సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు![1]
[1] దీనితో తెలిసేదేమిటంటే ఈ ఖుర్ఆన్ - ఏదైతే దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)పై అవతరింప జేయబడిందో - సర్వలోకాల వారికి, అంటే మానవుల కొరకు మరియు జిన్నాతుల కొరకు గూడా మార్గదర్శినిగా అవతరింపజేయబడింది. కావున ము'హమ్మద్ ('స'అస) వారందరికీ సందేశహరుడు. అతను వారందరి కొరకు మార్గదర్శకునిగా పంపబడ్డారు. చూడండి 7:158. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "నేను ఎర్ర-నల్ల అందరి వైపుకూ సందేశహరునిగా పంపబడ్డాను కాని పూర్వపు ప్రవక్తలు ('అలైహిమ్ స.) ఒక్క జాతివారి వైపుకు మాత్రమే పంపబడేవారు." ('స'హీ'హ్ బు'ఖారీ).
భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు[1]. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు[2].
[1] చూడండి, 17:111. [2] చూడండి, 87:3. అల్లాహ్ (సు.తా.) ప్రతిదాని విధిని, అంటే దాని జీవన విధానం మరియు దాని మరణం, మొదలైనవి అన్నీ మొదటనే వ్రాసిపెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు గడిచిపోయింది మరియు ముందు జరగనున్నది అంతా తెలుసు.
అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు.
మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "ఇది (ఈ ఖుర్ఆన్) కేవలం ఒక బూటక కల్పన; దీనిని ఇతనే కల్పించాడు. మరియు ఇతర జాతివారు కొందరు, ఇతనికి ఈ పనిలో సహాయపడ్డారు[1]. కాని వాస్తవానికి వారు అన్యాయానికి మరియు అబద్ధానికి పూనుకున్నారు."
[1] చూడండి, 16:103. దైవప్రవక్త ('స'అస) ఈ గ్రంథాన్ని, అబూ ఫకీహా యసార్, 'అదాస్ మరియు జబర్ మొదలైన యూద విద్వాంసుల నుండి నేర్చుకున్నారని సత్యతిరస్కారులు ఆరోపించారు.
మరియు వారిలా అంటారు: "ఇతను ఎటువంటి సందేశహరుడు, (సాధారణ వ్యక్తివలే) ఇతనూ అన్నం తింటున్నాడు మరియు వీధులలో తిరుగుతున్నాడు? (ఇతను వాస్తవంగానే దైవప్రవక్త అయితే) ఇతనికి తోడుగా హెచ్చరిక చేసేవాడిగా, ఒక దేవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు?[1]"
[1] సత్యతిరస్కారులు మొదట ఖుర్ఆన్ ను అసత్యమని తిరస్కరించారు. దానిని పూర్వికుల కట్టుకథ అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త ('స'అస) ను ఒక సాధారణ వ్యక్తి ఎలా దైవప్రవక్త కాగలడు, ఇతడు ఒక మాంత్రికుడు లేదా మంత్రజాలానికి గురి అయినవాడు లేదా ఇతరుల నుండి పూర్వ గాథలను నేర్చుకొని మాకు వినిపిస్తున్నాడు, అన్నారు. వాస్తవమేమిటంటే అతను ('స'అస) నిరక్షరాస్యుడు మరియు ఆయన చెప్పే గాథలు పూర్వ గ్రంథ ప్రజల గాథల కంటే భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే వారి గాథలు, పూర్వ ప్రవక్తలు తెచ్చిన నిజ గ్రంథాల నుండి గాక తరువాత తరాల వారు వ్రాసి పెట్టినవి. వారు తమ గ్రంథాలలో ఎన్నో మార్పులు తెచ్చారు. ఖుర్ఆన్ అయితే అల్లాహ్ తరఫు నుండి వచ్చింది మరియు 1400ల సంత్సరాలలో దానిలో ఒక్క అక్షరపు మార్పు కూడా రాలేదు. ఈ విషయాన్ని సత్యతిరస్కారులు కూడా ధృవీకరిస్తునారు.
లేదా ఇతనికొక నిధి ఎందుకు ఇవ్వబడలేదు? లేదా ఇతనికొక తోట ఎందుకు ఇవ్వబడలేదు? ఇతను దాని నుండి తినటానికి!" ఆ దుర్మార్గులు ఇంకా ఇలా అంటారు :"మీరు కేవలం ఒక మంత్రజాలానికి గురి అయిన మానవుణ్ణి అనుసరిస్తున్నారు."
ఆ శుభదాయకుడు కోరితే నీకు వాటి కంటే ఉత్తమమైన వాటిని ప్రసాదించగలడు - స్వర్గవనాలు - వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి మరియు అక్కడ నీ కొరకు పెద్ద కోటలు కూడా ఉంటాయి.
వాస్తవానికి వారు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించారు. మరియు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించే వారి కొరకు మేము జ్వలించే నరకాగ్నిని సిద్ధపరచి ఉంచాము.
మరియు ఆయన (అల్లాహ్) వారిని (సత్యతిరస్కారులను) మరియు అల్లాహ్ కు బదులుగా వారు ఆరాధించేవారిని, అందరినీ, ఆ రోజు సమావేశపరచి వారితో ఇలా అంటాడు: " ఏమీ? మీరేనా నా దాసులను మార్గం తప్పించిన వారు? లేక స్వయంగా వారే మార్గభ్రష్టులయ్యారా?"
వారంటారు: "ఓ మా ప్రభూ! నీవు సర్వలోపాలకు అతీతుడవు! మేము నిన్ను వదలి ఇతరులను మా సంరక్షకులుగా చేసుకోవటం మాకు తగినది కాదు, కాని నీవు వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా సుఖసంతోషాలను ప్రసాదించావు, చివరకు వారు నీ బోధననే మరచి పోయి నాశనానికి గురి అయిన వారయ్యారు."
(అప్పుడు అల్లాహ్ అంటాడు): "కాని ఇప్పడైతే వారు, మీ మాటలను అసత్యాలని తిరస్కరిస్తున్నారు. ఇక మీరు మీ శిక్ష నుండి తప్పించుకోలేరు మరియు ఎలాంటి సహాయమూ పొందలేరు. మరియు మీలో దుర్మార్గానికి పాల్పడిన వానికి మేము ఘోరశిక్ష రుచి చూపుతాము!"
మరియు (ఓ ముహమ్మద్!) మేము నీకు పూర్వం పంపిన సందేశహరులు అందరూ నిశ్చయంగా, ఆహారం తినేవారే, వీధులలో సంచరించేవారే. మరియు మేము మిమ్మల్ని ఒకరిని మరొకరి కొరకు పరీక్షా సాధనాలుగా చేశాము; ఏమీ? మీరు[1] సహనం వహిస్తారా? మరియు వాస్తవానికి, నీ ప్రభువు సర్వం చూసేవాడు[2].
మరియు మమ్మల్ని కలుసుకోవలసి ఉందని ఆశించనివారు ఇలా అన్నారు: "దేవదూతలు మా వద్దకు ఎందుకు పంపబడలేదు? లేదా మేము మా ప్రభువును ఎందుకు చూడలేము?" వాస్తవానికి, వారు తమను తాము చాలా గొప్పవారిగా భావించారు మరియు వారు తలబిరుసుతనంలో చాలా మితిమీరి పోయారు[1].
[1] అల్లాహ్ (సు.తా.), అగోచరాన్ని విశ్వసించే విషయంలో మానవులను పరీక్షిస్తున్నాడు. ఒకవేళ వారి ముందుకు దైవదూతలు లేక అల్లాహ్ (సు.తా.) స్వయంగా వచ్చి ప్రతి ఒక్కరితో తనను విశ్వసించండి అని చెప్పితే! ఈ పరీక్ష అవసరమే ఉండేది కాదు. అల్లాహ్ (సు.తా.) మానవుల ఇచ్ఛ ప్రకారం కాక తన ఇష్టప్రకారం ప్రవర్తిస్తాడు.
ఆ రోజు[1] వారు దేవదూతలను చూస్తారు; ఆరోజు అపరాధులకు ఎలాంటి శుభవార్తలు ఉండవు మరియు వారు (దేవదూతలు) ఇలా అంటారు: "మీకు శుభవార్తలన్నీ ఖచ్చితంగా నిషేధించబడ్డాయి."
[1] ఆ రోజు అంటే, మరణదినం కానీ లేక పునరుత్థానదినం కానీ కావచ్చు (ఇబ్నె-కసీ'ర్). ఆ రోజు సత్యతిరస్కారుల పరిస్థితికి చూడండి, 8:50. విశ్వాసుల పరిస్థితికి చూడండి, 41:30-32.
మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము[1].
[1] హబాఅన్': అంటే చిన్న సందులోనుండి ఇంటిలోకి వచ్చే సూర్య కిరణాలలో కనబడే సూక్ష్మకణాలు. వాటిని చేతితో పట్టుకోవటం అసాధ్యం. సత్యతిరస్కారుల కర్మలు, ఇక్కడ సూక్ష్మ కణాలతో పోల్చబడ్డాయి. అవి ఇతర ఆయతులలో ఎండమావులతో, బూడిదతో లేక సున్నని బండతో పోల్చబడ్డాయి. చూడండి, 2:264, 14:18 మరియు 24:39.
అప్పుడు సందేశహరుడు ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా జాతివారు ఈ ఖుర్ఆన్ ను పూర్తిగా వదలి పెట్టారు[1]."
[1] హిజ్ రున్: ఆటంకపరచటం, నిషేధించటం, ఆపటం మొదలైనవి. ముష్రికులు ఖుర్ఆన్ వినిపించే టప్పుడు, గొడవ చేసేవారు ఇదే హిజ్ రున్. ఖుర్ఆన్ ను విశ్వసించకుండటం, దానిని అనుసరించ కుండటం, అది నిషేధించిన దానిని విడువకకుండటం మొదలైనవి కూడా ఈ అర్థంలోకి వస్తాయి.
మరియు సత్యతిరస్కారులు అంటారు: "ఇతని (ముహమ్మద్) మీద ఈ ఖుర్ఆన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?" మేము (ఈ ఖుర్ఆన్ ను) ఈ విధంగా (భాగాలుగా పంపింది) నీ హృదయాన్ని దృఢపరచడానికి మరియు మేము దీనిని క్రమక్రమంగా అవతరింపజేశాము[1].
[1] అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: 'మేము ఈ ఖుర్ఆన్ ను 23 సంవత్సరాలలో క్రమక్రమంగా అవతరింపజేశాము.' ఇంకా చూడండి, 17:106, 73:4.
మరియు వారు నీ వద్దకు (నిన్ను వ్యతిరేకించటానికి) ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా! మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము[1].
[1] సత్యతిరస్కారులు దైవప్రవక్త ('స'అస) ను వ్యతిరేకించటానికి, ఎలాంటి ఉపమానాలు తెచ్చినా వాటికి తగిన సమాధానాలు ఇవ్వటానికి మేము క్రమక్రమంగా ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము.
ఎవరైతే, వారి ముఖాల మీద (బోర్లా పడవేయబడి) లాగుతూ నరకంలో కూడబెట్ట బడతారో, అలాంటి వారు ఎంతో దుస్థితిలో మరియు మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నవారు[1].
[1] అంటే సత్యతిరస్కారుడు ఎన్ని సత్కార్యాలు చేసినా అవి పరలోకంలో ఎండమావులుగా అదృశ్యమైపోతాయి. అంటే అతనికి వాటి నుండి ఎలాంటి పుణ్యఫలితం లభించదు. అతడు నరకంలో చేరిపోతాడు.
ఇక నూహ్ జాతి వారు: ఎప్పుడైతే వారు ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించారో, మేము వారిని ముంచి వేసి, సర్వజనులకు వారిని ఒక సూచనగా చేశాము. మరియు దుర్మార్గుల కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధ పరిచి ఉంచాము.
మరియు ఇదే విధంగా ఆద్ మరియు సమూద్ మరియు అర్ రస్స్[1] ప్రజలు మరియు వారి మధ్య ఎన్నో తరాల వారిని[2] (నాశనం చేశాము).
[1] రస్సున్: అంటే బావి. ఇమామ్ ఇబ్నె-జరీర్ 'తబరీ: వీరే అ'స్హాబ్ అల్-ఉ'ఖ్దూద్ అని అన్నారు. చూడండి, 85:4 (ఇబ్నె-కసీ'ర్). [2] ఖర్నున్: అంటే ఒక యుగానికి లేక ఒక తరానికి చెందిన ప్రజలు. ప్రతి ప్రవక్త సమాజాన్ని ఒక ఖర్న్ కు చెందినది అని అనవచ్చు. (ఇబ్నె-కసీ'ర్).
మరియు మేము దారుణమైన (రాళ్ళ) వర్షం కురిపించిన (లూత్) నగరం మీద నుండి వాస్తవానికి వారు (అవిశ్వాసులు) ప్రయాణం చేసి ఉంటారు. ఏమీ? వారు దానిని (దాని స్థితిని) చూడటం లేదా? వాస్తవానికి, వారు తిరిగి బ్రతికించి లేపబడతారని నమ్మలేదు[1].
మేము వాటి (మా దేవతల) పట్ల (దృఢవిశ్వాసం మీద) స్థిరంగా ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవతల నుండి తప్పించి దూరం చేసేవాడే!" మరియు త్వరలోనే వారు మా శిక్షను చూసినప్పుడు ఎవరు మార్గం తప్పి ఉన్నారో తెలుసుకుంటారు[1].
లేక వారిలోని చాలా మంది వింటారని లేదా అర్థం చేసుకుంటారని నీవు భావిస్తున్నావా? అసలు వారు పశువుల వంటి వారు. అలా కాదు! వారు వాటి కంటే ఎక్కువ దాని తప్పిన వారు.
ఏమీ? నీవు చూడటం లేదా? నీ ప్రభువు! ఏ విధంగా ఛాయను పొడిగిస్తాడో? ఒకవేళ ఆయన కోరితే, దానిని నిలిపివేసి ఉండేవాడు, కాని మేము సూర్యుణ్ణి దానికి మార్గదర్శిగా చేశాము.
మరియు ఆయన (అల్లాహ్) యే మీ కొరకు రాత్రిని వస్త్రంగానూ (తెరగానూ), నిద్రను విశ్రాంతి స్థితిగానూ మరియు పగటిని తిరిగి బ్రతికించి లేపబడే (జీవనోపాధి) సమయంగానూ చేశాడు.
మరియు వాస్తవానికి, మేము దానిని (నీటిని) వారి మధ్య పంచాము, వారు (మా అనుగ్రహాన్ని) జ్ఞాపకముంచుకోవాలని; కానీ మానవులలో చాలా మంది దీనిని తిరస్కరించి, కృతఘ్నులవుతున్నారు.
మరియు రెండు సముద్రాలను కలిపి ఉంచిన వాడు ఆయనే! ఒకటేమో రుచికరమైనది, దాహం తీర్చునది, మరొకటేమో ఉప్పగనూ, చేదుగనూ ఉన్నది మరియు ఆయన ఆ రెండింటి మధ్య ఒక అడ్డుతెరను - అవి కలిసి పోకుండా - అవరోధంగా ఏర్పరచాడు[1].
మరియు ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు[1]. తరువాత అతనికి తన వంశ బంధుత్వాన్ని మరియు వివాహ బంధుత్వాన్ని ఏర్పరచాడు. మరియు వాస్తవానికి నీ ప్రభువు (ప్రతిదీ చేయగల) సమర్ధుడు.
మరియు వారు అల్లాహ్ ను వదలి తమకు లాభం గానీ, నష్టం గానీ, చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. మరియు సత్యతిరస్కారుడు తన ప్రభువుకు విరుద్ధంగా, (షైతానుకు తోడుగా) ఉంటాడు.
ఆయనే ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తరువాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు[1]. ఆయన అనంత కరుణా మయుడు, ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు.
మరియు వారితో: "ఆ కరుణామయునికి సాష్టాంగం (సజ్దా) చేయండి." అని అన్నప్పుడల్లా, వారంటారు: "ఆ కరుణామయుడెవడు? మీరు ఆజ్ఞాపించిన వానికి మేము సాష్టాంగం (సజ్దా) చేయాలా?" మరియు అది (నీ పిలుపు) వారి వ్యతిరేకతను మరింత అధికమే చేసింది[1].
[1] 'హుదైబియహ్ ఒప్పందాన్ని: 'బిస్మిల్లా హిర్ర'హ్మా నిర్ర'హీమ్' తో, వ్రాయటం మొదలు పెడ్తే దానికి ముష్రిక్ ఖురైషీ రాయబారి అయఇన సుహైల్ బిన్ అమ్ర్ మేము ర'హ్మాన్, ర'హీంలను ఎరుగము: 'బి ఇస్మిక అల్లాహుమ్మ.' అని మొదలు పెట్టండన్నారు. (సీరత్ ఇబ్నె'హిషామ్). చూడండి 17:110, 13:30.
ఆకాశంలో నక్షత్రరాసులను (బురూజులను)[1] నిర్మించి అందులో ఒక (ప్రకాశించే) సూర్యుణ్ణి[2] మరియు వెలుగునిచ్చే (ప్రతిబింబింప జేసే) చంద్రుణ్ణి నియమించిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు.
[1] బురూజున్: మొట్టమొదటి వ్యాఖ్యాతలు బురూజున్, అంటే పెద్ద పెద్ద నక్షత్ర సముదాయాలన్నారు. తరువాత కాలపు వ్యాఖ్యాతలు పన్నెండు నక్షత్రరాసులు (సముదాయాలు) - మేషం, వృషభం, మిథునం, కర్కాట్కం, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం - అనేవి అన్నారు. (అయ్ సర్ అత్తఫాసీర్) ఇంకా చూడండి, 15:16. [2] చూడండి, 10:5, ప్రకాశించే సూర్యుడు. సూర్యుని వెలుగును ప్రతిబింపజేసే చంద్రుడు.
మరియు ఎవరైతే: "ఓ మా ప్రభూ! మా నుండి నరకపు శిక్షను తొలగించు. నిశ్చయంగా, దాని శిక్ష ఎడతెగని పీడన" అని అంటారో![1]
[1] చూవారే అనంతకరుణామయునికి ప్రియులైనవారు ఎవరైతే నమా'జ్ చేస్తారో, విధిదానం ('జకాత్) ఇస్తారో, సత్కార్యాలు చేస్తారో మరియు తమ ప్రభువును రేయింబవళ్ళు నరకపు శిక్ష నుండి తొలగించమని ప్రార్థిస్తారో! అంటే అల్లాహ్ (సు.తా.) ఆరాధన చేస్తూ ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తూ ఉండి కూడా, దానికై గర్వితులు కారో మరియు సదా తమ ప్రభువు శిక్ష నుండి భీతిపరులై ఉంటారో, అలాంటి వారు! ఇంకా చూడండి, 23:60.
మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో[1]! మరియు వ్యభిచారానికి పాల్పబడరో[2]. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.
[1] న్యాయానికి చంపే పరిస్థితులు మూడు: 1) ఇస్లాం స్వీకరించిన తరువాత మరల సత్యతిరస్కారి అవటం, 2) పెండ్లి అయినవాడు వ్యభిచారం చేయటం, 3) ఎవరినైనా చంపటం. [2] ఒకడు దైవప్రవక్త ('స'అస)తో ప్రశ్నించాడు: 'అన్నింటి కంటే మహాపాపం ఏమిటీ?' అతను ('స'అస) జవాబిచ్చారు: 'అల్లాహ్ (సు.తా.)కు ఎవరినైనా సాటికల్పించటం (షిర్క్). ఎందుకంటే ఆయనయే నిన్ను సృష్టించాడు.' అతనన్నాడు: 'దాని తరువాత ఏ పాపం పెద్దది?' దైవప్రవక్త ('స'అస) అన్నారు: 'తన సంతానాన్ని జీవనోపాధికి భయపడి చంపటం.' అతడు మళ్ళీ అడిగాడు, ఆ తరువాత అతను జవాబిచ్చారు: 'తన పొరుగు వాని భార్యతో వ్యభిచారం చేయటం!' ఆ తరువాత దైవప్రవక్త ('స'అస) అన్నారు: 'ఈ మూడు విషయాలు ఈ ఆయత్ తో విశదీకరించబడుతున్నాయి.' ఆని ఈ ఆయత్ ను చదివారు. ('స. బు'ఖారీ, ముస్లిం).
కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు[1]. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
మరియు ఎవరైతే, ఇలా ప్రార్థిస్తారో: "ఓ మా ప్రభూ! మా సహవాసుల (అజ్వాజ్ ల) మరియు సంతానం ద్వారా మా కన్నులకు చల్లదనం ప్రసాదించు. మరియు మమ్మల్ని దైవభీతి గలవారికి నాయకులుగా (ఇమాములుగా) చేయి."
(ఓ ముహమ్మద్! అవిశ్వాసులతో) ఇలా అను: "మీరు ఆయనను ప్రార్థిస్తున్నారు కాబట్టి నా ప్రభువు మిమ్మల్ని అలక్ష్యం చేయడం లేదు[1]. కాని వాస్తవానికి, ఇప్పుడు మీరు (ఆయనను) తిరస్కరించారు. కావున త్వరలోనే ఆయన శిక్ష మీపై అనివార్యమవుతుంది."
[1] అల్లాహ్ (సు.తా.) యందు భయభక్తులు కలిగివుండి కేవలం ఆయననే ఆరాధించే వారిని ఆయన (సు.తా.) లక్ష్యం చేస్తాడు. అల్లాహ్ (సు.తా.) ను తిరస్కరించిన వారికీ మరియు ఆయనకు సాటికల్పించిన వారికీ నరక శిక్ష తప్పదు.
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ni Abdur Rahim bin Muhammad - Indise ng mga Salin
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an sa wikang Telugu. Salin ni Abdur Rahim bin Muhammad. Inilathala ito ng King Fahd Glorious Quran Printing Complex sa Madinah Munawwarah. Imprenta ng taong 1434 H.
Contents of the translations can be downloaded and re-published, with the following terms and conditions:
1. No modification, addition, or deletion of the content.
2. Clearly referring to the publisher and the source (QuranEnc.com).
3. Mentioning the version number when re-publishing the translation.
4. Keeping the transcript information inside the document.
5. Notifying the source (QuranEnc.com) of any note on the translation.
6. Updating the translation according to the latest version issued from the source (QuranEnc.com).
7. Inappropriate advertisements must not be included when displaying translations of the meanings of the Noble Quran.
Mga Resulta ng Paghahanap:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".