Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (12) Chương: Chương Al-Nisa'
وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ اَزْوَاجُكُمْ اِنْ لَّمْ یَكُنْ لَّهُنَّ وَلَدٌ ۚ— فَاِنْ كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ مِنْ بَعْدِ وَصِیَّةٍ یُّوْصِیْنَ بِهَاۤ اَوْ دَیْنٍ ؕ— وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ اِنْ لَّمْ یَكُنْ لَّكُمْ وَلَدٌ ۚ— فَاِنْ كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُمْ مِّنْ بَعْدِ وَصِیَّةٍ تُوْصُوْنَ بِهَاۤ اَوْ دَیْنٍ ؕ— وَاِنْ كَانَ رَجُلٌ یُّوْرَثُ كَلٰلَةً اَوِ امْرَاَةٌ وَّلَهٗۤ اَخٌ اَوْ اُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ ۚ— فَاِنْ كَانُوْۤا اَكْثَرَ مِنْ ذٰلِكَ فَهُمْ شُرَكَآءُ فِی الثُّلُثِ مِنْ بَعْدِ وَصِیَّةٍ یُّوْصٰی بِهَاۤ اَوْ دَیْنٍ ۙ— غَیْرَ مُضَآرٍّ ۚ— وَصِیَّةً مِّنَ اللّٰهِ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَلِیْمٌ ۟ؕ
మరియు మీకు-ఓ భర్తలారా-మీ భార్యలు వదిలిన ఆస్తిలో నుంచి సగం ½ లభిస్తుంది ఒకవేళ వారికి మీనుండి లేక ఇతరుల నుండి మగ,ఆడ ఏ సంతానం లేకుంటే,అదే వారికి మగ లేక ఆడ సంతానం ఉంటే ఆస్తిలో మీకు ¼ లభిస్తుంది.అయితే ఈ ఆస్తి వారి వసియ్యతు(వీలునామా) అభీష్టం నెరవేర్చి మరియు ఆమె అప్పులను చెల్లించిన తరువాత పంచబడుతుంది. మీరు వదిలిన ఆస్తిలో భార్యలకు ¼ వంతు లభిస్తుంది,ఆమెతో లేక ఇతరులతో మీకు మగ ఆడ ఎలాంటి సంతానం లేనిపక్షంలో,అదే మీకు ఆమెనుండి గానీ లేదా వేరేభార్యల నుండి గానీ మగ లేక ఆడ సంతానం ఉన్నట్లైతే అప్పుడు ఆమెకు మీ ఆస్తిలో 1/8 వంతు లభిస్తుంది,మీ అభీష్ట వీలునామా(వసియ్యతు)ను మరియు మీ అప్పులను చెల్లించిన తరువాత వారికి ఇది పంచబడుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయాడు అతనికి తండ్రి మరియు సంతానం లేదు,లేదా ఒక స్త్రీ చనిపోయింది ఆమెకు తండ్రి మరియు సంతానం లేదు,అయితే ఈ మృతులకు సవతి సోదరులు లేక సవతి సోధరీమణులు ఉన్నప్పుడూ మృతుని సవతి సోదరునికి లేదా సహోధరికి 1/6 వంతు విధిగా లభిస్తుంది. ఒకవేళ సవతి సోదరులు లేక సోదరిమణులు ఒకటికంటే ఎక్కువ ఉన్నట్లయితే వారందరికి కలిపి 1/3 విధిగా లభిస్తుంది వారంతా అందులో భాగస్వాములవుతారు.ఇందులో మగ,ఆడ ఇద్దరూ సమానమే,మరియు మృతుని వసియ్యతుఅభీష్టం’వారసులకు నష్టం చేయకుండా ఉండాలి,అది ఆస్తిలో 1/3 కు మించరాదనే ’ ఈ షరత్తుతో పూర్తిచేసి మరియు అప్పులను చెల్లించిన తరువాత పొందుతారు, ఈ ఆదేశం పై ఆయతులో ఉంది,అల్లాహ్ తరుపున మీకు వసియ్యతు చేయబడింది మరియు విధిగా మీకు ఆదేశించబడింది.ఇహపరలోకాల్లో దాసులకు ఏది మంచిదో అల్లాహ్’కు చాలాబాగా తెలుసు,ఆయన నిగ్రహస్తుడు’పాపాత్ముడిని వెంటనే శిక్షించడంలో త్వరపడడు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• لا تقسم الأموال بين الورثة حتى يقضى ما على الميت من دين، ويخرج منها وصيته التي لا يجوز أن تتجاوز ثلث ماله.
మరణించిన వ్యక్తి చెల్లించాల్సిన అప్పు తీర్చబడే వరకు డబ్బును వారసుల మధ్య విభజించబడదు. తన డబ్బులో మూడోవంతును అతిక్రమిస్తూ చేయబడిన సమ్మతించబడని వీలు తొలగించబడుతుంది.

• التحذير من التهاون في قسمة المواريث؛ لأنها عهد الله ووصيته لعباده المؤمنين؛ فلا يجوز تركها أو التهاون فيها.
వారసత్వ ఆస్తుల విభజనలో చూపే నిర్లక్ష్యధోరణికి వ్యతిరేకంగా హెచ్చరిక ఉంది. ఎందుకంటే ఇందులో అల్లాహ్ తన విశ్వాసులైన దాసులకు చేసిన వాగ్దానం మరియు ఆయన చేసిన వీలు’ఉన్నాయి,వాటిని వదలడం,లేదా అందులో నిర్లక్ష్యం వహించడం సమ్మతించబడలేదు.

• من علامات الإيمان امتثال أوامر الله، وتعظيم نواهيه، والوقوف عند حدوده.
విశ్వాసానికి సంకేతాలు “అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం,ఆయన నిషేధాలను గౌరవించడం మరియు ఆయన హద్దులలో ఆగిపోవడం.

• من عدل الله تعالى وحكمته أن من أطاعه وعده بأعظم الثواب، ومن عصاه وتعدى حدوده توعده بأعظم العقاب.
మహోన్నతుడైన అల్లాహ్ న్యాయం మరియు వివేకం ప్రకారం ‘ఆయనకు విధేయత చూపినవారికి గొప్ప బహుమతి’ యొక్క వాగ్దానం చేశాడు, మరెవరైతే ఆయనకు అవిధేయత చూపుతూ హద్దులను అతిక్రమిస్తాడో అతన్ని పెద్దశిక్ష’తో హెచ్చరించాడు.

 
Ý nghĩa nội dung Câu: (12) Chương: Chương Al-Nisa'
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mục lục các bản dịch

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Đóng lại