Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Ayah: (5) Surah: Al-Hajj
یٰۤاَیُّهَا النَّاسُ اِنْ كُنْتُمْ فِیْ رَیْبٍ مِّنَ الْبَعْثِ فَاِنَّا خَلَقْنٰكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِنْ مُّضْغَةٍ مُّخَلَّقَةٍ وَّغَیْرِ مُخَلَّقَةٍ لِّنُبَیِّنَ لَكُمْ ؕ— وَنُقِرُّ فِی الْاَرْحَامِ مَا نَشَآءُ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ۚ— وَمِنْكُمْ مَّنْ یُّتَوَفّٰی وَمِنْكُمْ مَّنْ یُّرَدُّ اِلٰۤی اَرْذَلِ الْعُمُرِ لِكَیْلَا یَعْلَمَ مِنْ بَعْدِ عِلْمٍ شَیْـًٔا ؕ— وَتَرَی الْاَرْضَ هَامِدَةً فَاِذَاۤ اَنْزَلْنَا عَلَیْهَا الْمَآءَ اهْتَزَّتْ وَرَبَتْ وَاَنْۢبَتَتْ مِنْ كُلِّ زَوْجٍ بَهِیْجٍ ۟
ఓ ప్రజలారా ఒక వేళ మరణాంతరం మీ లేపబడటం పై మా సామర్ధ్యం విషయంలో మీకు ఎటువంటి సందేహము ఉంటే మీరు మీ పుట్టుక విషయంలో యోచన చేయండి. నిశ్ఛయంగా మేము మీ తండ్రి ఆదంను మట్టితో సృష్టించాము. ఆ తరువాత ఆయన సంతానమును మనిషి స్త్రీ గర్భములో విసిరే వీర్యముతో సృష్టించాము. ఆ తరువాత ఆ వీర్యపు బిందువు ఒక రక్తపు ముద్దగా మారుతుంది. ఆ తరువాత ఆ రక్తపు ముద్ద నమిలివేయబడిన మాంసపు ముక్కను పోలిన ఒక మాంసపు ముక్కగా మారుతుంది. ఆ తరువాత మాంసపు ముక్క మారి జీవం ఉన్నపిల్ల వాడి స్థితిలో బయటకు వచ్చేంత వరకు గర్భములో పూర్తి రూపమును దాల్చే వరకు ఉండవచ్చు లేదా పూర్తి రూపము దాల్చకుండానే గర్భము పడవేయవచ్చు. మీ పుట్టుకను రకరకాల స్థితుల నుండి జరపటం ద్వారా మేము మా సామర్ధ్యమును మీ కొరకు స్పష్టపరచటానికి. మేము గర్భకోశాలలో శిశువల్లోంచి మేము కోరుకున్న వారిని ఒక నిర్ణీత కాలము అది తొమ్మిది నెలల్లో జన్మించే వరకు స్థిరంగా ఉంచుతాము. ఆ తరువాత మేము మీ తల్లుల గర్భముల నుంచి మిమ్మల్ని పిల్లల రూపములో బయటకి తీస్తాము. ఆ తరువాత మీరు పరిపూర్ణ బలము, బుద్ధికి చేరుకోవటానికి (మీరు యవ్వనమునకు చేరుకోవటం కొరకు). మరియు మీలో నుండి దాని కన్న ముందే చనిపోయే వారు ఉంటారు. మీలో నుండి బలము,బుద్ధి బలహీనమయ్యే స్థితి వృధ్ధాప్య వయస్సునకు చేరుకునేంత వరకు జీవించే వారు ఉంటారు. చివరికు పరిస్థితి పిల్లవాడి పరిస్థితి అయిపోతుంది. అతనికి తెలిసిన వాటిని గురించి తెలియని వాడైపోతాడు.మరియు మీరు భూమిని ఎటువంటి మొక్కలు లేకుండా ఎండిపోయినగా మీరు చూస్తారు. మేము ఎప్పుడైతే దానిపై వర్షపు నీటిని కురిపిస్తామో అది మొక్కలతో వికసించిపోతుంది. దాని మొక్కలు పెరగటం కారణంగా అది ఎత్తుగా అవుతుంది. మరియు అది అందమైన దృశ్యం కల అన్నిరకాల మొక్కలను వెలికితీస్తుంది.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• وجوب الاستعداد ليوم القيامة بزاد التقوى.
దైవభీతి సామగ్రి ద్వారా ప్రళయ దినం కొరకు సిద్ధం కావటం తప్పనిసరి.

• شدة أهوال القيامة حيث تنسى المرضعة طفلها وتسقط الحامل حملها وتذهب عقول الناس.
పాలు త్రాపించే స్త్రీ తన పిల్లవాడిని మరిచిపోయే,గర్భిణీ తన గర్భమును పడవేసే,ప్రజల మతిపోయే స్థితి ప్రళయంయొక్క భయాందోళనల తీవ్రత.

• التدرج في الخلق سُنَّة إلهية.
సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సాంప్రదాయం.

• دلالة الخلق الأول على إمكان البعث.
మొడటి సారి సృష్టించటం మరణాంతరం లేపటం సాధ్యము అనటానికి సూచన.

• ظاهرة المطر وما يتبعها من إنبات الأرض دليل ملموس على بعث الأموات.
వర్షము యొక్క బహిర్గతం,దానిని అనుసరించిన భూమి అంతరోత్పత్తి మృతులు మరల లేపబడటంపై ధృడమైన ఆధారము.

 
Salin ng mga Kahulugan Ayah: (5) Surah: Al-Hajj
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Indise ng mga Salin

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Isara