แปล​ความหมาย​อัลกุรอาน​ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - สารบัญ​คำแปล


แปลความหมาย​ สูเราะฮ์: Al-Hadīd   อายะฮ์:

సూరహ్ అల్-హదీద్

วัตถุประสงค์ของสูเราะฮ์:
الترقي بالنفوس للإيمان والإنفاق في سبيل الله.
మనస్సులను విశ్వాసం కొరకు మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటం కొరకు ప్రోత్సహించటం.

سَبَّحَ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
ఆకాశములలో మరియు భూమిలో ఉన్న ఆయన సృష్టి రాసులన్నీ అల్లాహ్ పరిశుద్ధతను మరియు ఆయన అతీతను కొనియాడుతున్నవి. మరియు ఆయన ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు,తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— یُحْیٖ وَیُمِیْتُ ۚ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
భూమ్యాకాశముల అధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. తాను జీవింపచేయదలచిన వాడిని జీవింపజేస్తాడు. మరియు తాను మరణింపజేయదలచిన వాడిని మరణింపజేస్తాడు. మరియు ఆయన ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
هُوَ الْاَوَّلُ وَالْاٰخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ ۚ— وَهُوَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟
ఆయన తన ముందు ఏమీ లేని మొదటి వాడు. మరియు ఆయనే తన తరువాత ఏదీ లేని చివరివాడు. మరియు తన పై ఏదీ లేని ప్రత్యక్షంగా ఉండేవాడు. మరియు ఆయనే తాను లేకుండా ఏదీ లేని అంతరంగి. మరియు ఆయన ప్రతీది తెలిసినవాడు. ఆయన నుండి ఏది తప్పిపోదు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
ประโยชน์​ที่​ได้รับ​:
• شدة سكرات الموت وعجز الإنسان عن دفعها.
మరణ ఘడియల తీవ్రత మరియు దాన్ని తొలగించటం నుండి మనిషి అశక్తి.

• الأصل أن البشر لا يرون الملائكة إلا إن أراد الله لحكمة.
ఏదైన విజ్ఞత కొరకు అల్లాహ్ తలచుకుంటే తప్ప మానవుడు దైవ దూతలను చూడకపోవటం వాస్తవం.

• أسماء الله (الأول، الآخر، الظاهر، الباطن) تقتضي تعظيم الله ومراقبته في الأعمال الظاهرة والباطنة.
అల్లాహ్ నామములు (అల్ అవ్వలు,అల్ ఆఖిరు,అజ్జాహిరు,అల్ బాతిను) అల్లాహ్ గొప్పతనమును మరియు గోచరమైన మరియు అంతర్గత క్రియలలో ఆయన యొక్క పర్యవేక్షణను నిర్ణయిస్తాయి.

هُوَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ فِیْ سِتَّةِ اَیَّامٍ ثُمَّ اسْتَوٰی عَلَی الْعَرْشِ ؕ— یَعْلَمُ مَا یَلِجُ فِی الْاَرْضِ وَمَا یَخْرُجُ مِنْهَا وَمَا یَنْزِلُ مِنَ السَّمَآءِ وَمَا یَعْرُجُ فِیْهَا ؕ— وَهُوَ مَعَكُمْ اَیْنَ مَا كُنْتُمْ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
ఆయనే భూమ్యాకాశములను ఆరుదినములలో ఆదివారము ఆరంభమై శుక్రువారము ముగిసినట్లుగా సృష్టించాడు. మరియు కనురెప్ప వాల్చే సమయం కన్న తక్కువ సమయంలో వాటిని సృష్టించే సామర్ధ్యం కలవాడు ఆయన. ఆ తరువాత పరిశుద్ధుడైన ఆయన సింహాసనమును ఆయన సుబహానహు వతఆలాకి తగిన విధంగా అధీష్టించి ఆశీనుడైనాడు. భూమిలో ప్రవేశించే వర్షము,విత్తనము మరియు మొదలైనవి మరియు దాని నుండి వెలికి వచ్చే మొక్కలు,నిక్షేపాలు మొదలైనవి మరియు ఆకాశము నుండి దిగే వర్షము,దైవవాణి మొదలైనవి మరియు అందులో ఎక్కే దైవ దూతలు,దాసుల కర్మలు,వారి ఆత్మల గురించి ఆయనకు తెలుసు. ఓ ప్రజలారా మీరు ఎక్కడున్నా ఆయన తన జ్ఞానము ద్వారా మీతో పాటు ఉంటాడు. మీ నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు అల్లాహ్ మీరు చేసే వాటిని వీక్షిస్తున్నాడు. మీ కర్మల్లో నుంచి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَاِلَی اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۟
భూమ్యాకాశముల సామ్రాజ్యాధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. వ్యవహారాలు ఆయన ఒక్కడి వైపే మరలించబడుతాయి. ప్రళయదినమున సృష్టి రాసుల లెక్క తీసుకుంటాడు, మరియు వారికి వారి కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
یُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَیُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ ؕ— وَهُوَ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟
ఆయనే రాత్రిని పగటిపై ప్రవేశింపజేస్తాడు అప్పుడు చీకటి వస్తుంది మరియు ప్రజలు నిదురపోతారు. మరియు ఆయనే పగలును రాత్రిలో ప్రవేశింపజేస్తాడు. అప్పుడు వెలుగు వస్తుంది. అప్పుడు ప్రజలు తమ కార్యచరణల వైపు నడుస్తారు. మరియు ఆయన తన దాసుల హృదయముల్లో కల వాటిని తెలుసుకునే వాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
اٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَاَنْفِقُوْا مِمَّا جَعَلَكُمْ مُّسْتَخْلَفِیْنَ فِیْهِ ؕ— فَالَّذِیْنَ اٰمَنُوْا مِنْكُمْ وَاَنْفَقُوْا لَهُمْ اَجْرٌ كَبِیْرٌ ۟
మీరు అల్లాహ్ ను విశ్వసించండి మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి. మరియు అల్లాహ్ మిమ్మల్ని ఏ సంపదలోనైతే వారసులుగా చేశాడో అందులో నుండి ఖర్చు చేయండి. మరియు అందులో ధర్మం మీకు నిర్దేశించినట్లుగా మీరు ఖర్చు చేస్తారు. మీలో నుండి ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి అల్లాహ్ మార్గములో తమ సంపదలను ఖర్చు చేస్తారో వారి కొరకు ఆయన వద్ద గొప్ప ప్రతిఫలం కలదు. అది స్వర్గము.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
وَمَا لَكُمْ لَا تُؤْمِنُوْنَ بِاللّٰهِ ۚ— وَالرَّسُوْلُ یَدْعُوْكُمْ لِتُؤْمِنُوْا بِرَبِّكُمْ وَقَدْ اَخَذَ مِیْثَاقَكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
అల్లాహ్ పై విశ్వాసము కనబరచటం నుండి మిమ్మల్ని ఏది ఆపుతుంది ?! వాస్తవానికి దైవ ప్రవక్త మిమ్మల్ని పరిశుద్ధుడైన మీ ప్రభువుపై మీరు విశ్వాసము కనబరుస్తారని ఆశిస్తూ అల్లాహ్ వైపునకు పిలుస్తున్నారు. మరియు నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని మీ తండ్రుల వీపు నుండి వెలికి తీసినప్పుడు ఆయన పై మీరు విశ్వాసమును కనబరుస్తారని మీతో వాగ్దానం తీసుకున్నాడు ఒక వేళ మీరు విశ్వసించిన వారైతే.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
هُوَ الَّذِیْ یُنَزِّلُ عَلٰی عَبْدِهٖۤ اٰیٰتٍۢ بَیِّنٰتٍ لِّیُخْرِجَكُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ؕ— وَاِنَّ اللّٰهَ بِكُمْ لَرَءُوْفٌ رَّحِیْمٌ ۟
ఆయనే తన దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై స్పష్టమైన ఆయతులను మిమ్మల్ని అవిశ్వాసము మరియు అజ్ఞానము యొక్క చీకట్ల నుండి విశ్వాసము,జ్ఞానము యొక్క కాంతి వైపునకు తీయటానికి అవతరింపజేసేవాడు. మరియు అల్లాహ్ మీపై ఎంతో కనికరం చూపే వాడును మరియు అపారంగా కరుణించేవాడును అందుకనే ఆయన తన ప్రవక్తను మీ వైపునకు సన్మార్గం చూపే వాడిగాను,శుభవార్తనిచ్చేవాడిగాను చేసి పంపించాడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
وَمَا لَكُمْ اَلَّا تُنْفِقُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ وَلِلّٰهِ مِیْرَاثُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— لَا یَسْتَوِیْ مِنْكُمْ مَّنْ اَنْفَقَ مِنْ قَبْلِ الْفَتْحِ وَقٰتَلَ ؕ— اُولٰٓىِٕكَ اَعْظَمُ دَرَجَةً مِّنَ الَّذِیْنَ اَنْفَقُوْا مِنْ بَعْدُ وَقَاتَلُوْاؕ— وَكُلًّا وَّعَدَ اللّٰهُ الْحُسْنٰی ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟۠
అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం నుండి మిమ్మల్ని ఏది ఆపుతుంది ?! మరియు ఆకాశముల మరియు భూమి యొక్క వారసత్వము అల్లాహ్ కే చెందుతుంది. ఓ విశ్వాసపరులారా మక్కా పై విజయం కన్న ముందు అల్లాహ్ మార్గములో ఆయన మన్నతను ఆశిస్తూ తన సంపదను ఖర్చు చేసి,ఇస్లాంకు మద్దతు కొరకు అవిశ్వాసపరులతో పోరాడినవారు మక్కా విజయము తరువాత ఖర్చు చేసి,అవిశ్వాసపరులతో పోరాడిన వారితో సమానం కాజాలరు. విజయం కన్న ముందు ఖర్చు చేసినవారు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడిన వారందరు దాని విజయం తరువాత తమ సంపదలను అల్లాహ్ మార్గములో ఖర్చు చేసి,అవిశ్వాసపరులతో పోరాడిన వారికన్న అల్లాహ్ వద్ద గొప్ప స్థానము కలవారు. వాస్తవానికి అల్లాహ్ ఇరు వర్గముల కొరకు స్వర్గపు వాగ్దానం చేశాడు. మీరు చేస్తున్నది అల్లాహ్ కు తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
مَنْ ذَا الَّذِیْ یُقْرِضُ اللّٰهَ قَرْضًا حَسَنًا فَیُضٰعِفَهٗ لَهٗ وَلَهٗۤ اَجْرٌ كَرِیْمٌ ۟
తన మనస్సుకు మంచిదనిపించిన తన సంపదను అల్లాహ్ మన్నత కొరకు ఎవరు ఖర్చు చేస్తాడు ?! అల్లాహ్ అతనికి తాను ఖర్చు చేసిన తన సంపదకి రెట్టింపుగా పుణ్యమును ప్రసాదిస్తాడు. మరియు అతని కొరకు ప్రళయదినమున ఆదరణీయమైన పుణ్యము కలదు. అది స్వర్గము.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
ประโยชน์​ที่​ได้รับ​:
• المال مال الله، والإنسان مُسْتَخْلَف فيه.
ధనము అల్లాహ్ ధనము మరియు మనిషి దానికి లోబడి ఉంటాడు.

• تفاوت درجات المؤمنين بحسب السبق إلى الإيمان وأعمال البر.
విశ్వాసుల స్థాయిలు విశ్వాసానికి, సత్కర్మలకు అనుగుణంగా మారుతాయి.

• الإنفاق في سبيل الله سبب في بركة المال ونمائه.
అల్లాహ్ మర్గములో ఖర్చు చేయటం ధనంలో శుభము కలగటానికి మరియు అది పెరగటానికి కారణముగును.

یَوْمَ تَرَی الْمُؤْمِنِیْنَ وَالْمُؤْمِنٰتِ یَسْعٰی نُوْرُهُمْ بَیْنَ اَیْدِیْهِمْ وَبِاَیْمَانِهِمْ بُشْرٰىكُمُ الْیَوْمَ جَنّٰتٌ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟ۚ
ఆ రోజున మీరు విశ్వాసపర పురషులను,విశ్వాసపర స్త్రీలను వారి వెలుగు వారి ముందున మరియు వారి కుడి వైపుల నుండి ముందుకు సాగటమును చూస్తారు. ఆ రోజు వారితో ఇలా పలకబడును : ఈ రోజు మీకు భవనముల క్రింది నుండి మరియు వృక్షముల క్రింది నుండి సెలయేరులు ప్రవహించే స్వర్గ వనముల శుభవార్త ఇవ్వబడును. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఈ ప్రతిఫలం ఎటువంటి సాఫల్యముకు సమానము కాని గొప్ప సాఫల్యము.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
یَوْمَ یَقُوْلُ الْمُنٰفِقُوْنَ وَالْمُنٰفِقٰتُ لِلَّذِیْنَ اٰمَنُوا انْظُرُوْنَا نَقْتَبِسْ مِنْ نُّوْرِكُمْ ۚ— قِیْلَ ارْجِعُوْا وَرَآءَكُمْ فَالْتَمِسُوْا نُوْرًا ؕ— فَضُرِبَ بَیْنَهُمْ بِسُوْرٍ لَّهٗ بَابٌ ؕ— بَاطِنُهٗ فِیْهِ الرَّحْمَةُ وَظَاهِرُهٗ مِنْ قِبَلِهِ الْعَذَابُ ۟ؕ
ఆ రోజు కపట విశ్వాస పురషులు మరియు కపట విశ్వాస స్త్రీలు విశ్వాసపరులతో ఇలా పలుకుతారు : మార్గమును దాటటానికి మాకు సహాయపడే మీ వెలుగును మేము పుచ్చుకుంటామని ఆశిస్తూ మీరు మా కోసం నిరీక్షించండి. మరియు కపటవిశ్వాసులతో వారిని హేళన చేస్తూ ఇలా పలకబడును : మీరు మీ వెనుకకు మరలి మీరు వెలుగును పొందే ఏదైన కాంతిని వెతకండి. అప్పుడు వారి మధ్య ఒక అడ్డు గోడ ఏర్పరచబడును. ఆ గోడకు ఒక ద్వారముండును. దాని లోపలి వైపు విశ్వాసపరులకు దగ్గర ఉన్న భాగములో కారుణ్యముండును. మరియు దాని వెలుపల వైపు కపట విశ్వాసులకు దగ్గర ఉన్న భాగములో శిక్ష ఉండును.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
یُنَادُوْنَهُمْ اَلَمْ نَكُنْ مَّعَكُمْ ؕ— قَالُوْا بَلٰی وَلٰكِنَّكُمْ فَتَنْتُمْ اَنْفُسَكُمْ وَتَرَبَّصْتُمْ وَارْتَبْتُمْ وَغَرَّتْكُمُ الْاَمَانِیُّ حَتّٰی جَآءَ اَمْرُ اللّٰهِ وَغَرَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ ۟
కపటులు విశ్వాసపరులను ఇలా పలుకుతూ పిలుపునిస్తారు : ఏమీ మేము ఇస్లాం పై,విధేయత చూపటంపై మీతో పాటు లేమా ?! ముస్లిములు వారితో ఇలా పలుకుతారు : ఎందుకు కాదు మీరు మాతో పాటు ఉన్నారు. కాని మీరు మీ మనస్సులను కపటత్వముతో పరీక్షకు గురి చేసుకుని వాటిని నాశనం చేసుకున్నారు. మరియు మీరు విశ్వాసపరుల విషయంలో వారు ఓడిపోతే మీరు మీ అవిశ్వాసమును బహిరంగ పరచాలని నిరీక్షించారు. మరియు విశ్వాసపరులకు అల్లాహ్ సహాయము విషయంలో మరియు మరణాంతరం లేపబడటం విషయంలో మీరు సందేహపడ్డారు. మరియు మీ అబద్దపు ఆశలు మిమ్మల్ని మోసం చేశాయి చివరికి మీరు దానిపై ఉన్న స్థితిలోనే మీకు మరణం వచ్చినది. మరియు షైతాను అల్లాహ్ విషయంలో మిమ్మల్ని మోసం చేశాడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
فَالْیَوْمَ لَا یُؤْخَذُ مِنْكُمْ فِدْیَةٌ وَّلَا مِنَ الَّذِیْنَ كَفَرُوْا ؕ— مَاْوٰىكُمُ النَّارُ ؕ— هِیَ مَوْلٰىكُمْ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟
ఓ కపటవిశ్వాసులారా ఈ రోజు మీ నుండి అల్లాహ్ శిక్షకు బదులుగా ఎటువంటి పరిహారం తీసుకోబడదు. మరియు అల్లాహ్ పట్ల బహిరంగంగా అవిశ్వాసమునకు ఒడిగట్టే వారి నుండి ఎటువంటి పరిహారం తీసుకోబడదు. మరియు మీ పరిణామము మరియు అవిశ్వాసుల పరిణామం నరకాగ్ని అవుతుంది. అది మీకు తగినది. మరియు మీరు దానికి యోగ్యులు. మరియు అది ఎంతో చెడ్డ పరిణామము.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
اَلَمْ یَاْنِ لِلَّذِیْنَ اٰمَنُوْۤا اَنْ تَخْشَعَ قُلُوْبُهُمْ لِذِكْرِ اللّٰهِ وَمَا نَزَلَ مِنَ الْحَقِّ ۙ— وَلَا یَكُوْنُوْا كَالَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلُ فَطَالَ عَلَیْهِمُ الْاَمَدُ فَقَسَتْ قُلُوْبُهُمْ ؕ— وَكَثِیْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ ۟
ఏమీ అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విశ్వసించిన వారికి వారి హృదయములు పరిశుద్ధుడైన అల్లాహ్ స్మరణ కొరకు, ఆయన ఖుర్ఆన్ నుండి అవతరింపజేసిన వాగ్దానము,హెచ్చరికల నుండి మృధువుగా,మనశ్శాంతి పొందే సమయం రాలేదా ?. మరియు వారి హృదయములు కఠినంగా మారిపోవటంలో తౌరాత్ ఇవ్వబడిన యూదులు,ఇంజీల్ ఇవ్వబడిన క్రైస్తవుల మాదిరిగా కాకూడదు. వారికి మరియు వారి ప్రవక్తలు పంపించబడటానికి మధ్య చాలా కాలం గడిచిపోయినది అప్పుడు దాని వలన వారి హృదయములు కఠినంగా మారిపోయినవి. వారిలో నుండి చాలా మంది అల్లాహ్ విధేయత నుండి ఆయన పై అవిధేయత వైపునకు వైదొలిగిపోయారు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
اِعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یُحْیِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ— قَدْ بَیَّنَّا لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟
అల్లాహ్ భూమిని అది ఎండిపోయిన తరువాత దాన్ని మొలకెత్తించి జీవింపజేస్తాడని మీరు తెలుసుకోండి. ఓ ప్రజలారా వాస్తవానికి మేము అల్లాహ్ సామర్ధ్యమును మరియు ఆయన ఏకత్వమును సూచించే ఆధారాలను మరియు ఋజువులను మీరు వాటిని అర్ధం చేసుకుని భూమిని దాని మరణం తరువాత జీవింపజేసిన వాడు మిమ్మల్ని మీ మరణం తరువాత మరల లేపటంపై సామర్ధ్యం కలవాడని మరియు మీ హృదయములను వాటి కఠినమైపోయిన తరువత మృధువుగా చేసే సామర్ధ్యం కలవాడని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ మీకు స్పష్టపరిచాము.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
اِنَّ الْمُصَّدِّقِیْنَ وَالْمُصَّدِّقٰتِ وَاَقْرَضُوا اللّٰهَ قَرْضًا حَسَنًا یُّضٰعَفُ لَهُمْ وَلَهُمْ اَجْرٌ كَرِیْمٌ ۟
నిశ్చయంగా తమ సంపదల నుండి కొంత దాన్ని దానం చేసే పురుషులు మరియు తమ సంపదల నుండి కొంత దాన్ని దానం చేసే స్త్రీలు వారు దాన్ని తమ మనస్సులకు మంచిగా అనిపించిన దాన్ని దాతృత్వాన్ని పదేపదే చాటుకోకుండా మరియు (గ్రహీతల మనస్సులను) నొప్పించకుండా ధానం చేస్తారు. వారి కర్మల పుణ్యము వారి కొరకు రెట్టింపు చేయబడును ఏ విధంగానంటే ఒక పుణ్యము పది వంతుల నుండి ఏడు వందల వంతులకు ఇంకా అధిక వంతుల వరకు అధికం చేయబడును. మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద ఆదరణీయమైన ప్రతిఫలముండును అది స్వర్గము.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
ประโยชน์​ที่​ได้รับ​:
• امتنان الله على المؤمنين بإعطائهم نورًا يسعى أمامهم وعن أيمانهم.
విశ్వాసపరులపై అల్లాహ్ యొక్క ఉపకారము వారికి వారి ముందు మరియు వారి కుడి ప్రక్క పరిగెత్తే కాంతిని ప్రసాదించటం.

• المعاصي والنفاق سبب للظلمة والهلاك يوم القيامة.
పాప కార్యములు మరియు కపటత్వము ప్రళయదినమున చీకటికి మరియు వినాశనమునకు కారణము.

• التربُّص بالمؤمنين والشك في البعث، والانخداع بالأماني، والاغترار بالشيطان: من صفات المنافقين.
విశ్వాసపరుల విషయంలో (శిక్ష విషయంలో) వేచి ఉండటం,మరణాంతరం లేపబడే విషయంలో సందేహపడటం,కోరికలతో మోసపోవటం మరియు షైతాను ద్వారా మోసపోవటం కపట విశ్వాసుల లక్షణాలు.

• خطر الغفلة المؤدية لقسوة القلوب.
హృదయముల కాఠిన్యమునకు దారి తీసే నిర్లక్ష్యము యొక్క ప్రమాదము.

وَالَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖۤ اُولٰٓىِٕكَ هُمُ الصِّدِّیْقُوْنَ ۖۗ— وَالشُّهَدَآءُ عِنْدَ رَبِّهِمْ ؕ— لَهُمْ اَجْرُهُمْ وَنُوْرُهُمْ ؕ— وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَحِیْمِ ۟۠
మరియు అల్లాహ్ ను విశ్వసించేవారు మరియు ఆయన ప్రవక్తలను వారి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేకుండా విశ్వసించేవారు వారందరు సత్యసంధులు మరియు తమ ప్రభువు వద్ద అమరవీరులు, వారికి వారి కొరకు తయారు చేయబడిన వారి ఆదరణీయమైన ప్రతిఫలం కలదు. మరియు వారి కొరకు ప్రళయదినమున వారి ముందు మరియు వారి కుడి వైపున పరిగెత్తే వారి వెలుగు ఉంటుంది. మరియు అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరచి,మన ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరిస్తారో వారందరు నరకవాసులు. ప్రళయదినమున వారు అందులో ప్రవేశిస్తారు. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. దాని నుండి వారు బయటకు రారు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
اِعْلَمُوْۤا اَنَّمَا الْحَیٰوةُ الدُّنْیَا لَعِبٌ وَّلَهْوٌ وَّزِیْنَةٌ وَّتَفَاخُرٌ بَیْنَكُمْ وَتَكَاثُرٌ فِی الْاَمْوَالِ وَالْاَوْلَادِ ؕ— كَمَثَلِ غَیْثٍ اَعْجَبَ الْكُفَّارَ نَبَاتُهٗ ثُمَّ یَهِیْجُ فَتَرٰىهُ مُصْفَرًّا ثُمَّ یَكُوْنُ حُطَامًا ؕ— وَفِی الْاٰخِرَةِ عَذَابٌ شَدِیْدٌ ۙ— وَّمَغْفِرَةٌ مِّنَ اللّٰهِ وَرِضْوَانٌ ؕ— وَمَا الْحَیٰوةُ الدُّنْیَاۤ اِلَّا مَتَاعُ الْغُرُوْرِ ۟
ఇహలోక జీవితం శరీరములు ఆడుకునే ఒక ఆట అని మరియు హృదయములు వినోదం పొందే ఒక వినోదమని మరియు మీరు అలంకరించుకునే ఒక అలంకరణ అని మీరు తెలుసుకోండి. అందులో ఉన్న అధికారము మరియు ప్రయోజన సామగ్రితో మీరు పరస్పరం గొప్పలు చెప్పుకోవటం మరియు సంపదలు అధికముగా ఉండటం వలన,సంతానము ఎక్కువగా ఉండటం వలన ప్రగల్బాలు పలకటం. ఆ వర్షపు ఉపమానము మాదిరిగా ఉన్నది దాని మొక్కలు రైతులకు ఆనందం కలిగిస్తాయి. ఆ పిదప ఆ పచ్చటి మొక్కలు ఎండిపోకుండా ఉండవు. ఓ చూసే వాడా నీవు దాన్ని పచ్చగా అయిన తరువాత పసుపుగా చూస్తావు. ఆ తరువాత అల్లాహ్ దాన్ని ముక్కలు ముక్కలుగా అయిన పొట్టు వలె చేస్తాడు. మరియు పరలోకములో అవిశ్వాసపరులకు,కపటులకు కఠినమైన శిక్ష కలదు. మరియు అల్లాహ్ వద్ద నుండి విశ్వాసపరులైన తన దాసుల పాపములకు మన్నింపు మరియు ఆయన మన్నత కలదు. మరియు ఇహలోక జీవితం స్థిరత్వం లేని తరగిపోయే సామగ్రి మాత్రమే. ఎవరైతే తరిగి పోయే దాని సామగ్రికి పరలోక అనుగ్రహాలపై ప్రాధాన్యతనిస్తాడో అతడు మోసపోయి నష్టపోయేవాడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
سَابِقُوْۤا اِلٰی مَغْفِرَةٍ مِّنْ رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا كَعَرْضِ السَّمَآءِ وَالْاَرْضِ ۙ— اُعِدَّتْ لِلَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ ؕ— ذٰلِكَ فَضْلُ اللّٰهِ یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ ۟
ఓ ప్రజలారా మీరు మీ పాపముల మన్నింపును పొందేటటువంటి సత్కర్మలైన పశ్ఛాత్తాపము మరియు సాన్నిధ్యమును కలిగించే మొదలగు వాటి వైపునకు ముందుకు సాగండి. మరియు మీరు వాటి ద్వారా భూమ్యాకాశము విశాలమంత విశాలము కల స్వర్గమును పొందటానికి. ఈ స్వర్గమును అల్లాహ్ తనపై విశ్వాసమును కవబరచి తన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచిన వారి కొరకు సిద్ధం చేసి ఉంచాడు. ఈ ప్రతిఫలం అల్లాహ్ యొక్క అనుగ్రహము ఆయన దాన్ని తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సుబహానహూ వతఆలా విశ్వాసపరులైన తన దాసులపై గొప్ప అనుగ్రహము కలవాడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
مَاۤ اَصَابَ مِنْ مُّصِیْبَةٍ فِی الْاَرْضِ وَلَا فِیْۤ اَنْفُسِكُمْ اِلَّا فِیْ كِتٰبٍ مِّنْ قَبْلِ اَنْ نَّبْرَاَهَا ؕ— اِنَّ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرٌ ۟ۙ
భూమిలో ప్రజలపై కరువు కాటకాలు,ఇతర ఆపదలు గాని స్వయంగా వారి ప్రాణములపై వచ్చే ఆపద గాని మేము సృష్టిని సృష్టించక ముందే లౌహె మహఫూజ్ లో పొందు పరచబడినదే. నిశ్ఛయంగా ఇది అల్లాహ్ పై సులభము.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
لِّكَیْلَا تَاْسَوْا عَلٰی مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوْا بِمَاۤ اٰتٰىكُمْ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُوْرِ ۟ۙ
మరియు ఓ ప్రజలారా ఇదంతా మీరు కోల్పోయిన దానిపై మీరు బాధపడకుండా ఉండటానికి మరియు మీకు ఆయన ప్రసాదించిన అనుగ్రహాలపై మీరు గర్వానికి లోనయ్యే సంతోషమును పొందకుండా ఉండటానికి. నిశ్ఛయంగా అల్లాహ్, అల్లాహ్ ప్రసాదించిన వాటిపై ప్రజల ముందు గర్వానికి,అహంకారమునకు లోనయ్యే ప్రతీ వ్యక్తిని ఇష్టపడడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
١لَّذِیْنَ یَبْخَلُوْنَ وَیَاْمُرُوْنَ النَّاسَ بِالْبُخْلِ ؕ— وَمَنْ یَّتَوَلَّ فَاِنَّ اللّٰهَ هُوَ الْغَنِیُّ الْحَمِیْدُ ۟
ఎవరైతే తమపై ఖర్చు చేయటము అనివార్యము చేయబడిన వాటి విషయంలో పిసినారితనమును చూపుతారో మరియు ఇతరులను పిసినారి తనం చూపమని ఆదేశిస్తారో వారు నష్టపోతారు. ఎవరైతే అల్లాహ్ పై విధేయత చూపటం నుండి విముఖత చూపుతారో వారు అల్లాహ్ కు నష్టం కలిగించలేరు. వారు మాత్రం తమ స్వయానికి నష్టం కలిగించుకుంటారు. నిశ్ఛయంగా అల్లాహ్ స్వయం సమృద్ధుడు. తన దాసుల విధేయత ఆయనకు అవసరం లేదు. అన్నీ స్థితుల్లో పొగడబడేవాడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
ประโยชน์​ที่​ได้รับ​:
• الزهد في الدنيا وما فيها من شهوات، والترغيب في الآخرة وما فيها من نعيم دائم يُعينان على سلوك الصراط المستقيم.
ఇహలోకము,అందుగల వాంఛల పట్ల వైరాగ్యం మరియు పరలోకం,అందుగల శాశ్వత అనుగ్రహాల పట్ల ఆసక్తి ఋజుమార్గాన్ని అవలంభించడంలో తోడ్పడుతాయి.

• وجوب الإيمان بالقدر.
తఖ్ధీర్ పై విశ్వాసమును కనబరచటం తప్పనిసరి.

• من فوائد الإيمان بالقدر عدم الحزن على ما فات من حظوظ الدنيا.
ప్రాపంచిక భాగములను కోల్పోవటంపై బాధ లేక పోవటం తఖ్దీర్ పై విశ్వాసము యొక్క ప్రయోజనం.

• البخل والأمر به خصلتان ذميمتان لا يتصف بهما المؤمن.
పిసినారితనం మరియు దాని గురించి ఆదేశించటం రెండు దూషించదగిన లక్షణాలు. అవి రెండు విశ్వాసపరునిలో ఉండవు.

لَقَدْ اَرْسَلْنَا رُسُلَنَا بِالْبَیِّنٰتِ وَاَنْزَلْنَا مَعَهُمُ الْكِتٰبَ وَالْمِیْزَانَ لِیَقُوْمَ النَّاسُ بِالْقِسْطِ ۚ— وَاَنْزَلْنَا الْحَدِیْدَ فِیْهِ بَاْسٌ شَدِیْدٌ وَّمَنَافِعُ لِلنَّاسِ وَلِیَعْلَمَ اللّٰهُ مَنْ یَّنْصُرُهٗ وَرُسُلَهٗ بِالْغَیْبِ ؕ— اِنَّ اللّٰهَ قَوِیٌّ عَزِیْزٌ ۟۠
నిశ్ఛయంగా మేము మా ప్రవక్తలను స్పష్టమైన వాదనలను మరియు స్పష్టమైన ఆధారాలను ఇచ్చి పంపించాము. మరియు మేము ధృడమైన శక్తి కల ఇనుమును దింపాము. దాని నుండి ఆయుధాలు తయారు చేయబడుతాయి. మరియు అందులో ప్రజల కొరకు వారి పరిశ్రమల్లో మరియు వారి చేతి వృత్తుల్లో ప్రయోజనములు కలవు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి ఎవరు తనను చూడకుండానే తనకు ఎవరు సహాయపడుతారో దాసులకు బహిర్గతమవటం తెలుసుకోవటానికి. నిశ్ఛయంగా అల్లాహ్ ఏదీ ఆధిక్యత చూపని బలశాలి సర్వాధిక్యుడు. మరియు ఆయన దేని నుండి అశక్తుడు కాడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
وَلَقَدْ اَرْسَلْنَا نُوْحًا وَّاِبْرٰهِیْمَ وَجَعَلْنَا فِیْ ذُرِّیَّتِهِمَا النُّبُوَّةَ وَالْكِتٰبَ فَمِنْهُمْ مُّهْتَدٍ ۚ— وَكَثِیْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ ۟
మరియు నిశ్ఛయంగా మేము నూహ్ మరియు ఇబ్రాహీం అలైహిమస్సలాంలను ప్రవక్తలుగా పంపించాము. మరియు వారిరువురి సంతానములో దైవ దౌత్యమును మరియు అవతరించబడిన గ్రంధములను చేశాము. వారి సంతానములో సన్మార్గమును పొందే భాగ్యం ప్రాసాదించబడినవారున్నారు. మరియు వారిలో చాలామంది అల్లాహ్ విధేయత నుండి వైదొలగినవారున్నారు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
ثُمَّ قَفَّیْنَا عَلٰۤی اٰثَارِهِمْ بِرُسُلِنَا وَقَفَّیْنَا بِعِیْسَی ابْنِ مَرْیَمَ وَاٰتَیْنٰهُ الْاِنْجِیْلَ ۙ۬— وَجَعَلْنَا فِیْ قُلُوْبِ الَّذِیْنَ اتَّبَعُوْهُ رَاْفَةً وَّرَحْمَةً ؕ— وَرَهْبَانِیَّةَ ١بْتَدَعُوْهَا مَا كَتَبْنٰهَا عَلَیْهِمْ اِلَّا ابْتِغَآءَ رِضْوَانِ اللّٰهِ فَمَا رَعَوْهَا حَقَّ رِعَایَتِهَا ۚ— فَاٰتَیْنَا الَّذِیْنَ اٰمَنُوْا مِنْهُمْ اَجْرَهُمْ ۚ— وَكَثِیْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ ۟
ఆ తరువాత మేము మా ప్రవక్తలను ఒకరి తరువాత ఒకరిని పంపించాము. మేము వారిని వారి సమాజాల వద్దకు క్రమక్రమంగా పంపాము. మరియు మేము వారి వెనుక మర్యమ్ కుమారుడగు ఈసాను పంపాము. మరియు ఆయనకు మేము ఇంజీలును ప్రసాదించాము. మరియు మేము ఆయనను విశ్వసించి ఆయనను అనుసరించిన వారి హృదయములలో దయను,కరుణను కలిగించాము. అయితే వారు పరస్పరం ప్రేమించుకునే వారు మరియు దయ చూపుకునేవారు. మరియు వారు తమ ధర్మ విషయంలో అతిక్రమించటమును ఆరంభించారు. అప్పుడు వారు అల్లాహ్ వారికి ధర్మ సమ్మతం చేసిన నికాహ్,రుచి కరమైన వస్తువులను కొన్నింటిని వదిలివేశారు. మరియు మేము దాన్ని వారి నుండి కోరలేదు. వారు దాన్ని స్వయంగా తమపై తప్పనిసరి చేసుకున్నారు ; ధర్మంలో వారి తరపు నుండి కొత్తపొకడగా. కాని మేము మాత్రం అల్లాహ్ కు ఇష్టమైన వాటిని కోరాము వారు చేయలేదు. మేము వారిలోంచి విశ్వసించిన వారిని వారి ప్రతిఫలమును ప్రసాదించాము. వారిలో నుండి చాలా మంది ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరించి అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయినారు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَاٰمِنُوْا بِرَسُوْلِهٖ یُؤْتِكُمْ كِفْلَیْنِ مِنْ رَّحْمَتِهٖ وَیَجْعَلْ لَّكُمْ نُوْرًا تَمْشُوْنَ بِهٖ وَیَغْفِرْ لَكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟ۙ
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై మీ విశ్వాసము మరియు పూర్వ ప్రవక్తలపై మీ విశ్వాసము వలన మీకు రెండు భాగములు పుణ్యము,ప్రతిఫలము ప్రసాదిస్తాడు. మరియు మీకు ఒక వెలుగును ప్రసాదిస్తాడు దాని ద్వారా మీరు మీ ఇహలోక జీవితంలో మార్గం పొందుతారు మరియు ప్రళయదినమును సిరాత్ వంతెన పై వెలుగును పొందుతారు. మరియు ఆయన మీ కొరకు మీ పాపములను మన్నించి వాటిపై పరదా కప్పివేస్తాడు. మరియు మిమ్మల్ని వాటి పరంగా శిక్షించడు. పరిశుద్ధుడైన అల్లాహ్ తన దాసులను మన్నించేవాడును మరియు వారిపై అపారంగా కరుణించేవాడును.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
لِّئَلَّا یَعْلَمَ اَهْلُ الْكِتٰبِ اَلَّا یَقْدِرُوْنَ عَلٰی شَیْءٍ مِّنْ فَضْلِ اللّٰهِ وَاَنَّ الْفَضْلَ بِیَدِ اللّٰهِ یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ ۟۠
ఓ విశ్వాసపరులారా మేము మీ కొరకు సిద్ధం చేసి ఉంచిన మా గొప్ప అనుగ్రహమైన రెట్టింపు పుణ్యమును మేము మీకు స్పష్టపరిచాము. యూదులు,క్రైస్తవుల్లోంచి గ్రంధవహులు అల్లాహ్ అనుగ్రహములోంచి వారు తాము కోరుకున్న వారికి ప్రసాదించటానికి మరియు తాము కోరుకున్న వారి నుండి ఆపటానికి దేని సామర్ధ్యము వారికి లేదని తెలుసుకోవటానికి. మరియు అనుగ్రహము అల్లాహ్ చేతిలో ఉన్నదని ఆయన తన దాసుల్లోంచి తలచిన వారికి దాన్ని ప్రసాదిస్తాడని వారు తెలుసుకోవటానికి. అల్లాహ్ గొప్ప అనుగ్రహము కలవాడు దాన్ని తన దాసుల్లోంచి తాను కోరుకున్న వారికి ప్రత్యేకిస్తాడు.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
ประโยชน์​ที่​ได้รับ​:
• الحق لا بد له من قوة تحميه وتنشره.
సత్యాన్ని సంరక్షించటానికి మరియు దాన్ని వ్యాపింపజేయటానికి ఒక శక్తి ఉండాలి.

• بيان مكانة العدل في الشرائع السماوية.
దివ్య శాసనముల్లో న్యాయము యొక్క స్థాన ప్రకటన.

• صلة النسب بأهل الإيمان والصلاح لا تُغْنِي شيئًا عن الإنسان ما لم يكن هو مؤمنًا.
విశ్వాసపరులతో,సజ్జనులతో బంధుత్వము కలిగి ఉండటం మనిషికి అతను విశ్వాసపరుడు కానంతవరకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు.

• بيان تحريم الابتداع في الدين.
ధర్మంలో కొత్తపోకడల నిషిద్ధత ప్రకటన.

 
แปลความหมาย​ สูเราะฮ์: Al-Hadīd
สารบัญสูเราะฮ์ หมายเลข​หน้า​
 
แปล​ความหมาย​อัลกุรอาน​ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - สารบัญ​คำแปล

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

ปิด