Check out the new design

ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ * - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ


ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߝߐߘߊ ߘߏ߫: ߕߓߊߞߘߐߣߍ߲߫   ߟߝߊߙߌ ߘߏ߫:
وَلَوْ اَنَّ اَهْلَ الْقُرٰۤی اٰمَنُوْا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَیْهِمْ بَرَكٰتٍ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ وَلٰكِنْ كَذَّبُوْا فَاَخَذْنٰهُمْ بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟
మేము ప్రవక్తలను పంపించిన ఈ బస్తీల వారు వారి వద్దకు వారి ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని స్వీకరించి,పాపములను,అవిధేయ కార్యాలను విడనాడి తమ ప్రభువు పట్ల భయభీతి కలిగి ఉండి,ఆయన ఆదేశాలను పాటిస్తూ ఉంటే మేము వారిపై అన్ని వైపుల నుండి శుభాల ద్వారాలను తెరిచివేసేవారము. కాని వారు స్వీకరించనూలేదు,భయభీతి కలిగి ఉండలేదు. అంతే కాక వారి వద్దకు వారి ప్రవక్తలు తీసుకుని వచ్చిన దానిని తిరస్కరించారు. వారు చేసుకున్న పాపాలు,దుష్కర్మల వలన అకస్మాత్తుగా వారిని మేము శిక్ష ద్వారా పట్టుకున్నాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَفَاَمِنَ اَهْلُ الْقُرٰۤی اَنْ یَّاْتِیَهُمْ بَاْسُنَا بَیَاتًا وَّهُمْ نَآىِٕمُوْنَ ۟ؕ
అయితే తిరస్కారులైన ఈ బస్తీలవారు సుఖశాంతుల్లో మునిగి ఉండి నిదురపోతుండగా రాత్రిపూట వారి వద్దకు మా శిక్ష రావటం నుండి నిర్భయంగా ఉన్నారా ?.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَوَاَمِنَ اَهْلُ الْقُرٰۤی اَنْ یَّاْتِیَهُمْ بَاْسُنَا ضُحًی وَّهُمْ یَلْعَبُوْنَ ۟
లేదా వారు తమ ప్రాపంచిక కార్యాల వలన నిమగ్నమై ఉండటం చేత అశ్రద్దులై ఉన్న స్థితిలో పగటి మొదటి వేళలో మా శిక్ష వారి వద్దకు రావటం గురించి నిర్భయంగా ఉన్నారా ?.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَفَاَمِنُوْا مَكْرَ اللّٰهِ ۚ— فَلَا یَاْمَنُ مَكْرَ اللّٰهِ اِلَّا الْقَوْمُ الْخٰسِرُوْنَ ۟۠
మీరు దాని వైపున చూడండి అల్లాహ్ ఏ గడువునైతే వారికి ప్రసాదించి దాని ద్వారా వారికి బలాన్ని,ఆహారములో విశాలము (బర్కత్) ను ప్రసాదించి వారిని నెమ్మది నెమ్మదిగా (శిక్ష వైపునకు) తీసుకుని వెళ్ళటంకొరకు. ఏమీ ఈ బస్తీల వారిలోంచి తిరస్కారులైన వీరందరు అల్లాహ్ వ్యూహం నుండి,ఆయన రహస్య వ్యూహాల నుండి నిర్భయులైపోయారా ?. అల్లాహ్ వ్యూహం నుండి వినాశనమునకు గురయ్యే వారే నిర్భయులవుతారు. అనుగ్రహించబడిన వారు ఆయన వ్యూహం నుండి భయపడుతుంటారు. దాని ద్వారా ఆయన వారికి ప్రసాదించిన వాటి వలన వారు మోసపోరు. వారు మాత్రం తమపై ఆయన ఉపకారంగా భావిస్తారు. ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَوَلَمْ یَهْدِ لِلَّذِیْنَ یَرِثُوْنَ الْاَرْضَ مِنْ بَعْدِ اَهْلِهَاۤ اَنْ لَّوْ نَشَآءُ اَصَبْنٰهُمْ بِذُنُوْبِهِمْ ۚ— وَنَطْبَعُ عَلٰی قُلُوْبِهِمْ فَهُمْ لَا یَسْمَعُوْنَ ۟
మరియు తమ పూర్వ జాతులైన వారు తమ పాపముల వలన వినాశనమునకు గురి అయిన తరువాత భూమిలో ప్రతినిధులైన వారి కొరకు తేటతెల్లం కాలేదా ?. ఆ పిదప వారి పైకి సంభవించిన దాని వలన వారు గుణపాఠం నేర్చుకోలేదు. కాని వారు వారి కార్యాలనే చేశారు. అల్లాహ్ ఒకవేళ తన సంప్రదాయం ప్రకారం వారికి వారి పాపాల వలన శిక్షించదలచుకుంటే వారిని దానికి తప్పకుండా గురి చేస్తాడు అన్న విషయం వారికి తేటతెల్లం కాలేదా (అవగతం కాలేదా)?. మరియు వారి హృదయాలపై సీలు వేస్తాడు. వారు హితోపదేశం ద్వారా హితోపదేశం గ్రహించరు.వారికి హితోపదేశం ప్రయోజనం చేకూర్చదు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
تِلْكَ الْقُرٰی نَقُصُّ عَلَیْكَ مِنْ اَنْۢبَآىِٕهَا ۚ— وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ ۚ— فَمَا كَانُوْا لِیُؤْمِنُوْا بِمَا كَذَّبُوْا مِنْ قَبْلُ ؕ— كَذٰلِكَ یَطْبَعُ اللّٰهُ عَلٰی قُلُوْبِ الْكٰفِرِیْنَ ۟
వారందరు గతించిన బస్తీలవారైన నూహ్,హూద్,సాలిహ్,లూత్,షుఐబ్ జాతుల బస్తీలు. ఓ ప్రవక్తా మేము మీకు వారు దేనిపైనైతే ఉన్నారో తిరస్కారము,వ్యతిరేకత గురించి,దాని వలన వారిపై కురిసిన వినాశనమును గురించి చదివి వినిపిస్తాము. మీకు వారి సమాచారమిస్తాము అది గుణపాఠం నేర్చుకోదలచిన వారికి గుణపాఠం అవ్వటానికి,హితబోధన గ్రహించదలచిన వారికి హితబోధ అవటానికి. నిశ్చయంగా ఈ బస్తీలవారి వద్దకు వారి ప్రవక్తలు తాము నీతి మంతులు అనటానికి స్పష్టమైన ఆధారాలను తీసుకుని వచ్చారు. వారు దానిని తిరస్కరిస్తారని అల్లాహ్ ముందస్తు జ్ఞానంలో ఉండటం వలన వారు ప్రవక్తలు వచ్చినప్పుడు విశ్వసించే వారు కాదు. తమ ప్రవక్తలను తిరస్కరించే ఈ బస్తీలవారి హృదయాలపై అల్లాహ్ సీలు వేసినట్లే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించేవారి హృదయాలపై అల్లాహ్ సీలు వేస్తాడు. వారు విశ్వాసము కొరకు మార్గమును పొందలేరు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَمَا وَجَدْنَا لِاَكْثَرِهِمْ مِّنْ عَهْدٍ ۚ— وَاِنْ وَّجَدْنَاۤ اَكْثَرَهُمْ لَفٰسِقِیْنَ ۟
ప్రవక్తలు పంపించబడిన జాతులవారిని చాలా మందిని అల్లాహ్ ఆదేశించి వాటిని పూర్తి చేసినట్లు,పాటించినట్లు మేము పొందలేదు. వారు ఆయన ఆదేశాలను అనుసరించినట్లు మేము పొందలేదు. మేము వారిలో చాలా మందిని అల్లాహ్ విధేయత నుండి తొలగి పోయినట్లు మాత్రం పొందాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ثُمَّ بَعَثْنَا مِنْ بَعْدِهِمْ مُّوْسٰی بِاٰیٰتِنَاۤ اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ فَظَلَمُوْا بِهَا ۚ— فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِیْنَ ۟
మరియు మేము ఈ ప్రవక్తలందరి తరువాత మూసా అలైహిస్సలాంను ఆయన నిజాయితిని సూచించే మా వాదనలను,స్పష్టమైన ఆధారాలను ఇచ్చి ఫిర్ఔన్,అతని జాతి వారి వద్దకు పంపాము. అయితే వారు ఆ సూచనలను తిరస్కరించటం,వాటిపట్ల అవిశ్వాసమును చూపటం తప్ప ఇంకేమి చేయలేక పోయారు. అల్లాహ్ వారిని ముంచి వినాశనమునకు గురి చేశాడు. ఇహపరలోకాల్లో వారి వెనుక శాపమును అంటగట్టాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَقَالَ مُوْسٰی یٰفِرْعَوْنُ اِنِّیْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟ۙ
అల్లాహ్ మూసా అలైహిస్సలాంను ఫిర్ఔన్ వద్దకు పంపించినప్పుడు అతనితో ఇలా అన్నారు : ఓ ఫిర్ ఔన్ నిశ్చయంగా నేను సమస్త సృష్టిరాసుల సృష్టికర్త,వారి యజమాని,వారి కార్యనిర్వాహకుడి వద్ద నుండి ప్రవక్తగా పంపించబడ్డాను.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الإيمان والعمل الصالح سبب لإفاضة الخيرات والبركات من السماء والأرض على الأمة.
విశ్వాసము,సత్కార్యములు ఆకాశము,భూమి నుండి ఉమ్మత్ పై శుభాలు,మేళ్ళు కురవటానికి కారణమవుతాయి.

• الصلة وثيقة بين سعة الرزق والتقوى، وإنْ أنعم الله على الكافرين فإن هذا استدراج لهم ومكر بهم.
భంధుత్వము,జీవనోపాధిలో సమృద్ది,దైవ భీతికి మధ్య సంభంధమును కలుపును. ఒకవేళ అల్లాహ్ అవిశ్వాసపరులకు అనుగ్రహిస్తే నిశ్చయంగా అది వారిని నెమ్మది నెమ్మదిగా (శిక్ష వైపునకు) తీసుకుని వెళ్ళటం,వారి పట్ల ఒక వ్యూహం.

• على العبد ألا يأمن من عذاب الله المفاجئ الذي قد يأتي في أية ساعة من ليل أو نهار.
దాసుడు అకస్మాత్తుగా వచ్చే అల్లాహ్ శిక్ష నుండి నిర్భయంగా ఉండకూడదు. అది రాత్రి లేదా పగలు యొక్క ఏ ఘడియలోనైన వస్తుంది.

• يقص القرآن أخبار الأمم السابقة من أجل تثبيت المؤمنين وتحذير الكافرين.
ఖుర్ఆన్ పూర్వ జాతుల సమాచారములను విశ్వాసపరులను దృడపరచటాని,అవిశ్వాసపరులను హెచ్చరించటానికి తెలుపుతుంది.

 
ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߝߐߘߊ ߘߏ߫: ߕߓߊߞߘߐߣߍ߲߫
ߝߐߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ ߞߐߜߍ ߝߙߍߕߍ
 
ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ

ߡߍ߲ ߝߘߊߣߍ߲߫ ߞߎ߬ߙߊ߬ߣߊ ߞߘߐߦߌߘߊ ߕߌߙߌ߲ߠߌ߲ ߝߊ߲ߓߊ ߟߊ߫

ߘߊߕߎ߲߯ߠߌ߲