Check out the new design

పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం సూరహ్: అల్-ఖసస్   వచనం:
قَالَ اِنَّمَاۤ اُوْتِیْتُهٗ عَلٰی عِلْمٍ عِنْدِیْ ؕ— اَوَلَمْ یَعْلَمْ اَنَّ اللّٰهَ قَدْ اَهْلَكَ مِنْ قَبْلِهٖ مِنَ الْقُرُوْنِ مَنْ هُوَ اَشَدُّ مِنْهُ قُوَّةً وَّاَكْثَرُ جَمْعًا ؕ— وَلَا یُسْـَٔلُ عَنْ ذُنُوْبِهِمُ الْمُجْرِمُوْنَ ۟
ఖారూన్ ఇలా పలికాడు : ఈ సంపదలన్నీ నాకు మాత్రం నా జ్ఞానం వలన,సామర్ధ్యం వలన ఇవ్వబడినవి. నేను వాటి హక్కుదారుడను. ఏమీ అతని కన్నా ముందు తమ శక్తి అధికంగా కల,తమ అధిక సంపదలు కల జాతుల వారిని అల్లాహ్ అంతమొందించాడన్న విషయం ఖారూనుకు తెలియదా ?. అప్పుడు వారి బలము,వారి సంపదలు వారికి ప్రయోజనం కలిగించలేదు. మరియు ప్రళయదినాన పాపత్ములు తమ పాపముల గురించి వాటి గురించి అల్లాహ్ కు జ్ఞానం ఉండటం వలన ప్రశ్నించబడరు. అప్పుడు వారిని ప్రశ్నించటం గద్దింపు ప్రశ్న,మందలింపు ప్రశ్న.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَخَرَجَ عَلٰی قَوْمِهٖ فِیْ زِیْنَتِهٖ ؕ— قَالَ الَّذِیْنَ یُرِیْدُوْنَ الْحَیٰوةَ الدُّنْیَا یٰلَیْتَ لَنَا مِثْلَ مَاۤ اُوْتِیَ قَارُوْنُ ۙ— اِنَّهٗ لَذُوْ حَظٍّ عَظِیْمٍ ۟
అప్పుడు ఖారూను తన అహంకారమును ప్రదర్శిస్తూ తన వైభవంలో బయలుదేరాడు. ఖారూను సహచరుల్లోంచి ఇహలోక జీవిత వైభవములో అత్యాశను కలిగిన వారు ఇలా పలికారు : అయ్యో మా దౌర్భాగ్యం మేము కూడా ఖారూన్ కు ఇవ్వబడినట్లు ఇహలోక వైభవమును ఇవ్వబడి ఉంటే ఎంత బాగుండేది. నిశ్చయంగా ఖారూను పరిపూర్ణమైన పెద్ద వాటా కలిగిన వాడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالَ الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ وَیْلَكُمْ ثَوَابُ اللّٰهِ خَیْرٌ لِّمَنْ اٰمَنَ وَعَمِلَ صَالِحًا ۚ— وَلَا یُلَقّٰىهَاۤ اِلَّا الصّٰبِرُوْنَ ۟
మరియు జ్ఞాన సంపన్నులు ఖారూనును అతని వైభవంలో చూసినప్పుడు,అతని సహచరులు ఆశపడుతున్న దానిని విన్నప్పుడు ఇలా పలికారు : మీ పాడు గాను! అల్లాహ్ ప్రసాదించే ప్రతిఫలం పరలోకంలో ఉన్నది. మరియు ఏవైతే ఆయన తయారు చేసి ఉంచాడో అనుగ్రహాలు అతన్ని విశ్వసించి,సత్కార్యములు చేసిన వారి కొరకు ఉన్నయో అవి ఖారూనుకు ఇవ్వబడిన ప్రాపంచిక వైభవము కన్న గొప్పవి. ఈ మాటను పలకటానికి,దానికి తగ్గట్టుగా ఆచరించటానికి ఇహలోకంలో ఉన్న అంతమైపోయే ప్రాపంచిక సామగ్రిపై అల్లాహ్ వద్ద ఉన్న పుణ్యముపై ప్రాధాన్యత ఇవ్వటంపై సహనం చూపే ఓర్పుగలవారికే ఈ భాగ్యం కలిగించబడుతుంది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَخَسَفْنَا بِهٖ وَبِدَارِهِ الْاَرْضَ ۫— فَمَا كَانَ لَهٗ مِنْ فِئَةٍ یَّنْصُرُوْنَهٗ مِنْ دُوْنِ اللّٰهِ ؗۗ— وَمَا كَانَ مِنَ الْمُنْتَصِرِیْنَ ۟
అప్పుడు మేము అతని ద్రోహానికి ప్రతీకారంగా అతనిని,అతని ఇంటిని,అందులో ఉన్న వారందరిని భూమిలోకి కూర్చివేశాము. అల్లాహ్ తప్ప అతనికి సహాయం చేయటానికి ఎటువంటి వర్గము వారు అతని కొరకు లేకుండాపోయారు. మరియు అతను స్వయంగా తనను కాపాడుకోలేకపోయాడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَاَصْبَحَ الَّذِیْنَ تَمَنَّوْا مَكَانَهٗ بِالْاَمْسِ یَقُوْلُوْنَ وَیْكَاَنَّ اللّٰهَ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ وَیَقْدِرُ ۚ— لَوْلَاۤ اَنْ مَّنَّ اللّٰهُ عَلَیْنَا لَخَسَفَ بِنَا ؕ— وَیْكَاَنَّهٗ لَا یُفْلِحُ الْكٰفِرُوْنَ ۟۠
అతన్ని కూర్చక ముందు అతని సంపదలో,అతని వైభవంలో ఆశను కలిగిన వారు ఇలా పలకసాగారు : అల్లాహ్ తన దాసుల్లోంచి తాను కోరిన వారికి ఆహారోపాధిని విస్తరింపజేస్తాడని,వారిలో నుండి తాను కోరిన వారిపై కుంచింపజేస్తాడని మాకు తెలియదా ఏమిటీ ?!. ఒక వేళ మేము పలికిన దానికి ఆయన శిక్షించకుండా అల్లాహ్ అనుగ్రహమే మాపై లేకుంటే ఖారూన్ ను కూర్చినట్లు మమ్మల్ని ఆయన కూర్చేవాడు. నిశ్చయంగా అవిశ్వాసపరులు ఇహలోకంలో గాని,పరలోకంలో గాని సాఫల్యం చెందరు. అంతే కాదు వారి పరిణామం,వారి స్థితి ఆ రెండింటిలో నష్టమే.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
تِلْكَ الدَّارُ الْاٰخِرَةُ نَجْعَلُهَا لِلَّذِیْنَ لَا یُرِیْدُوْنَ عُلُوًّا فِی الْاَرْضِ وَلَا فَسَادًا ؕ— وَالْعَاقِبَةُ لِلْمُتَّقِیْنَ ۟
ఈ పరలోక గృహమును మేము సత్యముపై విశ్వాసమును కనబరచి,దాన్ని అనుసరించటం నుండి భూమిలో అహంకారమును కోరని వారి కొరకు,అందులో చెడును ఆశించని వారి కొరకు అనుగ్రహాల,మర్యాదల గృహముగా చేస్తాము. స్థుతింపబడిన పరిణామమైన అనుగ్రహాలు కల స్వర్గము,అందులో ఉండే అల్లాహ్ ప్రసన్నత తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి తమ ప్రభువు భీతి కలిగిన వారి కొరకు ఉంటుంది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
مَنْ جَآءَ بِالْحَسَنَةِ فَلَهٗ خَیْرٌ مِّنْهَا ۚ— وَمَنْ جَآءَ بِالسَّیِّئَةِ فَلَا یُجْزَی الَّذِیْنَ عَمِلُوا السَّیِّاٰتِ اِلَّا مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
ప్రళయదినాన ఎవరైన నమాజు,జకాతు,ఉపవాసము మొదలగు వాటి లోంచి ఏ సత్కార్యమును తీసుకుని వచ్చినా అతని ఆ సత్కార్యము కన్నా మంచిగా ప్రతిఫలముంటుంది. ఏ విధంగా నంటే అతని కొరకు పుణ్యము పది రెట్లు అధికం చేయబడుతుంది. మరియు ఎవరైన అవిశ్వాసము, వడ్డీ సొమ్ము తినటం, వ్యభిచారము మొదలగు వాటిలో నుంచి ఏ దుష్కార్యమును తీసుకుని వచ్చినా దుష్కార్యములకు పాల్పడిన వారికి మాత్రం అధికం చేయకుండా వారు చేసిన దుష్కార్యమునకు సమాన ప్రతిఫలమే ప్రసాదించటం జరుగుతుంది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• كل ما في الإنسان من خير ونِعَم، فهو من الله خلقًا وتقديرًا.
మనిషిలో ఉన్న ప్రతీ మంచితనము,అనుగ్రహము అది సృష్టిపరంగా,విధి వ్రాతపరంగా అల్లాహ్ తరపు నుంచి ఉంటుంది.

• أهل العلم هم أهل الحكمة والنجاة من الفتن؛ لأن العلم يوجه صاحبه إلى الصواب.
జ్ఞాన సంపన్నులు వారు విజ్ఞత కలవారై,ఉపద్రవాల నుండి విముక్తి పొందేవారై ఉంటారు. ఎందుకంటే జ్ఞానము జ్ఞాన సంపన్నులకు సరైన మార్గము వైపునకు మరలిస్తుంది.

• العلو والكبر في الأرض ونشر الفساد عاقبته الهلاك والخسران.
భూమిలో గర్వము,అహంకారము,ఉపద్రవాలను వ్యాపింపజేయటం దాని పరిణామం వినాశనము,నష్టమును చవి చూడటం ఉంటుంది.

• سعة رحمة الله وعدله بمضاعفة الحسنات للمؤمن وعدم مضاعفة السيئات للكافر.
విశ్వాసపరుని కొరకు పుణ్యాలను ద్విగుణీకృతం చేయటం,అవిశ్వాసపరుని కొరకు దుష్కర్మలను ద్విగుణీకృతం చేయకపోవటం అల్లాహ్ కారుణ్యము యొక్క, ఆయన న్యాయము యొక్క విస్తరణ.

 
భావార్ధాల అనువాదం సూరహ్: అల్-ఖసస్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం - అనువాదాల విషయసూచిక

మర్కజ్ తఫ్సీర్ లిల్ దిరాసాత్ అల్ ఖురానియ్యహ్ ప్రచురణ.

మూసివేయటం