Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Al-A‘rāf   Ayah:
قَالَ ادْخُلُوْا فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ مِّنَ الْجِنِّ وَالْاِنْسِ فِی النَّارِ ؕ— كُلَّمَا دَخَلَتْ اُمَّةٌ لَّعَنَتْ اُخْتَهَا ؕ— حَتّٰۤی اِذَا ادَّارَكُوْا فِیْهَا جَمِیْعًا ۙ— قَالَتْ اُخْرٰىهُمْ لِاُوْلٰىهُمْ رَبَّنَا هٰۤؤُلَآءِ اَضَلُّوْنَا فَاٰتِهِمْ عَذَابًا ضِعْفًا مِّنَ النَّارِ ؕ۬— قَالَ لِكُلٍّ ضِعْفٌ وَّلٰكِنْ لَّا تَعْلَمُوْنَ ۟
వారితో దైవదూతలు ఇలా అంటారు ఓ ముష్రికులారా : మీరు మీకన్న పూర్వం జిన్నాతుల్లోంచి,మానవుల్లోంచి అవిశ్వాసంలో,అపమార్గంలో ఉండి గతించిన వారందరితో నరకాగ్నిలో ప్రవేశించండి. సమూహాల్లోంచి ఏదైన సమూహం ప్రవేశించినప్పుడు తమ కన్న ముందు ప్రవేశించిన సహవాస సమూహముపై శాపనార్ధాలు పెడుతుంది. ఆఖరికి వారందరు అందులో కలిసిపోయిన తరువాత వారందరూ సమావేశమై వారిలోని తరువాత ప్రవేశించిన వారు అంటే క్రింది వారు,అనుసరించని వారు వారిలోని మొదటివారు అంటే పెద్ద వారు,నాయకులను ఉద్దేశించి ఇలా అంటారు : ఓ మా ప్రభువా ఈ పెద్దవారందరే మమ్మల్ని సన్మార్గము నుంచి తప్పించినారు. అప మార్గమును మాకు అలంకరించి చూపించినందుకు వారికి రెట్టింపు శిక్షను విధించు. అల్లాహ్ వారిని ఖండిస్తూ ఇలా అంటాడు : మీలో నుంచి ప్రతి సమూహానికి రెట్టింపు శిక్ష నుండి భాగముంటుంది. కాని అది మీకు అర్ధం కాదు. దానిని మీరు తెలుసుకోలేరు.
Ang mga Tafsir na Arabe:
وَقَالَتْ اُوْلٰىهُمْ لِاُخْرٰىهُمْ فَمَا كَانَ لَكُمْ عَلَیْنَا مِنْ فَضْلٍ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْسِبُوْنَ ۟۠
అనుసరించబడిన నాయకులు తమను అనుసరించిన వారిని ఉద్దేశించి ఇలా అంటారు : ఓ అనుసరించే వారా మీరు మీ నుండి శిక్షను తగ్గించుకోవటానికి మీకు మాపై ఎటువంటి ప్రాధాన్యత లేదు. మీరు చేసిన కర్మల యొక్క లెక్క ప్రకారం జరుగును.అసత్యాన్ని అనుసరించిన విషయంలో మీ కొరకు ఎటువంటి సాకులు (వంకలు) ఉండవు (స్వీకరించబడవు). ఓ అనుసరించేవారా మీరు చేసిన పాపాలు,అవిశ్వాస కార్యాల మూలంగా మేము అనుభవించిన శిక్షను మీరూ అనుభవించండి.
Ang mga Tafsir na Arabe:
اِنَّ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَاسْتَكْبَرُوْا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ اَبْوَابُ السَّمَآءِ وَلَا یَدْخُلُوْنَ الْجَنَّةَ حَتّٰی یَلِجَ الْجَمَلُ فِیْ سَمِّ الْخِیَاطِ ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُجْرِمِیْنَ ۟
నిశ్చయంగా ఎవరైతే స్పష్టమైన మా ఆయతులను తిరస్కరిస్తారో,వాటిని అనుసరించటం,విధేయత చూపటం విషయంలో దురహంకారమును ప్రదర్శిస్తారో వారు ప్రతి మేలు గురించి నిరాశులైపోయారు. వారి అవిశ్వాసం వలన వారి ఆచరణల కొరకు,వారు మరణించినప్పుడు వారి ఆత్మల కొరకు ఆకాశ ద్వారములు తెరుచుకోబడవు. జంతువుల్లో పెద్ద జంతువైన ఒంటే అత్యంత బిగుతువుగా ఉండే సూది రంధ్రంలో దూరనంత వరకు వారు ఎన్నడు స్వర్గంలో ప్రవేశించలేరు. ఇది అసాధ్యము. వారు స్వర్గంలో ప్రవేశించటం అసాధ్యము. ఇలాంటి ప్రతిఫలం మాదిరిగానే పెద్ద పాపములు కలవారిని అల్లాహ్ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Ang mga Tafsir na Arabe:
لَهُمْ مِّنْ جَهَنَّمَ مِهَادٌ وَّمِنْ فَوْقِهِمْ غَوَاشٍ ؕ— وَكَذٰلِكَ نَجْزِی الظّٰلِمِیْنَ ۟
దురహంకారము కల ఈ తిరస్కారులందరి కొరకు నరకాగ్ని పరుపు ఉంటుంది. దానిపై వారు పడుకుంటారు. వారి కొరకు వారిపై నరకాగ్ని కప్పు (దుప్పట) ఉంటుంది. ఇటువంటి ప్రతిఫలం మాదిరిగానే అల్లాహ్ పై తమ అవిశ్వాసం,అతని నుండి వారి విముఖత ద్వారా అల్లాహ్ హద్దులను దాటే వారిని మేము ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَاۤ ؗ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَنَّةِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
మరియు ఎవరైతే విశ్వసించి తమ శక్తికి తగ్గట్టుగా సత్కార్యాలు చేస్తారో అల్లాహ్ ఎవరి పై కూడా వారి శక్తికి మించి భారం వేయడు. వారందరు స్వర్గ వాసులు అందులో వారు ప్రవేశిస్తారు. అందులో శాశ్వతంగా ఉంటారు.
Ang mga Tafsir na Arabe:
وَنَزَعْنَا مَا فِیْ صُدُوْرِهِمْ مِّنْ غِلٍّ تَجْرِیْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ ۚ— وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ هَدٰىنَا لِهٰذَا ۫— وَمَا كُنَّا لِنَهْتَدِیَ لَوْلَاۤ اَنْ هَدٰىنَا اللّٰهُ ۚ— لَقَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ؕ— وَنُوْدُوْۤا اَنْ تِلْكُمُ الْجَنَّةُ اُوْرِثْتُمُوْهَا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
అల్లాహ్ వారి హృదయముల్లో ఉన్న ధ్వేషమును,విరోధమును తొలగించటం,వారి క్రింద నుండి కాలువలను ప్రవహింపచేయటం స్వర్గంలో వారికి ప్రసాదించిన పరిపూర్ణ అనుగ్రహాల్లోంచివి. వారు తమపై ఉన్న అనుగ్రహాలను అంగీకరిస్తూ ఇలా అంటారు : పొగడ్తలన్ని అల్లాహ్ కొరకే ఆయనే మేము ఈ స్థానమును పొందటానికి సత్కార్యమును చేసే అనుగ్రహమును ప్రసాదించాడు. ఒక వేళ అల్లాహ్ మాకు దానిని పొందే అనుగ్రహం కలిగించకపోతే మేము మా తరుపు నుండి దానిని పొందే వాళ్ళమే కాము. ఎటువంటి సందేహము లేని సత్యమును,ప్రమాణము,హెచ్చరికల్లో నిజాయితీని తీసుకుని మా ప్రభువు యొక్క ప్రవక్తలు వచ్చారు. ఒక ప్రకటించే వాడు వారిలో ఇలా ప్రకటిస్తాడు : ఇహలోకంలో నా ప్రవక్తలు మీకు సమాచారమిచ్చింది ఈ స్వర్గం గురించే. అల్లాహ్ మన్నతను కోరుకుంటూ మీరు చేసుకున్న సత్కర్మలకు ప్రతిఫలంగా అల్లాహ్ దీనినే మీకు ప్రసాదించాడు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• المودة التي كانت بين المكذبين في الدنيا تنقلب يوم القيامة عداوة وملاعنة.
ఇహలోకంలో సత్య తిరస్కారుల మధ్య ఉన్న స్నేహము ప్రళయ దినాన శతృత్వంగా,శాపనార్ధాలుగా మారిపోతుంది.

• أرواح المؤمنين تفتح لها أبواب السماء حتى تَعْرُج إلى الله، وتبتهج بالقرب من ربها والحظوة برضوانه.
ఆకాశ ద్వారములు విశ్వాసపరుల ఆత్మల కొరకు తెరవబడుతాయి. చివరికి వారు అల్లాహ్ వైపునకు ఎక్కుతారు. వారు తమ ప్రభువు సామిప్యము ద్వారా,ఆయన మన్నతను పొందే స్థాయి ద్వారా సంతోష పడుతారు.

• أرواح المكذبين المعرضين لا تفتح لها أبواب السماء، وإذا ماتوا وصعدت فهي تستأذن فلا يؤذن لها، فهي كما لم تصعد في الدنيا بالإيمان بالله ومعرفته ومحبته، فكذلك لا تصعد بعد الموت، فإن الجزاء من جنس العمل.
విముఖత చూపే సత్యతిరస్కారుల ఆత్మలకొరకు ఆకాశ ద్వారములు తెరవ బడవు. వారు చనిపోయినప్పుడు ఆకాశం వైపునకు ఎక్కి అనుమతి కోరుతారు. వారికి అనుమతివ్వబడదు. ఏ విధంగానంటే వారు ఇహ లోకంలో అల్లాహ్ పై విశ్వాసము ద్వారా,ఆయన్ను గుర్తించటం ద్వారా,ఆయన్ను ప్రేమించటం ద్వారా ఎక్క లేదో అదే విధంగా వారు మరణము తరువాత ఎక్క లేదు. ఎందుకంటే ప్రతిఫలం అన్నది ఆచరణ ఎలా ఉంటే అలా ఉంటుంది.

• أهل الجنة نجوا من النار بعفو الله، وأدخلوا الجنة برحمة الله، واقتسموا المنازل وورثوها بالأعمال الصالحة وهي من رحمته، بل من أعلى أنواع رحمته.
స్వర్గవాసులు అల్లాహ్ మన్నింపు ద్వారా నరకాగ్ని నుండి బతికి పోతారు,అల్లాహ్ కారుణ్యం ద్వారా స్వర్గంలో ప్రవేశించబడుతారు. వారు ఇళ్లను పంచుకుంటారు. సత్కర్మల వలన వాటికి వారు వారసులవుతారు. అది కూడా ఆయన కారుణ్యము ద్వారానే. అంతే కాదు అది ఆయన యొక్క ఎంతోఉన్నత కారుణ్య రకాల్లోంచిది.

 
Salin ng mga Kahulugan Surah: Al-A‘rāf
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara