Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Az-Zumar   Ayah:
خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَاَنْزَلَ لَكُمْ مِّنَ الْاَنْعَامِ ثَمٰنِیَةَ اَزْوَاجٍ ؕ— یَخْلُقُكُمْ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْ خَلْقًا مِّنْ بَعْدِ خَلْقٍ فِیْ ظُلُمٰتٍ ثَلٰثٍ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— فَاَنّٰی تُصْرَفُوْنَ ۟
ఓ ప్రజలారా మీ ప్రభువు మిమ్మల్ని ఒకే ప్రాణమైన ఆదం నుండి సృష్టించాడు. ఆ తరువాత ఆదం నుండి ఆయన భార్య హవ్వాను సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు ఒంటెల నుండి,ఆవుల నుండి,గొర్రెల నుండి,మేకల నుండి ఎనిమిది రకముల వాటిని సృష్టించాడు. ప్రతీ రకము నుండి మగ,ఆడను సృష్టించాడు. పరిశుద్ధుడైన ఆయన మిమ్మల్ని మీ మాతృ గర్భములో ఒక దశ తరువాత ఇంకో దశను కడుపు,గర్భము,మావి (తల్లి గర్భములో శిసువుపై ఉండే పొర) యొక్క చీకట్లలో సృష్టించాడు. వాటన్నింటిని సృష్టించిన వాడే మీ ప్రభువైన అల్లాహ్. రాజ్యాధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఇంకొకడు లేడు. అటువంటప్పుడు మీరు ఎలా ఆయన ఆరాధన చేయటం నుండి ఏమీ సృష్టించకుండా తామే సృష్టించబడి వాటి ఆరాధన చేయటం వైపునకు మరలిపోతున్నారు ?!.
Ang mga Tafsir na Arabe:
اِنْ تَكْفُرُوْا فَاِنَّ اللّٰهَ غَنِیٌّ عَنْكُمْ ۫— وَلَا یَرْضٰی لِعِبَادِهِ الْكُفْرَ ۚ— وَاِنْ تَشْكُرُوْا یَرْضَهُ لَكُمْ ؕ— وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ؕ— ثُمَّ اِلٰی رَبِّكُمْ مَّرْجِعُكُمْ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ؕ— اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟
ఓ ప్రజలారా ఒక వేళ మీరు మీ ప్రభువు పట్ల అవిశ్వాసమును కనబరిస్తే నిశ్ఛయంగా అల్లాహ్ మీ విశ్వాసము అక్కర లేని వాడు. మరియు మీ అవిశ్వాసం ఆయనకు నష్టం కలిగించదు. మరియు మీ అవిశ్వాసము యొక్క నష్టము మీ వైపునకు మాత్రమే మరలుతుంది. మరియు ఆయన తన దాసుల కొరకు తనను అవిశ్వసించటమును ఇష్టపడడు. మరియు వారిని అవిశ్వసించమని ఆదేశించడు. ఎందుకంటే అల్లాహ్ అశ్లీలత గురించి,చెడు గురించి ఆదేశించడు. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ కు ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపి ఆయనపై విశ్వాసమును కనబరిస్తే ఆయన మీ కృతజ్ఞత నుండి సంతుష్టపడి మీకు దాని ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు ఒక ప్రాణం వేరే ప్రాణము యొక్క పాపమును మోయదు. అంతేకాదు ప్రతీ వ్యక్తి తాను చేసుకున్న దానికి ప్రతిగా తాకట్టుగా ఉంటాడు. ఆ తరువాత మీరు ప్రళయదినమున మీ మరలటం ఒక్కడైన మీ ప్రభువు వైపునకు జరుగును. అప్పుడు ఆయన ఇహలోకంలో మీరు చేసుకున్న కర్మల గురించి మీకు సమాచారమిస్తాడు. మరియు ఆయన మీ కర్మలపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయన తన దాసుల హృదయములలో ఉన్న వాటి గురించి బాగా తెలిసినవాడు. వాటిలో ఉన్నది ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Ang mga Tafsir na Arabe:
وَاِذَا مَسَّ الْاِنْسَانَ ضُرٌّ دَعَا رَبَّهٗ مُنِیْبًا اِلَیْهِ ثُمَّ اِذَا خَوَّلَهٗ نِعْمَةً مِّنْهُ نَسِیَ مَا كَانَ یَدْعُوْۤا اِلَیْهِ مِنْ قَبْلُ وَجَعَلَ لِلّٰهِ اَنْدَادًا لِّیُضِلَّ عَنْ سَبِیْلِهٖ ؕ— قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِیْلًا ۖۗ— اِنَّكَ مِنْ اَصْحٰبِ النَّارِ ۟
మరియు అవిశ్వాసపరుడికి ఏదైన కీడు రోగము ,సంపదను కోల్పోవటము, మునిగిపోయే భయం రూపంలో సంభవించినప్పుడు అతడు పరిశుద్ధుడైన తన ప్రభువుతో ఆయన ఒక్కడి వైపు మరలుతూ తనకు కలిగిన కీడును తొలగించమని వేడుకుంటాడు. ఆయన అతనికి కలిగిన కీడును తొలగించి అతనికి అనుగ్రహాన్ని కలిగించినప్పుడు అతడు ముందు నుండి కడువినయంతో వేడుకున్న అల్లాహ్ ను వదిలివేస్తాడు. మరియు అతడు అల్లాహ్ కొరకు భాగస్వాములను చేసుకుని వారిని అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తాడు ఇతరులను అల్లాహ్ మర్గము ఏదైతే ఆయనకు చేరుతుందో దాని నుండి మరలించటానికి. ఓ ప్రవక్తా ఈ స్థితి కలిగిన వాడితో ఇలా పలకండి : నీ అవిశ్వాసముతో మిగిలిన నీ జీవితమంతా ప్రయోజనం చెందు. అది కొద్దిపాటి కాలమే. నిశ్ఛయంగా నీవు నరకవాసుల్లోంచి వాడివి ప్రళయదినమున నీవు దాన్ని ఒక స్నేహితుడు తన స్నేహితుడిని అట్టిపెట్టుకుని ఉన్నట్లుగా అట్టిపెట్టుకుని ఉంటావు.
Ang mga Tafsir na Arabe:
اَمَّنْ هُوَ قَانِتٌ اٰنَآءَ الَّیْلِ سَاجِدًا وَّقَآىِٕمًا یَّحْذَرُ الْاٰخِرَةَ وَیَرْجُوْا رَحْمَةَ رَبِّهٖ ؕ— قُلْ هَلْ یَسْتَوِی الَّذِیْنَ یَعْلَمُوْنَ وَالَّذِیْنَ لَا یَعْلَمُوْنَ ؕ— اِنَّمَا یَتَذَكَّرُ اُولُوا الْاَلْبَابِ ۟۠
ఏమిటీ ఎవరైతే అల్లాహ్ కు విధేయుడై రాత్రి సమయములను తన ప్రభువు కొరకు సాష్టాంగపడుతూ మరియు ఆయన కొరకు నిలబడుతూ గడిపి,పరలోక శిక్ష నుండి భయపడి తన ప్రభువు కారుణ్యము గురించి యోచన చేస్తాడో అతడు ఉత్తముడా లేదా ఆ విశ్వాసపరుడు ఎవరైతే కష్ట సమయముల్లో అల్లాహ్ ను ఆరాధించి కలిమిలో ఆయన పట్ల అవిశ్వాసమును కనబరచి,అల్లాహ్ తో పాటు భాగస్వాములను చేసుకుంటాడో అతడు ఉత్తముడా ?!. ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఏమీ ఎవరైతే అల్లాహ్ తమపై అనివార్యం చేసిన వాటిని అల్లాహ్ ను తాము గుర్తించటం వలన తెలుసుకుంటారో వారు మరియు ఎవరైతే వీటిలో నుండి ఏమీ తెలియనివారు సమానులవుతారా ?!. ఈ రెండు వర్గముల మధ్య ఉన్న వ్యత్యాసమును సరైన బుద్ధులు కలవారు మాత్రమే గుర్తిస్తారు.
Ang mga Tafsir na Arabe:
قُلْ یٰعِبَادِ الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوْا رَبَّكُمْ ؕ— لِلَّذِیْنَ اَحْسَنُوْا فِیْ هٰذِهِ الدُّنْیَا حَسَنَةٌ ؕ— وَاَرْضُ اللّٰهِ وَاسِعَةٌ ؕ— اِنَّمَا یُوَفَّی الصّٰبِرُوْنَ اَجْرَهُمْ بِغَیْرِ حِسَابٍ ۟
ఓ ప్రవక్తా మీరు నాపై,నా ప్రవక్తలపై విశ్వాసమును కనబరచిన నా దాసులతో ఇలా పలకండి : మీరు మీ ప్రభువుతో ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయభీతిని కలిగి ఉండండి. మీలో నుండి ఇహలోకంలో సత్కర్మలను చేసిన వారి కొరకు ఇహలోకములో విజయము (సహాయము),ఆరోగ్యము, సంపద రూపములో మరియు పరలోకములో స్వర్గము రూపములో మేలు కలదు. మరియు అల్లాహ్ యొక్క భూమి విశాలమైనది. కావున మీరు అందులో అల్లాహ్ ఆరాధన చేయటానికి ఏదైన ప్రదేశం పొంది,మిమ్మల్ని ఏ ఆటంకము ఆపనంత వరకు హిజ్రత్ చేయండి. సహనం పాటించేవారు ప్రళయదినమున వారి పుణ్యము లెక్క లేనంత మరియు దాని అధికమవటం వలన,దాని రకరకాలు ఉండటం వలన షుమారు చేయలేనంత ప్రసాదించబడుతుంది.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• رعاية الله للإنسان في بطن أمه.
మానవునికి తన తల్లి గర్భంలో అల్లాహ్ పరిరక్షణ

• ثبوت صفة الغنى وصفة الرضا لله.
అక్కరలేకపోయే గుణం మరియు సంతృప్తి కలిగించే గుణం అల్లాహ్ కొరకే అని నిరూపణ.

• تعرّف الكافر إلى الله في الشدة وتنكّره له في الرخاء، دليل على تخبطه واضطرابه.
అవిశ్వాసపరుడు లేమిలో అల్లాహ్ ను గుర్తుంచుకొని కలిమిలో ఆయనను పట్టించుకోకపోవటం అతని మూర్ఖత్వమునకు మరియు అతని గందరగోళమునకు ఆధారము.

• الخوف والرجاء صفتان من صفات أهل الإيمان.
భయము మరియు ఆశ విశ్వాసపరుల లక్షణాల్లోంచి రెండు లక్షణాలు.

 
Salin ng mga Kahulugan Surah: Az-Zumar
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara