Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Baqarah   Ayah:
وَمَثَلُ الَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمُ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ وَتَثْبِیْتًا مِّنْ اَنْفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ اَصَابَهَا وَابِلٌ فَاٰتَتْ اُكُلَهَا ضِعْفَیْنِ ۚ— فَاِنْ لَّمْ یُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
అల్లాహ్ యొక్క మన్నతును ఆశిస్తూ, తమ మనస్సులో అల్లాహ్ వాగ్దానం పై దృఢమైన నమ్మకంతో, అల్లాహ్ మార్గంలో తమ సంపదను వెచ్చించే విశ్వాసుల ఉపమానం – ‘మెరక ప్రాంతంలో ఉన్న సారవంతమైన భూమి వంటిది. ఒకవేళ దానిపై భారీ వర్షం కురిస్తే, అది రెట్టింపు పంటను ఉత్పత్తి చేస్తుంది. ఒక వేళ భారీ వర్షం కురవక పోయినా, భూమి సారవంతమైనది కనుక దానిపై పడే తేలికపాటి వర్షం సరిపోతుంది’. అదే విధంగా, చిత్తశుద్ధితో ఖర్చు చేసిన కొద్ది మొత్తాన్ని కూడా అల్లాహ్ అంగీకరిస్తాడు మరియు దాని ప్రతిఫలాన్ని హెచ్చిస్తాడు. అల్లాహ్ మీరు చేసే పనులను చూస్తున్నాడు: ఎవరు నిజాయితీపరుడో, ఎవరు కాదో ఆయన బాగా ఎరుగును మరియు ప్రతి ఒక్కరికీ ఆయన తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Arabic explanations of the Qur’an:
اَیَوَدُّ اَحَدُكُمْ اَنْ تَكُوْنَ لَهٗ جَنَّةٌ مِّنْ نَّخِیْلٍ وَّاَعْنَابٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۙ— لَهٗ فِیْهَا مِنْ كُلِّ الثَّمَرٰتِ ۙ— وَاَصَابَهُ الْكِبَرُ وَلَهٗ ذُرِّیَّةٌ ضُعَفَآءُ ۖۚ— فَاَصَابَهَاۤ اِعْصَارٌ فِیْهِ نَارٌ فَاحْتَرَقَتْ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُوْنَ ۟۠
మీలో ఎవరైనా ఖర్జూరపు చెట్లు మరియు ద్రాక్ష తీగలు కలిగి ఉండి, మంచి నీటి సెలయేళ్ళు ప్రవహిస్తూ, అన్నీ రకాల పళ్ళుఫలాలు కలిగి ఉన్న తోటను కలిగి ఉండాలని కోరుకుంటున్నారా ?. తోట యజమాని వృద్ధాప్యం వలన ఇక పై పని చేసి సంపాదించలేని స్థితికి చేరుకున్నాడు. అతని పిల్లలు మరీ తక్కువ వయస్సులో ఉండటం వలన పని చేయలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు తీవ్రమైన మంటలతో కూడిన సుడిగాలి ఆ తోటను తాకింది. వృద్ధాప్యం మరియు బలహీనమైన చిన్న పిల్లలతో గడ్డుకాలం గడుపుతున్న అతడి అత్యంత అవసరమైన సమయంలోనే అది పూర్తిగా కాలిపోయింది. తన సంపదను ప్రజలకు చూపడానికి ఖర్చు చేసే వ్యక్తి పరిస్థితి ఈ మనిషి మాదిరిగానే ఉంటుంది. పునరుత్థాన దినమున అతడు అల్లాహ్ ముందు నిలబడిన తరువాత, అతనికి అత్యంత ఎక్కువగా అవసరమైన ఆ క్లిష్టసమయంలో అతని వద్ద పుణ్యఫలాలేవీ మిగిలి ఉండవు. ఈ విధంగా, మీరు శ్రద్ధగా ఆలోచించేందుకు, ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మీకు ఏమి ప్రయోజనకరంగా ఉంటుందో అల్లాహ్ మీకు వివరిస్తున్నాడు.
Arabic explanations of the Qur’an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَنْفِقُوْا مِنْ طَیِّبٰتِ مَا كَسَبْتُمْ وَمِمَّاۤ اَخْرَجْنَا لَكُمْ مِّنَ الْاَرْضِ ۪— وَلَا تَیَمَّمُوا الْخَبِیْثَ مِنْهُ تُنْفِقُوْنَ وَلَسْتُمْ بِاٰخِذِیْهِ اِلَّاۤ اَنْ تُغْمِضُوْا فِیْهِ ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَنِیٌّ حَمِیْدٌ ۟
అల్లాహ్ పై విశ్వాసం ఉంచుతూ, ఆయన ప్రవక్తను అనుసరించే విశ్వాసులారా! మీరు సంపాదించిన స్వచ్ఛమైన, న్యాయమైన సంపద నుండి మరియు భూమి నుండి మేము మీ కోసం పండించిన ఉత్పత్తుల నుండి మాత్రమే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి. అలా ఖర్చు చేయడానికి నాసిరకం దాని కోసం వెతకకండి. ఎందుకంటే దానిని ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే, దాని నాణ్యత తక్కువగా ఉన్నందున మీరు తీసుకోవడానికి ఇష్టపడరు కదా! మరి, స్వయంగా మీ కోసం మీరు ఇష్టపడని దానిని అల్లాహ్ కు సమర్పించి, మీరు ఎలా సంతృప్తి చెందగలరు ? మీరు చేసే ఖర్చు అల్లాహ్ కు అస్సలు అవసరం లేదని తెలుసుకోండి. నిశ్చయంగా ఆయన తన ఉనికి మరియు దివ్యచర్యల ద్వారా ఆయన ప్రశంసించబడతాడు. పవిత్రమైన వాటిని మాత్రమే ఖర్చు చేయమని వారికి సూచించాడు.
Arabic explanations of the Qur’an:
اَلشَّیْطٰنُ یَعِدُكُمُ الْفَقْرَ وَیَاْمُرُكُمْ بِالْفَحْشَآءِ ۚ— وَاللّٰهُ یَعِدُكُمْ مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ؕ— وَاللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ ۟
షైతాను మిమ్మల్ని పేదరికానికి భయపడేలా చేసి, పిసినారితనం వైపు ప్రేరేపిస్తాడు. ఇంకా వాడు మిమ్మల్ని పాపకార్యాల వైపు ఆహ్వానిస్తాడు. మరోవైపు అల్లాహ్ మీ పాపాలు క్షమిస్తానని మరియు మరింత ఉపాధి ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ ఎంతో ఔదార్యము గలవాడు మరియు తన దాసుల పరిస్థితి బాగా ఎరిగినవాడు.
Arabic explanations of the Qur’an:
یُّؤْتِی الْحِكْمَةَ مَنْ یَّشَآءُ ۚ— وَمَنْ یُّؤْتَ الْحِكْمَةَ فَقَدْ اُوْتِیَ خَیْرًا كَثِیْرًا ؕ— وَمَا یَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ ۟
అల్లాహ్ తన దాసులలో నుండి ఎవరికైనా సరే, తమ పలుకులలో మరియు ఆచరణలలో స్థిరంగా ఉండగల సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. ఎవరికైతే అలాంటి సామర్థ్యం ప్రసాదించబడిందో, వారికి ఎంతో శుభం జరుగుతుంది. పరిపూర్ణ బుద్ధి కలవారు మాత్రమే అల్లాహ్ ఆయతుల ద్వారా ఉపదేశము పొందుతారు మరియు హితోపదేశం పొందుతారు. వారే ఆయన కాంతి ద్వారా వెలుగు పొందుతారు మరియు ఆయన ఋజుమార్గం ద్వారా మార్గం పొందుతారు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• المؤمنون بالله تعالى حقًّا واثقون من وعد الله وثوابه، فهم ينفقون أموالهم ويبذلون بلا خوف ولا حزن ولا التفات إلى وساوس الشيطان كالتخويف بالفقر والحاجة.
అల్లాహ్ ను విశ్వసించే నిజమైన విశ్వాసులు ఆయన వాగ్దానం మరియు ప్రతిఫలం గురించి ఖచ్చితమైన నమ్మకం కలిగి ఉంటారు: వారు తమ సంపదను ఎలాంటి భయం లేదా దుఃఖం లేకుండా,షైతాన్ దుష్ప్రేరణల వైపు చూడకుండా - ఉదాహరణకు పేదరికం,అవసరం గురించి భయపెట్టటం - ఖర్చు చేస్తారు.

• الإخلاص من أعظم ما يبارك الأعمال ويُنمِّيها.
చిత్తశుద్ధి ఆచరణలలో శుభాలను కలిగించే మరియు వాటిని పెంపొందించే గొప్ప సాధనం.

• أعظم الناس خسارة من يرائي بعمله الناس؛ لأنه ليس له من ثواب على عمله إلا مدحهم وثناؤهم.
తన మంచి పనులను, పుణ్యకార్యాలను ప్రజల ముందు ప్రదర్శించే వ్యక్తి అందరి కంటే ఎక్కువగా నష్టపోతాడు. ఎందుకంటే అతనికి లభించే ప్రతిఫలం కేవలం ప్రజల ప్రశంసలు మాత్రమే.

 
Translation of the meanings Surah: Al-Baqarah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close