Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (216) Chương: Chương Al-Baqarah
كُتِبَ عَلَیْكُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْ ۚ— وَعَسٰۤی اَنْ تَكْرَهُوْا شَیْـًٔا وَّهُوَ خَیْرٌ لَّكُمْ ۚ— وَعَسٰۤی اَنْ تُحِبُّوْا شَیْـًٔا وَّهُوَ شَرٌّ لَّكُمْ ؕ— وَاللّٰهُ یَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟۠
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మార్గంలో పోరాడటంలో ధనమును,మానమును ఖర్చు చేయటం అన్నది స్వాభావిక పరంగా మనస్సుకు నచ్చకపోయినా మీపై విధి గావించబడినది.బహుశా మీరు దేనినైతే ఇష్టపడటం లేదో అల్లాహ్ మార్గంలో పోరాడటం వాస్తవానికి మీ కొరకు మేలైనదేమో,లాభదాయకమైనదేమో.అల్లాహ్ యొక్క పెద్ద ప్రతిఫలంతో పాటు అందులో శతృవులకు వ్యతిరేకంగా సహాయం,అల్లాహ్ కలిమాను ఉన్నత శిఖరాలకు చేరవేయటంలో సహాయ సహకారాలు కలవు.బహుశా దేనినైతే మీరు ఇష్ట పడుతున్నారో ధర్మ యుద్ధంలో వెళ్ళకుండా కూర్చోవటం అది మీ పాలిట కీడును కలిగిస్తుంది,మీపై ఆపదను తెచ్చి పెడుతుంది,ఎందుకంటే అందులో ఓటమి ఉన్నది,శతృవుల ఆధిక్యత ఉన్నది అల్లాహ్ సంపూర్ణ జ్ఞానంతో కార్యాల మంచిని,వాటి చెడును తెలుసుకుంటాడు.మరియు మీకు వాటి గురించి తెలియదు.ఆయన ఆదేశమును స్వీకరించండి.అందులోనే మీకు శ్రేయస్కరమున్నది.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• الجهل بعواقب الأمور قد يجعل المرء يكره ما ينفعه ويحب ما يضره، وعلى المرء أن يسأل الله الهداية للرشاد.
కార్యాల పర్యావసనాల గురించి అజ్ఞానం మనిషిని అతనికి లాభం చేసే వాటిని అసహ్యించుకునే విధంగా,తనకు నష్టం చేసే వాటిని ఇష్టపడేటట్లుగా చేస్తుంది.మనిషి అల్లాహ్ తో సరైన మార్గమును చూపించమని తప్పని సరిగా వేడుకోవాలి.

• جاء الإسلام بتعظيم الحرمات والنهي عن الاعتداء عليها، ومن أعظمها صد الناس عن سبيل الله تعالى.
గౌరప్రదమైన వస్తువులను గౌరవించటానికి,వాటి విషయంలో హద్దుమీరటం నుండి వారించటానికి ఇస్లాం వచ్చినది. వాటిలోంచి (హద్దుమీరే విషయాల్లోంచి) పెద్దది ప్రజలను అల్లాహ్ మార్గం నుండి ఆపటం.

• لا يزال الكفار أبدًا حربًا على الإسلام وأهله حتَّى يخرجوهم من دينهم إن استطاعوا، والله موهن كيد الكافرين.
సత్య తిరస్కారులు ఇస్లాంకు వ్యతిరేకంగా,ముస్లింలకు వ్యతిరేకంగా వారిని వారి ధర్మం నుండి తీసివేయటం కొరకు యుద్దం చేస్తూనే ఉంటారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారుల కుట్రలను బలహీన పరుస్తాడు.

• الإيمان بالله تعالى، والهجرة إليه، والجهاد في سبيله؛ أعظم الوسائل التي ينال بها المرء رحمة الله ومغفرته.
అల్లాహ్ పై విశ్వాసం,ఆయన వైపునకు మరలటం,ఆయన మార్గంలో ధర్మ పోరాటం చేయటం మనిషికి అల్లాహ్ కారుణ్యాన్ని,ఆయన మన్నింపుని పొందటం కొరకు గొప్ప కారకాలు.

• حرّمت الشريعة كل ما فيه ضرر غالب وإن كان فيه بعض المنافع؛ مراعاة لمصلحة العباد.
నష్టం ఎక్కువగా ఉన్న విషయాలు ఒక వేళ అందులో కొద్దిపాటి లాభం ఉన్నా కూడా వాటిని దాసుల శ్రేయస్సు కొరకు ధర్మం నిషేదించినది.

 
Ý nghĩa nội dung Câu: (216) Chương: Chương Al-Baqarah
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mục lục các bản dịch

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Đóng lại