Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 章: 艾奈尔姆   段:
قُلْ اَیُّ شَیْءٍ اَكْبَرُ شَهَادَةً ؕ— قُلِ اللّٰهُ ۫— شَهِیْدٌۢ بَیْنِیْ وَبَیْنَكُمْ ۫— وَاُوْحِیَ اِلَیَّ هٰذَا الْقُرْاٰنُ لِاُنْذِرَكُمْ بِهٖ وَمَنْ بَلَغَ ؕ— اَىِٕنَّكُمْ لَتَشْهَدُوْنَ اَنَّ مَعَ اللّٰهِ اٰلِهَةً اُخْرٰی ؕ— قُلْ لَّاۤ اَشْهَدُ ۚ— قُلْ اِنَّمَا هُوَ اِلٰهٌ وَّاحِدٌ وَّاِنَّنِیْ بَرِیْٓءٌ مِّمَّا تُشْرِكُوْنَ ۟ۘ
ఓ ప్రవక్త మిమ్మల్ని తిరస్కరించే ముష్రికులతో ఇలా అడగండి-: నా నిజాయితీపై ఏ సాక్ష్యం గొప్పది,పెద్దది?.మీరు సమాధానమిస్తూ తెలపండి : నా నిజాయితీపై అల్లాహ్ యే గొప్ప సాక్షి,పెద్ద సాక్షి.నాకు,మీకు మధ్యన ఆయనే సాక్షి.నేను మీ వద్దకు తీసుకుని వచ్చిన దాని గురించి,మరియు మీరు దేనిని తిరస్కరిస్తారో దాని గురించి ఆయనకు తెలుసు.నిశ్చయంగా అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ను మిమ్మల్ని,ఇది మానవుల్లోంచి,జిన్నుల్లోంచి ఎవరెవరికి చేరుతుందో వారందరిని భయపెట్టటానికి వహీ ద్వారా నా వద్దకు చేరవేశాడు.ఓ ముష్రకులారా మీరు అల్లాహ్ తోపాటు వేరే ఆరాధ్య దైవాలు ఉన్నాయని విశ్వసిస్తున్నారు.ఓ ప్రవక్త మీరు చెప్పండి మీరు దేనినైతే నమ్ముతున్నారో అది అసత్యం కావటం వలన దాని గురించి నేను సాక్ష్యం ఇవ్వను.అల్లాహ్ మాత్రం ఒకే ఆరాధ్య దైవము,ఆయనతోపాటు ఎవరు సాటి లేరు.మీరు ఆయనతో సాటికల్పిస్తున్న వాటి నుండి నేను నిర్దోషిని.
阿拉伯语经注:
اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یَعْرِفُوْنَهٗ كَمَا یَعْرِفُوْنَ اَبْنَآءَهُمْ ۘ— اَلَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فَهُمْ لَا یُؤْمِنُوْنَ ۟۠
మేము తౌరాతును ప్రసాధించిన యూదులు,మేము ఇంజీలును ప్రసాధించిన క్రైస్తవులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పరిపూర్ణంగా గుర్తుపడుతున్నారు.ఏవిధంగానైతే వారు ఇతరుల పిల్లల మధ్య తమ పిల్లలను గుర్తుపడుతున్నారో ఆవిధంగా.వారందరు తమని నరకాగ్నిలో ప్రవేశింపజేయటం వలన తమ స్వయాన్ని నష్టం కలిగించుకున్నారు. ఇలాంటి వారు విశ్వసించరు.
阿拉伯语经注:
وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰیٰتِهٖ ؕ— اِنَّهٗ لَا یُفْلِحُ الظّٰلِمُوْنَ ۟
అల్లాహ్ తోపాటు ఎవరినైన సాటి కల్పించి అతనిని ఆయనతోపాటు ఆరాధించేవాడు లేదా ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన ఆయతులను తిరస్కరించే వాడికన్న పెద్ద దుర్మార్గుడు ఎవరూ ఉండరు.నిశ్చయంగా దుర్మార్గులు అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం,ఆయన ఆయతులను తిరస్కరించటం వలన ఒకవేళ వారు క్షమాపణ కోరకుండా ఉంటే ఎన్నటికి సాఫల్యం చెందలేరు.
阿拉伯语经注:
وَیَوْمَ نَحْشُرُهُمْ جَمِیْعًا ثُمَّ نَقُوْلُ لِلَّذِیْنَ اَشْرَكُوْۤا اَیْنَ شُرَكَآؤُكُمُ الَّذِیْنَ كُنْتُمْ تَزْعُمُوْنَ ۟
వారందరిని సమీకరించేటప్పటి ప్రళయదినాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి.మేము వారిలో ఎవరిని వదలము.ఆ తరువాత మేము అల్లాహ్ తోపాటు వేరే ఇతరులను ఆరాధించే వారితో వారిని చివాట్లు పెట్టటానికి ఇలా అంటాము.మీరు వారిని అల్లాహ్ కు భాగస్వాములని అబద్దపు వాదనలు చేసేవారో ఆ భాగస్వాములేరి?.
阿拉伯语经注:
ثُمَّ لَمْ تَكُنْ فِتْنَتُهُمْ اِلَّاۤ اَنْ قَالُوْا وَاللّٰهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِیْنَ ۟
ఈ పరీక్ష తరువాత వారికి తమ ఆరాధ్యదైవాలతో సంబంధం లేదని చెప్పటం తప్ప వేరే సాకు ఉండదు.వారు అబద్దం పలుకుతూ ఇలా అంటారు : మా ప్రభువైన అల్లాహ్ సాక్షిగా మేము ఇహలోకంలో నీతోపాటు సాటి కల్పించే వారము కాదు.కాని మేము నిన్ను విశ్వసించే వారము,నీ ఏకత్వమును తెలిపేవారము.
阿拉伯语经注:
اُنْظُرْ كَیْفَ كَذَبُوْا عَلٰۤی اَنْفُسِهِمْ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟
ఓ ముహమ్మద్ చూడండి వీరందరు ఎలా తాము షిర్కు చేయలేదని తమపై అబద్దమును చెప్పుకుంటున్నారో,వారు తాము ఇహలోక జీవితంలో అల్లాహ్ తోపాటు సాటి కల్పించినవారి విషయంలో కల్పించుకున్నారో వారు వారి నుండి అదృశ్యమైపోయారు,వారిని నిస్సహాయులగా వదిలి వేశారు.
阿拉伯语经注:
وَمِنْهُمْ مَّنْ یَّسْتَمِعُ اِلَیْكَ ۚ— وَجَعَلْنَا عَلٰی قُلُوْبِهِمْ اَكِنَّةً اَنْ یَّفْقَهُوْهُ وَفِیْۤ اٰذَانِهِمْ وَقْرًا ؕ— وَاِنْ یَّرَوْا كُلَّ اٰیَةٍ لَّا یُؤْمِنُوْا بِهَا ؕ— حَتّٰۤی اِذَا جَآءُوْكَ یُجَادِلُوْنَكَ یَقُوْلُ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ ۟
ఓ ప్రవక్త మీరు ఖుర్ఆన్ ను చదువుతున్నప్పుడు ముష్రికుల్లోంచి కొందరు మిమ్మల్ని శ్రద్ధగా వింటారు. కాని వారు తాము దేనినైతే శ్రద్ధగా వింటున్నారో దాని ద్వారా లబ్ది పొందలేరు.ఎందుకంటే మేము వారి హృదయాలపై మూతలు వేశాము.చివరికి వారు తమ మొండితనము,తమ విముఖత వలన ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోలేరు.మేము వారి చెవులలో ప్రయోజనకరమైన మాటలు వినకుండా ఉండటానికి చెవుడును వేశాము.ఒకవేళ వారు స్పష్టమైన ఆధారాలు ,స్పష్టమైన వాదనలు చూస్తే వాటిని విశ్వసించరు.ఆఖరికి వారు నీ వద్దకు వచ్చినప్పుడు అసత్యము ద్వారా సత్యం విషయంలో నీతో వాదనకు దిగుతారు.నీవు తీసుకుని వచ్చినది పూర్వికుల పుస్తకాల నుండి తీసుకొనబడినదని వారంటారు.
阿拉伯语经注:
وَهُمْ یَنْهَوْنَ عَنْهُ وَیَنْـَٔوْنَ عَنْهُ ۚ— وَاِنْ یُّهْلِكُوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا یَشْعُرُوْنَ ۟
వారు ప్రజలను ప్రవక్తపై విశ్వాసమును కనబరచటం నుండి ఆపేవారు.వారు దాని నుండి దూరంగా ఉండేవారు.దాని ద్వారా ప్రయోజనం చెందేవారిని వదిలేవారు కాదు.దాని ద్వారా స్వయాన్ని ప్రయోజనం చేకూర్చుకునేవారు కాదు.వారు ఇలా చేయటం వలన తమనే నాశనం చేసుకునేవారు.వారు ఏమి చేస్తున్నారో అందులో వారి వినాశనం ఉన్నదన్న విషయాన్ని వారు తెలసుకోలేపోతున్నారు.
阿拉伯语经注:
وَلَوْ تَرٰۤی اِذْ وُقِفُوْا عَلَی النَّارِ فَقَالُوْا یٰلَیْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِاٰیٰتِ رَبِّنَا وَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟
ఓ ప్రవక్తా ఒకవేళ మీరు ప్రళయదినాన వారిని నరకాగ్నిలో ప్రవేశపెట్టేటప్పుడు చూస్తే వారు శోకములో ఇలా అంటారు : మేము ఇహలోక జీవితం వైపు మరలించబడితే ఎంతో బాగుండేది.అప్పుడు మేము అల్లాహ్ సూచనలను తిరస్కరించే వాళ్ళము కాము.అల్లాహ్ ను విశ్వసించే వారిలోంచి అయిపోతాము.మీరు వారి ఈ దుస్ధితిని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• بيان الحكمة في إرسال النبي عليه الصلاة والسلام بالقرآن، من أجل البلاغ والبيان، وأعظم ذلك الدعوة لتوحيد الله.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఖుర్ఆన్ ను ఇచ్చి పంపించటంలో ఉన్న ఉద్దేశము సందేశాలను చేరవేయటం అని తెలపటం.అల్లాహ్ యొక్క ఏకత్వం గురించి పిలుపునివ్వటం అందులోనుంచి గొప్ప కార్యం.

• نفي الشريك عن الله تعالى، ودحض افتراءات المشركين في هذا الخصوص.
అల్లాహ్ కు భాగస్వామి ఉండటంను నిరాకరించటం,ఈ విషయంలో ముష్రికుల అబద్దపు కల్పితాలను తిరస్కరించటం.

• بيان معرفة اليهود والنصارى للنبي عليه الصلاة والسلام، برغم جحودهم وكفرهم.
యూదులకు,క్రైస్తవులకు అహంకారము,అవిశ్వాసం ఉన్నప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి జ్ఞానం ఉండేదని తెలపటం జరిగింది.

 
含义的翻译 章: 艾奈尔姆
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭