి బదులుగా అంటే గౌరవం,డబ్బు పొందడానికి మార్పిడి చేసుకున్నారు,వీరు అల్లాహ్ ప్రమాణానికి బదులుగా మార్పిడి చేసుకున్న ఈ మూల్యం అతిహీనమైనది.
Arabische uitleg van de Qur'an:
لَا تَحْسَبَنَّ الَّذِیْنَ یَفْرَحُوْنَ بِمَاۤ اَتَوْا وَّیُحِبُّوْنَ اَنْ یُّحْمَدُوْا بِمَا لَمْ یَفْعَلُوْا فَلَا تَحْسَبَنَّهُمْ بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِ ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
మీరు అస్సలు భావించకండి-ఓ ప్రవక్త - వారు పనికిమాలిన పనులను చేసి సంతోషిస్తారు మరియు ప్రజలు వారు చేయని మంచి పనులకు ప్రశంసించడాన్ని’ఇష్టపడతారు’మీరు వారిపట్ల శిక్ష నుండి తప్పించుకుని బ్రతికిపోతారని అస్సలు భావించకండి,బదులుగా నరకం వారి నివాసమై ఉంటుంది,వారికి అందులో బాధాకరమైన శిక్ష ఉంటుంది.
Arabische uitleg van de Qur'an:
وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠
మరియు ఏకైకుడైన అల్లాహ్’కు మాత్రమే భూమ్యాకాశాలపై మరియు అందులో ఉన్న దానిపై సృష్టి మరియు నిర్వహణ పరంగా ‘సార్వబౌమత్వం’కలదు,అల్లాహ్ ప్రతీది చేయగల సమర్థుడు.
Arabische uitleg van de Qur'an:
اِنَّ فِیْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافِ الَّیْلِ وَالنَّهَارِ لَاٰیٰتٍ لِّاُولِی الْاَلْبَابِ ۟ۚۖ
ఎటువంటి ప్రణాళిక లేకుండా భూమ్యాకాశాలను సృజించడం,రేయింభవళ్లు వెనువెంటనే రావడం,మరియు వాటిలో ఏర్పడే హెచ్చుతగ్గుల వ్యత్యాసాలలో ‘వివేచనపరుల’ కొరకు స్పష్టమైన సూచనలు ఉన్నాయి,ఆ సూచనలు ఆరాధనకు అర్హుడైన ఏకైకుడిని విశ్వసామ్రాజ్య సృష్టికర్తను సూచిస్తాయి.
Arabische uitleg van de Qur'an:
الَّذِیْنَ یَذْكُرُوْنَ اللّٰهَ قِیٰمًا وَّقُعُوْدًا وَّعَلٰی جُنُوْبِهِمْ وَیَتَفَكَّرُوْنَ فِیْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— رَبَّنَا مَا خَلَقْتَ هٰذَا بَاطِلًا ۚ— سُبْحٰنَكَ فَقِنَا عَذَابَ النَّارِ ۟
వారు తమ పరిస్థితులన్నిటిలో అనగా నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు,పడుకున్నప్పుడు,మరియు భూమ్యాకాశాల నిర్మాణం పై తమ ఆలోచనను లగ్నం చేసి ఇలా అంటారు : ఓ మా ప్రభూ! నీవు ఇంతటి మహా విశ్వాన్ని పనికిమాలినది గా సృష్టించలేదు,నీవు వ్యర్ధము నుంచి పరిశుద్దపర్చావు,మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు,సత్కార్యాల భాగ్యాన్ని ప్రసాదించు మరియు దుష్కార్యాల నుండి రక్షించు.
Arabische uitleg van de Qur'an:
رَبَّنَاۤ اِنَّكَ مَنْ تُدْخِلِ النَّارَ فَقَدْ اَخْزَیْتَهٗ ؕ— وَمَا لِلظّٰلِمِیْنَ مِنْ اَنْصَارٍ ۟
నిశ్చయంగా నీవు –ఓ మా ప్రభూ-నీ సృష్టిలో ఎవరినైతే నరకంలో పడేస్తావో నిస్సందేహంగా అతన్ని నీవు అవమానించావు మరియు పరాభావానికి గురిచేసావు. పునరుత్తానదినమున దుర్మార్గులను అల్లాహ్ యొక్క హింస మరియు శిక్షనుంచి కాపాడే ఆపద్భాంధవులెవరూ ఉండరు.
Arabische uitleg van de Qur'an:
رَبَّنَاۤ اِنَّنَا سَمِعْنَا مُنَادِیًا یُّنَادِیْ لِلْاِیْمَانِ اَنْ اٰمِنُوْا بِرَبِّكُمْ فَاٰمَنَّا ۖۗ— رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَكَفِّرْ عَنَّا سَیِّاٰتِنَا وَتَوَفَّنَا مَعَ الْاَبْرَارِ ۟ۚ
"ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము:ఈమాన్ వైపుకు ఆహ్వానిస్తున్న –మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్-ఇలా ఆహ్వానిస్తున్నప్పుడు-: 'ఏకైక ఆరాధ్యుడైన మీ ప్రభువును విశ్వసించండి’అని’ మేము ఆయన ఆహ్వానించిన సందేశాన్ని విశ్వసించాము,మరియు ఆయన ధర్మశాసనాలను అనుసరించాము,కాబట్టి మీరు మా పాపాలను కప్పివేయండి’వాటిని బహిర్గతపర్చవద్దు,మరియు మా తప్పిదాలను మన్నించండి వాటికి బదులుగా మమ్ములను పట్టుకోవద్దు,సత్కార్యాలు చేయు సద్బుద్దిని మరియు దుష్కార్యాలకు దూరంగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించి సత్పురుషులతో పాటు మరణాన్ని ప్రసాదించు.
Arabische uitleg van de Qur'an:
رَبَّنَا وَاٰتِنَا مَا وَعَدْتَّنَا عَلٰی رُسُلِكَ وَلَا تُخْزِنَا یَوْمَ الْقِیٰمَةِ ؕ— اِنَّكَ لَا تُخْلِفُ الْمِیْعَادَ ۟
"ఓ మా ప్రభూ! మరియు నీ ప్రవక్తల నోటిద్వారా నీవు మాకు చేసిన ప్రాపంచిక‘మార్గదర్శనం మరియు సాఫల్య’ వాగ్దానాలను మాకు ఇవ్వండి. మరియు పరలోకదినాన నరకాగ్నిపాలు చేసి మమ్ము అవమానపర్చకు,నిశ్చయంగా –ఓ మా ప్రభువా-దయామయుడవు-,నీవు నీ వాగ్దానాలను భంగం చేయవు".
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• من صفات علماء السوء من أهل الكتاب: كتم العلم، واتباع الهوى، والفرح بمدح الناس مع سوء سرائرهم وأفعالهم.
గ్రంధవహులైన దుష్టపండితుల కొన్ని గుణాలు:- జ్ఞానాన్ని దాచడం,మనోవాంఛలను అనుసరించడం,చెడు రహస్యాలు మరియు కర్మలు కలిగికూడా ప్రజల పొగడ్తల పై పరవశించిపోవడం.

• التفكر في خلق الله تعالى في السماوات والأرض وتعاقب الأزمان يورث اليقين بعظمة الله وكمال الخضوع له عز وجل.
•భూమ్యాకాశాల సృష్టి,ఒకదాని వెంబడి మరొకటి క్రమంగా కాలాలు మారడం”అల్లాహ్ పట్ల గొప్పతనాన్ని మరియు ఆయన కొరకు సంపూర్ణ సమర్పణ’యొక్క విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి.

• دعاء الله وخضوع القلب له تعالى من أكمل مظاهر العبودية.
•అల్లాహ్’ను పిలువడం మరియు మహోన్నతుడైన ఆయన కొరకు హృదయాన్ని సమర్పించడం దైవదాస్యపు సంపూర్ణ గుణాలలోనివి.

فَاسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ اَنِّیْ لَاۤ اُضِیْعُ عَمَلَ عَامِلٍ مِّنْكُمْ مِّنْ ذَكَرٍ اَوْ اُ ۚ— بَعْضُكُمْ مِّنْ بَعْضٍ ۚ— فَالَّذِیْنَ هَاجَرُوْا وَاُخْرِجُوْا مِنْ دِیَارِهِمْ وَاُوْذُوْا فِیْ سَبِیْلِیْ وَقٰتَلُوْا وَقُتِلُوْا لَاُكَفِّرَنَّ عَنْهُمْ سَیِّاٰتِهِمْ وَلَاُدْخِلَنَّهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۚ— ثَوَابًا مِّنْ عِنْدِ اللّٰهِ ؕ— وَاللّٰهُ عِنْدَهٗ حُسْنُ الثَّوَابِ ۟
అప్పుడు వారి ప్రభువు వారి దుఆకు సమాధానమిచ్చాడు:-నేను మీ పనుల ప్రతిఫలాన్నిపెంచి లేదా తగ్గించి వృధా చేయను అది మగవారైనా, ఆడవారైనా సరే, మీరందరూ ఒకరికొకరు (సమానులు)ఒకే సమాజానికి చెందినవారుగా తీర్పు చేశాడు,పురుషుడికి ఎక్కువ స్త్రీకు తక్కువగా చేయబడదు,అల్లాహ్ మార్గంలో వలసవెళ్లినవారు,మరియు తమ ఇంటి నుండి కాఫిరుల ద్వారా వెళ్లగొట్టబడినవారు,తమ ప్రభువుకు విధేయత చూపినందుకు కలిగిన నష్టం,మరియు దైవపోరాట యుద్దంలో పాల్గున్నవారు మరియు ‘అల్లాహ్ యొక్క కలిమా’గొప్పతనానికై ప్రాణత్యాగం చేసినవారు-దైవమార్గంలో ‘అల్లాహ్ యొక్క కలిమా’గొప్పతనానికై పోరాడారు మరియు చంపబడ్డారు – నేను ఖచ్చితంగా పరలోకంలో వీరందరి పాపాలను క్షమిస్తాను,మరియు వారి తప్పిదాలను తుడిచివేస్తాను,అంతేకాదు ‘వారిని స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాము,వాటి భవనాల క్రింది నుంచి నదులు ప్రవహిస్తాయి,అల్లాహ్ తరుపు నుండి ఇది గొప్ప బహుమతి,అల్లాహ్ వద్ద సర్వోత్తమమైన సాటిలేని ప్రతిఫలం ఉంది.
Arabische uitleg van de Qur'an:
لَا یَغُرَّنَّكَ تَقَلُّبُ الَّذِیْنَ كَفَرُوْا فِی الْبِلَادِ ۟ؕ
ఓ దైవప్రవక్త -దేశాలలోని అవిశ్వాసుల సంచారం,దానిలో వారి నైపుణ్యం మరియ వాణిజ్యం,జీవనోపాధి యొక్క వైశాల్యత మిమ్మల్ని అస్సలు మోసానికి గురిచేయకూడదు –ఎందుకంటే మీరు వారి పరిస్థితి పట్ల ఆందోళన మరియు విచారణకు గురవుతారు.
Arabische uitleg van de Qur'an:
مَتَاعٌ قَلِیْلٌ ۫— ثُمَّ مَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ— وَبِئْسَ الْمِهَادُ ۟
ఈ ప్రపంచం అత్యల్పమైన సుఖసామగ్రి,అశాశ్వతమైనది.దీని తరువాత వారి కొరకు నివాసం ఉంది దానివైపునకే పరలోకదినాన మరలుతారు: అదియే నరకం,నరకాగ్ని’ అత్యంత హీనమైన పడకలు గలది.
Arabische uitleg van de Qur'an:
لٰكِنِ الَّذِیْنَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ جَنّٰتٌ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا نُزُلًا مِّنْ عِنْدِ اللّٰهِ ؕ— وَمَا عِنْدَ اللّٰهِ خَیْرٌ لِّلْاَبْرَارِ ۟
కానీ తన ప్రభువు ఆజ్ఞలను పాటిస్తూ ఆయన నిషేధాల నుండి సంరక్షించుకుంటూ భయభీతి చెందే వారికొరకు,భవనాల క్రింద నుండి నదులు ప్రవహించే స్వర్గ వనాలు ఉన్నాయి,అందులో వారు శాశ్వతంగా ఉంటారు,ఇది మహోన్నతుడైన అల్లాహ్ తరుపు నుండి సిద్దంచేయబడిన ప్రతిఫలం,అల్లాహ్ తన సత్పురుషులైన దాసుల కొరకు సిద్దం చేసిపెట్టిన ఈ ప్రతిఫలం 'కాఫిరులు అనుభవించే ప్రాపంచిక సుఖాల కంటే ఎంతో మేలైనది మరియు అతిఉత్తమమైనది.
Arabische uitleg van de Qur'an:
وَاِنَّ مِنْ اَهْلِ الْكِتٰبِ لَمَنْ یُّؤْمِنُ بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ اِلَیْكُمْ وَمَاۤ اُنْزِلَ اِلَیْهِمْ خٰشِعِیْنَ لِلّٰهِ ۙ— لَا یَشْتَرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ ثَمَنًا قَلِیْلًا ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ؕ— اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟
గ్రంధవహులంతా సమానం కాదు,వారిలో ఒక సమూహం అల్లాహ్’ను మరియు వారివద్దకి ఆయన దింపిన సత్యాన్ని మరియు మార్గదర్శనాలను విశ్వసిస్తారు,మరియు వారి వైపుకు అవతరింపబడిన గ్రంధాలను విశ్వసిస్తారు,దైవసందేశహరుల మధ్య ఎలాంటి తారతమ్యతను చేయరు,అల్లాహ్ కొరకు లొంగిపోతారు ఆయన వద్దనున్న దానిని కోరుకుంటారు,ప్రాపంచిక సుఖాల కొరకు అల్పమూల్యానికి అల్లాహ్ ఆయతులను మార్పిడి చేసుకోరు. ప్రభువు వద్ద వారి కొరకు సిద్దం చేయబడిన గొప్పబహుమతి కొరకు అర్హులైన ఆ గుణవంతులు వీరే,నిశ్చయంగా కర్మలపై అతిత్వరగా అల్లాహ్ లెక్క తీసుకుంటాడు,మరియు అతితొందరగా దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు.
Arabische uitleg van de Qur'an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اصْبِرُوْا وَصَابِرُوْا وَرَابِطُوْا ۫— وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟۠
అల్లాహ్’ని విశ్వసించి,ఆయన దూతను అనుసరించే వారలారా,షరీఆ పరమైన ఇబ్బందుల పై మరియు ప్రాపంచిక విపత్తుల పై మీరు ఓపికపట్టండి. సహనంతో మీరు సత్యతిరస్కారులైన కాఫిరులపై ఆధిక్యతను పొందవచ్చు,ఓర్పులో మీకంటే ఎక్కువ సహించేవారు లేరు,దైవమార్గంలో జిహాదును నెలకొల్పండి,అల్లాహ్ ఆదేశాలను పాలిస్తూ,నిషేధాలకు దూరంగా ఉంటూ భయభీతిని కలిగి ఉండండి,బహుశా మీరు ఆశించే నరక రక్షణ మరియు స్వర్గప్రవేశం పొందుతారు.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• الأذى الذي ينال المؤمن في سبيل الله فيضطره إلى الهجرة والخروج والجهاد من أعظم أسباب تكفير الذنوب ومضاعفة الأجور.
దైవమార్గంలో విశ్వాసికి కలిగే నష్టం,హిజ్రతు,ఇంటినుండి వెళ్ళకొట్టబడటం మరియు జిహాద్’మొదలైనవి ‘పాపాలను తుడిచిపెట్టడానికి మరియు ప్రతి ఫలాలూ రెట్టింపు చేయడానికి గల గొప్ప కారణాలు.

• ليست العبرة بما قد ينعم به الكافر في الدنيا من المال والمتاع وإن عظم؛ لأن الدنيا زائلة، وإنما العبرة بحقيقة مصيره في الآخرة في دار الخلود.
‘గుణపాఠం పొందటం’ అంటే ఈ ప్రపంచంలో డబ్బు మరియు ఆస్తుల పరంగా అవిశ్వాసి ఆనందించేది కాదు,ఇవన్నీగొప్పవైనప్పటికీ ప్రపంచం అంతమైపోతుంది,వాస్తవానికి నిజమైన ‘గుణపాఠం’పరలోకంలో వారి యొక్క శాశ్వతమైన నివాస స్థలం.

• من أهل الكتاب من يشهدون بالحق الذي في كتبهم، فيؤمنون بما أنزل إليهم وبما أنزل على المؤمنين، فهؤلاء لهم أجرهم مرتين.
గ్రంధవహులలో తమ పుస్తకాలలో ఉన్న సత్యానికి ఎవరైతే ‘సాక్ష్యమిస్తూ ,వారివైపుకు అవతరింపబడిన దాన్ని విశ్వసించి మరియు ముస్లిములపై అవతరించిన దాన్ని కూడా విశ్వసించినట్లైతే అలాంటి వారికొరకు రెండు రేట్ల ప్రతిఫలం ఉంది.

• الصبر على الحق، ومغالبة المكذبين به، والجهاد في سبيله، هو سبيل الفلاح في الآخرة.
•సత్యం పట్ల సహనం, సత్యతిరస్కారులపై ఆధిక్యత,దైవమార్గంలో పోరాడే జిహాదు,పరలోక సాఫల్యానికి మార్గాలు.

 
Vertaling van de betekenissen Surah: Soerat Aal-Imraan ( Het Huis van Imraan )
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Index van vertaling

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Sluit