Check out the new design

《古兰经》译解 - 泰卢固语翻译 - 阿布杜·拉赫曼·本·穆罕默德。 * - 译解目录

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

含义的翻译 章: 拜格勒   段:
سَلْ بَنِیْۤ اِسْرَآءِیْلَ كَمْ اٰتَیْنٰهُمْ مِّنْ اٰیَةٍ بَیِّنَةٍ ؕ— وَمَنْ یُّبَدِّلْ نِعْمَةَ اللّٰهِ مِنْ بَعْدِ مَا جَآءَتْهُ فَاِنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟
మేము ఎన్ని స్పష్టమైన సూచన (ఆయత్) లను వారికి చూపించామో ఇస్రాయీల్ సంతతి వారిని అడగండి![1] మరియు ఎవడు అల్లాహ్ యొక్క అనుగ్రహాలను పొందిన తరువాత, వాటిని తారుమారు చేస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించటంలో ఎంతో కఠినుడు.
[1] ఈ సూచనలు ఉదాహరణకు: కర్ర, మాంత్రికులను ఓడించింది, సముద్రంలో త్రోవ చేసింది, బండ నుండి 12 ఊటలను ప్రవహింపజేసింది, మేఘాల ఛాయలు ఏర్పరచింది, మన్న మరియు 'సల్వాలను దింపింది మొదలైనవి. ఇవన్నీ అల్లాహుతా'ఆలా మహిమను మరియు దైవప్రవక్త నిజాయితీలను తెలుపుతున్నాయి. అయినా సత్యతిరస్కారులు విశ్వసించలేదు.
阿拉伯语经注:
زُیِّنَ لِلَّذِیْنَ كَفَرُوا الْحَیٰوةُ الدُّنْیَا وَیَسْخَرُوْنَ مِنَ الَّذِیْنَ اٰمَنُوْا ۘ— وَالَّذِیْنَ اتَّقَوْا فَوْقَهُمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— وَاللّٰهُ یَرْزُقُ مَنْ یَّشَآءُ بِغَیْرِ حِسَابٍ ۟
సత్యతిరస్కారులకు ఇహలోక జీవితం మనోహరమైనదిగా చేయబడింది. కావున వారు విశ్వాసులతో పరిహాసాలాడుతుంటారు. కానీ, పునరుత్థాన దినమున, దైవభీతి గలవారే వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.
阿拉伯语经注:
كَانَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً ۫— فَبَعَثَ اللّٰهُ النَّبِیّٖنَ مُبَشِّرِیْنَ وَمُنْذِرِیْنَ ۪— وَاَنْزَلَ مَعَهُمُ الْكِتٰبَ بِالْحَقِّ لِیَحْكُمَ بَیْنَ النَّاسِ فِیْمَا اخْتَلَفُوْا فِیْهِ ؕ— وَمَا اخْتَلَفَ فِیْهِ اِلَّا الَّذِیْنَ اُوْتُوْهُ مِنْ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنٰتُ بَغْیًا بَیْنَهُمْ ۚ— فَهَدَی اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا لِمَا اخْتَلَفُوْا فِیْهِ مِنَ الْحَقِّ بِاِذْنِهٖ ؕ— وَاللّٰهُ یَهْدِیْ مَنْ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
పూర్వం, మానవులంతా ఒకే ఒక సమాజంగా ఉండేవారు[1]. అప్పుడు అల్లాహ్ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు. మరియు మానవులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి, ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవతరింపజేశాడు మరియు అది (దివ్యగ్రంథం) ఇవ్వబడిన వారు, స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడా, పరస్పర ద్వేషాల వల్ల భేదాభిప్రాయాలు పుట్టించుకున్నారు. కాని అల్లాహ్ తన ఆజ్ఞతో, విశ్వాసులకు వారు వివాదాలాడుతున్న విషయంలో సత్యమార్గాన్ని చూపాడు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
[1] అంటే తౌ'హీద్: ఏకదైవ సిద్ధాంతంపై ఉండటం. ఆదమ్ ('అ.స.) నుండి నూ'హ్ ('అ.స.) వరకు ప్రజలంతా ఏకదైవ సిద్ధాంతంపై, తమ ప్రవక్తలను అనుసరిస్తూ వచ్చారు. నూ'హ్ ('అ.స.) కాలంలో షై'తాన్ కలతలు రేకెత్తించటం వలన వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. సత్యతిరస్కారం మరియు షిర్క్ వ్యాపించాయి. ఆ తరువాత అల్లాహ్ (సు.తా.) ప్రవక్తలను దివ్యగ్రంథాలతో - వారి భేదాభిప్రాయాలను దూరం చేయటానికి - పంపాడు (ఇబ్నె - కసీ'ర్).
阿拉伯语经注:
اَمْ حَسِبْتُمْ اَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا یَاْتِكُمْ مَّثَلُ الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلِكُمْ ؕ— مَسَّتْهُمُ الْبَاْسَآءُ وَالضَّرَّآءُ وَزُلْزِلُوْا حَتّٰی یَقُوْلَ الرَّسُوْلُ وَالَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ مَتٰی نَصْرُ اللّٰهِ ؕ— اَلَاۤ اِنَّ نَصْرَ اللّٰهِ قَرِیْبٌ ۟
ఏమీ? మీరు (సులభంగా) స్వర్గంలో ప్రవేశించగలమని భావిస్తున్నారా? మీ పూర్వీకులు సహించినటువంటి (కష్టాలు) మీరూ సహించనిదే! వారిపై దురవస్థ, రోగబాధలు విరుచుకు పడ్డాయి మరియు వారు కుదిపివేయబడ్డారు, చివరకు అప్పటి సందేశహరుడు మరియు విశ్వాసులైన అతని సహచరులు: "అల్లాహ్ సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది?" అని వాపోయారు. అదిగో నిశ్చయంగా అల్లాహ్ సహాయం సమీపంలోనే ఉంది![1]
[1] విశ్వాసులకు అల్లాహ్ (సు.తా.) సహాయం తప్పక లభిస్తుంది.
阿拉伯语经注:
یَسْـَٔلُوْنَكَ مَاذَا یُنْفِقُوْنَ ؕ— قُلْ مَاۤ اَنْفَقْتُمْ مِّنْ خَیْرٍ فَلِلْوَالِدَیْنِ وَالْاَقْرَبِیْنَ وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنِ وَابْنِ السَّبِیْلِ ؕ— وَمَا تَفْعَلُوْا مِنْ خَیْرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِیْمٌ ۟
(ఓ ముహమ్మద్!) వారు (ప్రజలు) నిన్ను అడుగుతున్నారు: "మేము ఏమి ఖర్చు చేయాలి?" అని. వారితో అను: "మీరు మంచిది ఏది ఖర్చు చేసినా సరే, అది మీ తల్లిదండ్రుల, బంధువుల, అనాథుల, యాచించని పేదల (మసాకీన్) మరియు బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది."[1]
[1] ఈ ఖర్చు, నఫిల్ 'సదఖాత్ గురించి ఉంది. విధిగా ఇవ్వవలసిన 'జకాత్ కాదు. ఎందుకంటే, తల్లిదండ్రులకు 'జకాత్ చెల్లదు. వారిని పోషించటం కుమారుల బాధ్యత. మైమూన్ బిన్ మహ్రాన్ అన్నారు: 'గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ఖర్చు చేయటంలో, ఇంట్లో పెట్టే డ్రాయింగ్స్ గానీ, లేక సంగీత సాధనాలు గానీ, లేక ఇంటి అలంకరణకు వేసే పర్దాలు గానీ లేవు.' అంటే ఇలాంటి వస్తువుల మీద ఖర్చు చేయటం అవాంఛనీయమైన వ్యర్థపు ఖర్చే.
阿拉伯语经注:
 
含义的翻译 章: 拜格勒
章节目录 页码
 
《古兰经》译解 - 泰卢固语翻译 - 阿布杜·拉赫曼·本·穆罕默德。 - 译解目录

阿卜杜·拉赫曼·本·穆罕默德翻译。

关闭