Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: An-Nisā’   Ayah:
وَّاسْتَغْفِرِ اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِیْمًا ۟ۚ
మరియు మీరు అల్లాహ్ తో మన్నింపును,క్షమాపణను కోరుకోండి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి తన వైపునకు పశ్చాత్తాపముతో మరలే వారిని మన్నించేవాడును,వారి పై కరుణించేవాడును.
Ang mga Tafsir na Arabe:
وَلَا تُجَادِلْ عَنِ الَّذِیْنَ یَخْتَانُوْنَ اَنْفُسَهُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ مَنْ كَانَ خَوَّانًا اَثِیْمًا ۟ۚۙ
ఆత్మద్రోహం చేసుకుని,తన ఆత్మద్రోహమును దాయటంలో అతిక్రమించే ఏ వ్యక్తి తరుపు నుండి కూడా మీరు వాదించకండి. మరియు అల్లాహ్ ఆత్మద్రోహమునకు పాల్పడే అసత్యపరులైన వారిని ఇష్టపడడు.
Ang mga Tafsir na Arabe:
یَّسْتَخْفُوْنَ مِنَ النَّاسِ وَلَا یَسْتَخْفُوْنَ مِنَ اللّٰهِ وَهُوَ مَعَهُمْ اِذْ یُبَیِّتُوْنَ مَا لَا یَرْضٰی مِنَ الْقَوْلِ ؕ— وَكَانَ اللّٰهُ بِمَا یَعْمَلُوْنَ مُحِیْطًا ۟
వారు పాపమునకు పాల్పడినప్పుడు భయంతో,సిగ్గుతో ప్రజల నుండి దాచేవారు. మరియు అల్లాహ్ నుండి దాచలేరు. మరియు ఆయన వారిని చుట్టుముట్టటం ద్వారా వారితో ఉన్నాడు. తప్పు చేసిన వాడి తరుపు నుండి వాదించటం మరియు అమాయకులపై నిందమోపటం వంటివి, ఆయనకు ఇష్టం లేని మాటలను గోప్యంగా పర్యాలోచన చేసినప్పుడు వారి నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు అల్లాహ్ వారు గోప్యంగా,బహిరంగంగా చేసే వాటిని చుట్టుముట్టి ఉన్నాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి వారి కర్మల పరంగా ప్రతిఫలంను ప్రసాదిస్తాడు.
Ang mga Tafsir na Arabe:
هٰۤاَنْتُمْ هٰۤؤُلَآءِ جَدَلْتُمْ عَنْهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۫— فَمَنْ یُّجَادِلُ اللّٰهَ عَنْهُمْ یَوْمَ الْقِیٰمَةِ اَمْ مَّنْ یَّكُوْنُ عَلَیْهِمْ وَكِیْلًا ۟
ఇక్కడ మీరు - నేరం చేసే వీరందరి విషయం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు మీరు వారి నిర్దోషత్వాన్ని నిరూపించటానికి,వారి నుండి శిక్షను తొలగించటానికి వారి తరుపు నుండి వాదిస్తున్నారు. అయితే ప్రళయదినమున వారి తరుపు నుండి అల్లాహ్ తో ఎవరు వాదిస్తారు. వాస్తవానికి వారి స్థితి గురించి ఆయనకు తెలుసు. మరియు ఆ దినమున వారి పై వక్తగా ఎవరు అవుతారు ? ఆ శక్తి ఎవరికీ లేదు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.
Ang mga Tafsir na Arabe:
وَمَنْ یَّعْمَلْ سُوْٓءًا اَوْ یَظْلِمْ نَفْسَهٗ ثُمَّ یَسْتَغْفِرِ اللّٰهَ یَجِدِ اللّٰهَ غَفُوْرًا رَّحِیْمًا ۟
మరియు ఎవడైతే పాపమునకు పాల్పడుతాడో లేదా పాపములకు పాల్పడి తన స్వయంపై దుర్మార్గమునకు ఒడిగడతాడో ఆ పిదప తన పాపమును అంగీకరిస్తూ,దానిపై పశ్చాత్తాప్పడుతూ,దాన్ని తన నుండి తొలగిస్తూ అల్లాహ్ తో మన్నింపును వేడుకుంటాడో అతడు అల్లాహ్ ను తన పాపమును మన్నించేవాడిగా,తనపై కరుణించేవాడిగా పొందుతాడు.
Ang mga Tafsir na Arabe:
وَمَنْ یَّكْسِبْ اِثْمًا فَاِنَّمَا یَكْسِبُهٗ عَلٰی نَفْسِهٖ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۟
ఎవరైన చిన్న లేదా పెద్ద పాపమునకు పాల్పడితే దాని శిక్ష అతని ఒక్కడికి మాత్రమే వర్తిస్తుంది, అతని నుండి ఇతరులకు వర్తించదు. మరియు దాసుల కర్మల గురించి అల్లాహ్ బాగా తెలిసినవాడు మరియు తన కార్యనిర్వహణలో,తన ధర్మశాసనంలో వివేకవంతుడు.
Ang mga Tafsir na Arabe:
وَمَنْ یَّكْسِبْ خَطِیْٓئَةً اَوْ اِثْمًا ثُمَّ یَرْمِ بِهٖ بَرِیْٓـًٔا فَقَدِ احْتَمَلَ بُهْتَانًا وَّاِثْمًا مُّبِیْنًا ۟۠
మరియు ఎవడైతే అనాలోచితంగా పాపం చేస్తాడో లేదా ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తాడో ఆ తరువాత ఆ పాపముతో ఒక అమాయక వ్యక్తిపై నిందమోపుతాడో అతడు తన ఆ కార్యం వలన తీవ్రమైన అబద్దమును,స్పష్టమైన పాపమును మోసినవాడవుతాడు.
Ang mga Tafsir na Arabe:
وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكَ وَرَحْمَتُهٗ لَهَمَّتْ طَّآىِٕفَةٌ مِّنْهُمْ اَنْ یُّضِلُّوْكَ ؕ— وَمَا یُضِلُّوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا یَضُرُّوْنَكَ مِنْ شَیْءٍ ؕ— وَاَنْزَلَ اللّٰهُ عَلَیْكَ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُنْ تَعْلَمُ ؕ— وَكَانَ فَضْلُ اللّٰهِ عَلَیْكَ عَظِیْمًا ۟
ఓ ప్రవక్తా మీ రక్షణ ద్వారా అల్లాహ్ అనుగ్రహం మీపై ఉండకపోతే తమ స్వయంపై విశ్వాసఘాతకమునకు పాల్పడిన వీరందరిలో నుంచి ఒక వర్గము మిమ్మల్ని సత్యం నుండి తప్పించటానికి పూనుకునేది. అప్పుడు మీరు అన్యాయంతో కూడకున్న తీర్పునిచ్చేవారు. వారు వాస్తవానికి తమ స్వయమును మాత్రమే అపమార్గమునకు లోను చేసుకున్నారు. ఎందుకంటే అపమార్గమునకు లోను చేసే ప్రయత్నం వారు ఏదైతే చేసారో దాని పరిణామం వారిపైనే మరలుతుంది. మరియు అల్లాహ్ మీ పై ఖుర్ఆన్ ను,సున్నత్ ను అవతరింపజేశాడు. మరియు మీకు ఇంతకు ముందు తెలియని సన్మార్గమును,వెలుగును ఆయన మీకు నేర్పించాడు. మరియు దైవదౌత్యముతో,రక్షణతో మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహం ఎంతో గొప్పది.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• النهي عن المدافعة والمخاصمة عن المبطلين؛ لأن ذلك من التعاون على الإثم والعدوان.
అసత్యపరుల తరుపు నుంచి ప్రతిఘటించటం,వాదించటం నుండి వారింపు. ఎందుకంటే ఇది పాపమునకు,అన్యాయమునకు సహాయం చేయటంలో నుంచి.

• ينبغي للمؤمن الحق أن يكون خوفه من الله وتعظيمه والحياء منه فوق كل أحد من الناس.
సత్యవిశ్వాసికి అల్లాహ్ పట్ల తన భయం,ఆయన గొప్పతనం పలకటం,ఆయన నుండి సిగ్గు, ప్రజల్లో ప్రతి ఒక్కరికంటే ఎక్కువ ఉండాలి.

• سعة رحمة الله ومغفرته لمن ظلم نفسه، مهما كان ظلمه إذا صدق في توبته، ورجع عن ذنبه.
తన స్వయమునకు అన్యాయం చేసుకున్న వారి కొరకు అల్లాహ్ కారుణ్యము మరియు ఆయన మన్నింపు యొక్క విశాలత్వము. ఎప్పుడైన అతని నుండి దుర్మార్గము జరిగి అతను తన పశ్చాత్తాపములో సత్యవంతుడై తన పాపము నుండి మరలుతాడో.

• التحذير من اتهام البريء وقذفه بما لم يكن منه؛ وأنَّ فاعل ذلك قد وقع في أشد الكذب والإثم.
అమాయకునిపై నిందమోపటం నుండి మరియు అతని నుండి జరగని దాన్ని అతనికి అంటగట్టడం నుండి హెచ్చరిక. మరియు ఇలా చేసినవాడు తీవ్రమైన అబద్దములో మరియు పాపములో పడిపోయాడు.

 
Salin ng mga Kahulugan Surah: An-Nisā’
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara