Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Ayah: (124) Surah: At-Tawbah
وَاِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ فَمِنْهُمْ مَّنْ یَّقُوْلُ اَیُّكُمْ زَادَتْهُ هٰذِهٖۤ اِیْمَانًا ۚ— فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا فَزَادَتْهُمْ اِیْمَانًا وَّهُمْ یَسْتَبْشِرُوْنَ ۟
మరియు అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏదైన సూరా అవతరింప జేసినప్పుడు కపట విశ్వాసుల్లోంచి అవహేళన చేస్తూ,ఎగతాళి చేస్తూ ముహమ్మద్ తీసుకుని వచ్చిన దానిపై మీలో నుంచి ఈ అవతరించిన సూరా ఎవరి విశ్వాసాన్ని అధికం చేసింది ? అని అడిగేవారు ఉన్నారు.అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తను సత్యమని అంగీకరించిన వారికి సూరా అవతరణ వారి క్రితం విశ్వాసమును అధికం చేసింది.వారందరు అవతరింపబడిన దైవవాణి ద్వారా అందులో ఉన్న వారి ఇహలోక,పరలోక ప్రయోజనాల వలన సంతోషముగా ఉన్నారు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• وجوب ابتداء القتال بالأقرب من الكفار إذا اتسعت رقعة الإسلام، ودعت إليه حاجة.
ఇస్లాం యొక్క పరిధి విస్తరించి,దానికి అవసరమైతే దగ్గర ఉన్న అవిశ్వాసపరులతో పోరాడటం ప్రారంభించటం విధి.

• بيان حال المنافقين حين نزول القرآن عليهم وهي الترقُّب والاضطراب.
ఖుర్ఆన్ అవతరణ సమయంలో కపటవిశ్వాసుల పరిస్థితి ప్రకటన అవి ఎదురుచూపులు,అయోమయ పరిస్థితులు.

• بيان رحمة النبي صلى الله عليه وسلم بالمؤمنين وحرصه عليهم.
విశ్వాసపరులపై దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యము మరియు విశ్వాసులకు దాని ఆశ ప్రకటన.

• في الآيات دليل على أن الإيمان يزيد وينقص، وأنه ينبغي للمؤمن أن يتفقد إيمانه ويتعاهده فيجدده وينميه؛ ليكون دائمًا في صعود.
విశ్వాసము పెరుగుతూ,తరుగుతూ ఉంటుందన్న దానిపై ఆధారం ఆయతుల్లో ఉన్నది.ఒక విశ్వాసపరుని కొరకు తన విశ్వాసమును పరిశీలించటం,దాన్ని పరిరక్షించటం,దాన్ని పునరుద్ధరిచటం,దాన్ని పెంపొందించటం అది ఎల్లప్పుడు పురోగతిలో ఉండటానికి ఎంతో అవసరం.

 
Salin ng mga Kahulugan Ayah: (124) Surah: At-Tawbah
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara