Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Al-An‘ām   Ayah:
وَمَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖۤ اِذْ قَالُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ عَلٰی بَشَرٍ مِّنْ شَیْءٍ ؕ— قُلْ مَنْ اَنْزَلَ الْكِتٰبَ الَّذِیْ جَآءَ بِهٖ مُوْسٰی نُوْرًا وَّهُدًی لِّلنَّاسِ تَجْعَلُوْنَهٗ قَرَاطِیْسَ تُبْدُوْنَهَا وَتُخْفُوْنَ كَثِیْرًا ۚ— وَعُلِّمْتُمْ مَّا لَمْ تَعْلَمُوْۤا اَنْتُمْ وَلَاۤ اٰبَآؤُكُمْ ؕ— قُلِ اللّٰهُ ۙ— ثُمَّ ذَرْهُمْ فِیْ خَوْضِهِمْ یَلْعَبُوْنَ ۟
అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అల్లాహ్ ఏ మానవునిపై ఎటువంటి దైవ వాణిని అవతరింప జేయలేదు అని ముష్రికులు పలికినప్పుడు వారు అల్లాహ్ ను ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించ లేదు. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : మూసాపై ఆయన జాతి వారికి జ్యోతిగా,సన్మార్గంగా,మార్గదర్శకత్వంగా తౌరాతును ఎవరు అవతరింప జేశారు?. దానిని యూదులు కొన్ని పుస్తకాల్లో పొందుపరచి తమ కోరికలకు అనుగుణంగా ఉన్న వాటిని భహిర్గతం చేస్తున్నారు. తమ కోరికలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని దాచివేస్తున్నారు. ఉదా : ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గుణగణాలు. ఓ అరబ్బులారా మీరు ఖుర్ఆన్ ద్వారా మీకు పూర్వికులకు తెలియని విషయాలను తెలియజేయబడ్డారు. ఓ ప్రవక్తా దానిని అల్లాహ్ అవతరింప జేశాడని వారికి తెలియ జేయండి. ఆ తరువాత మీరు వారిని వారికి మరణం వచ్చే వరకు హేళన చేస్తూ ఉండే స్థితిలోనే వారి మార్గభ్రష్టతలో,వారి అజ్ఞానంలోనే వదిలి వేయండి.
Ang mga Tafsir na Arabe:
وَهٰذَا كِتٰبٌ اَنْزَلْنٰهُ مُبٰرَكٌ مُّصَدِّقُ الَّذِیْ بَیْنَ یَدَیْهِ وَلِتُنْذِرَ اُمَّ الْقُرٰی وَمَنْ حَوْلَهَا ؕ— وَالَّذِیْنَ یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ یُؤْمِنُوْنَ بِهٖ وَهُمْ عَلٰی صَلَاتِهِمْ یُحَافِظُوْنَ ۟
ఓ ప్రవక్తా మేము మీపై అవతరింపజేసిన ఈ ఖుర్ఆను ఎంతో శుభప్రదమైనది. తన కన్న ముందు అవతరింపబడిన ఆకాశ గ్రంధాలను దృవీకరుస్తుంది. దాని ద్వారా మక్కా వాసులను, భూమికి తూర్పు,పడమరలో ఉన్న ప్రజలందరిని వారు సన్మార్గం పొందెంత వరకు హెచ్చరించటం కొరకు (అవతరింపజేశాము),మరియు ఎవరైతే పరలోక జీవితంను విశ్వసిస్తారో,ఈ ఖుర్ఆను ను విశ్వసిస్తారో,అందులో ఉన్న వాటిని ఆచరిస్తారో,తమ నమాజులను వాటి విధులతో,వాటి సున్నతులతో,వాటి నిర్దేశిత వేళల్లో షరిఅత్ పరంగా వాటి భాగములను నెలకొల్పుతూ పరిరక్షిస్తారో (వారిని హెచ్చరించటం కొరకు అవతరింపజేశాము).
Ang mga Tafsir na Arabe:
وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا اَوْ قَالَ اُوْحِیَ اِلَیَّ وَلَمْ یُوْحَ اِلَیْهِ شَیْءٌ وَّمَنْ قَالَ سَاُنْزِلُ مِثْلَ مَاۤ اَنْزَلَ اللّٰهُ ؕ— وَلَوْ تَرٰۤی اِذِ الظّٰلِمُوْنَ فِیْ غَمَرٰتِ الْمَوْتِ وَالْمَلٰٓىِٕكَةُ بَاسِطُوْۤا اَیْدِیْهِمْ ۚ— اَخْرِجُوْۤا اَنْفُسَكُمْ ؕ— اَلْیَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُوْنِ بِمَا كُنْتُمْ تَقُوْلُوْنَ عَلَی اللّٰهِ غَیْرَ الْحَقِّ وَكُنْتُمْ عَنْ اٰیٰتِهٖ تَسْتَكْبِرُوْنَ ۟
అల్లాహ్ ఏ మానవునిపై ఎటువంటి వస్తువును అవతరింప జేయలేదని పలికి లేదా తనపై అల్లాహ్ ఎటువంటి వస్తువును అవతరింప జేయకపోయిన అల్లాహ్ తనపై అవతరింప జేశాడని అబద్దం పలికి లేదా అల్లాహ్ ఖుర్ఆన్ ను అవతరింప జేసినట్లు తాను అవతరింప జేస్తానని తెలిపి అల్లాహ్ పై అబద్దంను కల్పించే వాడి కన్న పెద్ద దుర్మార్గుడు ఎవరూ ఉండరు.ఓ ప్రవక్త ఒక వేళ మీరు ఈ దుర్మార్గులందరిని మరణయాతను పొందుతున్నప్పుడు చూస్తే దైవదూతలు శిక్షిస్తూ,కొడుతూ వారి వైపున తమ జేతులను జాపుతుంటారు,కఠినత్వంతో వారితో ఇలా పలుకుతుంటారు : మీరు మీ ప్రాణములను వదలండి మేము వాటిని పట్టుకుంటాము.ఈ రోజు మీరు ప్రతిఫలంగా శిక్షను పొందుతారు.అది మీరు దైవదౌత్యం,దైవవాణి,అల్లాహ్ అవతరింప జేసినట్లు అవతరింప జేయటం యొక్క దావా చేసి అల్లాహ్ పై అబద్దమును అంటగడుతూ పలకటం వలన,మీరు విశ్వాసించటం నుండి ఆయన ఆయతుల పట్ల గర్వాన్ని ప్రదర్శించటం వలన మిమ్మల్ని పరాభవానికి,అగౌరవానికి గురిచేస్తుంది.ఒక వేళ మీరు దానిని చూస్తే భయంకరమైన విషయం కనబడుతుంది.
Ang mga Tafsir na Arabe:
وَلَقَدْ جِئْتُمُوْنَا فُرَادٰی كَمَا خَلَقْنٰكُمْ اَوَّلَ مَرَّةٍ وَّتَرَكْتُمْ مَّا خَوَّلْنٰكُمْ وَرَآءَ ظُهُوْرِكُمْ ۚ— وَمَا نَرٰی مَعَكُمْ شُفَعَآءَكُمُ الَّذِیْنَ زَعَمْتُمْ اَنَّهُمْ فِیْكُمْ شُرَكٰٓؤُا ؕ— لَقَدْ تَّقَطَّعَ بَیْنَكُمْ وَضَلَّ عَنْكُمْ مَّا كُنْتُمْ تَزْعُمُوْنَ ۟۠
ప్రళయదినాన వారితో ఈ విధంగా తెలుపబడును : ఏ విధంగానైతే మేము మొదటిసారి మిమ్మల్ని చెప్పలు లేకుండా,నగ్నముగా,సున్తీ చేయకుండా పుట్టించామో అలాగే మీరు ఈ రోజు మావద్దకు ఒంటరిగావచ్చారు.మీ వద్ద ఎటువంటి సంపద లేదు,ఎటువంటి అధికారము లేదు.మేము మీకు ప్రసాదించిన వాటిని మీరు అయిష్టతతో ఇహలోకములో మీ వెనుక వదిలివేశారు.మీ ఆరాధ్య దేవుళ్ళు ఎవరినైతే మీరు మీ కొరకు మధ్యవర్తులుగా (సిఫారసు చేసేవారిగా) ,ఆరాధనలో హక్కుదారులవటంలో అల్లాహ్ కు సాటిగా భావించే వారో వారిని మేము ఈ రోజు మీతోపాటు చూడటం లేదు.మీ మధ్యన సంబంధాలు తెగిపోయినవి.ఎవరికైతే సిఫారసు చేసే అధికారము ఉందని,వారు అల్లాహ్ కు సాటి అని మీరు నమ్మేవారో వారందరు మీ నుండి దూరమైపోయారు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• إنزال الكتب على الأنبياء هو سُنَّة الله في المرسلين، والنبي عليه الصلاة والسلام واحد منهم.
దైవప్రవక్తలపై గ్రంధముల అవతరణ ప్రవక్తల్లో అల్లాహ్ సాంప్రదాయము,ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలోంచి ఒకరు.

• أعظم الناس كذبًا وفرية هو الذي يكذب على الله تعالى، فينسب أو ينفي ويثبت في حق الله تعالى أمرًا ليس عليه دليل صحيح.
అల్లాహ్ పై అభద్దమును అపాదించేవాడు ప్రజల్లో పెద్ద అబద్దాలకోరు,నిందలను మోపేవాడు.అతడు ఎటువంటి సరైన (నిజమైన) ఆధారం లేకుండా అల్లాహ్ విషయంలో అంటగడుతాడు,నిరాకరిస్తాడు,నిరూపిస్తాడు.

• كل أحد يبعث يوم القيامة فردًا متجردًا عن المناصب والألقاب، فقيرًا، ويحاسب وحده.
ప్రతి ఒక్కడు ప్రళయదినాన హోదాలు,బిరుదులు లేకుండా,పేదవాడిగా లేవదీయబడుతాడు.అతనొక్కడే లెక్కతీసుకోవబడుతాడు.

 
Salin ng mga Kahulugan Surah: Al-An‘ām
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara