Check out the new design

ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ශුද්ධ වූ අල්කුර්ආන් අර්ථ විවරණයේ සංෂිප්ත අනුවාදය - තෙලුගු පරිවර්තනය * - පරිවර්තන පටුන


අර්ථ කථනය වාක්‍යය: (189) පරිච්ඡේදය: අල් බකරා
یَسْـَٔلُوْنَكَ عَنِ الْاَهِلَّةِ ؕ— قُلْ هِیَ مَوَاقِیْتُ لِلنَّاسِ وَالْحَجِّ ؕ— وَلَیْسَ الْبِرُّ بِاَنْ تَاْتُوا الْبُیُوْتَ مِنْ ظُهُوْرِهَا وَلٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقٰی ۚ— وَاْتُوا الْبُیُوْتَ مِنْ اَبْوَابِهَا ۪— وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
ఓ ప్రవక్త వారు మిమ్మల్ని చంద్రుని గురించి దాని స్థితుల మార్పు గురించి ప్రశ్నిస్తున్నారు.వారికి సమాధానమిస్తూ దాని మర్మం ఏమిటో తెలియజేయండి: నిశ్చయంగా అవి ప్రజల కొరకు వేళలు,వాటి ద్వారా హజ్ మాసము,ఉపవాసముల మాసము,జకాత్ చెల్లించటంలో సంవత్సరం పూర్తి అవటం లాంటి వారి ఆరాధనల వేళలు తెలుసుకుంటారు మరియు రక్తపరిహారము,రుణాలను చెల్లించటానికి వేళల నిర్ధారణ లాంటి వ్యవహారాల్లో వారి వేళలను తెలుసుకుంటారు.హజ్ లేదా ఉమ్రాలో మీరు ఇహ్రామ్ స్థితిలో ఇళ్ళలోకి వాటి వెనుక వైపు నుండి రావటం మీరు అజ్ఞాన కాలంలో అనుకునే విధంగా సత్కార్యం కాదు.కాని వాస్తవానికి సత్కార్యం అన్నది బాహ్యపరంగా,అంతఃపరంగా అల్లాహ్ కి భయపడే వాడి సత్కార్యమే అసలైన సత్కార్యం.అయితే ఇండ్లలోకి మీ రావటం వాటి వాకిళ్ల నుండే జరగాలి.అది మీకు సులభతరమైనది,కష్టతరమైనది కాదు.ఎందుకంటే అల్లాహ్ మీపై కష్టమైన వాటిని,మీకు ఇబ్బంది కరమైన వాటిని భారంగా వేయడు.మీరు మీకు అల్లాహ్ శిక్షకు మధ్య రక్షణగా సత్కార్యములను చేసుకోండి.తద్వారా మీకు దేనిలోనైతే ఇష్టత ఉన్నదో దానిని పొంది సాఫల్యం పొందుతారు,దేనినుంచైతే మీరు భయపడుతున్నారో దాని నుండి రక్షణ పొందుతారు.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
මෙ⁣ම පිටුවේ තිබෙන වැකිවල ප්‍රයෝජන:
• مشروعية الاعتكاف، وهو لزوم المسجد للعبادة؛ ولهذا يُنهى عن كل ما يعارض مقصود الاعتكاف، ومنه مباشرة المرأة.
ధర్మబద్దంగా ఏతికాఫ్ అంటే ఆరాధనల కొరకు మస్జిద్లను పట్టుకుని ఉండటం,అందుకనే ఏతికాఫ్ ఉద్దేశానికి అడ్డు తగిలే వాటి నుండి ఆపడం జరిగింది,భార్యతో సమగామనం చేయటం అందులో నుంచే.

• النهي عن أكل أموال الناس بالباطل، وتحريم كل الوسائل والأساليب التي تقود لذلك، ومنها الرشوة.
అధర్మ పద్దతిలో ప్రజల సొమ్మును తినడం గురించి వారింపు,దానిని అనుసరించే కారకాలు,పద్దతుల నిషేదింపు,లంచమూ అందులో నుంచే.

• تحريم الاعتداء والنهي عنه؛ لأن هذا الدين قائم على العدل والإحسان.
అతిక్రమింపు ను నిషేదించటం,దాని నుండి వారించటం ఎందుకంటే ఈ ధర్మం న్యాయం, మంచితనం పై స్థాపించ బడింది.

 
අර්ථ කථනය වාක්‍යය: (189) පරිච්ඡේදය: අල් බකරා
සූරා පටුන පිටු අංක
 
ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ශුද්ධ වූ අල්කුර්ආන් අර්ථ විවරණයේ සංෂිප්ත අනුවාදය - තෙලුගු පරිවර්තනය - පරිවර්තන පටුන

අල්කුර්ආන් අධ්‍යයන සඳහා වූ තෆ්සීර් මධ්‍යස්ථානය විසින් නිකුත් කරන ලදී.

වසන්න