Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Al-Baqarah   Ayah:
وَلَمَّا جَآءَهُمْ كِتٰبٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ ۙ— وَكَانُوْا مِنْ قَبْلُ یَسْتَفْتِحُوْنَ عَلَی الَّذِیْنَ كَفَرُوْا ۚ— فَلَمَّا جَآءَهُمْ مَّا عَرَفُوْا كَفَرُوْا بِهٖ ؗ— فَلَعْنَةُ اللّٰهِ عَلَی الْكٰفِرِیْنَ ۟
మరియు ఎప్పుడైతే తౌరాతులో మరియు ఇంజీలులో ఉన్న సాధారణమైన సరైన నియమములకు అనుగుణంగా ఉండే దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు వచ్చినదో మరియు వారు దాని అవతరణకు మునుపు ఇలా పలికే వారు : మేము ముష్రికులపై విజయం సాధిస్తాము, మరియు ఒక ప్రవక్తను పంపినప్పుడు అది మనకు తెరవబడుతుంది, కాబట్టి మనం ఆయనను విశ్వసించి ఆయనను అనుసరిస్తాము. ఎప్పుడైతే వారి వద్దకు వారికి తెలిసిన గుణములు కల ఖుర్ఆన్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారికి తెలిసిన సత్యము వచ్చినదో వారు దాన్ని తిరస్కరించారు. అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించే వారిపై అల్లాహ్ శాపము కురియుగాక.
Ang mga Tafsir na Arabe:
بِئْسَمَا اشْتَرَوْا بِهٖۤ اَنْفُسَهُمْ اَنْ یَّكْفُرُوْا بِمَاۤ اَنْزَلَ اللّٰهُ بَغْیًا اَنْ یُّنَزِّلَ اللّٰهُ مِنْ فَضْلِهٖ عَلٰی مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ ۚ— فَبَآءُوْ بِغَضَبٍ عَلٰی غَضَبٍ ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ مُّهِیْنٌ ۟
అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై విశ్వాసమునకు బదులుగా వారి మనస్సులు కోరుకున్న భాగము ఎంతో చెడ్డది. అయితే వారు అల్లాహ్ అవతరించిన దాన్ని అవిశ్వసించారు మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించారు. దైవదౌత్యము మరియు ఖుర్ఆన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించబడటం వలన దుర్మార్గంగా మరియు అసూయగా. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వారు తిరస్కరించటం వలన మరియు ముందు నుంచే తౌరాతులో మార్పు చేర్పులు చేయటం వలన వారు మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి రెట్టింపు ఆగ్రహానికి యోగ్యులయ్యారు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యమును తిరస్కరించే వారి కొరకు ప్రళయదినమున అవమానపరిచే శిక్ష కలదు.
Ang mga Tafsir na Arabe:
وَاِذَا قِیْلَ لَهُمْ اٰمِنُوْا بِمَاۤ اَنْزَلَ اللّٰهُ قَالُوْا نُؤْمِنُ بِمَاۤ اُنْزِلَ عَلَیْنَا وَیَكْفُرُوْنَ بِمَا وَرَآءَهٗ ۗ— وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ؕ— قُلْ فَلِمَ تَقْتُلُوْنَ اَنْۢبِیَآءَ اللّٰهِ مِنْ قَبْلُ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
ఈ యూదులందరితో మీరు అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన సత్యమును,సన్మార్గమును విశ్వసించండి అని పలకబడినప్పుడు వారు ఇలా పలికేవారు : మా ప్రవక్తలపై అవతరింపబడిన వాటిని మేము విశ్వసిస్తున్నాము. మరియు వారు అది కాకుండా వేరేవి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన దానిని తిరస్కరించేవారు. అది కూడా ఈ ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వారి వద్ద ఉన్న దానికి అనుగుణంగా ఉన్న సత్యము. ఒక వేళ వారు వాస్తవానికి తమపై అవతరింపబడిన వాటిని విశ్వసించి ఉంటే ఖుర్ఆన్ ను విశ్వసించేవారు. ఓ ప్రవక్త వారికి సమాధానమిస్తూ ఇలా పలకండి : ఎందుకని మీరు అల్లాహ్ ప్రవక్తలను మునుపటి నుండి హతమార్చేవారు. ఒక వేళ మీరు వాస్తవానికి వారు మీ వద్దకు తీసుకుని వచ్చిన సత్యమును విశ్వసించి ఉంటే.
Ang mga Tafsir na Arabe:
وَلَقَدْ جَآءَكُمْ مُّوْسٰی بِالْبَیِّنٰتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهٖ وَاَنْتُمْ ظٰلِمُوْنَ ۟
మరియు నిశ్చయంగా మీ ప్రవక్త అయిన మూసా అలైహిస్సలాం తన నిజాయితీపై సూచించే స్పష్టమైన ఆయతులను మీ వద్దకు తీసుకుని వచ్చారు. దాని తరువాత మీరు మూసా తన ప్రభువును కలవటానికి వెళ్ళిన తరువాత ఆవు దూడను తయారు చేసుకుని దాన్ని ఆరాధించేవారు. మరియు అల్లాహ్ తోపాటు మీరు సాటి కల్పించటం వలన దుర్మార్గమునకు పాల్పడ్డారు. మరియు ఆయన ఒక్కడే ఇతరులు కాకుండా ఆరాధనకు యోగ్యుడు.
Ang mga Tafsir na Arabe:
وَاِذْ اَخَذْنَا مِیْثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّوْرَ ؕ— خُذُوْا مَاۤ اٰتَیْنٰكُمْ بِقُوَّةٍ وَّاسْمَعُوْا ؕ— قَالُوْا سَمِعْنَا وَعَصَیْنَا ۗ— وَاُشْرِبُوْا فِیْ قُلُوْبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ؕ— قُلْ بِئْسَمَا یَاْمُرُكُمْ بِهٖۤ اِیْمَانُكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
మూసా అలైహిస్సలాంను అనుసరించమని మరియు ఆయన అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాన్ని స్వీకరించమని మేము మీపై దృఢమైన ప్రమాణమును తీసుకుని వచ్చినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. మరియు మేము మిమ్మల్ని భయపెట్టటానికి పర్వతమును మీపై తీసుకుని వచ్చి నిలబెట్టాము. మరియు మేము మీతో ఇలా పలికాము : మేము మీకు ప్రసాదించిన తౌరాతును శ్రమతో,కృషితో తీసుకోండి. మరియు స్వీకరించి విధేయత చూపే ఉద్దేశంతో వినండి. అలా గనుక జరగకపోతే మేము మీపై పర్వతమును పడవేస్తాము. అప్పుడు మీరు ఇలా పలికారు : మేము మా చెవులతో విన్నాము మరియు మేము మా చర్యల ద్వారా అవిధేయత చూపాము. వారి అవిశ్వాసం వలన ఆవు దూడ ఆరాధన వారి హృదయములలో చోటు చేసుకుంది. ఓ ప్రవక్త మీరు ఇలా పలకండి : ఒక వేళ మీరు విశ్వసించేవారైతే అల్లాహ్ పట్ల అవిశ్వాసం కలిగిన ఈ విశ్వాసం మీకు ఆదేశిస్తున్నది ఎంతో చెడ్డది. ఎందుకంటే సత్య విశ్వాసముతో పాటు అవిశ్వాసం ఉండదు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• اليهود أعظم الناس حسدًا؛ إذ حملهم حسدهم على الكفر بالله وردِّ ما أنزل، بسبب أن الرسول صلى الله عليه وسلم لم يكن منهم.
యూదులు ప్రజల్లోకెల్ల పెద్ద అసూయపరులు అందుకనే వారి అసూయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో నుంచి కాక పోవటం వలన అల్లాహ్ పట్ల అవిశ్వాసం పై మరియు ఆయన అవతరించిన దాన్ని ఖండించటం పై పురిగొల్పింది.

• أن الإيمان الحق بالله تعالى يوجب التصديق بكل ما أَنزل من كتب، وبجميع ما أَرسل من رسل.
అల్లాహ్ పై సత్యవిశ్వాసం ఆయన అవతరింపజేసిన గ్రంధములన్నింటిని మరియు ఆయన పంపించిన ప్రవక్తలందరిని దృవీకరించటమును అనివార్యం చేస్తుంది.

• من أعظم الظلم الإعراض عن الحق والهدى بعد معرفته وقيام الأدلة عليه.
పెద్ద దుర్మార్గముల్లో ఒకటి సత్యాన్ని,మార్గదర్శకత్వమును తెలుసుకున్న తరువాత దాని నుండి విముఖత చూపటం మరియు దానికి వ్యతిరేకంగా ఆధారాలను ఏర్పాటు చేయటం.

• من عادة اليهود نقض العهود والمواثيق، وهذا ديدنهم إلى اليوم.
ఒప్పొందాలను,ప్రమాణములను విచ్ఛిన్నం చేయటం యూదుల అలవాటులలో ఒకటి. మరియు ఇది ఈ రోజు వరకు వారి అలవాటుగానే ఉన్నది.

 
Salin ng mga Kahulugan Surah: Al-Baqarah
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara