Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Saba’   Ayah:

సూరహ్ సబా

Ilan sa mga Layon ng Surah:
بيان أحوال الناس مع النعم، وسنة الله في تغييرها.
కృపలతో ప్రజల స్థితిగతుల ప్రకటన మరియు వాటిని మార్చడంలో అల్లాహ్ సంప్రదాయము.

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ وَلَهُ الْحَمْدُ فِی الْاٰخِرَةِ ؕ— وَهُوَ الْحَكِیْمُ الْخَبِیْرُ ۟
సర్వస్తోత్రాలన్నీ అల్లాహ్ కొరకే ఆకాశముల్లో ఉన్నవన్నీ, భూమిలో ఉన్నవన్నీ సృష్టిపరంగా,అధికారపరంగా పర్యాలోచనపరంగా ఆయనకే చెందుతాయి. పరలోకములో పొగడ్తలు పరిశుద్ధుడైన ఆయన కొరకే. మరియు ఆయన తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు. తన దాసుల స్థితులను గురించి తెలుసుకునే వాడు. వాటిలో నుండి ఏది ఆయనపై గోప్యంగా ఉండదు.
Ang mga Tafsir na Arabe:
یَعْلَمُ مَا یَلِجُ فِی الْاَرْضِ وَمَا یَخْرُجُ مِنْهَا وَمَا یَنْزِلُ مِنَ السَّمَآءِ وَمَا یَعْرُجُ فِیْهَا ؕ— وَهُوَ الرَّحِیْمُ الْغَفُوْرُ ۟
భూమిలో ప్రవేశించే నీరు,మొక్కల గురించి ఆయనకు తెలుసు. మరియు దాని నుండి వెలుపలకి వచ్చే మొక్కలు,ఇతరవాటి గురించి ఆయనకు తెలుసు. మరియు ఆకాశము నుండి దిగే వర్షము,దైవదూతలు,ఆహారము గురించి ఆయనకు తెలుసు. మరియు ఆకాశము వైపునకు ఎక్కే దైవదూతలు,తన దాసుల కర్మలు,వారి ఆత్మల గురించి ఆయనకు తెలుసు. మరియు ఆయన విశ్వాసపరులైన తన దాసులపై అపారంగా కరుణించేవాడు, తన వద్ద పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును.
Ang mga Tafsir na Arabe:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لَا تَاْتِیْنَا السَّاعَةُ ؕ— قُلْ بَلٰی وَرَبِّیْ لَتَاْتِیَنَّكُمْ ۙ— عٰلِمِ الْغَیْبِ ۚ— لَا یَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِی السَّمٰوٰتِ وَلَا فِی الْاَرْضِ وَلَاۤ اَصْغَرُ مِنْ ذٰلِكَ وَلَاۤ اَكْبَرُ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِیْنٍ ۟ۙ
అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారు ఇలా అంటారు : ప్రళయం మా వద్దకు ఎన్నటికీ రాదు. ఓ ప్రవక్తా వారితో అనండి : ఎందుకు రాదు అల్లాహ్ సాక్షిగా మీరు తిరస్కరిస్తున్న ప్రళయం మీ వద్ధకు తప్పకుండా వస్తుంది. దాని యొక్క సమయం గురించి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అగోచరమైన ప్రళయము,ఇతర వాటి గురించి పరిశుద్ధుడైన ఆయనకు తెలుసు. ఆకాశముల్లో గాని భూమిలో గాని చిన్న చీమ బరువంతది కూడా పరిశుద్ధుడై ఆయన జ్ఞానము నుండి అదృశ్యం కాదు. ఈ ప్రస్తావించబడిన దాని నుండి చిన్నది గాని పెద్దది గాని ఆయన నుండి అదృశ్యం కాదు కానీ అది ఒక స్పష్టమైన పుస్తకములో వ్రాయబడి ఉన్నది. అది లౌహె మహ్ఫూజ్ అందులో ప్రళయం వరకు జరిగేవన్ని వ్రాయబడి ఉన్నాయి.
Ang mga Tafsir na Arabe:
لِّیَجْزِیَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِیْمٌ ۟
అల్లాహ్ లౌహె మహ్ఫూజ్ లో నిరూపితం చేసిన దాన్ని అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,సత్కార్యములు చేసిన వారికి ప్రతిఫలమును ప్రసాదించటానికి నిరూపించాడు. ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరి కొరకు అల్లాహ్ వద్ద నుండి వారి పాపములకు మన్నింపు ఉన్నది. ఆయన వాటి వలన వారిని శిక్షించడు. మరియు వారి కొరకు గౌరవప్రధమైన ఆహారోపాధి కలదు. అది ప్రళయదినమున ఆయన స్వర్గము.
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ سَعَوْ فِیْۤ اٰیٰتِنَا مُعٰجِزِیْنَ اُولٰٓىِٕكَ لَهُمْ عَذَابٌ مِّنْ رِّجْزٍ اَلِیْمٌ ۟
మరియు ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన ఆయతులను (సూచనలను) విఫలం చేయటానికి ప్రయత్నిస్తారో వారు వాటిని మంత్రజాలము అన్నారు. మరియు మా ప్రవక్తలను జ్యోతిష్యుడు,మంత్రజాలకుడు,కవి అన్నారు. ఈ గుణాలతో వర్ణించబడిన వారందరి కొరకు ప్రళయదినాన ఎంతో చెడ్డదైన,తీవ్రమైన శిక్ష కలదు.
Ang mga Tafsir na Arabe:
وَیَرَی الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ الَّذِیْۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ هُوَ الْحَقَّ ۙ— وَیَهْدِیْۤ اِلٰی صِرَاطِ الْعَزِیْزِ الْحَمِیْدِ ۟
మరియు అనుచరుల్లోంచి విద్వాంసులు, గ్రంధవహుల పండితుల్లోంచి విశ్వసించిన వారు మీ వైపునకు అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ఎటువంటి సందేహం లేని సత్యమని సాక్ష్యం పలుకుతారు. మరియు అది ఎవరూ ఓడించలేని ఆధిక్యుడి మార్గం వైపునకు మార్గదర్శకతం వహిస్తుంది. ఆయన ఇహపరాల్లో స్థుతింపదగినవాడు.
Ang mga Tafsir na Arabe:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا هَلْ نَدُلُّكُمْ عَلٰی رَجُلٍ یُّنَبِّئُكُمْ اِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ ۙ— اِنَّكُمْ لَفِیْ خَلْقٍ جَدِیْدٍ ۟ۚ
మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసం కనబరచిన వారు తమలోని కొంతమందితో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాని గురించి ఆశ్ఛర్యపోతు,హేళన చేస్తూ ఇలా పలికారు : మీరు మరణించి ముక్కలు ముక్కలగా చేయబడినప్పుడు మీరు మీ మరణం తరువాత జీవింపజేయబడి లేపబడుతారని మీకు తెలియపరిచే ఒక వ్యక్తి ని మేము మీకు చూపించమా ?.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• سعة علم الله سبحانه المحيط بكل شيء.
పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క జ్ఞానము విస్తరణ అన్ని వస్తువులకు చుట్టుముట్టి ఉన్నది.

• فضل أهل العلم.
జ్ఞానము కలవారి యొక్క ప్రాముఖ్యత.

• إنكار المشركين لبعث الأجساد تَنَكُّر لقدرة الله الذي خلقهم.
శరీరములు మరలా లేపబడటమును ముష్రికుల యొక్క తిరస్కారము వారిని సృష్టించిన అల్లాహ్ యొక్క సామర్ధ్యమును తిరస్కరించటం.

اَفْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا اَمْ بِهٖ جِنَّةٌ ؕ— بَلِ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ فِی الْعَذَابِ وَالضَّلٰلِ الْبَعِیْدِ ۟
మరియు వారు ఇలా పలికారు : ఈ వ్యక్తి అల్లాహ్ పై అబద్దమును కల్పించుకుని మా మరణము తరువాత మేము మరల లేపబడటం గురించి తాను చెప్పినది చెబుతున్నాడా లేదా అతను పిచ్చివాడా వాస్తవం లేని వాటి గురించి అర్ధంపర్ధం లేకుండా మాట్లాడుతున్నాడా ?. వీరందరు అనుకుంటున్నట్లు విషయం కాదు. అంతే కాక జరిగిందేమిటంటే పరలోకమును విశ్వసించని వారే ప్రళయదినమున కఠిన శిక్షలో ఉంటారు. మరియు ఇహలోకంలో సత్యము నుండి చాలా దూరపు అపమార్గములో పడి ఉంటారు.
Ang mga Tafsir na Arabe:
اَفَلَمْ یَرَوْا اِلٰی مَا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ ؕ— اِنْ نَّشَاْ نَخْسِفْ بِهِمُ الْاَرْضَ اَوْ نُسْقِطْ عَلَیْهِمْ كِسَفًا مِّنَ السَّمَآءِ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّكُلِّ عَبْدٍ مُّنِیْبٍ ۟۠
ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరు తమ ముందట ఉన్న భూమిని చూడటం లేదా,మరియు తమ వెనుకనున్న ఆకాశమును చూడటంలేదా ?. మేము భూమిని వారి కాళ్ళ క్రింది నుండి కూర్చదలచకుంటే దాన్ని మేము వారి క్రింది నుండి కూర్చి వేస్తాము. మరియు ఒక వేళ మేము వారిపై ఆకాశము నుండి ఏదైన ముక్కను పడవేయదలచుకుంటే వారిపై దాన్ని పడవేశేవారము. నిశ్ఛయంగా ఇందులో తన ప్రభువు వైపు ఎక్కువగా మరలే ప్రతీ దాసుని కొరకు ఒక ఖచ్చితమైన సూచన కలదు. దానితో అతడు అల్లాహ్ సామర్ధ్యముపై ఆధారం చూపుతాడు. అయితే దానిపై సామర్ధ్యం కలవాడు మీ మరణం తరువాత, మీ శరీరములు ముక్కలు ముక్కలు చేసిన తరువాత మిమ్మల్ని మరల లేపటంపై సామర్ధ్యం కలవాడు.
Ang mga Tafsir na Arabe:
وَلَقَدْ اٰتَیْنَا دَاوٗدَ مِنَّا فَضْلًا ؕ— یٰجِبَالُ اَوِّبِیْ مَعَهٗ وَالطَّیْرَ ۚ— وَاَلَنَّا لَهُ الْحَدِیْدَ ۟ۙ
మరియు మేము దావూద్ అలైహిస్సలాంకు మా వద్ద నుండి దైవదౌత్యమును,అధికారమును ప్రసాదించాము. మరియు మేము పర్వతాలకు ఇలా ఆదేశించాము : ఓ పర్వతాల్లారా మీరు దావూద్ తో కలిసి తస్బీహ్ ను చదవండి. మరియు ఇలాగే మేము పక్షులకూ తెలిపాము. మరియు ఆయన కొరకు ఇనుమును దానితో ఆయన తాను తలచిన పరికరములను తయారు చేసుకోవటానికి మెత్తగా చేశాము.
Ang mga Tafsir na Arabe:
اَنِ اعْمَلْ سٰبِغٰتٍ وَّقَدِّرْ فِی السَّرْدِ وَاعْمَلُوْا صَالِحًا ؕ— اِنِّیْ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
ఓ దావూద్ మీ యోధులను వారి శతృవుల బాధ నుండి రక్షించటానికి మీరు విస్తృత కవచాలను తయారుచేయండి. మరియు సువ్వలను చుట్టటం కొరకు సరైనవిగా చేయండి, అయితే మీరు వాటిని సన్నవిగా చేయకండి ఎందుకంటే అవి వాటిలో స్థిరంగా ఉండవు మరియు వాటిని గట్టిగా (లావుగా) చేయకండి ఎందుకంటే అవి అందులో దూరవు. మీరు సత్కార్యమును చేయండి. నిశ్ఛయంగా నేను మీరు చేసేవాటిని చూసేవాడిని. మీ కర్మల్లోంచి ఏదీ నా పై గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే నేను వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాను.
Ang mga Tafsir na Arabe:
وَلِسُلَیْمٰنَ الرِّیْحَ غُدُوُّهَا شَهْرٌ وَّرَوَاحُهَا شَهْرٌ ۚ— وَاَسَلْنَا لَهٗ عَیْنَ الْقِطْرِ ؕ— وَمِنَ الْجِنِّ مَنْ یَّعْمَلُ بَیْنَ یَدَیْهِ بِاِذْنِ رَبِّهٖ ؕ— وَمَنْ یَّزِغْ مِنْهُمْ عَنْ اَمْرِنَا نُذِقْهُ مِنْ عَذَابِ السَّعِیْرِ ۟
మరియు మేము దావూద్ కుమారుడైన సులైమాన్ అలైహిమస్సలామ్ కు గాలిని వశపరచాము. అది ఉదయము పూట ఒక నెల ప్రయాణపు గమ్యాన్ని చేదిస్తూ పయనిస్తుంది. సాయంత్రం పూట ఒక నెల ప్రయాణపు గమ్యాన్ని చేదిస్తూ పయనిస్తుంది. మరియు రాగితో ఆయన తలచుకున్నది తయారు చేయటానికి ఆయన కొరకు మేము రాగి ఊటను ప్రవహింపజేశాము. మరియు అతని ప్రభువు ఆజ్ఞతో, అతని సన్నధిలో పని చేసే జిన్నులను మేము అతనికి వశపరచాము. మరియు జిన్నుల్లోంచి మేము చేయమని ఆదేశంచిన కార్యం నుండి ఎవరైన మరలిపోతే మేము వారికి మండే అగ్ని శిక్షను రుచి చూపిస్తాము.
Ang mga Tafsir na Arabe:
یَعْمَلُوْنَ لَهٗ مَا یَشَآءُ مِنْ مَّحَارِیْبَ وَتَمَاثِیْلَ وَجِفَانٍ كَالْجَوَابِ وَقُدُوْرٍ رّٰسِیٰتٍ ؕ— اِعْمَلُوْۤا اٰلَ دَاوٗدَ شُكْرًا ؕ— وَقَلِیْلٌ مِّنْ عِبَادِیَ الشَّكُوْرُ ۟
ఈ జిన్నులందరు సులైమాన్ అలైహిస్సలాం కొరకు ఆయన కోరిన నమాజుల కొరకు మస్జిదులను, భవనములను మరియు ఆయన కోరిన ప్రతిమలను మరియు ఆయన కోరిన పెద్ద పెద్ద నీటి హౌజుల్లాంటి గంగాళాలను, స్థిరంగా ఉండే అవి పెద్దవిగా ఉండటం వలన కదలించలేని వంట దేగిశాలను తయారు చేసేవారు. మరియు మేము వారిని ఇలా ఆదేశించాము : ఓ దావూద్ వంశీయులారా మీరు అల్లాహ్ మీకు అనుగ్రహించిన వాటికి అల్లాహ్ కు కృతజ్ఞతగా ఆచరించండి. మరియు నా దాసుల్లోంచి నేను ప్రసాదించిన వాటిపై నాకు కృతజ్ఞత తెలుపుకునేవారు తక్కువ మంది ఉన్నారు.
Ang mga Tafsir na Arabe:
فَلَمَّا قَضَیْنَا عَلَیْهِ الْمَوْتَ مَا دَلَّهُمْ عَلٰی مَوْتِهٖۤ اِلَّا دَآبَّةُ الْاَرْضِ تَاْكُلُ مِنْسَاَتَهٗ ۚ— فَلَمَّا خَرَّ تَبَیَّنَتِ الْجِنُّ اَنْ لَّوْ كَانُوْا یَعْلَمُوْنَ الْغَیْبَ مَا لَبِثُوْا فِی الْعَذَابِ الْمُهِیْنِ ۟
మేము సులైమాన్ అలైహిస్సలాం పై మృత్యువును నిర్ణయించినప్పుడు జున్నులకు ఆయన ఆనుకుని ఉన్న ఆయన చేతికర్రను తింటున్న చీడ పురుగు తప్ప ఎవరూ ఆయన మరణించినట్లు తెలియపరచలేదు. ఎప్పుడైతే ఆయన పడిపోయారో జిన్నులకి తమకు అగోచర విషయాల గురించి జ్ఞానం లేదని స్పష్టమయ్యింది. ఒక వేళ వారికి అది తెలిసి ఉంటే వారు తమ కొరకు ఉన్న అవమానకరమైన శిక్షలో ఉండేవారు కాదు మరియు అది వారు చేసే ఆ కష్టమైన కార్యాలు వేటినైతే వారు సులైమాన్ అలైహిస్సలాం కొరకు ఆయన జీవించి ఉండి తమను పర్యవేక్షిస్తున్నారని తమ భావనతో చేసేవారో.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• تكريم الله لنبيه داود بالنبوة والملك، وبتسخير الجبال والطير يسبحن بتسبيحه، وإلانة الحديد له.
అల్లాహ్ తన ప్రవక్త దావూద్ అలైహిస్సలాం ను దైవదౌత్యము ద్వారా,రాజరికము ద్వారా,పర్వతములను,పక్షులను ఆదీనంలో చేయటంతో అవి ఆయన తస్బీహ్ తోపాటు తస్బీహ్ పటించటం ద్వారా,ఆయన కొరకు లోహమును మెత్తగా చేయటం ద్వారా గౌరవమును కలిగించాడు.

• تكريم الله لنبيه سليمان عليه السلام بالنبوة والملك.
అల్లాహ్ తన ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం గారిని దైవ దౌత్యం ద్వారా,రాజరికం ద్వారా గౌరవించటం.

• اقتضاء النعم لشكر الله عليها.
అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవాలని నిర్ణయమవుతుంది.

• اختصاص الله بعلم الغيب، فلا أساس لما يُدَّعى من أن للجن أو غيرهم اطلاعًا على الغيب.
అగోచర విషయాల జ్ఞానం అల్లాహ్ కు ప్రత్యేకము. జిన్నుల కొరకు,ఇతరుల కొరకు అగోచర విషయాల జ్ఞానం ఉన్నదన్న వాదనకు ఎటువంటి ఆధారం లేదు.

لَقَدْ كَانَ لِسَبَاٍ فِیْ مَسْكَنِهِمْ اٰیَةٌ ۚ— جَنَّتٰنِ عَنْ یَّمِیْنٍ وَّشِمَالٍ ؕ۬— كُلُوْا مِنْ رِّزْقِ رَبِّكُمْ وَاشْكُرُوْا لَهٗ ؕ— بَلْدَةٌ طَیِّبَةٌ وَّرَبٌّ غَفُوْرٌ ۟
నిశ్ఛయంగా సబా తెగ కొరకు వారు నివాసముండే వారి నివాసములో అల్లాహ్ సామర్ధ్యముపై, వారిపై ఉన్న ఆయన అనుగ్రహములపై స్పష్టమైన సూచన కలదు. అది రెండు తోటలు : ఒకటి కుడివైపున రెండవది ఎడమ వైపున కలదు. మరియు మేము వారితో ఇలా పలికాము : మీరు మీ ప్రభువు ప్రసాదించిన ఆహారము నుండి తినండి. మరియు ఆయన అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇది ఉత్తమమైన పట్టణము. మరియు ఈ అల్లాహ్ తన వైపు పశ్చాత్తాప్పడి వచ్చేవారి పాపములను మన్నించే ప్రభువు.
Ang mga Tafsir na Arabe:
فَاَعْرَضُوْا فَاَرْسَلْنَا عَلَیْهِمْ سَیْلَ الْعَرِمِ وَبَدَّلْنٰهُمْ بِجَنَّتَیْهِمْ جَنَّتَیْنِ ذَوَاتَیْ اُكُلٍ خَمْطٍ وَّاَثْلٍ وَّشَیْءٍ مِّنْ سِدْرٍ قَلِیْلٍ ۟
అప్పుడు వారు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవటం నుండి,ఆయన ప్రవక్తలపై విశ్వాసము కనబరచటం నుండి విముఖత చూపారు. అప్పుడు మేము వారిని వారి అనుగ్రహాలను శిక్షగా చేసి శిక్షించాము. అప్పుడు మేము వారిపై ఉధృతమైన వరదను పంపించాము అది వారి కట్టను శిథిలం చేసి వారి పంటలను ముంచివేసింది. మరియు మేము వారి రెండు తోటలను చేదు ఫలములు గల రెండు తోటలుగా చేశాము. మరియు వాటిలో ఫలించని ఝూవుక చెట్లు,కొన్ని రేగు చెట్లు కలవు.
Ang mga Tafsir na Arabe:
ذٰلِكَ جَزَیْنٰهُمْ بِمَا كَفَرُوْا ؕ— وَهَلْ نُجٰزِیْۤ اِلَّا الْكَفُوْرَ ۟
ఈ మార్పు ఏదైతే వారు ఉన్న అనుగ్రహాల్లో జరిగినదో అది వారి కృతఘ్నత వలన,అనుగ్రహాల పట్ల కృతజ్ఞత తెలుపుకోవటం నుండి వారి విముఖత తెలుపుకోవటం వలన. మేము ఈ తీవ్రమైన శిక్షను పరిశుద్ధుడైన అల్లాహ్ అనుగ్రహాలను ఎక్కువగా తిరస్కరించేవాడికి,వాటిపట్ల కృతఘ్నుడయ్యే వాడికి మాత్రమే విధిస్తాము.
Ang mga Tafsir na Arabe:
وَجَعَلْنَا بَیْنَهُمْ وَبَیْنَ الْقُرَی الَّتِیْ بٰرَكْنَا فِیْهَا قُرًی ظَاهِرَةً وَّقَدَّرْنَا فِیْهَا السَّیْرَ ؕ— سِیْرُوْا فِیْهَا لَیَالِیَ وَاَیَّامًا اٰمِنِیْنَ ۟
మరియు యమన్ లో సబా వాసుల మధ్య,మేము శుభాలను ప్రసాదించిన సిరియా (షామ్) బస్తీల మధ్య దగ్గర దగ్గరగా ఉండే బస్తీలను మేము ఏర్పరచాము. మరియు మేము అందులో పయనమును నిర్ధారించాము ఏవిధంగానంటే వారు సిరియా చేరే వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బస్తీ నుండి ఇంకొక బస్తీకి నడుస్తున్నారు. మరియు మేము వారితో ఇలా పలికాము : మీరు అందులో మీకు ఇష్టమయినప్పుడు రాత్రి లేదా పగలు శతృవు నుండి,ఆకలి నుండి,దాహం నుండి భద్రంగా ప్రయాణమును కొనసాగించండి.
Ang mga Tafsir na Arabe:
فَقَالُوْا رَبَّنَا بٰعِدْ بَیْنَ اَسْفَارِنَا وَظَلَمُوْۤا اَنْفُسَهُمْ فَجَعَلْنٰهُمْ اَحَادِیْثَ وَمَزَّقْنٰهُمْ كُلَّ مُمَزَّقٍ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ ۟
అప్పుడు వారు దూరాలను దగ్గర చేస్తూ తమపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలతో వారు మిడిసిపోయారు. మరియు ఇలా పలికారు : ఓ మా ప్రభువా నీవు ఈ బస్తీలను తొలగించి మా ప్రయాణముల మధ్య దూరములను కలిగించు తద్వారా మేము ప్రయాణముల అలసట రుచిని చూడవచ్చు మరియు మా సవారీల గొప్పతనము స్పష్టమవుతుంది. మరియు వారు అల్లాహ్ అనుగ్రహాలతో మిడిసి పడటం,ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటం నుండి విముఖత చూపటం,తమలో నుండి పేదవారిపై తమ అసూయ చెందటం వలన తమ స్వయముపైనే హింసకు పాల్పడ్డారు. అయితే మేము వారిని వారి తరువాత వారు చెప్పుకునే మాటలుగా చేశాము. మరియు వారు ఒకరితో ఒకరు సంభాషించుకోకుండా వారిని బస్తీల్లో పూర్తిగా విచ్చిన్నం చేశాము. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన సబావాసులపై అనుగ్రహించబడటం,ఆ పిదప వారి కృతఘ్నత,వారి మిడిసిపడటం వలన వారితో ప్రతీకారం తీసుకోవటం లో అల్లాహ్ పై విధేయత చూపటంపై,అయన పై అవిధేయత నుండి దూరంగా ఉండటంపై,ఆపదపై ఎక్కువగా సహనం చూపే ప్రతి ఒక్కరి కొరకు,తనపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలపై ఎక్కువగా కృతజ్ఞతలు తెలుపుకునే ప్రతి ఒక్కరి కొరకు గుణపాఠం ఉన్నది.
Ang mga Tafsir na Arabe:
وَلَقَدْ صَدَّقَ عَلَیْهِمْ اِبْلِیْسُ ظَنَّهٗ فَاتَّبَعُوْهُ اِلَّا فَرِیْقًا مِّنَ الْمُؤْمِنِیْنَ ۟
మరియు ఇబ్లీసు వారిని మోహింపజేయగలడని,వారిని సత్యము నుండి తప్పించగలడని తాను ఊహించినది వారిపై నిజం చేసి నిరూపించాడు. అప్పుడు విశ్వాసపరుల్లోంచి ఒక వర్గము తప్ప వారు అవిశ్వాసములో,అపమార్గములో అతన్ని అనుసరించారు. ఎందుకంటే వారు(విశ్వాసులు) అతన్ని అనుసరించకుండా అతని ఆశలపై నీరు చల్లారు.
Ang mga Tafsir na Arabe:
وَمَا كَانَ لَهٗ عَلَیْهِمْ مِّنْ سُلْطٰنٍ اِلَّا لِنَعْلَمَ مَنْ یُّؤْمِنُ بِالْاٰخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِیْ شَكٍّ ؕ— وَرَبُّكَ عَلٰی كُلِّ شَیْءٍ حَفِیْظٌ ۟۠
మరియు ఇబ్లీసుకి అతను వారిని మార్గభ్రష్టతకు లోను చేసే ఎటువంటి అధికారము వారిపై లేదు. మరియు అతను మాత్రం వారికి అలంకరించి చూపిస్తాడు,వారిని మోహింపజేస్తాడు. కాని ఎవరు పరలోకముపై, అందులో ఉన్న ప్రతిఫలంపై విశ్వాసం పెడతాడో,ఎవరు పరలోక విషయంలో సందేహములో ఉన్నాడో మేము తెలుసుకోవటానికి వారిని మోహింపజేయటానికి అతనికి అనుమతినిచ్చాము. ఓ ప్రవక్తా మీ ప్రభువు ప్రతీ వస్తువుని కనిపెట్టుకుని ఉంటాడు. ఆయన తన దాసుల కర్మలను కనిపెట్టుకుని ఉంటాడు. వాటిపరంగానే వారికి ఆయన ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Ang mga Tafsir na Arabe:
قُلِ ادْعُوا الَّذِیْنَ زَعَمْتُمْ مِّنْ دُوْنِ اللّٰهِ ۚ— لَا یَمْلِكُوْنَ مِثْقَالَ ذَرَّةٍ فِی السَّمٰوٰتِ وَلَا فِی الْاَرْضِ وَمَا لَهُمْ فِیْهِمَا مِنْ شِرْكٍ وَّمَا لَهٗ مِنْهُمْ مِّنْ ظَهِیْرٍ ۟
ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు అల్లాహ్ ను వదిలి మీ కొరకు ఆరాధ్య దైవాలుగా భావించుకున్న వారిని మీకు ప్రయోజనమును తీసుకుని రావటానికి లేదా మీ నుండి నష్టమును దూరం చేయటానికి పిలుచుకోండి. అయితే వారికి ఆకాశముల్లో గాని భూమిలో గాని రవ్వంత బరువు గల దానికి అధికారం లేదు. మరియు అల్లాహ్ తో పాటు వారికి వాటిలో భాగస్వామ్యం లేదు. మరియు అల్లాహ్ కి సహాయం చేయటానికి సహాయకుడెవడూ లేడు. ఎందుకంటే ఆయన భాగస్వాముల,సహాయకుల అక్కర లేనివాడు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• الشكر يحفظ النعم، والجحود يسبب سلبها.
కృతజ్ఞత అనుగ్రహాలను పరిరక్షిస్తుంది మరియు తిరస్కారము (కృతఘ్నత) వాటిని కోల్పోవటానికి కారణమవుతుంది.

• الأمن من أعظم النعم التي يمتنّ الله بها على العباد.
శాంతి (భద్రత) అల్లాహ్ తన దాసులకి అనుగ్రహించిన గొప్ప అనుగ్రహము.

• الإيمان الصحيح يعصم من اتباع إغواء الشيطان بإذن الله.
సరైన విశ్వాసము అల్లాహ్ అనుమతితో షైతాను మోసమునకు అనుసరించటం నుండి రక్షిస్తుంది.

• ظهور إبطال أسباب الشرك ومداخله كالزعم بأن للأصنام مُلْكًا أو مشاركة لله، أو إعانة أو شفاعة عند الله.
విగ్రహాలకు అధికారం ఉన్నదని లేదా అల్లాహ్ కొరకు భాగస్వామ్యం గలదని లేదా సహాయం చేయటం లేదా అల్లాహ్ వద్ద సిఫారసు చేయటం ఉన్నదని భావించటం లాంటి షిర్కు కారకాలు,వాటి ద్వారాలు అసత్యపరచటము స్పష్టమవటం.

وَلَا تَنْفَعُ الشَّفَاعَةُ عِنْدَهٗۤ اِلَّا لِمَنْ اَذِنَ لَهٗ ؕ— حَتّٰۤی اِذَا فُزِّعَ عَنْ قُلُوْبِهِمْ قَالُوْا مَاذَا ۙ— قَالَ رَبُّكُمْ ؕ— قَالُوا الْحَقَّ ۚ— وَهُوَ الْعَلِیُّ الْكَبِیْرُ ۟
మరియు పరిశుద్ధుడైన ఆయన వద్ద ఆయన అనుమతించిన వారి కొరకు మాత్రమే సిఫారసు ప్రయోజనం చేకూరుస్తుంది. మరియు అల్లాహ్ తన గొప్పతనం వలన తాను ఇష్టపడిన వారి కొరకు మాత్రమే సిఫారసు విషయంలో అనుమతిస్తాడు. ఆయన గొప్పతనములోంచి ఆయన ఆకాశములో మాట్లాడినప్పుడు ఆయన మాట కొరకు దైవదూతలు వినయంతో తమ రెక్కలతో కొడతారు చివరికి వారి హృదయముల నుండి భయం తొలిగిపోవగానే దైవదూతలు జిబ్రయీల్ తో మీ ప్రభువు ఏమి అన్నాడు ? అని అంటారు. జిబ్రయీల్ ఆయన సత్యం పలికాడు అని సమాధానమిస్తారు. మరియు ఆయన తన అస్తిత్వములో,తన ఆధిక్యతలో మహోన్నతుడు, ఇతర వస్తువులన్నింటి నుండి గొప్పవాడు.
Ang mga Tafsir na Arabe:
قُلْ مَنْ یَّرْزُقُكُمْ مِّنَ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— قُلِ اللّٰهُ ۙ— وَاِنَّاۤ اَوْ اِیَّاكُمْ لَعَلٰی هُدًی اَوْ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఆకాశముల నుండి వర్షమును కురిపించటం ద్వారా మరియు భూమి నుండి పండ్లను,పంటలను,ఫలములను మొలకెత్తించటం ద్వారా మీకు ఆహారోపాధిని కలిగిస్తున్న వాడెవడు ?. మీరు ఇలా పలకండి : అల్లాహ్ యే వాటి నుండి మీకు ఆహారోపాధిని కలిగిస్తున్నవాడు. ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మేము లేదా మీరు సన్మార్గంపై లేదా స్పష్టంగా మార్గం నుండి తప్పటంపై ఉన్నాము. మాలో నుండి ఒకరు ఖచ్చితంగా అలా ఉన్నాము. మరియు సన్మార్గమువారు విశ్వాసపరులే, మార్గభ్రష్టతవారు ముష్రికులే అన్నదానిలో ఎటువంటి సందేహం లేదు.
Ang mga Tafsir na Arabe:
قُلْ لَّا تُسْـَٔلُوْنَ عَمَّاۤ اَجْرَمْنَا وَلَا نُسْـَٔلُ عَمَّا تَعْمَلُوْنَ ۟
ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ప్రళయదినమున మీరు మేము పాల్పడినటువంటి మా పాపముల గురించి ప్రశ్నించబడరు మరియు మేము మీరు చేస్తున్నటువంటి కార్యముల గురించి ప్రశ్నించబడము.
Ang mga Tafsir na Arabe:
قُلْ یَجْمَعُ بَیْنَنَا رَبُّنَا ثُمَّ یَفْتَحُ بَیْنَنَا بِالْحَقِّ ؕ— وَهُوَ الْفَتَّاحُ الْعَلِیْمُ ۟
వారితో అనండి : ప్రళయదినమున అల్లాహ్ మీకూ,మాకూ మధ్య సమీకరిస్తాడు. ఆ తరువాత మీ మధ్య,మా మధ్య న్యాయపరంగా తీర్పునిస్తాడు. అప్పుడు ఆయన సత్యపరుడిని అసత్యపరుడి నుండి స్పష్టపరుస్తాడు. మరియు ఆయనే న్యాయపరంగా తీర్పునిచ్చేవాడును మరియు తాను తీర్పునిచ్చే దాని జ్ఞానము కలవాడును.
Ang mga Tafsir na Arabe:
قُلْ اَرُوْنِیَ الَّذِیْنَ اَلْحَقْتُمْ بِهٖ شُرَكَآءَ كَلَّا ؕ— بَلْ هُوَ اللّٰهُ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : మీరు అల్లాహ్ కొరకు భాగస్వాములుగా చేసుకుని ఆయనతోపాటు ఆరాధనలో మీరు సాటికల్పిస్తున్న వారిని నాకు చూపించండి. సాధ్యం కాదు. ఆయన కొరకు భాగస్వాములు ఉన్నారని మీరు అనుకుంటున్నట్లు విషయం కాదు. వాస్తవానికి ఆ అల్లాహ్ యే ఎవరూ ఆధిక్యత చూపని సర్వశక్తిమంతుడు, తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
Ang mga Tafsir na Arabe:
وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا كَآفَّةً لِّلنَّاسِ بَشِیْرًا وَّنَذِیْرًا وَّلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟
ِఓ ప్రవక్తా మేము మిమ్మల్ని ప్రజలందరి కొరకు దైవభీతి కలవారికి స్వర్గము ఉన్నదని శుభవార్తనిచ్చేవాడిగా మరియు అవిశ్వాసపరులని,పాపాత్ములని నరకాగ్ని నుండి భయపెట్టేవానిగా పంపించాము. కాని చాలామంది ప్రజలకి ఇది తెలియదు. ఒక వేళ వారు దాన్ని తెలుసుకుంటే వారు నిన్ను తిరస్కరించేవారు కాదు.
Ang mga Tafsir na Arabe:
وَیَقُوْلُوْنَ مَتٰی هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మరియు ముష్రికులు తమకు భయపెట్టబడుతున్న శిక్ష గురించి తొందరచేస్తూ ఇలా పలికేవారు : శిక్ష గురించి చేయబడిన ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేరనుంది ? ఒక వేళ అది సత్యమని మీరు వాదిస్తున్న విషయంలో మీరు సత్యవంతులే అయితే (తెలపండి).
Ang mga Tafsir na Arabe:
قُلْ لَّكُمْ مِّیْعَادُ یَوْمٍ لَّا تَسْتَاْخِرُوْنَ عَنْهُ سَاعَةً وَّلَا تَسْتَقْدِمُوْنَ ۟۠
ఓ ప్రవక్తా శిక్ష గురించి తొందర చేస్తున్న వీరందరితో ఇలా పలకండి : మీ కొరకు నిర్ణీత ఒక రోజు నిర్ణయించబడి ఉంది. దాని నుండి మీరు ఒక్కఘడియ వెనుకకు జరగలేరు మరియు దాని నుండి ఒక ఘడియ ముందుకు జరగలేరు. మరియు ఈ దినము అది ప్రళయదినము.
Ang mga Tafsir na Arabe:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لَنْ نُّؤْمِنَ بِهٰذَا الْقُرْاٰنِ وَلَا بِالَّذِیْ بَیْنَ یَدَیْهِ ؕ— وَلَوْ تَرٰۤی اِذِ الظّٰلِمُوْنَ مَوْقُوْفُوْنَ عِنْدَ رَبِّهِمْ ۖۚ— یَرْجِعُ بَعْضُهُمْ اِلٰی بَعْضِ ١لْقَوْلَ ۚ— یَقُوْلُ الَّذِیْنَ اسْتُضْعِفُوْا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْا لَوْلَاۤ اَنْتُمْ لَكُنَّا مُؤْمِنِیْنَ ۟
మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచిన వారు ఇలా అంటారు : ముహమ్మద్ తన పై అవతరింపబడినదని అనుకుంటున్న ఈ ఖుర్ఆన్ ను మేము ఖచ్చితంగా విశ్వసించము. మరియు మేము పూర్వ దివ్యగ్రంధములను ఖచ్చితముగా విశ్వసించము. ఓ ప్రవక్తా ఒక వేళ దుర్మార్గులు లెక్క తీసుకోవటం కొరకు ప్రళయదినమున తమ ప్రభువు వద్ద ఆపబడినప్పుడు మీరు చూస్తే వారు తమ మధ్య పరస్పరం ఆరోపించుకుంటారు. వారిలో నుండి ప్రతి ఒక్కరు బాధ్యతను,దూషణను ఇంకొకరిపై నెట్టుతారు. బలహీనులుగా భావించబడిన అనుసరించేవారు తమను బలహీనులుగా భావించేవారితో ఇలా పలుకుతారు : మీరు మమ్మల్ని అపమార్గమునకు లోను చేయకుండా ఉంటే మేము కూడా అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విశ్వసించేవారము.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• التلطف بالمدعو حتى لا يلوذ بالعناد والمكابرة.
అహ్వానితుని పట్ల అతడు మొండితనం,అహంకారమును ఆశ్రయించకుండా ఉండేందుకు దయతో మెలగాలి.

• صاحب الهدى مُسْتَعْلٍ بالهدى مرتفع به، وصاحب الضلال منغمس فيه محتقر.
సన్మార్గం పొందిన వాడు సన్మార్గముతో ఉన్నతుడవుతాడు మరియు దానితో ఎదుగుతాడు. అపమార్గముకు లోనయిన వాడు అందులో మునిగి దిగజారిపోతాడు.

• شمول رسالة النبي صلى الله عليه وسلم للبشرية جمعاء، والجن كذلك.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యం సమస్త మానవాళికి ఉన్నది. అలాగే జిన్నులకు కూడాను.

قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْا لِلَّذِیْنَ اسْتُضْعِفُوْۤا اَنَحْنُ صَدَدْنٰكُمْ عَنِ الْهُدٰی بَعْدَ اِذْ جَآءَكُمْ بَلْ كُنْتُمْ مُّجْرِمِیْنَ ۟
అనుసరించబడిన వారు ఎవరైతే సత్యము నుండి అహంకారమును చూపినారో వారు అనుసరించేవారు ఎవరినైతే వారు బలహీనులుగా భావించేవారో వారితో ఇలా అంటారు : ఏమీ ముహమ్మద్ మీ వద్దకు తీసుకుని వచ్చిన సన్మార్గము నుండి మేము మిమ్మల్ని ఆపామా ?. అలా కాదే . కానీ మీరు దుర్మార్గులు,చెడును ప్రభలింపజేసే చెడ్డవారు.
Ang mga Tafsir na Arabe:
وَقَالَ الَّذِیْنَ اسْتُضْعِفُوْا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْا بَلْ مَكْرُ الَّیْلِ وَالنَّهَارِ اِذْ تَاْمُرُوْنَنَاۤ اَنْ نَّكْفُرَ بِاللّٰهِ وَنَجْعَلَ لَهٗۤ اَنْدَادًا ؕ— وَاَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَاَوُا الْعَذَابَ ؕ— وَجَعَلْنَا الْاَغْلٰلَ فِیْۤ اَعْنَاقِ الَّذِیْنَ كَفَرُوْا ؕ— هَلْ یُجْزَوْنَ اِلَّا مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
మరియు ఆ అనుసరించేవారు ఎవరినైతే వారి నాయకులు బలహీనులుగా భావించేవారో వారు సత్యము నుండి అహంకారమును చూపిన తాము అనుసరించేవారితో ఇలా పలుకుతారు : రాత్రింబవళ్ళు మీ కుట్రలు ఎప్పుడైతే మీరు మమ్మల్ని అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచమని,ఆయనను వదిలి సృష్టితాలను ఆరాధించమని ఆదేశించేవారో మమ్మల్ని సన్మార్గము నుండి ఆపినాయి. వారు శిక్షను చూసి,తాము శిక్షించబడుతారని తెలుసుకున్నప్పుడు తాము ఇహలోకములో పాల్పడిన అవిశ్వాసముపై కలిగిన అవమానమును దాచివేస్తారు. మరియు మేము అవిశ్వాసపరుల మెడలలో సంకెళ్ళను వేస్తాము. వారు ఇహలోకములో అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధనచేయటం,పాపాలకు పాల్పడటం ఏదైతే చేశారో దానికి ప్రతిఫలంగా మాత్రమే వారు ఈ ప్రతిఫలమును ప్రసాదించబడుతారు.
Ang mga Tafsir na Arabe:
وَمَاۤ اَرْسَلْنَا فِیْ قَرْیَةٍ مِّنْ نَّذِیْرٍ اِلَّا قَالَ مُتْرَفُوْهَاۤ اِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟
మరియు మేము బస్తీల్లోంచి ఏ బస్తీలో ప్రవక్తను పంపిస్తే అతడు వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టేవాడు. కాని అందులో ఉన్న అధికారము,మర్యాద,సంపద కల ఐశ్వర్య వంతులు ఇలా పలికేవారు : ఓ ప్రవక్తలు నిశ్ఛయంగా మేము మీరు ఇచ్చి పంపించబడిన వాటిని తిరస్కరిస్తున్నాము.
Ang mga Tafsir na Arabe:
وَقَالُوْا نَحْنُ اَكْثَرُ اَمْوَالًا وَّاَوْلَادًا ۙ— وَّمَا نَحْنُ بِمُعَذَّبِیْنَ ۟
మరియు ఉన్నతులైన వీరందరు గర్వపడతూ,అహంకారపడుతూ ఇలా పలికారు : మేము ఎక్కువ సంపద,ఎక్కువ సంతానము కలిగినవారము. మేము శిక్షింపబడుతామని మీరు అనుకుంటున్నది అసత్యము. మేము ఇహలోకములో,పరలోకములో శిక్షంపబడము.
Ang mga Tafsir na Arabe:
قُلْ اِنَّ رَبِّیْ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَیَقْدِرُ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟۠
ఓ ప్రవక్తా మీరు తమకు ఇవ్వబడిన అనుగ్రహాలపై అహంకారమునకు లోనయ్యే వీరందరితో ఇలా పలకండి : పరిశుద్ధుడైన,మహోన్నతుడైన నా ప్రభువు తాను కోరుకున్న వాడి కొరకు ఆహారోపాధిని అతడు కృతజ్ఞత తెలుపుకుంటాడా లేదా కృఘ్నుడవుతాడా పరీక్షించటానికి విస్తృతపరుస్తాడు. మరియు తాను కోరుకున్న వారిపై దాన్ని అతడు సహనం వహిస్తాడా లేదా క్రోధానికి గురవుతాడా పరీక్షించటానికి కుదించివేస్తాడు. కానీ చాలా మంది ప్రజలకు అల్లాహ్ విజ్ఞత కలవాడని తెలియదు. ఆయన ఏదైన విషయాన్ని పూర్తి విజ్ఞతతో మాత్రమే అంచనా వేస్తాడు. దాన్ని తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు మరియు దాన్ని తెలిసికోని వాడు తెలియకుండా ఉంటాడు.
Ang mga Tafsir na Arabe:
وَمَاۤ اَمْوَالُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ بِالَّتِیْ تُقَرِّبُكُمْ عِنْدَنَا زُلْفٰۤی اِلَّا مَنْ اٰمَنَ وَعَمِلَ صَالِحًا ؗ— فَاُولٰٓىِٕكَ لَهُمْ جَزَآءُ الضِّعْفِ بِمَا عَمِلُوْا وَهُمْ فِی الْغُرُفٰتِ اٰمِنُوْنَ ۟
మరియు మీరు గర్వపడే మీ సంపదలు,మీ సంతానము మిమ్మల్ని అల్లాహ్ మన్నత వైపునకు తీసుకునిపోవు. కాని ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యములు చేస్తాడో వాడు రెట్టంపు పుణ్యాన్ని పొందుతాడు. అప్పుడు సంపదలు అల్లాహ్ మార్గములో వాటిని ఖర్చు చేయటం వలన,సంతానము అతని కొరకు వారు దుఆ చేయటం వలన అతనికి దగ్గర చేస్తాయి. వారందరు సత్కార్యములను చేసే విశ్వాసపరులు వారి కొరకు వారు చేసిన కర్మలకు రెట్టింపు పుణ్యం ఉంటుంది. మరియు వారు స్వర్గములోని ఉన్నత స్థానములలో తాము భయపడే శిక్ష,మరణం,అనుగ్రహాలు అంతం అయిపోవటం నుండి నిశ్ఛింతగా ఉంటారు.
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ یَسْعَوْنَ فِیْۤ اٰیٰتِنَا مُعٰجِزِیْنَ اُولٰٓىِٕكَ فِی الْعَذَابِ مُحْضَرُوْنَ ۟
మరియు మా ఆయతుల నుండి ప్రజలను మరలించటంలో శాయాశక్తుల కృషి చేసి,తమ లక్ష్యాలను సాధించటానికి ప్రయత్నం చేసే అవిశ్వాసపరులు వీరందరు ఇహలోకములో నష్టమును చవిచూస్తారు,పరలోకములో శిక్షింపబడుతారు.
Ang mga Tafsir na Arabe:
قُلْ اِنَّ رَبِّیْ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ وَیَقْدِرُ لَهٗ ؕ— وَمَاۤ اَنْفَقْتُمْ مِّنْ شَیْءٍ فَهُوَ یُخْلِفُهٗ ۚ— وَهُوَ خَیْرُ الرّٰزِقِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా పరిశుద్ధుడైన,మహోన్నతుడైన నా ప్రభువు తన దాసుల్లోంచి తాను కోరుకున్న వారికి ఆహారోపాధిని విస్తరింపజేస్తాడు మరియు వారిలో నుంచి తాను కోరుకున్న వారిపై దాన్ని కుదించివేస్తాడు. మరియు అల్లాహ్ మార్గంలో మీరు ఏదైన ఖర్చు చేస్తే పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ దాని కన్న మేలైన దాన్ని, పరలోకములో గొప్ప పుణ్యమును మీకు ఇచ్చి ఇహలోకములో మీపై దాన్ని రెట్టింపు చేసి ఇస్తాడు. మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ అందరికన్న ఉత్తమ ఆహారప్రధాత. అయితే ఎవరైతే ఆహారమును ఆశిస్తాడో అతడు పరిశుద్ధుడైన ఆయనతోనే మొర పెట్టుకోవాలి.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• تبرؤ الأتباع والمتبوعين بعضهم من بعض، لا يُعْفِي كلًّا من مسؤوليته.
అనుసరించేవారు,అనుసరించబడే వారు ఒకరి నుండి ఇంకొకరు విసుగు చెందటం ప్రతి ఒక్కరిని తమ బాధ్యతల నుండి మినహాయింపు కలిగించదు.

• الترف مُبْعِد عن الإذعان للحق والانقياد له.
విలాసము సత్యమును అంగీకరించటం నుండి,దానికి విధేయత చూపటం నుండి దూరంగా ఉంచుతుంది.

• المؤمن ينفعه ماله وولده، والكافر لا ينتفع بهما.
విశ్వాసపరుడిని అతని సంపద,అతని సంతానము ప్రయోజనం చేకూరుస్తుంది. మరియు అవిశ్వాసపరుడు వాటితో ప్రయోజనం చెందడు.

• الإنفاق في سبيل الله يؤدي إلى إخلاف المال في الدنيا، والجزاء الحسن في الآخرة.
అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం ఇహలోకములో సంపద రెట్టింపు అవటానికి,పరలోకములో మంచి ప్రతిఫలమునకు దారితీస్తుంది.

وَیَوْمَ یَحْشُرُهُمْ جَمِیْعًا ثُمَّ یَقُوْلُ لِلْمَلٰٓىِٕكَةِ اَهٰۤؤُلَآءِ اِیَّاكُمْ كَانُوْا یَعْبُدُوْنَ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ వారందరిని సమీకరించే రోజును ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ తరువాత పరిశుద్ధుడైన ఆయన దైవ దూతలతో ముష్రికులను మందలించటానికి,వారిని దూషించటానికి ఇలా పలుకుతాడు : ఏమీ వీరందరు ఇహలోక జీవితంలో అల్లాహ్ ను వదిలి మిమ్మల్ని ఆరాధించేవారా ?.
Ang mga Tafsir na Arabe:
قَالُوْا سُبْحٰنَكَ اَنْتَ وَلِیُّنَا مِنْ دُوْنِهِمْ ۚ— بَلْ كَانُوْا یَعْبُدُوْنَ الْجِنَّ ۚ— اَكْثَرُهُمْ بِهِمْ مُّؤْمِنُوْنَ ۟
దైవదూతలు ఇలా పలికారు : నీవు పరిశుద్ధుడవు,అతీతుడవు !. వారు కాకుండా నీవే మా సంరక్షకుడవు. వారికి మాకి మధ్య ఎటువంటి విధేయత (విశ్వసనీయత) లేదు. అంతే కాదు ఈ ముష్రికులందరు షైతానులను ఆరాధించేవారు. వాటిని వారు దైవ దూతలు అని భావించి అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించేవారు. వారిలో చాలా మంది వాటిని విశ్వసించేవారు.
Ang mga Tafsir na Arabe:
فَالْیَوْمَ لَا یَمْلِكُ بَعْضُكُمْ لِبَعْضٍ نَّفْعًا وَّلَا ضَرًّا ؕ— وَنَقُوْلُ لِلَّذِیْنَ ظَلَمُوْا ذُوْقُوْا عَذَابَ النَّارِ الَّتِیْ كُنْتُمْ بِهَا تُكَذِّبُوْنَ ۟
సమీకరించబడే,లెక్కతీసుకోబడే రోజు ఇహలోకములో వారు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే పూజించే వారో ఆ ఆరాధ్య దైవాలకి ఎటువంటి ప్రయోజనం కలిగించే అధికారం ఉండదు. వారికి ఎటువంటి నష్టం కలిగించే అధికారం ఉండదు. మరియు మేము అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంపై హింసకు పాల్పడిన వారితో ఇలా పలుకుతాము : ఇహలోకములో మీరు తిరస్కరించిన నరకాగ్ని శిక్షను చవిచూడండి.
Ang mga Tafsir na Arabe:
وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالُوْا مَا هٰذَاۤ اِلَّا رَجُلٌ یُّرِیْدُ اَنْ یَّصُدَّكُمْ عَمَّا كَانَ یَعْبُدُ اٰبَآؤُكُمْ ۚ— وَقَالُوْا مَا هٰذَاۤ اِلَّاۤ اِفْكٌ مُّفْتَرًی ؕ— وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلْحَقِّ لَمَّا جَآءَهُمْ ۙ— اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِیْنٌ ۟
మరియు తిరస్కారులైన ఈ ముష్రికులపై మా ప్రవక్త పై అవతరింపబడిన ఎటువంటి సందేహం లేని స్పష్టమైన మా ఆయతులు చదివి వినిపించబడితే వారన్నారు : వీటిని తీసుకుని వచ్చిన వ్యక్తి కేవలం మిమ్మల్ని మీ తాతముత్తాతలు ఉన్న ధర్మం నుండి మరల్చదలచాడు. మరియు వారు ఇలా పలికారు : ఈ ఖుర్ఆన్ కేవలం అబద్దము మాత్రమే అతడు దాన్ని అల్లాహ్ పై కల్పించుకున్నాడు. మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచిన వారు ఖుర్ఆన్ తో ఎప్పుడైతే అది అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు వచ్చినదో ఇలా పలికారు : ఇది భర్తకి అతని భార్యకి మధ్య,కొడుకుకి,అతని తండ్రికి మధ్య వేరు చేయటానికి స్పష్టమైన మంత్రజాలము మాత్రమే.
Ang mga Tafsir na Arabe:
وَمَاۤ اٰتَیْنٰهُمْ مِّنْ كُتُبٍ یَّدْرُسُوْنَهَا وَمَاۤ اَرْسَلْنَاۤ اِلَیْهِمْ قَبْلَكَ مِنْ نَّذِیْرٍ ۟ؕ
మరియు మేము వారికి ఎటువంటి గ్రంధములను ఇవ్వ లేదు వారు వాటిని చదివితే అవి వారికి ఈ ఖుర్ఆన్ ముహమ్మద్ కల్పించుకున్న అబద్దము అని నిర్దేశించటానికి. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని ప్రవక్తగా పంపించక మునుపు వారి వద్దకు ఏ ప్రవక్తనూ వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టటానికి పంపించలేదు.
Ang mga Tafsir na Arabe:
وَكَذَّبَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ۙ— وَمَا بَلَغُوْا مِعْشَارَ مَاۤ اٰتَیْنٰهُمْ فَكَذَّبُوْا رُسُلِیْ ۫— فَكَیْفَ كَانَ نَكِیْرِ ۟۠
ఆద్,సమూద్,లూత్ జాతి లాంటి పూర్వ జాతులు తిరస్కరించాయి. మీ జాతిలో నుండి ముష్రికులు పూర్వ జాతులు పొందినటువంటి శక్తి,బలం,సంపద,సంఖ్య లో నుండి పదోవంతును కూడా పొందలేదు. వారిలో నుండి ప్రతి ఒక్కరు (పూర్వ జాతులు) తమ ప్రవక్తను తిరస్కరించాయి. అప్పుడు వారికి ఇవ్వబడిన సంపద,బలం,సంఖ్య వారికి ప్రయోజనం కలిగించలేకపోయినవి. అప్పుడు వారిపై నా శిక్ష వచ్చిపడింది. ఓ ప్రవక్తా వారిపై నా శిక్ష ఎలా ఉందో మరియు వారి కొరకు నా యాతన ఏ విధంగా ఉన్నదో చూడండి.
Ang mga Tafsir na Arabe:
قُلْ اِنَّمَاۤ اَعِظُكُمْ بِوَاحِدَةٍ ۚ— اَنْ تَقُوْمُوْا لِلّٰهِ مَثْنٰی وَفُرَادٰی ثُمَّ تَتَفَكَّرُوْا ۫— مَا بِصَاحِبِكُمْ مِّنْ جِنَّةٍ ؕ— اِنْ هُوَ اِلَّا نَذِیْرٌ لَّكُمْ بَیْنَ یَدَیْ عَذَابٍ شَدِیْدٍ ۟
ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : నేను మాత్రం మిమ్మల్ని ఒక పద్ధతితో సూచిస్తున్నాను,మీకు ఉపదేశం చేస్తున్నాను. అదేమిటంటే మీరు పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు మనోవాంఛల నుండి ఖాళీ అయి ఇద్దరు ఇద్దరుగా లేదా ఒకొక్కరిగా నిలబడండి. ఆ తరువాత మీరు మీ సహచరుని చరిత్ర గురించి,అతని బుద్ధి,అతని నిజాయితీ,అతని అమానత్ మీకు ఏది తెలుసో దాని గురించి సుధీర్ఘంగా అలోచిస్తే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు పిచ్చి లేదని మీకు స్పష్టమవుతుంది. అతను శిక్ష రాక ముందే మీ కొరకు హెచ్చరించేవాడు మాత్రమే ఒక వేళ మీరు అల్లాహ్ వైపునకు ఆయనతోపాటు సాటి కల్పించినందుకు పశ్చాత్తాప్పడకపోతే.
Ang mga Tafsir na Arabe:
قُلْ مَا سَاَلْتُكُمْ مِّنْ اَجْرٍ فَهُوَ لَكُمْ ؕ— اِنْ اَجْرِیَ اِلَّا عَلَی اللّٰهِ ۚ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۟
ఓ ప్రవక్తా తరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : నేను మీ వద్దకు తీసుకుని వచ్చిన సన్మార్గము,మేలు పై ఏదైన బదులు లేదా ప్రతిఫలమును మీతో కోరి ఉంటే - దాని ఉనికిని ఊహించుకొని - అది మీ కొరకే. నా ప్రతిఫలం ఒక్కడైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది. పరిశుద్ధుడైన ఆయన ప్రతీ దానిపై సాక్షి. ఆయన నేను మీకు సందేశాలను చేరవేశాను అన్న దానిపై సాక్ష్యం పలుకుతాడు. మరియు మీ కర్మలపై సాక్ష్యం పలుకుతాడు. వాటి ప్రతిఫలం మీకు ఆయన ప్రసాదిస్తాడు.
Ang mga Tafsir na Arabe:
قُلْ اِنَّ رَبِّیْ یَقْذِفُ بِالْحَقِّ ۚ— عَلَّامُ الْغُیُوْبِ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా నా ప్రభువు సత్యమును అసత్యముపై ఆధిక్యతను కలిగించి దాన్ని నిర్వీర్యం చేస్తాడు. మరియు ఆయన అగోచర విషయాల గురించి బాగా తెలిసినవాడు. ఆకాశములలో గాని భూమిలో గానీ ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు తన దాసుల యొక్క కర్మలు ఆయనపై గోప్యంగా ఉండవు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• التقليد الأعمى للآباء صارف عن الهداية.
తాతముత్తాతలను గుడ్డిగా అనుకరించటం సన్మార్గము నుంచి మరలించేస్తుంది.

• التفكُّر مع التجرد من الهوى وسيلة للوصول إلى القرار الصحيح، والفكر الصائب.
మనోవాంఛలతో ఖాళీ అయ్యి ఆలోచించటం సరైన నిర్ణయం,సరైన ఆలోచనను పొందే మార్గము.

• الداعية إلى الله لا ينتظر الأجر من الناس، وإنما ينتظره من رب الناس.
అల్లాహ్ వైపు పిలిచేవాడు ప్రజల వద్ద నుండి ప్రతిఫలం కొరకు నిరీక్షంచడు. అతడు మాత్రం దాన్ని ప్రజల ప్రభువుతో నిరీక్షిస్తాడు.

قُلْ جَآءَ الْحَقُّ وَمَا یُبْدِئُ الْبَاطِلُ وَمَا یُعِیْدُ ۟
ఓ ప్రవక్తా తిరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : సత్యం వచ్చినది అదే ఇస్లాం. మరియు ఎటువంటి ప్రభావం లేదా శక్తి కనిపించని అసత్యం తొలగిపోయింది. మరియు అది తన ప్రభావం చూపే వైపునకు మరలదు.
Ang mga Tafsir na Arabe:
قُلْ اِنْ ضَلَلْتُ فَاِنَّمَاۤ اَضِلُّ عَلٰی نَفْسِیْ ۚ— وَاِنِ اهْتَدَیْتُ فَبِمَا یُوْحِیْۤ اِلَیَّ رَبِّیْ ؕ— اِنَّهٗ سَمِیْعٌ قَرِیْبٌ ۟
ఓ ప్రవక్తా తిరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఒక వేళ నేను మీకు చేరవేస్తున్న సందేశముల విషయంలో సత్యము నుండి తప్పిపోతే నేను తప్పిన దాని నష్టం నాకు మాత్రమే. అందులో నుంచి ఏదీ మీకు చేరదు. మరియు ఒక వేళ నేను దాని వైపునకు (సత్యం వైపునకు) సన్మార్గం పొందితే అది కేవలం పరిశుద్ధుడైన నా ప్రభువు నాకు దైవవాణి ద్వారా తెలపటంవలనే. నిశ్చయంగా ఆయన తన దాసుల మాటలను బాగా వినేవాడు. నేను ఏమి చెబుతానో అది ఆయన వినకుండా ఉండడు.
Ang mga Tafsir na Arabe:
وَلَوْ تَرٰۤی اِذْ فَزِعُوْا فَلَا فَوْتَ وَاُخِذُوْا مِنْ مَّكَانٍ قَرِیْبٍ ۟ۙ
ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఈ తిరస్కారులందరు ప్రళయదినాన శిక్షను కళ్ళారా చూసినప్పుడు భయకంపితులైనప్పుడు చూస్తే (ఎంత బాగుండేది). వారి కొరకు దాని నుండి పారిపోయే ప్రదేశముండదు. మరియు శరణం తీసుకోవటానికి ఎటువంటి శరణాలయం ఉండదు. మరియు వారు దగ్గర ప్రదేశము నుండి అందరికన్న ముందు శులభంగా పట్టుకోబడుతారు. ఒక వేళ మీరు దాన్ని చూస్తే మీరు ఆశ్ఛర్యకరమైన విషయాన్ని చూస్తారు.
Ang mga Tafsir na Arabe:
وَّقَالُوْۤا اٰمَنَّا بِهٖ ۚ— وَاَنّٰی لَهُمُ التَّنَاوُشُ مِنْ مَّكَانٍ بَعِیْدٍ ۟ۚ
మరియు వారు తమ పరిణామమును చూసినప్పుడు మేము ప్రళయదినంపై విశ్వాసమును కనబరుస్తాము అంటారు. విశ్వాసమును పట్టుకోవటం,దాన్ని పొందటం వారికి ఎలా సాధ్యమవుతుంది. వాస్తవానికి వారు ప్రతిఫల నివాసము కాకుండా ఆచరణలు చేసే నివాసమైన ఇహలోక నివాసము నుండి ఆచరణల నివాసము కాకుండా ప్రతిఫల నివాసమైన పరలోక నివాసము వైపునకు వారి వైదొలగటం వలన వారి నుండి విశ్వాసము స్వీకరించబడే ప్రదేశము దూరమైపోయింది.
Ang mga Tafsir na Arabe:
وَقَدْ كَفَرُوْا بِهٖ مِنْ قَبْلُ ۚ— وَیَقْذِفُوْنَ بِالْغَیْبِ مِنْ مَّكَانٍ بَعِیْدٍ ۟
మరియు ఎలా వారి నుండి విశ్వాసము లభిస్తుంది మరియు అది స్వీకరించబడుతుంది. వాస్తవానికి వారు దాన్నిఇహలోక జీవితంలోనే తిరస్కరించారు. మరియు వారు సత్యమును పొందటం నుండి దూరం నుండి అనుమానంతో విసురుతున్నారు. ఏవిధంగానైతే వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో ఆయన మంత్రజాలకుడు,జోతిష్యుడు,కవి అని పలికేవారో.
Ang mga Tafsir na Arabe:
وَحِیْلَ بَیْنَهُمْ وَبَیْنَ مَا یَشْتَهُوْنَ كَمَا فُعِلَ بِاَشْیَاعِهِمْ مِّنْ قَبْلُ ؕ— اِنَّهُمْ كَانُوْا فِیْ شَكٍّ مُّرِیْبٍ ۟۠
ఈ తిరస్కారులందరు తాము కోరుకున్న జీవిత సుఖాలు పొందకుండా,అవిశ్వాసము నుండి పశ్చాత్తాపముపడటం నుండి,నరకాగ్ని నుండి విముక్తి పొందటం నుండి ,ఇహలోక జీవితం వైపునకు మరలటం నుండి ఆపబడ్డారు. వారి కన్న మనుపటి తిరస్కార జాతుల వారి విధంగా వ్యవహరించబడినట్లు. నిశ్చయంగా వారు కూడా ప్రవక్తలు తీసుకుని వచ్చిన అల్లాహ్ తౌహీద్ గురించి,మరణాంతరం లేపబడటంపై విశ్వాసం గురించి సందేహములో పడి ఉండేవారు. అవిశ్వాసంపై పురిగొల్పే సందేహంలో.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• مشهد فزع الكفار يوم القيامة مشهد عظيم.
ప్రళయ దినాన అవిశ్వాసపరులు భయాందోళనకు గురయ్యే ధృశ్యం ఘోరమైన ధృశ్యం.

• محل نفع الإيمان في الدنيا؛ لأنها هي دار العمل.
విశ్వాసమునకు ప్రయోజనకరమైన ప్రదేశం ఇహలోకంలో ఉన్నది ఎందుకంటే అది ఆచరణ గృహము.

• عظم خلق الملائكة يدل على عظمة خالقهم سبحانه.
దైవదూతల సృష్టి గొప్పతనము వాటి సృష్టికర్త సుబహానహు వతఆలా యొక్క గొప్పతనమును సూచిస్తుంది.

 
Salin ng mga Kahulugan Surah: Saba’
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Indise ng mga Salin

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Isara