Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 章: 宰哈柔福   段:
وَاِنَّهٗ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُوْنِ ؕ— هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ ۟
మరియు నిశ్చయంగా ఈసా అలైహిస్సలాం ప్రళయ సూచనల్లోంచి ఒక సూచన ఆయన చివరికాలంలో దిగుతారు. ప్రళయం వాటిల్లే విషయంలో మీరు సందేహించకండి. నేను అల్లాహ్ వద్ద నుండి మీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో నన్ను మీరు అనుసరించండి. నేను మీ వద్దకు తీసుకుని వచ్చినది ఇదే ఎటువంటి వంకరతనం లేని తిన్నని మార్గము.
阿拉伯语经注:
وَلَا یَصُدَّنَّكُمُ الشَّیْطٰنُ ۚ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟
మరియు షైతాను తన మోసము ద్వారా,తన మోహింపజేయటం ద్వారా మిమ్మల్ని ఋజు మార్గము నుండి మళ్ళించకూడదు. నిశ్ఛయంగా అతడు మీ కొరకు బహిరంగ శతృవు.
阿拉伯语经注:
وَلَمَّا جَآءَ عِیْسٰی بِالْبَیِّنٰتِ قَالَ قَدْ جِئْتُكُمْ بِالْحِكْمَةِ وَلِاُبَیِّنَ لَكُمْ بَعْضَ الَّذِیْ تَخْتَلِفُوْنَ فِیْهِ ۚ— فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟
మరియు ఈసా అలైహిస్సలాం తాను ఒక ప్రవక్త అవటంపై స్పష్టపరిచే సూచనలను తీసుకుని తన జాతి వారి వద్దకు వచ్చినప్పుడు వారితో ఇలా పలికారు : నిశ్చయంగా నేను మీ వద్దకు అల్లాహ వద్ద నుండి విజ్ఞతను (హిక్మత్) తీసుకుని వచ్చాను. మరియు నేను మీరు మీ ధర్మ విషయాల్లోంచి విభేదించుకుంటున్న వాటిలో కొన్నింటిని మీకు స్పష్టపరుస్తాను. కావున మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో మరియు మీకు వారించిన వాటి విషయంలో నాపై విధేయత చూపండి.
阿拉伯语经注:
اِنَّ اللّٰهَ هُوَ رَبِّیْ وَرَبُّكُمْ فَاعْبُدُوْهُ ؕ— هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ ۟
నిశ్ఛయంగా అల్లాహ్ నాకూ మరియు మీకు ప్రభువు. ఆయన తప్ప మాకు ఏ ప్రభువు లేడు. కాబట్టి మీరు ఆయన ఒక్కడి కొరకు ఆరాధనను ప్రత్యేకించండి. మరియు ఈ ఏకేశ్వరోపాసన (తౌహీద్) ఇదే ఎటువంటి వంకరతనం లేని తిన్నని మార్గము.
阿拉伯语经注:
فَاخْتَلَفَ الْاَحْزَابُ مِنْ بَیْنِهِمْ ۚ— فَوَیْلٌ لِّلَّذِیْنَ ظَلَمُوْا مِنْ عَذَابِ یَوْمٍ اَلِیْمٍ ۟
అయితే ఈసా అలైహిస్సలం విషయంలో క్రైస్తవ వర్గాలు విభేదించుకున్నాయి. వారిలో నుండి కొందరు ఆయనను దైవం అన్నారు మరియు మరి కొందరు ఆయనను అల్లాహ్ కుమారుడన్నారు మరియు మరి కొందరు ఆయన,ఆయన తల్లి ఇద్దరు దేవుళ్ళన్నారు. ఈసా అలైహిస్సలాం ను దైవత్వముతో లేదా దైవ కుమారునితో లేదా ముగ్గురిలో నుండి మూడో వాడితో పోల్చటం వలన తమ స్వయమునకు అన్యాయం చేసుకున్న వారి కొరకు ప్రళయదినమున వారి గురించి నిరీక్షించే బాధాకరమైన శిక్షతో వినాశనం కలుగును.
阿拉伯语经注:
هَلْ یَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَاْتِیَهُمْ بَغْتَةً وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟
ఈసా అలైహిస్సలాం విషయంలో విభేదించుకునే ఈ వర్గాలన్నీ తమ వద్దకు ప్రళయం దాని రావటమును వారు గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు వారి వద్దకు రావటం గురించి నిరీక్షిస్తున్నారా ?. అది ఒక వేళ వారి వద్దకు వారు తమ అవిశ్వాస స్థితిలో ఉన్నప్పుడు వస్తే నిశ్చయంగా వారి పరిణామము బాధాకరమైన శిక్షే అవుతుంది.
阿拉伯语经注:
اَلْاَخِلَّآءُ یَوْمَىِٕذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ اِلَّا الْمُتَّقِیْنَ ۟ؕ۠
అవిశ్వాసంలో,అపమార్గంలో సన్నిహితులు,స్నేహితులు ప్రళయదినమున ఒకరికొకరు శతృవులు. కానీ అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడేవారు వారి సన్నిహితము అంతం కాకుండా శాశ్వతంగా ఉంటుంది.
阿拉伯语经注:
یٰعِبَادِ لَا خَوْفٌ عَلَیْكُمُ الْیَوْمَ وَلَاۤ اَنْتُمْ تَحْزَنُوْنَ ۟ۚ
మరియు అల్లాహ్ వారితో ఇలా పలుకుతాడు : ఓ నా దాసులారా ఈ రోజు మీరు ఎదుర్కొనే దాని విషయంలో మీపై ఎటువంటి భయం ఉండదు. మరియు మీరు కోల్పోయిన ప్రాపంచిక భాగముల విషయంలో మీరు బాధ పడరు.
阿拉伯语经注:
اَلَّذِیْنَ اٰمَنُوْا بِاٰیٰتِنَا وَكَانُوْا مُسْلِمِیْنَ ۟ۚ
వారు తమ ప్రవక్త పై అవతరింపబడిన ఖుర్ఆన్ పట్ల విశ్వాసమును కనబరిచారు. మరియు వారు ఖుర్ఆన్ కు కట్టుబడి ఉండేవారు; దాని ఆదేశాలను పాటిస్తారు మరియు దాని వారింపుల నుండి దూరంగా ఉంటారు.
阿拉伯语经注:
اُدْخُلُوا الْجَنَّةَ اَنْتُمْ وَاَزْوَاجُكُمْ تُحْبَرُوْنَ ۟
మీరూ మరియు విశ్వాసంలో మీలాంటి వారు స్వర్గంలో ప్రవేశించండి. తరగని,అంతంకాని వైన మీరు పొందే శాశ్వత అనుగ్రహాలతో మీరు సంతోషముగా ఉంటారు.
阿拉伯语经注:
یُطَافُ عَلَیْهِمْ بِصِحَافٍ مِّنْ ذَهَبٍ وَّاَكْوَابٍ ۚ— وَفِیْهَا مَا تَشْتَهِیْهِ الْاَنْفُسُ وَتَلَذُّ الْاَعْیُنُ ۚ— وَاَنْتُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟ۚ
వారి సేవకులు వారిపై బంగారపు పాత్రలను మరియు కడియములు లేని కప్పులను తీసుకుని తిరుగుతుంటారు. స్వర్గములో మనస్సులు కోరేవి మరియు కళ్ళు చూసి ఆనందించేవి ఉంటాయి. మరియు మీరు అందులో నివాసముంటారు. దాని నుండి మీరు ఎన్నటికి బయటకు రారు.
阿拉伯语经注:
وَتِلْكَ الْجَنَّةُ الَّتِیْۤ اُوْرِثْتُمُوْهَا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
మీ కొరకు వర్ణించబడిన ఈ స్వర్గము, దీనికే అల్లాహ్ తన వద్ద నుండి అనుగ్రహముగా మీ కర్మలకు బదులుగా మిమ్మల్ని వారసులుగా చేశాడు.
阿拉伯语经注:
لَكُمْ فِیْهَا فَاكِهَةٌ كَثِیْرَةٌ مِّنْهَا تَاْكُلُوْنَ ۟
అందులో మీ కొరకు అంతం కాని ఎన్నో ఫలాలు ఉంటాయి. వాటిలో నుండి మీరు తింటారు.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• نزول عيسى من علامات الساعة الكبرى.
ఈసా అలైహిస్సలాం దిగటం ప్రళయ పెద్ద సూచనల్లోంచిది.

• انقطاع خُلَّة الفساق يوم القيامة، ودوام خُلَّة المتقين.
ప్రళయదినమున అవిధేయుల స్నేహసంబంధాలు తెగిపోవటం మరియు దైవభీతిపరుల స్నేహసంబంధాలు శాశ్వతమవటం జరుగును.

• بشارة الله للمؤمنين وتطمينه لهم عما خلفوا وراءهم من الدنيا وعما يستقبلونه في الآخرة.
విశ్వాసపరుల కొరకు వారు ఇహలోకంలో తమ వెనుక వదిలి వచ్చిన దాని గురించి మరియు పరలోకంలో తాము ఎదుర్కొనవలసిన దాని గురించి అల్లాహ్ శుభవార్త మరియు ఆయన ఓదార్పు కలుగును.

 
含义的翻译 章: 宰哈柔福
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭