Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Āl-‘Imrān   Ayah:
رَبَّنَاۤ اٰمَنَّا بِمَاۤ اَنْزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُوْلَ فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِیْنَ ۟
ఈసా అలైహిస్సలాం శిష్యులు కూడా ఇలా అన్నారు: ఓ మా ప్రభువా! మీరు అవతరింపజేసిన ఇంజీలును మేము విశ్వసించాము మరియు మేము ప్రవక్త ఈసా అలైహిస్సలాంను అనుసరించాము. కాబట్టి మమ్ముల్ని నీపై మరియు నీ ప్రవక్తలపై విశ్వాసం కలిగి ఉండే మరియు సత్యానికి సాక్షులుగా ఉండే వారిలా చేయి.
Arabic explanations of the Qur’an:
وَمَكَرُوْا وَمَكَرَ اللّٰهُ ؕ— وَاللّٰهُ خَیْرُ الْمٰكِرِیْنَ ۟۠
ఇశ్రాయేలీయులలోని అవిశ్వాసులు ఈసా అలైహిస్సలాం ను చంపడానికి పన్నాగం పన్నారు, కాబట్టి అల్లాహ్ వారిని వారి మార్గభ్రష్టత్వంలో వదిలి వేశాడు; మరియు ఆయనను చంపడానికి పన్నాగం పన్నిన ఆయన శిష్యుడిని ఈసా అలైహిస్సలాం (యేసు) మాదిరి కనబడేలా చేశాడు. అల్లాహ్ అత్యుత్తమంగా పన్నాగం పన్నే వాడు, ఎందుకంటే ఆయన శత్రువులపై ఆయన పన్నాగం కంటే తీవ్రమైనది మరొకటి ఉండదు.
Arabic explanations of the Qur’an:
اِذْ قَالَ اللّٰهُ یٰعِیْسٰۤی اِنِّیْ مُتَوَفِّیْكَ وَرَافِعُكَ اِلَیَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِیْنَ كَفَرُوْا وَجَاعِلُ الَّذِیْنَ اتَّبَعُوْكَ فَوْقَ الَّذِیْنَ كَفَرُوْۤا اِلٰی یَوْمِ الْقِیٰمَةِ ۚ— ثُمَّ اِلَیَّ مَرْجِعُكُمْ فَاَحْكُمُ بَیْنَكُمْ فِیْمَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ ۟
ఈసా అలైహిస్సలాం తో ఇలా చెప్పడం ద్వారా అల్లాహ్ వారికి వ్యతిరేకంగా ప్రణాళిక వేశాడు : ఓ ఈసా! నేను నిన్ను సజీవంగా పైకి తీసుకువెళతాను, నీ శరీరాన్ని మరియు ఆత్మను నా వద్దకు లేపుతాను, నిన్ను విశ్వసించని వారి మురికిని తొలగించి, నిన్ను వారికి దూరం చేస్తాను. నిన్ను అనుసరించే వారిని ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ను అంతిమ ప్రవక్తగా విశ్వసించడంతో పాటు సత్యధర్మాన్ని పాటించేలా చేస్తాను; మరియు పునరుత్థాన దినం వరకు నిన్ను నమ్మని వారిపై వారి వద్ద గొప్ప ఋజువు మరియు గౌరవమూ ఉంటుంది. చివరికి పునరుత్థాన దినాన మీరు నా వైపు మాత్రమే మరలి వస్తారు మరియు మీ విభేదాలకు సంబంధించి నేను మీ మధ్య నిజమైన తీర్పునిస్తాను.
Arabic explanations of the Qur’an:
فَاَمَّا الَّذِیْنَ كَفَرُوْا فَاُعَذِّبُهُمْ عَذَابًا شَدِیْدًا فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ؗ— وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِیْنَ ۟
నిన్నూ మరియు నీవు తెచ్చిన సత్యాన్నీ విశ్వసించని వారిని ఈ ప్రపంచంలో హత్యలకు గురి చేయడం ద్వారా, ఖైదీలుగా బంధించడం ద్వారా, అవమానానికి గురి చేయడం ద్వారా నేను కఠినంగా శిక్షిస్తాను; మరియు పరలోకంలో వారిని నరకాగ్నిలో పడవేసి, శిక్షిస్తాను. ఆ శిక్ష నుండి వారికి సహాయం చేసే వారెవ్వరూ ఉండరు.
Arabic explanations of the Qur’an:
وَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَیُوَفِّیْهِمْ اُجُوْرَهُمْ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ الظّٰلِمِیْنَ ۟
"నిన్నూ మరియు నీవు తీసుకువచ్చిన సత్యాన్నీ విశ్వసించి, (ఆరాధనలు, దానధర్మాలు, ఉపవాసాలు, రక్తసంబంధాలను కాపాడటం మొదలైన) మంచిపనులు చేసిన వారికి వారి ఆచరణలకు బదులుగా, ఎలాంటి తగ్గింపు లేకుండా అల్లాహ్ వారికి పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఆగమనానికి పూర్వపు మూసా అలైహిస్సలాం అనుచరులకు కూడా వర్తిస్తుంది. తన తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం రాబోతున్నారని మూసా అలైహిస్సలాం స్వయంగా ధృవీకరించి ఉన్నారు. అల్లాహ్ దుర్మార్గమునకు పాల్పడే వారిని ప్రేమించడు మరియు దుర్మర్గముల్లోంచి అతి పెద్ద దుర్మార్గం ఏదంటే అల్లాహ్ కు భాగస్వాములను ఆపాదించడం మరియు ఆయన ప్రవక్తలను నిరాకరించడం".
Arabic explanations of the Qur’an:
ذٰلِكَ نَتْلُوْهُ عَلَیْكَ مِنَ الْاٰیٰتِ وَالذِّكْرِ الْحَكِیْمِ ۟
మీకు చెప్పబడిన ఈసా అలైహిస్సలాం యొక్క ఈ వృత్తాంతం మీకు వెల్లడి చేయబడిన సత్యాన్ని సూచించే స్పష్టమైన సంకేతాలలో ఒకటి. అల్లాహ్ గురించి ఆలోచించే వారి కొరకు ఇది ఒక నిర్దుష్టమైన సందేశం, ఎందుకంటే ఇందులో ఎలాంటి అబద్ధమూ లేదు.
Arabic explanations of the Qur’an:
اِنَّ مَثَلَ عِیْسٰی عِنْدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَ ؕ— خَلَقَهٗ مِنْ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟
"అల్లాహ్ వద్ద, ఈసా అలైహిస్సలాం సృష్టి యొక్క ఉదాహరణ ఆదమ్ అలైహిస్సలాం యొక్క సృష్టి లాంటిదే - అతను (ఆదము) తల్లిదండ్రులు లేకుండా మట్టి నుండి సృష్టించబడ్డాడు. అల్లాహ్ అతనితో కేవలం ఇలా అన్నాడు: ‘మనిషిగా మారు’. మరియు అతను వెంటనే అల్లాహ్ ఇచ్ఛ మేరకు మనిషిగా మారిపోయాడు. మరి, తల్లిదండ్రులు ఉభయులూ లేకుండా సృష్టించబడిన ఆదము అలైహిస్సలాంను మీరు మనిషిగా అంగీకరించిన తరువాత, కేవలం తండ్రి మాత్రమే లేకుండా సృష్టించ బడిన ఈసా అలైహిస్సలాంను మీరెలా దైవంగా భావించ గలరు ?
Arabic explanations of the Qur’an:
اَلْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُنْ مِّنَ الْمُمْتَرِیْنَ ۟
ఈసా అలైహిస్సలాం గురించి మీ ప్రభువైన అల్లాహ్ మీకు వెల్లడించినదే ఖచ్చితమైన సత్యము. కాబట్టి మీరు సందేహించే మరియు అనుమానించే వారిలో ఒకరు కాకండి. దానికి బదులుగా, మీ వద్ద ఉన్న సత్యంపై మీరు దృఢంగా ఉండండి.
Arabic explanations of the Qur’an:
فَمَنْ حَآجَّكَ فِیْهِ مِنْ بَعْدِ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ اَبْنَآءَنَا وَاَبْنَآءَكُمْ وَنِسَآءَنَا وَنِسَآءَكُمْ وَاَنْفُسَنَا وَاَنْفُسَكُمْ ۫— ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَلْ لَّعْنَتَ اللّٰهِ عَلَی الْكٰذِبِیْنَ ۟
ఓ ప్రవక్తా! క్రైస్తవులలో ఎవరైనా ఈసా అలైహిస్సలాం విషయానికి సంబంధించి మీతో వివాదానికి దిగితే, మీకు సరైన జ్ఞానం అందిన తరువాత కూడా అతను అల్లాహ్ దాసుడు కాదని మీతో వాదిస్తే, వారితో 'రండి! మా కొడుకులు మరియు మీ కొడుకులు; మా మహిళలు మరియు మీ మహిళలు; ఇంకా స్వయంగా మేము మరియు మీరు - మనమందరం ఒకచోట సమావేశమై, అబద్ధం చెప్పే వారిపై తన శాపాన్ని పంపమని అల్లాహ్ ను ప్రార్థిద్దాం.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• من كمال قدرته تعالى أنه يعاقب من يمكر بدينه وبأوليائه، فيمكر بهم كما يمكرون.
తన ధర్మం మరియు తన స్నేహితులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారిపై అల్లాహ్ తన పరిపూర్ణ శక్తితో తీవ్రమైన చర్య తీసుకుంటాడు.

• بيان المعتقد الصحيح الواجب في شأن عيسى عليه السلام، وبيان موافقته للعقل فهو ليس بدعًا في الخلقة، فآدم المخلوق من غير أب ولا أم أشد غرابة والجميع يؤمن ببشريته.
ఈసా అలైహిస్సలాంకు సంబంధించి సరైన విశ్వాసం గురించి చక్కటి వివరణ ఉన్నది. తండ్రి ప్రమేయం లేకుండా సృష్టించబడటం వలన అతడు కూడా దైవమని తప్పుగా అర్థం చేసుకున్న వారి విశ్వాసాన్ని అది స్పష్టంగా ఖండిస్తున్నది. ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా సృష్టించబడిన ఆదము సృష్టి మరింత విచిత్రమైనది, కానీ యావత్తు మానవజాతి అతడిని మానవుడిగా అంగీకరించింది కదా!

• مشروعية المُباهلة بين المتنازعين على الصفة التي وردت بها الآية الكريمة.
ఇద్దరి మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు, ఇద్దరిలో ఎవరు అసత్యంపై ఉంటే వారు అల్లాహ్ యొక్క శాపానికి గురి అవ్వాలని బహిరంగంగా ప్రమాణం చేసే విధానం చట్టబద్ధమైనదే.

 
Translation of the meanings Surah: Āl-‘Imrān
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close