Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Сура: Қамар сураси   Оят:

సూరహ్ అల్ ఖమర్

Суранинг мақсадларидан..:
التذكير بنعمة تيسير القرآن، وما فيه من الآيات والنذر.
ఖుర్ఆన్ ను శులభతరం చేసే అనుగ్రహమును మరియు అందులో ఉన్న ఆయతులను,హెచ్చరికలను గుర్తుచేసుకోవడం

اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ ۟
ప్రళయం రావటం ఆసన్నమైనది మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో చంద్రుడు చీలిపోయాడు. దాని చీలటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇంద్రియ సూచనల్లోంచిది.
Арабча тафсирлар:
وَاِنْ یَّرَوْا اٰیَةً یُّعْرِضُوْا وَیَقُوْلُوْا سِحْرٌ مُّسْتَمِرٌّ ۟
మరియు ఒక వేళ ముష్రికులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీని సూచించే ఏదైన ఆధారమును,ఋజువును చూస్తే దాన్ని స్వీకరించటం నుండి ముఖం త్రిప్పుకునేవారు. మరియు మేము చూసిన వాదనలు,ఆధారాలు అసత్య మంత్రజాలము అనేవారు.
Арабча тафсирлар:
وَكَذَّبُوْا وَاتَّبَعُوْۤا اَهْوَآءَهُمْ وَكُلُّ اَمْرٍ مُّسْتَقِرٌّ ۟
మరియు ఆయన వారి వద్దకు తీసుకుని వచ్చిన సత్యమును వారు తిరస్కరించారు మరియు తిరస్కరించటంలో వారు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతీ విషయం మంచి అయినా లేదా చెడు అయిన ప్రళయదినమున జరిగి తీరుతుంది.
Арабча тафсирлар:
وَلَقَدْ جَآءَهُمْ مِّنَ الْاَنْۢبَآءِ مَا فِیْهِ مُزْدَجَرٌ ۟ۙ
మరియు నిశ్చయంగా వారి వద్దకు అల్లాహ్ తమ అవిశ్వాసం వలన,తమ దుర్మార్గం వలన వినాశనమునకు గురి చేసిన సమాజముల వార్తలు వచ్చినవి. ఏవైతే వారిని వారి అవిశ్వాసము నుండి,వారి దుర్మార్గము నుండి నిరోధించటానికి తగినవో.
Арабча тафсирлар:
حِكْمَةٌ بَالِغَةٌ فَمَا تُغْنِ النُّذُرُ ۟ۙ
వారి వద్దకు వచ్చినది వారికి వ్యతిరేకంగా వాదనను స్థాపించటానికి సంపూర్ణ వివేకము కలిగి ఉన్నది. అయితే అల్లాహ్ పై,పరలోక దినముపై విశ్వాసమును కనబరచని జాతి వారికి హెచ్చరికలు ప్రయోజనం కలిగించలేదు.
Арабча тафсирлар:
فَتَوَلَّ عَنْهُمْ ۘ— یَوْمَ یَدْعُ الدَّاعِ اِلٰی شَیْءٍ نُّكُرٍ ۟ۙ
ఓ ప్రవక్తా వారు సన్మార్గంపై రాకపోతే వారిని వదిలివేయండి మరియు సృష్టితాలు ఇంతకు ముందు గుర్తించనటువంటి భయంకరమైన విషయం వైపునకు బాకాలో ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత పిలిచే దినమును నిరీక్షిస్తూ మీరు వారితో విముఖత చూపండి.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• عدم التأثر بالقرآن نذير شؤم.
ఖుర్ఆన్ ద్వారా ప్రభావితం కాకపోవటం చెడు శకునము.

• خطر اتباع الهوى على النفس في الدنيا والآخرة.
మనో వాంఛలను అనుసరించటం యొక్క ప్రమాదం మనిషికి ఇహపరాల్లో.

• عدم الاتعاظ بهلاك الأمم صفة من صفات الكفار.
సమాజాల వినాశనము ద్వారా హితబోధన గ్రహించక పోవటం అవిశ్వాసపరుల గుణముల్లోంచిది.

خُشَّعًا اَبْصَارُهُمْ یَخْرُجُوْنَ مِنَ الْاَجْدَاثِ كَاَنَّهُمْ جَرَادٌ مُّنْتَشِرٌ ۟ۙ
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి. వారు సమాదుల నుండి బయటకి వస్తారు ఎలాగంటే వారు లెక్క తీసుకోబడే ప్రదేశము వైపునకు వారి తమ పరిగెత్తటంలో చెల్లా చెదురైన మిడతల వలె ఉంటారు.
Арабча тафсирлар:
مُّهْطِعِیْنَ اِلَی الدَّاعِ ؕ— یَقُوْلُ الْكٰفِرُوْنَ هٰذَا یَوْمٌ عَسِرٌ ۟
ఆ ప్రదేశము వైపునకు పిలిచే వాడి వైపునకు వేగముగా. అవిశ్వాసపరులు ఇలా పలుకుతారు : ఈ దినము అందులో ఉన్న తీవ్రత మరియు భయాందోళనల వలన కఠినమైన దినము.
Арабча тафсирлар:
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ فَكَذَّبُوْا عَبْدَنَا وَقَالُوْا مَجْنُوْنٌ وَّازْدُجِرَ ۟
ఓ ప్రవక్తా మీ పిలుపును తిరస్కరించిన వీరందరికన్న ముందు నూహ్ జాతి తిరస్కరించినది. అప్పుడు వారు మా దాసుడగు నూహ్ అలైహిస్సలాంను మేము వారి వద్దకు పంపించినప్పుడు తిరస్కరించారు. మరియు అతని గురించి అతడు పిచ్చివాడు అని పలికారు. మరియు వారు అతన్ని ఎప్పుడైతే అతను వారిని పిలవటమును వదల్లేదో రకరకాల దూషణలు,అవమానములు,బెదిరింపుల ద్వారా అతన్ని మందలించారు.
Арабча тафсирлар:
فَدَعَا رَبَّهٗۤ اَنِّیْ مَغْلُوْبٌ فَانْتَصِرْ ۟
అప్పడు నూహ్ తన ప్రభువుతో ఇలా పలుకుతూ వేడుకున్నారు : నిశ్చయంగా నా జాతి నాపై ఆధిక్యతను ప్రదర్శించింది. మరియు నా పిలుపును స్వీకరించ లేదు. కాబట్టి నీవు వారిపై ఏదైన శిక్షను దింపి వారిపై విజయమును కలిగించు.
Арабча тафсирлар:
فَفَتَحْنَاۤ اَبْوَابَ السَّمَآءِ بِمَآءٍ مُّنْهَمِرٍ ۟ؗۖ
కావున మేము నిరంతరం ప్రవహించే నీటితో ఆకాశ ద్వారములను తెరిచాము.
Арабча тафсирлар:
وَّفَجَّرْنَا الْاَرْضَ عُیُوْنًا فَالْتَقَی الْمَآءُ عَلٰۤی اَمْرٍ قَدْ قُدِرَ ۟ۚ
మరియు మేము భూమిని చీల్చివేశాము అప్పుడు అది ఊటలుగా మారి వాటి నుండి నీరు పొంగిపొరలింది. అప్పుడు ఆకాశము నుండి కురిసే నీరు భూమి నుండి పొంగిపొరలే నీటితో అల్లాహ్ నిత్యములో నిర్దేశించిన ఆదేశం ప్రకారం కలసిపోయినది. అల్లాహ్ రక్షించిన వారు తప్ప అందరిని ముంచివేసినది.
Арабча тафсирлар:
وَحَمَلْنٰهُ عَلٰی ذَاتِ اَلْوَاحٍ وَّدُسُرٍ ۟ۙ
మరియు మేము నూహ్ అలైహిస్సలాంను పలకలు,మేకులు కల ఒక ఓడ పై ఎక్కించాము. అప్పుడు మేము ఆయనను,ఆయనతో పాటు ఉన్న వారిని మునగటం నుండి రక్షించాము.
Арабча тафсирлар:
تَجْرِیْ بِاَعْیُنِنَا جَزَآءً لِّمَنْ كَانَ كُفِرَ ۟
ఈ ఓడ మా కళ్ళ ముందట,మా రక్షణలో తాకుతున్న నీటి అలల్లో నడవసాగింది. తను తిరస్కరించిన మరియు అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు తీసుకుని వచ్చిన వాటిని అవిశ్వసించిన తన జాతి కలిగిన నూహ్ కి సహాయముగా.
Арабча тафсирлар:
وَلَقَدْ تَّرَكْنٰهَاۤ اٰیَةً فَهَلْ مِنْ مُّدَّكِرٍ ۟
మరియు నిశ్చయంగా మేము వారిని శిక్షించిన ఈ శిక్షను ఒక గుణపాఠముగా,హితోపదేశముగా వదిలిపెట్టాము. ఏమీ దీని ద్వారా ఎవరైన గుణపాఠం నేర్చుకునేవారు ఉన్నారా ?!
Арабча тафсирлар:
فَكَیْفَ كَانَ عَذَابِیْ وَنُذُرِ ۟
తిరస్కరించే వారి కొరకు నా శిక్ష ఎలా ఉన్నదో చెప్పండి ?! మరియు వారికి నా వినాశనం చేయటం గురించి నా హెచ్చరిక ఎలా ఉన్నదో చెప్పండి ?!
Арабча тафсирлар:
وَلَقَدْ یَسَّرْنَا الْقُرْاٰنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُّدَّكِرٍ ۟
మరియు నిశ్చయంగా హితబోధన మరియు హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేశాము. అయితే అందులో ఉన్న గుణపాఠము మరియు హితబోధనల ద్వారా గుణపాఠం నేర్చుకునేవాడు ఎవడైన ఉన్నాడా ?!
Арабча тафсирлар:
كَذَّبَتْ عَادٌ فَكَیْفَ كَانَ عَذَابِیْ وَنُذُرِ ۟
ఆద్ జాతివారు తమ ప్రవక్త అయిన హూద్ అలైహిస్సలాంను తిరస్కరించారు. ఓ మక్కా వాసులారా వారికి నా శిక్ష ఎలా ఉన్నదో మరియు వారి శిక్షంచటం ద్వారా ఇతరులకు నా హెచ్చరిక ఎలా ఉన్నదో యోచన చేయండి.
Арабча тафсирлар:
اِنَّاۤ اَرْسَلْنَا عَلَیْهِمْ رِیْحًا صَرْصَرًا فِیْ یَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ ۟ۙ
నిశ్ఛయంగా మేము వారిపై ఒక చెడ్డ,దురదృష్టకరమైన రోజున తీవ్రమైన చల్లని గాలిని పంపాము అది వారు నరకానికి వచ్చేవరకు వారితో కొనసాగుతుంది.
Арабча тафсирлар:
تَنْزِعُ النَّاسَ ۙ— كَاَنَّهُمْ اَعْجَازُ نَخْلٍ مُّنْقَعِرٍ ۟
అది ప్రజలను భూమి నుండి కూకటి వ్రేళ్ళతో పెకిలించి వారిని వారి తలలపై విసిరివేసింది ఎలాగంటే నాటిన చోట నుండి పెకలించబడిన ఖర్జూరపు బోదెలవలె.
Арабча тафсирлар:
فَكَیْفَ كَانَ عَذَابِیْ وَنُذُرِ ۟
ఓ మక్కా వాసులారా వారికి నా శిక్ష ఎలా ఉన్నదో మరియు వారి శిక్షంచటం ద్వారా ఇతరులకు నా హెచ్చరిక ఎలా ఉన్నదో యోచన చేయండి.
Арабча тафсирлар:
وَلَقَدْ یَسَّرْنَا الْقُرْاٰنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُّدَّكِرٍ ۟۠
మరియు నిశ్ఛయంగా హితబోధన మరియు హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేశాము. అయితే అందులో ఉన్న గుణపాఠము మరియు హితబోధనల ద్వారా గుణపాఠం నేర్చుకునేవాడు ఎవడైన ఉన్నాడా ?!
Арабча тафсирлар:
كَذَّبَتْ ثَمُوْدُ بِالنُّذُرِ ۟
సమూద్ జాతి వారు వారి ప్రవక్త అయిన సాలిహ్ అలైహిస్సలాం గారు వారిని హెచ్చరించిన దాన్ని తిరస్కరించారు.
Арабча тафсирлар:
فَقَالُوْۤا اَبَشَرًا مِّنَّا وَاحِدًا نَّتَّبِعُهٗۤ ۙ— اِنَّاۤ اِذًا لَّفِیْ ضَلٰلٍ وَّسُعُرٍ ۟
అప్పుడు వారు తిరస్కరిస్తూ ఇలా పలికారు : ఏమీ మేము మాలో నుండి ఒకడైన ఒక మనిషిని అనుసరించాలా ?! నిశ్ఛయంగా మేము ఒక వేళ ఈ స్థితిలో అతన్ని అనుసరిస్తే సరైన మార్గము నుండి దూరములో మరియు దాని నుండి మరలి పోవటంలో మరియు ఇబ్బందుల్లో ఉంటాము.
Арабча тафсирлар:
ءَاُلْقِیَ الذِّكْرُ عَلَیْهِ مِنْ بَیْنِنَا بَلْ هُوَ كَذَّابٌ اَشِرٌ ۟
ఏమీ అతని ఒక్కడిపైనే దైవ వాణి అవతరింపబడినదా మరియు మేమందరం కాకుండా అది అతనికే ప్రత్యేకించబడినదా ?! అలా కాదు అతను ఒక అబద్దాలకోరైన అహంకారి.
Арабча тафсирлар:
سَیَعْلَمُوْنَ غَدًا مَّنِ الْكَذَّابُ الْاَشِرُ ۟
ప్రళయదినమున వారు తొందరలోనే తెలుసుకుంటారు ఎవరు అబద్దాలకోరు అయిన అహంకారో సాలిహ్ నా లేదా వారా ?.
Арабча тафсирлар:
اِنَّا مُرْسِلُوا النَّاقَةِ فِتْنَةً لَّهُمْ فَارْتَقِبْهُمْ وَاصْطَبِرْ ۟ؗ
నిశ్ఛయంగా మేము ఆడ ఒంటెను శిల నుండి బయటకు తీసి దాన్ని వారికి పరీక్షగా పంపిస్తాము. ఓ సాలిహ్ వారు దాని పట్ల ఎలా వ్యవహరిస్తారో మరియు వారి పట్ల ఏమి వ్యవహరించబడుతుందో మీరు వేచి చూడండి. మరియు మీరు వారి బాధించటంపై సహనం చూపండి.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• مشروعية الدعاء على الكافر المصرّ على كفره.
తన అవిశ్వాసముపై మొండిగా వ్యవహరించే అవిశ్వాసిని శపించటం యొక్క ధర్మబద్దత.

• إهلاك المكذبين وإنجاء المؤمنين سُنَّة إلهية.
తిరస్కారులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము.

• تيسير القرآن للحفظ وللتذكر والاتعاظ.
కంఠస్థం కొరకు,హితబోధన కొరకు,హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేయటం.

وَنَبِّئْهُمْ اَنَّ الْمَآءَ قِسْمَةٌ بَیْنَهُمْ ۚ— كُلُّ شِرْبٍ مُّحْتَضَرٌ ۟
మరియు వారి బావి నీరు వారికి మరియు ఒంటె మధ్య పంచబడినదని వారికి తెలియపరచండి. ఒక రోజు దానికి మరియు ఒక రోజు వారికి. వంతుకల ప్రతీ ఒక్కరు తనకోసం ప్రత్యేకించబడిన తన దినములో దాని వద్దకు రావాలి.
Арабча тафсирлар:
فَنَادَوْا صَاحِبَهُمْ فَتَعَاطٰی فَعَقَرَ ۟
అప్పుడు వారు ఒంటెను హతమార్చటానికి తమ సహచరుడికి పిలుపునిచ్చారు. అప్పుడు అతడు ఖడ్గమును తీసుకుని దాన్ని హతమార్చాడు. తాన జాతి వారి ఆదేశమును పాటిస్తూ.
Арабча тафсирлар:
فَكَیْفَ كَانَ عَذَابِیْ وَنُذُرِ ۟
ఓ మక్కా వాసులారా వారికి నా శిక్ష ఎలా ఉన్నదో మరియు వారి శిక్షంచటం ద్వారా ఇతరులకు నా హెచ్చరిక ఎలా ఉన్నదో యోచన చేయండి.
Арабча тафсирлар:
اِنَّاۤ اَرْسَلْنَا عَلَیْهِمْ صَیْحَةً وَّاحِدَةً فَكَانُوْا كَهَشِیْمِ الْمُحْتَظِرِ ۟
నిశ్ఛయంగా మేము వారిపై ఒక భయంకరమైన శబ్ధమును పంపాము అది వారిని హతమార్చింది. అప్పుడు వారు సంరక్షకుడు తన గొర్రెలకు గాదెగా చేసుకునే ఎండిపోయిన చెట్ల వలే అయిపోయారు.
Арабча тафсирлар:
وَلَقَدْ یَسَّرْنَا الْقُرْاٰنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُّدَّكِرٍ ۟
మరియు నిశ్ఛయంగా హితబోధన మరియు హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేశాము. అయితే అందులో ఉన్న గుణపాఠము మరియు హితబోధనల ద్వారా గుణపాఠం నేర్చుకునేవాడు ఎవడైన ఉన్నాడా ?!
Арабча тафсирлар:
كَذَّبَتْ قَوْمُ لُوْطٍۭ بِالنُّذُرِ ۟
లూత్ జాతి వారు వారి ప్రవక్త అయిన లూత్ అలైహిస్సలాం గారు వారిని హెచ్చరించిన దాన్ని తిరస్కరించారు.
Арабча тафсирлар:
اِنَّاۤ اَرْسَلْنَا عَلَیْهِمْ حَاصِبًا اِلَّاۤ اٰلَ لُوْطٍ ؕ— نَجَّیْنٰهُمْ بِسَحَرٍ ۟ۙ
నిశ్ఛయంగా మేము వారిపై రాళ్ళను విసిరే పెను గాలిని పంపాము.కాని లూత్ ఇంటి వారిపై కాదు. వారికి శిక్ష కలగలేదు. వాస్తవానికి మేము వారిని దాని నుండి రక్షించాము. అప్పుడే ఆయన శిక్ష వాటిల్లక ముందే రాత్రి చివరి వేళలో వారిని తీసుకుని బయలుదేరారు.
Арабча тафсирлар:
نِّعْمَةً مِّنْ عِنْدِنَا ؕ— كَذٰلِكَ نَجْزِیْ مَنْ شَكَرَ ۟
మా తరపు నుండి వారిపై ఉపకారముగా మేము వారిని శిక్ష నుండి రక్షించాము. లూత్ అలైహిస్సలాంనకు మేము ప్రసాదించిన ఈ ప్రతిఫలం వంటిదే అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత తెలుపుకునేవారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
Арабча тафсирлар:
وَلَقَدْ اَنْذَرَهُمْ بَطْشَتَنَا فَتَمَارَوْا بِالنُّذُرِ ۟
మరియు వాస్తవానికి లూత్ వారిని మా శిక్ష నుండి భయపెట్టాడు. కాని వారు అతని హెచ్చరికల గురించి వాదులాడి అతన్ని తిరస్కరించారు.
Арабча тафсирлар:
وَلَقَدْ رَاوَدُوْهُ عَنْ ضَیْفِهٖ فَطَمَسْنَاۤ اَعْیُنَهُمْ فَذُوْقُوْا عَذَابِیْ وَنُذُرِ ۟
మరియు వాస్తవానికి లూత్ అలైహిస్సలాంను ఆయన జాతివారు వారికి మరియు ఆయన అతిధులైన దైవదూతలకు మధ్య రావద్దని అశ్లీల కార్యమును ఆశిస్తూ దువ్వ సాగారు. అప్పుడు మేము వారి కళ్ళను తుడిచి వేశాము. అప్పుడు అవి వారిని చూడలేకపోయాయి. మరియు మేము వారితో ఇలా పలికాము : మీరు నాశిక్షను మరియు మీకు నేను చేసిన హెచ్చరిక ఫలితమును చవిచూడండి.
Арабча тафсирлар:
وَلَقَدْ صَبَّحَهُمْ بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ ۟ۚ
మరియు నిశ్ఛయంగా ఉదయం వేళ వారి వద్దకు శిక్ష వచ్చినది. అది వారు పరలోకమునకు చేరి దాని శిక్ష వారి వద్దకు వచ్చేవరకు వారితో కొనసాగింది.
Арабча тафсирлар:
فَذُوْقُوْا عَذَابِیْ وَنُذُرِ ۟
మరియు వారితో ఇలా పలకబడింది : నేను మీపై కురిపించిన శిక్షను మరియు లూత్ అలైహిస్సలాం మీకు హెచ్చరించిన దాని ప్రతిఫలమును మీరు చవిచూడండి.
Арабча тафсирлар:
وَلَقَدْ یَسَّرْنَا الْقُرْاٰنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُّدَّكِرٍ ۟۠
మరియు నిశ్చయంగా హితబోధన మరియు హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేశాము. అయితే అందులో ఉన్న గుణపాఠము మరియు హితబోధనల ద్వారా గుణపాఠం నేర్చుకునేవాడు ఎవడైన ఉన్నాడా ?!
Арабча тафсирлар:
وَلَقَدْ جَآءَ اٰلَ فِرْعَوْنَ النُّذُرُ ۟ۚ
మరియు నిశ్చయంగా ఫిర్ఔన్ వంశీయుల వద్దకు మూసా మరియు హారూన్ అలైహిమస్సలాం నోట మా హెచ్చరిక వచ్చినది.
Арабча тафсирлар:
كَذَّبُوْا بِاٰیٰتِنَا كُلِّهَا فَاَخَذْنٰهُمْ اَخْذَ عَزِیْزٍ مُّقْتَدِرٍ ۟
మా వద్ద నుండి వారి వద్దకు వచ్చిన ఆధారాలను మరియు ఋజువులను తిరస్కరించారు. అప్పుడు వాటిని తిరస్కరించటం పై ఎవరు ఓడించలేని సర్వ శక్తిమంతుడు మరియు దేని నుండి అశక్తుడు కాని సర్వాధికారి శిక్షించిన విధంగా మేము వారిని శిక్షించాము.
Арабча тафсирлар:
اَكُفَّارُكُمْ خَیْرٌ مِّنْ اُولٰٓىِٕكُمْ اَمْ لَكُمْ بَرَآءَةٌ فِی الزُّبُرِ ۟ۚ
ఓ మక్కా వాసులారా ఏమీ మీలోని అవిశ్వాసపరులు ఈ ప్రస్తా వించబడిన అవిశ్వాసపరులందరైన నూహ్ జాతి,ఆద్ జాతి,సమూద్ జాతి,లూత్ జాతి మరియు ఫిర్ఔన్ మరియు అతని జతివారి కన్న ఉత్తములా ?! లేదా అల్లాహ్ శిక్ష నుండి దివ్య గ్రంధములు తీసుకుని వచ్చిన మినహాయింపు ఏదైన మీకు ఉన్నదా ?!
Арабча тафсирлар:
اَمْ یَقُوْلُوْنَ نَحْنُ جَمِیْعٌ مُّنْتَصِرٌ ۟
లేక మక్కా వాసుల్లోంచి ఈ అవిశ్వాసపరులందరు "మాకు చెడు చేయదలచిన మరియు మనందరిని విభజించదలచిన వారిపై మేమందరము గెలుపొందే వారము" అని అంటున్నారా ?!
Арабча тафсирлар:
سَیُهْزَمُ الْجَمْعُ وَیُوَلُّوْنَ الدُّبُرَ ۟
తొందరలోనే ఈ అవిశ్వాసపరులందరి వర్గము పరాజయము చెంది వారు విశ్వాసపరుల ముందు నుండి వీపు త్రిప్పి పారిపోతారు. వాస్తవానికి బదర్ దినమున ఇది సంభవించినది.
Арабча тафсирлар:
بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ اَدْهٰی وَاَمَرُّ ۟
అంతే కాదు వారు తిరస్కరించే ప్రళయమే అందులో వారు శిక్షింపబడే వారి వాగ్దాన సమయము. మరియు ప్రళయము వారు బదర్ దినమున వారు పొందే ఇహలోక శిక్ష కన్న ఎంతో పెద్దది మరియు కఠినమైనది.
Арабча тафсирлар:
اِنَّ الْمُجْرِمِیْنَ فِیْ ضَلٰلٍ وَّسُعُرٍ ۟ۘ
నిశ్ఛయంగా అవిశ్వాసమునకు,పాపకార్యములకు పాల్పడి అపరాధము చేసిన వారు సత్యము నుండి తప్పిపోవటంలో మరియు శిక్షలో మరియు ఇబ్బందిలో ఉంటారు.
Арабча тафсирлар:
یَوْمَ یُسْحَبُوْنَ فِی النَّارِ عَلٰی وُجُوْهِهِمْ ؕ— ذُوْقُوْا مَسَّ سَقَرَ ۟
ఆ రోజు వారు తమ ముఖాల మీద నరకాగ్ని లోకి ఈడ్చబడతారు; వారిని మందలిస్తూ ఇలా పలకబడుతుంది : మీరు నరకాగ్ని శిక్ష రుచి చూడండి.
Арабча тафсирлар:
اِنَّا كُلَّ شَیْءٍ خَلَقْنٰهُ بِقَدَرٍ ۟
నిశ్చయంగా మేము విశ్వంలో ఉన్న ప్రతీ దాన్ని మా ముందస్తు అంచనా ప్రకారం సృష్టించాము. అది మా జ్ఞానమునకు మరియు మా ఇచ్చకు మరియు మేము లౌహె మహ్ఫూజ్ లో రాసిన దానికి అనుగుణంగా అయినది.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• شمول العذاب للمباشر للجريمة والمُتَمالئ معه عليها.
అపరాధమునకు పాల్పడే వాడికి అతనితో పాటు దానిని చేయటానికి పురిగొల్పే వాడికి శిక్షను చేర్చడం.

• شُكْر الله على نعمه سبب السلامة من العذاب.
అల్లాహ్ కు ఆయన అనుగ్రహములపై కృతజ్ఞతలు తెలుపుకోవటం శిక్ష నుండి రక్షణకు కారణమగును.

• إخبار القرآن بهزيمة المشركين يوم بدر قبل وقوعها من الإخبار بالغيب الدال على صدق القرآن.
ముష్రికులు బదర్ దినమున పరాభవమును పొందటం అది సంభవించక ముందే ఖుర్ఆన్ తెలియపరచటం ఖుర్ఆన్ నిజాయితీపై సూచించే అగోచర విషయముల గురించి సమాచారమివ్వటంలోంచిది.

• وجوب الإيمان بالقدر.
తఖ్ధీర్ పై విశ్వాసమును కనబరచటం తప్పనిసరి.

وَمَاۤ اَمْرُنَاۤ اِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ ۟
మేము ఏదైన తలచుకుంటే ఈ ఒక మాట పలకటం మాత్రమే మా ఆదేశము : కున్ (నీవు అయిపో) అంతే మేము తలచుకున్నది కను రెప్ప వాల్చే విధంగా త్వరగా అయిపోతుంది.
Арабча тафсирлар:
وَلَقَدْ اَهْلَكْنَاۤ اَشْیَاعَكُمْ فَهَلْ مِنْ مُّدَّكِرٍ ۟
మరియు నిశ్చయంగా మేము పూర్వ సమాజముల్లోంచి అవిశ్వాసములో మీ లాంటి వారిని నాశనం చేశాము. ఏమీ దీని ద్వారా గుణపాఠం నేర్చుకుని తన అవిశ్వాసమును విడనాడే గుణపాఠం నేర్చుకునేవాడు ఎవడైన ఉన్నాడా ?!
Арабча тафсирлар:
وَكُلُّ شَیْءٍ فَعَلُوْهُ فِی الزُّبُرِ ۟
దాసులు చేసిన ప్రతీది పరిరక్షింపబడిన పుస్తకములలో వ్రాయబడి ఉంది. అందులో నుంచి ఏదీ వారి నుండి తప్పిపోదు.
Арабча тафсирлар:
وَكُلُّ صَغِیْرٍ وَّكَبِیْرٍ مُّسْتَطَرٌ ۟
కర్మల్లోంచి మరియు మాటల్లోంచి ప్రతీ చిన్నది మరియు వాటిలో నుండి పెద్దది కర్మల పుస్తకముల్లో మరియు లౌహె మహ్ఫూజ్ లో వ్రాయబడి ఉంది. మరియు వారు తొందరలోనే దాని పరంగా ప్రతిఫలం ప్రసాదించబడుతారు.
Арабча тафсирлар:
اِنَّ الْمُتَّقِیْنَ فِیْ جَنّٰتٍ وَّنَهَرٍ ۟ۙ
నిశ్చయంగా తమ ప్రభువుకు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడే వారు స్వర్గ వనముల్లో మరియు ప్రవహించే సెలయేరుల్లో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటారు.
Арабча тафсирлар:
فِیْ مَقْعَدِ صِدْقٍ عِنْدَ مَلِیْكٍ مُّقْتَدِرٍ ۟۠
అబద్ధం లేదా పాపం లేని సత్యం యొక్క మండలిలో.ప్రతీది అధికారం కలిగి ఉన్న ఒక రాజు వద్ద, దేని నుండి అశక్తుడు కాని సర్వాధిక్యుడి వద్ద, కాబట్టి శాశ్వత అనుగ్రహాల్లో నుండి వారు అతని నుండి ఏమి పొందారో అడగవద్దు.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• كتابة الأعمال صغيرها وكبيرها في صحائف الأعمال.
కర్మలు అవి చిన్నవైన,పెద్దవైన కర్మల పుస్తకములలో వ్రాయబడి ఉండటం.

• ابتداء الرحمن بذكر نعمه بالقرآن دلالة على شرف القرآن وعظم منته على الخلق به.
అనంత కరుణామయుడు తన అనుగ్రహాలను ప్రస్తావిస్తూ ఖుర్ఆన్ ను ఆరంభించటం ఖుర్ఆన్ గోప్పతనంపై మరియు దాని ద్వారా సృష్టిపై అయన ఉపకార గొప్పతనం పై సూచన ఉన్నది.

• مكانة العدل في الإسلام.
ఇస్లాంలో న్యాయమునకు స్థానం ఏమిటో తెలిసింది.

• نعم الله تقتضي منا العرفان بها وشكرها، لا التكذيب بها وكفرها.
అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మన నుండి వాటిని గుర్తించటమును మరియు వాటి విషయంలో కృతజ్ఞత తెలుపుకోవటమును ఆశిస్తున్నవి. వాటి పట్ల తిరస్కారమును,కృతఘ్నతను కాదు.

 
Маънолар таржимаси Сура: Қамар сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш