Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Baqarah   Ayah:
مَثَلُهُمْ كَمَثَلِ الَّذِی اسْتَوْقَدَ نَارًا ۚ— فَلَمَّاۤ اَضَآءَتْ مَا حَوْلَهٗ ذَهَبَ اللّٰهُ بِنُوْرِهِمْ وَتَرَكَهُمْ فِیْ ظُلُمٰتٍ لَّا یُبْصِرُوْنَ ۟
అల్లాహ్ ఈ కపట విశ్వాసుల గురించి రెండు ఉపమానాలు ఇచ్చాడు. ఒకటి అగ్నికి సంబంధిచిన ఉపమానమైతే, మరొకటి నీటికి చెందిన ఉపమానం. వారికి చెందిన అగ్ని ఉపమానం ఎలా ఉందంటే, ఒకడు అగ్నిని రాజేశాడు (పరిసరాలను) ప్రకాశవంతం చేయడానికి. ఎపుడైతే దాని వెలుగు (పరిసరాలను) ప్రకాశవంతం చేసిందో, దానినుండి ప్రయోజనం పొందాలని తలపోసాడు. ఇంతలోనే దాని వెలుతురు పోయింది. (పరిసరాలనుండి) ప్రకాశం పోయింది. నిప్పు మిగిలి పోయింది. దానిని రాజేసినవారు ఏమీ చూడలేకపోయారు; మార్గం కనిపించని అంధకారంలో మిగిలి పోయారు.
Arabic explanations of the Qur’an:
صُمٌّۢ بُكْمٌ عُمْیٌ فَهُمْ لَا یَرْجِعُوْنَ ۟ۙ
వారు సత్యాన్ని స్వీకరించే ఉద్ధేశంతో వినలేని చెవిటివారు. వారు దాన్ని పలకలేని మూగవారు; వారు దాన్ని చూడలేని గ్రుడ్డివారు.అయితే వారు తమ మార్గ భ్రష్ఠత్వము నుండి మరలిరారు.
Arabic explanations of the Qur’an:
اَوْ كَصَیِّبٍ مِّنَ السَّمَآءِ فِیْهِ ظُلُمٰتٌ وَّرَعْدٌ وَّبَرْقٌ ۚ— یَجْعَلُوْنَ اَصَابِعَهُمْ فِیْۤ اٰذَانِهِمْ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ؕ— وَاللّٰهُ مُحِیْطٌ بِالْكٰفِرِیْنَ ۟
అయితే వారికి (మునాఫిఖులకు) సంబంధించిన నీటి ఉపమానం చిమ్మచీకటిని క్రమ్ము కొని ఉన్న మేఘాలు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాన్ని పోలి ఉన్నది. అది ఒక జాతిపై కురవగా వారు తీవ్రమైన భయాందోళనకు గురైయ్యారు. కనుక వారు ఆ శబ్ధాలకు మ్రుత్యు భయంతో తమ వ్రేళ్లతో తమ చెవులను మూసుకోసాగారు.మరియు అల్లాహ్ సత్యతిరస్కారులను (అన్ని వైపుల నుండి) ఆవరించి ఉన్నాడు. (కనుక) వారు ఆయనను అశక్తుడిగా చేయలేరు.
Arabic explanations of the Qur’an:
یَكَادُ الْبَرْقُ یَخْطَفُ اَبْصَارَهُمْ ؕ— كُلَّمَاۤ اَضَآءَ لَهُمْ مَّشَوْا فِیْهِ ۙۗ— وَاِذَاۤ اَظْلَمَ عَلَیْهِمْ قَامُوْا ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَاَبْصَارِهِمْ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠
పిడుగు తన తీవ్రమైన మెరుపు,కాంతిలతో వారి చూపులను తీసుకుపోవుటకు సమీపమవుతున్నది.ఉరుము వారి కొరకు మెరిసి,కాంతినిచ్చినప్పుడల్లా ముందడుగు వేస్తున్నారు,అది కాంతినివ్వనప్పుడు అంధకారంలోనే మిగిలిపోతున్నారు. అప్పుడు వారు కదలలేకపోతున్నారు . ఒకవేళ అల్లాహే అనుకుంటే వారి సత్యతిరస్కరణ కారణంగా ఏదైనాచేయగల తన సంపూర్ణ సామర్ధ్యంతో వారి వినికిడిని, చూపునూ పోగోట్టేవాడు. అవి ఎన్నటీకీ వారివైపు తిరిగి రాగలిగేవికావు. కాబట్టి (ఇందులో ప్రస్తావించబడిన) వర్షపు ఉపమానం దివ్యఖుర్ఆన్ ను పోలినది. మరియు ఉరుముల శబ్ధాలు ఈ గ్రంధంలో ప్రస్తావించబడిన హెచ్చరికలను పోలినవి. మరియు మెరుపుల వెలుతురు యొక్క ఉపమానం అప్పుడప్పుడు వారి ముందు ప్రస్తుటమవుతున్న సత్యమును పోలినది. వారు ఉరుముల శబ్ధాలకు తమ చెవులను మూసుకోవటం యొక్క ఉపమానం సత్యం పట్ల వారి విముఖత చూపటం మరియు స్వీకరించకపోవటం వంటిది. కపటులకు ఈ రెండు ఉపమాల వారి మధ్య పోలిక ప్రయోజనం పొందకపోవటమే.నిప్పుకు సంబంధించిన ఉపమానంలో నిప్పును రాజేసేవాడు చీకటి,కాల్చటం తప్ప ఏ విధమైన ప్రయోజనం చెందలేకపోయడు. మరియు నీటి ఉపమానంలో వర్షం కురిపింప జేయబడిన వారు ఉరుముల మెరుపుల వలన భయం మరియు ఆందోళనను తప్ప మరే ప్రయోజనాన్ని పోందలేకపోయారు. ఈ విధంగా కపటవిశ్వాసులు ఇస్లాంలో కఠినత్వాన్ని, మరియు కష్టతరాన్ని తప్ప మరేమీ చూడలేక పోతున్నారు.
Arabic explanations of the Qur’an:
یٰۤاَیُّهَا النَّاسُ اعْبُدُوْا رَبَّكُمُ الَّذِیْ خَلَقَكُمْ وَالَّذِیْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟ۙ
ఓ మానవులారా మీరు మీప్రభువును మాత్రమే ఆరాధించండి. ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి ఎందుకంటే ఆయనే మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారినీ పుట్టించాడు. ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా మిమ్మల్ని మీరు దైవశిక్ష నుంచి రక్షించుకునే ఆశ ఉంది.
Arabic explanations of the Qur’an:
الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ فِرَاشًا وَّالسَّمَآءَ بِنَآءً ۪— وَّاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ ۚ— فَلَا تَجْعَلُوْا لِلّٰهِ اَنْدَادًا وَّاَنْتُمْ تَعْلَمُوْنَ ۟
ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా, నివాసయోగ్యంగా చేశాడు. మరియు దానిపై ఆకాశాన్ని దృఢమైన కప్పుగా చేశాడు. మరియు కరుణతో వర్షాన్ని కురింపించి తద్వారా భూమినుండి రకరకాల పంటలూ, పండ్లూ, ఫలాలూ పండేలా చేసి మీకు జీవనోపాధిగా చేశాడు. కావున మీరు అల్లాహ్ తప్ప మరొక సృష్టికర్త లేడన్న విషయాన్ని తెలిసికూడా అల్లాహ్ కు పోలికలను, భాగస్వాములను కల్పించకండి.
Arabic explanations of the Qur’an:
وَاِنْ كُنْتُمْ فِیْ رَیْبٍ مِّمَّا نَزَّلْنَا عَلٰی عَبْدِنَا فَاْتُوْا بِسُوْرَةٍ مِّنْ مِّثْلِهٖ ۪— وَادْعُوْا شُهَدَآءَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మరియు ఒక వేళ మీరు – ఓ మానవులారా - మాదాసుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింప జేయబడిన ఖుర్ఆన్ (దైవ గ్రంధం అన్న) విషయంలో మీకు సందేహం ఉంటే; మేము చాలేంజ్ చేస్తున్నాము; దానిని పోలిన ఒక్క సూరహ్ లేక దాని కంటే చిన్నసూరహ్ నైనా తయారు చేసుకుని వచ్చి దానిని వ్యతిరేకించండి. మరియు మీ వాదనలో మీరు సత్యవంతులు అయితే మీ సహాయకులలో మీకు వీలైనంత మందిని కూడా పిలుచుకోండి.
Arabic explanations of the Qur’an:
فَاِنْ لَّمْ تَفْعَلُوْا وَلَنْ تَفْعَلُوْا فَاتَّقُوا النَّارَ الَّتِیْ وَقُوْدُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖۚ— اُعِدَّتْ لِلْكٰفِرِیْنَ ۟
కానీ, ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - వాస్తవానికి అలా మీరు ఎన్నటికీ చేయలేరు – కాబట్టి ఆ అగ్నికి భయపడండి; ఎదైతే (దైవ తిరస్కారణ కారణంగా) దైవశిక్షకు అర్హులైన మానవులూ, మరియు వారు ఆరాధించిన రకరకాల శిలలతో (వాటిని అందులో వేసి) ప్రజ్వలింప జేయబడుతుందో; ఆ నరకాగ్నికి భయపడండి. (ఎందుకంటే) అల్లాహ్ ఈ నరకాగ్నిని దైవతిరస్కారుల కోసం తయారుచేసి ఉన్నాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• أن الله تعالى يخذل المنافقين في أشد أحوالهم حاجة وأكثرها شدة؛ جزاء نفاقهم وإعراضهم عن الهدى.
నిశ్చయంగా అల్లాహ్ కపట విశ్వాసులను – వారి కపటత్వానికి ప్రతిఫలంగా, మరియు ఋజుమార్గం పట్ల వారి విముఖతకు బదులుగా – వారి క్లిష్టతర విషయాలలో వారిని భంగపాటుకు గురిచేస్తాడు.

• من أعظم الأدلة على وجوب إفراد الله بالعبادة أنه تعالى هو الذي خلق لنا ما في الكون وجعله مسخَّرًا لنا.
ఆరాధనలలో ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట విధి అనుటకు గొప్ప రుజువులలో ఒకటి - ఆయనే ఈ సర్వ సృష్ఠిలో ఉన్నదానినంతా సృష్ఠించాడు మరియు దానిని మన కొరకు ఉపయుక్తంగా మలచాడు.

• عجز الخلق عن الإتيان بمثل سورة من القرآن الكريم يدل على أنه تنزيل من حكيم عليم.
ఖుర్ఆన్ గ్రంధాన్ని పోలినటువంటి ఒక్క సూరహ్ నైనా రచించ లేకపోయిన సృష్టి యొక్క అసమర్ధత ఈ గ్రంధం మహావివేకి మరియు సర్వజ్నుడైన అల్లాహ్ చే అవతరింప జేయబడినదని రుజువు చేస్తున్నది.

 
Translation of the meanings Surah: Al-Baqarah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close