Check out the new design

Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版 * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Chương: Al-Baqarah   Câu:
وَبَشِّرِ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ— كُلَّمَا رُزِقُوْا مِنْهَا مِنْ ثَمَرَةٍ رِّزْقًا ۙ— قَالُوْا هٰذَا الَّذِیْ رُزِقْنَا مِنْ قَبْلُ وَاُتُوْا بِهٖ مُتَشَابِهًا ؕ— وَلَهُمْ فِیْهَاۤ اَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَّهُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
క్రితం చేయబడిన హెచ్చరికలు అవిశ్వాసుల కొరకు కాగా, ఓ ప్రవక్తా! అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యాలు చేసే విశ్వాసులకు, క్రింద సెలయేళ్ళు పారుతూ ఉండే (అద్భుతమైన) భవనాల, (అందమైన) వృక్షాలతో కూడిన స్వర్గవనాల శుభవార్త వినిపించు. వారికి ఆహారంగా తినడానికి స్వర్గవనాల ఫలాలను ఇచ్చినపుడు; భూమి పైని ఫలాలతో వాటి ప్రబలమైన పోలిక కారణంగా; వారు ఇలా అంటారు “ఇవి మేము ఇంతకు ముందు తిన్న ఫలాలను పోలి ఉన్నాయి”.(ఎందుకంటే) అవే పేర్లు, అవే రూపాలు కలిగిన ఫలాలు వారికి ఇవ్వబడ్డాయి కనుక. తమకు తెలిసినవే (తాము చూసినవే) కనుక వారు (సంకోచం లేకుండా) స్వీకరిస్తారని. కానీ అవి రుచిలో భిన్నంగా ఉంటాయి. ఇంకా వారి కొరకు సౌందర్యవతులైన, చురుకైన సహచరులు (Partners) ఉంటారు. వారు (ఆ సహచరులు), మనసుకు తట్టే అన్నీ రకాల అశుధ్ధతలనుండి, పరిశుద్దులై ఉంటారు. మరియు వారు (విశ్వాసులు) అంతము అనేదే లేని (ఏ నిర్వచనానికీ అందని) సౌఖ్యం లో ఉంటారు - (ఎప్పుడో ఒకప్పుడు) తెగిపోయి, ముగిసిపోయే ఇహలోకపు సౌఖ్యాలకు భిన్నంగా.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّ اللّٰهَ لَا یَسْتَحْیٖۤ اَنْ یَّضْرِبَ مَثَلًا مَّا بَعُوْضَةً فَمَا فَوْقَهَا ؕ— فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا فَیَعْلَمُوْنَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّهِمْ ۚ— وَاَمَّا الَّذِیْنَ كَفَرُوْا فَیَقُوْلُوْنَ مَاذَاۤ اَرَادَ اللّٰهُ بِهٰذَا مَثَلًا ۘ— یُضِلُّ بِهٖ كَثِیْرًا وَّیَهْدِیْ بِهٖ كَثِیْرًا ؕ— وَمَا یُضِلُّ بِهٖۤ اِلَّا الْفٰسِقِیْنَ ۟ۙ
నిస్సందేహంగా అల్లాహ్ తానుకోరిన ఉపమానాలను (మనసుకు తాకేలా) ఉపయోగించడానికి సిగ్గుపడడు. కనుక దోమ ఉపమానమైనా, లేక దానికంటే పెద్ద వాటిలో పెద్ద దానినైనా సరే, లేక దానికంటే చిన్న వాటిలో చిన్న దానినైనా సరే. ప్రజలు రెండు రకాలు; 1. విశ్వాసులు, 2. అవిశ్వాసులు. ఈ విషయంలో విశ్వాసులు (ఉపమానంలోని) సత్యాన్ని ధృవీకరిస్తారు, ఉపమానాన్ని తెలియజేయడం వెనుక దైవ పరమార్ధం ఉందన్న విషయాన్ని గ్రహిస్తారు. కాగా అవిశ్వాసులు “అల్లాహ్ దోమ, ఈగ మరియు సాలీడు పురుగు లాంటి అల్పమైన జీవుల ఉదాహరణ ఇవ్వడం ఏమిటీ?” అని పరిహాసమాడుతారు. దానికి జవాబు అల్లాహ్ నుండి వస్తున్నది “నిస్సందేహంగా ఈ ఉపమానాలలో ప్రజల కొరకు కొన్ని సూచనలు మరియు పరమార్ధాలు మరియు ప్రజలకు పరీక్షలున్నాయి. అల్లాహ్ వారిలో కొందరిని (వారి అహంకారం కారణంగా) ఈ ఉదాహరణలతో అపమార్గానికి లోను చేస్తాడు. ఇలాంటివారు అనేకులు. మరి కొందరిని హితబోధ గ్రహించటం కారణంగా సన్మార్మాన్ని ప్రసాధిస్తాడు. మరియు ఇలాంటి వారు కూడా అనేకులు. మరియు అల్లాహ్ కేవలం అపమార్గానికి అర్హులైన వారిని తప్ప మరెవ్వరినీ అపమార్గానికి లోను చెయ్యడు. వారు తమ అవిధేయత కారణంగా బహిష్కరించ బడినవారు ఉదాహరణకు కపటవిశ్వాసులు”.
Các Tafsir tiếng Ả-rập:
الَّذِیْنَ یَنْقُضُوْنَ عَهْدَ اللّٰهِ مِنْ بَعْدِ مِیْثَاقِهٖ ۪— وَیَقْطَعُوْنَ مَاۤ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ یُّوْصَلَ وَیُفْسِدُوْنَ فِی الْاَرْضِ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟
ఎవరైతే అల్లాహ్ యొక్క ఒప్పందాన్ని తెంచివేస్తారో. ఏదైతే వారు కేవలం ఆయనను మాత్రమే ఆరాధిస్తారని మరియు ఆ ప్రవక్తకు విధేయత చూపుతామని ఒప్పందం చేశారో ఏ ప్రవక్త గురించైతే ఆయనకు ముందు పంపబడిన వారు తెలియజేశారో. ఇటువంటి వారు తమ ఒప్పందాన్ని తిరస్కరించి అల్లాహ్ ఆదేశించిన ఆజ్ఞలను మరియు అల్లాహ్ కలిపి ఉంచమని చెప్పిన బంధుత్వాలను త్రెంచివేస్తున్న గుణం కలిగి ఉన్నారు. మరియు వీరు తమ అవిధేయతతో భువిలో కల్లోలాన్ని వ్యాపింపజేస్తున్నారు. వీరే తమ ఇహపరలోకాల యొక్క వ్యవహారాలలో నిర్లక్ష్యం వహిస్తున్నవారు.
Các Tafsir tiếng Ả-rập:
كَیْفَ تَكْفُرُوْنَ بِاللّٰهِ وَكُنْتُمْ اَمْوَاتًا فَاَحْیَاكُمْ ۚ— ثُمَّ یُمِیْتُكُمْ ثُمَّ یُحْیِیْكُمْ ثُمَّ اِلَیْهِ تُرْجَعُوْنَ ۟
నిస్సందేహంగా ఓ సత్యతిరస్కారులారా, మీ వైఖరి బహు విచిత్రమైనది. మీరు మీలోనే అల్లాహ్ యొక్క శక్తిసామర్ధ్యాల నిదర్శనాలను చూస్తున్నప్పటికీ ఆయనను ఎలా తిరస్కరించగలరు.వాస్తవానికి క్రితంలో మీరు ఏమీ కానప్పుడు ఆయన మీకు ఉనికిని కలిగించాడు మరియు మీకు జీవితాన్ని ప్రసాదించాడు తిరిగి రెండోసారి మీకు మరణాన్ని ప్రసాదించేవాడు ఆయనే మళ్లీ మీకు రెండో జీవితం కలిగిస్తాడు తర్వాత మీరు ముందు పంపుకున్న కర్మల యొక్క లెక్క తీసుకోవటానికి ఆయనవైపే మరలుతారు.
Các Tafsir tiếng Ả-rập:
هُوَ الَّذِیْ خَلَقَ لَكُمْ مَّا فِی الْاَرْضِ جَمِیْعًا ۗ— ثُمَّ اسْتَوٰۤی اِلَی السَّمَآءِ فَسَوّٰىهُنَّ سَبْعَ سَمٰوٰتٍ ؕ— وَهُوَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟۠
మరియు అల్లాహ్ అధ్వితీయుడు ఎవరైతే మీకు ప్రపంచంలో ఉన్న సమస్త నదులను, చెట్లను మరియు లెక్కించలేనన్ని సమస్తాన్ని సృష్టించాడు మీరు వాటి ద్వారా ప్రయోజనాన్ని పోందుతున్నారు మరియు మీకు ఉపయుక్తంగా చేసిన వాటిని వినియోగపరుచుకుంటున్నారు. ఆయన ఆకాశాన్ని సృష్టించటానికి పూనుకుని దానిని ఏడు సమానమైన ఆకాశాలుగా సృష్టించాడు మరియు ఆయన జ్ఞానము ప్రతీ వస్తువును పర్యవేష్టించియున్నది.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• من كمال النعيم في الجنة أن ملذاتها لا يكدرها أي نوع من التنغيص، ولا يخالطها أي أذى.
స్వర్గము యొక్క అనుగ్రహాల పరిపూర్ణత (ఎటువంటిదంటే) వాటి రుచి (ఎంత ఆస్వాధించినప్పటికీ) విరక్తిని కలిగించదు.మరియు వాటి సమ్మేళననము ఏవిధమైన ఇబ్బందిని కలిగించదు.

• الأمثال التي يضربها الله تعالى لا ينتفع بها إلا المؤمنون؛ لأنهم هم الذين يريدون الهداية بصدق، ويطلبونها بحق.
అల్లాహ్ ఉపదేశించిన ఉదాహరణలు వాస్తవానికి విస్వాసులకు తప్ప మరెవరికీ ప్రయోజనాన్ని కలిగించవు ఎందుకంటే యధార్దానికి వారే సచ్చీలతతో మార్గదర్శకాన్ని కోరేవారు.మరియు దానిని నిజంగా అన్వేషించేవారు.

• من أبرز صفات الفاسقين نقضُ عهودهم مع الله ومع الخلق، وقطعُهُم لما أمر الله بوصله، وسعيُهُم بالفساد في الأرض.
అవిధేయుల యొక్క బహిర్గత లక్షణం ఏమనగా అల్లాహ్ తో మరియు సృష్టిరాశులతో చేసిన ఒప్పందాలను ఉల్లఘించటం.అల్లాహ్ కలిపి ఉంచమని ఆదేశించిన బంధుత్వాలను తెంచివేయటం.మరియు భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేయటానికి ప్రయత్నించటం.

• الأصل في الأشياء الإباحة والطهارة؛ لأن الله تعالى امتنَّ على عباده بأن خلق لهم كل ما في الأرض.
వాస్తవానికి వుస్తువులన్నింటిలో పరిశుధత మరియు ధర్మసమ్మతమే మూలసిధ్దాంతం.ఎందుకనగా దైవం భూమిలోని సమస్త వస్తువులను దాసుల ప్రయోజనం కొరకే సృష్టించి ఉపకారం చేశాడు.

 
Ý nghĩa nội dung Chương: Al-Baqarah
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版 - Mục lục các bản dịch

由古兰经研究释义中心发行

Đóng lại