Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Ayah: (61) Surah: Al-Baqarah
وَاِذْ قُلْتُمْ یٰمُوْسٰی لَنْ نَّصْبِرَ عَلٰی طَعَامٍ وَّاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ یُخْرِجْ لَنَا مِمَّا تُنْۢبِتُ الْاَرْضُ مِنْ بَقْلِهَا وَقِثَّآىِٕهَا وَفُوْمِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ؕ— قَالَ اَتَسْتَبْدِلُوْنَ الَّذِیْ هُوَ اَدْنٰی بِالَّذِیْ هُوَ خَیْرٌ ؕ— اِهْبِطُوْا مِصْرًا فَاِنَّ لَكُمْ مَّا سَاَلْتُمْ ؕ— وَضُرِبَتْ عَلَیْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَآءُوْ بِغَضَبٍ مِّنَ اللّٰهِ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ كَانُوْا یَكْفُرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ وَیَقْتُلُوْنَ النَّبِیّٖنَ بِغَیْرِ الْحَقِّ ؕ— ذٰلِكَ بِمَا عَصَوْا وَّكَانُوْا یَعْتَدُوْنَ ۟۠
మరియు మీరు మీ ప్రభువు అనుగ్రహమును తిరస్కరించినప్పటి వైనమును గుర్తు చేసుకోండి అప్పుడు మీరు అల్లాహ్ మీపై అవతరింపజేసిన మన్న,సల్వాను తినటం నుండి విసిగిపోయి ఇలా పలికారు : మారని ఒకేరకమైన ఆహారమును మేము సహించము. అప్పుడు మీరు మూసా అలైహిస్సలాంను అల్లాహ్ తో తమ కొరకు భూమి ఉత్పత్తి చేసే కాయగూరలను,ఆకుగూరలను,దోసకాయలను (దోసకాయ లాంటిదే కాని దాని కన్నపెద్దది),ధాన్యములను,పప్పును,ఉల్లిపాయలను ఆహారంగా వెలికితీయమని వేడుకోమని కోరారు. అప్పుడు మూసా అలైహిస్సలాం అయిష్టతను చూపుతూ ఇలా పలికారు : మీరు బదులుగా కోరుకున్న మీ కోరిక మన్న,సల్వా కన్న చాలా తక్కువైనది మరియు అల్పమైనది. మరియు అది (మన్న,సల్వా) మేలైనది,గౌరవప్రధమైనది. వాస్తవానికి అది మీ వద్దకు ఎటువంటి అలసట,శ్రమ లేకుండా వస్తున్నది. మీరు ఈ ఊరు నుండి ఏ ఉరుకైనా వెళ్ళండి అక్కడి పొలాల్లో,బజారులలో మీరు అడిగిన వాటిని పొందుతారు. మరియు వారు తమ మనోవాంఛలను అనుసరించటం వలన మరియు అల్లాహ్ వారి కొరకు ఎంపిక చేసిన వాటి నుండి పదేపదే విముఖత చూపటం వలన వారికి అవమానము,పేదరికం,కష్టాలు చుట్టుకున్నాయి. మరియు వారు ఆయన ధర్మము పట్ల విముఖత చూపటం వలన మరియు వారు ఆయన ఆయతులను తిరస్కరించటం వలన మరియు ఆయన ప్రవక్తలను దుర్మార్గముగా శతృత్వముగా హతమార్చటం వలన అల్లాహ్ ఆగ్రహమునకు లోనయ్యారు. ఇదంతా వారు అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడటం వలన మరియు ఆయన హద్దులను అతిక్రమించటం వలన.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• كل من يتلاعب بنصوص الشرع ويحرّفها فيه شَبَهٌ من اليهود، وهو مُتوعَّد بعقوبة الله تعالى.
ధర్మ ఆధారాలతో ఆటలాడి వాటిని తారుమారు చేసే ప్రతీ ఒక్కడు యూదులు లాంటివాడు. మరియు అతడు మహోన్నతుడైన అల్లాహ్ శిక్షతో వాగ్దానం చేయబడ్డాడు.

• عِظَمُ فضل الله تعالى على بني إسرائيل، وفي مقابل ذلك شدة جحودهم وعنادهم وإعراضهم عن الله وشرعه.
ఇశ్రాయీలు సంతతి వారిపై సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అనుగ్రహ గొప్పతనం, దీనికి ప్రతిగా వారి అవిశ్వాసం, మొండితనం మరియు వారు అల్లాహ్ నుండి మరియు ఆయన ధర్మ శాసనం నుండి తప్పుకోవడం.

• أن من شؤم المعاصي وتجاوز حدود الله تعالى ما ينزل بالمرء من الذل والهوان، وتسلط الأعداء عليه.
నిశ్చయంగా అవిధేయ కార్యాలు మరియు మహోన్నతుడైన అల్లాహ్ హద్దులను అతిక్రమించటం యొక్క దుష్ప్రభావములోంచిది మవిషిపై దిగే అవమానము మరియు పరాభవము మరియు అతని శతృవుల ఆధిక్యత.

 
Salin ng mga Kahulugan Ayah: (61) Surah: Al-Baqarah
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Indise ng mga Salin

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Isara