Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Baqarah   Ayah:
اُحِلَّ لَكُمْ لَیْلَةَ الصِّیَامِ الرَّفَثُ اِلٰی نِسَآىِٕكُمْ ؕ— هُنَّ لِبَاسٌ لَّكُمْ وَاَنْتُمْ لِبَاسٌ لَّهُنَّ ؕ— عَلِمَ اللّٰهُ اَنَّكُمْ كُنْتُمْ تَخْتَانُوْنَ اَنْفُسَكُمْ فَتَابَ عَلَیْكُمْ وَعَفَا عَنْكُمْ ۚ— فَالْـٰٔنَ بَاشِرُوْهُنَّ وَابْتَغُوْا مَا كَتَبَ اللّٰهُ لَكُمْ ۪— وَكُلُوْا وَاشْرَبُوْا حَتّٰی یَتَبَیَّنَ لَكُمُ الْخَیْطُ الْاَبْیَضُ مِنَ الْخَیْطِ الْاَسْوَدِ مِنَ الْفَجْرِ ۪— ثُمَّ اَتِمُّوا الصِّیَامَ اِلَی الَّیْلِ ۚ— وَلَا تُبَاشِرُوْهُنَّ وَاَنْتُمْ عٰكِفُوْنَ فِی الْمَسٰجِدِ ؕ— تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَقْرَبُوْهَا ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ اٰیٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
పూర్వ ఆదేశాల్లోంచి ఉపవాసపు రాత్రుల్లో మనిషి నిదురపోయినప్పటి నుంచి ఫజర్ కన్న మునుపు మేల్కొనే వరకు తినటం,తమ భార్యతో సంబోగం చేయటం నిషేదించబడి ఉండేది,ఓ విశ్వాసపరులారా అల్లాహ్ ఆ ఆదేశమును రద్దుపరచి ఉపవాస రాత్రుల్లో మీ భార్యలతో సంబోగం చేయటమునకు అనుమతించాడు,వారు మీ కొరకు వస్త్రము,నిష్కలంకులు. మీరు వారి కొరకు వస్త్రము,నిష్కలంకులు. మీరు ఒకరి అవసరం ఇంకొకరికి లేనివారు కారు.అల్లాహ్ వారించిన వాటిని పాటించి మీరు ఆత్మ ద్రోహానికి పాల్పడుతున్నారని అల్లాహ్ గ్రహించాడు.మీ పై కనికరించి మీ పశ్చాత్తాపమును స్వీకరించాడు,మీకు సౌలభ్యాన్ని కలిగించాడు.అయితే మీరు ఇప్పుడు వారితో సంబోగము చేయండి,అల్లాహ్ మీకొరకు నిర్ణయించిన సంతానమును కోరుకోండి.రాత్రి నల్ల చారలు తొలిగిపోయి ఉదయపు తెల్ల చారలు ప్రస్పుటమై మీ కొరకు ఫజరె సాదిక్ (ఫజర్ అజాన్ అయ్యే వరకు) వేళ అయ్యే వరకు మీరు తినండి,త్రాగండి,ఫజర్ నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు ఉపవాసమును భంగ పరిచే వాటి నుండి దూరంగా ఉండి ఉపవాసమును పూర్తి చేసుకోండి.మీరు మస్జిద్ లో ఏతికాఫ్ పాటించే సమయంలో మీ భార్యలతో సంబోగించకండి.ఎందుకంటే అది (సంబోగం) దానిని (ఏతికాఫ్) భంగం చేస్తుంది.ఈ తెలియ పరచబడిన ఆదేశాలు అల్లాహ్ హద్దులు,అతడు హలాల్,హరాంను స్పష్టంగా తెలియ పరచాడు.ఎప్పుడు కూడా వాటి దరి దాపులకు వెళ్ళకండి,ఎందుకంటే ఎవరైతే అల్లాహ్ హద్దుల దరి దాపులకు వెళతాడో అతడు హరామ్ లో పడిపోయే సంభావన ఉన్నది.ఈ ఆదేశాల కొరకు ఈ స్పష్టమైన ఉదాహరణను ఇచ్చి అల్లాహ్ ప్రజల కొరకు ఆయనిచ్చిన ఆదేశమును పాటించటం,వారించిన వాటికి దూరంగా ఉండటం ఆయన నుండి తప్పి పోకుండా ఉండటానికి తన ఆయతులను వివరించి తెలియ పరచాడు.
Arabic explanations of the Qur’an:
وَلَا تَاْكُلُوْۤا اَمْوَالَكُمْ بَیْنَكُمْ بِالْبَاطِلِ وَتُدْلُوْا بِهَاۤ اِلَی الْحُكَّامِ لِتَاْكُلُوْا فَرِیْقًا مِّنْ اَمْوَالِ النَّاسِ بِالْاِثْمِ وَاَنْتُمْ تَعْلَمُوْنَ ۟۠
మీలోని కొందరు కొందరి సొమ్మును దొంగతనం,దోపిడి,మోసంలాగా అధర్మ పద్దతిలో తీసుకోకండి.వాటి ద్వారా పాలకుల వద్ద ఒక వర్గము ప్రజల సొమ్మును పాపముతో కూడుకుని తీసుకోవటం కొరకు వాటిని అల్లాహ్ నిషేదించాడని తెలిసి కూడా మీలో మీరు తగాదా పడకండి.నిషేదించబడినదని తెలిసి కూడా పాపం చేయడానికి ముందడుగు వేయటం అత్యంత చెడ్డదైన కార్యం,శిక్ష పరంగా చాలా పెద్దది.
Arabic explanations of the Qur’an:
یَسْـَٔلُوْنَكَ عَنِ الْاَهِلَّةِ ؕ— قُلْ هِیَ مَوَاقِیْتُ لِلنَّاسِ وَالْحَجِّ ؕ— وَلَیْسَ الْبِرُّ بِاَنْ تَاْتُوا الْبُیُوْتَ مِنْ ظُهُوْرِهَا وَلٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقٰی ۚ— وَاْتُوا الْبُیُوْتَ مِنْ اَبْوَابِهَا ۪— وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
ఓ ప్రవక్త వారు మిమ్మల్ని చంద్రుని గురించి దాని స్థితుల మార్పు గురించి ప్రశ్నిస్తున్నారు.వారికి సమాధానమిస్తూ దాని మర్మం ఏమిటో తెలియజేయండి: నిశ్చయంగా అవి ప్రజల కొరకు వేళలు,వాటి ద్వారా హజ్ మాసము,ఉపవాసముల మాసము,జకాత్ చెల్లించటంలో సంవత్సరం పూర్తి అవటం లాంటి వారి ఆరాధనల వేళలు తెలుసుకుంటారు మరియు రక్తపరిహారము,రుణాలను చెల్లించటానికి వేళల నిర్ధారణ లాంటి వ్యవహారాల్లో వారి వేళలను తెలుసుకుంటారు.హజ్ లేదా ఉమ్రాలో మీరు ఇహ్రామ్ స్థితిలో ఇళ్ళలోకి వాటి వెనుక వైపు నుండి రావటం మీరు అజ్ఞాన కాలంలో అనుకునే విధంగా సత్కార్యం కాదు.కాని వాస్తవానికి సత్కార్యం అన్నది బాహ్యపరంగా,అంతఃపరంగా అల్లాహ్ కి భయపడే వాడి సత్కార్యమే అసలైన సత్కార్యం.అయితే ఇండ్లలోకి మీ రావటం వాటి వాకిళ్ల నుండే జరగాలి.అది మీకు సులభతరమైనది,కష్టతరమైనది కాదు.ఎందుకంటే అల్లాహ్ మీపై కష్టమైన వాటిని,మీకు ఇబ్బంది కరమైన వాటిని భారంగా వేయడు.మీరు మీకు అల్లాహ్ శిక్షకు మధ్య రక్షణగా సత్కార్యములను చేసుకోండి.తద్వారా మీకు దేనిలోనైతే ఇష్టత ఉన్నదో దానిని పొంది సాఫల్యం పొందుతారు,దేనినుంచైతే మీరు భయపడుతున్నారో దాని నుండి రక్షణ పొందుతారు.
Arabic explanations of the Qur’an:
وَقَاتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ الَّذِیْنَ یُقَاتِلُوْنَكُمْ وَلَا تَعْتَدُوْا ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ الْمُعْتَدِیْنَ ۟
అల్లాహ్ వాక్కును (కలిమా) పెంపొందించే ఉద్దేశంతో మీరు పోరాడండి.సత్యతిరస్కారుల్లోంచి ఎవరైతే మీతో పోరాడుతున్నారో వారు మిమ్మల్ని అల్లాహ్ ధర్మం నుండి ఆపుతారు.మీరు పిల్లలను,స్త్రీలను,వృద్దులను హతమార్చి లేదా మృతుల అవయవాలను కోసి,అటువంటి కార్యాలు చేసి అల్లాహ్ హద్దులను అతిక్రమించకండి.నిశ్చయంగా అల్లాహ్ తాను నిర్దేశించిన,నిర్ణయించిన వాటిలో అతని హద్దులను అతిక్రమించే వారిని ఇష్టపడడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• مشروعية الاعتكاف، وهو لزوم المسجد للعبادة؛ ولهذا يُنهى عن كل ما يعارض مقصود الاعتكاف، ومنه مباشرة المرأة.
ధర్మబద్దంగా ఏతికాఫ్ అంటే ఆరాధనల కొరకు మస్జిద్లను పట్టుకుని ఉండటం,అందుకనే ఏతికాఫ్ ఉద్దేశానికి అడ్డు తగిలే వాటి నుండి ఆపడం జరిగింది,భార్యతో సమగామనం చేయటం అందులో నుంచే.

• النهي عن أكل أموال الناس بالباطل، وتحريم كل الوسائل والأساليب التي تقود لذلك، ومنها الرشوة.
అధర్మ పద్దతిలో ప్రజల సొమ్మును తినడం గురించి వారింపు,దానిని అనుసరించే కారకాలు,పద్దతుల నిషేదింపు,లంచమూ అందులో నుంచే.

• تحريم الاعتداء والنهي عنه؛ لأن هذا الدين قائم على العدل والإحسان.
అతిక్రమింపు ను నిషేదించటం,దాని నుండి వారించటం ఎందుకంటే ఈ ధర్మం న్యాయం, మంచితనం పై స్థాపించ బడింది.

 
Translation of the meanings Surah: Al-Baqarah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close