ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - පරිවර්තන පටුන


අර්ථ කථනය වාක්‍යය: (19) පරිච්ඡේදය: සූරා අල්-අහ්සාබ්
اَشِحَّةً عَلَیْكُمْ ۖۚ— فَاِذَا جَآءَ الْخَوْفُ رَاَیْتَهُمْ یَنْظُرُوْنَ اِلَیْكَ تَدُوْرُ اَعْیُنُهُمْ كَالَّذِیْ یُغْشٰی عَلَیْهِ مِنَ الْمَوْتِ ۚ— فَاِذَا ذَهَبَ الْخَوْفُ سَلَقُوْكُمْ بِاَلْسِنَةٍ حِدَادٍ اَشِحَّةً عَلَی الْخَیْرِ ؕ— اُولٰٓىِٕكَ لَمْ یُؤْمِنُوْا فَاَحْبَطَ اللّٰهُ اَعْمَالَهُمْ ؕ— وَكَانَ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرًا ۟
విశ్వాసపరుల సమాజము వారా వారు తమ సంపదల్లో మీపై పరమ పీనాసులు కాబట్టి వారు వాటిని ఖర్చు చేసి మీకు సహాయపడరు. మరియు వారు తమ ప్రాణముల విషయంలో పీనాసులు కాబట్టి వారు మీతోపాటు కలిసి యుద్ధం చేయరు. మరియు వారు తమ ప్రేమా అభిమానములో పీనాసులు కాబట్టి వారు మీపై ప్రేమా అభిమానములను వెలుబుచ్చరు. శతృవును ఎదుర్కున్నప్పుడు భయం వచ్చినప్పుడు ఓ ప్రవక్తా మీరు వారిని మీ వైపు చూస్తుండగా చూస్తారు వారి కళ్ళు పిరికితనం వలన మరణ ఘడియలను చూసిన వ్యక్తి రెండు కళ్ళు తిరిగినట్లు తిరుగుతుంటాయి. ఎప్పుడైతే వారి నుండి భయం తొలగిపోయి వారు నిశ్ఛింతగ ఉంటారో అప్పుడు వారు పదునైన నాలుకల ద్వారా మాటలతో మిమ్మల్ని బాధిస్తారు. యుద్ధ ప్రాప్తి పై అత్యాస కలిగిన వారు వాటి గురించి వెతుకుతూ మీ దగ్గరకు వస్తారు. ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరు వాస్తవానికి విశ్వసించరు. అందుకే అల్లాహ్ వారి కర్మల ప్రతిఫలాన్ని వృధా చేస్తాడు. ఈ వృధా చేయటం అల్లాహ్ పై చాలా తేలిక.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
මෙ⁣ම පිටුවේ තිබෙන වැකිවල ප්‍රයෝජන:
• الآجال محددة؛ لا يُقَرِّبُها قتال، ولا يُبْعِدُها هروب منه.
నిర్ణీత ఆయుషులు యుద్ధం వాటిని దగ్గరగా చేయదు మరియు దాని నుండి పారిపోవటం వాటి నుండి దూరం చేయదు.

• التثبيط عن الجهاد في سبيل الله شأن المنافقين دائمًا.
అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేయటం నుండి నిరుత్సాహపరచటం ఎల్లప్పుడు కపట విశ్వాసుల లక్షణం.

• الرسول صلى الله عليه وسلم قدوة المؤمنين في أقواله وأفعاله.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన మాటల్లో,ఆయన చేతల్లో విశ్వాసపరులకు ఆదర్శం.

• الثقة بالله والانقياد له من صفات المؤمنين.
అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండి ఆయనకు విధేయత చూపటం విశ్వాసపరుల గుణము.

 
අර්ථ කථනය වාක්‍යය: (19) පරිච්ඡේදය: සූරා අල්-අහ්සාබ්
සූරා පටුන පිටු අංක
 
ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - පරිවර්තන පටුන

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

වසන්න