Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Surja: El Bekare   Ajeti:
مَا نَنْسَخْ مِنْ اٰیَةٍ اَوْ نُنْسِهَا نَاْتِ بِخَیْرٍ مِّنْهَاۤ اَوْ مِثْلِهَا ؕ— اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
అల్లాహ్ స్పష్టపరుస్తున్నాడు ఆయన ఖుర్ఆన్ నుండి ఏదైన ఆయత్ యొక్క ఆదేశమును ఎత్తివేసినప్పుడు లేదా దాని పదములనే ఎత్తివేసినప్పుడు ఆయన వాటి నుండి ప్రజలను మరపింపజేస్తాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయన దాని కన్న ప్రయోజనకరమైన దాన్ని త్వరగా లేదా ఆలస్యంగా లేదా దానికి పోలినటువంటి వాటిని తీసుకుని వస్తాడు. మరియు ఇది అల్లాహ్ జ్ఞానముతో మరియు ఆయన విజ్ఞతతో. ఓ ప్రవక్త మీకు తెలుసు అల్లాహ్ ప్రతీది చేయగల సమర్ధుడని. కావున ఆయన తాను తలచుకున్నది చేస్తాడు. తాను కోరికున్నది నిర్ణయిస్తాడు.
Tefsiret në gjuhën arabe:
اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَمَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟
ఓ ప్రవక్త మీకు తెలుసు అల్లాహ్ భూమ్యాకాశముల సామ్రాజ్యాధిపతి అని. ఆయన తలచుకున్నది ఆయన నిర్ణయిస్తాడు. తాను తలచిన దాని గురించి తన దాసులకు ఆయన ఆదేశిస్తాడు. మరియు తాను తలచుకున్న వాటి నుండి వారిని వారిస్తాడు. ధర్మం నుండి తాను తలచుకున్న దాన్ని స్థాపిస్తాడు. మరియు తాను తలచుకున్న దాన్ని రద్దు పరుస్తాడు. మరియు మీ కొరకు అల్లాహ్ తరువాత మీ వ్యవహారములను పరిరక్షించే పరిరక్షకుడెవడూ ఉండడు. మరియు మీ నుండి కీడును తొలగించే ,హాయకుడెవడూ ఉండడు. కాని అల్లాహ్ యే వాటన్నిటి పరిరక్షకుడు మరియు దాన్ని చేసే సమర్ధుడు.
Tefsiret në gjuhën arabe:
اَمْ تُرِیْدُوْنَ اَنْ تَسْـَٔلُوْا رَسُوْلَكُمْ كَمَا سُىِٕلَ مُوْسٰی مِنْ قَبْلُ ؕ— وَمَنْ یَّتَبَدَّلِ الْكُفْرَ بِالْاِیْمَانِ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِیْلِ ۟
ఓ విశ్వాసులారా మీరు మీ ప్రవక్తను అభ్యంతరకరమైన,మొండిదైన ప్రశ్నను అడగటం మీ పని కాదు. ఏ విధంగానైతే మూసా అలైహిస్సలాం జాతివారు తమ ప్రవక్తను ఇంతకు ముందే అడిగారో. వారి మాట ఇలా ఉన్నది : أَرِنَا اللَّهَ جَهْرَةً﴾ [النساء: ١٥٣]﴿ "నీవు అల్లాహ్ ను మాకు ప్రత్యక్షంగా చూపించు". మరియు ఎవరైతే విశ్వాసమునకు బదులుగా అవిశ్వాసమును కోరుకుంటాడో అతడు సన్మార్గమైన మాధ్యే మార్గము నుండి తప్పిపోతాడు.
Tefsiret në gjuhën arabe:
وَدَّ كَثِیْرٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ یَرُدُّوْنَكُمْ مِّنْ بَعْدِ اِیْمَانِكُمْ كُفَّارًا ۖۚ— حَسَدًا مِّنْ عِنْدِ اَنْفُسِهِمْ مِّنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْحَقُّ ۚ— فَاعْفُوْا وَاصْفَحُوْا حَتّٰی یَاْتِیَ اللّٰهُ بِاَمْرِهٖ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
చాలా మంది యూదులు మరియు క్రైస్తవులు మీరు విశ్వాసం తీసుకుని వచ్చిన తరువాత మిమ్మల్ని అవిశ్వాసులుగా మరల్చాలనుకుంటున్నారు. ఏ విధంగానైతే మీరు విగ్రహాలను ఆరాధించేవారో. ఇది వారి మనస్సుల్లో ఉన్న అసూయ వలన. ప్రవక్త అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చినది సత్యం అని వారికి స్పష్టమైన తరువాత వారు ఇలా ఆశిస్తున్నారు. ఓ విశ్వాసులారా వారి చర్యలను క్షమించివేయండి. మరియు వారి అజ్ఞానమును మరియు వారి మనస్సుల్లో ఉన్న చెడును మన్నించివేయండి. వారి విషయంలో అల్లాహ్ తీర్పు వచ్చేంత వరకు. వాస్తవానికి అల్లాహ్ ఈ ఆదేశం,ఆయన తీర్పు వచ్చినది. మరియు అవిశ్వాసపరునికి ఇస్లాంను లేదా జిజియా ఇవ్వటంను లేదా యుద్దం చేయటంను ఎంపిక చేసుకునే అధికారం కలదు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. కాబట్టి వారు ఆయనను అశక్తుడిని చేయలేరు.
Tefsiret në gjuhën arabe:
وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ؕ— وَمَا تُقَدِّمُوْا لِاَنْفُسِكُمْ مِّنْ خَیْرٍ تَجِدُوْهُ عِنْدَ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
మరియు మీరు నమాజును దాని మూలవిషయాలతో,విధులతో,సున్నతులతో పరిపూర్ణంగా పాటించండి. మరియు మీరు మీ సంపదల నుండి జకాతును తీసి దాని హక్కుదారులకు ఇవ్వండి. మరియు మీరు ఏదైతే సత్కర్మను మీ ఇహలోక జీవితంలోనే చేసుకుని దాన్ని మీ మరణం కన్న ముందు మీ స్వయం కొరకు భద్రంగా పంపించుకుంటారో దాని పుణ్యమును మీరు ప్రళయదినమున మీ ప్రభువు వద్ద పొందుతారు. అప్పుడు ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేస్తున్న కర్మలను వీక్షిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి అతని కర్మ పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tefsiret në gjuhën arabe:
وَقَالُوْا لَنْ یَّدْخُلَ الْجَنَّةَ اِلَّا مَنْ كَانَ هُوْدًا اَوْ نَصٰرٰی ؕ— تِلْكَ اَمَانِیُّهُمْ ؕ— قُلْ هَاتُوْا بُرْهَانَكُمْ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మరియు యూదుల్లోంచి,క్రైస్తవుల్లోంచి ప్రతీ వర్గము నిశ్ఛయంగా స్వర్గము తమ కొరకు ప్రత్యేకించబడినదని తెలిపింది. యూదులు ఇలా పలికారు : అందులో యూదులు మాత్రమే ప్రవేశిస్తారు. మరియు క్రైస్తవులు ఇలా పలికారు : అందులో క్రైస్తవులు మాత్రమే ప్రవేశిస్తారు. ఇవి వారి అసత్య మనోవాంఛలు మరియు వారి చెడు భ్రమలు. ఓ ప్రవక్తా వారిని ఖండిస్తూ ఇలా పలకండి : ఒక వేళ మీరు మీ వాదనలో వాస్తవానికి సత్యవంతులే అయితే మీరు వాదిస్తున్న దానిపై మీ ఆధారమును తీసుకుని రండి.
Tefsiret në gjuhën arabe:
بَلٰی ۗ— مَنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَهُوَ مُحْسِنٌ فَلَهٗۤ اَجْرُهٗ عِنْدَ رَبِّهٖ ۪— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟۠
స్వర్గములో మాత్రం అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో ఉండి ఆయన వైపునకు మరలేవాడు ప్రవేశిస్తాడు. మరియు అతడు తన చిత్తశుద్ధితో పాటు ప్రవక్త తెచ్చిన దాన్ని అనుసరించటం ద్వారా తన ఆరాధనను మెరుగుపరచుకునేవాడై ఉంటాడు. అతడే స్వర్గములో ప్రవేశిస్తాడు అతడు ఏ వర్గములో నుంచి అయినా సరే. మరియు అతని కొరకు అతని ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంటుంది. పరలోకంలో వారు ఎదుర్కొనే వాటి గురించి వారిపై ఎటువంటి భయముండదు. మరియు ఇహలోకములో నుంచి వారు కోల్పోయిన దానిపై వారికి బాధ ఉండదు. మరియు ఈ లక్షణాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తరువాత ముస్లిముల్లో మాత్రమే నిరూపితమైనవి.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• أن الأمر كله لله، فيبدل ما يشاء من أحكامه وشرائعه، ويبقي ما يشاء منها، وكل ذلك بعلمه وحكمته.
వ్యవహారమంతా అల్లాహ్ కే చెందుతుంది. కావున ఆయన తన ఆదేశముల్లోంచి మరియు తన శాసనముల్లోంచి తాను తలచుకున్న వాటిని మార్చివేస్తాడు మరియు వాటిలో నుంచి తాను తలచుకున్న వాటిని అట్టే ఉంచుతాడు. మరియు ఇవన్ని ఆయన జ్ఞానముతో మరియు విజ్ఞతతో జరుగును.

• حَسَدُ كثيرٍ من أهل الكتاب هذه الأمة، لما خصَّها الله من الإيمان واتباع الرسول، حتى تمنوا رجوعها إلى الكفر كما كانت.
ఈ సమాజముపై గ్రంధవహుల తరపు నుండి చాలా అసూయ కలదు ఎందుకంటే అల్లాహ్ వారిని విశ్వాసముతో మరియు ప్రవక్తను అనుసరించటంతో ప్రత్యేకించాడు. చివరికి వారు తాము ఉన్న అవిశ్వాసం వైపునకు వారి మరలటమును ఆశించారు.

 
Përkthimi i kuptimeve Surja: El Bekare
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll