Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Al-Hujurāt   Ayah:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اجْتَنِبُوْا كَثِیْرًا مِّنَ الظَّنِّ ؗ— اِنَّ بَعْضَ الظَّنِّ اِثْمٌ وَّلَا تَجَسَّسُوْا وَلَا یَغْتَبْ بَّعْضُكُمْ بَعْضًا ؕ— اَیُحِبُّ اَحَدُكُمْ اَنْ یَّاْكُلَ لَحْمَ اَخِیْهِ مَیْتًا فَكَرِهْتُمُوْهُ ؕ— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ تَوَّابٌ رَّحِیْمٌ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీరు తగిన కారణాలు మరియు ఆధారాలు లేని అనేక ఆరోపణల నుండి దూరంగా ఉండండి. నిశ్చయంగా కొన్ని అనుమానాలు బాహ్యంగా ప్రయోజనం కలిగించేవాడి విషయంలో దురాలోచన లాంటివి పాపములవుతాయి. మరియు మీరు విశ్వాసపరుల రహస్యాలను వారి చాటునుండి తెలుసుకోవటానికి అనుసరించకండి. మరియు మీలో నుండి ఏ ఒక్కరు కూడా తన సోదరుడు ఇష్టపడని వాటి గురించి చర్చించకండి. ఎందుకంటే అతడు ఇష్టపడని దాని గురించి చర్చించటం అతని మృత శరీరం నుండి మాంసమును తిన్నట్లే. ఏమి మీ లో నుండి ఎవరైన తన సోదరుని మృత శరీరము నుండి మాంసమును తినటం ఇష్టపడుతాడా ?. మీరు ఇష్టపడరు అతని చాడీలు చెప్పటము దాని లాంటిదే. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడేవారిని మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును.
Ang mga Tafsir na Arabe:
یٰۤاَیُّهَا النَّاسُ اِنَّا خَلَقْنٰكُمْ مِّنْ ذَكَرٍ وَّاُ وَجَعَلْنٰكُمْ شُعُوْبًا وَّقَبَآىِٕلَ لِتَعَارَفُوْا ؕ— اِنَّ اَكْرَمَكُمْ عِنْدَ اللّٰهِ اَتْقٰىكُمْ ؕ— اِنَّ اللّٰهَ عَلِیْمٌ خَبِیْرٌ ۟
ఓ ప్రజలారా నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు మీ తండ్రి అయిన ఆదమ్ మరియి ఒకే స్త్రీ మీ తల్లి అయిన హవ్వాతో సృష్టించాము. కావున మీ వంశము ఒక్కటే. కాబట్టి మీరు వంశం విషయంలో ఒకరిపై ఒకరు గర్వించకండి. మరియు మేము దాని తరువాత మిమ్మల్ని చాలా వర్గములుగా మరియు విస్తరించిన తెగలుగా చేశాము మీరు ఒకరినొకరు గుర్తించుకోవటానికి దానిపై గర్వించటానికి కాదు. ఎందుకంటే వ్యత్యాసం అనేది దైవభీతి పరంగా మాత్రమే ఉంటుంది. అందుకనే ఆయన (అల్లాహ్) ఇలా పలికాడు : నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతి కలవాడే అల్లాహ్ వద్ద మీలో ఎక్కువ గౌరవం కలవాడు. నిశ్చయంగా అల్లాహ్ మీ పరిస్థితుల గురించి తెలిసినవాడు, మీలో ఉన్న పరిపూర్ణతను,లోపమను తెలుసుకునేవాడు. దానిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Ang mga Tafsir na Arabe:
قَالَتِ الْاَعْرَابُ اٰمَنَّا ؕ— قُلْ لَّمْ تُؤْمِنُوْا وَلٰكِنْ قُوْلُوْۤا اَسْلَمْنَا وَلَمَّا یَدْخُلِ الْاِیْمَانُ فِیْ قُلُوْبِكُمْ ؕ— وَاِنْ تُطِیْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ لَا یَلِتْكُمْ مِّنْ اَعْمَالِكُمْ شَیْـًٔا ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
కొందరు పల్లెవాసులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు ఇలా పలికారు : మేము అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరిచాము. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : మీరు విశ్వసించ లేదు, కాని మీరు మేము విధేయులయ్యాము మరియు కట్టుబడి ఉన్నాము అని పలకండి. మీ హృదయముల్లో ఇంకా విశ్వాసము ప్రవేశించలేదు. మరియు అది వాటిలో ప్రవేశిస్తుందని ఆశించవచ్చు. ఓ పల్లెవాసుల్లారా ఒక వేళ మీరు విశ్వసించే విషయంలో,సత్కర్మలు చేయటంలో,నిషిద్దతాల నుండి దూరంగా ఉండటంలో అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను అనుసరిస్తే అల్లాహ్ మీ కర్మల ప్రతిఫలము నుండి ఏమాత్రం మీకు తగ్గించడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛచత్తాప్పడేవారిని మన్నించేవాడును మరియు వారిపై కనికరించేవాడును.
Ang mga Tafsir na Arabe:
اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ ثُمَّ لَمْ یَرْتَابُوْا وَجٰهَدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الصّٰدِقُوْنَ ۟
వాస్తవానికి విశ్వాసపరులు వారే ఎవరైతే అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి ఆ తరువాత వారి విశ్వాసమునకు ఎటువంటి సందేహము కలవలేదో మరియు వారు అల్లాహ్ మార్గములో తమ సిరిసంపదలతో,తమ ప్రాణములతో పోరాడి వాటిలో కొంచము కూడా పిసినారితనము చూపరో వారు. ఈ గుణములతో వర్ణించబడిన వారందరే తమ విశ్వాసములో సత్యవంతులు.
Ang mga Tafsir na Arabe:
قُلْ اَتُعَلِّمُوْنَ اللّٰهَ بِدِیْنِكُمْ ؕ— وَاللّٰهُ یَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟
ఓ ప్రవక్తా మీరు ఈ పల్లె వాసులందరితో ఇలా పలకండి : ఏమీ మీరు అల్లాహ్ కు మీ ధార్మికత గురించి తెలియపరుస్తున్నారా,జ్ఞానోదయం చేస్తున్నారా ?! వాస్తవానికి ఆకాశముల్లో ఏమున్నదో,భూమిలో ఏమున్నదో అల్లాహ్ కు తెలుసు. మరియు అల్లాహ్ కు ప్రతీది తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మీ ధార్మికత గురించి మీరు ఆయనకు తెలియపరచవలసిన అవసరం లేదు.
Ang mga Tafsir na Arabe:
یَمُنُّوْنَ عَلَیْكَ اَنْ اَسْلَمُوْا ؕ— قُلْ لَّا تَمُنُّوْا عَلَیَّ اِسْلَامَكُمْ ۚ— بَلِ اللّٰهُ یَمُنُّ عَلَیْكُمْ اَنْ هَدٰىكُمْ لِلْاِیْمَانِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఓ ప్రవక్త ఈ పల్లెవాసులందరు తమ ఇస్లామును స్వీకరించటమును మీ పై ఉపకారము చేసినట్లు చూపుతున్నారు. మీరు వారితో ఇలా పలకండి : అల్లాహ్ ధర్మములో మీరు ప్రవేశించటమును నా పై ఉపకారము చేసినట్లు చెప్పకండి. దాని ప్రయోజనము ఒక వేళ కలిగితే అది మీపైనే మరలుతుంది. కానీ అల్లాహ్ ఆయనే మీకు ఆయనపై విశ్వాసమును కనబరచే భాగ్యమును కలిగించి మీపై ఉపకారం చేశాడు ఒక వేళ మీరు అందులో ప్రవేశించారని మీ వాదనలో సత్యవంతులే అయితే.
Ang mga Tafsir na Arabe:
اِنَّ اللّٰهَ یَعْلَمُ غَیْبَ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَاللّٰهُ بَصِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟۠
నిశ్ఛయంగా ఆకాశముల యొక్క అగోచర విషయముల గురించి అల్లాహ్ కు తెలుసు మరియు ఆయనకు భూమి యొక్క అగోచర విషయముల గురించి తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు ఆయన వాటి పుణ్య కార్యాలపై మరియు దుష్కార్యాలపై మీకు తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• سوء الظن بأهل الخير معصية، ويجوز الحذر من أهل الشر بسوء الظن بهم.
మంచి వ్యక్తుల గురించి దురాలోచన కలిగి ఉండటం పాపము. వారిపై దురాలోచనను కలిగిన దుష్టుల నుండి జాగ్రత్తపడటం సమ్మతము.

• وحدة أصل بني البشر تقتضي نبذ التفاخر بالأنساب.
మానవ సంతానము మూలం యొక్క ఐక్యత వంశాల గురించి ప్రగల్బాలు విడనాడటమును నిర్ణయిస్తుంది.

• الإيمان ليس مجرد نطق لا يوافقه اعتقاد، بل هو اعتقاد بالجَنان، وقول باللسان، وعمل بالأركان.
విశ్వాసం అనేది కేవలం విశ్వాసముతో ఏకీభవించని మాట కాదు. మనస్పూర్తిగా విశ్వసించటం మరియు నాలికతో పలకటం మరియు మూలసూత్రాలపై ఆచరించటం.

• هداية التوفيق بيد الله وحده وهي فضل منه سبحانه ليست حقًّا لأحد.
అనుగ్రహించే భాగ్యం ఒక్కడైన అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నది. అది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. పరిశుద్ధుడైన ఆయన తరపు నుండి ఒక అనుగ్రహము.

 
Salin ng mga Kahulugan Surah: Al-Hujurāt
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara