Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Сура: Нажм сураси   Оят:

సూరహ్ అ-నజ్మ్

Суранинг мақсадларидан..:
إثبات صدق الوحي وأنه من عند الله.
దైవవాణి సత్యమని మరియు అది అల్లాహ్ వద్ద నుండి వచ్చినదని నిరూపించడం

وَالنَّجْمِ اِذَا هَوٰی ۟ۙ
పరిశుద్ధుడైన ఆయన నక్షత్రము రాలినప్పుడు ప్రమాణం చేశాడు.
Арабча тафсирлар:
مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوٰی ۟ۚ
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఋజుమార్గము నుండి మరల లేదు మరియు ఆయన అపమార్గమునకు లోను కాలేదు కాని ఆయన హేతుబద్ధమైనవారు.
Арабча тафсирлар:
وَمَا یَنْطِقُ عَنِ الْهَوٰی ۟ؕۚ
మరియు ఆయన ఈ ఖుర్ఆన్ ను తన మనోవాంఛను అనుసరించి పలకలేదు.
Арабча тафсирлар:
اِنْ هُوَ اِلَّا وَحْیٌ یُّوْحٰی ۟ۙ
ఈ ఖుర్ఆన్ అల్లాహ్ జిబ్రయీల్ అలైహిస్సలాం మార్గము నుండి ఆయన వైపునకు అల్లాహ్ అవతరింపజేసిన ఒక దైవవాణి మాత్రమే.
Арабча тафсирлар:
عَلَّمَهٗ شَدِیْدُ الْقُوٰی ۟ۙ
మహా బలవంతుడు ఒక దూత అయిన జిబ్రయీల్ అలైహిస్సలాం దాన్ని ఆయనకు నేర్పించాడు.
Арабча тафсирлар:
ذُوْ مِرَّةٍ ؕ— فَاسْتَوٰی ۟ۙ
మరియు జిబ్రయీల్ అలైహిస్సలాం మంచి రూపము కలవారు. మరియు ఆయన అలైహిస్సలాం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు అల్లాహ్ ఆయనను సృష్టించిన రూపములో (నిజ రూపములో) ప్రత్యక్షమై నిలబడ్డారు.
Арабча тафсирлар:
وَهُوَ بِالْاُفُقِ الْاَعْلٰی ۟ؕ
మరియు జిబ్రయీల్ ఆకాశపు ఎత్తైన అంచులపై ఉన్నారు.
Арабча тафсирлар:
ثُمَّ دَنَا فَتَدَلّٰی ۟ۙ
ఆ తరువాత జిబ్రయీల్ అలైహిస్లాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమునకు దగ్గరయ్యారు. ఆ తరువాత ఆయనకు ఇంకా ఎక్కువ దగ్గరయ్యారు.
Арабча тафсирлар:
فَكَانَ قَابَ قَوْسَیْنِ اَوْ اَدْنٰی ۟ۚ
ఆయనకు ఆయన దగ్గరవ్వటం రెండు విల్లులంత లేదా దానికి ఇంచుమించుగా ఉన్నది.
Арабча тафсирлар:
فَاَوْحٰۤی اِلٰی عَبْدِهٖ مَاۤ اَوْحٰی ۟ؕ
అప్పుడు జిబ్రయీల్ అల్లాహ్ దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంనకు దైవవాణి చేర్చవలసినది చేర్చారు.
Арабча тафсирлар:
مَا كَذَبَ الْفُؤَادُ مَا رَاٰی ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయం ఆయన చూపులు చూసిన దాన్ని అబద్దమనలేదు.
Арабча тафсирлар:
اَفَتُمٰرُوْنَهٗ عَلٰی مَا یَرٰی ۟
ఓ ముష్రికులారా అల్లాహ్ ఆయనను రాత్రివేళ తీసుకుని వెళ్ళి ఆయనకు చూపిన దాని విషయంలో మీరు ఆయనతో వాదులాడుతున్నారా ?!
Арабча тафсирлар:
وَلَقَدْ رَاٰهُ نَزْلَةً اُخْرٰی ۟ۙ
మరియు వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాంను రెండవ సారి ఆయన నిజరూపములో ఆయనకు రాత్రి వేళ తీసుకుని వెళ్ళినప్పుడు చూశారు.
Арабча тафсирлар:
عِنْدَ سِدْرَةِ الْمُنْتَهٰی ۟
సిద్రతుల్ ముంతహా (చివరి హద్దుల్లో ఉన్న రేగు చెట్టు) వద్ద. ఏడవ ఆకాశములో ఉన్న చాలా గొప్ప వృక్షము అది.
Арабча тафсирлар:
عِنْدَهَا جَنَّةُ الْمَاْوٰی ۟ؕ
ఆ వృక్షము వద్దనే జన్నతుల్ మావా (స్వర్గ ధామం) కలదు.
Арабча тафсирлар:
اِذْ یَغْشَی السِّدْرَةَ مَا یَغْشٰی ۟ۙ
అప్పుడు సిద్రహ్ ను అల్లాహ్ ఆదేశముతో ఒక గొప్ప వస్తువు కప్పివేస్తుంది. దాని వాస్తవికత అల్లాహ్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు.
Арабча тафсирлар:
مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغٰی ۟
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చూపులు కుడి యడమలకు వాలనూ లేదు మరియు ఆయనకి నిర్ణయించిన హద్దులను అతిక్రమించలేదు.
Арабча тафсирлар:
لَقَدْ رَاٰی مِنْ اٰیٰتِ رَبِّهِ الْكُبْرٰی ۟
వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనను గగన యాత్ర చేయించబడిన రాత్రి తన ప్రభువు సామర్ధ్యమును సూచించే గొప్ప సూచనలను చూశారు. అప్పుడు ఆయన స్వర్గమును చూశారు మరియు నరకమును ఇతరవాటిని చూశారు.
Арабча тафсирлар:
اَفَرَءَیْتُمُ اللّٰتَ وَالْعُزّٰی ۟ۙ
ఓ ముష్రికులారా మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించే ఈ విగ్రహాలు లాత్ మరియు ఉజ్జాలను గురించి ఆలోచించారా.
Арабча тафсирлар:
وَمَنٰوةَ الثَّالِثَةَ الْاُخْرٰی ۟
మరియు మీ విగ్రహాల్లోంచి మూడవదైన ఇంకొకటి మనాత్ ను గరించి. నాకు చెప్పండి మీరు అవి మీకు ఏదైన ప్రయోజనం గాని నష్టం గాని కలిగించే అధికారం కలవా ?!
Арабча тафсирлар:
اَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْاُ ۟
ఓ ముష్రికులారా మీకు మీరు ఇష్డపడే మగ సంతానమా మరియు పరిశుద్ధుడైన ఆయనకు మీరు ఇష్టపడని ఆడ సంతానమా ?!.
Арабча тафсирлар:
تِلْكَ اِذًا قِسْمَةٌ ضِیْزٰی ۟
మీ ఇచ్ఛానుసారం మీరు పంచిన ఈ పంపకము ఒక అన్యాయమైన పంపకం.
Арабча тафсирлар:
اِنْ هِیَ اِلَّاۤ اَسْمَآءٌ سَمَّیْتُمُوْهَاۤ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ مَّاۤ اَنْزَلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍ ؕ— اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَمَا تَهْوَی الْاَنْفُسُ ۚ— وَلَقَدْ جَآءَهُمْ مِّنْ رَّبِّهِمُ الْهُدٰی ۟ؕ
ఈ విగ్రహాలు కొన్ని అర్దరహిత పేర్లు మాత్రమే. దైవత్వ గుణముల్లో వాటికి ఎటువంటి భాగము లేదు. వాటిని మీరు మీ తాత ముత్తాతలు మీ స్వయంతరపు నుండి పేర్లు పెట్టుకున్నారు. వాటి గురించి అల్లాహ్ ఎటువంటి ఆధారము అవతరింపజేయలేదు. ముష్రికులు తమ మనసులు కోరిన తమ హృదయములలో షైతాను అలంకరించిన విశాసములను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు వద్ద నుండి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైైహి వసల్లం నాలుక ద్వారా వారి వద్దకు సన్మార్గము వచ్చినది. కాని వారు ఆయన ద్వారా మార్గము పొందలేదు.
Арабча тафсирлар:
اَمْ لِلْاِنْسَانِ مَا تَمَنّٰی ۟ؗۖ
లేదా మానవునికి తాను ఆశించిన విగ్రహాల సిఫారసు అల్లాహ్ యందు కలదా ?!
Арабча тафсирлар:
فَلِلّٰهِ الْاٰخِرَةُ وَالْاُوْلٰی ۟۠
లేదు అతను ఆశించినది అతనికి లభించదు. పరలోకము మరియు ఇహలోకము అల్లాహ్ దే. వాటిలో నుండి ఆయన తాను కోరిన దాన్ని ఇస్తాడు మరియు తాను కోరిన దాన్ని ఆపుతాడు.
Арабча тафсирлар:
وَكَمْ مِّنْ مَّلَكٍ فِی السَّمٰوٰتِ لَا تُغْنِیْ شَفَاعَتُهُمْ شَیْـًٔا اِلَّا مِنْ بَعْدِ اَنْ یَّاْذَنَ اللّٰهُ لِمَنْ یَّشَآءُ وَیَرْضٰی ۟
మరియు ఆకాశముల్లో ఎందరో దూతలున్నారు ఒక వేళ వారు ఎవరికోసమైన సిఫారసు చేయదలచితే వారి సిఫారసు ఏమాత్రం పనికిరాదు కాని అల్లాహ్ వారిలో నుంచి ఎవరికి తలచుకుని సిఫారసు చేసే అనుమతించిన తరువాత మరియు దానికి సిఫారసు చేయబడే వాడి నుండి ప్రసన్నుడు అయితే తప్ప. అల్లాహ్ సాటి కల్పించే వారి కొరకు సిఫారసు చేసే అనుమతివ్వడు మరియు అల్లాహ్ ను వదిలి అతను ఆరాధించే ఆతని సిఫరసు చేయబడే వాడి నుండి ఆయన ప్రసన్నుడవడు.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• كمال أدب النبي صلى الله عليه وسلم حيث لم يَزغْ بصره وهو في السماء السابعة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి సల్లం గారి గుణము యొక్క పరిపూర్ణత ఎప్పుడైతే ఆయన ఏడవ ఆకాశంలో ఉన్నా ఆయన దృష్టి తప్పిపోలేదు.

• سفاهة عقل المشركين حيث عبدوا شيئًا لا يضر ولا ينفع، ونسبوا لله ما يكرهون واصطفوا لهم ما يحبون.
ముష్రికుల బుద్ధిలేమి తనం ఎప్పుడైతే వారు నష్టం కలిగించని,లాభం కలిగించని వాటిని ఆరాధించారో మరియు అల్లాహ్ కు తాము ఇష్టపడని వాటిని అంటగట్టారో,తాము ఇష్టపడే వాటిని తమ కొరకు ప్రత్యేకించుకున్నారో.

• الشفاعة لا تقع إلا بشرطين: الإذن للشافع، والرضا عن المشفوع له.
సిఫారసు చేయటం రెండు షరతులతో ఏర్పడుతుంది : 1) సిఫారసు చేసే వాడికి అనుమతి ఉండాలి. 2) సిఫారసు చేయబడే వ్యక్తి నుండి ప్రసన్నత.

اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ لَیُسَمُّوْنَ الْمَلٰٓىِٕكَةَ تَسْمِیَةَ الْاُ ۟
నిశ్చయంగా పరలోక నివాసములో మరల లేపబడటం గురించి విశ్వసించని వారు దైవదూతలను వారు అల్లాహ్ కుమార్తెలు అన్న తమ విశ్వాసముతో స్త్రీల పేర్లను పెట్టుకున్నారు. అల్లాహ్ వారి మాటల నుండి ఎంతో మహోన్నతుడు.
Арабча тафсирлар:
وَمَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ ؕ— اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ ۚ— وَاِنَّ الظَّنَّ لَا یُغْنِیْ مِنَ الْحَقِّ شَیْـًٔا ۟ۚ
మరియు వారికి వారిని స్త్రీలుగా పేర్లు పెట్టుకోటానికి ఎటువంటి ఆధారపూరితమైన జ్ఞానం లేదు. వారు ఈ విషయంలో ఊహగానాలను మరియు భ్రమను మాత్రమే అనుసరిస్తున్నారు. భ్రమ సత్యం విషయంలో దాని స్థానములో నిలబడనంతవరకు ప్రయోజనం కలిగించదు.
Арабча тафсирлар:
فَاَعْرِضْ عَنْ مَّنْ تَوَلّٰی ۙ۬— عَنْ ذِكْرِنَا وَلَمْ یُرِدْ اِلَّا الْحَیٰوةَ الدُّنْیَا ۟ؕ
ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ స్మరణ నుండి వీపు త్రిప్పుకుని,దాని గురించి పట్టించుకోని మరియు ఇహలోక జీవితమునే ఆశించే వ్యక్తి నుండి మీరు ముఖం త్రిప్పుకోండి. అతడు తన పరలోకం కొరకు ఆచరించడు. ఎందుకంటే అతడు దాన్ని విశ్వసించడు.
Арабча тафсирлар:
ذٰلِكَ مَبْلَغُهُمْ مِّنَ الْعِلْمِ ؕ— اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ وَهُوَ اَعْلَمُ بِمَنِ اهْتَدٰی ۟
ఈ ముష్రికులందరు దైవదూతలను స్త్రీల పేర్లు పెట్టి ఏదైతే పలుకుతున్నారో వారు చేరే వారి జ్ఞాన పరిధి. ఎందుకంటే వారు అజ్ఞానులు. వారు వాస్తవమునకు చేరలేదు. ఓ ప్రవక్తా నిశ్చయంగా సత్య మార్గము నుండి మరలిపోయిన వారి గురించి మీ ప్రభువుకే బాగా తెలుసు. మరియు ఆయన మార్గమును పొందే వారి గురించి ఆయనకే బాగా తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
Арабча тафсирлар:
وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ۙ— لِیَجْزِیَ الَّذِیْنَ اَسَآءُوْا بِمَا عَمِلُوْا وَیَجْزِیَ الَّذِیْنَ اَحْسَنُوْا بِالْحُسْنٰی ۟ۚ
ఆకాశముల్లో ఉన్నది మరియు భూమిలో ఉన్నది అధికారక పరంగా, సృష్టి పరంగా మరియు కార్య నిర్వహణ పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. ఇహలోకము దుష్కర్మలు చేసిన వారికి యోగ్యమైన శిక్షను కలిగించటానికి మరియు సత్కర్మలు చేసిన విశ్వాసపరులకు స్వర్గమును ప్రసాదించటానికి.
Арабча тафсирлар:
اَلَّذِیْنَ یَجْتَنِبُوْنَ كَبٰٓىِٕرَ الْاِثْمِ وَالْفَوَاحِشَ اِلَّا اللَّمَمَ ؕ— اِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ؕ— هُوَ اَعْلَمُ بِكُمْ اِذْ اَنْشَاَكُمْ مِّنَ الْاَرْضِ وَاِذْ اَنْتُمْ اَجِنَّةٌ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْ ۚ— فَلَا تُزَكُّوْۤا اَنْفُسَكُمْ ؕ— هُوَ اَعْلَمُ بِمَنِ اتَّقٰی ۟۠
మరియు ఎవరైతే చిన్న పాపములు కాకుండా పెద్ద పాపముల నుండి మరియు అసహ్యకరమైన పాపముల నుండి దూరంగా ఉంటారో ఇవి (చిన్న పాపములు) పెద్ద పాపములను వదిలి వేయటం వలన,విధేయత కార్యములను అధికంగా చేయటం వలన మన్నించబడుతాయి. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు విశాలమైన మన్నింపు కలవాడు. ఆయన తన దాసుల పాపములను వారు వాటి నుండి మన్నింపు వేడుకున్నప్పుడు మన్నిస్తాడు. పరిశుద్ధుడైన ఆయనకు మీ స్థితులను గురించి మరియు మీ వ్యవహారముల గురించి మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించబడినప్పుడు మరియు మీరు మీ మాతృ గర్భముల్లో పిండములుగా ఉండి పుట్టుక తరువాత సృష్టించబడినప్పుడు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వాటి పై మీరు స్వయంగా దైవభీతిపరులని గొప్పగా చెప్పుకోకండి. పరిశుద్ధుడైన ఆయనకు ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడే వారి గురించి బాగా తెలుసు.
Арабча тафсирлар:
اَفَرَءَیْتَ الَّذِیْ تَوَلّٰی ۟ۙ
ఇస్లాం నుండి అది దగ్గరైన తరువాత విముఖత చూపిన వాడి దుర్భర స్థితిని మీరు చూశారా ?.
Арабча тафсирлар:
وَاَعْطٰی قَلِیْلًا وَّاَكْدٰی ۟
మరియు అతడు సంపద నుండి కొద్దిగా ఇచ్చి ఆ తరువాత ఆగిపోయాడు ఎందుకంటే పిసినారితనం అతని తీరు. అయినా కూడా అతడు తన గొప్పలు చెప్పుకునేవాడు.
Арабча тафсирлар:
اَعِنْدَهٗ عِلْمُ الْغَیْبِ فَهُوَ یَرٰی ۟
ఏమీ అతను చూడటానికి మరియు అగోచర విషయాలు మాట్లాడటానికి అతని వద్ద అగోచర జ్ఞానమున్నదా ?!.
Арабча тафсирлар:
اَمْ لَمْ یُنَبَّاْ بِمَا فِیْ صُحُفِ مُوْسٰی ۟ۙ
లేదా అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్నాడా ? లేదా అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్న ఇతడికి అల్లాహ్ మూసాపై అవతరింపజేసిన మొదటి గ్రంధముల్లో ఉన్న వాటి గురించి తెలియపరచబడలేదా ?.
Арабча тафсирлар:
وَاِبْرٰهِیْمَ الَّذِیْ وَ ۟ۙ
మరియు తన ప్రభువు తనకు ఇచ్చిన బాధ్యతలన్నింటిని నెరవేర్చిన ఇబ్రాహీం అలైహిస్సలాం గ్రంధముల్లో.
Арабча тафсирлар:
اَلَّا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ۟ۙ
ఏ మనిషి ఇతరుల పాప బరువును మోయడని.
Арабча тафсирлар:
وَاَنْ لَّیْسَ لِلْاِنْسَانِ اِلَّا مَا سَعٰی ۟ۙ
మరియు మనిషికి తాను చేసుకున్న కర్మల ప్రతిఫలం మాత్రమే ఉంటుందని.
Арабча тафсирлар:
وَاَنَّ سَعْیَهٗ سَوْفَ یُرٰی ۟
మరియు అతడు తొందరలోనే తన కర్మను ప్రళయదినమున కళ్ళారా చూపబడుతుందని.
Арабча тафсирлар:
ثُمَّ یُجْزٰىهُ الْجَزَآءَ الْاَوْفٰی ۟ۙ
ఆ తరువాత అతని కర్మ ప్రతిఫలం ఎటువంటి తగ్గుదల లేకుండా పూర్తిగా అతనికి ఇవ్వబడుతుంది.
Арабча тафсирлар:
وَاَنَّ اِلٰی رَبِّكَ الْمُنْتَهٰی ۟ۙ
ఓ ప్రవక్తా దాసుని మరలే చోటు,వారి గమ్య స్థానము వారి మరణము తరువాత నీ ప్రభువు వైపే ఉంటుందని.
Арабча тафсирлар:
وَاَنَّهٗ هُوَ اَضْحَكَ وَاَبْكٰی ۟ۙ
మరియు ఆయనే తాను నవ్వింపదలచిన వారికి నవ్వించే వాడని మరియు తాను బాధ కలిగించదలచిన వాడిని ఏడ్పిస్తాడని.
Арабча тафсирлар:
وَاَنَّهٗ هُوَ اَمَاتَ وَاَحْیَا ۟ۙ
మరియు ఆయన ఇహలోకంలో జీవించి ఉన్న వారికి మరణమును కలిగిస్తాడని మరియు మృతులను మరణాంతరం లేపి జీవింపజేస్తాడని.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• انقسام الذنوب إلى كبائر وصغائر.
మహాపరాదాలు పెద్దవి మరియు చిన్నవి గా విభజించబడటం.

• خطورة التقوُّل على الله بغير علم.
ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లాహ్ పై అబద్దమును కల్పించటం యొక్క ప్రమాదం.

• النهي عن تزكية النفس.
తనను తాను గొప్పలు చెప్పుకోవటం నిషేధించబడినది.

وَاَنَّهٗ خَلَقَ الزَّوْجَیْنِ الذَّكَرَ وَالْاُ ۟ۙ
మరియు ఆయన ఆడ,మగ రెండు జంటలను సృష్టించాడని,
Арабча тафсирлар:
مِنْ نُّطْفَةٍ اِذَا تُمْنٰی ۪۟
విర్య బిందువు నుండి అది మాతృ గర్భంలో ఉంచబడినప్పుడు.
Арабча тафсирлар:
وَاَنَّ عَلَیْهِ النَّشْاَةَ الْاُخْرٰی ۟ۙ
మరియు వారి మరణం తరువాత మరణాంతరం లేపటం కొరకు వారిద్దరి సృష్టిని మరలింపజేయటం ఆయనపై ఉన్నదని.
Арабча тафсирлар:
وَاَنَّهٗ هُوَ اَغْنٰی وَاَقْنٰی ۟ۙ
మరియు నిశ్చయంగా ఆయనే తన దాసుల్లోంచి తాను తలచిన వారికి సంపదలో అధికారమును ప్రసాదించి సంపన్నులుగా చేసేవాడు మరియు ప్రజల్లోంచి సంపద పట్ల తృప్తి చెందే విధంగా సంపదను ప్రసాదించేవాడని.
Арабча тафсирлар:
وَاَنَّهٗ هُوَ رَبُّ الشِّعْرٰی ۟ۙ
మరియు ఆయనే ముష్రికుల్లోంచి కొందరు అల్లాహ్ తో పాటు ఆరాధించే షిఅ్'రా నక్షత్రమునకు ప్రభువు అని.
Арабча тафсирлар:
وَاَنَّهٗۤ اَهْلَكَ عَادَا ١لْاُوْلٰی ۟ۙ
మరియు ఆయనే హూద్ జాతి వారైన తొలి ఆద్ ను వారు తమ అవిశ్వాసంపై మొండిగా వ్యవహరించినప్పుడు నాశనం చేశాడని.
Арабча тафсирлар:
وَثَمُوْدَاۡ فَمَاۤ اَبْقٰی ۟ۙ
మరియు ఆయన సాలిహ్ జాతి సమూద్ ను వారిలో నుండి ఏ ఒక్కరిని మిగల్చకుండా తుదిముట్టించాడని.
Арабча тафсирлар:
وَقَوْمَ نُوْحٍ مِّنْ قَبْلُ ؕ— اِنَّهُمْ كَانُوْا هُمْ اَظْلَمَ وَاَطْغٰی ۟ؕ
మరియు ఆయన ఆద్,సమూద్ కన్న ముందు నూహ్ జాతివారిని నాశనం చేశాడు. నిశ్చయంగా నూహ్ జాతి వారు ఆద్ మరియు సమూద్ కన్న పరమ దుర్మార్గులుగా మరియు అధికంగా మితిమీరేవారిగా ఉండే వారు. ఎందుకంటే నూహ్ వారి మధ్య తొమ్మిదొందల యాభై సంవత్సరాలు అల్లాహ్ ఏకత్వము వైపునకు పిలుస్తూ ఉన్నారు. కాని వారు ఆయన మాటను స్వీకరించలేదు.
Арабча тафсирлар:
وَالْمُؤْتَفِكَةَ اَهْوٰی ۟ۙ
మరియు లూత్ జాతి వారి బస్తీలను ఆకాశము వైపునకు ఎత్తి ఆ తరువాత వాటిని తిరిగేశాడు. ఆ తరువాత వాటిని భూమి వైపునకు పడవేశాడు.
Арабча тафсирлар:
فَغَشّٰىهَا مَا غَشّٰی ۟ۚ
ఆ తరువాత వాటిని ఆకాశము వైపునకు ఎత్తి భూమిపై పడవేసిన తరువాత వాటిపై క్రప్పవలసిన రాళ్ళతో క్రప్పివేశాడు.
Арабча тафсирлар:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكَ تَتَمَارٰی ۟
ఓ మానవుడా అయితే నీవు నీ ప్రభువు సామర్ధ్యముపై సూచించే ఏ ఏ సూచనలను వాటి ద్వారా హితోపదేశం స్వీకరించకుండా వాదులాడుతావు ?.
Арабча тафсирлар:
هٰذَا نَذِیْرٌ مِّنَ النُّذُرِ الْاُوْلٰی ۟
మీ వైపునకు పంపించబడ్డ ఈ ప్రవక్త తొలి ప్రవక్తల కోవకు చెందినవాడే.
Арабча тафсирлар:
اَزِفَتِ الْاٰزِفَةُ ۟ۚ
దగ్గరయ్యే ప్రళయం దగ్గరైనది.
Арабча тафсирлар:
لَیْسَ لَهَا مِنْ دُوْنِ اللّٰهِ كَاشِفَةٌ ۟ؕ
దాన్ని తొలగించే వాడు మరియు దాని గురించి తెలుసుకునేవాడు అల్లాహ్ మాత్రమే.
Арабча тафсирлар:
اَفَمِنْ هٰذَا الْحَدِیْثِ تَعْجَبُوْنَ ۟ۙ
ఏమీ మీకు చదివి వినిపించబడే ఈ ఖుర్ఆన్ గురించి అది అల్లాహ్ వద్ద నుండి అవటం విషయంలో మీరు ఆశ్ఛర్యపోతున్నారా ?!
Арабча тафсирлар:
وَتَضْحَكُوْنَ وَلَا تَبْكُوْنَ ۟ۙ
మరియు దానిపై పరిహాసంగా మీరు నవ్వుతున్నారు మరియు మీరు దాని హితోపదేశాలను విన్నప్పుడు ఏడవటంలేదు ?!
Арабча тафсирлар:
وَاَنْتُمْ سٰمِدُوْنَ ۟
మరియు మీరు దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. దాన్ని పట్టించుకోవటంలేదు.
Арабча тафсирлар:
فَاسْجُدُوْا لِلّٰهِ وَاعْبُدُوْا ۟
అయితే మీరు ఒక్కడైన అల్లాహ్ కు సాష్టాంగపడండి మరియు ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించండి.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• عدم التأثر بالقرآن نذير شؤم.
ఖుర్ఆన్ ద్వారా ప్రభావితం కాకపోవటం చెడు శకునము.

• خطر اتباع الهوى على النفس في الدنيا والآخرة.
మనో వాంఛలను అనుసరించటం యొక్క ప్రమాదం మనిషికి ఇహపరాల్లో.

• عدم الاتعاظ بهلاك الأمم صفة من صفات الكفار.
సమాజాల వినాశనము ద్వారా హితబోధన గ్రహించక పోవటం అవిశ్వాసపరుల గుణముల్లోంచిది.

 
Маънолар таржимаси Сура: Нажм сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш