Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه سورت: نساء   آیت:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُوْنُوْا قَوّٰمِیْنَ بِالْقِسْطِ شُهَدَآءَ لِلّٰهِ وَلَوْ عَلٰۤی اَنْفُسِكُمْ اَوِ الْوَالِدَیْنِ وَالْاَقْرَبِیْنَ ۚ— اِنْ یَّكُنْ غَنِیًّا اَوْ فَقِیْرًا فَاللّٰهُ اَوْلٰی بِهِمَا ۫— فَلَا تَتَّبِعُوا الْهَوٰۤی اَنْ تَعْدِلُوْا ۚ— وَاِنْ تَلْوٗۤا اَوْ تُعْرِضُوْا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرًا ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు మీ అన్ని పరిస్థితులలో న్యాయం విషయంలో స్థిరంగా ఉండేవారై ఉండండి ప్రతీ ఒక్కరితో సత్యంతో కూడుకున్న సాక్ష్యమును పలికేవారై ఉండండి. ఒక వేళ అది సత్యం విషయంలో మీ స్వయమునకు లేదా మీ తల్లిదండ్రులకు లేదా మీ బంధువులకు వ్యతిరేకంగా మీరు అంగీకరించవలసినా సరే. మరియు ఎవరి పేదరికం గాని లేదా ధనికం గాని మీకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకటానికి లేదా దాన్ని వదిలివేయటానికి మిమ్మల్ని పురిగొల్పకూడదు. అల్లాహ్ పేదవాడి పట్ల,ధనికుడి పట్ల మీ కన్న ఎక్కువగా (మంచి చేయటానికి) యోగ్యుడు మరియు వారి వారి ప్రయోజనాల గురించి బాగా తెలిసినవాడు. కావున మీరు మీ సాక్ష్యం పలికే విషయంలో మనోవాంఛలను అనుసరించకండి మీరు ఆ విషయంలో సత్యం నుండి మరలిపోకుండా ఉండటానికి. మరియు ఒక వేళ మీరు సాక్ష్యాన్ని వేరే విధంగా ప్రదర్శించడం ద్వారా వక్రీకరించినట్లయితే లేదా మీరు దానిని చేయడానికి (సాక్ష్యం ఇవ్వటానికి) నిరాకరించినట్లయితే; నిశ్ఛయంగా మీరు చేసేదాని గురించి అల్లాహ్ కు తెలుసు.
عربي تفسیرونه:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَالْكِتٰبِ الَّذِیْ نَزَّلَ عَلٰی رَسُوْلِهٖ وَالْكِتٰبِ الَّذِیْۤ اَنْزَلَ مِنْ قَبْلُ ؕ— وَمَنْ یَّكْفُرْ بِاللّٰهِ وَمَلٰٓىِٕكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ وَالْیَوْمِ الْاٰخِرِ فَقَدْ ضَلَّ ضَلٰلًا بَعِیْدًا ۟
ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల మరియు ఆయన తన ప్రవక్త పై అవతరింపజేసిన ఖుర్ఆన్ పట్ల మరియు ఆయన కన్న మునుపటి ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంధముల పట్ల మీ విశ్వాసము పై స్థిరంగా ఉండండి. మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల,ఆయన దూతల పట్ల,ఆయన గ్రంధముల పట్ల,ఆయన ప్రవక్తల పట్ల,ప్రళయదినము పట్ల అవిశ్వాసము చూపుతాడో అతడు సన్మార్గం నుండి చాలా దూరం అయిపోయాడు.
عربي تفسیرونه:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا ثُمَّ كَفَرُوْا ثُمَّ اٰمَنُوْا ثُمَّ كَفَرُوْا ثُمَّ ازْدَادُوْا كُفْرًا لَّمْ یَكُنِ اللّٰهُ لِیَغْفِرَ لَهُمْ وَلَا لِیَهْدِیَهُمْ سَبِیْلًا ۟ؕ
నిశ్చయంగా వారిలో నుండి విశ్వాసనంతరం పదేపదే అవిశ్వాసమునకు పాల్పడుతారో ఎలాగంటే విశ్వాసములో ప్రవేశించి ఆ తరువాత దాని నుండి మరలిపోయి ఆ తరువాత దానిలో ప్రవేశించి ఆ తరువాత దాని నుండి మరలిపోయి మరియు అవిశ్వాసముపై మొండిగా ఉండి దాని స్థితిలోనే మరణిస్తే అల్లాహ్ వారి పాపములను వారి కొరకు మన్నించడు. మరియు మహోన్నతుడైన ఆయన వైపునకు చేరవేసే సన్మార్గము వైపునకు వారికి భాగ్యమును కలిగించడు.
عربي تفسیرونه:
بَشِّرِ الْمُنٰفِقِیْنَ بِاَنَّ لَهُمْ عَذَابًا اَلِیْمَا ۟ۙ
ఓ ప్రవక్తా విశ్వాసమును బహిర్గతం చేసి అవిశ్వాసమును గోప్యంగా ఉంచిన కపటులకు అల్లాహ్ వద్ద ప్రళయదినమున బాధాకరమైన శిక్ష కలదని శుభవార్తనివ్వండి.
عربي تفسیرونه:
١لَّذِیْنَ یَتَّخِذُوْنَ الْكٰفِرِیْنَ اَوْلِیَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِیْنَ ؕ— اَیَبْتَغُوْنَ عِنْدَهُمُ الْعِزَّةَ فَاِنَّ الْعِزَّةَ لِلّٰهِ جَمِیْعًا ۟ؕ
ఈ శిక్ష ఎందుకంటే వారు విశ్వాసపరులను వదిలి అవిశ్వాసపరులను సహాయకులుగా,మద్దతు దారులుగా చేసుకున్నారు. మరియు నిశ్చయంగా అది ఆశ్చర్యకరమైనది ఏదైతే వారిని వారితో స్నేహం చేసేటట్లు చేసినదో. ఏమీ వారు వారి వద్ద బలమును,నివారణను వాటి ద్వారా వారు ఉన్నతులు అవటానికి ఆశిస్తున్నారా ?! నిశ్ఛయంగా బలము మరియు నివారణ అంతా అల్లాహ్ కే చెందుతుంది.
عربي تفسیرونه:
وَقَدْ نَزَّلَ عَلَیْكُمْ فِی الْكِتٰبِ اَنْ اِذَا سَمِعْتُمْ اٰیٰتِ اللّٰهِ یُكْفَرُ بِهَا وَیُسْتَهْزَاُ بِهَا فَلَا تَقْعُدُوْا مَعَهُمْ حَتّٰی یَخُوْضُوْا فِیْ حَدِیْثٍ غَیْرِهٖۤ ۖؗ— اِنَّكُمْ اِذًا مِّثْلُهُمْ ؕ— اِنَّ اللّٰهَ جَامِعُ الْمُنٰفِقِیْنَ وَالْكٰفِرِیْنَ فِیْ جَهَنَّمَ جَمِیْعَا ۟ۙ
ఓ విశ్వాసపరులారా నిశ్చయంగా అల్లాహ్ మీపై దివ్య ఖుర్ఆన్ లో అవతరింపజేశాడు మీరు ఏదైన సభలో కూర్చుని అందులో అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కరించి, వాటి పట్ల హేళన చేసే వారిని వింటే వారు అల్లాహ్ ఆయతుల పట్ల అవిశ్వాస మాటలు కాకుండా ,వాటి పట్ల హేళన చేసే మాటలు మాట్లాడనంత వరకు మీరు వారితో పాటు కూర్చోవటమును వదిలివేసి వారి సభ నుండి మరలిపోవటం మీపై తప్పనిసరి. నిశ్చయంగా అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కారము,వాటి పట్ల హేళన చేసే స్థితిలో మీరు విన్న తరువాత కూడా వారితో కూర్చుంటే అది వారిలాగే అల్లాహ్ ఆదేశము విబేధించటంలో వస్తుంది. ఎందుకంటే మీరు వారితో కూర్చోవటం వలన అల్లాహ్ కు అవిధేయత చూపారు ఏ విధంగానైతే వారు తమ అవిశ్వాసం వలన అల్లాహ్ కు అవిధేయత చూపారో. నిశ్చయంగా అల్లాహ్ తొందరలోనే ప్రళయదినమున విశ్వాసమును బహిర్గతం చేసి అవిశ్వాసమును గోప్యంగా ఉంచిన కపటులను నరకాగ్నిలో అవిశ్వాసపరులతో సమావేసపరుస్తాడు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• وجوب العدل في القضاء بين الناس وعند أداء الشهادة، حتى لو كان الحق على النفس أو على أحد من القرابة.
ప్రజల మధ్య తీర్పు నివ్వటంలో మరియు సాక్ష్యం ఇచ్చే సమయంలో న్యాయపూరితంగా వ్యవహరించటం తప్పనిసరి. చివరికి ఒక వేళ సత్యము స్వయానికి లేదా దగ్గరి బందువుల్లో ఎవరికైన వ్యతిరేకంగా ఉన్నా కూడా.

• على المؤمن أن يجتهد في فعل ما يزيد إيمانه من أعمال القلوب والجوارح، ويثبته في قلبه.
విశ్వాసపరుడు తన విశ్వాసమును అధికం చేసే హృదయ కార్యాలను,అవయవ కార్యాలను చేయటంలో కృషి చేయాలి మరియు దాన్ని (విశ్వాసమును) తన హృదయంలో స్థిర పరచాలి.

• عظم خطر المنافقين على الإسلام وأهله؛ ولهذا فقد توعدهم الله بأشد العقوبة في الآخرة.
ఇస్లాంనకు,దాని ప్రజలకు కపటుల ప్రమాదం తీవ్రమైనది. అందుకనే అల్లాహ్ వారికి పరలోకంలో తీవ్రమైన శిక్ష ద్వారా హెచ్చరించాడు.

• إذا لم يستطع المؤمن الإنكار على من يتطاول على آيات الله وشرعه، فلا يجوز له الجلوس معه على هذه الحال.
అల్లాహ్ ఆయతులకు మరియు ఆయన ధర్మమునకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి విశ్వాసపరుడు నిరాకరించలేక పోయినప్పుడు ఆ స్థితిలో అతనితో పాటు కూర్చుని ఉండటం అతనికి సమ్మతం కాదు.

 
د معناګانو ژباړه سورت: نساء
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول