Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Surja: El Bekare   Ajeti:
وَلَنْ تَرْضٰی عَنْكَ الْیَهُوْدُ وَلَا النَّصٰرٰی حَتّٰی تَتَّبِعَ مِلَّتَهُمْ ؕ— قُلْ اِنَّ هُدَی اللّٰهِ هُوَ الْهُدٰی ؕ— وَلَىِٕنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَ الَّذِیْ جَآءَكَ مِنَ الْعِلْمِ ۙ— مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟ؔ
అల్లాహ్ తన ప్రవక్తను ఉద్దేశించి ఆయనకు దర్శకత్వం మరియు హెచ్చరిక చేస్తూ ఇలా పలికాడు : మీరు ఇస్లాంను వదిలి యూదులు మరియు క్రైస్తవులు ఉన్న దాన్ని అనుసరించనంతవరకు వారు మీతో సంతృప్తి చెందరు. ఒక వేళ ఇది మీతో లేదా మీ అనుచరులతో మీ వద్దకు వచ్చిన స్పష్టమైన సత్యం తరువాత జరిగితే మీకు అల్లాహ్ వద్ద నుండి ఎటువంటి మద్దతు కాని సహాయం కాని లభించదు. ఇది సత్యాన్ని విడిచిపెట్టి,అసత్య ప్రజలతో కలిసిపోయే ప్రమాదాన్ని వివరించే పరంగా ఉన్నది.
Tefsiret në gjuhën arabe:
اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یَتْلُوْنَهٗ حَقَّ تِلَاوَتِهٖ ؕ— اُولٰٓىِٕكَ یُؤْمِنُوْنَ بِهٖ ؕ— وَمَنْ یَّكْفُرْ بِهٖ فَاُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟۠
దివ్య ఖుర్ఆన్ యూదుల్లోంచి ఒక వర్గము గురించి ప్రస్తావిస్తుంది. వారు అవతరింపబడి తమ చేతుల్లో ఉన్న గ్రంధముల ప్రకారం ఆచరిస్తున్నారు. మరియు వాటిని అనుసరించవలసిన రీతిలో అనుసరిస్తున్నారు. వారందరు ఈ గ్రంధముల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీపై సూచించే సూచనలను పొందుతున్నారు. మరియు అందువల్లే వారు ఆయనపై విశ్వాసం చూపటం వైపునకు త్వరపడ్డారు. మరోక వర్గము గురించి (ప్రస్తావిస్తుంది) అది తన అవిశ్వాసంపై మొండిగా ఉన్నది. దాని కొరకు నష్టము కలదు.
Tefsiret në gjuhën arabe:
یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اذْكُرُوْا نِعْمَتِیَ الَّتِیْۤ اَنْعَمْتُ عَلَیْكُمْ وَاَنِّیْ فَضَّلْتُكُمْ عَلَی الْعٰلَمِیْنَ ۟
ఓ ఇస్రాయీలు సంతతివారా మీపై నేను అవతరింపజేసిన ధార్మిక మరియు ప్రాపంచిక అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి.మరియు నేను మీ కాలంలో మీ తోటివారి కంటే మీకు దైవదౌత్యం మరియు రాజ్యాన్ని అనుగ్రహించి మీకు వారిపై ఔన్నత్యాన్ని ప్రసాదించిన దానిని జ్ఞాపకం చేసుకోండి.
Tefsiret në gjuhën arabe:
وَاتَّقُوْا یَوْمًا لَّا تَجْزِیْ نَفْسٌ عَنْ نَّفْسٍ شَیْـًٔا وَّلَا یُقْبَلُ مِنْهَا عَدْلٌ وَّلَا تَنْفَعُهَا شَفَاعَةٌ وَّلَا هُمْ یُنْصَرُوْنَ ۟
మరియు మీరు అల్లాహ్ ఆదేశములను అనుసరించటం ద్వారా మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా మీకు మరియు ప్రళయదిన శిక్షకు మధ్య రక్షణను ఏర్పరచుకోండి. ఎందుకంటే ఆ రోజు ఏ ప్రాణి ఏ ప్రాణికి ఏవిధంగా ఉపయోగపడదు. మరియు దాని నుండి ఎటువంటి పరిహారము అది ఎంత పెద్దదైన స్వీకరించబడదు. మరియు దానికి ఎవరి సిఫారసు కూడా అతను ఎంత ఉన్నత స్థానం వాడైన సరే ప్రయోజనం కలిగించదు. మరియు అల్లాహ్ కాకుండా అతనికి రక్షించే రక్షకుడు ఎవడూ ఉండడు.
Tefsiret në gjuhën arabe:
وَاِذِ ابْتَلٰۤی اِبْرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّ ؕ— قَالَ اِنِّیْ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًا ؕ— قَالَ وَمِنْ ذُرِّیَّتِیْ ؕ— قَالَ لَا یَنَالُ عَهْدِی الظّٰلِمِیْنَ ۟
మరియు అల్లాహ్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంను ఆయనకు ఆదేశములను,బాధ్యతలను ఇవ్వటం ద్వారా పరీక్షించినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు ఆయన వాటిని నెలకొల్పారు. మరియు వాటిని పరిపూర్ణ రీతిలో పూర్తి చేశారు.అల్లాహ్ తన ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాంతో ఇలా పలికాడు : నిశ్చయంగా నేను నిన్ను ప్రజల కొరకు ఆదర్శంగా చేస్తాను. నీ చర్యల్లో,నీ గుణాల్లో నిన్ను ఆదర్శంగా తీసుకోబడును. అప్పుడు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా అలాగే నా సంతానములో నుంచి ప్రజలు అనుసరించే నాయకులను చేయి. అల్లాహ్ ఆయనకు సమాధానమిస్తూ ఇలా పలికాడు : నీ సంతానములో నుండి ధర్మ విషయంలో దుర్మార్గులైన వారికి ఇమామత్ గురించి నీ కొరకు నా వాగ్దానం వర్తించదు.
Tefsiret në gjuhën arabe:
وَاِذْ جَعَلْنَا الْبَیْتَ مَثَابَةً لِّلنَّاسِ وَاَمْنًا ؕ— وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرٰهٖمَ مُصَلًّی ؕ— وَعَهِدْنَاۤ اِلٰۤی اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ اَنْ طَهِّرَا بَیْتِیَ لِلطَّآىِٕفِیْنَ وَالْعٰكِفِیْنَ وَالرُّكَّعِ السُّجُوْدِ ۟
అల్లాహ్ నిషిద్ధ గృహమును ప్రజల కొరకు మరలే స్థలంగా చేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి వారి హృదయములు దానిని అట్టిపెట్టుకుని ఉంటాయి. ఎప్పుడెప్పుడైతే వారు దాని నుండి పయనించి వెళతారో వారు దాని వైపునకే మరలి వస్తారు. మరియు ఆయన దాన్ని వారి కొరకు శాంతి నిలయంగా చేశాడు. అందులో వారిపై దాడీ చేయబడదు. మరియు ఆయన ప్రజలకు ఇలా ఆదేశించాడు : ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కాబా నిర్మాణం చేసేటప్పుడు ఆయన నిలబడిన రాయిని మీరు నమాజు కొరకు స్థలంగా చేసుకోండి. మరియు నిషిద్ధ గృహమును మలినముల నుండి మరియు విగ్రహాల నుండి పరిశుద్ధ పరచమని మరియు తవాఫ్ ద్వారా,ఈతికాఫ్ ద్వారా,నమాజు,ఇతర వాటి ద్వారా అందులో ఆరాధన చేయదలచిన వారి కొరకు దాన్ని సిద్ధం చేయమని మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ కు తాకీదు చేశాము.
Tefsiret në gjuhën arabe:
وَاِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّ اجْعَلْ هٰذَا بَلَدًا اٰمِنًا وَّارْزُقْ اَهْلَهٗ مِنَ الثَّمَرٰتِ مَنْ اٰمَنَ مِنْهُمْ بِاللّٰهِ وَالْیَوْمِ الْاَخِرِ ؕ— قَالَ وَمَنْ كَفَرَ فَاُمَتِّعُهٗ قَلِیْلًا ثُمَّ اَضْطَرُّهٗۤ اِلٰی عَذَابِ النَّارِ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟
ఓ ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన ప్రభువును వేడుకొంటూ ఇలా పలికినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి : ఓ నా ప్రభువా నీవు మక్కా ను శాంతియుతమైన నగరంగా చేయి. అందులో ఎవరూ హానికి గురి కాకూడదు. మరియు అక్కడి ప్రజలకు రకరకాల ఫలాలను ఆహారంగా ప్రసాదించు. మరియు వాటిని నీపై మరియు అంతిమ దినముపై విశ్వాసమును చూపే వారికి ప్రత్యేక ఆహారంగా చేయి. అల్లాహ్ ఇలా పలికాడు : మరియు వారిలో నుండి తిరస్కరించే వాడికి నిశ్చయంగా నేను అతనికి ఇహలోకంలో ఆహారంగా ప్రసాదించే వాటితో కొంత ప్రయోజనం చేకూర్చుతాను. ఆ తరువాత పరలోకంలో అతడిని బలవంతాన నరకాగ్ని శిక్ష వైపునకు ఈడుస్తాను. ప్రళయదినమున అతడు మరలి వెళ్ళే ఎంతో చెడ్డ నివాసము.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• أن المسلمين مهما فعلوا من خير لليهود والنصارى؛ فلن يرضوا حتى يُخرجوهم من دينهم، ويتابعوهم على ضلالهم.
ముస్లిములు యూదులకు,క్రైస్తవులకు ఎంత మేలు చేసినా వారు వారిని వారి ధర్మం నుండి తీసివేసేంతవరకు మరియు వారి మార్గ భ్రష్టతపై వారిని అనుసరించేటట్లు చేయనంత వరకు సంత్రుప్తి చెందరు.

• الإمامة في الدين لا تُنَال إلا بصحة اليقين والصبر على القيام بأمر الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ ఆజ్ఞను నెరవేర్చడంలో నిశ్చయత మరియు సహనంతో తప్ప ధర్మంలో ఇమామత్ సాధించబడదు.

• بركة دعوة إبراهيم عليه السلام للبلد الحرام، حيث جعله الله مكانًا آمنًا للناس، وتفضّل على أهله بأنواع الأرزاق.
నిషిద్ధ నగరము కొరకు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం దుఆ శుభాలు. అందుకనే అల్లాహ్ దాన్ని ప్రజల కొరకు శాంతి ప్రదేశంగా చేశాడు. మరియు అక్కడి వాసులపై రకరకాల ఆహార పదార్ధాలను అనుగ్రహించాడు.

 
Përkthimi i kuptimeve Surja: El Bekare
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll