Check out the new design

ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ * - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ


ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߝߐߘߊ ߘߏ߫: ߖߘߍ߬ߟߊ߬ߛߊߦߌ   ߟߝߊߙߌ ߘߏ߫:
لَقَدِ ابْتَغَوُا الْفِتْنَةَ مِنْ قَبْلُ وَقَلَّبُوْا لَكَ الْاُمُوْرَ حَتّٰی جَآءَ الْحَقُّ وَظَهَرَ اَمْرُ اللّٰهِ وَهُمْ كٰرِهُوْنَ ۟
నిశ్చయంగా ఈ కపటులందరూ తబూక్ యుద్ధం కన్నా ముందు నుండే విశ్వాసపరుల మాటను వేరుచేసి,వారి ఐకమత్యమును చిందరవందర చేసి అల్లకల్లోలాలపై అత్యాశను చూపేవారు.ఓ ప్రవక్త వారు కుట్రలను పర్యాలోచన చేసి విషయాలను మీ కొరకు క్రమబద్దీకరించి చేసేవారు.బహుశ వారి కుట్రలు యుద్ధంలో మీ ధృఢ సంకల్పము పై ప్రభావము చూపుతాయని.చివరికి అల్లాహ్ సహాయము,ఆయన ప్రోత్సాహము మీ కొరకు వచ్చినది.మరియు వారు దానిపట్ల అయిష్టత చూపుతుండగా అల్లాహ్ తన ధర్మమును ఆధిక్యతను కలిగించాడు,తన శతృవులను అణచివేశాడు. ఎందుకంటే వారు సత్యము పై అసత్యమునకు విజయమును కోరుకునేవారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَمِنْهُمْ مَّنْ یَّقُوْلُ ائْذَنْ لِّیْ وَلَا تَفْتِنِّیْ ؕ— اَلَا فِی الْفِتْنَةِ سَقَطُوْا ؕ— وَاِنَّ جَهَنَّمَ لَمُحِیْطَةٌ بِالْكٰفِرِیْنَ ۟
మరియు కపటుల్లోంచి తయారు చేసుకున్న సాకులతో వంకలు పెట్టేవాడు ఇలా పలుకుతాడు : ఓ ప్రవక్త యుద్ధము నుండి వెనుక ఉండే విషయంలో నాకు అనుమతి ఇవ్వండి.రోమ్ శతృవుల స్త్రీలను నేను చూసినప్పుడు వారి పరీక్ష (ఫిత్నా) ద్వారా నాకు పాపము సంభవించకుండా ఉండేంత వరకు మీతో పాటు బయలుదేరటానికి మీరు నన్ను బలవంత పెట్టకండి.వినండి నిశ్చయంగా వారు పెద్ద పరీక్షలో దేని గురించి వారు వాదిస్తున్నారో దానిలో పడిపోయారు.అది కపటము పరీక్ష,వెనుక ఉండిపోయే పరీక్ష.నిశ్చయంగా నరకము ప్రళయ దినాన అవిశ్వాసపరులను చుట్టుముడుతుంది.వారిలోంచి ఎవరూ దాని నుండి తప్పించుకోలేరు.దాని నుండి పారిపోయే ఏ ప్రదేశమును వారు పొందలేరు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اِنْ تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ ۚ— وَاِنْ تُصِبْكَ مُصِیْبَةٌ یَّقُوْلُوْا قَدْ اَخَذْنَاۤ اَمْرَنَا مِنْ قَبْلُ وَیَتَوَلَّوْا وَّهُمْ فَرِحُوْنَ ۟
ఓ ప్రవక్తా ఒక వేళ మీకు సంతోషమును కలిగించే విజయము లేదా యుద్ధప్రాప్తి ద్వారా అల్లాహ్ అనుగ్రహము లభిస్తే వారు దాన్ని ఇష్టపడేవారు కాదు.మరియు దుఃఖం చెందేవారు.మరియు ఒక వేళ కష్టము లేదా శతృవు విజయం ద్వారా మీకు ఆపద కలిగితే ఈ కపటులందరు ఇలా అనేవారు : నిశ్చయంగా మేము మా స్వయం కొరకు జాగ్రత్తపడ్డాము . ఎందుకంటే విశ్వాసపరులు బయలుదేరినట్లు మేము యుద్ధం కొరకు బయలుదేరలేదు. వారికి మరణము,బంధీ అవ్వటం సంభవించినవి.ఆ తరువాత ఈ కపటులందరు శాంతి ద్వారా సంతోషపడుతూ తమ ఇంటి వారి వద్దకు మరలుతారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قُلْ لَّنْ یُّصِیْبَنَاۤ اِلَّا مَا كَتَبَ اللّٰهُ لَنَا ۚ— هُوَ مَوْلٰىنَا ۚ— وَعَلَی اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఈ కపటులందరితో ఇలా పలకండి : అల్లాహ్ మా కొరకు రాసినదే మాకు సంభవిస్తుంది పరిశుద్ధుడైన ఆయన మన యజమాని,మేము రక్షణ కోరుకునే రక్షణ నిలయము అతనే. మేము మా వ్యవహారాల్లో ఆయనపైనే నమ్మకమును కలిగి ఉంటాము.విశ్వాసపరులు తమ వ్యవహారాలను ఆయన ఒక్కడికే అప్పజెప్పుతారు.ఆయన వారికి చాలు,ఆయన చాలా మంచి కార్యసాధకుడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قُلْ هَلْ تَرَبَّصُوْنَ بِنَاۤ اِلَّاۤ اِحْدَی الْحُسْنَیَیْنِ ؕ— وَنَحْنُ نَتَرَبَّصُ بِكُمْ اَنْ یُّصِیْبَكُمُ اللّٰهُ بِعَذَابٍ مِّنْ عِنْدِهٖۤ اَوْ بِاَیْدِیْنَا ۖؗۗ— فَتَرَبَّصُوْۤا اِنَّا مَعَكُمْ مُّتَرَبِّصُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా అనండి : మాకు విజయం కలగాలని లేదా అమరగతి కలగాలని మీరు నిరీక్షిస్తున్నారా ?.మరియు అల్లాహ్ తన వద్ద నుండి మీపై శిక్షను కలిగించి మిమ్మల్ని వినాశనమునకు గురి చేయాలని లేదా మా చేతులతో మిమ్మల్ని హతమార్చి,మిమ్మల్ని బందీలుగా చేసి మిమ్మల్ని ఆయన శిక్షించాలని మేము నిరీక్షిస్తున్నాము.అప్పుడే కదా ఆయన మీతో పోరాడటానికి మాకు అనుమతినిచ్చాడు.అయితే మీరు మా పరిణామం గురించి నిరీక్షించండి,మేము మీ పరిణామం గురించి నిరీక్షిస్తున్నాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قُلْ اَنْفِقُوْا طَوْعًا اَوْ كَرْهًا لَّنْ یُّتَقَبَّلَ مِنْكُمْ ؕ— اِنَّكُمْ كُنْتُمْ قَوْمًا فٰسِقِیْنَ ۟
ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : మీరు ఖర్చు చేయవలసినదేదో ఇష్టంతో లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేయండి.మీ అవిశ్వాసము వలన,మీరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగటం వలన మీరు ఖర్చు చేసిన దానిలో నుంచి మీ నుండి స్వీకరించబడదు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَمَا مَنَعَهُمْ اَنْ تُقْبَلَ مِنْهُمْ نَفَقٰتُهُمْ اِلَّاۤ اَنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَبِرَسُوْلِهٖ وَلَا یَاْتُوْنَ الصَّلٰوةَ اِلَّا وَهُمْ كُسَالٰی وَلَا یُنْفِقُوْنَ اِلَّا وَهُمْ كٰرِهُوْنَ ۟
వారు చేసే ఖర్చులు స్వీకరించబడటం నుంచి మూడు విషయములు ఆపినవి : అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త పట్ల వారి అవిశ్వాసము,వారు నమాజు పాటించేటప్పుడు వారి బద్దకము,వారి సోమరతనము,వారు తమ సంపదను ఇష్టముతో ఖర్చు చేసేవారు కాదు,వారు వాటిని ఖర్చు చేసినా బద్దకంతో ఖర్చు చేసేవారు.ఎందుకంటే వారు తమ నమాజుల్లో,తమ ఖర్చు చేయటంలో పుణ్యాన్ని ఆశించేవారు కాదు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• دأب المنافقين السعي إلى إلحاق الأذى بالمسلمين عن طريق الدسائس والتجسس.
కుట్రలు,కుతంత్రాలు చేస్తూ ముస్లిములకు హాని తలపెట్టటం కపటుల అలవాటు.

• التخلف عن الجهاد مفسدة كبرى وفتنة عظمى محققة، وهي معصية لله ومعصية لرسوله.
యుద్ధ పోరాటము నుండి వెనుక ఉండిపోవటం వలన పెద్ద ప్రమాదము,మహా ఉపద్రవము ఏర్పడుతుంది.మరియు అది అల్లాహ్ అవిధేయత,ఆయన ప్రవక్త పట్ల అవిధేయత అవుతుంది.

• في الآيات تعليم للمسلمين ألا يحزنوا لما يصيبهم؛ لئلا يَهِنوا وتذهب قوتهم، وأن يرضوا بما قدَّر الله لهم، ويرجوا رضا ربهم؛ لأنهم واثقون بأن الله يريد نصر دينه.
ఆయతుల్లో ముస్లిముల కొరకు వారికి సంభవించిన వాటి వలన వారు దఃఖించకూడదని బోధన ఉన్నది.వారు బలహీనపడి వారి బలము నసించకుండా ఉండటానికి,అల్లాహ్ వారి కొరకు తఖ్దీరులో రాసిన దాని పట్ల వారు సంతుష్ట పడటానికి,తమ ప్రభువు మన్నతను వారు ఆశించటానికి ఎందుకంటే వారు అల్లాహ్ తన ధర్మ విజయాన్ని కోరుకుండటం వలన నమ్మకమును కలిగి ఉన్నారు.

• من علامات ضعف الإيمان وقلة التقوى التكاسل في أداء الصلاة والإنفاق عن غير رضا ورجاء للثواب.
నమాజును పాటించటంలో బద్దకము,ఇష్టం లేకుండా,పుణ్యాన్ని ఆశించకుండా ఖర్చు చేయటం విశ్వాసము యొక్క బలహీనత,దైవభీతి లోపమునకు సూచనల్లోంచివి.

 
ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߝߐߘߊ ߘߏ߫: ߖߘߍ߬ߟߊ߬ߛߊߦߌ
ߝߐߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ ߞߐߜߍ ߝߙߍߕߍ
 
ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ

ߡߍ߲ ߝߘߊߣߍ߲߫ ߞߎ߬ߙߊ߬ߣߊ ߞߘߐߦߌߘߊ ߕߌߙߌ߲ߠߌ߲ ߝߊ߲ߓߊ ߟߊ߫

ߘߊߕߎ߲߯ߠߌ߲